Friday 1 July 2016

Generala Essayes for themonth of 7/2016

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - తెలుసుకోతగ్గ విషయ ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు   

భగత్ సింగ్






శ్రీమద్భాగవతం – (కధలు .. 1.)
(బ్రహ్మ శ్రీ చా గంటి .) 

భరతుడు ఒక సారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు.
ఆయనకు ఉపనయనం చేశారు. తరువాత ఆయనకు మనస్సులో ఒక భావన ఉండిపోయింది. ‘అప్పుడు పులహాశ్రమానికి వెళ్లాను. లేడిమీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగోలాగ కష్టపడి మనసులో భగవంతుడిని పెట్టుకుని లేడిని వదిలి ఇపుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపునా పుట్టాను. ఇప్పుడు కానీ నేను గాయత్రిని చేయడం, ఈయన చెప్పిన మంత్రములన్నీ నేర్చుకుంటే నాకు వివాహం చేస్తానని నాకు పెళ్ళి చేసి నన్ను సంసారంలో పెడితే రోపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మరల భ్రష్టుడనయిపోయి మరల ఎటు జారిపోతానో! అందుకని నేనెవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను. నేనొక వెర్రివాని వలె వుంటే నాకు పిల్ల నిచ్చేవాడెవడు ఉంటాడు?’ అని నిర్ణయించుకుణి వెర్రివాడిలా అలా కూర్చుని ఉండేవాడు. ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు. తల్లి సహగమనం చేసింది. సవతి బిడ్డలయిన అన్నదమ్ములు “వీడికేమి వచ్చు. వీడికి శాస్త్రం ఏమిటి! వేడిని గొడ్లశాల దగ్గర కూర్చోబెట్టండి. పొలానికి పంపించండి. ఆ పనులన్నీ చూస్తుంటాడు అని అతనిని ఒరేయ్ పేద ఎత్తరా అనేవారు. ఎత్తేవాడు. పాసిపోయిన అన్నం పెడితే మారుమాట్లాడకుండా అదే తినేవాడు. ‘సర్వం బ్రహ్మమయం జగత్’ అని బ్రహ్మమునందు మనస్సు కుదుర్చుకుని ఉండిపోయాడు. ఒకరోజు అన్నదమ్ములు ‘నువ్వు పొలానికి వెళ్ళి పంటని కాపలా కాయరా” అన్నారు. ఆయన పొలం వెళ్ళి మంచెను ఎక్కి వీరాసనం వేసుకుని కూర్చున్నాడు. 

లోకమునందు కొంతమంది చిత్రవిచిత్రమయిన ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు లేని ఒక వ్యక్తి కాళికా దేవికి మంచి అవయవ హీనత్వం లేని వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు పుడతారు అనుకుని వీడెవడో బాగానే ఉన్నాడు. మాట కూడా మాట్లాడడం లేదు వీడిని తీసుకుపోదాం అని వెళ్ళి తాళ్ళు వేసి కడుతున్నారు. బ్రహ్మజ్ఞానుల జోలికి వెళితే లేనిపోని ప్రమాదములు వస్తాయి. చక్కగా కట్టించేసుకున్నాడు. పద అన్నారు. వెళ్ళిపోయాడు. ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ఏదో పెట్టారు. తినేశాడు. తరువాత వంగు, నరికేస్తాము అన్నారు. వంగాడు. కత్తియందు బ్రహ్మము, నరికేసేవారియందు బ్రహ్మం. అంతటా బ్రహ్మమును చూసి తలవంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహంలోంచి బయటకు వచ్చి ‘ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అంతటా ఈశ్వర దర్శనం చేస్తున్నవాడు. ఆయన మీదనా మీరు కత్తి ఎత్తుతారు అని కత్తి తీసి ఆ వచ్చినవారి శిరసులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేశాడు. బ్రహ్మమే అనుకుని ఒక నమస్కారం పెట్టుకుని మరల తిరిగి వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తుంటే సింధుదేశపు రాజు రహూగణుడు (రాహుగణుడు) ఇక్షుమతీ నదీతీరంలో వున్న కపిల మహర్షి దగ్గర తపోపదేశం కోసమని వెళుతున్నాడు. బోయీలు పల్లకిని మోస్తున్నారు. అందులో ఒక బోయీకి అలసట వచ్చింది. వాడిని అక్కడ వదిలేశారు. నాలుగో బోయీ కోసం చూస్తుంటే ఈయన కనపడ్డాడు. మంచి దృఢకాయుడై ఉన్నాడు. ఈయనను తీసుకురండి పల్లకీ మోస్తాడు అన్నారు. 

బాగా పొడుగయిన వాడు పల్లకీ పట్టుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఈయన పల్లకీ మోస్తున్నాడు. అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనంద పడిపోవడంలో ఒక్కొక్కసారి ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి అడుగులు తడబదేవి. అటువంటప్పుడు ఎత్తు పల్లములకు లోనయి పల్లకీ లోపల కూర్చున్న రాజుగారి తల పల్లకి అంచుకు గట్టిగా తగిలేది. ఆయన రెండుమూడు మాటలు చూసి ‘ఎందుకురా అలా ఎగిరెగిరి పడుతున్నారు. ఒంటిమీద తెలివి ఉందా’ అని అడిగారు. వాళ్ళు ‘అయ్యా, మాతప్పు కాదు. కొత్త బోయీ సరిగా లేదు. వీడి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాడు’ అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చి ఆ బోయీవంక చూసి పరిహాసమాడాడు. మోస్తున్న వాడు బ్రహ్మజ్ఞాని. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడడం. రాజుగారు పల్లకి తేరా తప్పించి క్రిందికి చూసి ‘తిన్నగా నిందించకుండా పరిహాసపూర్వకమయిన నింద చేశాడు. అలా చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తాను అన్ని మాటలు అన్నాడు కాబాట్టి జాగ్రత్తగా మోస్తాడని రాజు అనుకున్నాడు. ఈయన మరల బ్రహ్మమునందు రమించిపోతూ మళ్ళీ దూకాడు ఎందుకో. మళ్ళీ రాజుగారి బుర్ర ఠంగుమని తగిలింది. అపుడు రాజు ‘ఒరేయ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపడడం లేదు. నిన్ను రాజ దండనము చేత నా మార్గములోనికి తిప్పే అవసరము నాకు కనపడుతోంది. పలకవేమిటి?’ అన్నాడు. ఇప్పటివరకు పుట్టిన తరువాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ‘రాజా, నువ్వు మాట్లాడింది నిజమే. నువ్వు ఎవరికి శిక్ష వేస్తావు? ఈ దేహమునకు శిక్ష వేస్తాను అంటున్నావు. ఈ దేహం నేను కాదు. నేను ఆత్మని అని ఉన్నవాడిని నేను. ఇది నీ మాయని నీ అజ్ఞానాన్ని బయటపెడుతోంది’ అన్నాడు. 

ఈమాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. ‘అయ్యబాబోయ్ మోస్తున్న వాడెవడో సామాన్యుడు కాదు. ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు’ అని పల్లకి ఆపమని గభాలున క్రిందికి దూకి ఆయనవంక చూస్తె గుర్తు పట్టడానికి యజ్ఞోపవీతం ఒక్కటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా! నన్ను పరీక్ష చేయడానికి బహుశః కపిలుడే ఇలా వచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు? నిజం చెప్పండి. మీవంటి బ్రాహ్మణులు జోలికి నేను రాను. మీమాటలు నన్ను చాలా సంతోష పెట్టాయి. నాకొక్క మాట చెప్పండి. లేనిది ఎలా కనపడుతోంది? ’ అని క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళమీద పడ్డాడు రాజు. అపుడు భరతుడు నవ్వి ‘రాజా, నువ్వు ఉపదేశం పొందడానికి అర్హత పొందావు. అందుకని చెపుతున్నాను. ‘నేను’ అనబడే పదార్థము ఈ కన్నుల చేత చూడలేనిది కాదు. ఈ కన్నులకు కనపడుతుంది. దీనిని తిరస్కరించక పోతే ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇప్పుడు ఇంకా నీకు బోధ ఎందుకు? ఈ నేత్రానికి మూడిటి వలన అనేకము కనపడతాయి. అవి కాలము బుద్ధి నామములు. రూపము ఉంటే నామము ఉంటుంది. నామము ఉంటే రూపము ఉంటుంది. నామము రూపము రెండూ లేకపోయినట్లయితే మాయ పోయినట్లు అవుతుంది. రూపము చేత నామము మారదు. నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు. కానీ ఈ రెండూ అశాశ్వతమే. నామము, రూపము రెండూ అబద్ధమే. నామ రూపములుగా కాలగతియందు బుద్ధిచేత తిరస్కరింపబడుతుంది. మాంస నేత్రముచేత మగ్నము చేయబడుతుంది. అది నీవు తెలుసుకుంటే ఇప్పుడు నేను చెపుతాను. ఒక్కమాటు ఆలోచించు. ఇది పృథివి. ఈ భూమిమీద నా చరణములు పృథివి. నా చరణముల మీద నా కాళ్ళు పృథివి. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారమునకు నీవు ఒక పేరు పెట్టుకున్నావు. ‘నేను మహారాజును – వాడు బోయీ’ అనుకుంటూ నన్ను నిందించి మాట్లాడుతున్నావు. కానీ నీవు మాట్లాడడానికి ఆధారమయిన ఆత్మా, నాలో వున్న ఆత్మా ఒక్కటే. రెండూ రెండు శరీరములను ధరించాయి. ఈ రెండూ నామరూపముల చేత గుర్తించ బడుతున్నాయి. కానీ ఇవి మాయ. వీటికి అస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలుసుకున్నట్లే. నీకు తత్త్వం అర్థం అయిపొయింది. కానీ సంసారం అనే అడవి దీనిని అర్థం కాకుండా చేస్తుంది. అక్కడ బందుత్వములనే తోడేళ్ళు ఉంటాయి. అవి మేకల వెంట తరుముకు వచ్చినట్లు వస్తాయి. ప్రతివాని ఇంట్లో ఈగలు ఉంటాయి. పొమ్మంటే పోవు. వాటిని తోలుకు తిని బతుకుతూ ఉంటారు. అలాగే పిల్లలు భార్య వెంబడించి ఉండనే ఉంటారు. కామన పోయినట్లు ఉంటుంది. మళ్ళీ వచ్చి చేతుతుంది. రాజా, వ్యవసాయం బాగా చెయ్యాలని ఆనుకున్న వాడు కలుపు మొక్కని కత్తిరిస్తే సరిపోదు. మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. మొదటంట తీసి బయటపారేసి ఎండిపోయిన తరువాత తగులబెట్టెయ్యాలి. తరించాలనుకున్నవాడు కామనను ముందు గలవాలి. 

అలా గెలవలేకపోతే ఏమవుతుంది? అడవిలో వెళుతుండగా నిన్ను చూసి ఆరుగురు దొంగలు వెంట పడతారు. ఆ ఆరుగురు ఎక్కడో లేరు. ఇక్కడే ఉన్నారు. అయిదు ఇంద్రియములు, మనస్సు – ఈ ఆరుగురు లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా, ఇంత ధర్మం కలిగినా ఎత్తుకు పోతారు. నువ్వు పతితుడవు అయిపోయి పతనం అయిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడం శరీరంలోకి వెడుతూ ఉండడం, ఇది ‘నేను’ అనుకోవడం దీని అనుబంధములతో మగ్నం అయిపోవడం ఈశ్వరుడిని తెలుసుకోవడం. అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు. రాజా, ఏనాడు నీ జ్ఞాన నేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల పాదసేవ చేస్తావు. వారి పాదముల మీద పడతావు. బ్రహ్మ జ్ఞానమును పొందుతావు. భక్తితో ఉంటావు. కర్మా చరణమును చేసి వైరాగ్యమును పొందుతావు. అదే మనిషి పొందవలసిన స్థితి. అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెబితే రహూగణుడు విని వైరాగ్యమును పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతమును తెలుసుకున్నాడు భరతుడు మోక్షమును పొందాడు. 

ఇలా ఎంతోమంది ఒక చిన్న పొరపాటుకి ఎన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది. మనిషి సాధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అరణ్యమునకు వెళితే మోక్షం వచ్చేస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు. ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటకు వెళ్ళి ఋషభుడు మోక్షమును పొందాడు. ఇంట్లో ఉంటే నన్నేదో పట్టేసుకుందని భయపడిపోయి అరణ్యము వెళ్ళి మూడు జన్మలు ఎట్టి మోక్షం పొందాడు భరతుడు. కాబట్టి నిన్ను పాడుచేసేది ఇల్లు కాదు. నీలోపల వున్న మనసు. అందుకే ఆధునిక కవి ఒకమాట అన్నారు. 

“తలనీలాలు అస్తమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది? మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకు నిలయమయిన మనస్సును ప్రక్షాళన చేయాలి. నీ మనస్సే నీ ఉన్నతికి గాని, పతనమునకు గాని కారణము అవుతోంది అని ఒక అద్భుతమయిన విషయాన్ని నలుగురి యందు నాలుగు విషయములను ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమయిన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో తరించదానికి మనకి వున్న అనుమానములను నివృత్తి చేస్తూ వ్యాస భగవానుడు ఇచ్చిన అమృత ఫలాలను పోతన గారు ఆంధ్రీకరించి మనలను ఉద్దరించారు.
భాషా భారతి's photo.

శ్రీమద్భాగవతం – (కధలు .. 1.)
(బ్రహ్మ శ్రీ చా గంటి .)
భరతుడు ఒక సారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపు...


మీ శక్తి మీకు తెలిసా ???
దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం
*మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. *మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
* హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
* మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి
*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
* మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును
*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి
* మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును
*మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి *ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
* మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి
*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి
*మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు
* మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.
*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది
*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము
*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి
*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
*మానవుని మెదడుకు నొప్పి తెలియదు
*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది
*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
* మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది
*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది
*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును
*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు
* రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది
*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును
*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి
*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన
*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది
* రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి
*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు
*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది
*మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును
*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును
*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనునుv ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును
*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును
*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది
*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది
*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.
*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.
ఇప్పుడు చెప్పండి మీలో ఎమి తక్కువగా ఉంది? .
ఇక నిరాశ , నిస్పృహ వద్దు.
గమ్యం చేరే వరకు ప్రయానించండి.

" వచ్చి పోవడానికి రాలేదు. ..
ఇచ్చి పోవడానికే వచ్చాము"...




సృష్టి రహస్యం !

పరమేశ్వర తత్త్వానికి రూపం లేదు గుణం లేదు. లింగ భేదము అసలే లేదు. అది ఒక తేజోవంతమైన కాంతి పుంజము. బ్రహ్మ వాదులు దీనినే పరమేశ్వరుడు అంటారు. పరమేశ్వరుడు అన్నా పరమేశ్వరి అన్నా ఒక్కటే , రెంటికీ భేదము లేదు. అది శివ శక్తుల ఏకీకృత రూపము. అది ఒక అవ్యక్తము అనూహ్యమైన శక్తి.

గతములో మహా ప్రళయము వచ్చినప్పుడు, ఈ జగత్తు అంతా నాశనమైపోయింది. ఆ సమయం లో కర్మక్షయమైన జీవరాశికంతటికి మోక్షము సిద్దించినది. కర్మక్షయంకాకుండగా యున్న జీవరాశి తమ కర్మను తమతో బాటు మూటగట్టుకొని మాయలో కలిసిపోయినది. అప్పుడు భూమి జలం లోను, జలం అగ్ని లోను, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశమందు, ఆకాశము అహంకారమునందు, అహంకారము మహా తత్త్వమందు, మహాతత్త్వము మాయ అనబడు అవ్యక్తమందు లీనమైనవి. ఈ రకంగా పంచభూతములను, జీవరాశిని తనలో ఐక్యంజేసుకొనిన మాయ అనబడు అవ్యక్తము అనూహ్యమైన శక్తి ( పరమేశ్వరి ) లో కలిసి పోయినది.

ఇప్పటి సృష్టి ఆవిర్భవానికి ముందు, జగత్తు నంతటినీ తనలో నిక్షిప్తం చేసుకొనిన ఆ పరమేశ్వరి స్వరూపమొక్కటే యున్నది. ఆపరమేశ్వరి ఈ సృష్టిని చేయాలి అని అనుకొంది. అసలు సృష్టిని ఎందుకు చేయాలి? ఇది ఆమె లీలా వినోదం కోసము మాత్రము కాదు. అంతకుముందు ప్రళయము సంభవించినప్పుడు తనలో లీనమైన కర్మక్షయము గాని జీవరాశుల కు ముక్తిని కలిగించుటకొరకు, సృష్టి చేయాలనుకున్నది. ఇక సృష్తి ప్రారంభమైనది. నిరాకారముగా నున్న ఆ పరమేశ్వరి నుంచి సత్త్వగుణప్రధానమైన అవ్యక్తం బయటికి వచ్చినది, అదే మాయ. ఈ అవ్యక్తం లేదా మాయ పరమేశ్వరి అధీనములోనే వుంటుంది. ఈ మాయ వలననే సృష్టి స్థితి లయములు అన్నియు జరుచున్నవి. పిదప రజోగుణప్రధానమైన మహాతత్త్వము పుట్టినది. ఇదే హిరణ్యగర్భుడు. ఈ మహాతత్త్వమునుండి రమోగుణ ప్రధానమైన అహంకారము పుట్టినది. అదే విరాడ్రూపము. ఈ రకంగా పరమేశ్వరినుండి మాయ, మహాతత్త్వము, అహంకారములు ఆవిర్భవించినవి.
అహంకారము నుండి నామరూపాత్మకమైన జగత్తు ఆవిర్భవించినది. ముందుగా రూపాత్మకమైన జగత్తు, అహంకారమునుండి పంచభూతాలసూక్ష్మరూపాలయిన తన్మాత్రలు ఆవిర్భవించినవి, అవియే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఆ తరువాత యీ తన్మాత్రల స్థూల రూపాలయిన పంచ భూతములు ఆవిర్భవించినవి. పంచ భూతాలలో ముందుగా ఆకాశము పుట్టినది. ఆకాశము నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓశధులు నుండి వనస్పతులు, వనస్పతులు నుండి అన్నము ( ఆహారము ) వచ్చినది. ఈ రకముగా రూపాత్మకమైన జగత్తు యేర్పడినది. ఇక నామాత్మకమైన జగత్తు, ముందుగా అవ్యక్తము నుండి ఓంకారము పుట్టినది. ఓంకారము నుండి అకార, ఉకార, మకారములు పుట్టినవి. వాటి నుండి అక్షర సమామ్నాయము పుట్టినది. అక్షరం నుంచి పదాలు, పదాలు నుంచి వాక్యాలు, మంత్రాలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, సంగీతము, సాహిత్యము మొదదలుగునవి యేర్పడ్డాయి. ఈ విధంగా పరమేశ్వరి నుండి ఈ నామ రూపాత్మకమైన జగత్తు యేర్పడినది.

ఇక పంచ భూతాలలో మొదట ఆకాశము పుట్టినది. అకాశ ము లో దాని లక్షణమైన శబ్దము మాత్రము వుంటుంది. ఆకాశము నుండి పుట్టినది వాయువు, వాయువు లక్షణము స్పర్శ. వాయువునందు వాయు లక్షణ మైన స్పర్శ మరియు ఆకాశము లక్షణమైన శబ్దము రెండు వుంటాయి. వాయువు నుండి వచ్చినది అగ్ని. అగ్ని లక్షణము తేజము ( రూపము ). అగ్ని యందు అగ్ని లక్షణమైన తేజము, ఆకాశ లక్షణమైన శబ్దము, వాయువు లక్షణమైన స్పర్శ లు గూడి మూడు లక్షణములను కలిగి యుండును. ఇక అగ్ని నుండి వచ్చినది జలము. జలము లక్షణము రసము. జలమునందు ఆకాశ లక్షణమైన శబ్దము, వాయువు లక్షణమైన స్పర్శ, అగ్ని లక్షణమైన తేజము మరియు జలము లక్షణమైన రసములు కలిగి నాలుగు లక్షణములు యుండును. జలము నుండి పుట్టినది భూమి. భూమి లక్షణము గంధము. భూమి యందు ఆకాశ లక్షణమైన శబ్దము, వాయువు లక్షణమైన స్పర్శ, అగ్ని లక్షణమైన తేజము, జలము లక్షణమైన రసము, భూమి లక్షణ మైన గంధము అను ఐదు లక్షణములు కలిగి యుండును.

పంచ భూతాలలో గుణత్రయాన్ని కలిపి అనంతకోటి బ్రహ్మాండాలను, ఆబ్రహ్మాండాలకు తగిన లోకాలను, ఆలోకాలకు తగిన గోళాలను, స్థూల శరీరాలను సృష్టించింది పరమేశ్వరి. ఆ పరమేశ్వరి పంచ మహాభూతాలను రజోగుణాన్ని నాలుగు భాగములు చేసి అందు మూడు భాగములనుంచి ప్రాణశక్తిని, నాల్గవభాగముతో కర్మేంద్రియాలను సృష్టించింది.
ఆతరువాత పంచభూతాల సత్త్వగుణాన్ని నాలుగు భాగములు చేసి, అందు మూడు భాగములనుంచి అంతఃకరణ చతుష్టయాన్ని, నాల్గవ భాగముతో జ్ణానేంద్రియాలను సృష్టించించి. ఇంద్రియ పాలకులను సృష్టించింది. తరువాత పంచమహాభూతముల తమో గుణమును నుండి స్థూలశరీరములను సృష్టించింది. ఈ రకముగా జగత్తులో జ్ణానేంద్రియాలను, కర్మేంద్రియాలను, స్థూల సూక్ష్మ శరీరాలను సృష్తించుట జరిగినది.
అప్పుడు ఆ పరమేశ్వరి తాను సృష్టించిన స్థూల శరీరములలో ప్రవేశించ దలచి తాను బ్రహ్మ రంధ్రముద్వారా స్థూల శరీరములన్నిట వ్యాపించి సర్వము తానై నిండి యున్నది.

(ప్రాంజలికి ప్రభకు పంపినవారు రచయత డి.సత్యనారాయణగారు, సేకరణ