Monday 26 February 2018

కల్పన




దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ
దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ
ముద్దులగుమ్మ

చరణం 1
ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో ||2||
కదలికలన్నీ కధలుగ అల్లి కవితలే రాసుకుంటావో రామయ్య
పొన్నల పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు ||2||
ఆ వెన్నెలలో నీ కన్నులలో ||2||
సన్నజాజులే రువ్వు
కను సన్నజాజులే రువ్వు ||2||
సీతమ్మ... సీతమ్మ... ||దిక్కులు||

చరణం 2
కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో ||2||
కలలిక మాని కలయికలో నా కన్నులలో చూసుకుంటావో
రామయ్య
వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు ||2||
ఆ వెల్లువలో నా పల్లవిలో ||2||
రాగమే పలికించు అనురాగమై పులకించు ||2||
సీతమ్మ... సీతమ్మ... ||దిక్కులు||

https://www.youtube.com/watch?v=Q0mxV9-x6gA

Kalpana Songs - Dikkulu Choodaku Ramayya - Murali Mohan Jayachitra
Watch Murali Mohan Jayachitra's Kalpana Telugu Old Song With HD Quality Music : Chakravarthy Lyrics

జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)


ప్రియతమా నను పలకరించు ప్రణయమా..అతిథిలా నను చేరుకున్న హృదయమా
చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:
ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

చరణం 1:
నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ కలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా నరుడే .. వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనము నాలో మురిసే
మబ్బులనీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే

చరణం 2:
ప్రాణవాయువులో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె కులము గుణము అన్నీ కుదిరి
నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే






Sunday 25 February 2018

దొంగ మొగుడు (1987)


కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో...వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో చిత్రం : దొంగ మొగుడు (1987) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, జానకి పల్లవి : ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా.. ఆ.. ఆ.. ఆ.. కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో చరణం 1 : కన్నెకుసుమం కన్ను గీటి నన్ను పిలిచిన వేళ తేనె వానల తాన మాడగ తేటినై నే రానా... లలలలలా కాటు వేసిన మోటు సరసం హాయి గురుతై పోగాఘుమ్ముఘుమ్ముగ కమ్ముకున్న మత్తు వరదై రాదా ఓ.. ఓహో.. ఓ.. ఓ.. మారం చేసే ఆరలన్నీ తీరాలి ఈ వేళలో.. ఓ.. ఓహో.. ఓ.. ఓ.. పందెం వేసే అందాలన్నీ ఊగాలి ఉయ్యాలలో... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో చరణం 2 : వలపు వానా కురిసినాక వలపు వరదై పోదా కోరికలతో ఏరువాక సాగు తరుణం రాదా.. లలలలలా కన్న కలలు కోతకొస్తే పుష్యమాసం రాదా శోభనాల సంకురాతిరి సంబరాలే కాదా... అహ..హ..హా..అహా..హ..హా తూనిగల్లే ఆనందాలే తేలాలి ఈ గాలిలో ఓ..ఓ..ఓ..ఓ.. తేనేగల్లే మకరందాలే తూలాలి ఈ పూలలో... కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా.. ఆ.. ఆ.. ఆ.. https://www.youtube.com/watch?v=0dRPrbcSIKM Donga Mogudu Telugu Movie || Kokamma Cheppamma Video Song || Chiranjeevi, Bhanupriya, Radhika Donga Mogudu is a 1987 Tollywood film starring Chiranjeevi, Bhanupriya, Madhavi, and Radhika. This f...

గుండమ్మ కథ

అలిగిన వేళనే చూడాలి ...గోకుల కృష్ణుని అందాలు

చిత్రం : గుండమ్మ కథ
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : పి.సుశీల

అలిగిన వేళనే చూడాలి
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనే చూడాలి

రుసరుసలాడే చూపులలోనే
రుసరుసలాడే చూపులలోనే
ముసి ముసి నవ్వుల చందాలు

అలిగిన వేళనే చూడాలి

అల్లన మెల్లన నల్ల పిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి...ఈఈఈ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి మేలుకొని దొంగను చూసి
అల్లరిదేమని అడిగినందుకే

అలిగిన వేళనే చూడాలి
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనే చూడాలి

మోహన మురళి గానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
మోహన మురళి గానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోదా
దృష్టి తగులునని జడిసి యశోదా
తనను చాటుగా దాచినందుకే

అలిగిన వేళనే చూడాలి
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనే చూడాలి

https://www.youtube.com/watch?v=VuJE2v02Cm8
Gundamma Katha | Aligina Velane Choodali Video Song | NTR, ANR, Savitri, Jamuna
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...



Friday 16 February 2018

స్వరాభిషేకం (2004)


4. కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన...కొండలరాయనికిక కోటి రాతురులు... 

చిత్రం : స్వరాభిషేకం (2004) 
సంగీతం : పార్థసారధి (ఈపాటకు మాత్రమే) 
సాహిత్యం : కె.విశ్వనాథ్ 
గానం : బాలు, సునీత 

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన 
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన 
కొండలరాయనికిక కోటి రాతురులు 
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన 
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన 
కొండలరాయనికిక కోటి రాతురులు 

మేలుమేలాయెనే మంగ మాయమ్మకు 
అలకల తీపులు ఆర్చినందుకు 
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు 
అలకల తీపులు ఆర్చినందుకు 
చాలుచాలాయె చెలి బుగ్గలకు 
ఆఆఆ..చాలుచాలాయె చెలి బుగ్గలకు 
చెలువంపు గాటున చెక్కినందుకు 

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన 

తెలుపరే భానునికి తెలవారలేదనీ 
తెలుపరే భానునికి తెలవారలేదనీ 
పులిసినమేనా కొలది పవళించినందుకు 
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల 
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల 
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు 

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన 

స స గ రి ని ద మ ద ని ని ని ద ని స 
గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద 
సా... ని ద మ గ రి స 
ద ని స ద ని స ద ని స ద ని స 

తీయకే...ఆఆఆఆఅ.... ఆ గడియ ఆఆఆఆఅ 
తీపిఘడియలు వేలు మ్మ్..మ్.మ్.మ్.మ్... 
తిరునాధు కౌగిలిని కాగువరకు 
సాయకే...ఏ.. ఆ మేను... 
సాయకే ఆ మేను సరసాల సమయాలు 
సరిగంచు సవరించి సాగువరకూ 

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన 
కొండలరాయనికిక కోటి రాతురులు 


 

https://www.youtube.com/watch?v=pdwu3bHtlJA





Tuesday 13 February 2018

ఓం నమఃశివాయ

చిత్రం : నాగులచవితి (1956)
సంగీతం : ఆర్.గోవర్థనం/ఆర్.సుదర్శనం 
సాహిత్యం : పరశురాం 
గానం : పి.బి.శ్రీనివాస్ 


వందే శంభు ఉమాపతిం

సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగ భూషణం
మృగధరం వందే పశూనామ్ పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రంచక వరదం
వందే శివం శంకరం 



శివ శివ శంభో భవ భయహర శంభో 

శివ శివ శంభో భవ భయహర శంభో 

శివ శివ శంభో భవ భయహర శంభో 
శివ శివ శంభో భవ భయహర శంభో 
శివ శివ శంభో భవ భయహర శంభో 
శివ శివ శంభో భవ భయహర శంభో 



శైలజా మనోహరా కృపాకరా 

ఫాలనేత్ర భీకరా పాపహరా 

శైలజా మనోహరా కృపాకరా 
ఫాలనేత్ర భీకరా పాపహరా 



శివ శివ శంభో భవ భయహర శంభో 

శివ శివ శంభో భవ భయహర శంభో 



జాహ్నవీ జఠాధరా పరాత్పరా 

నిర్వికార సుందరా సౌఖ్యధరా 

జాహ్నవీ జఠాధరా పరాత్పరా 
నిర్వికార సుందరా సౌఖ్యధరా 


శివ శివ శంభో భవ భయహర శంభో 
శివ శివ శంభో భవ భయహర శంభో 


ఓం.. ఓం.. ఓం.. ఓం... 

Pranjai Prabha telugu songs

నమో భూతనాథా నమో దేవదేవా

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే .....
స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో .....
హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే .....
భూతాధిపా ప్రమథనాథ గిరీశచాపా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....

నమో భూతనాథా .....

భవ వేదసారా సదా నిర్వికారా .....
భవ వేదసారా సదా నిర్వికారా .....
జగాలెల్ల బ్రోవా ప్రభూ నీవె కావా .....
నమో పార్వతీవల్లభా నీలకంఠా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....
నమో భూతనాథా .....

సదా సుప్రకాశా మహాపాపనాశా ..... ఆ ఆ ఆ .....
సదా సుప్రకాశా మహాపాపనాశా .....
కాశీ విశ్వనాథా దయాసింధువీవే .....
నమో పార్వతీవల్లభా నీలకంఠా .....

నమో భూతనాథా నమో దేవదేవా .....
నమో భక్తపాలా నమో దివ్యతేజా .....
నమో భూతనాథా నమో దేవదేవా .....

సినిమా : సత్య హరిశ్చంద్ర
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు గారు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గారు
గానం : ఘంటసాల గారు, ఎస్.వరలక్ష్మి గార





చిత్రం:      భీష్మ (1962)

రచన:      ఆరుద్ర
గానం:      పి. సుశీల
సంగీతం:  సాలూరు రాజేశ్వర రావు

మహాదేవ శంభో..ఓ..ఓ..  మహాదేవ శంభో..ఓ..ఓ..


మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించ రావా                 | మహా దేవ |


జటాజూట ధారీ శివా చంద్రమౌళి నిటాలాక్ష నీవే సదా నాకు రక్షా        | జటాజూట |


ప్రతీకార శక్తి ప్రసాదించ రావా  ప్రసన్నమ్ము కావా! ప్రసన్నమ్ము కావా!


మహాదేవ శంభో..ఓ..ఓ.. మహాదేవ శంభో..ఓ..ఓ..


మహేశా గిరీశా ప్రభో దేవదేవా  మొరాలించి పాలించ రావా 


మహా దేవ శంభో..


శివోహం శివోహం శివోహం శివోహం  


మహాదేవ శంభో..ఓ..ఓ.. మహాదేవ శంభో..ఓ..ఓ..


మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించ రావా


మహా దేవ శంభో..


శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం



Pranjali prabha telugu songs.com

శివరాత్రి సందర్భముగా చిత్ర గీతాలు

1. స్వర్ణ కమలం

ఓం నమో నమో నమఃశివాయ

మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగ యాతరంగితొత్తమాంగతే నమఃశివాయ

ఓం నమో నమో నమఃశివాయ

శూలినే నమో నమః కపాళినే నమఃశివాయ
పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ

ఆందెల రవమిది పదములదా

అందెల రవమిది పదములదా
అంబర మంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా

సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా

మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై

మేను హర్ష వర్ష మేఘమై
వేణి విసురు వాయువేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేల

జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ

ఆందెల రవమిది పదములదా

నయన తేజమె న కారమై
మనో నిశ్చయం మ కారమై
శ్వాస చలనమె శి కారమై
వాంచితార్ధమె వా కారమై
యోచన సకలము యః కారమై

నాదం న కారం మంత్రం మ కారం స్తొత్రం శి కారం వేదం వా కారం యఙం య కారం

ఓం నమఃశివాయ

భావమె మౌనపు భవ్యము కాగ
భరతమె నిరతము భాగ్యము కాగ
పురిల గిరులు తరిగేల తాండవమాడే వేళ

ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిద
--((*))--