Saturday 21 October 2017

22-10-2017


నిన్న కనిపించింది నన్ను మురిపించింది
చిత్రం : రాణీ రత్నప్రభ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి :
అహ.. హా.. ఆ.. అహ.. ఆ..
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది

చరణం 1:
ఆమె చిరునవ్వులోనే హాయున్నది
ఆమె చిరునవ్వులోనే హాయున్నది
మనసు పులకించగా మధురభావాలు నాలోన కలిగించిందీ

నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది

చరణం 2:
ఆ.. ఆ.. అ.. ఆ..
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి

తలచుకొనగానే ఎదో ఆనందము
తలచుకొనగానే ఎదో ఆనందము
వలపు జనియించగా ప్రణయగీతాలు నాచేత పాడించింది

నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది

చరణం 3:
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ
సోగ కనులారా చూసింది సొంపారగా
సోగ కనులారా చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగిరించే ఇంపారగా
మూగ కోరికలు చిగిరించే ఇంపారగా

నడచిపోయిందీ ఎంతో నాజూకుగా
నడచిపోయిందీ ఎంతో నాజూకుగా
విడచి మనజాలనూ... విరహ తాపాలు మోహాలు రగిలించింది..

నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది...
అందచందాల రాణి ఆ చిన్నది



Rani Rathna Prabha - Ninna Kanipinchindi...

https://youtu.be/X0nEJLEPddY?list=PLFBE498A261FCAE7D

Friday 20 October 2017

21-10-2017-నాన్నకు ప్రేమతో (2016)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
 చిత్రం :నాన్నకు ప్రేమతో (2016)
రచన స్వరకల్పన : దేవిశ్రీ ప్రసాద్ 
పల్లవి 
ఏ కష్టమేదురొచ్చినా 
కన్నీళ్లు ఎదిరించినా 
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో 
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం 
 చరణం :
నేనే దారిలో వెళ్లినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నాని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం 
చరణం :
 ఏ అప్పులే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం 
చరణం
ఏ ఉసులే చెప్పినా
ఏ పాటలే పాడినా
భలే ఉంది మల్లి పాడరా అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం 
చారణం
ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో వందనం
ఈ పాటతో ఈ పాటతో  ఈ పాటతో ...   

19-10-2017

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

చంద్రముఖి
రా...రా సరసకు రారా...రా రా చెంతకు చేరా..
ప్రాణమే నీదిరా ఏలుకో రాదొరా...శ్వాసలో శ్వాసవై రారా

చిత్రం : చంద్రముఖి
సంగీతం : విద్యాసాగర్ 
గానం : బిన్నీ కృష్ణకుమార్,టిప్పు

రారా సరసకు రారా
రా రా చెంతకు చేరా

ప్రాణమే నీదిరా ఏలుకో రాదొరా
శ్వాసలో శ్వాసవై రారా

తోమ్..తోమ్...తోమ్...తోమ్...తోమ్..తోమ్...
ఆ...ఆ...ఆ..ధీరనన...ధీరనన....ధీరనన....

నీ పొందు నే కోరి...అభిసారికై నేను
వేచాను సుమనోహరా....ఆ...ఆ...
కాలాన పరుగైన ఆనంద రాగాలు
వినిపించ నిలిచానురా....

తనన ధీంత ధీంత ధీంతన
తనన ధీంత ధీంత ధీంతన
తనన ధీంత ధీంత ధీంతన

వయసు జాలమోపలేదురా
మరులు గొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చరా..రావెరా....
సల సల సల రగిలిన పరువపు పొదయిది
తడి పొడి తడి పొడి తపనల స్వరమిది
రా..రా...రా..రా....రారా......

ఏ బంధమో ఇది ఏ బంధమో
ఏ జన్మ బంధాల సుమగంధమో
ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో
నయనాల నడయాడు తొలి స్వప్నమో
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
మగువల మనసులు తెలిసి
నీ వలపులు మరుచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసకు పిలచితి విరసము తగదిక
జిగి బిగి జిగి బిగి సొగసుల మొరవిని
మిలమిల మగసిరి మెరుపుల మెరియగా

రా...రా..రా..రా.....రారా
తాం తరిగిడ ధీం తరిగిడ తోమ్ తరిగిడ నం తరిగిడ



Raa Raa Video Song from Chandramukhi Tamil Movie, featuring Rajinikanth, Jyothika, Prabhu, and…

Pranjali prabha

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


దేవత
బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా ఆ కరిగిపోయే
తలచేది జరుగదూ జరిగేది తెలియదూ

బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసి .ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
గారడిచేసి గుండెలు కోసి నవ్వేవు ఈవింత చాలికా

బొమ్మను చేసీ ప్రాణము పోసి ఆడేవు నీకిది వే ...డుకా
అందాలు సృష్టించినావూ దయతో నీవూ మరలా నీచేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే ఘాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశా అడియాశ చేసి
కొండంత ఆశా అడియాశ చేసి
పాతాళలోకాల తోసేవులే ...

బొమ్మను చేసి ...ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవూ
హాలాహలజ్వాల చేసేవులే .
ఆనందనౌకా పయనించువేళా
ఆనందనౌకా పయనించువేళా శోకాల సంద్రాల ముంచేవులే

బొమ్మను చేసీ . ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా .ఆ..
గారడి చేసీ . గుండెలు కోసి . నవ్వేవు ఈవింత చాలిక.
బొమ్మను చేసి .ప్రాణము పోసి ఆడేవు నీకిది వే ... డుకా



Watch Devatha Songs. Super Hit Movie Devatha Video Songs. Starring NTR, Savitri. Music : SP Kodandapani Lyrics : Veturi Sundararama Murthy , Sri Sri , Dasara...



youtube.com

Tuesday 17 October 2017

Pranjali Prabha - 18-10-=2017

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి - 2ప్రభ18-10-2017
అల్లుడుగారు
పల్లవి:
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
లాలలలాలల లాలలలాలల లాలల

చరణం 1:
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవతా
ఇంత చోటులోనే అంత మనసు వుంచి
ఇంత చోటులోనే అంత మనసు వుంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా

ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు

చరణం 2:
అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోకి రమ్మంది ఈ దైవము
మాట నోచుకోని ఒక పేదరాలిని
మాట నోచుకోని ఒక పేదరాలిని
నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా...

ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్...






Pranjali Prabha - కల్పన (1977)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ - 17-10-2017


ఒక ఉదయంలో నా హృదయంలో
చిత్రం: కల్పన (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఇది నా కల్పన.. కవితాలాపన.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఒక ఉదయంలో... నా హృదయంలో
ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

చరణం 1:

తార తారకి నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో..

తార తారకి నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో..

మనిషి మనిషికీ మద్య మనసనేది ఎందుకో
మనసే గుడిగా.. మనిషికి ముడిగా..
మమత ఎందుకో.. మమత ఎందుకో..

తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా..
అది ఒక కల్పన.. అది నా కల్పన...

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

చరణం 2:

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే

కవి మనస్సులో ఉషస్సు కారు చీకటౌతుంటే
మిగిలిన కథలో.. పగిలిన ఎదలో..
ఈ కవితలెందుకో.. కవితలెందుకో..

తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా..
అది ఒక కల్పన.. అది నా కల్పన..

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన
https://youtu.be/X88q0Xp-2SE
Kalpana Songs - Oka Udayamlo - Murali Mohan Jayachitra
Watch Murali Mohan Jayachitra's Kalpana Telugu Old Song With HD Quality Music : Chakravarthy Lyrics ...

Monday 16 October 2017

ప్రాంజలి ప్రభ - రోజుకో పాట విందాం - 16-10-2017

ప్రాంజలి ప్రభ - రోజుకో పాట విందాం - మనస్సు ప్రశాంత పరుచుకుందాం
16-10-2017

మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

చిత్రం: కాళహస్తి మహాత్మ్యం (1954)
రచన: తోలేటి వెంకట రెడ్డి
సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం: ఘంటసాల

మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే....ఏ......ఏ.....
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

ఆగమ సంచారా
ఆగమ సంచారా, నా స్వాగతమిదె గొనుమా..
భావజ సంహారా...
భావజ సంహారా.....
భావజ సంహారా... నా నన్ను కావగ రావయ్యా

పాలను ముంచెదవో.. ఓ.. ఓ.. ఓ..
పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో..
భారము నీదయ్యా
పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా..
జయహే సర్వేశా!
జయహే సర్వేశా! సతి శాంభవి ప్రాణేశా!..ఆ..
కారుణ్య గుణసాగరా!..
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

https://www.youtube.com/watch?v=Jon0s51aCKI
Madhuramu Shiva Mantram || Rajkumar Hit Songs - Telugu Devotional Songs
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...