ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు
1. తులాభారం
2. మేఘసందేశం
3. అన్నవరం
2. మేఘసందేశం
3. అన్నవరం
4. జయసుధ
5. ప్రేమ సంకెళ్లు | |||
6. అత్తారింటికి దారేది 7. భట్టి విక్రమార్క |
8. ప్రతిజ్ఞ పాలన
9. గుడిగంటలు
10. కొత్త నీరు
| |||||||
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా...కనుపాప నవ్వింది కనులున్న చోట...
చిత్రం : జయసుధ (1980) సంగీతం : రమేశ్ నాయుడు గీతరచయిత : దాసరి నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల పల్లవి: కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా కనుపాప నవ్వింది కనులున్న చోట కలగన్న చోట అవి కలగన్న చోట కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా చరణం 1: కలలూరు వేళ కనుమూత పడగా కనుముందు నీ నీడ కదలాడి రాగా కలలూరు వేళ కనుమూత పడగా కనుముందు నీ నీడ కదలాడి రాగా కనులెందుకు?ఈ కనులెందుకు? కలలు చెరిగేందుకు చెరిగి పోయేందుకు కనుల కనుల కలయికలో కలయికల కలవరింతలలో కలిగే... కరిగే.... కదిలే.... కదలికలే ఆ కలలూ ఆ కలల వెలుగులే ఈ కనులు ఆ కలల వెలుగులే ఈ కనులు కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా కనుపాప నవ్వింది కనులున్న చోట కలగన్న చోట అవి కలగన్న చోట కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా చరణం 2: తెలవారు వేళ కనురెప్ప విడగా కనుముందు నీ రూపు కనిపించిపోగా తెలవారు వేళ కనురెప్ప విడగా కనుముందు నీ రూపు కనిపించిపోగా కలలెందుకు? ఆ కలలెందుకు? కధలు మిగిలేందుకు మిగిలి నిలిచేందుకు మనసు మనసు ఊహలలో మరపురాని ఊసులలో విరిసే... కురిసే... మెరిసే... మెరుపులవే ఈ కలలు ఆ కలల వెలుగులే ఈ కనులు ఆ కలల వెలుగులే ఈ కనులు కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా కనుపాప నవ్వింది కనులున్న చోట కలగన్న చోట అవి కలగన్న చోట కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా https://www.youtube.com/watch? | ||
|
మెరుపులా మెరిశావు..వలపులా కలిశావు..కన్ను తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు...
చిత్రం : ప్రేమ సంకెళ్లు (1982) సంగీతం : రమేశ్ నాయుడు గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి: ఓహో... ఓ.. ఓహో... ఓ... ఓహో... ఓ... మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు... కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు... కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు.... నిన్నలలో నిలిచావు... చరణం 1: మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో... వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో ... దోసిట నా ఆశలన్నీ... దోచి వెళ్ళిపొయావు ... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు చరణం 2: ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి... ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... పసుపైనా కానీవా... పదాలంటుకొనీవా .... పాదాలకు పారాణై... పరవశించిపోనీవా... పలకరించిపోలేవా... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... చరణం 3: వేకువంటి చీకటి మీద... చందమామ జారింది... నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది... తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా... తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా... జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి బెదిరిపోతున్నాను మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.. నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు ... https://www.youtube.com/watch? | ||
|
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే
DSP Rocks as Lyricist as well! నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే ఏమిటో ఏం మాయో చేసినావే కంటి చూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావే మరదలా నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే ఏయ్.. అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే ఏయ్.. భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగరాసావే ఏయ్.. అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంటపడనా నావలా నువ్వు తూగుతూ నడుస్తుంటే కాపలాకి నేను వెంటరానా కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రావే మరదలా అత్త లేని కోడలుత్తమురాలు ఓరమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా పచ్చి పాల మీద మీగడేదమ్మా వేడి పాలల్లోన వెన్న ఏదమ్మా మోనలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాల సీస అందాన్ని చూడనేలేదు ఇంక ఏం లాభం కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళినోడు రాజైనా దాని మెరుపు నీలోనే దాగి ఉందని తెలియలే పాపం ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే | ||
|
| |||||||
ఓ నెలరాజా వెన్నెల రాజా...నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.. ఓ నెలరాజా... చిత్రం : భట్టి విక్రమార్క (1961) సంగీతం : పెండ్యాల గీతరచయిత : అనిశెట్టి సుబ్బారావు నేపధ్య గానం : ఘంటసాల, సుశీల పల్లవి: ఓ నెలరాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్ మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.. ఓ నెలరాజా... చరణం 1: ఓ.... ఓ... చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో.. చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో ఓ....ఓ..ఓ..ఓ.. కొంటె చూపు నీకేలా చంద్రుడా నా వెంటనంటి రాకోయీ చంద్రుడా ఆ... ఓ నెలరాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్ మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్....ఓ నెలరాజా... ఆ..ఆ.. చరణం 2: ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే ఓ...ఓ..ఓ..ఓ.. కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా వాని విడవ మనకు తరమవున చంద్రుడా ఆ..ఆ..ఆ..ఆ.. ఓ నెలరాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్ మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.... ఓ నెలరాజా... చరణం 3: లేత లేత వలపులే పూత పూయు వేళలో... కలవరింత లెందుకోయి చంద్రుడా.. నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా.. కలవరింత లెందుకోయి చంద్రుడా.. నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా.. ఆ..ఆ..ఆ..ఆ ఓ నెలరాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్ మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్....ఓ నెలరాజా... https://www.youtube.com/watch? | ||
|
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో...అనురాగమో సరాగమో అదేమి లోకమో... ఓ..ఓ..
చిత్రం : ప్రతిజ్ఞ పాలన (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో...
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో... ఓ..ఓ..
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... ప్రేమ ఏమిటో...
చరణం : 1
కలలో ఒక అందగాడు కన్ను కలిపి నవ్వెనే
ఓ ఓ ఓ....
కలలో ఒక అందగాడు కన్ను కలిపి నవ్వెనే
కనుకలుపగ నా వన్నెలు కడలిపొంగులాయెనే
కన్నెమనసు పొంగించిన వెన్నెల రాజెవ్వరే
ఆ..ఆ..ఆ.... ఓ..ఓ....
కన్నెమనసు పొంగించిన వెన్నెల రాజెవ్వరే
ఆనరా...తనెవ్వరా...వరించు నాధుడే..హ..హ..హ..
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... ప్రేమ ఏమిటో...
చరణం : 2
అహహా ఒహొహో...
ఓ....
ఒక చోటను నిలువలేను ఒంటరిగా ఉండలేను
ఊహలోని చెలికానితో ఊసులాడి వేగలేను
జాబిలితో ఈ తారక జతగూడుట ఎన్నడే...
కానరా..నీ నోమునూ...ఫలించినప్పుడే...అహహా
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో...
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... ప్రేమ ఏమిటో...
https://www.youtube.com/watch?
Ramachiluka telupave రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో ....
Movie: Pratigna Palana(1965) Lyricist: Arudra Music: Master Venu Singer: P.Suseela
|
ఊగిసలాడకే మనసా..నువ్వు ఉబలాట పడకే మనసాఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ..
చిత్రం: కొత్త నీరు (1981) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: ఎస్. పి. శైలజ పల్లవి: ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ.. ఉర్రూతలూగకే మనసా..ఆ..ఆ.. ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా చరణం 1: తలలోన ముడిచాక.. విలువైన పువ్వైనా.. దైవ పూజకు తగదు మనసా దైవ పూజకు తగదు మనసా.. పొరపాటు చేశావో దిగజారిపోతావు.. నగుబాటు తప్పదు మనసా పెడదారి మురిపాలు.. మొదటికే మోసాలు.. చాలు నీ వేషాలు మనసా చాలు.. నీ వేషాలు మనసా.. ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా.. చరణం 2: తుమ్మెదలు చెలరేగి.. తోటలో ముసిరేను.. దిమ్మరిని నమ్మకే మనసా దేశ దిమ్మరిని నమ్మకే మనసా.. చపల చిత్తం విపరీతమౌతుంది.. చలియించకే వెర్రి మనసా కపటాలు సరదాలు.. కవ్వించు సరసాలు.. కాలు జారేనేమో మనసా కాలు.. జారేనేమో మనసా.. ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ.. ఉర్రూతలూగకే మనసా..ఆ..ఆ.. ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా http://n3.filoops.com/telugu/ |