Monday 10 August 2015

1. జే గంటలు (1981) 2. భద్రకాళి (1976) 3బావమరదళ్ళు (1960) 4నాదీ ఆడజన్మే (1965) 5మూగనోము (1969) 6ఆత్మబంధం (1991) 7ఏడంతస్తుల మేడ (1980) 8కుంకుమ తిలకం (1983) 9ఓ సీత కథ (1974) 10కన్నవారి కలలు (1974) 11వాగ్ధానం (1961) 12పూల రంగడు (1967) 13హార్ట్ ఎటాక్ (2014) .

Om Sri Ram      Om Sri Raam   Om Sri Raam 
ప్రాంజలి ప్రభ -సంగీత ప్రభ 

సర్వేజానాసుఖినోభవంతు

ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా...
కులుకులమ్మ కన్న కూతురా... మెరుపులమ్మ మేనకోడలా..

చిత్రం: జే గంటలు (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: ఏసుదాస్, వాణీ జయరాం

పల్లవి:

ఆ....ఆ....ఆ ఆ ఆ.....ఆ

ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా...
ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా...
కులుకులమ్మ కన్న కూతురా... మెరుపులమ్మ మేనకోడలా..
కులుకులమ్మ కన్న కూతురా... మెరుపులమ్మ మేనకోడలా..
ఎవరమ్మా... ఎవరమ్మా...ఈ కొమ్మా

ఆ ఆ ఆ...ఆ ....ఆ.....ఆ.....ఆ

చరణం 1:

కొనగోటను గోరింటలు పేరంటాలడగా..
చెక్కిలిలో చేమంతులు సీమంతాలడగా...
ఊఁ....మూ....మూ...మూ....ఆహహా
కొనగోటను గోరింటలు పేరంటాలడగా..
చెక్కిలిలో చేమంతులు సీమంతాలడగా...

స్వాతివాన చినుకై ముత్యాలనవ్వు మొలకై...
స్వాతివాన చినుకై ముత్యాలనవ్వు మొలకై
మురిసే ముద్దులగుమ్మా ఎవరమ్మా
కులుకులమ్మ కన్న కూతురా... మెరుపులమ్మ మేనకోడలా..

ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా...

చరణం 2:

లలలలలలలలల..లలలలలలలలలా...
లలలలలలలలల..లలలలలలలలలా...ఆ...ఆ.
..ఆ....

కొన సిగ్గులు చెలిబుగ్గల తొలిముగ్గులు తీర్చగా...
అరకన్నుల సిరివెన్నెల మదికిన్నెర మీటగా...
ఓ..ఓ..ఓ..ఓహో...
కొన సిగ్గులు చెలిబుగ్గల తొలిముగ్గులు తీర్చగా
అరకన్నుల సిరివెన్నెల మదికిన్నెర మీటగా...

సందెగాలి తరగై చందమామ తునకై ...
సందెగాలి తరగై చందమామ తునకై ...
విరిసే పున్నమిరెమ్మ ఎవరమ్మా....

ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా...
ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా...
ఆ....ఆ....ఆ ఆ ఆ.....ఆ అ ఆ... ఆ అ ఆ...
https://www.youtube.com/watch?v=i11kJYD-DMM
Jae Ghantalu | Yevaramma song
Watch the melodious romantic song, "Yevaramma Yevaramma" sung by KJ Yesudas and Vani Jairam from the...


నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో...నీవు పాడే పాట వినిపించునీ వేళా

చిత్రం : బావమరదళ్ళు (1960)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : జానకి

పల్లవి:

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 1:

ఏ పూర్వపుణ్యమో.. నీ పొందుగా మారీ
ఏ పూర్వపుణ్యమో.. నీ పొందుగా మారీ
అపురూపమై నిలిచే.. నా అంతరంగానా

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 2:

నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు
నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింప చేయు

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 3:

అందుకో జాలనీ... ఆనందమే నీవు
అందుకో జాలనీ... ఆనందమే నీవు
ఎందుకో చేరువై.. దూరమౌతావు

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...


http://n3.filoops.com/telugu/Bava%20Maradallu%20%281961%29/Neeli%20Meghalalo%20-%20Janaki.mp3

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. నిన్ను కనలేని కనులుండునా

చిత్రం: నాదీ ఆడజన్మే (1965)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా..ఆ..

చరణం 1:

గుణమెంత లేనింట పడవైతువా.. నన్ను వెలివేయువారికే బలిచేతువా
గుణమెంత లేనింట పడవైతువా.. నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరి జూచుకుని నన్ను మరిచావయా..
సిరి జూచుకుని నన్ను మరిచావయా.. మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా

చరణం 2:

బంగారు మనసునే ఒసగినావు.. అందు అందాల గుణమునే పొదిగినావు
బంగారు మనసునే ఒసగినావు.. అందు అందాల గుణమునే పొదిగినావు

మోముపై నలుపునే పులిమినావు..
మోముపై నలుపునే పులిమినావు.. ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ..
నిన్ను కనలేని కనులుండునా

http://n3.filoops.com/telugu/Naadi%20Aada%20Janme%20%281965%29/Kannayya%20Nallani.mp3


ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు

చిత్రం : మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు

నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలే

చరణం 1 :

నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. నీ మాటలో మధువులే పొంగిపోయే

నాలోని ఆణువణువు నీదాయెలే..
బ్రతుకంతా నీకే అంకితం చేయనా..

నీలోని ఆశలన్నీ నా కోసమే.. నా పిలిపే నీలో వలపులై విరిసెలే..
లా ... లాలలా... లలలా... లా...

చరణం 2 :

నీ రూపమే గుండెలో నిండిపోయే... నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే... నా స్వప్నమే నేటితో పండిపోయే

ఉయ్యాల జంపాల ఊగేములే..
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు.. లోలోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... లాలలా లాలలా... ఊ హూ హు..

https://www.youtube.com/watch?v=uX5q3x13eDU
Ee Vela Naalo Enduko Aasalu - Evergreen Telugu Song Between ANR & Jamuna - Mooga Nomu HD
Mooga Nomu - Telugu Movie Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More ...


ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...ఒట్టి ఊహ కాదని.. ఈ కొత్త పూల గాలి ..

చిత్రం : ఆత్మబంధం (1991)
సంగీతం : కీరవాణి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒట్టి ఊహ కాదని.. ఈ కొత్త పూల గాలి ..
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని ..
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని ...

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...

చరణం 1 :

ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ
అమావాశ్య కొలువై మోయ మంటు రేయినీ...
సుదూరాల తారల్ని సుధా శాంతి కాంతుల్నీ
వలలు వేసి తెచ్చా కంటి కొనలో నింపనీ ..
చెదరని చెలిమి కి సాక్ష్యమా
హృదయము తెలుపగ సాధ్యమా ...
మాయని మమతల దీపమా... ఉదయపు తళుకులు చూపుమా ...
నా జాబిలి నీవేనని ...

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి ...

చరణం 2 :

ల ల ల ల ల లా ....
ల ల ల ల ల లా ....
ల ల ల ల ల లా ....
ల ల ల ల ల లా ....

తుదే లేని కధ కాని గతం కాని స్వప్నాన్ని
ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ ..
నువ్వే వున్న కన్నులతో మరే వంక చూడననీ
రెప్ప వెనక నిన్నే ఎల్లకాలం దాచనీ ...
యుగములు కలిగిన కాలమా ఈ ఒక ఘడియను వదులుమా
చరితలు కలిగిన లోకమా ఈ జత జోలికి రాకుమా ...
స్వప్నం చిగురించిందని .....

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి .......
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి .......
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి ..
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని ..
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచిందని ....

ఇంకొక్కసారి ...
ఇంకొక్కసారి ...

https://www.youtube.com/watch?v=pCQ7pT4jvvw
Ottesi chepava inkokasari - Video song - Aatma bandham (suman,lizy)

   Like
   Comment
   Share




ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది..ఏమీ లేక ఉన్నదొక్కటే... నాకు మీరు.. మీకు నేను

చిత్రం: ఏడంతస్తుల మేడ (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది
ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది
ఏమీ లేక ఉన్నదొక్కటే...
నాకు మీరు.. మీకు నేను
నాకు మీరు.. మీకు నేనూ....

చరణం 1:

పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే
కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే
పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే
కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే

చాప కన్న చదరే మేలని.. చతికిలపడి అతుకుతు ఉంటే
ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై నిదరనే..
ఏయ్ నిదరనే నిదరపొమ్మంటుంటే ఏ ఏ ఏ...
వెన్నెల మల్లెల మంచమిది.. ఎన్నో జన్మల లంచమిది
మూడు పొద్దులు ముద్దు ముచ్చటే..
నాకు మీరు .. మీకు నేను
నాకు మీరు మీకు నేనూ.....

ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది

చరణం 2:

పాయసాన గరిటై తిరిగే..పాడు బ్రతులులెందుకు మనకు
పాలలోన నీరై కరిగే.. బంధమొకటి చాలును కడకు
పాయసాన గరిటై తిరిగే..పాడు బ్రతులులెందుకు మనకు
పాలలోన నీరై కరిగే..బంధమొకటి చాలును కడకు

చావు కన్నా బ్రతుకే మేలని.. తెలిసి కలిసి మసులుతు ఉంటే
ప్రేమకన్న పెన్నిధి లేదని తెలుసుకో..
ఏయ్ తెలుసుకో మనసు నీదంటుంటే ఏ ఏ ఏ...

ఎండ వానల ఇల్లు ఇది..ఎండని పూపొదరిల్లు ఇది
రేయి పగలు ఆలు మగలే...
నాకు మీరు.. మీకు నేను
నాకు మీరు మీకు నేనూ...

ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది
ఏమీ లేక ఉన్నదొక్కటే...
నాకు మీరు.. మీకు నేను
నాకు మీరు.. మీకు నేనూ....

https://www.youtube.com/watch?v=jZNYzowQN6s
Yedanthasthula Meda, Yedanthasthula Meda Idi

ఆలనగా పాలనగా అలసిన వెళల అమ్మవుగా..లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: ఏసుదాస్, సుశీల

పల్లవి:

ఆలనగా పాలనగా అలసిన వెళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా అలసిన వెళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

చరణం 1:

నీ చిరునవ్వే.. తోడై ఉంటే.. నే గెలిచేను లోకాలన్నీ
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ చిరునవ్వే.. తోడై ఉంటే.. నే గెలిచేను లోకాలన్నీ

అరఘడియైనా నీ ఎడబాటు.. వెన్నెల కూడా చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

చరణం 2:

మోమున మెరిసే.. కుంకుమ తిలకం.. నింగిని వెలిగే.. జాబిలి కిరణం
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మోమున మెరిసే.. కుంకుమ తిలకం.. నింగిని వెలిగే.. జాబిలి కిరణం

నేనంటే నీ మంగళ సూత్రం.. నువ్వంటే నా ఆరో ప్రాణం
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా అలసిన వెళల అమ్మవుగా
ఆహా.. హా.. హా.. ఊ.. ఊ...

https://www.youtube.com/watch?v=sukQcYkRXwg
Kunkuma tilakam movie songs 03 Muralimohan Jayasudha

మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..వెన్నెలంత చల్లన మా సీత సొగసు...

చిత్రం: ఓ సీత కథ (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

మల్లె కన్న తెల్లన....వెన్నెలంత చల్లన...
ఏది... ఏది.. ఏది..
మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..
వెన్నెలంత చల్లన మా సీత సొగసు...

తేనె కన్న తీయన...పెరుగంత కమ్మన...
ఏది... ఏది.. ఏది..
తేనె కన్న తీయన మా బావ మనసు..
పెరుగంత కమ్మన మా బావ మనసు...

చరణం 1:

నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి...
నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి...
... ఏమని
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని..
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని...
నీతోనే ఒక మాట ...నీతోనే ఒక మాట...
చెప్పాలి.... ఏమని
నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని...

మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..
తేనె కన్న తీయన మా బావ మనసు..

చరణం 2:

మనసుంది ఎందుకని... మమతకు గుడిగా మారాలని..
వలపుంది ఎందుకని ...ఆ గుడిలో దివ్వెగా నిలవాలని..
మనసుంది ఎందుకని... మమతకు గుడిగా మారాలని..
వలపుంది ఎందుకని ...ఆ గుడిలో దివ్వెగా నిలవాలని..

మనువుంది ఎందుకని.. ఆ దివ్వెకు వెలుగై పోవాలని
బ్రతుకుంది ఎందుకని... ఆ వెలుగే నీవుగా చూడాలని...ఆ వెలుగే నీవుగా చూడాలని

మల్లె కన్న తెల్లన...ఊహు..ఊ...
తేనె కన్న తీయన...ఊ..ఊ..ఊ...

http://n3.filoops.com/telugu/O%20Seetha%20Katha%20%281974%29/Malle%20Kanna%20Thellana.mp3

   Like
   Comment
   Share



ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...తొలినాటి ప్రేమదీపం.. కలనైన ఆరిపోదు...

చిత్రం: కన్నవారి కలలు (1974)
సంగీతం: వి. కుమార్
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల

పల్లవి:

ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...
ఒకనాటి మాట కాదు.. ఒక నాడు తీరిపోదు...
తొలినాటి ప్రేమదీపం.. కలనైన ఆరిపోదు...
తొలినాటి ప్రేమదీపం..కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు..

చరణం 1:

ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో ...
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో....
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో...
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో...

పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ ...
గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ...
కలసిన కౌగిలిలో ...కాలమే ఆగినదీ....

ఒకనాటి మాట కాదు ...ఒక నాడు తీరిపోదు...

చరణం 2:

చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా..
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ...
ఆహా..చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా...
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా ...

ఆ....కొంటెగా నిన్నేదో కోరాలనివుంది...
ఆ....తనువే నీదైతే దాచేదేముంది ...
మనసులవీణియపై ...బ్రతుకే మ్రోగిందీ...

ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు...
తొలినాటి ప్రేమదీపం... కలనైన ఆరిపోదు...
ఒకనాటి మాట కాదు... ఒక నాడు తీరి పోదు...

https://www.youtube.com/watch?v=Ll7inf7FmIE
OKANAATI MAATA KAADU - KANNAVARI KALALU
OKANAATI MAATA KAADU - KANNAVARI KALALU


నా కంటి పాపలో నిలిచిపోరా...నీ వెంట లోకాల గెలువనీరా...
చిత్రం : వాగ్ధానం (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఊ..ఉ...ఉ...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ..ఆ..ఆ..ఆ...
చరణం 1 :
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
అహ..హా..ఆ..
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొంద్దాము అందని ఆకాశమే...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
చరణం 2 :
ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
అహ..హా..ఆ..
ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో...
మేఘాలలో వలపు రాగాలలో....
దూర దూరాల స్వర్గాల చేరుదమా....
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
చరణం 3 :
ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అహ..హా..ఆ..
ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అందాలనూ తీపి బంధాలను...
అందాలనూ తీపి బంధాలను...
అల్లుకుంద్దాము డెందాలు పాలించగా...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...


Watch ANR Krishna Kumari's Vaagdhanam Telugu Old Movie Song With HD Quality Music : Pendiala Nageswara Rao Lyrics : Atreya Sri Sri
youtube.com

నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి...

చిత్రం : పూల రంగడు (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు...

చరణం 1:

తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి ..ఈ ఈ .....
ఆ ఆ ఆ ఆ.....
తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి...
చింతా చీకటి ఒకటై...చిన్నబోయే ఈ రేయి

నీవు రావు..
నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు..

చరణం 2:

ఆశలు మదిలో విరిసే... దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ..ఆలయాన చేరి చూడ...
స్వామికానరాడాయే..నా స్వామికానరాడాయె...

కౌగిలిలో ఒదిగిపోయే... కలలుగనే వేళాయే
కౌగిలిలో ఒదిగిపోయే... కలలుగనే వేళాయే
ఎదురుచూసి ఎదురుచూసి...
ఎదురుచూసి ఎదురుచూసి... కన్నుదోయి అలసిపోయె

నీవు రావు..
నీవు రావు నిదురరాదు...నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు

https://www.youtube.com/watch?v=qPzGNqf1KYE
Poola Rangadu Neevu Raavu Nidura Raadu






సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమై పోదుకదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నులోని కన్నీటి కెరటాలలో ఓ ఓ
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం ఓ ఓ
సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమై పోదుకదా
అనుకున్న అనుకున్న నాతోటే వుంటావు అనుకున్న
నాలాగే నీకుడా నేనంటే ఇష్టం అనుకున్న
పిలిచానా రమ్మని కసిరాన పొమ్మని
చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని
నువ్వు కాదంటే ఇక రానంటే
మన ఇద్దరి మధ్య ఇంకేమ్లేదంటే
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
నువ్వంటే నాలాంటి ఇంకోనేనని అనుకున్న
ఇన్నాలి బ్రమలోనే ఆనందముగా బ్రతికానా
నచ్చిందే తడవుగా వేల్లోదే అలుసని
చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
నా ఉహలని నా ఆశలని నరికేస్తున్నావు అని చిదిమేస్తే
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
చిత్రం : హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : చైత
http://m.youtube.com/watch?v=C8zL_kbospE


లలిత సంగీత సామ్రాట్ ఎమ్మెస్ విశ్వనాధన్.కి నివాళిగా నా "రోజుకో ఎమ్మెస్ మధుర గీతం" సమర్పణలో భాగంగా, ఈ రోజు ఈ మధుర గీతం
హే......విటో....., ఈ "రోజుకో ఎమ్మెస్ మధుర గీతం" కార్యక్రమ క్రమంలో, నేనెప్పుడూ చూడని పాటలు కూడా చూసే భాగ్యం కలుగుతోంది
https://www.youtube.com/watch?v=kl35acCMeSM#
Manchi Chedu Movie || Repanti Roopam Video Song || NTR, Saroja Devi B
Manchi Chedu(Manchechedu) Movie Starts with Comedy Discussion Between Nagabhushanam & Padmanabham. N...


2 comments: