Monday 31 August 2015

ప్రాంజలి ప్రభ -జయసుధ-ప్రేమ సంకెళ్లు- అత్తారింటికి దారేది- భట్టి విక్రమార్క- ప్రతిజ్ఞ పాలన- గుడిగంటలు

ఓం శ్రీ రామ్          ఓం శ్రీ రామ్       ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు
1. తులాభారం
2. మేఘసందేశం
3. అన్నవరం
4. జయసుధ
                                      5. ప్రేమ సంకెళ్లు


                                    6. అత్తారింటికి దారేది
                                    7.  భట్టి విక్రమార్క

8. ప్రతిజ్ఞ పాలన
9. గుడిగంటలు  
10. కొత్త నీరు 


నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాగుండెల్లో దడదడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాఅందంలో అలజడులే నీవల్లే

చిత్రం : అన్నవరం (2006)
సంగీతం : రమణ గోగుల
రచన : చంద్రబోస్
గానం : టిప్పు , కళ్యాణి

పల్లవి :

నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాగుండెల్లో దడదడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాఅందంలో అలజడులే నీవల్లే
నాచంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీవల్లే
నా మాటల్లో ఆటల్లో రాగంలో మలిపులు నీవల్లే ||నీవల్లే నీవల్లె||

చరణం : 1

మామూలు రూపు మామూలు తీరు ఏముంది నీలోన
ఆకర్షణ ఏదో ఉంది పడిపోయా నీపైనా
నిన్ను తలచుకొనే అలవాటే మారెను వ్యసనమై నిన్నుగెలుచుకొనే
ఈ ఆటే తెలిసెను ప్రణయమై ||నీవల్లే నీవల్లె||

చరణం : 2

ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువ్వి వెల్లావు చల్లగా
ఆ నవ్వుతో ఆ చూపుతో కల్లోలం ఒళ్ళంతా
కొంతకరకుతనం కరుణగుణం కలిపితే నువ్వేలే
కొంటెమనసుతనం మనిషివలే ఎదిగితే నువ్వేలే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాగుండెల్లో దడదడల్ నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా కళ్ళలో కొత్త కధలే నీవల్లే
నా చేతుల్లో చేతల్లో నడకల్లో వణుకులు నీవల్లే
నా మాటలో ఆటల్లో మార్గంలో మార్పులు నీవల్లే ||నీవల్లే నీవల్లే||
https://www.youtube.com/watch?v=m2hnaEGEofA
Annavaram Video Songs | Neevalle Neevalle Video Song | Pawan Kalyan, Asin | Sri Balaji Video
Cast: Pawan Kalyan, Asin, Sandhya, Sivabalaji, Venu madhav, Nagendra Babu, Aasish Vidyarthi, Brahmaj...

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా...కనుపాప నవ్వింది కనులున్న చోట...

చిత్రం : జయసుధ (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల

పల్లవి:

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా

చరణం 1:

కలలూరు వేళ కనుమూత పడగా
కనుముందు నీ నీడ కదలాడి రాగా
కలలూరు వేళ కనుమూత పడగా
కనుముందు నీ నీడ కదలాడి రాగా
కనులెందుకు?ఈ కనులెందుకు?
కలలు చెరిగేందుకు చెరిగి పోయేందుకు

కనుల కనుల కలయికలో
కలయికల కలవరింతలలో
కలిగే... కరిగే.... కదిలే.... కదలికలే ఆ కలలూ
ఆ కలల వెలుగులే ఈ కనులు
ఆ కలల వెలుగులే ఈ కనులు

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా

చరణం 2:

తెలవారు వేళ కనురెప్ప విడగా
కనుముందు నీ రూపు కనిపించిపోగా
తెలవారు వేళ కనురెప్ప విడగా
కనుముందు నీ రూపు కనిపించిపోగా
కలలెందుకు? ఆ కలలెందుకు?
కధలు మిగిలేందుకు మిగిలి నిలిచేందుకు

మనసు మనసు ఊహలలో మరపురాని ఊసులలో
విరిసే... కురిసే... మెరిసే... మెరుపులవే ఈ కలలు
ఆ కలల వెలుగులే ఈ కనులు
ఆ కలల వెలుగులే ఈ కనులు

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా

https://www.youtube.com/watch?v=x40tFBb1MCo
Jayasudha | Kannureppa Paadindhi song
Watch the melodious song, "Kannureppa Paadindhi" sung by P Jayachandran and P Susheela from the film...

మెరుపులా మెరిశావు..వలపులా కలిశావు..కన్ను తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు...

చిత్రం : ప్రేమ సంకెళ్లు (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ఓహో... ఓ..
ఓహో... ఓ...

ఓహో... ఓ...

మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు....
నిన్నలలో నిలిచావు...

చరణం 1:

మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది
లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో...
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో ...
దోసిట నా ఆశలన్నీ... దోచి వెళ్ళిపొయావు ...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు

చరణం 2:

ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి...
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...
ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...

పసుపైనా కానీవా... పదాలంటుకొనీవా ....
పాదాలకు పారాణై... పరవశించిపోనీవా...
పలకరించిపోలేవా...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

చరణం 3:

వేకువంటి చీకటి మీద... చందమామ జారింది...
నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది...
తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి బెదిరిపోతున్నాను

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా..
నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు ...
https://www.youtube.com/watch?v=_MC8Ycw8ktY
merupula..merisaavu..valapulaa
prema..sankellu..movie

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే

DSP Rocks as Lyricist as well!
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే
ఏమిటో ఏం మాయో చేసినావే కంటి చూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావే మరదలా
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే
ఏయ్.. అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే
ఏయ్.. భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగరాసావే
ఏయ్.. అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తుంటే కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రావే మరదలా
అత్త లేని కోడలుత్తమురాలు ఓరమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా
పచ్చి పాల మీద మీగడేదమ్మా
వేడి పాలల్లోన వెన్న ఏదమ్మా
మోనలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాల సీస అందాన్ని చూడనేలేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగి ఉందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను
తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే
Attarintiki Daredi Songs || Ninnu Chudagaane - Pawan Kalyan, Samantha, Devi Sri Prasad
Attarintiki Daredi Songs || Ninnu Chudagaane Click Here Watch To All Songs: https://www.youtube.com/...

అందాల జలపాతం చిందించు జల్లులలో
గాయకులు: పి సుశీల
రచన: దాశరథి
సంగీత దర్శకులు: ఆర్ సుదర్శనం..

అందాలా జలపాతం చిందించు జల్లులలో ఆనాడు
ఒంటరిగా జలకాలాడానూ పులకించిపోయానూ

పొంగారు యదమీది కొంగునే తీసానూ పొంగారు యదమీది కొంగునే తీసానూ
చాటుగా గమనించే కళ్ళనే చూసానూనా ఒళ్ళు జల్లనగా నన్ను నే మరిచానూ
నా ఒళ్ళు జల్లనగా నన్ను నే మరిచానూ
అందాలా జలపాతం చిందించు జల్లులలో ఆనాడు
ఒంటరిగా జలకాలాడానూ పులకించిపోయానూ

శ్రీదేవి కోవెలలో సిందూర తిలకమునే శ్రీదేవి కోవెలలో సిందూర తిలకమునే
దీపాల కాంతులలో దిద్దుకొను సమయానాఆ కళ్ళే చూసానూ ఆశలో తేలానూ
ఆ కళ్ళే చూసానూ ఆశలో తేలానూ

మోజుతో రతనాలా గాజులే కొనువేళామోజుతో రతనాలా గాజులే కొనువేళా
చేతిలో చైవేసీ చెంతకే చేరాడూఅమ్మమ్మ నా మేనూ చెమ్మగిల్లి పోయిందీ
ఓయమ్మొ నా వయసూ ఉరకలె వేసిందీ

సిరిమల్లె పూలన్నీ చేజారిపొయాయి
పరుగులే తీసాయీ పాదాల వాలాయీ మా కళ్ళు కలిశాయీ మనసులే విరిసాయీ
మా కళ్ళు కలిశాయీ మనసులే విరిసాయీ

చిక్కని చీకటిలో . . చిక్కని చీకటిలో చుక్కల్ల వెలుగులలో
చెక్కిళ్ళు ఏకమై మక్కువలు పెరిగాయీ
నా స్వామి కౌగిలిలో నే కరిగిపోయానూనన్ను నే కానుకగా అర్పించుకున్నానూ
అందాలా జలపాతం చిందించు జల్లులలో
ఆనాడు ఒంటరిగా జలకాలాడానూ పులకించిపోయానూ..
https://www.youtube.com/watch?v=dc8FCkmuy6Q
andala jalapatham - bhale paapa - P.Susheela - R.Sudardanam - K.R.Vijaya -Harnath
Music: R.Sudarsanam Singer:P.Susheela

ఓ నెలరాజా వెన్నెల రాజా...నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.. ఓ నెలరాజా...

చిత్రం : భట్టి విక్రమార్క (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : అనిశెట్టి సుబ్బారావు
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.. ఓ నెలరాజా...

చరణం 1:
ఓ.... ఓ...
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో..
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓ....ఓ..ఓ..ఓ..
కొంటె చూపు నీకేలా చంద్రుడా
నా వెంటనంటి రాకోయీ చంద్రుడా
ఆ...

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్....ఓ నెలరాజా...

ఆ..ఆ..

చరణం 2:

ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
ఓ...ఓ..ఓ..ఓ..
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడవ మనకు తరమవున చంద్రుడా
ఆ..ఆ..ఆ..ఆ..

ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.... ఓ నెలరాజా...

చరణం 3:

లేత లేత వలపులే పూత పూయు వేళలో...
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా..
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా..

ఆ..ఆ..ఆ..ఆ
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్....ఓ నెలరాజా...
https://www.youtube.com/watch?v=28BaG89tlf4
O NELARAJA VENNELARAJA..CHITRAM - BHATTI VIKRAMARKA mp4
"ఓ నెలరాజా" SUBSCRIBERS కు సినీ సంగీత రసికులందరికి నమస్కారం ఓ నెలరాజా ఆదరించినట్లు గానే ఈ మేనేజర్ ద్...


రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో...అనురాగమో సరాగమో అదేమి లోకమో... ఓ..ఓ..

చిత్రం : ప్రతిజ్ఞ పాలన (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో...
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో... ఓ..ఓ..
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... ప్రేమ ఏమిటో...

చరణం : 1

కలలో ఒక అందగాడు కన్ను కలిపి నవ్వెనే
ఓ ఓ ఓ....
కలలో ఒక అందగాడు కన్ను కలిపి నవ్వెనే
కనుకలుపగ నా వన్నెలు కడలిపొంగులాయెనే
కన్నెమనసు పొంగించిన వెన్నెల రాజెవ్వరే
ఆ..ఆ..ఆ.... ఓ..ఓ....

కన్నెమనసు పొంగించిన వెన్నెల రాజెవ్వరే
ఆనరా...తనెవ్వరా...వరించు నాధుడే..హ..హ..హ..

రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... ప్రేమ ఏమిటో...

చరణం : 2

అహహా ఒహొహో...
ఓ....

ఒక చోటను నిలువలేను ఒంటరిగా ఉండలేను
ఊహలోని చెలికానితో ఊసులాడి వేగలేను
జాబిలితో ఈ తారక జతగూడుట ఎన్నడే...

కానరా..నీ నోమునూ...ఫలించినప్పుడే...అహహా

రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో...
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... ప్రేమ ఏమిటో...
https://www.youtube.com/watch?v=FzJR4Ba8Bpc

Ramachiluka telupave రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో ....
www.youtube.com

Movie: Pratigna Palana(1965) Lyricist: Arudra Music: Master Venu Singer: P.Suseela


ఊగిసలాడకే మనసా..నువ్వు ఉబలాట పడకే మనసాఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ..

చిత్రం: కొత్త నీరు (1981)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఎస్. పి. శైలజ

పల్లవి:

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా
ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా
ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ..
ఉర్రూతలూగకే మనసా..ఆ..ఆ..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా

చరణం 1:

తలలోన ముడిచాక.. విలువైన పువ్వైనా.. దైవ పూజకు తగదు మనసా
దైవ పూజకు తగదు మనసా..
పొరపాటు చేశావో దిగజారిపోతావు.. నగుబాటు తప్పదు మనసా
పెడదారి మురిపాలు.. మొదటికే మోసాలు.. చాలు నీ వేషాలు మనసా
చాలు.. నీ వేషాలు మనసా..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా..

చరణం 2:

తుమ్మెదలు చెలరేగి.. తోటలో ముసిరేను.. దిమ్మరిని నమ్మకే మనసా
దేశ దిమ్మరిని నమ్మకే మనసా..
చపల చిత్తం విపరీతమౌతుంది.. చలియించకే వెర్రి మనసా
కపటాలు సరదాలు.. కవ్వించు సరసాలు.. కాలు జారేనేమో మనసా
కాలు.. జారేనేమో మనసా..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ..
ఉర్రూతలూగకే మనసా..ఆ..ఆ..
ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా
http://n3.filoops.com/telugu/Kotha%20Neeru%20%281981%29/Oogisalaadake%20Manasa.mp3




No comments:

Post a Comment