Wednesday 6 October 2021

 


ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ 

చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1997)

గాయకులు: స్వర్నలత, వందేమాతరం శ్రీనివాసు 

రచయిత: సుద్దాల అషోక్ తేజ  

ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ

ఓ పున్నమి బొమ్మ ఓ పుత్త్తడి గుమ్మా

ఓ రాములమ్మ రాములమ్మ

ఎం సూపులోయమ్మ ఎగు సుక్కలేనమ్మా

సిరి నవ్వులోయమ్మ సెంద్ర వంకేలేనమ్మా

ఓ రాములమ్మ రాములమ్మ

నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మా

ఓ ఒసేయ్ రాములమ్మ

ఆ కరిమబ్బు వరిదొబ్బు కన్ను గెలిపినమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటే నమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టెనమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే

నురగ తీరుగా వున్నవే

ఓ రాములమ్మ

విఛ్చుకొని మొగ్గవోలె పచ్చిపాలా నిగ్గువోలె

ముచ్చటేసి పోతున్నవే

ఓ రాములమ్మ

ఓ రాములమ్మ

వాగుల్లో వంకల్లో

ఆ సెల్లాల్లో ఆఆ మూలల్లో

వాగుల్లో వంకల్లో ఆ సెల్లాల్లో మూలల్లో

నువ్వు పచ్చ్చగుండాలె

నువ్వు పదిలంగుండాలె

భూమి తల్లి సాక్షిగా సేమాంగుండాలె

సూరీడే నీ వంక తేరి సుసెనమ్మా

ఓ ఒసేయ్ రాములమ్మ

అడుగేస్తే నెలంతా అద్ధమాయెనమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

పసిడి వన్నె వొంటి మీద పాడు సూపు పడకుండా

పసుపు పూసినారే అమ్మలు

ఓ రాములమ్మ

సిటీ వయసు పారిపోయే జిగురు వయసు చేరినని

సీర కట్టినారు గుమ్మాలు

ఓ రాములమ్మ

దొర గారి దొరసాని దీవెనల కోసమని

ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని

కాళ్ళు మోక్త బంచానని వంగినవమ్మా

మూడు గుంచాలిస్తే నిలువెత్తు పొంగినవమ్మా

దొరగారి పై ఊగే పంక వైనవమ్మా

ఓ ఒసేయ్ రాములమ్మ

దొరసాని కాలొత్తే దూది వైనవమ్మా

ఓ ఒసేయ్ రాములమ్మ

దేవీడునే వెలిగించే దివ్వె వైనవమ్మా

ఓ ఒసేయ్ రాములమ్మ

నలుగురికి తల్లోన్ని నాల్కవైనవమ్మా

ఓ ఒసేయ్ రాములమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

సీకటింట బిక్కుమంటూ కలత పడ్డ కళ్ళలోన

బాకు లాంటి ఎలుగు మెరిసిన

ఓ రాములమ్మ

మూక బైట వెదురులోన ముచ్చ్చటైన

రాగాలూదే ముద్దులయ్య చెయ్యి దొరికేనా

ఓ రాములమ్మ

కష్టాలు కన్నీళ్లు ఉంటాయా శానల్లు

కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా శానల్లు

ఇంకా పొదల మాటు పువ్వుల్లాగా ఒదగాలోయమ్మ

గుబులే లేని గువ్వలాగా ఎగరాలోయమ్మ

పచ్చని అడివి తల్లి పందిరవుతుందమ్మా

ఓ ఒసేయ్ రాములమ్మ

నీరెండే నీ కాళీ పరానవుతుందమ్మా

ఓ ఒసేయ్ రాములమ్మ

పూసేటి పూలన్నీ పొసే తలంబ్రాలమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

కోయిలలా సందల్లే సన్నాయిమేళాలమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ

ఓ ఒసేయ్ రాములమ్మ


Mommy:

*దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - 3.శ్రీ అన్నపూర్ణాదేవి/చంద్రఘంట*

*శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళిః/ శ్రీ అన్నపూర్ణాదేవి సహస్రనామం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.

అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.



శ‌ర‌న్నవ‌రాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా ద‌ర్శన‌మిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ త‌ల్లిగా కుటుంబంలో మ‌హిళ‌కు ఉండే పాత్రను చాటిచెప్పే అవ‌తారం.. అన్నపూర్ణ‌.. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించమ‌నే సందేశము…అమ్మవారు మన‌కు ఇస్తుంది. కుటుంబంలో త‌ల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతార‌ము మ‌న‌కు బోద‌ప‌డేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.



సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. 



అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.



అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది.



 ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.


దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.



ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.

‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.



‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.



దీపావళిరోజున కూడా కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది.అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి.


@@@@@@@@@

* శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః*

@@@@@@@@@


ఓం అన్నపూర్ణాయై నమః

ఓం శివాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం భీమాయై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం పార్వత్యై నమః

ఓం దుర్గాయై నమః

ఓం శర్వాణ్యై నమః || 




ఓం శివవల్లభాయై నమః

ఓం వేదవేద్యాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం విద్యాదాత్రై నమః

ఓం విశారదాయై నమః

ఓం కుమార్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం బాలాయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం శ్రియై నమః || 




ఓం భయహారిణ్యై నమః

ఓం భవాన్యై నమః

ఓం విష్ణుజనన్యై నమః

ఓం బ్రహ్మాదిజనన్యై నమః

ఓం గణేశజనన్యై నమః

ఓం శక్త్యై నమః

ఓం కుమారజనన్యై నమః

ఓం శుభాయై నమః

ఓం భోగప్రదాయై నమః

ఓం భగవత్యై నమః || 




ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః

ఓం భవరోగహరాయై నమః

ఓం భవ్యాయై నమః

ఓం


శుభ్రాయై నమః

ఓం పరమమంగళాయై నమః

ఓం భవాన్యై నమః

ఓం చంచలాయై నమః

ఓం గౌర్యై నమః

ఓం చారుచంద్రకళాధరాయై నమః

ఓం విశాలాక్ష్యై నమః || 




ఓం విశ్వమాత్రే నమః

ఓం విశ్వవంద్యాయై నమః

ఓం విలాసిన్యై నమః

ఓం ఆర్యాయై నమః

ఓం కళ్యాణనిలాయాయై నమః

ఓం రుద్రాణ్యై నమః

ఓం కమలాసనాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం శుభయై నమః

ఓం అనంతాయై నమః || 




ఓం వృత్తపీనపయోధరాయై నమః

ఓం అంబాయై నమః

ఓం సంహారమథన్యై నమః

ఓం మృడాన్యై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం విష్ణుసంసేవితాయై నమః

ఓం సిద్ధాయై నమః

ఓం బ్రహ్మాణ్యై నమః

ఓం సురసేవితాయై నమః

ఓం పరమానందదాయై నమః || 




ఓం శాంత్యై నమః

ఓం పరమానందరూపిణ్యై నమః

ఓం పరమానందజనన్యై నమః

ఓం పరాయై నమః

ఓం ఆనందప్రదాయిన్యై నమః

ఓం పరోపకారనిరతాయై నమః

ఓం పరమాయై నమః

ఓం భక్తవత్సలాయై నమః

ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః

ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః || 




ఓం శుభలక్షణసంపన్నాయై నమః

ఓం శుభానందగుణార్ణవాయై నమః

ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః

ఓం శుభదాయై నమః

ఓం రతిప్రియాయై నమః

ఓం చండికాయై నమః

ఓం చండమథన్యై నమః

ఓం చండదర్పనివారిణ్యై నమః

ఓం మార్తాండనయనాయై నమః

ఓం సాధ్వ్యై నమః || 




ఓం చంద్రాగ్నినయనాయై నమః

ఓం సత్యై నమః

ఓం పుండరీకహరాయై నమః

ఓం పూర్ణాయై నమః

ఓం పుణ్యదాయై నమః

ఓం పుణ్యరూపిణ్యై నమః

ఓం మాయాతీతాయై నమః

ఓం శ్రేష్ఠమాయాయై నమః

ఓం శ్రేష్ఠధర్మాత్మవన్దితాయై నమః

ఓం అసృష్ట్యై నమః || 




ఓం సంగరహితాయై నమః

ఓం సృష్టిహేతవే నమః

ఓం కపర్దిన్యై నమః

ఓం వృషారూఢాయై నమః

ఓం శూలహస్తాయై నమః

ఓం స్థితిసంహారకారిణ్యై నమః

ఓం మందస్మితాయై నమః

ఓం స్కందమాత్రే నమః

ఓం శుద్ధచిత్తాయై నమః

ఓం మునిస్తుతాయై నమః || 




ఓం మహాభగవత్యై నమః

ఓం దక్షాయై నమః

ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః

ఓం సర్వార్థదాత్ర్యై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సదాశివకుటుంబిన్యై నమః

ఓం నిత్యసుందరసర్వాంగ్యై నమః

ఓం సచ్చిదానందలక్షణాయై నమః || 


🕉🌞🌎🌙🌟🚩


*దుర్గామాత యొక్క మూడవ శక్తి* *'చంద్రఘంట’/అన్నపూర్ణాదేవి అలంకారం*



దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. 

ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. 

ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’  అనే పేరు స్థిరపడింది. 

ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిల లాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. 

సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. 

ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.



*శ్రీఅన్నపూర్ణదేవి విశిష్ఠత*


అన్నం పరబ్రహ్మ స్వరూపం. 

సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. 

అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. 

ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. 

అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.



అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, 

సమయస్పూర్తి, 

వాక్శుద్ది, 

వాక్సిద్ధి, 

భక్తిశ్రద్ధలు, 

ఐశ్వర్యం కలుగుతాయి. 

భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. 

బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచిన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం.



ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి

 తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. 

” హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. 



అమ్మవారికి దధ్యోదనము, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. 

అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.

 


నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. 

ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. 

చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. 

దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. 

అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. 

ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.



ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. 

ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. 

ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. 

ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. 

ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.



ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. 



ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. 

వారి నేత్రాలలోని క


ాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. 

వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. 

చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. 

ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. 

ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. 

కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.



మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. 

అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, 

సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది. 



మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత  మహిదేవ్యన్నం స్వాహా 

అనే మంత్రం జపించాలి.



అన్నపూర్ణ అష్టోత్తర శత నామావళి 

శ్రీ అన్నపూర్ణాష్టకమ్ పారాయణం చేయవలెను.


@@@@@@@@@

*శ్రీఅన్నపూర్ణాష్టకం*

@@@@@@@@@


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 1 ||



నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ

కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 2 ||



యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౩ ||



కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ

కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ

మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 4 ||



దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ

లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ

శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 5 ||



ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ

కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ

స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 6 ||



ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 7 ||



దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ

వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ

భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 8 ||



చంద్రార్కానలకోటి

కోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ

చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ

మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 9 ||



క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ

సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 10 



అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || 11 ||



మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ !12 ||



🕉🌞🌎🌙🌟🚩


చంద్రఘంటా దుర్గా,  దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.



శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న  తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన  మేనకా దేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత,  ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి  వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. 



 అప్పుడు  అమ్మవారు  చంద్రఘంటాదేవి  రూపంలో శివునకు కనిపించి,  తమ కుటుంబం భయపడకుండా ఉండేలా 

తన వేషం  మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని  వేషంలో,  లెక్కలేనన్ని  నగలతో తయారవుతాడు.   అప్పుడ


ు  ఆమె కుటుంబసభ్యులు,  స్నేహితులు, 

బంధువులూ భయం  పోయి  శివుణ్ణి  వివాహానికి  ఆహ్వానిస్తారు.  ఆ  తరువాత  శివ,పార్వతులు  వివాహం చేసుకుంటారు.  అలా  ప్రజల  భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.

శివ, పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు.



 ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.



చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో  త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్భాణాలు, మరో చేతిలో  ఖడ్గం,  ఇంకో  చేతిలో కమండలం  ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ, సింహం  మీదగానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు.  అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.



పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా, ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి, చాముండాదేవి అని పిలుస్తారు.

ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు.



 రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానినాదానికే గుండెలవిసాయని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో, ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.



*ధ్యాన శ్లోకం:-*


*పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా!!*


🕉🌞🌎🌙🌟🚩


*శ్రీ అన్నపూర్ణాదేవి  కవచం*

💫💫💫💫💫💫


*1)ద్వాత్రింశద్వర్ణమన్త్రోఽయం శంకర ప్రతిభాషితః ।అన్నపూర్ణా మహావిద్యా సర్వమన్త్రోత్తమోత్తమా ॥*



*2)పూర్వముత్తర ముచ్చార్య సమ్పుటీ కరణముత్తమమ్ ।స్తోత్రమన్త్రస్య ఋషిర్బ్రహ్మా ఛన్దో త్రిష్టుబుదాహృతః ॥*



*3) దేవతా అన్నపూర్ణా చ హ్రీం బీజమమ్బికా స్మృతా ।  స్వాహా శక్తిరితి జ్ఞేయం భగవతి కీలకం మతమ్ ॥*



*4)ధర్మాఽర్థ-కామ-మోక్షేషు వినియోగ ఉదాహృతః । ఓం హ్రీం భగవతి మాహేశ్వరి అన్నపూర్ణాయై స్వాహా ।సప్తార్ణవమనుష్యాణాం జపమన్త్రః సమాహితః ॥*



*5)అన్నపూర్ణే ఇమం మన్త్రం మను సప్త దశాక్షరమ్।  సర్వ సమ్పత్ప్రదో నిత్యం సర్వవిశ్వకరీ తథా ॥*



*6)భువనేశ్వరీతి విఖ్యాతా సర్వాఽభీష్టం ప్రయచ్ఛతి ।హృల్లేఖేయమితి జ్ఞేయమోంకారాక్షరరూపిణీ ॥*



*7)కాన్తి-పుష్టి-ధనా-ఽఽరోగ్య యశాంసి లభతే శ్రియమ్ । అస్మిన్ మన్త్రే రతో నిత్యం వశయేదఖిలం జగత్ ॥*



*అఙ్గన్యాసః -- ఓం అస్య శ్రీఅన్నపూర్ణామాలా మన్త్రస్య బ్రహ్మా ఋషయే!  నమః శిరసి । ఓం అన్నపూర్ణాదేవతాయై నమః హృదయే । ఓం హ్రీం బీజాయ నమః   నాభౌ । ఓం స్వాహా శక్తయే నమః  పాదయోః । ఓం ధర్మా-ఽర్థ-కామ-మోక్షేషు   వినియోగాయ నమః సర్వాఙ్గే !కరన్యాసః -- ఓం హ్రాం అఙ్గుష్ఠాభ్యాం నమః ।ఓం హ్రీం తర్జనీభ్యాం  నమః । ఓం హ్రఁ మధ్యమాభ్యాం నమః । ఓం హ్రైం అనామికాభ్యాం నమః । ఓం హ్రీం కనిష్ఠికాభ్యాం నమః । ఓం హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః । హృదయాదిన్యాసః -ఓం హ్రాం హృదయాయ నమః । ఓం హ్రీం శిరసే స్వాహా । ఓం ఇహ శిఖాయై వషట్ । ఓం హ్రైం కవచాయ హుమ్ । ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ । ఓం హ్రః అస్త్రాయ ఫట్ ।*


*ధ్యానమ్:--*


*రక్తాం విచిత్రవసనాం నవచన్ద్రచూడాం అన్నప్రదాన-నిరతాం స్తనభారనమ్రామ్ ।నృత్యన్తమిన్దు సకలాభరణం విలోక్య హృష్టాం భజే భగవతీం భవ-దుఃఖ-హన్త్రీమ్ ।*



*మాలామత్రః:--*


*1) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నమో భగవతి మాహేశ్వరి అన్నపూర్ణే !మమాఽభిలషితమన్నం దేహి స్వాహా । ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మన్దార-కల్ప-హరిచన్దన-పారిజాత-మధ్యేశశాఙ్క-మణిమణ్డిత-వేదిసంస్థే ।అర్ధేన్దు-మౌలి-సులలా ట-షడర్ధనేత్రే భిక్షాం ప్రదేహి గిరిజే!క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*2) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కేయూర- హార-కనకాఙ్గదకర్ణపూరే కాఞ్చీకలాప- మణికాన్తి-లసద్దుకూలే ।దుగ్ధా-ఽన్నపాత్ర-వర-కాఞ్చన-దర్విహస్తే భిక్షాం ప్రదేహి గిరిజే!క్షుధితా


య మహ్యమ్ ఓం క్లీం శ్రీ హ్రీం ఐం ఓం ॥*



*3) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఆలీ కదమ్బపరిసేవిత-పార్శ్వభాగే శక్రాదిభిర్ముకులితాఞ్జలిభిః పురస్తాత్ । దేవి! త్వదీయచరణౌ శరణం ప్రపద్యే భిక్షాం ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం ఓం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*4) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గన్ధర్వ- దేవఋషి-నారద- కౌశికాఽత్రి-వ్యాసా- ఽమ్వరీష-కలశోద్భవ-కశ్యపాద్యాః । భక్త్యా స్తువన్తి నిగమా-ఽఽగమ-సూక్త-మన్త్రైర్భిక్షా ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం ఓం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*5) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం లీలావచాంసి తవ దేవి! ఋగాదివేదాః సృష్ట్యాదికర్మరచనా భవదీయచేష్టా ।త్వత్తేజసా జగదిదం ప్రతిభాతి  నిత్యం భిక్షాం ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*6) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శబ్దాత్మికే శశికలాభరణార్ధదేహే శమ్భో- రురస్థల- నికేతననిత్యవాసే ।దారిద్ర్య-దుఃఖభయహారిణి కా త్వదన్యా భిక్షాం ప్రదేహి గిరిజే !క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం ఐం ఓం ॥*



*7) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సన్ధ్యాత్రయే సకలభూసురసేవ్యమానే స్వాహా స్వధాసి పితృదేవగణార్తిహన్త్రీ !జాయా సుతాః పరిజనాతిథయోఽన్నకామాః భిక్షాం ప్రదేహి గిరిజే!క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*8) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సద్భక్తకల్పలతికే భువనం కవన్ద్యే భూతేశ- హృత్కమలమగ్న-కుచాగ్రభృఙ్గే ।కారుణ్యపూర్ణనయనే కిముపేక్షసే మాం భిక్షాం ప్రదేహి గిరజే క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*9) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అమ్బ! త్వదీయ-చరణామ్బుజ-సంశ్రయేణ బ్రహ్మాదయో- ఽప్యవికలాం శ్రియమాశ్రయన్తే ।తస్మాదహం తవ నతోఽస్మి పదారవిన్దే భిక్షాం ప్రదేహి గిరిజే!క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*10) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఏకాగ్ర మూలనిలయస్య మహేశ్వరస్య ప్రాణేశ్వరి!ప్రణత-భక్తజనాయ శీఘ్రమ్ ।కామాక్షి-రక్షిత-జగత్-త్రితయేఽన్నపూర్ణేభిక్షాం ప్రదేహి గిరిజే! క్షుధితాయ మహ్యం క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*11) ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భక్త్యా పఠన్తి గిరిజాదశకం ప్రభాతే మోక్షార్థినో బహుజనాః ప్రథితాన్నకామాః ।ప్రీతా మహేశవనితా హిమశైల- కన్యా తేషాం దదాతి సుతరాం మనసేప్సితాని క్లీం శ్రీం హ్రీం ఐం ఓం ॥*



*ఇతి శ్రీశఙ్కరాచార్య విరచితము  శ్రీ అన్నపూర్ణాదేవి కవచం సమాప్తమ్.*


🕉🌞🌏🌙🌟🚩


*॥ శ్రీఅన్నపూర్ణాదేవి సహస్రనామస్తోత్రమ్ ॥*


కైలాసశిఖరాసీనం దేవదేవం మహేశ్వరం . ప్రణమ్య దండవద్భూమౌ పార్వతీ పరిపృచ్ఛతి .. 1.. శ్రీపార్వత్యువాచ . అన్నపూర్ణా మహాదేవీ త్రైలోక్యే జీవధారిణీ . నామ్నాం సహస్రం తస్యాస్తు కథయస్వ మహాప్రభో .. 2.. శ్రీశివ ఉవాచ . శృణు దేవి వరారోహే జగత్కారణి కౌలిని . ఆరాధనీయా సర్వేషాం సర్వేషాం పరిపృచ్ఛసి .. 3.. సహస్రైర్నామభిర్దివ్యైస్త్రైలోక్యప్రాణిపూజితైః . అన్నదాయాస్స్తవం దివ్యం యత్సురైరపి వాంఛితం .. 4.. కథయామి తవ స్నేహాత్సావధానాఽవధారయ . గోపనీయం ప్రయత్నేన స్తవరాజమిదం శుభం .. 5.. న ప్రకాశ్యం త్వయా భద్రే దుర్జనేభ్యో నిఃశేషతః . న దేయం పరశిష్యేభ్యో భక్తిహీనాయ పార్వతి .. 6.. దేయం శిష్యాయ శాంతాయ గురుదేవరతాయ చ . అన్నపూర్ణాస్తవం దేయం కౌలికాయ కులేశ్వరీ .. 7.. ఓం అస్య శ్రీమదన్నపూర్ణాసహస్రనామస్తోత్రమాలామంత్రస్య, శ్రీభగవాన్ ఋషిః, అనుష్టుప్ఛందః, ప్రకటగుప్తగుప్తతర సంపదాయ కులోత్తీర్ణ నిగర్భరహస్యాతి రహస్యపరాపరాతిరహస్యాతిపూర్వాచింత్యప్రభావా భగవతీ శ్రీమదన్నపూర్ణాదేవతా, హలో బీజం, స్వరాశ్శక్తిః, జీవో బీజం, బుద్ధిశ్శక్తిః, ఉదానో బీజం, సుషుమ్నా నాడీ, సరస్వతీ శక్తిః, ధర్మార్థకామమోక్షార్థే పాఠే వినియోగః .. ధ్యానం . అర్కోన్ముక్తశశాంకకోటివదనామాపీనతుంగస్తనీం చంద్రార్ధాంకితమస్తకాం మధుమదామాలోలనేత్రత్రయీం . బిభ్రాణామనిశం వరం జపపటీం శూలం కపాలం కరైః ఆద్యాం యౌవనగర్వితాం లిపితనుం వాగీశ్వరీమాశ్రయే .. అథ అన్నపూర్ణాసహస్రనామస్తోత్రం . .. ఓం అన్నపూర్ణాయై నమః .. అన్నపూర్ణా అన్నదాత్రీ అన్నరాశికృతాలయా . అన్నదా అన్నరూపా చ అన్నదానరతోత్సవా .. 1.. అనంతా చ అనంతాక్షీ అనంతగుణశాలినీ . అచ్యుతా అచ్యుతప్రాణా అచ్యుతానందకారిణీ .. 2.. అవ్యక్తాఽనంతమహిమా అనంతస్య కులేశ్వరీ . అబ్ధిస్థా అబ్ధిశయనా అబ్ధిజా అబ్ధినందినీ .. 3.. అబ్జస్థా అబ్జనిలయా అబ్జజా అబ్జభూషణా . అబ్జాభా అబ్జహస్తా చ అబ్జపత్రశుభేక్షణా .. 4.. అబ్జాననా అనంతాత్మా అగ్రిస్థా అగ్నిరూపిణీ . అగ్నిజాయా అగ్నిముఖీ అగ్నికుండకృతాలయా .. 5.. అకారా అగ్నిమాతా చ అజయాఽదితినందినీ . ఆద్యా ఆదిత్యసంకాశా ఆత్మజ్ఞా ఆత్మగోచరా .. 6.. ఆత్మసూరాత్మదయితా ఆధారా ఆత్మరూపిణీ . ఆశా ఆకాశపద్మస్థా అవకాశస్వరూపిణీ .. 7.. ఆశాపూరీ అగాధా చ అణిమాదిసుసేవితా . అంబికా అబలా అంబా అనాద్యా చ అయోనిజా .. 8.. అనీశా ఈశికా ఈశా ఈశానీ ఈశ్వరప్రీయా . ఈశ్వరీ ఈశ్వరప్రాణా ఈశ్వరానందదాయినీ .. 9.. ఇంద్రాణీ ఇంద్రదయితా ఇంద్రసూరింద్రపాలినీ . ఇందిరా ఇంద్రభగినీ ఇంద్రియా ఇందుభూషణా .. 10.. ఇందుమాతా ఇందుముఖీ ఇంద్రియాణాం వశంకరీ . ఉమా ఉమాపతేః ప్రాణా ఓడ్యాణపీఠవాసినీ .. 11.. ఉత్తరజ్ఞా ఉత్తరాఖ్యా ఉకారా ఉత్తర


ాత్మికా . ఋమాతా ఋభవా ఋస్థా ౠలౄకారస్వరూపిణీ .. 12.. ఋకారా చ లృకారా చ లౄతకప్రీతిదాయినీ . ఏకా చ ఏకవీరా చ ఏకారైకారరూపిణీ .. 13.. ఓకారీ ఓఘరూపా చ ఓఘత్రయసుపూజితా . ఓఘస్థా ఓఘసంభూతా ఓఘధాత్రీ చ ఓఘసూః .. 14.. షోడశస్వరసంభూతా షోడశస్వరరూపిణీ . వర్ణాత్మా వర్ణనిలయా శూలినీ వర్ణమాలినీ .. 15.. కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిః సులోచనా . కాలీ కపాలినీ కృత్యా కాలికా సింహగామినీ .. 16.. కాత్యాయనీ కలాధారా కాలదైత్యనికృంతనీ . కామినీ కామవంద్యా చ కమనీయా వినోదినీ .. 17.. కామసూః కామవనితా కామధుక్ కమలావతీ . కామదాత్రీ కరాలీ చ కామకేలివినోదినీ .. 18.. కామనా కామదా కామ్యా కమలా కమలార్చితా . కాశ్మీరలిప్తవక్షోజా కాశ్మీరద్రవచర్చితా .. 19.. కనకా కనకప్రాణా కనకాచలవాసినీ . కనకాభా కాననస్థా కామాఖ్యా కనకప్రదా .. 20.. కామపీఠస్థితా నిత్యా కామధామనివాసినీ . కంబుకంఠీ కరాలాక్షీ కిశోరీ చ కలాపినీ .. 21.. కలా కాష్ఠా నిమేషా చ కాలస్థా కాలరూపిణీ . కాలజ్ఞా కాలమాతా చ కాలధాత్రీ కలావతీ .. 22.. కాలదా కాలహా కుల్యా కురుకుల్లా కులాంగనా . కీర్తిదా కీర్తిహా కీర్తిః కీర్తిస్థా కీర్తివర్ధనీ .. 23.. కీర్తిజ్ఞా కీర్తితపదా కృత్తికా కేశవప్రియా . కేశిహా కేలీకారీ చ కేశవానందకారిణీ .. 24.. కుముదాభా కుమారీ చ కర్మదా కమలేక్షణా . కౌముదీ కుముదానందా కౌలినీ చ కుముద్వతీ .. 25.. కోదండధారిణీ క్రోధా కూటస్థా కోటరాశ్రయా . కాలకంఠీ కరాలాంగీ కాలాంగీ కాలభూషణా .. 26.. కంకాలీ కామదామా చ కంకాలకృతభూషణా . కపాలకర్త్రికకరా కరవీరస్వరూపిణీ .. 27.. కపర్దినీ కోమలాంగీ కృపాసింధుః కృపామయీ . కుశావతీ కుండసంస్థా కౌబేరీ కౌశికీ తథా .. 28.. కాశ్యపీ కద్రుతనయా కలికల్మషనాశినీ . కంజస్థా కంజవదనా కంజకింజల్కచర్చితా .. 29.. కంజాభా కంజమధ్యస్థా కంజనేత్రా కచోద్భవా . కామరూపా చ హ్రీంకారీ కశ్యపాన్వయవర్ధినీ .. 30.. ఖర్వా చ ఖంజనద్వంద్వలోచనా ఖర్వవాహినీ . ఖడ్గినీ ఖడ్గహస్తా చ ఖేచరీ ఖడ్గరూపిణీ .. 31.. ఖగస్థా ఖగరూపా చ ఖగగా ఖగసంభవా . ఖగధాత్రీ ఖగానందా ఖగయోనిస్వరూపిణీ .. 32.. ఖగేశీ ఖేటకకరా ఖగానందవివర్ధినీ . ఖగమాన్యా ఖగాధారా ఖగగర్వవిమోచినీ .. 33.. గంగా గోదావరీ గీతిర్గాయత్రీ గగనాలయా . గీర్వాణసుందరీ గౌశ్చ గాధా గీర్వాణపూజితా .. 34.. గీర్వాణచర్చితపదా గాంధారీ గోమతీ తథా . గర్విణీ గర్వహంత్రీ చ గర్భస్థా గర్భధారిణీ .. 35.. గర్భదా గర్భహంత్రీ చ గంధర్వకులపూజితా . గయా గౌరీ చ గిరిజా గిరిస్థా గిరిసంభవా .. 36.. గిరిగహ్వరమధ్యస్థా కుంజరేశ్వరగామినీ . కిరీటినీ చ గదినీ గుంజాహారవిభూషణా .. 37.. గణపా గణకా గణ్యా గణకానందకారిణీ . గణపూజ్యా చ గీర్వాణీ గణపాననందకారిణీ .. 38.. గురుమాతా గురురతా గురుభక్తిపరాయణా . గోత్రా గౌః కృష్ణభగినీ కృష్ణసూః కృష్ణనందినీ .. 39.. గోవర్ధనీ గోత్రధరా గోవర్ధనకృతాలయా . గోవర్ధనధరా గోదా గౌరాంగీ గౌతమాత్మజా .. 40.. ఘర్ఘరా ఘోరరూపా చ ఘోరా ఘర్ఘరనాదినీ . శ్యామా ఘనరవాఽఘోరా ఘనా ఘోరార్తినాశినీ .. 41.. ఘనస్థా చ ఘనానందా దారిద్ర్యఘననాశినీ . చిత్తజ్ఞా చింతితపదా చిత్తస్థా చిత్తరూపిణీ .. 42.. చక్రిణీ చారుచంపాభా చారుచంపకమాలినీ . చంద్రికా చంద్రకాంతిశ్చ చాపినీ చంద్రశేఖరా .. 43.. చండికా చండదైత్యఘ్నీ చంద్రశేఖరవల్లభా . చాండాలినీ చ చాముండా చండముండవధోద్యతా .. 44.. చైతన్యభైరవీ చండా చైతన్యఘనగేహినీ . చిత్స్వరూపా చిదాధారా చండవేగా చిదాలయా .. 45.. చంద్రమండలమధ్యస్థా చంద్రకోటిసుశీతలా . చపలా చంద్రభగినీ చంద్రకోటినిభాననా .. 46.. చింతామణిగుణాధారా చింతామణివిభూషణా . భక్తచింతామణిలతా చింతామణికృతాలయా .. 47.. చారుచందనలిప్తాంగీ చతురా చ చతుర్ముఖీ . చైతన్యదా చిదానందా చారుచామరవీజితా .. 48.. ఛత్రదా ఛత్రధారీ చ ఛలచ్ఛద్మవినాశినీ . ఛత్రహా ఛత్రరూపా చ ఛత్రచ్ఛాయాకృతాలయా .. 49.. జగజ్జీవా జగద్ధాత్రీ జగదానందకారిణీ . యజ్ఞప్రియా యజ్ఞరతా జపయజ్ఞపరాయణా .. 50.. జననీ జానకీ యజ్వా యజ్ఞహా యజ్ఞనందినీ . యజ్ఞదా యజ్ఞఫలదా యజ్ఞస్థానకృతాలయా .. 51.. యజ్ఞభోక్త్రీ యజ్ఞరూపా యజ్ఞవిఘ్నవినాశినీ . జపాకుసుమసంకాశా జపాకుసుమశోభితా .. 52.. జాలంధరీ జయా జైత్రీ జీమూతచయభాషిణీ . జయదా జయరూపా చ జయస్థా జయకారిణీ .. 53.. జగదీశప్రియా జీవా జలస్థా జలజేక్షణా . జలరూపా జహ్నుకన్యా యమునా జలజోదరీ .. 54.. జలజాస్యా జాహ్నవీ చ జలజాభా జలోదరీ . యదువంశోద్భవా జీవా యాదవానందకారిణీ .. 55.. యశోదా యశసాం రాశిర్యశోదానందకారిణీ . జ్వలినీ జ్వాలినీ జ్వాలా జ్వలత్పావకసన్నిభా .. 56.. జ్వాలాముఖీ జగన్మాతా యమలార్జునభంజనీ . జన్మదా జన్మహా జన్యా జన్మభూర్జనకాత్మజా .. 57.. జనానందా జాంబవతీ జంబూద్వీపకృతాలయా . జాంబూనదసమానాభా జాంబూనదవిభూషణా .. 58.. జంభహా జాతిదా జాతిర్జ్ఞానదా జ్ఞానగోచరా . జ్ఞానరూపాఽజ్ఞానహా చ జ్ఞానవిజ్ఞానశాలినీ .. 59.. జినజైత్రీ జినాధారా జినమాతా జినేశ్వరీ . జితేంద్రియా జనాధారా అజినాంబరధారిణీ .. 60.. శంభుకోటిదురాధర్షా విష్ణుకోటివిమర్దినీ . సముద్రకోటిగంభీరా వాయుకోటిమహాబలా .. 61.. సూర్యకోటిప్రతీకాశా యమకోటిదురాపహా . కామధుక్కోటిఫలదా శక్రకోటిసురాజ్యదా .. 62.. కందర్పకోటిలావణ్యా పద్మకోటినిభాననా . పృ


థ్వీకోటిజనాధారా అగ్నికోటిభయంకరీ .. 63.. అణిమా మహిమా ప్రాప్తిర్గరిమా లఘిమా తథా . ప్రాకామ్యదా వశకరీ ఈశికా సిద్ధిదా తథా .. 64.. మహిమాదిగుణోపేతా అణిమాద్యష్టసిద్ధిదా . జవనధ్నీ జనాధీనా జామినీ చ జరాపహా .. 65.. తారిణీ తారికా తారా తోతలా తులసీప్రియా . తంత్రిణీ తంత్రరూపా చ తంత్రజ్ఞా తంత్రధారిణీ .. 66.. తారహారా చ తులజా డాకినీతంత్రగోచరా . త్రిపురా త్రిదశా త్రిస్థా త్రిపురాసురఘాతినీ .. 67.. త్రిగుణా చ త్రికోణస్థా త్రిమాత్రా త్రితనుస్థితా . త్రైవిద్యా చ త్రయీ త్రిఘ్నీ తురీయా త్రిపురేశ్వరీ .. 68.. త్రికోదరస్థా త్రివిధా త్రైలోక్యా త్రిపురాత్మికా . త్రిధామ్నీ త్రిదశారాధ్యా త్ర్యక్షా త్రిపురవాసినీ .. 69.. త్రివర్ణీ త్రిపదీ తారా త్రిమూర్తిజననీ త్వరా . త్రిదివా త్రిదివేశాఽఽదిర్దేవీ త్రైలోక్యధారిణీ .. 70.. త్రిమూర్తిశ్చ త్రిజననీ త్రీభూస్త్రీపురసుందరీ . తపస్వినీ తపోనిష్ఠా తరుణీ తారరూపిణీ .. 71.. తామసీ తాపసీ చైవ తాపఘ్నీ చ తమోపహా . తరుణార్కప్రతీకాశా తప్తకాంచనసన్నిభా .. 72.. ఉన్మాదినీ తంతురూపా త్రైలోక్యవ్యాపినీశ్వరీ . తార్కికీ తర్కికీ విద్యా తాపత్రయవినాశినీ .. 73.. త్రిపుష్కరా త్రికాలజ్ఞా త్రిసంధ్యా చ త్రిలోచనా . త్రివర్గా చ త్రివర్గస్థా తపసస్సిద్ధిదాయినీ .. 74.. అధోక్షజా అయోధ్యా చ అపర్ణా చ అవంతికా . కారికా తీర్థరూపా చ తీరా తీర్థకరీ తథా .. 75.. దారిద్ర్యదుఃఖదలినీ అదీనా దీనవత్సలా . దీనానాథప్రియా దీర్ఘా దయాపూర్ణా దయాత్మికా .. 76.. దేవదానవసంపూజ్యా దేవానాం ప్రియకారిణీ . దక్షపుత్రీ దక్షమాతా దక్షయజ్ఞవినాశినీ .. 77.. దేవసూర్దక్షీణా దక్షా దుర్గా దుర్గతినాశినీ . దేవకీగర్భసంభూతా దుర్గదైత్యవినాశినీ .. 78.. అట్టాఽట్టహాసినీ దోలా దోలాకర్మాభినందినీ . దేవకీ దేవికా దేవీ దురితఘ్నీ తటిత్తథా .. 79.. గండకీ గల్లకీ క్షిప్రా ద్వారా ద్వారవతీ తథా . ఆనందోదధిమధ్యస్థా కటిసూత్రైరలంకృతా .. 80.. ఘోరాగ్నిదాహదమనీ దుఃఖదుస్స్వప్ననాశినీ . శ్రీమయీ శ్రీమతీ శ్రేష్ఠా శ్రీకరీ శ్రీవిభావినీ .. 81.. శ్రీదా శ్రీశా శ్రీనివాసా శ్రీమతీ శ్రీర్మతిర్గతిః . ధనదా దామినీ దాంతా ధమదో ధనశాలినీ .. 82.. దాడిమీపుష్పసంకాశా ధనాగారా ధనంజయా . ధూమ్రాభా ధూమ్రదైత్త్రఘ్నీ ధవలా ధవలప్రియా .. 83.. ధూమ్రవక్త్రా ధూమ్రనేత్రా ధూమ్రకేశీ చ ధూసరా . ధరణీ ధరిణీ ధైర్యా ధరా ధాత్రీ చ ధైర్యదా .. 84.. దమినీ ధర్మిణీ ధూశ్చ దయా దోగ్ధ్రీ దురాసదా . నారాయణీ నారసింహీ నృసింహహృదయాలయా .. 85.. నాగినీ నాగకన్యా చ నాగసూర్నాగనాయికా . నానారత్నవిచిత్రాంగీ నానాభరణమండితా .. 86.. దుర్గస్థా దుర్గరూపా చ దుఃఖదుష్కృతనాశినీ . హీంకారీ చైవ శ్రీంకారీ హుంకారీ క్లేశనాశినీ .. 87.. నగాత్మజా నాగరీ చ నవీనా నూతనప్రియా . నీరజాస్యా నీరదాభా నవలావణ్యసుందరీ .. 88.. నీతిజ్ఞా నీతిదా నీతిర్నిమనాభిర్నగేశ్వరీ . నిష్ఠా నిత్యా నిరాతంకా నాగయజ్ఞోపవీతినీ .. 89.. నిధిదా నిధిరూపాచ నిర్గుణా నరవాహినీ . నరమాంసరతా నారీ నరముండవిభూషణా .. 90.. నిరాధారా నిర్వికారా నుతిర్నిర్వాణసుందరీ . నరాసృక్పానమత్తా చ నిర్వైరా నాగగామినీ .. 91.. పరమా ప్రమితా ప్రాజ్ఞా పార్వతీ పర్వతాత్మజా . పర్వప్రియా పర్వరతా పర్వపావనపావనీ .. 92.. పరాత్పరతరా పూర్వా పశ్చిమా పాపనాశినీ . పశూనాం పతిపత్నీ చ పతిభక్తిపరాయణా .. 93.. పరేశీ పారగా పారా పరంజ్యోతిస్వరూపిణీ . నిష్ఠురా క్రూరహృదయా పరాసిద్ధిః పరాగతిః .. 94.. పశుఘ్నీ పశురూపా చ పశుహా పశువాహినీ . పితా మాతా చ యంత్రీ చ పశుపాశవినాశినీ .. 95.. పద్మినీ పద్మహస్తా చ పద్మకింజల్కవాసినీ . పద్మవక్త్రా చ పద్మాక్షీ పద్మస్థా పద్మసంభవా .. 96.. పద్మాస్యా పంచమీ పూర్ణా పూర్ణపీఠనివాసినీ . పద్మరాగప్రతీకాశా పాంచాలీ పంచమప్రియా .. 97.. పరబ్రహ్మస్వరూపా చ పరబ్రహ్మనివాసినీ . పరమానందముదితా పరచక్రనివాసినీ .. 98.. పరేశీ పరమా పృథ్వీ పీనతుంగపయోధరా . పరాపరా పరావిద్యా పరమానందదాయినీ .. 99.. పూజ్యా ప్రజ్ఞావతీ పుష్టిః పినాకిపరికీర్తితా . ప్రాణఘ్నీ ప్రాణరూపా చ ప్రాణదా చ ప్రియంవదా .. 100.. ఫణిభూషా ఫణావేశీ ఫకారకంఠమాలినీ . ఫణిరాడ్వృతసర్వాంగీ ఫలభాగనివాసినీ .. 101.. బలభద్రస్య భగినీ బాలా బాలప్రదాయినీ . ఫల్గురుపా ప్రలంబధ్నీ ఫల్గూత్సవ వినోదినీ .. 102.. భవానీ భవపత్నీ చ భవభీతిహరా భవా . భవేశ్వరీ భవారాధ్యా భవేశీ భవనాయికా .. 103.. భవమాతా భవాగమ్యా భవకంటకనాశినీ . భవప్రియా భవానందా భవ్యా చ భవమోచనీ .. 104.. భావనీయా భగవతీ భవభారవినాశినీ . భూతధాత్రీ చ భూతేశీ భూతస్థా భూతరూపిణీ .. 105.. భూతమాతా చ భూతఘ్నీ భూతపంచకవాసినీ . భోగోపచారకుశలా భిస్సాధాత్రీ చ భూచరీ .. 106.. భీతిఘ్నీ భక్తిగమ్యా చ భక్తానామార్తినాశినీ . భక్తానుకంపినీ భీమా భగినీ భగనాయికా .. 107.. భగవిద్యా భగక్లిన్నా భగయోనిర్భగప్రదా . భగేశీ భగరూపా చ భగగుహ్యా భగాపహా .. 108.. భగోదరీ భగానందా భగాద్యా భగమాలినీ . భోగప్రదా భోగవాసా భోగమూలా చ భోగినీ .. 109.. భేరుండా భేదినీ భీమా భద్రకాలీ భిదోజ్ఝితా . భైరవీ భువనేశానీ భువనా భువనేశ్వరీ .. 110.. భీమాక్షీ భారతీ చైవ భైరవాష్టకసేవితా . భాస్వరా భాస్వతీ


భీతిర్భాస్వదుత్తానశాయినీ .. 111.. భాగీరథీ భోగవతీ భవఘ్నీ భువనాత్మికా . భూతిదా భూతిరూపా చ భూతస్థా భూతవర్ధినీ .. 112.. మాహేశ్వరీ మహామాయా మహాతేజా మహాసురీ . మహాజిహ్వా మహాలోలా మహాదంష్ట్రా మహాభుజా .. 113.. మహామోహాంధకారఘ్నీ మహామోక్షప్రదాయినీ . మహాదారిద్ర్యశమనీ మహాశత్రువిమర్దినీ .. 114.. మహాశక్తిర్మహాజ్యోతిర్మహాసురవిమర్దినీ . మహాకాయా మహావీర్యా మహాపాతకనాశినీ .. 115.. మహారవా మంత్రమయీ మణిపూరనివాసినీ . మానసీ మానదా మాన్యా మనశ్చక్షురగోచరా .. 116.. మాహేంద్రీ మధురా మాయా మహిషాసురమర్దినీ . మహాకుండలినీ శక్తిర్మహావిభవవర్ధినీ .. 117.. మానసీ మాధవీ మేధా మతిదా మతిధారిణీ . మేనకాగర్భసంభూతా మేనకాభగినీ మతిః .. 118.. మహోదరీ ముక్తకేశీ ముక్తికామ్యార్థసిద్ధిదా . మాహేశీ మహిషారూఢా మధుదైత్యవిమర్దినీ .. 119.. మహావ్రతా మహామూర్ధా మహాభయవినాశినీ . మాతంగీ మత్తమాతంగీ మాతంగకులమండితా .. 120.. మహాఘోరా మాననీయా మత్తమాతంగగామినీ . ముక్తాహారలతోపేతా మదధూర్ణితలోచనా .. 121.. మహాపరాధరాశిఘ్రీ మహాచోరభయాపహా . మహాచింత్యస్వరూపా చ మణీమంత్రమహౌషధీ .. 122.. మణిమండపమధ్యస్థా మణిమాలావిరాజితా . మంత్రాత్మికా మంత్రగమ్యా మంత్రమాతా సుమంత్రిణీ .. 123.. మేరుమందిరమధ్యస్థా మకరాకృతికుండలా . మంథరా చ మహాసూక్ష్మా మహాదూతీ మహేశ్వరీ .. 124.. మాలినీ మానవీ మాధ్వీ మదరూపా మదోత్కటా . మదిరా మధురా చైవ మోదినీ చ మహోద్ధతా .. 125.. మంగలాంగీ మధుమయీ మధుపానపరాయణా . మనోరమా రమామాతా రాజరాజేశ్వరీ రమా .. 126.. రాజమాన్యా రాజపూజ్యా రక్తోత్పలవిభూషణా . రాజీవలోచనా రామా రాధికా రామవల్లభా .. 127.. శాకినీ డాకినీ చైవ లావణ్యాంబుధివీచికా . రుద్రాణీ రుద్రరూపా చ రౌద్రా రుద్రార్తినాశినీ .. 128.. రక్తప్రియా రక్తవస్త్రా రక్తాక్షీ రక్తలోచనా . రక్తకేశీ రక్తదంష్ట్రా రక్తచందనచర్చితా .. 129.. రక్తాంగీ రక్తభూషా చ రక్తబీజనిపాతినీ . రాగాదిదోషరహితా రతిజా రతిదాయినీ .. 130.. విశ్వేశ్వరీ విశాలాక్షీ వింధ్యపీఠనివాసినీ . విశ్వభూర్వీరవిద్యా చ వీరసూర్వీరనందినీ .. 131.. వీరేశ్వరీ విశాలాక్షీ విష్ణుమాయా విమోహినీ . విద్యావతీ విష్ణురూపా విశాలనయనోజ్జ్వలా .. 132.. విష్ణుమాతా చ విశ్వాత్మా విష్ణుజాయాస్వరూపిణీ . వారాహీ వరదా వంద్యా విఖ్యాతా విలసల్కచా .. 133.. బ్రహ్మేశీ బ్రహ్మదా బ్రాహ్మీ బ్రహ్మాణీ బ్రహ్మరూపిణీ . ద్వారకా విశ్వవంద్యా చ విశ్వపాశవిమోచనీ . విశ్వాసకారిణీ విశ్వా విశ్వశక్తిర్విచక్షణా .. 134.. బాణచాపధరా వీరా బిందుస్థా బిందుమాలినీ . షట్చక్రభేదినీ షోఢా షోడశారనివాసినీ .. 135.. శితికంఠప్రియా శాంతా శాకినీ వాతరూపిణీ . శాశ్వతీ శంభువనితా శాంభవీ శివరూపిణీ .. 136.. శివమాతా చ శివదా శివా శివహృదాసనా . శుక్లాంబరా శీతలా చ శీలా శీలప్రదాయినీ .. 137.. శిశుప్రియా వైద్యవిద్యా సాలగ్రామశిలా శుచిః . హరిప్రియా హరమూర్తిర్హరినేత్రకృతాలయా .. 138.. హరివక్త్రోద్భవా హాలా హరివక్షఃస్థలస్థితా . క్షేమంకరీ క్షితిః క్షేత్రా క్షుధితస్య ప్రపూరణీ .. 139.. వైశ్యా చ క్షత్రియా శూద్రీ క్షత్రియాణాం కులేశ్వరీ . హరపత్నీ హరారాధ్యా హరసూర్హరరూపిణీ .. 140.. సర్వానందమయీ సిద్ధిస్సర్వరక్షాస్వరూపిణీ . సర్వదుష్టప్రశమనీ సర్వేప్సితఫలప్రదా .. 141.. సర్వసిద్ధేశ్వరారాధ్యా సర్వమంగలమంగలా . ఫలశ్రుతిః . పుణ్యం సహస్రనామేదం తవ ప్రీత్యా ప్రకాశితం .. 142.. గోపనీయం ప్రయత్నేన పఠనీయం ప్రయత్నతః . నాతః పరతరం పుణ్యం నాతః పరతరం తపః .. 143.. నాతః పరతరం స్తోత్రం నాతః పరతరా గతిః . స్తోత్రం నామసహస్రాఖ్యం మమ వక్త్రాద్వినిర్గతం .. 144.. యః పఠేత్పరయా భక్త్యా శృణుయాద్వా సమాహితః . మోక్షార్థీ లభతే మోక్షం స్వర్గార్థీ స్వర్గమాప్నుయాత్ .. 145.. కామార్థీ లభతే కామం ధనార్థీ లభతే ధనం . విద్యార్థీ లభతే విద్యాం యశోఽర్థీ లభతే యశః .. 146.. కన్యార్థీ లభతే కన్యాం సుతార్థీ లభతే సుతాన్ . మూర్ఖోఽపి లభతే శాస్త్రం చోరోఽపి లభతే గతిం .. 147.. గుర్విణీ జనయేత్పుత్రం కన్యాం విందతి సత్పతిం . సంక్రాంత్యాం చ చతుర్దశ్యామష్టమ్యాం చ విశేషతః .. 148.. పౌర్ణమాస్యామమావాస్యాం నవమ్యాం భౌమవాసరే . పఠేద్వా పాఠయేద్వాపి పూజయేద్వాపి పుస్తకం .. 149.. స ముక్తస్సర్వపాపేభ్యః కామేశ్వరసమో భవేత్ . లక్ష్మీవాన్ సుతవాంశ్చైవ వల్లభస్సర్వయోషితాం .. 150.. తస్య వశ్యం భవేదాశు త్రైలోక్యం సచరాచరం . విద్యానాం పారగో విప్రః క్షత్రియో విజయీ రణే .. 151.. వైశ్యో ధనసమృద్ధస్స్యాచ్ఛూద్రస్సుఖమవాప్నుయాత్ . క్షేత్రే చ బహుసస్యం స్యాద్గావశ్చ బహుదుగ్ధదాః .. 152.. నాశుభం నాపదస్తస్య న భయం నృపశత్రుతః . జాయతే నాశుభా బుద్ధిర్లభతే కులపూజ్యతాం .. 153.. న బాధంతే గ్రహాస్తస్య న రక్షాంసి న పన్నగాః . న పిశాచా న డాకిన్యో భూతభేతాలడంభకాః .. 154.. బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం . ద్వంద్వానాం ప్రతిభేదే చ మైత్రీకరణముత్తమం .. 155.. లోహపాశైదృఢైర్బద్ధో బందీ వేశ్మని దుర్గమే . తిష్ఠంఛృణ్వన్పతన్మర్త్యో ముచ్యతే నాత్ర సంశయః .. 156.. పశ్యంతి నహి తే శోకం వియోగం చిరజీవినః . శృణ్వతీ బద్ధగర్భా చ సుఖం చైవ ప్రసూయతే .. 157.. ఏకదా పఠనాదేవ సర్


వపాపక్షయో భవేత్ . నశ్యంతి చ మహారోగా దశధావర్తనేన చ .. 158.. శతధావర్తనే చైవ వాచాం సిద్ధిః ప్రజాయతే . నవరాత్రే జితాహారో దృఢబుద్ధిర్జితేంద్రియః .. 159.. అంబికాయతనే విద్వాన్ శుచిష్మాన్ మూర్తిసన్నిధౌ . ఏకాకీ చ దశావర్తం పఠంధీరశ్చ నిర్భయః .. 160.. సాక్షాత్త్వగవతీ తస్మై ప్రయచ్ఛేదీప్సితం ఫలం . సిద్ధపీఠే గిరౌ రమ్యే సిద్ధక్షేత్రే సురాలయే .. 161.. పఠనాత్సాధకస్యాశు సిద్ధిర్భవతి వాంఛితా . దశావర్తం పఠేన్నిత్యం భూమీశాయీ నరశ్శుచిః .. 162.. స్వప్నే మూర్తిమయాం దేవీం వరదాం సోఽపి పశ్యతి . ఆవర్తనసహస్రైర్యే జపంతి పురుషోత్తమాః .. 163.. తే సిద్ధా సిద్ధిదా లోకే శాపానుగ్రహణక్షమాః . ప్రయచ్ఛంతశ్చ సర్వస్వం సేవంతే తాన్మహీశ్వరాః .. 164.. భూర్జపత్రేఽష్టగంధేన లిఖిత్వా తు శుభే దినే . ధారయేద్యంత్రితం శీర్షే పూజయిత్వా కుమారికాం .. 165.. బ్రాహ్మణాన్ వరనారీశ్చ ధూపైః కుసుమచందనైః . క్షీరఖండాదిభోజ్యాంశ్చ భోజయిత్వా సుభక్తితః .. 166.. బధ్నంతి యే మహారక్షాం బాలానాం చ విశేషతః . రుద్రం దృష్ట్వా యథా దేవం విష్ణుం దృష్ట్వా చ దానవాః .. 167.. పన్నగా గరుడం దృష్ట్వా సింహం దృష్ట్వా యథా గజాః . మండూకా భోగినం దృష్ట్వా మార్జారం మూషికాస్తథా .. 168.. విఘ్నభూతాః పలాయంతే తస్య వక్త్రవిలోకనాత్ . అగ్నిచోరభయం తస్య కదాచిన్నైవ సంభవేత్ .. 169.. పాతకాన్వివిధాన్సోఽపి మేరుమందరసన్నిభాన్ . భస్మితాన్కురుతే క్షిప్రం తృణం వహ్నిహుతం యథా .. 170.. నృపాశ్చ వశ్యతాం యాంతి నృపపూజ్యాశ్చ తే నరాః . మహార్ణవే మహానద్యాం పోతస్థే చ న భీః కచిత్ .. 171.. రణే ద్యూతే వివాదే చ విజయం ప్రాప్నువంతి తే . సర్వత్ర పూజితో లోకైర్బహుమానపురస్సరైః .. 172.. రతిరాగవివృద్ధాశ్చ విహ్వలాః కామపీడితాః . యౌవనాక్రాంతదేహాస్తాన్ శ్రయంతే వామలోచనాః .. 173.. సహస్రం జపతే యస్తు ఖేచరీ జాయతే నరః . సహస్రదశకం దేవి యః పఠేద్భక్తిమాన్నరః .. 174.. సా తస్య జగతాం ధాత్రీ ప్రత్యక్షా భవతి ధ్రువం . లక్షం పూర్ణం యదా దేవి స్తోత్రరాజం జపేత్సుధీః .. 175.. భవపాశవినిర్ముక్తో మమ తుల్యో న సంశయః . సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం .. 176.. సర్వధర్మేషు యజ్ఞేషు సర్వదానేషు యత్ఫలం . సర్వవేదేషు ప్రోక్తేషు యత్ఫలం పరికీర్తితం .. 177.. తత్పుణ్యం కోటిగుణితం సకృజ్జప్త్వా లభేన్నరః . దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభం . స యాస్యతి న సందేహస్స్తవరాజస్య కీర్తనాత్ .. 178.. ..


 ఇతి రుద్రయామలే శ్రీఅన్నపూర్ణాసహస్రనామస్తోత్రం సంపూర్ణం.


🕉🌞🌏🌙🌟🚩

[06/10, 18:03] Mallapragada Ramakrishna: సార్ద: ప్రవసతో మిత్రం 

భార్యా మిత్రం గృహే సత:

ఆతరస్య భిషక్ మిత్రం 

దానం మిత్రంమరిష్యత:   

శివమేవ గతిర్ మమ

[06/10, 18:40] Mallapragada Ramakrishna: (2)నవ్వులే నవ్వులుగా సిరిమువ్వలు 

రక రకాల పువ్వుల వెలుగులు 

తారాజువ్వలు తళుకు బెళుకులు 

ఆత్మ విశ్వాసం తో జరిపే నవ్వులు 

ఆత్మస్థైర్యం తోను నవ్వులే ఈశ్వరా

[06/10, 18:51] Mallapragada Ramakrishna: ప్రయాణాల్లో ప్రయాణికులు మిత్రులు

ఇంటిలోనున్న వారికి భార్య మిత్రురాలు 

రోగి రక్షగా వైద్యుడే మిత్రురాలు 

చచ్చేవానికి దానమే మిత్రురాలు 

ఉషోదయంకు మిత్రుడుగాఈశ్వరా

[06/10, 18:54] Mallapragada Ramakrishna: 1) పూలలో వాసన వలే, 

నువ్వులలో నూనె వలే,

 పండ్లలో రసము వలే, 

పాలలో నెయ్యి వలే,

మా మనసులో నీవే ఈశ్వరా .


రంగు రంగులు గల ఆశ పూలు 

సప్త వర్ణ ముగల శోభ లేలు

ఆడ బిడ్డ  ఆట పాట లేలు

భక్తి పూర్వక మగు పూజలేలు

అన్ని తెల్పు ఈశ్వరునిలొ లీల



 ఊరువాడలన్ని ఒక్కటయ్యె

ఆడ మోగ కలిసి చేరువయ్యె

పువ్వు లాగ  కలిసి ఏకమయ్యె

గొంతులన్ని ఒకటి మాది రయ్యె

సర్వ ముగను తెలుపు ఈశ్వరయ్యె

Tuesday 5 October 2021

చిత్రం: శ్రీ పాండురంగ మహత్యం (1957)


ప్రాంజలి ప్రభ (1) నాకు నచ్చిన అలనాటి ఆణిముత్యాలు, సేకరణ 2013

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు...


చిత్రం : రాజ్ కుమార్ (1983)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం... మన జీవన పారాయణం

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు


చరణం 1:


చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది

వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది

ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది

శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి

తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే

తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

చరణం 2 :


సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం

ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం

సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం

ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం

గతమంటే నీవే కథకానిది నీవే

కలలన్ని నావే కలకాలం నీవే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం... మన జీవన పారాయణం...

లలలలల లలల... లలలలల లలల... లలలలల లలల


--((()))--


ప్రాంజలి ప్రభ (2) నాకు నచ్చిన అలనాటి ఆణిముత్యాలు, సేకరణ 2014

చక్రవర్తి గారి సంగీతం సింపుల్ గా ఒక చక్కని రిథమ్ తో సాగిపోతుంది, అలాగే వాణీజయరాం గారి స్వరం ఒక వింత అందాన్నిచ్చింది. నాకు ఇష్టమైన ఈ పాటను మీరూ వినండి.

చిత్రం : జీవితంలో వసంతం (1977)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, వాణీ జయరాం


నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన


నీ మది కోవెల అన్నది కోయిల

నీ జత నేనుంటే బ్రతుకే ఊయల


నీలాల మబ్బులలో...

తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా

ప్రియతమా... ప్రియతమా ఓ ఓ ఓ


నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నీ మది కోవెల అన్నది కోయిల


నీ లేడి కన్నులలో మెరిసే తారకలు

నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు

నీ మాట వరసలలో వలపే వెల్లువగా

నీ పాట తోటలలో పిలుపే వేణువుగా

పులకించిన నా మదిలో పలికించిన రాగాలు

చెలరేగిన వయసులో తీయని అనురాగాలు

ఇదే ఇదేలే జీవితం లలాలలా

జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ

ఇదే ఇదేలే జీవితం అహహహహ


జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...

తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా

ప్రియతమా... ప్రియతమా


నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నీ మది కోవెల అన్నది కోయిల

ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా

ఈ కొండగాలులలో హా గుసగుసలే నీ ఊసులుగా

ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా

ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా

తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో

మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో

ఇదే ఇదేలే జీవితం లలాలలా

జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ

ఇదే ఇదేలే జీవితం ఓహోఓహో


జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...

నీలాల మబ్బులలో

తేలి తేలి పోదామా... తేలి తేలి పోదామా

సోలి సోలిపోదామా... సోలి సోలిపోదామా

ప్రియతమా... ప్రియతమా


((()))

  ప్రాంజలి ప్రభ (3) నాకు నచ్చిన అలనాటి ఆణిముత్యాలు, సేకరణ 2014

చిత్రం : రంగులరాట్నం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కనరాని దేవుడే కనిపించినాడే...కనిపించి అంతలో...
కన్ను మరుగాయే...కన్ను మరుగాయే..
కనరాని దేవుడే కనిపించినాడే...ఆ..ఆ..ఆ..ఆ

చరణం 1:

అల నీలీగగనాన వెలిగే నీ రూపూ..
అల నీలీగగనాన వెలిగే నీ రూపూ
ఆనంద బాష్పాల మునిగే నా చూపూ...
మనసారా నిను చూడలేనైతి స్వామీ...
కరుణించి ఒకసారి కనిపించవేమీ...

చరణం 2:

అందాల కన్నయ్య కనిపించగానే...
బృందావనమెల్ల పులకించిపొయే...
యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే...
నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే...ఆ..ఆ..ఆ..ఆ

చరణం 3:

వలపుతో పెనవేయు పారిజాతమునై... ఎదమీద నిదురించు అడియాశ లేదూ
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై... నీ చరణకమలాల నలిగి పోనీయవా...
ఆ..ఆ..ఆ..ఆ..

కనరాని దేవుడే కనిపించినాడే...
కనిపించి అంతలో కన్ను మరుగాయే ... కన్ను మరుగాయే..

((()))

  ప్రాంజలి ప్రభ (4) నాకు నచ్చిన అలనాటి ఆణిముత్యాలు, సేకరణ 2014

కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయే...కోరినది దరిచేరినది ఆహా ఎదలు ఒకటాయే

చిత్రం : మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల, బాలు

పల్లవి :

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే
కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

తొలివలపే మధురసము.. మన బతుకే పరవశము
కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

చరణం 1 :

పూలతోటలై నా అందాలు పూచేనులే
తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే
పూలతోటలై నా అందాలు పూచేనులే
తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే
దోచుకున్న వలపు దాచుకున్ననాడే.. సుఖం.. సుఖం.. సుఖం
తోడుగా.. నీడగా.. సాగిపో

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

చరణం 2 :

రాగబంధమై పెనవేసుకున్నానులే
మూగకోరిక నే తెలుసుకున్నానులే
రాగబంధమై పెనవేసుకున్నానులే
మూగకోరిక నే తెలుసుకున్నానులే

ఊసులాడు వేళ బాస చేయు వేళ.. ఇదే.. ఇదే.. ఇదే
ఆడుకో... ఆశలే... తీర్చుకో

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే
ఆహా...ఆహా.. హా... ఓహో... ఓహో...
తొలివలపే మధురసము.. మన బతుకే పరవశము

https://www.youtube.com/watch?v=vVTUrqQXV00
Mosagallaku Mosagadu || Korinadi Neraverinadi Video Song || Krishna ,Vijaya || Shalimarcinema
Mosagallaku Mosagadu was a 1971 first Indian, Telugu Cowboy film. Telugu Full MovieVideo Songs Stari...
)))(((

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా...నవ్వింది నా తోడుగా...
చిత్రం : ప్రేమ విజేత (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :
గానం : బాలు, జానకి

నిస రిమ పద నిద సా నిసని...నిస రిమ పద నిద సా నిసని....శభాష్.....
సరి నిస దని పదమా......సరి నిస దని పదమా...మపసా నిసనిద మపసా

నీలో అల గోదారి ఎన్నెల
నండూరి ఎంకిలానవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే
ఆత్రేయ పాటలాఉన్నాయి నా నీడగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా

నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ
నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ

నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన
నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..

నీలో తొలి అందాల తోటలే
ఆత్రేయ పాటలా...ఉన్నాయి నా నీడగా
నీలో అల గోదారి ఎన్నెల
నండూరి ఎంకిలా...నవ్వింది నా తోడుగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా...నవ్వింది నా తోడుగాకృష్ణా ముకుందా మురారీ

((()))

 వచ్చెనంటా... తనువచ్చెనంటా...

చిత్రం : ఐ (మనోహరుడు) (2015)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : అనంత శ్రీరామ్
గానం : హరిచరణ్, శ్రేయాఘోషల్

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

అసలిపుడు నీకన్న ఘనుడు లోకాన కనబడునా మనిషై
అదిజరగదని ఇలా అడుగువేసినా నిను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము నీ అణువుఅణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని గీత నువ్వై నా గొంతుని వీడని పేరువి నువ్వై
తడిపెదవుల తళుకవనా నవ్వు నవ్వనా ఎంత మధురం

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యడా
నీడంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యడా
నాలోన వుండే వేరొక నన్నే నాకే చూపించిందా
నారాతి గుండెని తాకుతు శిల్పంగా మార్చేసిందా
యుగములకైనా మగనిగ వీణ్ణే పొగడాలి
అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయానా తన వదనాన్నే
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా 

(((())))






చిత్రం:  శ్రీ పాండురంగ మహత్యం (1957)

దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు

సంగీతం:  టి.వి. రాజు

గీతరచయిత:  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం:  ఘంటసాల


పల్లవి:

    హే... కృష్ణా.... ముకుందా.... మురారీ....

    జయ కృష్ణా... ముకుందా... మురారి

    జయ కృష్ణా... ముకుందా... మురారి


    జయ గోవింద బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి


    దేవకి పంట... వసుదేవువెంట....

    దేవకి పంట... వసుదేవువెంటా...

    యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ

    వెలసితివంటా... నందుని ఇంటా

    వెలసితివంటా... నందుని ఇంటా


    వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..

    కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ... ఈ..

    కృష్ణా... ముకుందా... మురారి


చరణం 1: 


    నీ పలుగాకి పనులకు గోపెమ్మ...

    నీ పలుగాకి పనులకు గోపెమ్మ... కోపించి నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..

    ఊపునబోయీ మాకులకూలిచి....

    ఊపునబోయీ మాకులకూలిచి... శాపాలు బాపితివంటా....ఆ...


    కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి


    అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ... చూడమ్మా అని రామన్న తెలుపగా

    అన్నా.. అని చెవి నులిమి యశోద.. ఏదన్నా నీ నోరు చూపుమనగా...ఆ...

    చూపితివట నీ నోటను... బాపురే పదునాల్గు భువనభాండమ్ముల

    ఆ రూపము గనిన యశోదకు... తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..


    జయ కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ... ఈ...

    కృష్ణా... ముకుందా... మురారి


చరణం 2:


    కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...

    కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ... కేళీ ఘటించిన గోపకిశోరా..ఆ..ఆ

    కంసాదిదానవ గర్వాపహారా...

    కంసాదిదానవ గర్వాపహారా... హింసా విదూరా.. పాపవిదారా...


    కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ... ఈ..

    కృష్ణా... ముకుందా... మురారి


    కస్తూరి తిలకం... లలాట ఫలకే

    వక్షస్థలే కౌస్తుభం... నాసాగ్రే నవమౌక్తికమ్

    కరతలే వేణుమ్... కరే కంకణమ్

    సర్వాంగే హరిచందనంచ కలయమ్

    కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో...


    విజయతే... గోపాల చూడామణీ...

    విజయతే... గోపాల చూడామణీ...


చరణం 3:


    లలిత లలిత మురళీ స్వరాళీ...

    లలిత లలిత మురళీ స్వరాళీ... పులకిత వనపాళి... గోపాళీ..

    పులకిత వనపాళి...ఈ...

    విరళీకృత నవ రాసకేళి...

    విరళీకృత నవ రాసకేళి... వనమాలీ శిఖిపింఛమౌళీ

    వనమాలీ శిఖిపింఛమౌళీ....


    కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి..

    జయ కృష్ణా... ముకుందా... మురారి..

    హే... కృష్ణా.... ముకుందా.... మురారీ.... ఈ.. ఈ..



గో దావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా...

నిండారి తెలుగింటి అందాలే వెలిగించే.....నండూరి వారెంకిలా ఓ...


చిత్రం : సరిగమలు (1994)

సంగీతం : బాంబే రవి

రచన : వేటూరి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర


ఆఆఆఅ..ఆఆఆ....ఆఆఅ..

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

ఓ..ఓ..ఓఓఓఓఓ....

చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..

చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..


గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

నిండారి తెలుగింటి అందాలే వెలిగించే

నండూరి వారెంకిలా ఓ...


గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల

కిన్నెరసాని పాటలా ఓ...


గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా


ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ

ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ


సిగ్గల్లే పండెనులే సాయంత్రము

బుగ్గల్లో పండాలి తాంబూలము...ఓఓ..

సిగ్గల్లే పండెనులే సాయంత్రము

బుగ్గల్లో పండాలి తాంబూలము

ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము

నన్నల్లుకోమంది వయ్యారము

కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో

నా స్వప్న లోకాలలో..ఓయ్.ఒయ్.ఒయ్..


గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా


గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం

మువ్వమ్మ మురిసేటి మురళీపురం

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం

మువ్వమ్మ మురిసేటి మురళీపురం

కవ్వాలే కడవల్లో కదిలే క్షణం

కడలల్లే పొంగింది నా మానసం

పొన్నలలో పొగడలలో తుంటరి ఓతుమ్మెదవో

నా బాహు బంధాలలో..ఓయ్.ఓయ్..


గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల

కిన్నెరసాని పాటలా ఓ...

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా


కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

ఓ..ఓ..ఓఓఓఓఓ....

చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..

చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో.. 


(((())))


Tuesday 17 August 2021

kavitalu




నేటి నా పాట పాట సంఖ్య:-566.

********

పాట సందర్భంపై నా విశ్లేషణ.

**********

నేటి యువతుల తీరు వేష భాషలు నచ్చక  పాత భావజాలం  అణుకువ మెలుకువల ఆచారాల కల

అమ్మాయి కోసం వేచిచూస్తు వెదుకుతున్న విలువలు సంప్రదాయం  కలగలసిన   ఓ యువకుడు కట్టుబొట్టు భారతీయ వస్త్రధారణ వైవాహికత వైపు ఆశక్తి కలిగిన వాడికి   కనిపించింది   తన మనసు కోరుకున్న అన్ని అర్హతల సహజ సిద్ద ముగ్ధ  మనోహరి కనిపించగానే అతనిలోని ఆనందం ఇలా పాటగా పాడుతోంది..!

*************

పల్లవి:-

****

సహజ సౌందర్యం ఇన్నాళ్లకి  నా   కళ్ళ పడగా


వయసులో పుష్పం ప్రేమగా పిలిచెగా 

మనసులో ఇష్టం  ప్రేమగా  కురిసెగా..

తనువులో కష్టం ప్రేమగా మెరిసెగా ...

 

నిజం మాధుర్యమై నవ్వుతూ నడిచిరాగా

వయసు మురిసెనే ఒళ్లు పులకింతగా!!


ఏం చెప్పను  ఎన్నాళ్ళుగానో ఎదురు చూసానో

కుదురులేని మనసుతో...

నీవు కానరాక ఎంతగా వెతికానో  

నిదురలేని  ఈ కళ్ళతో !!


ఇన్నాళ్లకు కరుణించి కనిపించినావే 

అనురాగ దేవతవై..

సహజ సౌందర్యం నా కళ్ళ పడగా

మనసులో ఇష్టం ప్రేమగా కురిసెగా !!

చరణం:-

*****

ఆ కురులు  నీలి మేఘాల సిరులు

ఆ ముఖారవిందం  మందార పువ్వుల లాలిత్యం

ఆ హృదయాలయం తూరుపు ఉషోదయ సమయం

ఆ  నడక వయ్యారం జలజల పారే కృష్ణా ప్రవాహం!!


ఎందెందు చూసినా

నీలో అందచందాల  పూలవనాలే 

ఆకాశ తీరానా  ఎగెరెగిరిపోతున్నా

గువ్వల గుంపుల చూపులన్ని నీపైనే!!

పల్లవి:-

****

సహజ సౌందర్యం నా కళ్ళ పడగా

మనసులో ఇష్టం ప్రేమగా కురిసెనే!!

చరణం:-

****

మది దోచినా హంసద్వని రాగమాలికవే

సిగ్గు వదిలి  ఒకసారి నావైపు చూడవే

మొగ్గ తొడిగిన పువ్వా  మొగ్గు నా వైపు దూకవే   

సిరిమల్లే నవ్వా!!


చుక్కలన్ని చూస్తున్నాయని  పక్క ఏమో ఒప్పుకోకుంది

కోరికేమో  కోనసీమలా పచ్చగా  చిగురు వేసింది

కోక  ఏమో కేక వేసే   కాక నంతా  కైపుగా మార్చేసింది

చీకటి దుప్పటై మీదికొచ్చింది చిన్నది మత్తు గా హత్తుకుందీ...

 పల్లవి:-

****

 సహజ సౌందర్యం ఇన్నాళ్లకు  నా కళ్ళ పడగా

 మనసులో ఇష్టం ప్రేమగా మారెనే ..!!

************

నేటి నా పాట పాట సంఖ్య:-561.

**********

పాట సందర్భంపై నా విశ్లేషణ.

*********

సర్వేశ్వరుడైన ఈశ్వరుడి  సన్నిదానమే తన నివాసం కాగా  బసవేశ్వరుడు ఈశ్వరుని స్తుతిస్తు పాడుతున్న పాట. మనిషిగా పుట్టి ఋషిలా తపస్సు చేసి అల్పాయుష్కుడైన  వాడు చిరంజీవి గా ఈశ్వరుని చేత వరంపొంది కైలాసం లో పరమేశ్వరుని పాదాల చెంత ఉండు భాగ్యం పొంది ప్రధమ గణాలలో ముఖ్యుడిగా

 భాసిల్లుతోన్న నందీశ్వరుడి భక్తి పరవశం ఈ పాట.

***************

పల్లవి:-

***

భక్తి దారి చూపినా నా దేవరా  పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి  చేర్చుకున్నా విశ్వేశ్వరా!!


భక్తి దారి చూపినా నా దేవరా పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి నన్ను  చేర్చుకున్నా విశ్వేశ్వరా!!


భౌతిక బాధల వలయం ఛేదించగా 

నైతిక విలువల మార్గం పయనించగా

ఆత్మస్వరూపుడిగా  దేహభావం దహించగా

పంచాక్షరీ మంత్రం ఓంనమశ్శివాయ

ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ


స్మరించిగా సమసిన అంతర్యుద్ధం

స్థితప్రజ్ఞతకు నీ ఆజ్ఞ దారిచూపెను  దయామయా

అజ్ఞానానంధకారం దహనమై

సుజ్ఞానం ఉదయించి నీ సన్నిదానం వరమాయే ఓంకారా..!!


పంచాక్షరీ మంత్రం అమితానందం

పరవశమైన ఈ తనువణువు పొందిన  ఆత్మనందం 

కర్మ నాశనం జన్మరాహిత్యం 

 నీ నామ స్మరణం ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ!!


ఇది చాలులే ఇక ఏది వద్దులే

పంచక్షరి మంత్రం మించిని పంచభక్ష్యాలు

వుంటాయా ఈ సృష్టిలో సర్వేశ్వరాయ

సదాశివాయ ఓం నమశ్శివాయ!!


 భక్తి దారి చూపినా నా దేవరా పరమేశ్వరా!

చరణం:-

***

నీ ద్యాసలో  నీ నామ ద్యానం స్మరించగా

అణువణువునా విభూది గా సంతరించుకొని

నిశ్చలమే మనస్సున చేరి ఉషస్సు గా తాకింది

అచంచలమైన భక్తి ఊటా 

ఉప్పొంగెనులే గంగా ప్రవాహమై నా మది అణువణువునా ఆది శంకరా అనాధ రక్షకా

పరమేశ్వరా పాహిమాం పాహిమాం పరమాత్మా!!


అంతరంగాన భక్తి జ్యోతిని  వెలిగించినా

అంతులేని ఆనందం వైపు  అడుగులే వేయించినా

ముక్తి త్రోవ చూపినా

రక్తిపై మోహమే తుడిపేసినా

ముత్యమల్లే మెరిసేలా 

నా మనసును  మల్లెపూవులా మార్చేసినా

మల్లికార్జునా !!


నిను సేవించే భాగ్యం  ప్రసాదించినా నా తండ్రి

ఈశ్వరా మల్లేశ్వరా!!ఈశ్వరా పరమేశ్వరా !!


భక్తి దారి చూపినా దేవా పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి చేర్చుకున్నావయ్యా  దయాస్వరూపా!!

చరణం:-

***

నీ లీలామృతం త్రాగినానయా

కన్నీళ్ల కడలిని దాటినానయా 

లోకానికంతా ఆకలి  తొలగించే

వరమునే నొసగి నందిశ్వరుడిగా

బసవేశ్వరుడిగా నామకరణమే చేసి

భువిన నన్ను భూమాతకు తోడుగా

పంపి చరితార్దుడను చేసినావు చెన్న మల్లేశ్వరా!!


వందనమయ్యా విశ్వ విభుడా 

పార్వతీ వల్లభా పరమేశ్వరా!!


నీ సన్నిదిలో  నీ బంటుగా ఉంటు

నిను నిత్యం కొలిచే నన్ను  నీ నోట  మనసారా మహానందని పిలిపించుకొనుట   

మహాదానందం  మహితాత్మా

మహదానందం మహితాత్మా!!

పల్లవి:-

***

భక్తి దారిచూపినా దేవరా  పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరిన ఉండే వరమునే ప్రసాదించిన విశ్వేశ్వరా!!


అల్పాయుష్కుడను చిరంజీవి గా దీవించావు

అనంతమైన ఆనందుడిగా చరిత్రలోనే నిలిపావు

ప్రధమగణాలలోముఖ్యుడిగా చేసావు

నిత్యం నీ యందుండే లా   నిను స్పర్శించేలా   

నీ వాహనమై నా జన్మతరించే లా 

ఆదిదంపతులకు సేవలు చేయు భాగ్యమును నొసంగి  ఎవరికి దక్కని భాగ్యం నాకిచ్చినావు నంది వాహన నాగభూషణ 

వందనం వందనం వందనం ఓంనమశ్శివాయ!!


పరవశం నా అణువణువు పావనం నా తనువు  కైలాసం నా నివాసం

పార్వతీ పరమేశ్వరులు కొలుచు ఈ జన్మం పంచాక్షరీ మంత్రం  నా స్వర వీణా తంతువై

నిరంతరం  స్మరిస్తు చిరంజీవి గా నిలిచాను తండ్రి నీ సన్నిదిలో ఈ నంది..

ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ!!

పల్లవి:-

****

భక్తి దారి చూపినా దేవరా పరమేశ్వరా

ముక్తి  ప్రసాదించిన నీ దరికి నన్ను చేర్చుకున్నా విశ్వేశ్వరా!!

*************

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ , 

6281190539



సైన్సు దినోత్సవం

పాట

సాకీ:

సైన్సు దినోత్సవమా!

ప్రజాసైన్సు దినోత్సవమా!

పల్లవి: సైన్సు దినోత్సవం

సైన్సు దినోత్సవం

సైన్సును ముందుకు నడిపించే విజ్ఞాన ఉత్సవం

విజ్ఞానం ఉనికి తెలిపి నిలుపు దినోత్సవం

సైన్సును ముందుకు నడిపే జ్ఞాన ఉత్సవం

విజ్ఞానం ఉనికి తెలిపినిలుపు 

దినోత్సవం

బుద్ధి చూపు నేర్పించే దినోత్సవం

                             ...సైన్సు

చరణం1:

నిజము తెలివి వెలుగులనూచూపించు దినోత్సవం

బుద్ధిలోని చీకట్లను తొలగించుట నేర్పించును

చదువుకు పునాది వేసి మెదడుకు .మెరుగులు దిద్దును

సైన్సు లేని చదువంటే గుండేలేని దేహమే... సైన్సు

చరణం2:

ఏడాదిలోన నేర్చుకున్న సైన్సు లోని ముచ్చట్లను

పంచనామ చేసుకొనీ దిద్దుకొనే సందర్భము

నిజము తెలివి వెలుగుతోటి దిద్దుకొనే సందర్భము

సైన్సుపాఠములలోనీ సారాంశము  నే ర్చెదమూ.. సైన్సు

చరణం 3:

మనసులోని మర్మాలకు ఉన్నపాట్లు

చూపించును

సైన్సంటే జీవితమని చాటి చెప్పి నేర్పించును

సైన్సంటే ప్రగతియనే లెక్కలనూ నేర్పించును

సై న్సే జీవిత కళలకుఅద్దమనీ చాటించును... సైన్సు

వల్లభాపురంజనార్దన

944016

3687

చుక్కలు

సైన్సుపాట


పల్లవి:

ఆరుతు వెలుగుతు మినుకు మిణుకుమని తారలు వెలిగేదెందుకో?

సూర్యునిలాగా వెలుగునిచ్చుటకు

చుక్కలకెందుకు వీలవదో!?

                                 ...ఆరుతు

చరణం1:

సూర్యునికన్నా చుక్కలు పెద్దవి

ఎన్నో రెట్ల కాంతి ఉన్నవీ

దివిటీముందు  దీపంలాగా

అవి వెలవెల పోవును ఎందుకనీ?...ఆరుతు

చరణం2:

వాతావరణములోపలఉన్నా

గాలి స్థిరముగా ఉండదురన్నా

అటుయిటు కదులుతు ఉంటుందన్నా

ఆ గాలే దీనికి కారణమన్నా...ఆరు

చరణం3:

గాలిపొరల సాంద్రతలో తేడా

ఉష్ణోగ్రతలో వచ్చేతేడా

వాయు వీచికల నడకల తేడా

కాంతి పయనమును నికువరిస్తవీ

                                  ...ఆరుతు

చరణం4:

తక్కువ ఎక్కువ సాంద్రతలుండే

దారులకాంతీ పయనిస్తుంటే

వక్రీభవనము చెందుటవలనా

చుక్కల వెలుగులు నిలకడగుండవు

                              ....ఆరుతూ

చరణం5:

గాలి అలల దిశ మారుటవలనా

పొరల సాంద్రతలు ఆపుటవలనా

కాంతి నిలకడగ కంటిని చేరదు

చుక్కలందుకే మినుకుమినుకు మని వెలుగు తుంటవీ...ఆరుతు

వల్లభాపురంజనార్దన

9440163687

నేటి నాపాట పాట సంఖ్య:-555.

******************************

రచన;- మహేష్ వూటుకూరి  ✍️

9640713717.

దోర్నాల.

 ప్రకాశం జిల్లా.

22/02/2023.

****************

పాట సందర్భంపై నా విశ్లేషణ.:-

***************************

తెలియని తనం చేసిన తప్పలను  తెలిసి తనం   ఇది తప్పు అని చెప్పినప్పుడు సరిదిద్దుకొంటే అది తెలివైన తనం అవుతుంది . 

బోయవాడు వాల్మీకి అయి నట్లుగా ఒక మనిషిని ఒక అమ్మాయి తనలోని లోపాలను ఎత్తి చూపుతుంది తన పాపాల చిట్టా విప్పి చెబుతుంది దాని వలన  ఎంత మందికి ఎంత నష్టం జరిగిందో వివరిస్తుందీ.


పొగరులోనో తెలియక నో చేసావు నీ తప్పులకు వాళ్ళ కష్టాలు చూడంటు చూయిస్తుంది. కళ్ళారచూసిన  ఆ వ్యక్తి తన తప్పును సరిచేసుకుంటాడు  

అందరి బాధ్యత లు తీసుకుంటాడు తనలా తప్పులు చేసే వారిని తప్పులు చేయకుండా మార్గదర్శిగా మారి దారి చూపుతాడు

అతనిలో మార్పుకు కారణమైన ఆమె ను కృతజ్ఞతా భావంతో 

ఇలా పాట రూపంలో కీర్తిస్తు  ఇలా పాడుతు

మనసులో దేవతలా కొలుస్తు ప్రేమిస్తుంటాడు అతని మానవత్వానికి  ప్రేమతత్వానికి ఫిదా అయిన ఆమెలో కూడ అతనిపై ప్రేమ పుడుతుంది అలా మంచి ఆలోచనలెపుడు మంచికి ప్రాణం పోసి పదిమందికి మేలుచేస్తాయనే సారాంశమే ఈ పాట.

*************************************************పల్లవి:-

*******

అహాహా అహాహాహా

ఆహాహా హా

పల్లవి:-

******

ప్రకృతి కి ప్రాణం పోసిన తొలికిరణం లా

నాలో  తెగువకు జీవం  పోసావు(లే)

ఆకృతే లేని  ఈ ప్రాణికి చిరునవ్వులు అద్దావు(లే)

నేనేంటో తెలిపి నా గమ్యానికి తెరచాపవై నిలిచావు(లే)!!


మరిచిపోయిన పాఠం గురుతు చేసావులే

పరీక్షలో నెగ్గేలా  నాకో రూపం ఇచ్చావులే

మరిచి పోను నేస్తమా నీ సాయం

నా చివరి శ్వాస వరకుఇక  నీవే నా ప్రాణం.!!


ప్రకృతి కీ  ప్రాణం పోసిన తొలికిరణం లా

నాలో తెగువకు ప్రాణం పోసావులే..!!

చరణం:-

*********

మనిషి ధర్మం మరచి

ధనమే సర్వస్వం అనుచు

స్నేహానికి సాయం  విడిచి

ద్రోహం చేస్తుంటే


కళ్ళుమూసుకున్నా  పెద్దరికం అవుతుందా

తప్పించుకునే దారులు వెతుకుట తప్పు కదా

తప్పు ఒప్పుల నిశిత పరిశీలన తెలిసిన అనుభవమా

నిజము వైపు నిలిచి సత్యం బతికించుమా !!


నిజానిజాల జీవన సారమే జీవిత సౌభాగ్యం

ప్రజా జీవన  సహకారమే సంతోషాలకు మూలం

మన గమనం మన గమ్యం సమతుల్యం

రేపటి భవితకు మన మిచ్చు ఐశ్వర్యం.!!


ప్రకృతి కి ప్రాణం పోసిన వేకువలా

నాలో తెగువకు జీవం పోసావులే.!!

చరణం:-

********

నీవు నేను  వేరను భావం ప్రగతికి అవరోదం

దారులు వేరైనా గమ్యం అగమ్యగోచరం

అంతా మనమనుకొని పదం కలిపి అడుగేసి చూడు

ఆనందం అంతా మన ఇంట  పూల వనమల్లే వికశించునులే !!


కల కాలం సాగేలా కలుపు చేయీ చేయి

కలుపు మొక్కలను  పీకివేయి

వటవృక్షమల్లే మీ వంశం నిలబడగలదు 

ఎందరికో నీడనే ఇవ్వగలదు

లోకమే వసుదైక కుటుంబమనీ చాటేది ఉమ్మడి కుటుంబాల వేదికలేను

సాదించిన  ఐక్యతా సాధికరత  సాగాలి ఏరువాకలా!!


ఈ సత్యం గ్రహించిన నిత్యం 

ఆనందం మన హృదయం.

అపుడే ఆరోగ్యం  మన  మా  నవజాతికి

ఆయుష్మాన్ భవ దీవెనలు!!


నీ దారిలో నడిచి ముళ్ళదారులన్ని

మల్లెల రహదారులుగా మార్చాను

ఎల్లలు లేని ఆనందానికి మార్గం చూపావు

కలలేని  తలపులకు హృదయం తలుపులు తెరిచావు

ఉషోదయం గా మార్చావు.!!


 ప్రకృతి కి ప్రాణం పోసిన తొలికిరణం లా

 నాలో వెలుగుల జ్ఞానం మేల్కొలిపావులే!!

************************************

ఆహాహా  ఆహా హాహా ఆహాహా..


**********

నేటి నా పాట పాట సంఖ్య:-561.

**********

రచన :- మహేష్ వూటుకూరి  ✍️

9640713717.

దోర్నాల.

28/02/2023.

*******

పాట సందర్భంపై నా విశ్లేషణ.

*********

సర్వేశ్వరుడైన ఈశ్వరుడి  సన్నిదానమే తన నివాసం కాగా  బసవేశ్వరుడు ఈశ్వరుని స్తుతిస్తు పాడుతున్న పాట. మనిషిగా పుట్టి ఋషిలా తపస్సు చేసి అల్పాయుష్కుడైన  వాడు చిరంజీవి గా ఈశ్వరుని చేత వరంపొంది కైలాసం లో పరమేశ్వరుని పాదాల చెంత ఉండు భాగ్యం పొంది ప్రధమ గణాలలో ముఖ్యుడిగా

 భాసిల్లుతోన్న నందీశ్వరుడి భక్తి పరవశం ఈ పాట.

***************

పల్లవి:-

***

భక్తి దారి చూపినా నా దేవరా  పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి  చేర్చుకున్నా విశ్వేశ్వరా!!


భక్తి దారి చూపినా నా దేవరా పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి నన్ను  చేర్చుకున్నా విశ్వేశ్వరా!!


భౌతిక బాధల వలయం ఛేదించగా 

నైతిక విలువల మార్గం పయనించగా

ఆత్మస్వరూపుడిగా  దేహభావం దహించగా

పంచాక్షరీ మంత్రం ఓంనమశ్శివాయ

ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ


స్మరించిగా సమసిన అంతర్యుద్ధం

స్థితప్రజ్ఞతకు నీ ఆజ్ఞ దారిచూపెను  దయామయా

అజ్ఞానానంధకారం దహనమై

సుజ్ఞానం ఉదయించి నీ సన్నిదానం వరమాయే ఓంకారా..!!


పంచాక్షరీ మంత్రం అమితానందం

పరవశమైన ఈ తనువణువు పొందిన  ఆత్మనందం 

కర్మ నాశనం జన్మరాహిత్యం 

 నీ నామ స్మరణం ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ!!


ఇది చాలులే ఇక ఏది వద్దులే

పంచక్షరి మంత్రం మించిని పంచభక్ష్యాలు

వుంటాయా ఈ సృష్టిలో సర్వేశ్వరాయ

సదాశివాయ ఓం నమశ్శివాయ!!


 భక్తి దారి చూపినా నా దేవరా పరమేశ్వరా!

చరణం:-

***

నీ ద్యాసలో  నీ నామ ద్యానం స్మరించగా

అణువణువునా విభూది గా సంతరించుకొని

నిశ్చలమే మనస్సున చేరి ఉషస్సు గా తాకింది

అచంచలమైన భక్తి ఊటా 

ఉప్పొంగెనులే గంగా ప్రవాహమై నా మది అణువణువునా ఆది శంకరా అనాధ రక్షకా

పరమేశ్వరా పాహిమాం పాహిమాం పరమాత్మా!!


అంతరంగాన భక్తి జ్యోతిని  వెలిగించినా

అంతులేని ఆనందం వైపు  అడుగులే వేయించినా

ముక్తి త్రోవ చూపినా

రక్తిపై మోహమే తుడిపేసినా

ముత్యమల్లే మెరిసేలా 

నా మనసును  మల్లెపూవులా మార్చేసినా

మల్లికార్జునా !!


నిను సేవించే భాగ్యం  ప్రసాదించినా నా తండ్రి

ఈశ్వరా మల్లేశ్వరా!!ఈశ్వరా పరమేశ్వరా !!


భక్తి దారి చూపినా దేవా పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి చేర్చుకున్నావయ్యా  దయాస్వరూపా!!

చరణం:-

***

నీ లీలామృతం త్రాగినానయా

కన్నీళ్ల కడలిని దాటినానయా 

లోకానికంతా ఆకలి  తొలగించే

వరమునే నొసగి నందిశ్వరుడిగా

బసవేశ్వరుడిగా నామకరణమే చేసి

భువిన నన్ను భూమాతకు తోడుగా

పంపి చరితార్దుడను చేసినావు చెన్న మల్లేశ్వరా!!


వందనమయ్యా విశ్వ విభుడా 

పార్వతీ వల్లభా పరమేశ్వరా!!


నీ సన్నిదిలో  నీ బంటుగా ఉంటు

నిను నిత్యం కొలిచే నన్ను  నీ నోట  మనసారా మహానందని పిలిపించుకొనుట   

మహాదానందం  మహితాత్మా

మహదానందం మహితాత్మా!!

పల్లవి:-

***

భక్తి దారిచూపినా దేవరా  పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరిన ఉండే వరమునే ప్రసాదించిన విశ్వేశ్వరా!!


అల్పాయుష్కుడను చిరంజీవి గా దీవించావు

అనంతమైన ఆనందుడిగా చరిత్రలోనే నిలిపావు

ప్రధమగణాలలోముఖ్యుడిగా చేసావు

నిత్యం నీ యందుండే లా   నిను స్పర్శించేలా   

నీ వాహనమై నా జన్మతరించే లా 

ఆదిదంపతులకు సేవలు చేయు భాగ్యమును నొసంగి  ఎవరికి దక్కని భాగ్యం నాకిచ్చినావు నంది వాహన నాగభూషణ 

వందనం వందనం వందనం ఓంనమశ్శివాయ!!


పరవశం నా అణువణువు

పావనం నా తనువు  

 కైలాసం నా నివాసం

పార్వతీ పరమేశ్వరులు కొలుచు ఈ జన్మం

పంచాక్షరీ మంత్రం  నా స్వర వీణా తంతువై

నిరంతరం  స్మరిస్తు చిరంజీవి గా నిలిచాను తండ్రి 

నీ సన్నిదిలో ఈ నంది..

ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ!!

పల్లవి:-

****

భక్తి దారి చూపినా దేవరా పరమేశ్వరా

ముక్తి  ప్రసాదించిన నీ దరికి నన్ను చేర్చుకున్నా విశ్వేశ్వరా!!

*************

*****************************

నేటి నా పాట పాట సంఖ్య:-560.

******************************

 రచన :- మహేష్ వూటుకూరి  ✍️

9640713717.

దోర్నాల.

27/02/2023.

****************

పాట సందర్భంపై నా విశ్లేషణ.

***************************

ప్రేమ ఎలా మొగ్గ తొడుగుతుందో  అంతలోనే వాడి రాలిపోతుందో ఆ దేవుడికే తెలియాలి.

అతనిలో మంచిని గుర్తించిన ఓ అమ్మాయి అతనే తన సర్వస్వమని తలచి అతని వెంట పడుతుంది

 తీరా ప్రేమ చిగురించి  మొగ్గ తొడిగాక పరిస్థితులకు 

తలఒంచి  ప్రేమ నుంచి వైదొలగిన సమయంలో  ప్రేమే లోకమనుకున్న ప్రేమికుడు పిచ్చి వాడిలా తయారై దేవదాసుగా మారిపోతాడు  ఆమె ఓ పెద్దింటి కోడలై ఓ వారసుడితో కనిపిస్తుంది.  విధి నాటకంలో భాగమైన కాలం  ఇద్దరు తారసపడి గతంలోకి వెళ్ళి  కన్నీటి పర్యంతమవుతు   మనసుల మూగవేదన ఈ పాట.

*********************************************

 పల్లవి:-

******** 

మరిచావా మరిచావా ఓ ప్రేమా నన్ను మరిచావా

మరిచావా మరిచావా ఓ భామా నన్ను మరిచావా!!


మరిచావా మరిచావా ఓ ప్రేమా నన్ను మరిచావా!!


తొలిపొద్దు రాకముందే నా ముందు వాలేదానివే

తొలి కోడి కూయక ముందే నా తలుపు తట్టే దానివే

తొలి ముద్దు నాతో పంచుకొంటివే

తొలి సిగ్గు నాలో  చూసుకుంటివే!!


తొలిప్రేమ చిగురుల్లో కోయిలమ్మవై 

కుహ కుహ రాగం  పాడితివే

నెమలి వల్లే ఆడిపాడి కౌగిళ్ళ లో కరిగిపోతివే

అంతలోనే వింతగా మారిపోయి

అంతులేని ఆవేదనగామార్చి నను విడిచిపోతివే!!


మరిచావా మరిచావా ఓ ప్రేమ నన్ను మరిచావా

మరిచావా మరిచావా ఓ భామ నన్ను మరిచావా!!

చరణం:-1

********

ప్రేమించానంటు నా వెంటపడినావే

నా ప్రేమ కావాలంటు  పడిగాపులే కాసినావే!!

వద్దన్నా వినకుండా ప్రేమ లోకి దించినావే

నేనే నీవెంటపడేలా చేసుకున్నావే


ఇపుడేమో ఇలాచేసినావే

నమ్మించి మోసం చేసినావే.. !!

ఏమైపోయేదే నేను

ఎట్లాబ్రతీకేది నీవు లేకుండా నేను.!!

పల్లవి:-

********

మరిచావా మరిచావా ఓ ప్రేమ నన్ను మరిచావా!!

చరణం:-2

*******

దేవుడి ముడివేసిన ప్రేమను ఏ దయ్యం విడదీసిందే

ధర్మం తప్పిన ప్రేయసి నీవే విడమరచి చెప్పాలి

నన్ను ఏ మార్చి  చేసిన గాయం మజ్నులా  మార్చివేసిందే

శోకమైన దేహం సొమ్మసిల్లి పడిపోతే  పట్టుకున్నావా


గతమంతా గుర్తుకు రాలేదా  వర్తమానం కళ్ళుకప్పిందా

భవిష్యత్తు లేకుండా చేసి భావితరంతో భాసిల్లుతున్నావా

వాడిపోయి రాలిపోతున్నా పూ వనాన్ని చూసి జాలివేస్తుందా జాబిల్లి తోటకు!!


ఆశలన్నీ  ఆవిరైపోయి శ్వాస ఆగి పోతున్న సమయాన

 చూసిపోదామని వచ్చావా

చివరి క్షణాన వచ్చినావు  తులసి తీర్ధమే వేసి పోదువులే

 నా చివరి కోరికగా కనిపించినావులే

నీ తొలి ప్రేమకు  అంతిమ సంస్కారం చూసి పో చెలి

పల్లవి:-

*********

 మరిచావా మరిచావా ఓ ప్రేమ నన్ను మరిచావా

మరిచావా మరిచావా ఓ భామ నన్ను మరిచావా!!

షట్పదిగా రాజరాజీ 

==

రాజరాజీ షట్పది: UUI UUIU // UUI UUIU // UUI UUIU - UUIUU

==

బేలూరి శిల్పమ్మువా

పాలేటిపై నూర్మివా 

కాలాంబుదేంద్రాగ్నివా - కామాబ్జవల్లీ 

ఏలాసుగంధమ్ముతో 

లీలారవిందమ్ముతో 

బాలామణీ గాంచుమా - భామామతల్లీ 

==

సోమాగ్నిలో మండనా 

ధూమమ్ములో నుండనా 

నీమానసాభ్రమ్ములో - నేనేల లేనో 

ఈమేను నీదే గదా 

ప్రేమమ్ము నీవే గదా 

కామాగ్ని మండింతువా - కన్నీట నార్ప(న్) 

==

రాగాలతో హాసమా 

రోగాలతో వాసమా 

యీగాలిలో నేమియో - యీగాథ లేమో 

యీగుండెలో భారమే 

యీగుండె నిస్సారమే 

నాగమ్యమెందున్నదో - నాగమ్య మేమో

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

0 Co


 ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:

(ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం ) 
 రచయత: మల్లాప్రగడ  శ్రీ దేవి రామకృష్ణ
నేటి రాధాకృష్ణ సరస గీతం 
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ   

రాధానీ కల ఇదిగా -కృష్ణానీ కల ఇదిగా 
రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 

నీమాయన్ బడితినిగా  
దాహమ్మున్ అడిగితిగాఁ 
నీ కాలమ్ ఇది కథగా   
దేహమ్మున్ వడి వడిగా 
  
రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా 

నీకై కోర్కెలు మదిగా  
ప్రేమమ్మేగ కథలుగా  
నాకై తీర్పుగను మదిగా 
స్నేహమ్మే గ మనసుగా 

రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 
   
లోకమ్మంతయు కనగా   
జీవంమ్మంతయు కలగా
నాకంమ్మంతయు మనగా 
ప్రేమమ్మంతయు కళగా

రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా 

ఏకాంతమ్ము న నెలగా  
శ్రీ కాంచమ్మును వలగా
శ్రీ శాంతమ్ముయు నెలగా  
శ్రీ శాంతిత్వము వలగా

రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 
     
ప్రేమాచ్ఛాదక మనగా 
దేహత్యాగము అనగా 
ప్రోత్యాహమ్ముయు యనగా 
ఉచ్చాహమ్ము యు అనగా 

రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా 
రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా    
కృష్ణానీ కల ఇదిగా - రాధానీ కల ఇదిగా
కృష్ణా నీ తలపులుగా- రాధానీ వలపులుగా

ఆధారం: UU UII IIU

*****

నేటి కవిత - రాధాకృష్ణసరసగీతం  
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

సమయమ్ము చేబట్టి .. సుఖమునే కోరినా
పంతమ్ము మానము ..ప్రణతు లివియే రాధా 

అతిగాను అనలేదు..అర్ధంబు తెలిపితీ
పరమార్ధమును తెల్సి ..పలుకు లివియె కృష్ణా 

మదిలో భావం అనంతం కృష్ణా 
అనంతాన్ని చేసుకోలేము అర్ధం 
అర్థంలోనే దాగి ఉంది పరమార్ధం 
పరమార్ధ భావాలే నిజమైన అర్ధం
  
సమయమ్ము చేబట్టి .. సుఖమునే కోరినా
పంతమ్ము మానము ..ప్రణతు లివియే రాధా 

అతిగాను అనలేదు..అర్ధంబు తెలిపితీ
పరమార్ధమును తెల్సి ..పలుకు లివియె కృష్ణా 

మనసు ఎప్పుడూ నలుగుతుంది రాధా 
కారణం ఇదేనని చెప్పనంటుంది 
సుఖదుఃఖం చుట్టూ తిరుగుతుంది   
ఎండా వాన చలికి మనసు పూస్తుంది 

ఇష్టమైన బ్రతుకు..ఇప్పుడూ ఎప్పుడూ
క్రమశిక్షణ తొ సాగు.. కనికరమ్మె రాధా 

నిర్ణయించు కొనునది.. నియమబధ్ధముగనే
ఓర్పుపరిశ్రమే ఒప్పు ప్రేమ కృష్ణా 

ఒకటికి ఒకటి  మన మమేకం  కృష్ణా 
మమేకం లోనే ఉన్నది ఏకత్వం 
ఏకత్వంలో ఉన్నది సృజనత్వం  
సృజనత్వమే కవితలో పటుత్వం

కేశములెన్నో చెప్పుట కష్టమే  రాధా 
తరంగాలెన్నో తెల్పుట కష్టమే   
మనసు అంతరంగాలు తెలుపుట కష్టమే 
కావ్యాలను గగన చుక్కలను తెల్పుట కష్టమే 
 
సమయమ్ము చేబట్టి .. సుఖమునే కోరినా
పంతమ్ము మానము ..ప్రణతు లివియే రాధా 
అతిగాను అనలేదు..అర్ధంబు తెలిపితీ
పరమార్ధమును తెల్సి ..పలుకు లివియె కృష్ణా 

ఇష్టమైన బ్రతుకు..ఇప్పుడూ ఎప్పుడూ
క్రమశిక్షణ తొ సాగు.. కనికరమ్మె రాధా 

నిర్ణయించు కొనునది.. నియమబధ్ధముగనే
ఓర్పుపరిశ్రమే ఒప్పు ప్రేమ కృష్ణా 


నేటి రాధాకృష్ణ సరసగీతం - 03-02-2022
ప్రాంజలి ప్రభ -- మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  
మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

ఎకసెక్కె ములు ఏల..ఏది ఎందాకనో
అందాక కులుకులే .. అరిగి నాను రాధా 

తైతక్క లాటలు.. తక్కువ అనగ లేను
విశ్వాస పలుకులు..విజయ మగును కృష్ణా 

మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

నొప్పింత లేకుండ ..నొప్పింత రాకుండ
మనసునొప్పింపక..మనుగడగను రాధా 

ఆర్భాటములు లేవు..అంతరములు లేవు
ఆలుమగలు గాను బ్రతక వలెను కృష్ణా 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  

ప్రేమయే మనకిక.. ప్రేమయే శ్రధ్ధగా
శ్రద్ధకలిగెనేని .. శుభము మనకు రాధా 

సులభసాధ్యముప్రేమ...సుమధురమ్ముగ ప్రేమ
సర్వసృష్టికి సమయ మేను కృష్ణా 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  
వినుడునాదు పలుకు విశ్వసించు ము ప్రేమ
దెలియవచ్చెటి మేలు దెలుపు ప్రేమ రాధా 

అడిగిన తలపున..ఆదరముయు ప్రేమ
అలుకలేని సుఖము.. అందు ప్రేమ కృష్ణా 
మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  
మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

నేటి రాధాకృష్ణ సరసగీతం - ప్రాంజలి ప్రభ  
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 
మధుర క్షణాల్లో మాటలు అలికే 

గడిచిన ప్రతి క్షణము గమ్య మయ్యె 
ఉదయ భానుకర్తవ్యమే ఊత మయ్యె
కళ్ళ ముందట ఆయుధం కావ్య మయ్యె
చేష్ట లన్నియు నిజముయే చెంత కృష్ణా      

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే

ఆశల గొడుగు చేరకు ఆట లాగ  
ఆశ తలుపు తట్టకు నిరాశ యేగ 
అలసిన మనసు లో వేట లాగ
గెలుపు ఓటమి లాగానె గొలుసు రాధా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 
మధుర క్షణాల్లో మాటలు అలికే 

లాలి పాటతో కమ్మగా జాలి ఆట 
గాలి వాటమై బ్రతుకుయే కాలి బాట 
మాలి లాగానే జీవితం మేలి మాట 
రాలి పొయేటి ఆకుయే రవ్వ వెల్గు కృష్ణా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 

వెన్నెల కురిసే రాత్రుల్ని వేడు కొనుచు 
మంచు కప్పిన కాలము మనసు అనుచు  
తరువులకు ఉన్న పుష్పాలు తపన యనుచు  
లేత ఆకులు వలననే నీవు రాధా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 

--((()))--


నేటి రాధాకృష్ణ సరస గీతం- ప్రాంజలి ప్రభ 
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ  
02-02-2022

సానుకూలము ఇదియే 
తనువునే సంగ్రహించు కృష్ణా --- 2 
సామర్ధ్యము చూపావు లే 
నీపై విశ్వాసమంది రాధా   --- 2 

చలిపులి పిలిచింది చర్మంబు పగిలింది
మంచునే కురిపించి మాటు వేసె రాధా 

చల్లగాలి యె పెర్గి చపలచిత్తము ఆయె
మత్తును పెంచియు మమత కోరె కృష్ణా 

కలలాయె బత్కు.. కలకాల మేలు. 
కిలరావ మయ్యె కీర్తి బతుకే రాధ

విలలాప సేవ.వెలలాగ చిందు. .
వలలాగ జిక్కి వృధ్ధి బతుకే. కృష్ణా

చలిలోన వచ్చాను చక్కని చుక్కను
వెచ్చపర్చు మిపుడే వేగ మల్లె రాధా  ---2

కౌగిలి అందించు కరములు బందించు
సౌఖ్యముయే నీకు సుఖము నాకు కృష్ణా ---2

అలకాయె నీవు  అలనాడు మాట. 
అందుకేది చెప్పి ప్రీతి బతుకే కృష్ణా

జలకాలు ఆడి.జిలికేను మేలు 
చలిలాగ వేడు శాంతి బతుకే  రాధా

మోదము లేదని మైకము లేదని
వినుము తీరు ఇదియు వింత కాదు కృష్ణా 

ఖేదము లేదని భేదము లేదని
అన్నమాట ఇదియు ఆశ కాదు రాధా 

గరికపైవొదిగాను విశ్రాంతి తీరు వేళ
మత్తుగావిని పించుము గాన లీల కృష్ణా 

అణువణువు నిండిన ప్రణవం ఆత్ర హేళ
నువ్వు అడుగంట ని ప్రమ నమ్మె లీల రాధా 

విలలాప సేవ వెలలాగ చిందు.
వలలాగ జిక్కి వృధ్ధి బతుకే కృష్ణా

చలిపులి పిలిచింది చర్మంబు పగిలింది
మంచునే కురిపించి మాటు వేసె రాధా 

సానుకూలము ఇదియే 
తనువునే సంగ్రహించు కృష్ణా --- 2 
సామర్ధ్యము చూపావు లే 
నీపై విశ్వాసమంది రాధా   --- 2 

*****

నేటి రాధ కృష్ణ సరస గీతం - ప్రాంజలి ప్రభ 
విధేయుడు ।మల్లాప్రగడ రామకృష్ణ -- 02-02-2022

ఉదయ వెలుగులు కమ్మె నాలో 
హృదయ భావాలు చిమ్మె నీలో ---2

ప్రకృతి ప్రభావము కమ్మె  నాలో   
ప్రకృతిఁ ప్రాభవం  చిమ్మె నీలో -- 2

సాగి పోయేను కాల గమన మేను 
కాగి పోయేను ప్రేమ గమన మేను 
వేగి పోయేను సేవ గమన మేను
యోగి అయ్యేను ధర్మ గమన మేను 

ఉదయ వెలుగులు కమ్మె నాలో 
హృదయ భావాలు చిమ్మె నీలో ---2

కాలమే దేహంతొ ఆడుతుంది  
ప్రేమయే దాహంతొ పాడుతుంది 
ద్వేషమే కోపంతొ  చేరుతుంది   
స్వేశ్చయె స్నేహంతొ మాయమైంది
 
ప్రకృతి ప్రభావము కమ్మె  నాలో   
ప్రకృతిఁ ప్రాభవం  చిమ్మె నీలో---2

పువ్వుల వసంతం చిమ్ముతుంది 
కొవ్వులు హేమంతం కమ్ముతుంది 
నవ్వుల శ్రీమంతం ప్రేమిస్తుంది 
మువ్వల శ్రీ శబ్దం  హృద్యమైంది
 
ఉదయ వెలుగులు కమ్మె నాలో 
హృదయ భావాలు చిమ్మె నీలో --2 

గతకాలపు తలుపులు తెరిచి
భవిష్యత్తుకు సహకారం అందించి 
ప్రకృతితో పరిమళాలు పొంది 
అక్షరసాహిత్యం బ్రతుకౌతుంది 

ఉదయ వెలుగులు కమ్మె నాలో 
హృదయ భావాలు చిమ్మె నీలో ---2

ప్రకృతి ప్రభావము కమ్మె  నాలో   
ప్రకృతిఁ ప్రాభవం  చిమ్మె నీలో
******


నేటి రాధాకృష్ణ సరస పద్యం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  

శ్వాసలో శ్వాసనైతిని కృష్ణా    
ప్రాణములొ ప్రాణమైతివి రాధా  
ఊపిరిలొ ఊపిరైతిని  కృష్ణా
జీవములొ జీవమైతివి రాధా

పువ్వు హృదయంలొ నెత్తురు పూలు విచ్చె 
దాహముతొ రసజ్వలితమై దేహ మిచ్చె రాధా 

వెచ్చగా విచ్చుకున్నను వేడి నిచ్చె 
మమత చెక్కిళ్ళు చల్లారె మనసు నిచ్చె కృష్ణా 

శ్వాసలో శ్వాసనైతిని కృష్ణా 
ప్రాణములొ ప్రాణమైతివి రాధా
ఊపిరిలొ ఊపిరైతిని కృష్ణా 
జీవములొ జీవమైతివి రాధా

ఎఱ్ఱనిపెదాలు మధువునే పెదవి కిచ్చె 
స్పర్శతో ఒళ్ళంతా వేడి సెగలు చొచ్చె రాధా 

వేడి నెత్తురు తీగలై వేగ మొచ్చె 
చేతులబిగింపు లోచల్లఁ చేయ నిచ్చె కృష్ణా 

శ్వాసలో శ్వాసనైతివి   రాధా
ప్రాణములొ ప్రాణమైతిని కృష్ణా  
ఊపిరిలొ ఊపిరైతివి  రాధా
జీవములొ జీవమైతిని కృష్ణా
  
మెత్తటినున్నటి దేహము మత్తు పెంచె 
దేహముచితకే చల్లార్చె దృతియు నెంచె రాధా 

ప్రతిభ సాన్నిధ్య సాయుజ్య ప్రేమ నుంచె 
వేళ్ళు మీటి ప్రకంపన వేగా పరిచె కృష్ణా 
      
శ్వాసలో శ్వాసనైతివి   రాధా
ప్రాణములొ ప్రాణమైతిని  కృష్ణా
ఊపిరిలొ ఊపిరైతివి రాధా
జీవములొ జీవమైతిని కృష్ణా

*****
   
నేటి రాధాకృష్ణ సరస గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   
ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

ప్రవేశమ్ము నీది ప్రయాణమ్ము నాది   
ప్రమాణమ్ము ఇచ్చి ప్రయాణంబు చేసె  
ప్రశంసించు దాన బ్రదీపించు దాన
మమైకమ్ము దాన మాదియమ్ము దాన 

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

ప్రదానమ్ము లేదు ప్రమేయమ్ము లేదు 
ప్రసాదమ్ము లేదు ప్రమోదమ్ము లేదు 
ప్రపంచమ్ము లేదు ప్రకోపమ్ములేదు 
ప్రభావము లేదు ప్రవేశమ్ము లేదు 

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

హుషారైన దాన సుమారైన దాన 
ఖరీ దైన దాన  ఖర్చేకాని దాన 
యసామాన్య దాన యమోఘంపు దాన 
సువాసమ్ము దాన సుదేహమ్ము దాన 

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

మమేకమ్ముఁ రక్తి మనోమాయ సూక్తి 
సహాయమ్ము సూక్తి సమాధాన యుక్తి 
వినోదమ్ము యుక్తి వివాదమ్ము శక్తి 
విశేషంపు శక్తి విశాలంపు దృష్టి 

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   
 
ప్రధానమ్ము గాను ప్రకాశమ్ము  గాను 
నిదానమ్ము గాను విధానమ్ము  మౌను  
సదానందమౌను సదాసౌఖ్య మౌను 
ముదా వెల్గు నౌను ముదాస్పర్శ నేను  

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   
ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

*****
ఆధారం : గణములు - య,జ,య,జ యతి- 7


నేటి సరసమైన గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

నవ్వుల కొవ్వుల రాజా, అందుకోవా కాజా 
పువ్వుల యవ్వని రాణి, పొందుకోరి పూజా 
ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

నీలి కన్నుల మెరుపు నవుతా
కాలి శింజిని  పిలుపు నవుతా
జాలి హాసిని  గెలుపు నవుతా
మెలి మోహిని వలపు నవుతా 

ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

పరవ సింపచేసే పెదవి నీకె   
తళుకు లొలికే కంటిపాపలు నీకె 
చెక్కిలికి మైమరపించే ముద్దు నీకె   
నాదు తలపుల కుదుపు అంత నీకె    

ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

పలకరిస్తే వలపుల తలుపునె  
ఎదలో  అలజడి అలలనె 
తనువు పులకల వలపునె 
నీకు మేలును చేసే మలపునె 

ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
 
చంద్రకాంతిని ప్రతిఫలింప చేస్తా 
నీలికన్నుల నాట్యాన్ని చేసి చూపిస్తా 
తమలపాకుల మడుపు కిల్లి అందిస్తా  
నిరాశలను తరిమి అసలు నింపేస్తా 

నవ్వుల కొవ్వుల రాజా, అందుకోవా కాజా 
పువ్వుల యవ్వని రాణి, పొందుకోరి పూజా 
ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
   
ఎత్తుకు పై ఎత్తులు ఎందుకే 
ఎంతైనా మత్తుకు చిత్తవుటే 
అంత తొందర నీకు ఎందుకే 
ముందొచ్చేది మనువాడే పండగే 

నవ్వుల పువ్వుల రాణి నాజూకుగా ఇస్తావా కాజా 
యవ్వన మగధీరుడిని పొందుకోరి పూజా
ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

అంతే లే నామాటవినరు నీమాట వినాలంటారు 
తొలకరి చినుకులా వచ్చి తైపీ తడిపి పోతుంటారు  
ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

అవునులే మనమధ్య మాటల యుద్ధం వద్దులే 
అవునులే మనమధ్య మాటల యుద్ధం వద్దులే 
అవునులే మనమధ్య మాటల యుద్ధం వద్దులే 

--(()))--

నేటి సాహిత్య గీతం 
మల్లాప్రగడ రామకృష్ణ 

మనసు కోరె-- పాఠము ఏదో
శాంతి పల్కు - గెలుపు నవుతా 
వయసు కోరె  - మోక్షము ఏదో 
కాంతి పల్కు -  దాహము నవుతా 

మనిషి నీవె-- మాటలు నీవే 
మనసు నీదె -- మార్గము నీవే 
ఇలా వుంటె --ఇచ్ఛా ఏలా
ఇలా ఉంటె --ఇచ్ఛా ఏలా

తనువు మాటు-- దాగు పాఠమే
అణువు చోటు --- కాగు పాఠమే 
క్షణము నోటు -- వేగు పాఠమే 
మనిషి నాటు -- మాగు పాఠమే 

మనిషి నీవె--- మాటలు నీవే 
మనసు నీదె -- మార్గము నీవే 
ఇలా వుంటె --ఇచ్ఛా ఏలా
ఇలా ఉంటె ---ఇచ్ఛా ఏలా

చిరిగిన ప్యాంటు --- చిన్నది చొక్కా
చేతిలో సెల్లు---చెవులకు జోడే
మాసిన గడ్డం--- చింపిరి జుట్టే
శరణము చెప్పే -- ప్రేమ పాఠమే

మనసు కోరె-- పాఠము ఏదో
శాంతి పల్కు - గెలుపు నవుతా 
వయసు కోరె  - మోక్షము ఏదో 
కాంతి పల్కు -  దాహము నవుతా 

రాణి పల్కిన -- మధువు గుండెలొ 
వాణి పల్కిన -- చదువు గుండెలొ 
బోణి చిల్కిన -- పొదుపు గుండెలొ 
ప్రాణి చిల్కిన -- ప్రేమ పాఠమే

మనసు కోరె-- పాఠము ఏదో
శాంతి పల్కు - గెలుపు నవుతా 
వయసు కోరె  - మోక్షము ఏదో 
కాంతి పల్కు -  దాహము నవుతా 

ప్రణయ మిదే--- ప్రణతివి నీవే
తృణము ఇదే--- థలుకులు నీవే
ప్రణయములో--- భధికుడ నీవే
ప్రణయ మిదియు--- ప్రధమ పాఠమే
   
మనిషి నీవె--- మాటలు నీవే 
మనసు నీదె -- మార్గము నీవే 
ఇలా వుంటె --ఇచ్ఛా ఏలా
ఇలా ఉంటె ---ఇచ్ఛా ఏలా

*****


నేటి ఛందస్సు గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

తరుణము చిలికిన చిలిపి ఊహలకు
శరణము తెలిపిన మెదిలె భావముకు
అనుభవ భావాలు తెలిపి బ్రతుకుటకు  
మనసుతొ చేసే ముప్పు ఒప్పు తెలుపుటకు  

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 

నలుగురు నడిచేది  - నమ్మకమైన పలుకు 
దేహము భద్రముకే  - దేశమందు 
పదుగురు పలుకేది  - పదవీవ్యామోహమే 
వేద మంత్రముయేను - వేల్పు లందు 

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
 
చెడుగుడు పలికేను - చేతసత్తువవులే 
 ప్రేమ సూత్రము యేను -- ప్రేమ పొందు 
తనమన మనసేను - తపనల భావాలె 
భార్య మార్గము యేను - భాగ్యమందు 

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 

తొలి బుడి అడుగులే - తొందర పలుకులే  
పడిలేచుట యగుటే - పెదవి నందు 
సమయము పలుకేను - సమరము శాంతియే 
తల్లితండ్రుల మాట - త్యాగ మందు 

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 

తొలకరి చినుకులు - తపనలు పెంచుటే 
పడి పారుట యగుటే - పడతి నందు 
మమతను పంచేది - మనసును ఇచ్చేది  
తల్లియే తెలిపెను - తృప్తె మందు  

తరుణము చిలికిన చిలిపి ఊహలకు
శరణము తెలిపిన మెదిలె భావముకు
అనుభవ భావాలు తెలిపి బ్రతుకుటకు  
మనసుతొ చేసే ముప్పు ఒప్పు తెలుపుటకు  

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
  
****


 నేటి సాహిత్య గీతం  - కలువలు- ప్రాంజలి ప్రభ  
 30-01-2022 - మల్లాప్రగడ రామకృష్ణ 

అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా

కలువలు పూజ లాలసులకే కు అనకు  
ముడుపులు దైవ లాలసులకే అనకు   
మకుటము రాజ లాలసులకే అనకు   
సకటము బద్ద లాలసులకే అనకు 
   
కర్మాను సారము కలిగే ఫలితమే 
ఆనంద మందరికీ  అద్భుతమే
అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  
   
కపటము మోస లాలసులకే అనకు 
నటనము హాస్యలాలసులకే అనకు 
జపమును మౌన లాలసులకే అనకు 
తపమును మోక్ష లాలసులకే అనకు 
 
కృషితో నాస్తి అని తెలిపే నటనా 
మౌన హాస్య మోక్ష మాయ లాలసుల నటనా     
అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  

ధనమును సత్య లాలసులకే అనకు  
గుణమును మంచి లాలసులకే అనకు
గ తియును ధర్మ లాలసులకే   అనకు
మతియును న్యాయ లాలసులకే అనకు

న్యాయ ధర్మ సత్య మాయ లాలసల నటనా  
అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  
 
తలపులు ప్రేమలాలసులకే అనకు 
గడువులు అప్పులాలసులకే అనకు
పదవులు భోగలాలసులకే  అనకు
చదువులు విద్యలాలసులకే అనకు

ప్రేమ భోగవిద్య మాయ లాలసల నటనా 
అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  

--((*))--


ప్రాంజలి ప్రభ - సరస గీతం -29-01-2022

ఉన్న దాన్ని చూడరా, ముద్దునిచ్చి పిలవరా 
కళలు తీర్చు మదియెరా,  కలలు తీర్చు మదియెరా,
అవునా 
 
తొలి బుడి అడుగులు పడిలేచె  
తొలకరి చినుకులు  పడి లేచె 
తడిపొడి పలుకులు మది దోచె  
మగసిరి కులుకులు శివపెంచె  

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఉన్న దాన్ని చూడరా, ముద్దునిచ్చి పిలవరా 
కళలు తీర్చు మదియెరా, కలలు తీర్చు మదియెరా, అవునా 
 
తరుణము చిలికిన చలిపెంచె  
శరణము తెలిపిన మదినెంచె  
చరణపు పలుకులు కులుకుంచె  
కరుణతొ బిగువును సరియంచె  

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఉన్న దాన్ని చూడరా ముద్దునిచ్చి పిలవరా 
కళలు తీర్చు మదియెరా, కలలు తీర్చు మదియెరా, అవునా 

తడబడి కనుగొని చెలి వచ్చె  
అనుభవ తెలిపియు పస పంచె 
మనసుతొ కనుగొని వలపించె  
మమతను తెలిపియు మదినుంచె 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఉన్న దాన్ని చూడరా ముద్దునిచ్చి పిలవరా 
కళలు తీర్చు మదియెరా, కలలు తీర్చు మదియెరా, అవునా 

విలువలు నడవడి జగతిచ్చె  
మనసు మగువకు గడబిడిచ్చె 
తరుణము చిలికెడి పలుకిచ్చె  
వినయపు చినుకులు చలినిచ్చె  

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఉన్న దాన్ని చూడరా ముద్దునిచ్చి పిలవరా 
కలలు తీర్చు మదియెరా అవునా 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అవునే ఉన్నది సుఖమే అయ్యెరా 
కలలను తీర్చే మగధీరునురా 
నీకుతోడు నేను, నాకుతోడు నీవెరా  

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
అవునే ఉన్నది సుఖమే అయ్యెరా 
కలలను తీర్చే మగధీరునురా 
నీకుతోడు నేను, నాకుతోడు నీవెరా  

--(())--

నేటి ఛందస్సు గీతం - 28-01-2022
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ  

నినునమ్మితి నామనోహరా
ననుపాలింపగ రమ్ము నాదొరా  
మనసంతయు నీకునామొరా 
వినిపించేదను ప్రార్ధనమ్మె రా      
అణువంతయు శాంతి ఇమ్మురా 

వరమియ్యుము రామచంద్రమూర్తీ 
మురిపించేమది మోహనాబ్ధిమూర్తీ
తరుణమ్ముయు వచ్చి పొమ్ము మూర్తీ
శరణమ్మే ఇది  సత్య ధర్మ మూర్తీ 

నినునమ్మితి నామనోహరా
ననుపాలింపగ రమ్ము నాదొరా  
మనసంతయు నీకు నామొరా 
 
చిరుహాసము చేత కాదు మూర్తీ 
మరిజాగేందుకు మౌనమేల మూర్తీ 
దరిజేరుము  ధర్మ సౌర్య మూర్తీ 
కరుణమ్మే ఇక కామ్య దాత మూర్తీ 

మనసంతయు నీకు నామొరా 
వినిపించేదను ప్రార్ధనమ్మె రా      
అణువంతయు శాంతి ఇమ్మురా 
 
అరుణోదయ మయ్యె తేజొ మూర్తీ 
తరుణంమంతయు దేహ తృప్తి మూర్తీ 
హరినామము హాయి నిచ్చు మూర్తీ  
సిరిమువ్వే నువు సర్వ రక్ష మూర్తీ 

నినునమ్మితి నామనోహరా
ననుపాలింపగ రమ్ము నాదొరా  
మనసంతయు నీకునామొరా 

చెరణాలను చేరినాము మూర్తీ  
చిరునవ్వేమియు మమ్ముచూసి మూర్తీ 
వరమాలతొ వందనమ్ము మూర్తీ
సరిలేరెవ్వరు సామదాన మూర్తీ  

నినునమ్మితి నామనోహరా
ననుపాలింపగ రమ్ము నాదొరా  
మనసంతయు నీకునామొరా 
వినిపించేదను ప్రార్ధనమ్మె రా      
అణువంతయు శాంతి ఇమ్మురా 

ఆధారం : IIUII - UIUI UU / IIU UII - UIUI UU
****
 

నేటి సాహిత్య గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

యువత ప్రాయము విలువ ఎంతోమేలు 
చెపుతా విను ఆకర్షణ కు లొంగకుంటేమీలు  

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

నిత్య గలాబి పువ్వు గుభాలింపు ఆకర్షణ లే
నిత్య వినోద నటన కళాకారి ఆకర్షణ లే
నిత్య మదీయ మమత శుభంకారి ఆకర్షణ లే
నిత్య మనోమయ జ్ఞాన విజ్ఞాన ఆకర్షణ లే

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

సమయ సర్వలోకాల సంపదాకర్షణ లే
సమయ ధర్మపీఠాల బోధనాకర్షణ లే
సమయ జన్మభావల పోషణాకర్షణ లే
సమయ అమ్మతత్వ ఉషోదయాకర్షణ లే

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

పచ్చని నవ్వు పూదోట పువ్వు హృదయాకర్షణలే 
వెచ్చని కడలి వేన్నీళ్లు తపము చలియాకర్షణ లే
నచ్చిన పిలుపు కన్నీళ్లు నదులు మగువాకర్షణ లే
మెచ్చిన మనసు ఇల్లాలు కొరకు సుఖమాకర్షణ లే

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

అక్కర వయసు కొచ్చిన పడచు చుట్టమాకర్షణ లే
చెక్కర తీపి పాకము పాల  కోవకాకర్షణ లే
ముక్కెర పడచు ముక్కుతొ మెఱుపు  నాట్యమాకర్షణ లే
మక్కువ చూపె కొద్దియు మగువ మనస్సె ఆకర్షణ లే

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

యువతా ప్రాయము విలువ ఎంతోమేలు 
చెపుతా విను ఆకర్షణ కు లొంగకుంటేమీలు 

--(())--


ప్రాంజలి ప్రభ - నేటి గీతం - 28-01-2022
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

రామ జపము రామ అనుచు నున్న 
లంక నంత శబ్ద మయ్యె అచట
హనుమ చెట్టు దిగియు చెంత చేరె 
వినయ పూర్వ వందనములు తెల్పె    

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

క్షేమ మమ్మ క్షేమ మమ్మ  మీకు  
భూమి తనయ వేగ వినుమ మాట    
భూమి పతియు వేగుచుండె గాన 
భూమి లోన వేగ మతము పెరిగె    

భూమిలోన వేఱు లేరు మీరు      
ప్రేమమయులు కాన  వచ్చె మాకు      
రామలక్ష్మణులు నిజాన ప్రేమ
హృదయు తోను హృదయ మంత తెలిపె  

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 
 
ప్రేమహృదయులైన కపులు మీరు       
రామచంద్రు డాన తీయ చుండె        
సామ దాన క్షేమ కోరు వారు
కామితార్థ మొంద కపులు వీరు 
 
స్వామి సరస పోరు వేగ మయ్యె  
వేగ మంటు వత్తు వానరలులె        
జాగు సేయ జాము రమ్మ వారు       
మూగ బాధ తొలగు బ్రదుకు నీకు   

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

బాగు పడును గాను పదిల మనెను        
బాగు పడదు భాధ అనెటి సేవ    
యోగ మొందు యోగి  రాజ్య లక్ష్మి    
రాగ మది ముఖారి యగును కలత 

మాను అనక మాన సమ్ము ఉండు         
కలత మాను కళలు మమ్మ యిపుడు     
కలుగు మంచి కలత పుడమి కెపుడు    
వెలయు రామచంద్ర మూర్తి చేరి 

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

నిలువ గాను నియమ మనుచు నుండె           
నిలువ రామమూర్తి యండ మనము      
తొలగు దుష్ట రావణుండు  ఇకను     
యిలను రాలు మ్రుత్యు వోలె ఇపుడు   

అంగనామణీ యనుంగు మెరుపు 
యుంగరమును పంపె రాము నీకు 

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 
     
నంగుళి వెలసిల్లిన దది రంగు  
రంగు మణుల యాసనాలు వలెను       
రంగు రంగు మ్రుగ్గులు పలు చూచె     
మంగళము గయోధ్య పిలుచు నూత్న 

కాంతితోను కలలు తీరు వేలు 
నూత్న కాంతు లిడు కిరీట మగును      
రత్నముల ధరింతు రింక మాత       
రత్నగర్భ తనయ యైన యతుల 

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

రత్నమాల దాల్చు దనుజ నపుడు       
రత్న మగు దశముఖ మకుట వేళ   
రత్న మదియు నేల వ్రాలు తప్ప 
తప్ప దమ్మ రామ జయము ఇపుడు      

తప్ప దమ్మ నీ విడుదల మనసు      
తప్ప దమ్మ రావణ వధ ఇపుడు       
తప్ప దుర్వి తనయ నీవు ఇపుడు      
తప్పకుండ లంక వీడ వలెను 

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 
     
గొప్పగాను చూతు వతని రయము          
క్షేమ మమ్మ క్షేమ మమ్మ అకట   
రామచంద్రమూర్తి యతడు అచట      
ప్రేమల హనుమంతు నన్ను పంపె  

శ్రీమతులు వెలుంగ నీదు ప్రేమ       
క్షేమ వార్త నతని కిత్తు ఇపుడు   
భూమి పుత్త్రి జీవిత మిక చాలు          
సుందరమగు వదనము లిక మేలు
     
రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

సుందరమగు హృదయము లిక పంచు      
సుందరమగు బ్రదుకు లింక వెలుగు          
అందము లిక చిందువారు మనసు        
చందన మగు గాలి తావి అపుడు      
చిందు లిడుచు పోదు నీదు క్షేమ 
వార్త తోను హనుమ రామచంద్ర  

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 
రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

******
నేటి సాహిత్య గీతం  - తోడు 
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

తోడు తోడు అంటూ ఆడి చూడు  
ఆడి అడి అంటూ  పాట చూడు 
పాడి పాడి అంటూ మాట చూడు 
మాట మాట అంటూ కలసి చూడు  

మనసుకు మనసు నీడలా మమత తోడు 
మనసుకు మమత హాయిని మౌన  తోడు 
మమతకు స్నేహము విలువ మంచి తోడు     
స్నేహముకు బలము ప్రేమ సహన తోడు

బలముకి ధనము దైర్యము బంధ తోడు 
ధనము ధర్మానికి వినయ ధరణి  తోడు 
ధర్మమే న్యాయముననిత్య దారి  తోడు
న్యాయముకు సత్య మార్గము నయన తోడు

తోడు తోడు అంటూ ఆడి చూడు  
ఆడి అడి అంటూ  పాట చూడు 
పాడి పాడి అంటూ మాట చూడు 
మాట మాట అంటూ కలసి చూడు  

సత్యమే మనిషికి నీడ సమయ తోడు 
మనిషికి ప్రేమ మనసు మాట తోడు 
ప్రేమలే దేశమునకుయే క్షేమ తోడు   
ఒకరి కొకరుగా ఒక్కరై ఓర్పు తోడు

నియమ కష్టాల కు కడలి నిత్య తోడు 
నియమ సుఖములకు మనిషి నిత్య తోడు 
నియమ క్రమశిక్షణకు చీమ నిత్య తోడు 
నియమ ఐక్యమత్యము కాకి నిత్య తోడు 

తోడు తోడు అంటూ ఆడి చూడు  
ఆడి అడి అంటూ  పాట చూడు 
పాడి పాడి అంటూ మాట చూడు 
మాట మాట అంటూ కలసి చూడు  
  
సమయ నీడలు ఎండకు సత్య తోడు
సమయ చలియంత వెచ్చగా సత్య తోడు
సమయ ఆతృతఆశలు సత్య తోడు
సమయ కోపాని కి ప్రేమ సత్య తోడు

తోడు తోడు అంటూ ఆడి చూడు  
ఆడి అడి అంటూ  పాట చూడు 
పాడి పాడి అంటూ మాట చూడు 
మాట మాట అంటూ కలసి చూడు  

--((*))--

నేటి  మనసు ఛందస్సు  గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

మరుమల్లెలావికసించి నున్నాను 
మకరంద మంతాను దోచి పొమ్మురా 
అధరమ్ము తీపిని ఆస్వాదించు రా 
అందాల బొమ్మను ఆటపట్టించకురా    

చిరునవ్వు చిందించు సిరులు కురుపించు 
ముద్దిచ్చి మైమర్చె మోహనా రా 
నిఱుపేద నాపైనఁ గరుణఁ జూపించు 
సరసిజోద్భవ రమ్ము - సంతుష్టి రా  

పుత్తడి బొమ్మనై పు వై ఉన్నాను 
ముద్దిచ్చి మొహమే తీర్చాలి రా 
చిరునవ్వుతో రమ్ము సిరులు అందిస్తా 
స్మరణమ్ము నీపైన మోహనా రా 

హాసమ్ము పంచియే హాయిఁ గొనిపోర
ఆర్భాటమే కాదు మోహనా రా 
అందాలన్నీ పొంది ఆడి మరవాలి 
అధరమ్ము తీపిని అందుకోరా 
   
ఇదియేను శృంగారమనకు మన్మధా 
ప్రకృతిలో ధర్మమే మోహనా రా 
వయసున్నది వలపు వుంది మన్మధా 
వరుసైన దాన్నిలే మోహనా రా     

మరుమల్లెలావికసించి నున్నాను 
మకరంద మంతాను దోచి పొమ్మురా 
అధరమ్ము తీపిని ఆస్వాదించు రా 
అందాల బొమ్మను ఆటపట్టించకురా    

అధరమ్ము తీపిని ఆస్వాదించు రా 
అందాల బొమ్మను ఆటపట్టించకురా    

___((()))____

ప్రాంజలి ప్రభ - సాహిత్య గీతం 
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రధానమ్ము వీవే ఈశ్వరా 
ప్రభావమ్ము నీదే ఈశ్వరా 
సహాయమ్ము వీవే ఈశ్వరా 
సమాధాన మీదే ఈశ్వరా 

వినోదమ్ము వల్లేను వివాహం మహేశా  
మనోనేత్ర మళ్లేను మహానేత్ర మహేశా    

సహాయమ్ము పొందే అవకాశం మహేశా 
అహమ్మేమి లేదే వర దాహం మహేశా 
మొహమ్మేను కాదే సమదేహం మహేశా 
విహారమ్ము పోదాం అభిమానం మహేశా 

సుశైలేంద్ర వీవే ఈశ్వరా 
శుదర్మేంద్ర నీవే  ఈశ్వరా 
శుభాకార వీవే ఈశ్వరా  
శుభాకాంక్ష నీకే ఈశ్వరా 

విధానమ్ము తెల్పే ను వివేకం మహేశా 
నిదానమ్ము గానే విని పించే మహేశా 
సదానమ్ము నీదే వస పొందే మహేశా 
ప్రధానమ్ము నీవే ‌‌ను ప్రమోదం మహేశా   

ప్రధానమ్ము వీవే ఈశ్వరా 
ప్రభావమ్ము నీదే ఈశ్వరా 
సహాయమ్ము వీవే ఈశ్వరా 
సమాధాన మీదే ఈశ్వరా 

అకాలమ్ము కాదే సహనమ్మే మహేశా
సకాలమ్ము ఉందే ‌‌సమ ర్ధత్వం మహేశా
వికాసమ్ము ఉందే అభిమానం మహేశా
రకాలన్ని చూపేను రరామం మహేశా

సుశైలేంద్ర వీవే ఈశ్వరా 
శుదర్మేంద్ర నీవే  ఈశ్వరా 
శుభాకార వీవే ఈశ్వరా  
శుభాకాంక్ష నీకే ఈశ్వరా 

ప్రభావమ్ము వల్లే ‌‌‌‌‌ప్రయాణమ్మె మహేశా
సభా ప్రాభవమ్మే ను సమానామ్ మహేశా
ముభావమ్ము వల్లే సమూలామ్ మహేశా
ప్రభావమ్ము వెల్గే ప్రసాదం మహేశా

ప్రధానమ్ము వీవే ఈశ్వరా  ప్రభావమ్ము నీదే ఈశ్వరా 
సహాయమ్ము వీవే ఈశ్వరా సమాధాన మీదే ఈశ్వరా 
సుశైలేంద్ర వీవే ఈశ్వరా శుదర్మేంద్ర నీవే  ఈశ్వరా 
శుభాకార వీవే ఈశ్వరా  శుభాకాంక్ష నీకే ఈశ్వరా 

ఆధారం .య.య.య.య.8
00000
నేటి గీతం - రాజ్యం
ప్రాంజలి ప్రభ -- మల్లాప్రగడ రామకృష్ణ 
వందేమాతరం .. వందేమాతరం ... వందేమాతరం 

సుఖానికి మూలం ధర్మం
ధర్మానికి మూలం అర్ధం 
అర్ధానికి మూలం అర్ధాంగి 
అర్ధాంగికి మూలం రాజ్యం 

రాజ్యానికి మూలం ఇంద్రియం 
ఇంద్రియానికి మూలం వినయం 
వినయానికి మూలం వృద్ధ సేవ 
వృద్ధసేవకు మూలం విజ్ఞానము 

విజ్ఞానమునకు మూలం సంపాదన 
సంపాదన కు మూలం ఆత్మ తృప్తి
ఆత్మతృప్తికి మూలం ఓర్పు లాభం 
ఓర్పులాభానికి మూలం ప్రకృతి వరం 

ప్రకృతి వరానికి మూలం క్రమశిక్షణ 
క్రమశిక్షణ కు మూలం సూర్యోదయం
సూర్యోదయానికి మూలం కాలచక్రం 
కాలచక్రానికి మూలం విధాత సృష్టి 

విధాత సృష్టి కి మూలం ఆదిపరాశక్తి 
ఆదిపరాశక్తి కి మూలం సర్వాంతర్యామి 
సర్వాంతర్యామి కి మూలం ప్రేమతత్వం 
ప్రేమతత్వానికి మూలం నమ్మకత్వమే         
--((*))--

****
*ప్రాంజలి ప్రభ నేటి సరస సంభాషణ గీతం  
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   

సాంఘీకంగా కధలను పోల్చగా 
సామాన్యంగా నిజమును తెల్పగా 
స్నేహంగానే  కళలను  తీర్చెగా 
ఆనందంతో అలకను మార్చెగా 
 
ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   

సంధానం గా అణుకువ చూపెగా 
మేధస్సంతా తెలుపుచు ఉండెగా  
శక్తీ నంతా  కలలతొ పూడ్చగా  
మౌనంగానే ఒకటవ టానికేగా  

ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   

సమ్మోహంగా కణతలు విచ్చెగా 
ప్రాధాన్యంగా పలుకులు  పల్కెగా  
ప్రాభావంగా విలువలు పెంచెగా  
వ్యత్యాసంగా వలపులు చూపెగా 

ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   
     
పాఠాలన్నీ వరుసగ చెప్పగా  
సమ్మోహంతో మనసును పంచె గా 
సంతోషంతో ఒకరిగ మార్పుగా    
కొర్కళన్నీ మనసుతొ  తీర్పుగా 

ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   

ఆధారం:  UUUU-IIII-UIU 

--((*))--



ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 


ప్రాంజలి ప్రభ  (8 )

మేఘాలు దట్టంగా కమ్ముకొని 
ఒక్కసారి వర్షం కురిపించి 
గుర్తుచేస్తున్నాయి

అకాలపు వరద పొంగు గమనాన్ని 
చూడగా స్త్రీల కన్నీరు భాదలు  
గుర్తుకొస్తున్నాయి

మంచుకొండలు ఎర్రబారటాన్ని
ఏరులా కరిగి బోతూ 
గుర్తుచేస్తున్నాయి   

గద్దల మూకమ్ముడి గమనాన్ని  
చూడగా రక్తపు కళేబరాలు
గుర్తుకొస్తున్నాయి 

ఎగసి పడుతున్న కెరటాల్ని 
చూడగా ముష్కరమూకల దాడులు  
గుర్తుకొస్తున్నాయి

దొంగదెబ్బ చేసి శాలువా కప్పటాన్ని 
వెర్రి వెంగళప్ప చేసే చేష్టలు  
గుర్తుకొస్తున్నాయి

కొవ్వొత్తిలా వెలుగు పంచి కరిగి పోటాన్ని
శ్రీ కృష్ణ భగవానుని బోధలు 
గుర్తుకొస్తున్నాయి

బిడ్డల కోసం పుడమి తల్లి రక్తాన్ని 
చిందిస్తూ ఘోషిస్తూ విలపించటం 
గుర్తుకొస్తున్నాయి

ఆత్మలు పరిబ్రమిస్తూ చిత్రాలలో 
మనో హృదయలలోచేరి 
గుర్తు చేస్తున్నాయి 

గతం గత: అనుకోవటం ఎందుకు 
భవిషత్తు పూలబాట కదనుకోవటం ఎందుకు 
వర్తమానంలో గుర్తు చేస్తున్నాయి 
--((**))-

ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (7 )

వందనమ్ములు పలుకు తున్నా భాషామ తల్లికి 
వందనమ్ములు పల్కుతున్నా పండిత పామర్లకి   
వందనమ్ములు గురువు తల్లి తండ్రు లందరికి  
తెలుగుభాషను బ్రతికించమని కోరుతున్నా  

ప్రతిదినమ్ము నాకు భాషోత్సవంబుగ నుండునే   
ప్రతిదినమ్ము వరమె, కలో తెలియకుండెనే  
ప్రతిదినమ్ము శ్రీకరమ్ముగఁ గొలుచు చుండెనే  
ప్రస్తుతించుచుండి భాష పద కరుణ దయలే  . 

తెలుఁగు వెలుఁగుఁ బంచి దేశదేశమ్ములఁ యందు  

దలిఋణమ్ము దీర్చి ధన్య జీవి అవ్వాలి ముందు  
శ్రీమాత పితల భాష బ్రతికించు సత్య ముందు  
వలయునట్టి ప్రేమ పెంచు భాషాభివృద్ధి యందు  

తీయనగుచు వినఁగ హాయి గూర్చెడి తెలుగు 

తాయి పలుకు భాష తనివినిడును తెలుగు  
శ్రేయమిడెడు నాకుఁ జెప్పలేనంత వెలుగుగా  
చదువి వ్రాయఁట యందు హాయి నొసగు తెలుగు  

ప్రాంజలి హాస్య గీత ప్రభ - గణతంత్ర దినోత్త్సవ సందర్భముగా 
 
ఒక్కసారి విను--ఒక్కసారి విను--ఒక్కసారి విను
ఒక్కసారి విను ఒక్కమాట మాటవిను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
ముద్దు వద్దు అంటూ ముద్దు చేస్తావా 

ధనాన్ని చూస్తే ఎవరికైనా - బుద్ది చంచల మౌతుంది 
శెవాన్ని చూస్తే ఎవరికైనా  - బుద్ది వేదాంత మౌతుంది
స్త్రీ వేషాన్ని చూస్తే ఎవరికైనా - బుద్ధి ఆలోచన మారుతుంది  
యువతి కళ్ళు చూస్తే ఎవరికైనా - బుద్ధి ఎదో తెల్పాలనిపిస్తుంది

ఒక్కసారి విను--ఒక్కసారి విను--ఒక్కసారి విను
ఒక్కసారి విను ఒక్కమాట మాటవిను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
ముద్దు వద్దు అంటూ ముద్దు చేస్తావా 
 
పౌర్ణమి వన్నెల చూస్తే ఎవరికైనా  - కలలు నిజం చేసుకోవాలనిపిస్తుంది        
అమావాస్య చీకటిని చూస్తే ఎవరికైనా - తెలియని మైకం కమ్ము కుంటుంది 
తలఎత్తి పైకి చూస్తే ఎవరికైనా - కళ్ళను కమ్మే వెలుగు కనబడుతుంది
చుక్కలతో చంద్రుని చూస్తే ఎవరికైనా - మనసు తన్మయత్వం చెందుతుంది 

ఒక్కసారి విను--ఒక్కసారి విను--ఒక్కసారి విను
ఒక్కసారి విను ఒక్కమాట మాటవిను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
ముద్దు వద్దు అంటూ ముద్దు చేస్తావా 

కమనీయ ప్రకృతి చూస్తే ఎవరికైనా - నయనాలు వెలుగు చిమ్ముతుంది
అనుకోని సంఘటన చూస్తే ఎవరికైనా - హృదయం గగుర్పాటు చెందుతుంది 
పరువాల పిల్లల్ని చూస్తే ఎవరికైనా  - నోటిలో జిల్లాలు ఊరి హాయిగుంటుంది 
పిటపిట లాడే పిరుదులు ఎవరికైనా -- ఊపుతూఉంటే వళ్ళు  ఝల్లు మంటుంది 
   
ఒక్కసారి విను--ఒక్కసారి విను--ఒక్కసారి విను
ఒక్కసారి విను ఒక్కమాట మాటవిను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
ముద్దు వద్దు అంటూ ముద్దు చేస్తావా 

--((*))--



ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (6 )

మనస్సు రంజిల్లఁ పరచి 
మనో నిగ్రహాన్నిపెంచేటి
తలచినంతనే తన్మయత్వం 
కల్గించి శాంతిని పంచేటి 
తీపి నొందించు పీయూష 
తేనెలొలుకు తెలుగు భాష 

చదివినంతనే మదిలో మెదిలి       
హృదయాన్ని ఆనంద డోలికలో 
ఉంచి దివ్య కావ్యాభిరుచి
కల్పించే తెలుగు భాష 

అమ్మ పాలు రుచి ఉండగా    

దాది చెంత పాలు త్రాగ నేలా 
తెలుగు భాష తీయగా నుండగా 
పొరుగు భాష చెంతకు పోవనేలా 

చీకట్లో కలసి పొయ్యేది కాదు 

చిరుదీపమై వెలుగు నిచ్చేది భాష 
అణగద్రొక్కి పైకెక్కాలని అనుకోనిది కాదు
స్వయం కృషితో ఎదగాలనుకొనే భాష  

కవి సమూహములందు కాళిదాసు లెస్స 

కోటలందు కొండపల్లి కోట లెస్స    
నగరులందు అమరావతి లెస్స 
దేశభాషలందు తెలుగు లెస్స 

--((**))--


ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (5 )

తెలుగు వీర లేవరా

దీక్షపూని సాగరా  
తెలుగు మాత స్వేశ్చ కోరి
ఉద్యమం చేయరా

అంగ్లమా నీకు జోహార్ 
అంగ్లమా నీకు జోహార్
వేదభూమిని కలుషితం చేసావు 
మాతృభూమి రూపు రేఖలు మార్చి వేశావు 
విపరీత ధోరణి తో నష్టాలే కల్పించావు 
ఆశలు చూపి మొదటికే మోసం చేస్తున్నావు 

మూడేండ్లకే పిల్లలకే ధనం కోసం 

ఉద్యోగరీత్యా తల్లి తండ్రులు ప్రేమను పంచక 
తెలుగునొదలి ఆంగ్లమే గొప్పని చేరుస్తున్నారు  
ఎప్పుడు మారుతుంది ఈ వ్యవస్థా 
ప్రభుత్వమే ఉచిత భోధనతో అనేక 
సౌకర్యాలు కల్పిస్తే ఎందుకు చేర్చరు
తెలుగు భోదనా పద్ధతిలో        
    
అమ్మ భాష వదలి ఆంగ్లభాషను 
చూసి సంబరపడి కాలం ఎప్పుడు మారుతుంది 
తెలుగు భాషాసంస్కృతి సాంప్రదాయం 
సంగీత సాహిత్యాభివృద్ధికి ప్రతిఒక్కరు కృషి చేస్తే 
తేనెలొలుకు తెలుగు భాష వెలుగు సిద్ధికి 
మహర్దశకు ఉద్యమం చేయరా 

తెలుగు వీర లేవరా

దీక్షపూని సాగరా  
తెలుగు మాత స్వేశ్చ కోరి
ఉద్యమం చేయరా
--((**))--


ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 

ప్రాంజలి ప్రభ  (4 )

చెడు చూడకు ఎందుకంటే 
చెడు వినకు ఎందు కంటే 
చెడు అనకు ఎందు కంటే 
నీవు నీచుట్టువారు బతకాలికదా

చెడు చూస్తె కనబడు ప్రత్యక్ష నరకం

చెడు వింటే జోరీగ దుష్ట శంఖారావం 
చెడు అంటే మటు మాయం సర్వసుఖం 
అందుకే నేనంటా నిగ్రహ శక్తి ఉండి నీవెంట  

చెడు చూసిన నిలవదు నీ మనసు

చెడు విన్న పరుగేట్టు నీ మనసు 
చెడు అన్న ఉండనీయదు మనసు 
అందుకే నేనంటా నీది కాదు మనసు 
మరో కరికి అర్పించాక ఉండదు హక్కు 
  
చెడు చూసిన నీలోపెరుగు అజ్ఞానం 
చెడు విన్న నీలో పెరుగు అసత్యం 
చెడు అన్న నీకు పోవు నిజ స్నేహం 
అందుకే నేనంట విజ్ఞానం 
సత్యం స్నేహం ఉండాలి నీవెంట  

అందుకే మన మాతృభాషను నమ్ముకో 
అదే నిన్ను అందిపించి బ్రతికిస్తుంది 

--((**))--


ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (3)

అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్
తెలుగు కెంత కష్టం వచ్చింది  
ఏమి చిత్రం ఏమి విచిత్రం
తెలుగు భాషకు ఎంతో నకష్టం 

చేదు బాబోయ్ వద్దు బాబోయ్

అందదు ఆంగ్ల విద్యలో సరైన భావం   
ఏమి తంత్రం ఏమి కుతంత్రం
తెలుగు భాషకు తెచ్చిన మంత్రం 
  
నమ్మ లేనోయ్ నమ్మ వద్దోయ్
తెలుగు బాష తప్ప అన్య భాష
నమ్మ మిత్రం నమ్మే అమిత్రం
తెలుగు భాష మిత్రం, ఆగ్లం అమిత్రం  

మంచి లేదోయ్ చెడు వుందోయ్

అర్ధం చేసుకోలేని భాష ఆంగ్లం  
లేదు శాంతి లేదే విశ్రాంతి
ఆంగ్ల చదువుల్లో  అంతా బ్రాంతి 

కాల ముందోయ్ నమ్మ వద్దోయ్ 
ఆంగ్లంలో లేదు జ్ణాణం లేదే విజ్ణాణం
గీత నీదోయ్, గురు బోధోయ్
తెలుగే కాలం తెలుగే నిత్య సకాలం

నమ్మ లేనోయ్ ఉండ లేదోయ్

కళ లేదు కల లేదు ఆంగ్లంలో 
మంచి బుధ్ధి మంచి కార్యం
చేసే జీవితం తెలుగులో ఉందోయ్

--((**))--

ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (2)

తెలుగు జాతి మనది 

నిండుగ వెలుగు జాతి మనది
ప్రాంతాలు భేధము లేనిది
ఆంధ్రుల ఆరాధ్య భాష ఇది

అంధకారంలో పడిపోతున్నది

వేలుగులా తెలుగును పంచాల్సి ఉంది
ఇది జాతి మత కుల భేధం లేని భాష ఇది
జాతీయ అంతర్జాతీయంగా వ్రృధ్ధిలోనికి తేవాల్సినది

నిజం నిలకడగ తెలప గలిగేది

పుకారు ప్రవాహంగా పరుగెత్తించేది
స్నేహం బలంగా నిలప గలీగేది
పగని మార్చి ప్రేమను పెంచే జాతి ఇది

ఓటమిని గెలుపు మార్చగలిగేది

నమ్మకాన్ని కల్పించి అందర్ని కలిపేది
సమస్యల పరిష్కారం చూపగలిగేది
ఆత్మవిశ్వాసం కల్పించే తెలుగు జాతి ఇది 


--((**))--



ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

కవితలు వ్రాద్దామనుకున్నా  
ఆదరించేవారిని ఆత్మీయతతో పిలుస్తున్నది.
రచయత: మల్లాప్రగడ  రామకృష్ణ   
ప్రాంజలి ప్రభ - (1)
  
బాబూ వినరా, పాప వినరా 
మన తెలుగు భాషలో చదివారా 
అదే నీ తల్లి భాషరా
దీనిని మించినదీ లోకంలో ఏదీ లేదురా 

అమ్మా నాన్నా అని మనసారా పిలవరా 

పిలుపులో ఉన్న ఆత్మీయతను గమనించరా
ఆమ్మ నాన్న స్నేహితుడిలా ఆదుకునేది తెలుగురా 
ఆద మరచి తెలుగును చులకన చేయకురా

కడు హీన స్థితిలో నుంది మాతృభాష చూడరా

కన్నీరు కార్చుతున్నది తెలుగు తల్లి కనుమూరా 
నేటి యువజంటన్నా కళ్ళు తెరచి ఉండాలిరా

తమిళ, మరాఠీ, కన్నడల తపన వెళ్లి చూడరా 
తరతరాల నుండి తల్లి హష భక్తులైయున్నారురా 
తల్లి భాషలో చదవలేని ఆంధ్రులు ఎందుకురా
తెలుగుభాషను ఉద్దరించలేని తనయులున్నా దండగరా     
జీవంలేని జీవిలా భాషరాని మొద్దులా ఉండకురా 

తెలుగుభాషను వృద్ధి చేయు మార్గాన్ని వెతకరా 

తెలుగు తల్లి కన్నీరు తుడిచే మార్గం చూడురా 
ప్రభుత్వం తల్లి తండ్రులే తెలుగు ప్రేమ హీనులురా 

దూరపు చదువులకోసం ఆత్మీయతకే కరువౌ తున్నారురా 

ప్రభుత్వం వారు కంటినీరు తుడుపులా ప్రవర్తిస్తున్నారురా 
ఆదిలోనే ఆంగ్లం వద్దని అనేవారు కరువయ్యారురా 
కూడు అమ్మ భాష పెడుతుంది ఆంగ్లం పెట్టదురా
మాతృ భాష వల్లనే మన సంస్కృతి బతుకునురా 
మన వేదపురాణాలు యితిహాసాలు చదవాలిరా  

బాబూ వినరా, పాప వినరా 

మన తెలుగు భాషలో చదివారా 
అదే నీ తల్లి భాషరా
దీనిని మించినదీ లోకంలో ఏదీ లేదురా 
--((**))-- 


మీ అభిప్రాయాలు కుడా తెలియ పరచండి 

తెలుగు భాష ప్రతికించుటకు ముందుకురండి


కాళిదాసు గర్వభంగం


మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.


మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.


బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.


ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.


ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది.


నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...


‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు:


‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?


పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.*


అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...


‘మీరు అసత్య మాడుతున్నారు.


ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.


వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.


అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...


‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.


ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు.


అయినా ఆ బాలిక కనికరించదు.


‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’


అని అడుగు తుంది. బాలిక.*


‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు.


‘మళ్లీ అసత్య మాడుతున్నారు.


బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.


మీరేమో అలిసి పోయారు కదా.


ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.


వారే సూర్యచంద్రులు!’


అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.


దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి..


‘మాతా నీళ్లు ఇవ్వండి.


దాహం తో చనిపోయేలా ఉన్నాను..’ 

అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.

లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...


‘మీరెవరో సెలవివ్వండి...


నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా...


‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు.*


‘మీరు అసత్యం చెబుతున్నారు.


ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.


ఒకటి ధనం, రెండోది యవ్వనం.


ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది.*


కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు.*


కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.


ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.


ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.


ఓపిక నశించిన కాళిదాసు..


‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు.


ఆ అవ్వ నవ్వుతూ...‘


ఇదీ అసత్యమే.


ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.


ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.

ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది.

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.*


*ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. _


ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది._


‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!


కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’అని జలమును అనుగ్రహిస్తుంది


--((**))--




అదృష్టం ఆదమరిస్తే - దరిద్రం దారిచూపు

ఒంటరిగా చావాలనిపిస్తే - ప్రేమ కూడా దారిచూపు

విలయం తాండ విస్తే - వినయం దారిచూపు

వికాసం వెంబడిస్తే - విజయం దారిచూపు

అర్ధం కోసం అనర్ధంచేస్తే - శక్తిని తుంచే దారిచూపు

నిరాశావాదానికి వస్తే - చేసే కర్మలు దారి చూపు

బలహీనత వెంబడీస్తే - బావుటా దారిచూపు

ఓటమి వెంబడిస్తే - వికృతి దారిచూపు

లెక్కకు ధుఖం వస్తే - కన్నీరు దారిచూపు

లెక్కకు పాపం చేస్తే - గత దానం దారిచూపు

లోకం నిద్రలేకుండా చేస్తే - సముద్రం దారిచూపు

నీడ అంద్దంలా వెంబడిస్తే - తికమకే దారిచూపు

ఓటరుని ముంచి వేస్తే - ఆశలు దారిచూపు

కారు వేగము పెంచేస్తే - కాటికి దారిచూపు

--((**))--



కొలవలెను నీ సొగసు సుకుమారాన్ని

హృదయంలో దాచిఉంచలేను సోయగాన్ని
వర్ణించి చెప్పలేను ముచ్చటైన భావాల్ని
చెప్పలేకున్నాను ముద్దులోని మహత్సాన్ని

పెదవులకు పదవులను కట్టిన వైనాన్ని
మెరుపుల సందడిలో దాగిఉన్న మోనాన్ని
కలిసిన చిత్ర విచిత్ర సొబగులు సౌరభాన్ని
చెప్పలేను రెప్పల మాటున దాస్తోగిన అందాన్ని

--((***))--


--((***))--

 చిన్నది

నేను రయ్యమని వస్తే 
ఖంగు తినకు శాస్త్రీ 
నాతో పెట్టు కుంటే
నలిగి పోతుంది ఇస్త్రీ

నాకోసం ముందే వచ్చే
బుర్ర మీసాల మేస్త్రీ
నేను కనుక చేయ్ వేస్తే
తప్పక మారు సాల్తీ

నీకండలకు వయసుకరిగే 
నా మనసు దాచి ఇస్తా
ఒక్క సారి నావంక చూస్తే
ఒకటికి ఒకటి ఫ్రీ ఇస్తా 

నేను చిలకలూరి పేట
చింతలు తీర్చె శింతామణి
మారుతుంది నీ లైఫ్  హిష్టరే
నెచెయ్ వేస్తె నీలైఫ్ బ్లాకు బష్టరే

--((**))--


--((***))--రూపాయి కన్నా రూపం గొప్పది
వేల కన్నా వినయం గొప్పది
లక్షల కన్నా లక్షణం గొప్పది
కోట్ల కన్నా కరుణ గొప్పది

బాల్యం ఉడుకు మాట గొప్పది
యవ్వనం ఉడుకు ప్రేమ గొప్పది
వృధ్ధాప్యం  బిడ్డల విద్య గొప్పది.
వానప్రస్థం మనః శాంతి గొప్పది

ఆశ కన్నా ఆకలి గొప్పది
ఊహ కన్నా ఊపిరి గొప్పది
మేను కన్నా మాట గొప్పది
మతి కన్నా మోనం గొప్పది

మబ్బు కన్నా మేఘం గొప్పది
నేల కన్నా పంట గొప్పది
ఆత్మ కన్నా గాలి  గొప్పది
అగ్ని  కన్నా దైవం గొప్పది


--((**))--


Ilustraciones realizadas para Hermano Gato, mi marca de láminas decorativas e ilustraciones personalizadas por encargo. Para conocer más puedes visitar: www.hermanogato.com
వేదోద్ధారణ సేసినదెవరు?
 విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాదోపాసన మెచ్చెడిదెవరు?
నాట్యానందము నొందెడిదెవరు?

ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా

ఆధారంబయి యుండెడిదెవరు?
అక్షీణంబుగ మించెడిదెవరు?
లేదన్నట్టిది పల్కనిదెవరు?
 ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా


అంతా తానయి నిండెడిదెవరు ?
 ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ?
శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా


కాంతిన్‌ గుండెల నింపెడిదెవరు?
 కంటిన్‌ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్‌ గూర్చొని పల్కెడిదెవరు?
 స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?

ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా


బోధన్‌ జేయుచుఁ దెల్పెడిదెవరు?
ముక్తన్‌ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు?
నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా


నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు?
నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
నీ దైవంబుగ నిల్చినదెవరు?
 నీవే నేనని యన్నది యెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా

--((***))--
ఓ అబలా మేలుకో!! 

నాడు సతీసహగమనం పేరిట 
సజీవ దహనం చేసి 
పైశాచికానందంతో 
కరాళ నృత్యం చేసిన 
నర రూప పిశాచాలనూ 
క్షమించిన క్షమాగుణం నీది 

పెనిమిటి పొయాడన్న నెపంతో 
నీ కెశాలని తీసి నిన్ననాకారిని చేసి 
శిరోముండనం చేయించి ఏకవస్త్రం కట్టించి 
చీకటి గదిలొ బంధించి 
అపశకునానికి చిహ్నానివని 
అవహేళన చేసి అవమానించినా 
అసుర సమాన అహంకార పూరిత జాతినీ 
క్షమించిన క్షమాగుణం నీది 

కన్యాశుల్కం నాడు 
కన్నవారి ధనదాహానికి బలై 
ఈడుజారి కాడుజేరే వగ్గులకు 
నిన్ను అమ్ముకున్న ఆ స్వార్థపరులనూ 
క్షమించిన క్షమాగుణం నీది 

నేడు వరకట్నం కోసం 
అత్తారింటి వారి ధనదాహానికి బలైపోతూ 
ఆరళ్ళను పెట్టినా ఆడిపోసుకున్నా 
అగ్నికాహుతి జేసినా 
హలాహలాన్ని మింగిన పరమ శివునిలా 
బాధని గుండెల్లో దాచుకుని వారినీ 
క్షమిస్తున్న క్షమాగుణం నీది 

కాలం యేదైనా వ్యవస్థ యేదైనా 
రూపం యెదైనా అన్యాయమయ్యేది 
బలైపోయేది నీవైనా... ఎదురు మాటాడక 
మౌనంగా భరిస్తూనే వున్న సహనమూర్తివీవు 

పురుషాహంకారంతో నీ స్త్రీ జాతినీ 
రూపుదిద్దుకోక ముందే 
కడతేర్చాలని చూస్తున్న 
అమానుషాన్ని మౌనంగా చూస్తూ క్షమిస్తున్నావ్ 

తిరిగి తిరిగి పురుషాహంకారానికి 
జన్మనిస్తున్నావ్ తల్లివై మమకారం 
పంచి పోషిస్తున్న నీక్షమాగుణానికి 
జోహారులు 

ఎన్నాళ్ళు ..........ఇంకెన్నాళ్ళు......... 
ఏ జంతు జాలంలొనూ కనరాని అమానుషం 
నా నరజాతి ఆడజాతి కే అడుగడుగున అన్యాయం 
నేత్రాలలొ రోషాగ్ని రుధిరజ్వాలల నింపుకుని 
పురుష జాతి కబంద హస్తాల నుండి 
విముక్తి పొంది.....నువ్వో అపరకాళివై 
శివమెత్తి భావితరాల నీజాతి 
బానిసత్వానికి విముక్తి కలిగించుకో!! 

--((***))--

Bala Thandapani, Murugan Statue Holding Staff-http://www.lotussculpture.com/muruganwargod.htm
ఓ కాలమా ఏమిటి పరిస్థితి 
నన్ను నేను తెలుసుకోలేని స్థితి 

నాకు తోడు  ఉంది ఓక ఇంతి 
దాని మనస్సు తెలుసుకోలేని స్థితి 
నా ఆలోచన ఒక కొలిక్కి రాని స్థితి 
సమయస్పుర్తిగా తెలుసుకోలేని గతి 

నిజం నిప్పు లాంటిది 
అది చెప్పిన తప్పే, చెప్పక పోయినా తప్పే 
ధనం ఆశ లాంటిది 
అది ఉన్న గొప్పే, లేకున్నా ముప్పే  

ఇరువురు కలిస్తేనే సృష్టి 
ఆకర్షణ, వికర్షణలు తప్పవు 
మనిషి వేస్తాడు కొన్ని తప్పటడుగులు 
తెలియక వేస్తె కష్టం, తెలిసి వేస్తె పాపం 

మతం చలవే జీవితం  
ఆదరిస్తే సుఖం, నిరాకరిస్తే నరకం 
ధనంలో లేదు జీవితం 
ప్రేమను పంచి, పొందటంలో ఉంది 

దొంగలకు పాలకులకు నిద్ర ఉండదు
ఉన్నది దోచుకోవటం, అందరిది పంచటం 
వయసు మార్పుల్లో ఉంటుంది ఆ సక్తి     
వ్యసనంగాను, మరోవైపు ఆద్యాత్మికంగాను 

మంచికి, ధర్మానికి  విలువ లేదు
తలవంచి లేదా, తలయెత్తి మాట్లాడినా తప్పే 
మనిషి మనిషిగా గుర్తింపు లేనిచోట 
ఏది చెప్పినా అది తెప్పే, ఒప్పును గుర్తించరు   
  
ఓ కాలమా ఏమిటి పరిస్థితి 
నన్ను నేను తెలుసుకోలేని స్థితి 


--((***))--


చుక్కలో చుక్కనై
చిక్కల్లో చక్కనై
చంద్రుడిలో మచ్చనై
చమత్కార చరితనై
నా వయసుకు తగ్గ వరుని కోసం వేటనై

చదరంలో తునకనై
చరితంలో కథనై
చూతుర్య సుహాసినై
చాపల్య దాసినై
చాతుర్యంతో వరున్ని పొందు కోసం వేటనై

చలంలో చిక్కెి
చామంతి పువై
చల్లకు కరువై
చల్ల దనానికి లోకువై
చల్లని చల్లను పంచే వరుని కోసం వేటనై

చూపులకు బరువై
చూపరులకు కరువై
చేతులు రాకయై
చేప కన్నులయై
చేప కన్నులతో వరుని కోసం వేటనై

నీటిలో రుచిగా నేనై
సూర్యచంద్రలలోన కాంతిని నేనై
ఆకాశంలో శబ్దాన్ని నేనై
వేదాలలోని ప్రణవాన్ని నేనై
నరులలో పౌరుషాన్ని నేనై

నేనై నేనై అని ఆలోచిస్తున్నారా
అదే అంతరాత్మ ప్రేమగా
అందరిలో వ్యాపించిఉన్న
భగవంతుని లీల అదే ప్రేమ హేల


--((***))--



ఆనాడు ముఖవర్ఛస్సు చూసి
సోది రూపాన న్యాయం జరిగె
ఆకాశవాణి, దూర్వాణి ద్వార
ధర్మబద్ధంగా నిర్వాహణ జరిగె

వేదాల అర్ధాలను అందరికీ అందచేసి
మన:శాంతి, మనోసంకల్పం కలిగె
నేడు అంతర్జాల మహోజ్వల వెలుగు
ప్రాంజలిప్రభ గా రూపాంతరం జరిగె

పత్రికా స్వేస్చను రక్షించటం
ధ్యేయంగ నిర్వహిస్తున్న ప్రభ
సూర్యుని వెలుగలా చీకటి
తరిమి వెలుగును నింపుటే
ధర్మాన్ని నిలబెట్టడం మా ధ్యేయం
ఎవ్వరికి తలవంచం
ధర్మం, సత్యం , న్యాయం
నిలబెట్టుటకు శాంతిని కల్పించుటకు
ప్రజల పక్షమే ఉండుటకు
ప్రాంజలి ప్రభ ఉంటుంది నిత్యం

ఇష్టం తో పని చేస్తుంటాం
కష్టాలను ఓర్చి నిజాన్ని నిలబెడతాం
వేతనాలు ఆశించక ధర్మ
ప్రచారం కోసం, నిరంతరం
ప్రజలనుద్దేశించి వ్రాయటం
నీతికి నీడగా‌, న్యాయానికి అండగా
ధర్మానికి సాక్షిగా ఉండుటే మా ధ్యేయం

అధర్మాన్ని ఎదిరించి
న్యాయ పక్షాన నిలబడతాం
ఎవర్నైన నిలదీసి ప్రశ్నిస్తాం
నిజాన్ని రాబడతాం
నిర్భయంగా చూపిస్తాం
ప్రజల పక్షాన నిలబడతాం
అదియే మాలక్షం. మా ధ్యేయం
మా అభిమానం మీ పక్షం
ప్రాంజలి ఘటిస్తూ తెలియపరుస్తూ
మీవెంటే ఉంటుంది ప్రాంజలిప్రభ
సర్వేజన సుఖినోభవంతు
ఓం శ్రీ రాం, శ్రీ మాత్రే నమ:
ఓం శాంతి: శాంతి: శాంతి:
***********

roeu
ఓ కాలమా ఏమిటి పరిస్థితి 
నన్ను నేను తెలుసుకోలేని స్థితి 

సూర్యున్ని చీకటి అడిగింది
మనం ఏనాటికీ కల్సికోలేమా 
చంద్రున్ని వేకువ అడిగింది 
నేను వస్తూ ఉంటే కల్సుకోలేవా 

పువ్వు మొగ్గను అడిగింది
నేను వచ్చాక నీవుకానరావేమి    
కాయ పువ్వు నడిగింది  
నేను ఎదిగిన కొద్దీ రాలిపోతున్నావేమి 

సముద్రం తీరాన్ని అడిగింది 
అఘాతంనుండి వచ్చినా కౌగాలిన్చుకోవేమి 
విధ్యుత్ వైరును అడిగింది 
వెలుగును పంచుతుంటే నన్ను తాకరేమి 

యవ్వనం బాల్యాన్ని అడిగింది 
నేను వచ్చాక నీవు కానరాలేదేమి 
వృద్ధాప్యం యవ్వనాన్ని అడిగింది 
ఇప్పుడు నీవు కాన రాక పోతున్నావేమి 

నిన్న అనుబంధాలు నేడు కానరాకున్నాయి 
నేటి అనురాగాలు రేపటికి ఉంటాయో లేవో 
అనుబంధాలు అనురాగాలు మనసుని తాకుతాయి
ప్రేమను ఎలాతెల్పాలి, బంధాన్ని ఎలానిల్పాలి 

ఓ కాలమా ఏమిటి పరిస్థితి 
నన్ను నేను తెలుసుకోలేని స్థితి 


--((***))--


స్త్రీ అంటే ప్రగతి, జగతి జాగృతి
పురుషుడంటే జ్యోతి, జగతికి దివ్య జ్యోతి
స్త్రీ అంటే మాతృ మూర్తి, మానవతా మూర్తి
పురుషుడంటే స్నేహసహకార ఆదర్శ మూర్తి

నిత్యమూ సవాళ్ళను ఎదుర్కోవడం మగతనం
బడబగ్నినైన చల్లబరిచే హృదయం ఆడతనం
మాటల్లో వికసించే పురుష హావాభావం
చిరునవ్వుల సొగసు స్త్రీ సహజ స్వభావం

నలిగిన వేల వివేకం చూపే స్త్రీ తత్త్వం
విజ్ఞతతో ఆదుకొనే సహజ పురుష తత్త్వం
బ్రతుకు తెరువు నిత్య పోరాటం స్త్రీ మయం
సంపాదన, మమకారపు ఆరాటం పురుషమయం

స్త్రీ పురుషులలో ఉండు మానవత్వం
స్త్రీలో చక్కని సౌందర్యం గల ఆకృతి
పురుషుల్లో చాతుర్యం గల ఆకృతి
కష్ట నష్టాలలో జీవనయానం సమానం
--((*))--


Kite can fly 

 నీ నవ్వుల వానకు
వెన్నెల తోడవుతుంది
నీ తలపుల జల్లుకు
చల్లని గాలి తోడవుతుంది


నీ జ్ఞాపకాల వెల్లువకు
కోరిక తోడవుతుంది
నీ మౌనపు చూపుకు
మమత తోడు వుంటుంది


నీ ముద్దుల మాటలకు
కోకిల తోడవుతుంది
నీ పావడా విసురుకు
ప్రకృతి తోడవుతుంది


నీవలపుల తలపుకు
బుధ్ధి తోడు వుంటుంది
నీ ఆశల పరుగుకు
అడుగు తోడవుతుంది


నీ నిద్దుర మత్తుకు
కల తోడవుతుంది
నీ లేత పెదవులకు
మధువు తోడవుతుంది


నీ ఆలోచనకు
మెరుపు తోడవుతుంది
నీ ఆలాపనకు
మనసు తోడవుతుంది

--((***))--

వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం

మురళీ గాణలీల మాధుర్య మకరంద
రవళీ మోహలీల ఆకర్ష సుఖనంద
సరళీకృత మోక్ష తన్మాయ లతనంద
నవనీతాశ ప్రియ మోహాల వలనంద

పలుభావాల రాగ సంతృప్తి ముఖనంద
పలువేషాల తాప చిన్మాయ రమనంద
సుఖలాలిత్వ సేవ తన్మంత్ర అభినంద
మనసావాచ ప్రీతి కల్పించే సఖి నంద

కరుణాశీల వాళ ఉద్భోద గురునంద
తరుణాదిత్య భావ స్సద్బోధ భగనంద
నవరాగాల ప్రేమ సంతోష లయనంద
తనువాదిత్య శోభ ఆనంద జగనంద

నవమాసాలు బిడ్డ ఆదర్శ సుఖనంద
నవభావాల పుత్ర ఆకాంక్ష సమనంద
నవరూపాల శక్తి స్వరూప చరనంద
నవలోకాల భాగ్య అందించె సుమనంద

వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం
వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం

--((**))--


ఓ నవనీతమా - ఓ ఉష్ణ తాపమా  

ఓ నవనీతమా నిన్ను మించినది లేదు 
నీలో ఉన్న తీపి, శక్తి ఎప్పటికీ మరువలేను 

ఓ ఉష్ణ తాపమా నీముందు నే నెంత 
నీ దగ్గరకు రాగానే కరగినా నిన్ను మరువలేను   

ఆదిక్కు ఈ దిక్కు కలుపుతూ ఉండే 
మంచు పర్వతాన్నివి నీవు
నన్నే ఉడికించి నీలో ఐక్యం చేసుకొనే 
అగ్ని ఆపర్వతాన్నివి నీవు 

ఆకాశంలో అందాన్ని చూపుతూ వర్షాన్ని 
కురిపించే మేఘానివి నీవు 
గాలిలా నీవు నా వెంటపడి నా 
మనసు కరగించేదాకా ఊరుకోవు నీవు 

నాతో కలసి తీపి దనాన్ని అందించి  
నన్ను ఉరికెత్తే కెరటంలా మారుస్తున్నావు నీవు   
నీకు సుఖం అందించినా నన్ను చుట్టేసి 
గట్టుదాకా తీసుకెళ్ళి చల్లగా జారుకుంటావు నీవు     

ఇంద్ర ధనస్సులా రంగులు, హంగులు 
చూపి నాకు వారధి అంటూ క్షణం ఉండిపోతావు నీవు  
చల్లని స్పర్శను కల్పించి ఆనందాన్ని 
అందించి క్షణ సుఖం సృష్టికి నంది అవుతావు నీవు 
   
అందాల పై యదతో జిలిబిలి అందాలతో  
కనులారా కమనీయ దృశ్యం చూపవు నీవు 

హృదయాన్ని సమ్మోహపరచి సంగమ 
భంగిమగా హిమ బిందువు వలే ఉన్నావు నీవు 
నీవేమి తక్కువా కిరణములా వేడిని పంపి 
సమ్మోహాపరచి చుంబించి జారుకుంటావు నీవు    

రంగవల్లిలో ముంచి మృదు మందహాసముతో 
నన్ను లోబరుచుకొని ఆధరాన్ని జుర్రిపోతావు నీవు   
ఇది మృదు లాస్యం మమతానురాగా భాష్యం 
ఇది చైతన్య మనస్సు చిద్విలాస  మమేకం 

ఓ హృదయసంగమా  ఇది ఒక రసఘంధము 
అవును ఇది ఒక మధురాను భూతి సంగమం 

ఓ నవనీతమా నిన్ను మించినది లేదు 
నీలో ఉన్న తీపి, శక్తి ఎప్పటికీ మరువలేను 

ఓ ఉష్ణ తాపమా నీముందు నే నెంత 
నీ దగ్గరకు రాగానే కరగినా నిన్ను మరువలేను   

--((*))--
ఈ కవిత మీకు నచ్చి నట్లైతే షేర్ చేసి స్నేహాన్ని పెంచుకోండి 




అమ్మ, ఆవు మనకు
కల్పించిన కల్పతరువు
ఇంతి, ఈహ మనకు
అందించిన బ్రహ్మతరువు

ఉక్తి, ఊదా మనకు
చేయూత నిచ్చిన ఆకాశతరువు
ఋతి, ఎడ మనకు
దిశను అందించిన ప్రకృతి తరువు
ఏణి, ఐతి మనకు
తెల్పిన ఐక్య భావ కల్పనా తరువు
ఒమ్ము, ఓర్పు మనకు
ప్రేరణ కల్పించిన పుడమి తరువు
--((*))--
ఇంతి = స్త్రీ , ఋ తి= శుభము, ఎడ=స్థానము ఈహ = కోరిక, ఉక్తి = మాట, ఊదా= వర్ణ విశేషము
ఏణి = స్త్రీ , ఐతి= శక్యము ఒమ్ము,=సరిపడు
--((***))--


"మాతృభాష..... 93

అమ్మా
ఆంధ్ర మాత
పాదాభి వందనం నీకు

అహర్నిశాలు నీకోసం తపిస్తున్నా
మాకు విజ్ణానాన్ని అందించిన తల్లివమ్మా
పల్లేవాసుల పాటల్లో నుడికిరానివి నీవమ్మా
మాగుండెల్లో మాటల మమకారాన్ని 
అందించావు కదమ్మా

మధురమైన యాస మా జీవితానికి 
ఉచ్ఛ్వాస నిశ్వాస కదమ్మా
సాహిత్యం తో విజ్ణాణాన్ని 
మాకు అందించావు కదమ్మా
ఈనాడు ఛెంగు ఛెంగు అని దూకే
 కోడెదూడలా తెలుగు బాష లేదమ్మా
శివంగిలా పరిగెడుతూ హ్రృదయాన్ని 
తట్టె బాషగా లేదమ్మా

అవసరానికి యెండపెట్టి 
వాడుకొనే ఒరుగులా మారిందమ్మా
వాకిలి తట్టి నిద్ర లేపే ఉదయ కిరణంలా
 తెలుగు బాష లేదమ్మా
ఆంద్ర సంస్కృతిని తవ్విపోసే పార,
 పలుగులా మారాలి కదమ్మా
బ్రతుకు తెరువుగా మార్చి
 బ్రతుకు బాషగా మార్చాలి కదమ్మో

అణ్యబాషలకు పుట్టి నిల్లు, మెట్టినిల్లు 
అట్టి నీకు ఉనికి కావాలి కదమ్మా
చనుపాలతో రంగరించి అమ్మ బాషగా 
నేర్పిన మాటను నిలబెట్టు కోవాలమ్మా
ఆంధ్రమును బతికించమని 
నాయకులకు చెప్పేవారు యెవరోచెప్పమ్మా
ఆధునిక సాంకేతముగా తెలుగును వ్రృధ్ధి
పరుస్తున్నారు ఉపాధి కల్పించాలమ్మా"


==((***))---


 
భాషే -ఆనందం 94

వలదన్న పోదునిశ్చలానందం...
కలదన్న  మర్చి మెచ్చెటానందం
కలిసున్న వచ్చి పోయెటానందం
కలగన్న  కల్సి తీర్చే టానందం

వ్యధ కలుగ జేసినా నొక్కరి కానందం
మంచి తెలిపి చేసినా అందరి కానందం
పిచ్చి ముదిరి చేసినా కొందరి కానందం
అమ్మ తెలుపు మాటలే నిత్యము ఆనందం

వందల మందికి మేలు జేసినా ఆనందం
పండుగ సంబర మంత చూసినా ఆనందం
తక్కువ ఎక్కువ చేసి చెప్పినా ఆనందం
ప్రేమను పంచిన డబ్బు ఇచ్చిన ఆనందం

వందనములు పెక్కు బెట్టియున్నా ఆనందం
మంచిపనులు పెక్కు చేసియున్నా ఆనందం
చెడ్డ పనులు చేసి మారి యున్నా ఆనందం
తల్లి పలుకు వల్ల మారి యున్నా ఆనందం

--((**))--


భాషే - సంతృప్తి ...95

సంసార బంధము నేర్పు సంతృప్తి ఉండే  
ఉద్యోగ పర్వము మార్పు సంతృప్తి ఉండే
సన్యాసి వేషమున అసంతృప్తి ఉండే
స్త్రీ మాట నందున తీర్పు సంతృప్తి ఉండే   

సంగతి అవస్థ యందు కాక స్వంతమున ఉండే
సంపద అవస్థ ముందు ఉండి స్వంతమున ఉండే 
ప్రేమలొ అవస్థ కాల మాయ స్వంతమున ఉండే 
రోగము అవస్థ మందు వాడి  స్వంతమున ఉండే

సన్యాసి సంపదకాశ పడిన సాని మార్గము ఉండే
విన్యాస భావము ఆశ పడిన సాధు మార్గము ఉండే    
సౌందర్య్ర సేవయు కాల మహిమ ప్రేమ మార్గము ఉండే 
సాహిత్య సంపద నిత్య సంపద విద్య మార్గము ఉండే 

--((**))--
96...

భాషే - చందము  

భేషజము లేని బ్రతుకు మంచి గంధము చందము
డాంబికము లేని పలుకు మంచి గ్రంధము చందము 
కోపమును తెల్పు పలుకు చేదు గంధము చందము 
పాపమును చేయు పనియు పోరు గంధము చందము

కరుణ గల హృదయము కమల నాభుని చందము
తరుణి కళ విజయము ప్రణయ నాభుని చందము 
మనసు జత ప్రణయము ప్రధమ నాభుని చందము       
తరుణ మిది సరసము వినయ నాభుని చందము

ఓర్పున పలుకు మాట గొప్ప మంత్రము చందము 
నేర్పు తొ తగువు తీర్చి చెప్పు మంత్రము చందము 
కూర్పు తొ మనువు చేసి కల్పు తంత్రము చందము    
తీర్పు తొ నిజము తెల్పి జీవి యంత్రము చందము

--((**))--


నాది నాదన్న అహము మాట నీట ముంచు 
నీది నీదన్న పలుకు మంచి చేసి  ఉంచు 
నాది నీదన్న మనసు బుద్ది చెంత చేరు 
నీది నాదన్న హృదయ శుద్ధి వింత పోరు 
  
నీది నీదని త్యజించిన నిలువు దోపిడి యే
సేవ చేసిన స్వరం వివ  రములు దోపిడి యే 
ప్రేమ పొందిన జ్వరం వివ రములు దోపిడి యే
 దేశ సంపద వ్యయం వివరములు దోపిడి యే 

--((***))--

  

97....
కైపు సెగ ఫలితంబు భార్య కే  తెలుసు
భర్త కల  ఫలితంబు భార్యకే  తెలుసు   
వేడి సెగ ఫలితంబు వెన్నకే తెలుసు,
నేతి రుచి ఫలితంబు మన్షి కే తెలుసు   

దాహార్తి తో నున్న జలము విలువ తెలుసు ,
ప్రేమార్తి తో ఉన్న తపము విలువ తెలుసు 
అన్నార్తితో ఉన్న జపము విలువ తెలుసు 
మేఘార్తి తో ఉన్న పుడమి విలువ తెలుసు

మనసున్న వానికే మంచి విలువ తెలుసు,
సొగసున్న దానికే  తప్పు విలువ తెలుసు 
పొగరున్న దానికే  కోప విలువ తెలుసు 
వరుసున్న దానికే పట్టు విలువ తెలుసు

బ్రతుకు బాటను మార్చు కొనుట తెలుసు  
మనిషి మాటను నమ్ము  కొనుట తెలుసు 
ప్రకృతి ఆటను  ఒప్పు అనుట తెలుసు        
ఆకృతి వేటను తప్పు అనుట తెలుసు

--((**))--

98///
 
అరవిరిసిన . .మందారం 
మనలో వికసించే మనస్సు 
అమ్మాయి...సౌందర్యం
ఆత్మ అనుగ్రహ తేజస్సు 

అంగాంగ..... ..శోభితం
పరిమళ మైన ఉషస్సు 
అభినయ....ప్రదర్శనం
మనలో తరిమే తమస్సు 

సుమ దళ ..పరిమళం
నిత్యం వికసించే యవ్వనం 
సౌగంధికా... కుసుమం
వికసించే సుమదళం 

సువిశాల....హృదయం
సహృదయ సహనం 
సుందర ముఖారవిందం
ఆనంద దాయకం 

లలిత లావణ్య లతికం
లేత చెక్కెళ్ల ....చుబుకం
మధుర సుధా ..అధరం
సుమధుర చిరు లాస్యం!

ఆశల .. .... ఆరాటం
కోర్కెల. కుతూహలం
అంతులేని ...విరహం
అభి సారిక ....నిరీక్షణం!

--((***))--
 99....

నీ సిగలో మందారం
నా తనువే సింగారం
నీ మెడలో బంగారం
నా కురులే వయ్యారం

నీ మనసే నవనీతం
నా వలపే నవదీపం
నీ కురులే పరిమళం
నా జతలో సుమధురం

నీ మెరుపే నా కుల్లాసం
నా పిలుపే నీ కుత్సాహం
నీ సొగసే  నా కామోదం
నా మదిలో నీ ప్రమోదం

నీ పయనం  నా ఆలోచన 
నా నయనం  నీ ఆలాపన 
నీ ఆధరం నా మధురం 
నా మధురం నీ ఆధరం

నీ కలలే నా తలపులు 
నా తలపే నీ అలకలు 
నీ ఉడుకే  నా పిలుపులు 
నా పిలుపే నీ గళములు  

జలపాతాల శబ్దం ఒక నాదం
మనోఉల్లాసానికి అది ఒక అద్భుతం    
కెరటాల ఉరవడి ఒక మనోహరం
అది మనసుకు కల్గించు ఒక ఆహ్లాదం  
  
తరంగాల లాస్యాలు ఒక స్పందనం
అది హృదయానికి ఒక కేంద్రం 
 చినుకుల విన్యాసాలు ఒక ఉల్లాసం
అది ఒక ఆనంద పారవశ్యం  
    
ఆకుల గల గల శబ్దం ఒక కల
ఊగే చెట్ల కొమ్మలు ఒక గాలి 
వాయుతరంగ గాలులు ఒక లాలి
స్వర విహారాలు మనసుకు ఒక జాలి

మబ్బుల గర్జనలు ఒక స్వరాలు
హృదయ శబ్దాలు  ఒక ప్రేమలు 
స్నేహాల భావాలు ఒక చిహ్నాలు
మాటల కలయకలు ఒక ఆందాలు
--(())--
చేయి చేయి కలిపాం.......  100

చేయి చేయి కలిపాం
- చేతులు కాల్చుకున్నాం
బ్రమలునుండి తొలిగాం
- ఇక మాయామాటలు నమ్మం

ఆత్మగౌరవం మా ఆయుధం
- ఆంధ్రుల ఉన్నతియే మాధ్యేయం
ఆంధ్రుల ఔనత్యమే మాలక్ష్యం
- అమరావతి నిర్మాణం ఆపం

నిను వీడక మేమంటే   
మట్టి నీరు పంచి సరిపెట్టుకోమన్నావ్
మీ మాటలు నమ్మి ఉంటే
కొందరి మనసులను నొప్పించటం రాజకీయమన్నావ్

స్వశ్చమైన గుండె ఆంద్ర అన్నావ్
గుండె కోత పెట్టి మాటతప్పటం రాజకీయమన్నవ్
ఊహలలో మెరుపును చూపిస్తానన్నావ్
అసలుకే ఎగనామం పెట్టి ఇది రాజకీయమన్నవ్

మాటల్లో సత్యాన్ని గమనించలేదన్నవ్
అభిమానాన్ని దోచుకొనే ఇది ఒక రాజకీయమన్నవ్
ప్రపంచదేశాలలో భారత ప్రగతిఁ చాటావ్
దక్షిణాదిలో ఉన్న ఆంధ్రులాదుకోవటం మరిచావ్