Wednesday 26 August 2015

పాతాళభైరవి-ముద్దులగుమ్మా-మాయా బజార్ దసరా బుల్లోడు ఇంద్రుడు చంద్రుడు ప్రేమలేఖలు సీతాకోకచిలుక

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
మధురగీతలు (తెలుగు లిపి - వీడియో)
image not displayed 
సర్వ్ జనా సుఖినోభవంతు

శివ
పాతాళభైరవి

ముద్దులగుమ్మా

మాయా బజార్  

దసరా బుల్లోడు 

ఇంద్రుడు చంద్రుడు 

ప్రేమలేఖలు

సీతాకోకచిలుక 

రాక్షసుడు 

శృతిలయలు 
దేవాంతకుడు 
సువర్ణసుందరి

చిత్రం : శివ (1989), రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా, గానం : మనో, ఎస్.జానకి

పల్లవి :
సరసాలు చాలు శ్రీవారు వేళకాదు
విరహాల గోల ఇంకానా వీలుకాదు ॥
వంటి ంట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారు
చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు

చరణం : 1
సూర్యుడే చురచుర చూసినా
చీరనే వదలరు చీకటే చెదిరినా
కాకులే కేకలు వేసినా
కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికీ సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోపుగా కావాలనే సర దా
పాపిడి తీసి పౌడరు పూసి
బయటికే పంపేయనా
పైటతో బాటే లోనికి రానా పాపలా పారాడనా
తీయగ తిడుతూనే లాలించనా...॥

చరణం : 2
కొత్తగా ముదిరిన వేడుక
మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందరా
బొత్తిగా కుదురుగ ఉండనే ఉండదా
ఆరారగా చేరకా తీరేదెలా గొడవ
ఆరాటమే ఆరనా సాయంత్రమే పడదా
మోహమే తీరే మూర్తమే రాదా
మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరి రాగానికా
ఆగదే అందాకా ఈడు గోల॥
ఊరించే దూరాలు ఊ అంటే తీయంగా తీరు ॥

https://youtu.be/Wl9d3hgPeaM
Sarasalu Video Song - Shiva Movie - Nagarjuna, Amala
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

పాతాళభైరవి సినిమా గురించి ఈ పాట గురించి తెలియని తెలుగు వాళ్ళుండరేమో కదా... ఈ మధురమైన పాటను మరోసారి చూసీ వినీ ఆనందించండి మరి....
చిత్రం: పాతాళభైరవి(1951)
సంగీతం: ఘంటసాల
రచన: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి లీల

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే
మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే

కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే

కలవరమాయే మదిలో నా మదిలో

కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
https://youtu.be/cIJp8cJDEko
Honeymoon Songs From Telugu Movies (Golden Oldies)
Golden Oldies

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలను ఆహ్వానిస్తూ

నీ కనులెటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా

ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ

నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మ

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలను ఆహ్వానిస్తూ

నీ కనులెటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా

ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ

నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మ

జలజల జాజుల వాన కిలకిల కిన్నెరవీణ

మిలమిల మిన్నంచుల పైన మెలి తిరిగిన చంచలయాన

మధురోహల లాహిరిలోన మదినూపే మధిరవే జాన

నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైనా

నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో

గమనించవు కాస్తైనా నీ వెనకాలేమవుతున్నా

నీ వీపుని ముళ్ళై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో

లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు

లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు

నీ గాలే సోకిన వారు గాలిబ్ గజలై పోతారు

నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణవుతారు

కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మా

నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు

నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు

ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ

చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయొద్దు

వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు

ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు

అందాకా మారాం మాని జోకొట్టవే ఆరాటాన్ని

పొందిగ్గా పడుకో రాణీ జాగారం ఎందుగ్గానీ

నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మా



నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల, జానకి

పల్లవి :

నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

వెన్నెవంటి మనసున్న చిన్నవాడే
చిన్న నాటినుండి నువ్వు కోరుకొన్నవాడే
వెన్నెవంటి మనసున్న చిన్నవాడే
చిన్న నాటినుండి నువ్వు కోరుకొన్నవాడే
ప్రేమకే బానిసైపోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే
ప్రేమకే బానిసైపోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

చరణం :1

నువ్వు వాని వరస వున్నదానివీ
నువ్వు వలపుదోచుకొన్నదానివీ
నువ్వు వాని వరస వున్నదానివీ
నువ్వు వలపుదోచుకొన్నదానివీ
మనసిచ్చి మాట పుచ్చుకొంటివీ
నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివీ
మంచితనముతో నువ్వు గెలుచుకొంటివీ
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడేచరణం :2

రాధా కౄష్ణులు కథలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధా కౄష్ణులు కథలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధా కౄష్ణుల ప్రేమే పవిత్రమూ
లోకానికే అది ఆదర్శమూ
రాధా కౄష్ణుల ప్రేమే పవిత్రమూ
లోకానికే అది ఆదర్శమూ

చరణం :3

గోపాల బాలుడూ...నీ ప్రేమలోలుడూ
గోపాల కృష్ణుడూ...నీ పాలి దేవుడు
గోపాల బాలుడూ...నీ ప్రేమలోలుడూ
గోపాల కృష్ణుడూ...నీ పాలి దేవుడు
వాడు నీ వాడే...కాదు నీ వాడే
వాడు నీ వాడే...కాదు కాదు కానేకాడు
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే...

Chitapata Chinukulu 2 (Telugu Movie Classic Songs) in Eastman Color
Golden Ol



లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి

లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి

తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు

కాపురం చేస్తున్న పావురం ఒకటుంది ఆలినే కాదంది కాకినే కూడింది

అంతలో ఏమైంది అడగవే పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నా చేయి

మాయనే నమ్మింది బోయతో పోయింది

దెయ్యమే పూనిందో రాయిలా మారింది

వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది

కన్నులే విప్పింది గండమే తప్పింది ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి

పారిపోనీకుండా పట్టుకో నా చేయి

పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఏడ్చారో గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు

నేరం నాదైనా భారం నీపైన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా

తల్లిలా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా

బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా




చిత్రం : ప్రేమలేఖలు (1977)
సంగీతం : సత్యం
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల, వాణీ జయరాం

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ....
ఈ రోజు... మంచి రోజు..
మరపురానిది.. మధురమైనది
మంచితనం ఉదయించినరోజు

ఆ ఆ ఆ ఆ...
ఈ రోజు.. మంచి రోజు...
మరపురానిది.. మధురమైనది
ప్రేమ సుమం వికసించినరోజు

చరణం 1:

తొలిసారి ధృవతార దీపించెను... ఆ కిరణాలే లోకాన వ్యాపించెను
ఆ ఆ ఆ ఆ..
తొలి ప్రేమ హృదయాన పులకించెను... అది ఆనంద దీపాలు వెలిగించెను

చెలికాంతులలో.. సుఖశాంతులతో.. జీవనమే పావనమీనాడు

ఈ రోజు మంచి రోజు... మధురమైనది మరపురానిది
ప్రేమ సుమం వికసించినరోజు

చరణం 2:

రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము
రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము

మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు..అభినందనలు
అందించే శుభసమయం నేడు

ఈ రోజు మంచి రోజు... మధురమైనది మరపురానిది
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు
Prema Lekhalu Songs - Eeroju Manchi Roju - Jayasudha - Ananth Nag
Jayasudha and Anant Nag's Prema Lekhalu Movie - Eeroju Manchi Roju Song with HD Quality Music - Saty...

శుభోదయం. .
ఈ రోజుల్లో సాక్సోఫోనులు, బాక్సోఫోనులంటూ అనేక రకాల సంగీత వాయిద్యాలు మంచి బేస్ తో మన గూబలు గుయ్యిమనిపిస్తున్నాయి. అనేకరకాల శబ్దాలను ఒకే వాయిద్యంలో పలికించగల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ రోజుల్లో ఒక రకపు శబ్దానికి ఒక వాయిద్యాన్ని వాడేవారు. అలా మన మనసులను (ఆరోజుల్లో) ఉర్రూతలూగించిన వాయిద్యాల్లో ఘటవాయిద్యమొకటి. ఘటం అంటే కుండ. కుండ ఆకారంలో ఉండే యీ వాయిద్యాన్ని మ్రోగిస్తే కుండపై చేతులతో తట్టితే వచ్చే శబ్దంలాగే ఉంటుంది. ఈ వాయిద్యాన్ని మిళితం చేస్తూ అంజలీదేవి గారి భర్త ఆదినారాయణరావుగారు తనే అంజలీ పిక్చర్స్ పై నిర్మించిన "సువర్ణసుందరి" లో తొలిపాటగా మోత మోగించేశారు. తెలుగువారి "సువర్ణసుందరి" అంజలీదేవి కధానాయికగా నటించిన యీ చిత్రంలో మళయాళ గాయని పి. లీలగారు బృందంతో కలిసి పాడిన సముద్రాల(జూ) వ్రాసిన యీపాట ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం రాఘవయ్య గారు నేర్పిన అడుగులతొ సూర్యకళగారు నర్తించారు.(కాపీరైట్స్ సమస్యవల్ల ఆ పాటను అప్లోడ్ చేయకపోయిన ఆ పాటలోని కొన్ని ఫొటోలను అప్లోడ్ చేస్తున్నాను.) ఆ పాట సాహిత్యం యిదిగో :

బంగారు వన్నెల రంగారు సంజ
రంగేళి యేతెంచెనే -
నారాజా చెంగూన రాడాయెనే ~ బంగారు ~

1. ఎలపొద్దూ గని తొలిముద్దు గొనీ
చనే వస్తాననీ ఠీవిగా - నా రాజా
రాడేలనో చేరగా
ఓ చెలియా - రాడేమో యీ ఛాయగా ఓ. . ఓ. . ~బంగారు ~

2. జత జేరే తొలీ వెత దీరే చెలీ!
ఎల సూరేడటూ డాయగా - నా రాజా
రారే మటూమాయగా
మా మనసూ మారేనే ఓ రాయిగా ఓ. . ఓ. . ~బంగారు~

3. సొగసెంచీ మరి - సిగనుంచి విరి
వగ ముంచీ గిరి గీసెను - నా రాజా
ఏ గారడో చేసెనూ
ఓ చెలియా - రాగాలు దోచేసెను ~ బంగారు ~





రాక్షసుడు చిత్రం కోసం యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఒక చక్కని మెలొడీ ఈ రోజు విందాం

https://youtu.be/nr8dt0TDdNU

చిత్రం : రాక్షసుడు (2015)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : కార్తీక్, చిన్మయి

నీ నీడవుతా నీ తోడవుతా
అడుగులో అడుగునై నీ నీడవుతా
నువ్వే నా ప్రాణం అన్నా
నీ నింగిలో రెండో జాబిలినై
నే నిలిచే వరమీవా వరమీవా

ఆమెను మరపించకపొయినా
తలపించేలా నీ గుండెల్లో కాపురముంటా

కానీ చెలియా కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని
నీకివ్వడానికి తడబాటు
కానీ చెలియా కానీ చెలియా
ఆమెతొ చేసిన పయనాలు
నీతో కావాలీ అలవాటు

నా నింగిలో ఒక తారగ వచ్చావులే
మెల మెల్లగా వెన్నెలై నిండావులే నా గుండెలో
నా నేలపై ఒక పువ్వై విచ్చావులే
మెల మెల్లగా తోటవై పూచావులే నా గుండెలో
చిరునవ్వై నువ్వొస్తే చిగురించా మళ్ళీ నేను
సిరిమువ్వై నా ఎదలో రవళించావే..
వచ్చింది నాకోసమే ఇలా అమవాస లోన వెన్నెలా

కానీ చెలియా కానీ చెలియా
ఆమెకు ఇచ్చినా హృదయాన్ని నీకివ్వడానికి...

నేనిన్ను ప్రేమించు ముందే
నీ ప్రేమంత నా చిట్టితల్లికి నువ్విచ్చావ్ ఇంకేమి
నే కోరకుండానే వరమిచ్చు దేవతల దిగివస్తివే
ఒడిలో చేర్చీ జోలాలి పాడీ
నువ్ సేద దీర్చగా నా గాయమారెలే

నీవే చెలియా నీవే చెలియా
నీవే నా మౌనం నీవేనా గానం
నీవే నా ధ్యానం
నీవే చెలియా నీవే చెలియా
నీవే నా హృదయం నీవే నా ప్రయణం
నీవే నా లోకం
Nee Needavutha Full Video Song - Rakshasudu | Suriya, Pranitha Subhash
Check out the full video song Nee Needavutha from the film 'Rakshasudu'. Set "Nee Needavutha" as you...

ఇన్ని రాసులయునికి యింతి చెలువపురాశి
కన్నె నీరాశికూటమి గలిగిన రాశి

కలికి బొమవిండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి

చిన్ని మకరాంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నెపాయపు సతికి కన్నెరాశి
వన్నెమై పైడిఁదులతూగువనితకుఁ దులారాశి
తి
న్ననివాడి గోళ్ళసతికి వృశ్చికరాశి

ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతి కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతిఁ గలసె ప్రియమిధున రాశి
Sruthilayalu Songs - Inni Raasula - Sumalatha - Rajasekhar
Watch Rajasekhar Sumalatha's Sruthilayalu Telugu Movie Song With HD Quality Music : K V Mahadevan Ly...

దేవాంతకుడు చిత్రం కోసం ఆరుద్ర గారి కలం నుంచి జాలువారిన ఈ ప్రణయగీతాన్ని, అశ్వథ్థామ గారి స్వరపరచిన ఈ అద్భుత బాణిని పి.బి శ్రీనివాస్, ఎస్.జానకి గార్ల మధుర స్వరంలో వినండి. వింటూ పాడుకోండి...

ఎంత మధుర సీమ..ప్రియతమా
సంతతము మనమిచటే సంచరించుదామా.. //ఎంత..//

వినువీధుల తారకలే విరజాజుల మాలికలై
కనులముందు నిలువగా, నీ కురులులలోన ముడిచెదనే..//ఎంత//
గగన గంగ అలలలోన కదిలి ఆడు తామరలే
కరములందు వచ్చి చేర నీ చరణపూజ చేయుదునా ..//ఎంత//
ఎటుచూసిన అందమే చిందును మకరందమే
ఈ వన్నెల వెన్నెలలో ఓలలాడు తూలుదమా..//ఎంత//
కమ్మని ఈ వనమందున కలిసి మెలిసి పాడుదమా
కల్పవృక్ష ఛాయలోన కాపురమే చేయుదమా...//ఎంత//
Devanthakudu | Enta Madhura song
Listen to one of the popular melodious romantic songs,"Enta Madhura Seema" sung by PB Sreenivos and ...
ఓం శ్రీమాత్రేనమ: = మహాలక్ష్మీ స్వరూపిణియై సంపదలను ప్రసాదించు జననికి నమస్కారము.(27-08-015)
లలితాసహస్రనామావళి-2 - 28-08-2015
ఓం శ్రీ మహారాజ్ఞైనమ: = సామ్రాజ్య లక్ష్మీస్వరూపిణి యై మహారాజ్ఞిగా చరాచర విశ్వాన్ని పాలించు దేవికి వందనాలు.


4. ఓం చిదగ్నికుండ సంభూతాయైనమ: = చిత్ అంటే బ్రహ్మతేజస్సు. అట్టి తేజస్సు యొక్క అగ్నికుండం నుంచి అమ్మ ప్రాదుర్భవించింది. బ్రహ్మతేజస్సు అనే అగ్నికుండం నుంచి ఉద్భవించిన దివ్యతేజోమయికి నమస్కారం. 
5. ఓం దేవకార్య సముద్యతాయైనమ: = దేవకార్యములు అంటే సృష్టి స్థితి లయములు,దుష్టశిక్షణ, శిష్టరక్షణ మొదలగునవి. ఈ కార్యములన్నీ చేయడానికి సంసిధ్ధురాలైన జగజ్జననికి నమస్కారం. ( సృష్టి చేసేది బ్రహ్మ, స్థితి కి విష్ణుమూర్తి, లయానికి శివుడు ఉన్నారుగా? వారిలో శక్తి లేకపోతే వారు ఆ కార్యాలేమీ చేయలేరు. వారిని ఉపకరణాలుగా చేసుకుని దేవకార్యాలన్నీ జరుపుతున్నది లలితాదేవే.)

 

image not displayed

1 comment: