Tuesday 25 August 2015

ప్రాంజలి ప్రభ -ముద్దమందారం-స్వాతి కిరణం- కెవ్వు కేక - అమెరికా అమ్మాయి - చిరంజీవులు -ముత్యాల పల్లకి

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ



సర్వే జనా సుఖినోభవంతు
1. గాయం
2. పంచభూతాలు
3. పంచభూతాలు
4. జాతర
5. బందిపోటు
6. కొత్త జీవితాలు 
7. ముద్దమందారం
8. స్వాతి కిరణం 
9. కెవ్వు కేక
10. అమెరికా అమ్మాయి 
11. చిరంజీవులు
12. ముత్యాల పల్లకి  


 అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
ల ల ల ల లలలలలలలా

నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
ల ల ల ల లలలలలలలా

నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల ల ల ల లలలలలలలా <3

చిత్రం : గాయం (1993)
Rachana : sirivennela
Music : shree
Lyrics : Seetaraama sastry
Singer : chitra
నటీనటులు: జగపతి బాబు, రేవతి
https://www.youtube.com/watch?v=v7gPbY4W1IQ

Gaayam Songs - Alupannadi Unda - Revathi,Jagapathi Babu
is a 1993 Telugu movie directed by Ram Gopal Varma, which established Jagapathi Babu as a star. The

ఈ సినిమా పేరు మాత్రమే చెబితే మీలో చాలా మంది గుర్తించలేరేమో కానీ ఈపాట విన్నపుడు మాత్రం "అరే చాన్నాళ్ల తర్వాత విన్నామే... ఇంత మంచి పాటను ఎలా మర్చిపోయాం" అని ఖచ్చితంగా అనిపించి తీరుతుంది. నాకైతే ఎప్పుడో ఎనభైల్లో రేడియోలో మాత్రమే విన్న గుర్తు మళ్ళీ మొన్న ఏదో పాట గురించి వెతుకుతుంటే ఇది కనిపించి ఆశ్చర్యపరచింది. ఇళయరాజా గారు క్లాసికల్ స్టైల్లో కంపోజ్ చేసిన ఈ చక్కని పాటను మీరూ విని ఆనందించండి.
చిత్రం : పంచభూతాలు (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఆ..ఆఅ..ఆ..ఆ.ఆఆ...ఆ..ఆ.ఆ..ఆ..

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా
సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును
మరుల విరులు కురియగ

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

ఆ..ఆ.ఆఆఅ...ఆఆ...ఆ..ఆ
లలిత పవన కర చలిత జలద గతిలో..ఓఓ.
నవ వికచ కుసుమ ముఖ
ముఖర భ్రమర రుతిలో..ఓఓ..
వనమే వధువై మనువే వరమై
పులకించే ఈ వేళా
ఆషాఢ మేఘమే.. ఆనంద రాగమై..
చల చల్లగా జల్లుగా కవితలల్లగా
ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై..
చెలియకై ముత్యాల పందిట
రత్నాల పల్లకి నిలుపగా

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
https://youtu.be/FTP91WBivO0
Panchaboothalu | Kavvinche Kallalo song
Listen to the romantic hit of SP Balasubramaniam and P Susheela, "Kavvinche Kallalo " from the super...

కొన్నిపాటలు ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ కొట్టడమనే మాటే ఉండదు అలాంటివాటిలో ఇదీ ఒకటి. జాతర సినిమా కోసం జి.కె.వెంకటేష్ గారి స్వర సారధ్యంలో మైలవరపు గోపీ గారి రచన. అప్పటివరకూ చిన్న పిల్లలకి మాత్రమే పాడుతున్న శైలజ గారు కథానాయిక కోసం పాడిన మొదటి పాటట ఇది. నాకు ఎంతో ఇష్టమైన పాటను మీరూ వినండి.స్వరాభిషేకంలో శైలజ గారు పాడిన

చిత్రం : జాతర (1980)
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : శైలజ

మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..
గొరవంక పై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..

పెళ్ళిపీట పైన ఏ రాజు దాపున
చూపు చూపు లోన నూరేళ్ళ దీవెన
ఆ సమయమందు నేను..
ఆ సమయమందు నేను.. ఈ బిడియమోపలేను

గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..

వెన్నెల్లనడుగు మరుమల్లెనడుగు
ఇల్లాలి మనసే కడు చల్లన
వెన్నెల్లనడుగు మరుమల్లెనడుగు
ఇల్లాలి మనసే కడు చల్లన
ఈగుండెనడుగు నిట్టూర్పునడుగు
ఈగుండెనడుగు నిట్టూర్పునడుగు
తొలిరేయి తలపే నులివెచ్చన
తొలిరేయి తలపే నులివెచ్చనా..

గొరవంక పై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..

మా ఊరు తలుచుకుంటూ నీతోటి సాగనీ..
నిన్ను తలుచుకుంటూ మా ఊరు చేరనీ..
ఈ రాకపోకలందే...
ఈ రాకపోకలందే నను రేవు చేరుకోనీ..

గొరవంక పై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..
గొరవంక పై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
https://youtu.be/-DJykzQxPH4
Swarabhishekam - S.P.Sailaja Performance - Magha Masa Velalo Song - 20th July 2014
Song : Magha Masa Velalo Movie : Jaatra Singer in Swarabhishekam : S.P.Sailaja Watch Full Episode : ...

పండు వెన్నెల్లో రామారావంతటి అందాగాడు మేడ దిగి రావే అని పాడితే రానమ్మాయి ఉంటుందా ? అఫ్ కోర్స్ మన కృష్ణకుమారి మాత్రం వెంటనే దిగిరాలేదులెండి. ఆ మత్తు కలిగించే పాటేమిటో వినాలనుకుంటే, ఆ చక్కని జంటను మీరూ చూడాలనుకుంటే చూసి.. వినేసేయండి మరి

చిత్రం : బందిపోటు (1963)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల

ఓహోహో...ఓ... ఓ...
ఓహోహో... ఓ... ఓ...
ఓహోహోహో... ఓ... ఓ...

వగలరాణివి నీవే సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే

వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవే..

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం

వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఒహోహో ఓ..
ఒహోహో ఓ..ఓ..

ఓహోహొ ఓఓఓ
ఓహోహొ ఓఓఓ

దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగల రాణివి నీవే ..

కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె

వగలరాణివి నీవే.. సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను.. తోడుగా రావే...

వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఓహోహో ఓ...
ఓహోహో ఓఓఓ...
https://youtu.be/SBLZlqXkl44
Bandipotu | Vagala Ranivi Neeve Video Song | NTR, Krishna Kumari
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...


కొత్త జీవితాలు సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాట ఇది. సినిమాలో మాంటేజ్ సాంగ్ గా చిత్రీకరించిన ఈపాటను ఇద్దరితో పాడించాలనే ఆలోచన ఇళయరాజా గారిదో భారతీరాజా గారిదో కానీ అది మనకి వీనుల విందైంది. సుశీల గారు జానకి గారు ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి పాడారీ పాటను. సినారే గారి అందమైన సాహిత్యానికి ఇళయరాజా గారి సంగీతం సొబగులద్దితే గాయనీమణులిద్దరూ ప్రాణం పోశారు.
చిత్రం : కొత్త జీవితాలు (1980)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : సుశీల, జానకి

తననం...తననం...తననం...తననం..త...
ఆ....ఆ....ఆ...ఆ...ఆ...ఆ...ఆ..ఆ..

తం...తననం..తననం...తననం...తననం...
తం తన నంతన తాళంలో..
రస రాగంలో మృదునాదంలో..
నవ జీవన భావన పలికెనులే
తం తన నంతన తాళంలో..
రస రాగంలో మృదునాదంలో..
నవ జీవన భావన పలికెనులే
నవ భావనయే సుమ మోహనమై...
ఆపై వలపై పిలుపై కళలొలుకగ

తం తన నంతన తాళంలో..
రస రాగంలో.. మృదునాదంలో..
నవ జీవన భావన పలికెనులే

తనన తని నననని నననని తనన
తని నననని నననని తనన
తని నననని నననని తనన..తనన తనన..

ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే...
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే
ఆ....ఆ...ఆ...ఆ...
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే...
మది దోచెనులే...మరు మల్లెలు సైగలు చేసెనులే...

కన్నియ ఊహలు వెన్నెలలై...
కదలే కదలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో...
కన్నులు దాచిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే...
చిరు మరులను చిలుకగ

తం తన నంతన తాళంలో..
రసరాగంలో మృదునాదంలో...
నవ జీవన భావన పలికెనులే

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..

పొంచిన మదనుడు పువ్వుల బాణం...
నాటెనులే.. ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
పొంచిన మదనుడు పువ్వుల బాణం...
నాటెనులే.. ఎద మీటెనులే
పులకింతలు హద్దులు దాటెనులే
మ్రోగెను పరువం రాగిణియై...
మురిసే మురిసే చెలి మోహినియై
వన్నెల చుక్కల పందిరిలో...
వెన్నెల రాయని కౌగిలిలో
ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే...
మధుమధురిమలోలుకగ

తం తన నంతన తాళంలో...
రస రాగంలో మృదునాదంలో
నవ జీవన భావన పలికెనులే...
నవ భావనయే సుమమోహనమై...
ఆపై వలపై పిలుపై కళలొలుకగ...

తం తన నంతన తాళంలో..
రసరాగంలో మృదునాదంలో...
నవ జీవన భావన పలికెనులే

తం తననం తననం తననం తననం తననం

https://youtu.be/GjS3_H3_fNk
Ilayaraja's Kotha Jeevithalu Movie Songs - Tham Thananam Song - Suhasini, Hari Prasad
Click here to watch Pavitra Theatrical Trailer http://www.youtube.com/watch?v=x_Dl2AHiHxw Iddarammay...
   Like
   Comment
   Share


ముద్దమందారం చిత్రంలోని ఒక అందమైన పాట
చిత్రం : ముద్దమందారం (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
మందారం..ముద్దు మందారం...
మందారం..ముద్ద మందారం...
ముద్దుకే ముద్దొచ్చే... మువ్వకే నవ్వొచ్చే
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్ళు
విరి వాలు జడ కుచ్చుల సందళ్ళు...
కన్నె పిల్లా.. కాదు కళల కాణాచి
కలువ కన్నులా.. కలల దోబూచి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా
పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా.. కాదు మరుల మారాణి
బంతి పువ్వా పసుపు తాను పారాణి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
Mudda Mandaram Songs - Mudduke Muddoche Mandaram - Poornima, Pradeep
Mudda Mandaram Songs - Mudduke Muddoche Mandaram Movie: Mudda Mandaram, Starring: Poornima, Pradeep,...

శృతి నీవు గతి నీవు
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
శరణాగతి నీవు భారతి

నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె
అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె
అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె
త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులె
నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీభవ తారక మంత్రాక్షరం

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ
Swati Kiranam Movie Songs | Sruthi Neevu Song | Mammootty | Radhika | K Vishwanath | KV Mahadevan
Watch Swati Kiranam Movie Songs, Sruthi Neevu Song, Mammootty, Radhika and Master Manjunath. Directe...

ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి
దిల్లిని గిల్లేసి పోతివో
అ ఢిల్లీకి బైలెల్లి పోతివో..
ఐ వన ఐ వన యూ వన యూ వన
వన్ మోరు వన్ మోరు చిం చిమ్మ చిమ్మో
చుం చుమ్మ చుమ్మో..
ఓయ్ బాబు.. ఓ రాంబాబు.. ఓరారి ఒరే
హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు..
హాయ్.. ఏయ్ బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు
ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు..
హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు..
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు..

హా మంచోడు మంచోడివంటె రాంబాబు
నువ్వు మంచం కిందికి దూరినవుర రాంబాబు
ఇంట్లోకి రమ్మంటె నిన్ను రాంబాబు
అరె ఇల్లే పీకి పందిరి వేస్తివి రాంబాబు
ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం
ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం
నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
హా బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు

ఓసి నీ తస్సారాల బొడ్డు సూసాములేవో

హేయ్ తాడిని తన్నే వాడుంటే రాంబాబు
వాడి తలదన్నే టైపు నేను రాంబాబు
తాటాకు సప్పుడ్లు యేల రాంబాబు
నీకు శంకర్‌గిరి మాన్యాలేర రాంబాబు
ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట
ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట
కర్ర కాల్చి వాత పెడితె కెవ్వు కెవ్వు కేకంట
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాం రాం రాం రాం రాం రాం రాం రాంబాబు...





ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను చిరు నవ్వు సొగసులో

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
రేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక
నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక సంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

***

చిత్రం: అమెరికా అమ్మాయి
సంగీతం: GK వెంకటేష్
గానం: G ఆనంద్
రచన: మైలవరపు గోపి

https://www.youtube.com/watch?v=WgXvq_K-WCEhttps://www.youtube.com/watch?v=WgXvq_K-WCE
Oka Venuvu America Ammayi

తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా...మళ్ళీ పరుండేవు లేరా

చిత్రం: చిరంజీవులు (1956)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: పి.లీల

పల్లవి:

తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు ….
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా
తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా

చరణం 1:

కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
దైవరాయా నిదురలేరా

చరణం 2:

నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా
వెన్న తిందువుగాని రారా

https://www.youtube.com/watch?v=41XDTvI3mpA
THELLA VARA VACHCHE TELIYAKA NAA SAMY....CHITRAM:- CHIRANJIVULU
"ఓ నెలరాజా" SUBSCRIBERS కు సినీ సంగీత రసికులందరికి నమస్కారం ఓ నెలరాజా ఆదరించినట్లు గానే ఈ మేనేజర్ ద్...

తెల్లావారక ముందే పల్లె లేచింది...తనవారినందరినీ తట్టీ లేపింది...

చిత్రం : ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది

తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది

చరణం 1:

వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి

తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది

చరణం 2:

పాలావెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లేపూల రాశివంటి మమతలు
పల్లేసీమలో కోకొల్లలు

అనురాగం... అభిమానం..
అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు

తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
https://www.youtube.com/watch?v=E36eTEtMat
Thellavarakamunde Palle Lechindi
Movie Muthyala Pallaki Music Sathyam Singer P suseela






1 comment: