Thursday 10 June 2021

 





ఆరాధ్య ప్రేమ లీల (మనసైన మగుఉంటే)  
 రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తొలి పొద్దు మేలు గొలుపు మలి రాత్రి ముద్దు సలుపు 
తొలి కాంతి ఆశ మెరుపు  మలి హాయ్ సద్దు వలపు 

తొలి సేవ నిత్య మెరుపు  మలి మాయ వద్దు గెలుపు 
తొలి  పూజ భక్తి తలపు  మలి వెన్నె లద్ది  మలుపు  

తొలి వేళ వెచ్చ దనము మలి నీడ చల్ల దనము 
తొలి గంధ పచ్చ దనము మలి మౌన సేవ తనము 

తొలి హంస పంచు దనము మలి హంస ప్రేమ తనము      
తొలి వంట ఇచ్చు తనము మలి పంట  వెచ్చ తనము 

కాంతి కిరణం చల్లదనం తరుము 
ప్రేమ మాధుర్యం కోపం తరుము 
సంసార సౌఖ్యం సంతాన భాగ్యము 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


గురువుగారు జన్మ  రహస్యం తెలప గలరు , శిష్యులారా ముందు ఈ పద్యాలు   అర్ధం చేసుకోండి కొంత తెలుస్తుంది అట్లాగేనండి   

ఉ ::మాతయు తండ్రియున్ మనకు మంగళగౌరులరూపులేయనన్

       ఆతతసేవయే నిలుపు యాతనలన్నియు జీవికిన్ సదా

       కాతరభావమే మదినిఁగన్పడదెన్నడువారిసన్నిధిన్

      యాతమునందునున్ స్మరణహానినిఁగూర్చదు శంభునామమున్ !!! "


ఉ :: ఉల్లము ఝల్లనే మనిషి ఊయలు ఊగియు మార్పు కల్గుచున్

         మల్లెల తీగలే మనసు మక్కువ మోహము పెంచు చుండియున్

        చల్లని వేళలో తరుణ జల్లులు హాయిని కల్గ చేయుచున్

        జెల్లని రూకవోలె తమ చేష్టలతో మనసంత సంతసమ్


అంబరమ్మున మేఘాలు రంగులు మారుస్తూ కదిలేను

మేఘము లన్నీ గాలి వాటముతో దేశదేశాలు తిరిగే ను

ఉరుము మెరుపుల వల్ల మేఘాలు అన్ని కురవ సాగేను

వాన చినుకులు మోదలయై వర్షము అన్నిచోట్లా సొగేను


అలల కదలికల ఉరవడి ని ఎవరు ఆపలేరు

అలలు గట్టు చేరువరకు ఎక్కడ ఆగనే ఆగవు

నురుగు ల పరుగుల అలలు నీటిలో కలసిపోవును

అలలపై పడవలు పెద్ద ఓడలు సాగి పోవుచుండేను


తనువును తమకమ్ము దారి మనసుని తెలిపెన్

వినయపు వివరమ్ము విద్య వయసుని నిలుపున్

కని కర సమయమ్ము  కార్య వివరము తెలిపెన్        

దొన పులి మొనయమ్ము శాఖి .తుదలని  పలికెన్....


వీరా వేశము ఎందుకే పనులనే వర్ణించ వాక్యంబునన్

ఆరాటమ్ముగనే సదాసేవలునే చేసేటి ఆదర్శమున్

పేరాశే ధనమందు ఉండు వినయం ప్రేమంత అత్యాశయున్

ఔరా సత్కవి వింతగా సులభమా యష్టావధానంబునన్


జన్మల్లో చరితమ్ము యే విషయ మే జీవమ్ము శృష్టించు టే

ప్రాణమ్మే పదిలమ్ము గా బతుకు టే ప్రత్యేక భావమ్ము యే

మానమ్మే నిరతమ్ము సేద్యము గా పాలించి పోషించు టే

దానమ్మే తరుణానంద ము కలిగే దారిద్ర్య నిర్మూల మే

Thursday 3 June 2021

నిజమైన సంపద 

     పెద్దపెద్ద భవంతులు, ఎకరాలకొద్దీ పొలాలు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాల్లో ప్రయాణం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం సంపదగా పరిగణిస్తాం. డబ్బుతోనే గొప్పతనం, గౌరవం వస్తాయనే ఆలోచన కొంతవరకు వాస్తవమే అయినా నిజమైన సంపద ఇది కాదు! 

 మనిషి ఏదైనా సాధించడానికి శరీరమనే ఉపాధి కావాలి. ఇది ఉన్నంతవరకే మనమేమి చేయాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్నా సాధ్యమయ్యేది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఇహపర *సాధనకు సాధనం ఈశరీరమే. 

 కష్టకాలంలో మన పక్కన స్నేహితులను కలిగి ఉండటమన్నది, ఎంతో గొప్ప సంపద. సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దేది చదువు. విచక్షణ, వివేకాలనే చక్షువులనిచ్చి మనిషిని సన్మార్గంలో పయనించేటట్లు చేస్తుంది. తన పుట్టుకకు ఇతర ప్రాణుల పుట్టుకకు భేదాన్ని తెలుసుకునే మేధనిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని, కర్తవ్యాన్ని మనిషికి *బోధపరచేది చదువే. అది చాలా విలువైన సంపద. 

 మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎదుటివారితో ఎలా మసలుకోవాలో, ఎలా సంభాషించాలో ప్రథమంగా తన కుటుంబ సభ్యులనుంచి, తన పెద్దలనుంచి గ్రహించాలి. వారి సత్ప్రవర్తనను అలవరుచుకోవాలి. అది   సమాజంలో తోటివారితో ప్రవర్తించే తీరుపై ప్రతిబింబించి సత్ఫలితాలనిస్తుంది. సంబంధ, బాంధవ్యాలను నిలుపుకొనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన బంధాలు హాయిగా సాగిపోతాయి. అందరినీ కలుపుకొనే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే. 

 సంపదంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు. మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు. అలాగని ఎక్కువగా పొదుపు చేయడమూ కాదు! సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తరవాత ఇక సంపాదించవలసిన అవసరంలేదన్న భావన కలగడం. దాన్నే తృప్తి అంటారు. అది మనిషికి కలగనినాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరవవుతుంది. కంటిమీద కునుకే ఉండదు. తృప్తి కొంతమందికే దక్కే అరుదైన సంపద. 

 తమ సృజనతో అద్భుతమైన రచనలు చేసేవారు, నిష్ణాతులైన కళాకారులు, రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు, ప్రయోగశాలలో అహరహం పరిశోధనలు చేస్తూ మానవాళికి ఉపకరించే అనేక వస్తువులకు రూపకల్పన చేసే శాస్త్రవేత్తలు, భావితరాలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులు... ఏ దేశానికైనా విలువైన సంపద. 

 మహాపురుషులందించిన జ్ఞానసంపద, మన పూర్వీకులందించిన విజ్ఞానం, పెద్దలు మనకోసం ఏర్పరచిన సదాచారాలు, సత్సంప్రదాయాలు, మన జీవితానికొక క్రమశిక్షణను, పథాన్ని ఇస్తాయి. వాటిని పాటిస్తూ, వారు చూపిన ధర్మపథంలో కొనసాగడమే ఆ వారసత్వ సంపదకు మనమివ్వగలిగే నిజమైన గౌరవం. అది ఘనమైన సంపద. 

 దాస్యశృంఖలాలను బద్దలుచేసి దేశమాతకు స్వేచ్ఛా ఊపిరులూదడంలో తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన ఎందరో త్యాగధనులు తరతరాలు మనసులో నిలుపుకోవలసినవారు. వారు జాతికి అమూల్యమైన సంపద .

‘ మనిషి కడవరకు తోడు ఉండాల్సిదేమిటి?’ అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. మనోబలమని సమాధానమిస్తాడు యుధిష్ఠిరుడు. మనవెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద. 

 సంపద అనగానే మనకు వచ్చే లౌకిక దృష్టి, భావనల నుంచి బయటపడి నిజమైన సంపదను గుర్తెరగాలి. జీవితానికొక ఔన్నత్యం చేకూరేదప్పుడే!

--(())--

భగవంతుడు అంటే ఏమిటి...?

భగవంతుడు అంటే కోర్కెలు తీర్చేవాడండి. ఆయనంటే నాకు ఇష్టం అండి. భజన చేస్తానండి. ఇది చాలా మందికి తెలిసిన భగవతత్త్వం. అర్థం తెలీదు. కోర్కె తీరింది. ఇష్టం పెరిగింది. ఆయన్ని పట్టుకున్నాను. అంతకు మించి అర్థం పర్థం లేదు.

ఇష్టం అంటే వారి గురించి తెలుసుకోవడం. భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుంటే నువ్వు భగవంతుడు అయిపోతావు. అంతే తప్ప ఏ కోరిక కావాలంటే అది తీర్చేవాడు కాదు. ఆయన గురించి విచారణ చేయాలి.

కాకపోతే కోరిక కోసం భక్తులు తప్ప అర్థం చేసుకోవడానికి కాదు. ఎవరైనా అర్థం చెబుతున్నా  తెలుసుకునే ప్రయత్నం చేయం. మనంతట మనం తలుపులు మూసేస్తే సూర్యుడి కిరణాలు మనకి చేరవు. తలుపు తెరవండి. కిరణాలను ప్రసరించనివ్వండి. ఎంతవరకు కోరిక తెర అడ్డు ఉంటుందో అంతవరకు భగవంతుడిని ఆస్వాదించలేము.

pa రమాత్మని ఎందుకు తెలుసుకోవాలి?పరమాత్మ ఆధారమై ఉన్నాడు.పరమాత్మ వలన ఏర్పడింది. పరమాత్మ చేత నిర్వహింపబడుతుంది.

పరమాత్మే ప్రపంచమై ఉన్నాడు. ఎలా? సముద్రము పైన కెరటములు ఉన్నాయి.సముద్రం వలన కెరటాలు ఉన్నాయి. సముద్రం చేత కెరటాలు ఉన్నాయి.సముద్రమే కెరటం. మనం కెరటం కెరటం అంటున్నాం కదా.. సముద్రం లోని జలం. సముద్రమే జలం కదా! మనం ప్రత్యేక దృష్టితో కెరటం చూస్తున్నాం కనుక పైకి లేచింది. ఇంత సేపు ఉంది అంటున్నాం. సముద్ర జలం తప్ప కెరటంలో అన్యమైన జలం ఉందా! లేదు.

అలానే ఈ సృష్టి యావత్తు భగవంతుడే ఉన్నాడు.అన్యమైనది ఏదీ లేదు. లేనే లేదు. పరమాత్మ యందు పరమాత్మ వల్ల పరమాత్మ చేత జరపబడుతున్న ప్రపంచము పరమాత్మ యొక్క స్వరూపమే.

)000000)

-అవధూత అంటే ఎవరు ? సన్యాసి అంటే ఎవరు ?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు :

అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.

అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము.

సన్యాసం నాలుగు రకాలు .

౧. వైరాగ్య సన్యాసం :

వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది .

ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు .

అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.

౨. జ్ఞాన సన్యాసం :

సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి

సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ,

ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .

౩. జ్ఞాన వైరాగ్య సన్యాసం :

సాధన ద్వారా , ధ్యానం ద్వారా

అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని

నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు .

౪. కర్మ సన్యాసం :

బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ,

ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం .

ఈ సన్యాసులు ఆరు రకాలు :

౧. కుటిచకుడు :

శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.

౨. బహుదకుడు :

ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు

౩. హంస :

ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.

౪. పరమహంస :

వెదుర దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి

నిరంతర సాధన లో ఉంటారు .

౫. తురియాతితుడు :

దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .

౬. అవధూత :

ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిధ్య నేను సత్యం అంటూ ,

నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.

నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము,

అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి

అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ,

దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ

రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.

కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు … ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం )

అవధూత’ అంటే ఎవరు?

బట్టలు విప్పుకు తిరిగే పిచ్చివాడా? భగవదన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరా?

కాదు! కానే కాదు!

ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచానీయమో ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలకు అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరినవారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.

అట్టి అవధూత స్థితిని తెలియజెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంతవాజ్గ్మయంలో ఇది అతి ప్రశస్తమయినది. ఇది అష్టాధ్యాయాల్లో 289 గీతలతో విరాజిల్లుతున్నది. తీవ్ర వైరాగ్యవంతులై, మొక్షాపేక్షగలవారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరు, ఎవరికీ బోధించేరు?

త్రిమూర్తుల అంశగా ఆవిర్భవించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యస్వామికి దీనిని బోధించేరు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ.

ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు? ఏమా కథ?

కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.

ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.

అనసూయ పాతివ్రత్యమహిమ తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డుచెప్పక అనసూయను పరీక్షించడానికి సన్యాసుల వేషంలో అత్రిమహాముని ఆశ్రమానికి వస్తారు. అనసూయాదేవిని ‘నిర్వాణభిక్ష’ కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు! అనసూయ, అప్పటి కప్పుడు తన చనుదోయి చేపుకి రాగా, పాలను ఆపిల్లలకు కుడుపుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అనసూయ త్రిమూర్తులవంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ కావాలన్నది గనుక, అత్రిమహాముని ఆ ముగ్గురు పసిపాపలను కౌగలించుకోగానే, వారు ముగ్గురూ అదృశ్యమై మూడు శిరస్సులు, ఆరు చేతులుగల ఒకే పిల్లవాడిగా మారిపోతారు. అత్రిమహాముని ఆ పిల్లవానికి ‘దత్తాత్రేయుడు’ అని నామకరణం చేస్తాడు.

త్రిమూర్తులు అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రిమహామునీశ్వరుని పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తత్రేయుడే నిత్యవైరాగ్యంతో అవధూతలా అడవిలో సంచరిస్తున్నపుడు ఎదురుపడ్డ సుబ్రహ్మణ్యస్వామికి ఆయన అభ్యర్థనమేరకు అవధూత గీతను బోధిస్తాడు. 

ఇంతకీ అవధూత లక్షణాలేమిటి?

ఆశాపాశాళ నుంచి విడువబడినవాడు, ఆదిమధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానందస్వరూపుడు అయిన అట్టివానికి ‘అ’ కారం అతని లక్షణం.


ఎవని చేత వాసనలు విడువబడినవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలలో ఉనికి కలిగివున్నాడో అట్టివానికి ‘వ’ కారం లక్షణమైఉన్నవాడు

ఎవని శరీరం ధూళిధూసరితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవడు ధ్యాన ధారణల విముక్తుడై ఉన్నాడో వానికి ‘ధూ’కారం లక్షణమై ఉన్నది.


తత్త్వచింత కలిగియున్నవాడు, చింతాచేష్టాలు వీడినవాడు, అహంకార మాంద్యములను విడిచినవాడు ఎవడో వానికి ‘త’కారం లక్షణం.

 *1. శ్రీమాతా*
 -----------------
 లక్ష్మీ స్వరూపిణి యై అన్ని సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము.
 
            ఈ లోకంలో ఏ ప్రాణి అయినాసరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మా ! అంటుంది. అంటే తన తల్లి వచ్చి ఆ బాధను తీరుస్తుంది అని ఆ ప్రాణి నమ్మకం. జన్మానాం నరజన్మ దుర్లభం. జన్మలన్నింటిలోకి దుర్లభమైనది మానవజన్మ. ఎన్నో వేల జన్మలు ఎత్తిన తరువాత పూర్వజన్మలలో చేసిన మంచి ఫలితము ఆధారంగా మానవజన్మ వస్తుంది. అందుకే మానవజన్మ ఉత్తమమైనది. ప్రాణులకన్నింటికీ ఇంద్రియాలుంటాయి.

            ఆహార నిద్రా మైధునాలు అన్నిటికీ సమానమే. కాని మానవులకు మనస్సు అనబడే పదకొండవ ఇంద్రియము ఒకటి ఉంటుంది. దీనివల్లనే అతడు ఆలోచించగలుగుతాడు. అంటే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది. పాపపుణ్యాల యోచన ఉంటుంది. ధర్మాధర్మాల వివేచన ఉంటుంది. ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నోవేలసార్లు జన్మ ఎత్తవలసి ఉంటుంది. చివరకు పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను చేరుతుంది. ఈ లోగా కొన్ని లక్షల సార్లు పుట్టటం జరుగుతుంది. ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఉంటుంది. లోకంలో పిల్లలు లేని తల్లులుంటారు. కాని తల్లిలేని పిల్లలు మాత్రం ఉండరు. అందుచేతనే ప్రతివారికి ఒక తల్లి ఉంటుంది. మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని పిలిచినట్లు ? పోనీ ఈ జన్మలోని తల్లినే పిలిచాడు అనుకుందాం. ఆమె తన బిడ్డ యొక్క కష్టాలు తీర్చగలుగుతుందా ? తాపత్రయాలు పొగొట్టగలుగుతుందా ?

            తాపత్రయాలు మూడురకాలు అవి.

1. ఆధి భౌతికము : తనకన్న ఇతరులైన అనగా భార్యాపుత్రులకు సంభవించిన వ్యాధుల వలన, సర్పవృశ్చికాది బాధల వలన పరితపించుట.
2. ఆధి దైవికము : ప్రకృతి సిద్ధమైన వాటివలన కలుగుబాధలు. అగ్ని ప్రమాదము, భూకంపము, వరదలు మొదలైన వాటివల్ల కలుగునవి.
3. ఆధ్యాత్మికము : తన దేహంలో ఉన్న ఇంద్రియాలకు కలిగిన వ్యాధులచే దుఃఖించుట. అలసత్వము, కపటము, అవిశ్వాసము, శ్రద్ధ మొదలైనవి.

            బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది. మరి ఆ తల్లి అంటే ఎవరు ?

            అమ్మల గన్నయమ్మ ముగు రమ్మల మూలపుటమ్మ తల్లులకే తల్లియైనటువంటిది. ముగురమ్మలు అంటే త్రిశక్తులు. వారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. వారిని సృష్టించినటువంటిది. ఆవిడే పరమేశ్వరి. జగన్మాత రాత్పరి. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ దేవియే అమ్మ. ఆమె కరుణామయి.       దయాసముద్రురాలు. అందుకే అమ్మా ! అని ఒకసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది. మరి శ్రీ అంటే ఏమిటి ? శ్రీ అనేది గౌరవ వాచకము. విశేషణము. గొప్పదయిన అని అర్ధం. శ్రీయనలక్ష్మి, శ్రీయనగారి, శ్రీయనసరస్వతి. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అర్ధం కాబట్టి ఈ ముగ్గురికీ మూలస్వరూపురాలయినది.

ఆమెయే సదాశివుని అర్థాంగి పరాశక్తి. దేవీ భాగవతంలో త్రిమూర్తులు ఒక దివ్య విమానం ఎక్కి మణిద్వీపం చేరతారు. అక్కడ పరమేశ్వరి శ్రీచక్రం మీద కూర్చుని దర్శనమిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు “తల్లీ నీవే పరమేశ్వరివా ? నీవే పరబ్రహ్మవా ? నీ తత్త్వాన్ని మాకు వివరించవలసింది”  అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవి చెబుతుంది. “నీటిలోని చల్లదానాన్ని నేనే. అగ్నిలోని వెచ్చదనాన్ని నేనే సూర్యునిలోని తేజస్సును, చంద్రుని లోని మంచును నేనే. నేను లేని వస్తువు జగత్తులో ఏదీలేదు. అంతదాకా ఎందుకు ? మీ ముగ్గురూ కూడా నేను లేకుండా ఏ పనీ చెయ్యలేరు. శక్తితో కలిస్తేనే బ్రహ్మ లోకాలను సృష్టిస్తాడు. విష్ణువు లోకాలను రక్షిస్తాడు. రుద్రుడు సంహారం చేస్తాడు. కాబట్టి నేను లేనిది ఏదీలేదు. చరాచర జగత్తంతా నేనే నిండి ఉన్నాను” అని చెబుతుంది. ఆ పరమేశ్వరియే శ్రీ మాత. ఆమె శక్తి స్వరూపిణి. ఆమె లేకుండా ఏ పనీ జరగదు. అందుకే శంకరభగవత్సాదులవారు సౌందర్యలహరిలోని
         
  మొదటి శ్లోకంలో

  శివ శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
  నచేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితు మపి
  అత స్త్వా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి
  ప్రణన్తుం స్తోతుంవా కథ మకృతపుణ్యః ప్రభవతి ?

            ఓ భగవతీ ! సర్వమంగళ సహితుడగు శివుడు జగన్పిర్మాణశక్తివైన నీతో కూడిననే ఈ జగత్తును సృష్టించటానికి సమర్థుడౌతాడు. అలాకాకపోతే అతడు కదలటానికి కూడా అశక్తుడు. కాబట్టి హరిహర ట్రహ్మాదులచే పూజించుటకుగాని నీకు నమస్కరించటానికిగాని పూర్వపుణ్యము ఉండాలి కదా ?

            అంటే త్రిమూర్తులను సృష్టించినది, వారిచేత పూజించబడేది అయిన ఆ పరదేవతయే  శ్రీమాత. ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తులలో చెప్పబడింది.

            మాతృశబ్దం ఉభయలింగంగా చెప్పబడుతోంది. దేవీభాగవతంలో పరమేశ్వరి తన తత్వాన్ని వివరిస్తూ “ఉపాధి భేదంవల్ల రెండు విధాలయినట్లుగా, అద్దంలో కనిపించే ప్రకృతిలాగా క్రియాసమయంలో భిన్నంగా కనిపించినా పరమావస్థ యందు బ్రహ్మపదార్థం ఒక్కటే. దానికి వైవిధ్యం లేదు. సృష్టిసమయంలోగాని, లయసమయంలోగాని నాకు
స్త్రీపురుష నపుంసక బేధాలు లేవు.” అని చెబుతుంది. అందుచేతనే మాతృశబ్దం ఉభయలింగాత్మకమని చెప్పారు.

            శ్రీ అంటే విషము. మాతి అంటే కంఠము నందుంచుకొనినది. గరళమును    కంఠము నందుంచు కొన్నవాడు. గరళకంఠుడు అన్బప్పుడు పుంలింగము అవుతుంది. మాతా - తల్లి అనే అర్ధంలో స్త్రీలింగమవుతుంది. ఇక్కడ మాతృశబ్దం చాలా గొప్పది. అందుకే దానికి ముందు శ్రీ అనే గౌరవవాచకము ఉంచటం జరిగింది. మాత అనే శబ్దము త్రిపురసుందరినే తెలుపుతుంది. హ సక లర డ అనే ఆరు అక్షరాలు బాలామంత్రం త్రిపుటిలో మూడు అచ్చులతో కూడి ఉన్నాయి. ఆ మూడు మాత అని చెప్పబడతాయి. ఇక్కడ  హసకలరడైం, హసకలరడీం, హసకలరడౌఃలో చివర అచ్చులు ఐ ఈ జౌ బాలామంత్రం ఐం క్లీం సౌః ఇందులోని అచ్చులు మాతృకాబోధకాలు అని గుర్తించాలి. ఈ విషయాన్ని కాళిదాసు వ్రాసిన వపంచస్తవాలలో ఒకటయిన “లఘుస్తవం”లోని 18వ శ్లోక వివరణలో చెప్పారు. ఆ శ్లోకం.

            మాయా కుండలినీ క్రియా మధుమతీ కాళీ కలామాలినీ
            మాతంగో విజయా జయా భగవతీ దేవీ శివా శాంభవీ
            శక్తి శృంకరవల్లభా త్రినయనా వాగ్యాదినీ భైరవీ
            ట్రీంకారీ త్రిపురా పరాపరమయీ మాతా కుమారీ త్యపి!॥

            స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో సర్వప్రాణులు ఎవరివల్ల జన్మిస్తున్నాయో ఆవిడ మాత  ఎవ్వనిచే జనించుజగము ? ఎవ్వనిలోపల నుండు లీనమై ?
            ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. మూలకారణంబెవ్వ డనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానె అయినా వాడెవ్వడు ?
            జగత్తులోని లోకాలన్నీ ఎవరియందు లీనమై ఉన్నాయో, ఎవని వల్ల సృష్టి జరుగుతున్నదో, అంటే సృష్టిస్థితి లయాలకు కారణభూతుడెవరో, ఆది మధ్యాంతర హితుడెవరో, సర్వమూ తానే అయిన వాడెవరో అతడే మాత. సకలసద్గుణ సంపన్నురాలు, పవిత్రమూర్తి అయిన ఆ తల్లి సుఖసంపదలు, భోగభాగ్యాలే కాదు. శ్రీ రూపమయిన అమృతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది.

            యోబ్రహ్మాణి విధాతిపూర్వం సృష్టికాలంలో బ్రహ్మదేవుడికి త్రయీవిద్య నుపదేశించింది. త్రయీవిద్య అంటే వేదవిద్య. అవి బుగ్‌ యజుర్‌ సామవేదాలు. అంతేకాదు జీవికి ముూక్తిని ప్రసాదిస్తుంది.అందుకే శ్రీమాత అని పిలువబడుతోంది. ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఉన్నప్పటికీ జ్ఞాత జ్ఞాతృ జ్షేయము అనే మూడు ఉండాలి. అంటే 1. తెలుసుకొనేవాడు. £. తెలుసుకొను శక్తి 8. తెలుసుకొను విషయము. ఈ మూడింటినీ త్రిపుటి అంటారు. ఈ త్రిపుటికి అధిదేవత, థ్రిభుజానికి అధిదేవత, వ్యక్తావ్యక్తస్వరూపిణి అయిన బాలాత్రిపురసుందరి శ్రీ అని చెప్పబడుతోంది. త్రికోణంలోనే బిందు వుంటుంది. ఆ బిందువులో పరమేశ్వరి ఉంటుంది. అందుకే ఆదేవి.

            బిందుమండలవాసిని అని పిలవబడుతోంది. ఆవిడే శ్రీమాత, పరమేశ్వరి నిరాకార, నిర్లుణస్వరూప. ఆమెకు రూపంలేదు. కాని జగత్తంతా ఆమె స్వరూపమే. ఛాందోగ్యోపనిషత్తు లో సత్యకామజాబాలికి ఒక ఆబోతు బ్రహ్మ నాలుగు పాదాలుగా ఉంటుంది. అందులో మొదటి పాదం నేను చెబుతాను. “ నాలుగుదిక్కులూ ఆ పరబ్రహ్మ స్వరూపమే” అంటుంది. రెండవపాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ” భూమి, ఆకాశము, సముద్రాలు, నదులు,
పర్వతాలు అన్ని బ్రహ్మపదార్థంలోని అంతర్భాగాలే” అంటాడు.

            మూడవపాదాన్ని ఒక హంస చెబుతూ “ అన్నీ పరబ్రహ్మలోని భాగాలే” అంటుంది.
            నాల్లవపాదాన్ని ఒక నీటిపక్షి చెబుతూ “ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ” అంటుంది. అంటే జగత్తంతా పరమేశ్వరస్వరూపమే. అతడికి ఆది మధ్య అంతము అనేవి లేవు. 'జగత్తులోని 'అగ్న్ని సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు దేవీ భాగవతంలోని సప్తమస్కంధంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా పరమేశ్వరిని ధ్యానిస్తారు. అప్పుడు చైత్రశుద్ధ నవమి, శుక్రవారం వేదసమ్మతమైన పరంజ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయింది. ఆ రూపం ఎలా ఉందంటే

            కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్‌ ॥
            విద్యుత్కోటిసమానాభ మరుణం తత్సరం మహః
            నైవ చోర్ధ్వం న తిర్యక్పన మధ్యే పరిజగ్రభత్‌ ॥
            ఆద్యంతరహితం తత్తు న హస్తా ద్యంగ సంయుతమ్‌
            నచ స్రీ రూప మథవా నపుంరూప మధోభయమ్‌ ॥

            కొన్నివేల కోట్ల సూర్యులయొక్క కాంతులతో, కోట్లకొలది చంద్రుల చల్లదనముతో,
కొన్నికోట్ల మెరుపులు ఒక్కసారి వచ్చినట్లుగా ఒక్కసారి తళుక్కున మెరిసింది. అది కోటి పాగసాగగా అది అరుణారుణకాంతులు వెదజల్లుతోంది. దానికి పైన, క్రింద, నడుమ, అడ్డము అనేవి ఏవీ లేవు. ఆద్యంతాలు లేవు. కాలు చేతులు లేవు. స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు. అది పరమేశ్వరి స్వరూపం. ఆవిడ శ్రీమాత. అందుకే ఆవిడను చెప్పేటప్పుడు అన్నిరూపులు నీ రూపమైనవాడ !

            ఆది మధ్యాంతములు లేక అలరువాడ ! అని చెప్పటం జరుగుతుంది. ఆ దేవి ఆత్రత్రాణ పరాయణ. బిడ్డల కోరికలు తీర్చేది. వారిని సన్మార్గంలో నడిపించేది. కాబట్టే ఆవిడ శ్రీమాత అనబడుతోంది. అందుచేతనే దుర్వాసుడు తన “శ్రీదేవీ మహిమ్మః స్తుతి”లో శ్రీమాత స్తిపురే ! పరాత్సరతరే దేవి ! త్రిలోకీ అంటాడు. లోకంలోని ప్రాణులకు మాత అని పిలిపించుకునే అధికారం ఉంది. ఆ పరమేశ్వరి సర్వులకు మాత లోకాలన్నింటికీ మాత. అందుకనే శ్రీమాత అనబడుతోంది.

            ఈ నామంలో దేవి సృష్టి రూపిణి.
            --000--

    
ఏమిటో....ఈ మనసు !
********************
మా చిన్నప్పుడు మేము మా పోస్టు మేన్ వచ్చే టైముకి దారి కాసే వాళ్ళం. అతను మా ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేస్తే, మహానందపడిపోయేవాళ్ళం. తీరా చేసి, అద్దెకున్న వాళ్ళకిచ్చి,
మాకేమీ ఉత్తరాలు లేవంటే, నీరసం వచ్చేది.మాకు ఒకటైనా పోస్టు కార్డు ఇస్తే, మొదట చదవడానికి పోటీలు పడి, దెబ్బలాడుకుని, 'బలవంతుడిదే ఉత్తరం' అన్నట్టు లాక్కుని, నాలుగుసార్లు చదివాక, మిగిలినవారిని 'ఉత్తరా'ధికారుల్ని చేసేవాళ్ళం.

ఢిల్లీ నుంచి మా అక్క రాసిన 'ఇంగ్లాండు' కవరు వస్తే, దాంట్లో విశేషాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి,
దానికి ఎంత గ్లామరో !
ఉత్తరానికి మూడు పక్కలా నింపేశాక, 'అందరినీ అడిగానని' చెప్పాలి కాబట్టి, మా పనిమనిషి అప్పలమ్మ దగ్గిరనించీ, ప్రతి నెలా టైముకి అద్దె ఇవ్వని ప్రకాశం అంకుల్, పాలు పొసే పాలశంకరం లాంటి వాళ్ళ పేర్లు రాయడానికి మార్జిన్ లు వాడుకునేది.

1965 లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు ప్రభుత్వం వారు తీసుకునే 'బ్లాక్ ఔట్'
(కరెంటు తీసేసి,పట్టణమంతా చీకటి చేసెయ్యడం,) విమానం మోత వినిపిస్తే సైరన్ మోగించడం లాంటి విశేషాలన్నీ పూసలు గా గుచ్చి, పెద్ద కవరు రాసేది. ఢిల్లీ లో రిపబ్లిక్ డే కి జరిగే ఉత్సవాల విశేషాలు మొదటిసారిగా మా అక్క రాసిన 'పే.....ధ్ధ' ఉత్తరం ద్వారా తెలుసుకున్నాం.

ఠావులు ఠావులు ఉత్తరాలు రాసేస్తే, అదనంగా స్టాంపులు అతికించాలని అప్పుడే తెలిసింది.
ఆ ఉత్తరాన్ని వంతుల వారీగా ఎన్నిసార్లు చదివి ఉంటామో చెప్పాలంటే, 'మాయాబజార్ సినిమా చూసినన్నిసార్లు' అని చెప్పాలి. క్లాసు పుస్తకాల కంటే, మా అక్క రాసిన ఉత్తరాలే ఎక్కువ ఆకర్షణగాను, విజ్ఞానదాయకం గాను ఉండేవి.

అందుకే కాబోలు, నెహ్రూ గారు, "కూతురికి ఉత్తరాలు" అనే శీర్షికతో, ఇందిరా గాంధీ గారికి జైలు నుంచే ఉత్తరాలు తెగ రాసి పడేశారు "మీకు పాఠాలు చెప్పను, కధలు చెబుతాను" అని
విష్ణు శర్మ, ముగ్గురు మొద్దబ్బాయిలయిన రాజ కుమారులకి కధలు వినిపించి, వాళ్ళతో పాటు,
మనక్కూడా పంచ తంత్రాలూ బోధించాడు 

                      ★★★★★★★★

ఇప్పుడు మన గుట్లన్నీ గూగుల్ మామకి, ఫేస్ బుక్కు అంకుల్ కీ తెలిసినట్టే, మనకి ఎవరెవరి దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తాయో, ఎవరి దగ్గర్నుంచి ఎంత మనీ ఆర్దరు వస్తుందో, ఎవరింట్లో పెళ్ళి కూతుళ్ళ కోసం, "అమ్మాయి నచ్చింది" అని వచ్చే ఉత్తరం కోసం పడిగాపులు కాస్తున్నారో, ఏ కుర్రాడు తనకి ఉజ్జోగం ఇస్తున్నట్టు వచ్చే ఉత్తరం కోసం గెడ్డం పెంచుతున్నాడో,
నాటి పోస్టు మేన్ లకి  బాగా తెలుసు.

కాబట్టే, దసరా మామూళ్లు దండిగా ఇచ్చేవాళ్ళం. ఇవ్వకపోతే, 'అలుగుటయే ఎరుంగని' పోస్టు మాన్ అలిగిననాడు, ఉత్తరాలే కాదు, కుదరబోయే పెళ్ళి సంబంధం, రాబోయే ఉజ్జోగం కూడా
కాకి ఎత్తుకు పోతుందేమోనని భయం !

అప్పటి పోస్టు మాన్ లు ప్రతి కుటుంబానికి ఆప్తులు, హీరోలు !
టెలిగ్రాములు తెచ్చే ఎర్ర సైకిల్ వాళ్ళు, శత్రువులు, విలన్ లు !
టెలిగ్రామ్ వచ్చిందంటే.. "సో అండ్ సో సీరియస్, స్టార్ట్ ఇమీడియేట్లీ" యే !
అందుకే...టెలిగ్రాములకి నూరేళ్లూ నిండించాము !
 
                    ★★★★★★★★

రెండు మూడు తరాల వాళ్ళం అలా....
'ఉత్తర'కుమారులం, 'ఉత్తరా'కుమార్తెలం గా వెలుగుతూ, తీగలకి గుచ్చిన పాత ఉత్తరాలే దుమ్ము దులిపి, మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండగానే.....

'రోజులు మారాయి' సినిమా తీసిన చాలా కాలానికి, మా రోజులు మారడం మొదలెట్టాయి.
వింతలు, విడ్డూరాలు, విష్ణు మాయలు జరిగిపోతున్నాయి !

మనలాంటి వాళ్ళకి ఇంట్లో దేశవాళీ టెలిఫోను రావడానికే సగం జీవితం గడిచిపోతే, గత రెండు దశాబ్దాలుగా అన్ని రంగాల్లోనూ మార్పులే మార్పులు !

ఒకప్పుడు విమానం శబ్దం వినిపిస్తే, బయటికి పరుగెత్తి చూసిన మధ్య తరగతి వాళ్ళలో చాలామంది
లక్షలకి పడగలెత్తి, కోట్లకి అర్రులు చాస్తూ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగ, గౌలిగూడా బస్ స్టాండు లాగ, విమానాశ్రయాలు ఖాళీ లేకుండా చేసేశారు. 

"మా వాడు డల్లాస్"అంటే, "మా అమ్మాయి "డెట్రాయిట్" అనేవారు !
"మా అల్లుడికి లండన్ లో ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది" అంటే, "మా వాళ్ళకి కెనడా సిటిజెన్ షిప్ వచ్చేసింది" అనేవాళ్ళు. ప్రస్తుతం కొరోనా కాటుకి, ఆ దేశాలతో పాటు, మనవాళ్ళు కూడా పాపం,
బిక్కు బిక్కుమంటున్నారనుకోండి !

ఇండియా కి విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్నది, దేశం లో టాక్స్ లు నిక్కచ్చిగా కడుతున్నదీ,
తద్వారా దేశ ఆర్థిక పురోగతికి దోహద పడుతున్నదీ, మన మధ్య తరగతి వాళ్ళేట !

పావు కిలో బరువున్న నోకియా ఫోను తో మొదలయిన మన సాంకేతిక ప్రస్థానం, కొంప కి పది చొప్పున, తల ఒక్కింటికి రెండు చొప్పున, సెల్ ఫోనులు, టాబ్ లు కాక, లాప్ టాప్ లు అదనం గా వచ్చి కూచున్నాయి ! ఇంటి నిండా చార్జర్ ల కలగాపులగం !

పొద్దున్న లేచాక, దైవ ధ్యానం,దీపారాధన కంటే ముందే, 'కరచరవాణీ' దర్శనం చెయ్యాల్సి రావడమే కాదు, అన్నిటికీ ఛార్జింగ్ పెట్టడానికే జీవితం సరిపోతోంది !

ఇంక పనికొచ్చే పోస్టులు చూడ్డం, పనికిరాని వాళ్ళు పంపిన పోస్టులు తీసెయ్యడం, నిత్య కృత్యం ఐపోయింది. ఇది కాక, మన "ఎగుమతి - దిగుమతి"  వ్యాపారం (అదే నండి అప్ లోడ్, డౌన్ లోడ్)
ఉండనే ఉంది !
(ఇదేదో పెద్ద వ్యాపారం అనుకోకండి, మనకి వాట్సాప్ లో వచ్చినవి అందరికీ పంపడం, ఫేస్ బుక్కు లో చూసినవి షేర్ చెయ్యడం లాంటివి) ఇలా కొంతకాలంగా 'అత్యాధునిక సాంకేతిక విప్లవాలను ఔపోసన పట్టి, అలరారుతున్నాం' అని సంతోషిస్తుండగా...

ఒక రోజు మా పని మనిషి గొంతు, వాష్ ఏరియా లో నుంచి గట్టిగా వినపడుతోంది.
'ఏదైనా గొడవా' అని వెళ్ళి చూస్తే...
దుబాయ్ లో ఉన్న కొడుకుతో వీడియో కాల్ మాట్లాడుతోంది !

తన దగ్గర ఉన్నది నా ఫోను కంటే కొత్త మోడలు, ఖరీదయినది !
అన్నట్టు....రోజులు మారాయి కదూ....

                  ★★★★★★★★

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఒక రోజు మా పిల్లలు హడావిడిగా వచ్చి, నన్ను లాక్కెళ్లి,
లాప్ టాప్ ముందు కూచోబెట్టారు.తీరా చూస్తే, సినిమా ఆఖరి రీలులో గ్రూప్ ఫోటో లాగ,   దేశ విదేశాల్లో ఉన్న మా వాళ్ళందరూ అందులో ఉన్నారు !
అందరూ ఒకే సారి, "బావ గారూ బాగున్నారా ?', "హాయ్ బ్రో",  "హల్లో తాత గారూ" "బాబయ్యా, ఎలా ఉన్నావ్ ?" "అల్లుడూ...కులాసానా ?" "మావయ్యా, చాలా రోజులయింది, నిన్ను చూసి"
అని కోరస్ పాడేస్తున్నారు !
ఒక్కక్కళ్ళనే గుర్తుపట్టి, పలకరించి, పులకరించడానికి కొంచెం టైం పట్టింది. "ఖండములు ఎన్ని, అవి ఏవి ?" అని, హైస్కూల్ లో సోషల్ మేష్టారు అడిగితే, తడుముకుని, బట్టీ బట్టి చెప్పేవాళ్ళం.
ఇప్పుడు ఖండములు, ఖండాంతరములు అన్నీ ఒకే చోట కనిపించేస్తున్నాయి !!!

ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, కెనడా, సింగపూర్,లండన్ ఇలా అన్ని దేశాల నుంచీ,
బీరకాయ పీచువాళ్ళందరూ....
కెనేడియన్ దగ్గిరనించీ తాడేపల్లిగూడేరియన్ వరకు కొరోనా ధర్మమా అని, ఒకేసారి, కొంపల్లో కూచుని, నెల రోజులుగా అన్ని రకాల కాలక్షేపాలు చేసి, చేసి, విసుగెత్తి, బహుశా గాలి మార్పు కోసం, యిలా...
"జూమ్" వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ ఒకే సారి దండెత్తారు. ఎవరికీ హెయిర్ కట్ లు లేనట్టుంది !
మగంగులు అందరూ  తలలు మాసి ఉన్నారు. కొన్ని పాత మొహాలు...
ఆకారాలు, ప్రాకారాలు మారిపోయాయి. కొన్ని కొత్త మొహాలు గుర్తుపట్టలేకపోతున్నా. కొన్ని పిల్ల మొహాలు యవ్వనం లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని చంటి మొహాలు కొత్తగా పుట్టాయి.

సామూహిక యోగక్షేమాల కార్యక్రమం అయ్యాక, ఎవరెవరు, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో,
ఎవరికి ఎంతమంది పిల్లలో సగర్వంగా చెప్పుకున్నాక, లోకల్ కొరోనా వార్తలు, స్కోరులు చదువుకున్నాక, 'ఆరోగ్యాలు జాగ్రత్త' లాంటి షరా మామూలు హెచ్చరికలు చేసుకుని, చివరిగా సామూహికంగా జాతీయ గీతం పాడినట్టు, అందరం "గో, కొరోనా, గో" అనే మంత్రం చదివి, 'బై' లు చెప్పుకున్నాం. 
                      ★★★★★★★★

ఇదంతా అయ్యాక, కొత్త రకం ప్రసార మాధ్యమాలు వచ్చాయని, 'కానీ' ఖర్చు లేకుండా, నిమిషాల్లో,
ప్రపంచం లో ఎక్కడ ఉన్నా,మన వాళ్ళందరినీ చూస్తూ మాట్లాడుకునే సౌకర్యాలు వచ్చిన కారణంగా అందరి విశేషాలు, యోగ క్షేమాలు తెలుసుకోగలుతున్నామని సంతోషించాను.

                       ౦౦౦౦౦౦౦౦౦౦౦

కానీ ఏమిటో.....ఆ డొక్కు సైకిల్ మీద ఖాకీ గుడ్డలతో వచ్చి, నవ్వుతూ అరుగు మీద ఎదురు చూస్తున్న మాకు అందించిన ఆ 'కార్డు ముక్క' ఇచ్చిన ఆనందం, ఇప్పుడు వాట్సాప్ లు, ఫేస్ బుక్ లు తెచ్చే వందల కొద్దీ పోస్టులు,విశేషాలు, స్కైపులు, 'జూమ్' లు చూపించే  వీడియోలు ఇవ్వలేకపోతున్నాయి !

అవునులే ! నాన్న 200 రూపాయలతో రెండు చక్రాల సైకిల్ కొన్నప్పుడు, ఎంతగానో ఆనందించిన ఇదే బుర్ర, పది లక్షలు పెట్టి నాలుగు చక్రాల కారు కొనుక్కున్నప్పుడు ఆనందించలేకపోడమేవిటి ?కాల మహిమ కాకపోతేను ? ఏమిటో....యీ మనసు !!!

sekarana     వారణాసి సుధాకర్.

                        ★★★★★★★★

సేకరణ ప్రాంజలి ప్రభ 

శిష్టత - మార్గ శిర మాసం


శిష్టత - మార్గ శిర మాసం వినేటి నుండి మార్గశిర మాసం ప్రారంభం

వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.

హేమంత ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయం గా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు. చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు.ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.

--(())--

సేకరణ ప్రాంజలి ప్రభ 

శిష్టత - మార్గ శిర మాసం

సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం లో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, మనం తీసుకొనే ఆహార పదార్దాల లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు.

మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది.

మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి.

మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.

మార్గశిర అష్టమి ని కాళభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.

మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వారా దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసం లో వచ్చే ద్వాదశి ని అఖండ ద్వాదశి అంటారు.

మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు.

మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీ ని నోరార పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.

కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు.మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకం గా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

--(())--

-(())--

ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు. మనకు నవ్వుల కొరకు ఆమె ఈ విధంగా ముద్దు పేర్లతో పిలిచిది. అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన, రెండవ అమ్మాయి పేరు చిరిగిన, మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన, నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...

ఇలా ఈ విధంగా ఆ తల్లి తన కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది. ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’

అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’ 

తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!

అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే కూర్చుంటాను’’

తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’

అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే కూర్చుంటాను’’

అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు. కొద్దిసేపు తరువాత....

తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా.. పాలు తీసుకుంటారా?’’

అతిథి : ‘‘టీ’’

తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’

అతిథి : ‘‘వద్దు వద్దులెండి.. నేను పాలు తీసుకుంటాను’’

తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని రామ్మా’’

ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి పారిపోతాడు

--(())__

 

సేకరణ ప్రాంజలి ప్రభ 

శిష్టత - మార్గ శిర మాసం

బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?

పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.

ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యం ఉందా? అంటే విశ్లేషిస్తే పెద్దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

మరి పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయం ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. ఎందుకంటే ఉదయాన్నే ప్రక్రుతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని మనందరకూ తెలుసు.రాత్రంతా చెట్లు విడిచిన ఆక్సిజన్ వేకువన కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది.

మరి గృహిణులు ఎందుకు లేవాలి? ఇది అందరకు తెలిసినదే. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంటపనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు వారు రోజంతా. అటువంటి వారికీ ఒత్తిడి లేని జీవన విధానం, మానసిక , శారీరిక ఆరోగ్యం చాల అవసరం. బ్రాహ్మి ముహూర్తం లో లేవటం వలన మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, శారీరిక ఆరోగ్యం కూడా సమకూరుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏంటంటే, వేకువనే లేవడం వలన ఇంటి పనులు అన్ని ఒక పద్దతిగా ఆందోళన లేకుండా చేసుకోవడానికి వీలు అవుతుంది. గందరగోళం లేకుండా ఉంటుంది. పనులు ఒక క్రమశిక్షణతో జరుగుతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి హృదయం, మెదడు, ప్రశాంతంగా ఉంటాయి.

బ్రాహ్మి ముహూర్తం లో లేవడం వలన ఇంకొక మేలు ఏమిటంటే, సూర్యుని లేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో డి విటమిన్ ఉంటుంది అని అందరికి తెలుసు, ఎముకల పటుత్వానికి ఇది ఎంతో అవసరం. ఇదివరకు మాములు ఇల్లు ఉన్నపుడు ఏదో ఒకవేపు నుంచి ఎండ ఇంట్లోకి వచ్చేది. ఈనాడు అంతా apartment culture కదా. కొన్ని ఇళ్ళల్లో సూర్యోదయం కనిపించదు. అటువంటివారికి డి విటమిన్ లోపం వచ్చే అవకాసం ఉంది. కొన్ని చర్మ వ్యాదులకు కూడా సూర్యరశ్మి మేలు చేస్తుంది. అటువంటి వారు ఉదయం , సాయంత్రం కొన్ని నిముషాలు సూర్య కిరణాలు తమకు సోకేటట్టుగా లేత ఎండలో నుంచోవడం ఎంతో మంచిది.

మనం తొందరగా లేస్తే, పిల్లలు కూడా మనలను చూసి లేవడం అలవాటు చేసుకుంటారు. వారికీ కూడా క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మన పూర్వులు ఏమి చెప్పినా, మన మంచికే చెప్పారు. వారు చెప్పిన సూత్రాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకు ఎప్పుడూ మేలే జరుగుతుంది.

--(())--


 --(())--

కొన్ని సంవత్సరాలు గడిచాయి .ఒకనాడు ముంజుడి సభకు ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు.రాజుకు నమస్కరించి రాజా!ఈ ప్రపంచం లో నాలాంటి జ్యోతిష శాస్త్ర పండితుడు లేడని చెప్పుకుంటారు.భూత భవిష్యత్
వర్తమానాలలో ఏ విషయంగురించైనా మీకేదయినా కావాలంటే అడగండి అన్నాడు.ఎంత ప్రతిభాశాలి అయినా యింత అహంకారమా?అనిపించింది ముంజుడికి.మీకు చేతనైతే నా జీవితం లో పుట్టినప్పటినుంచీ ఇప్పటిదాకా
జరిగిన ముఖ్య ఘట్టాలను చెప్పు అన్నాడు.ఆ పండితుడు ముంజుడి జీవిత చిత్ర అంతా చెప్పుకొచ్చాడు.

. ఎవ్వరూ ఎరుగని ఎన్నో రహస్య విషయాలను కూడా అతనికి మాత్రమె చెప్పాడు.ఆయన ప్రతిభకు రాజు నివ్వెరపోయి కాళ్ళమీద పడిపోయాడు.తగినరీతి సత్కరించి ఆయనవిద్యను ప్రశంసిస్తూ యిలా అన్నాడు.

మాతేవ రక్షతి, పితేవ హితే నియుంక్తే
కాంతేవ చాభిరమయత్య పనీయ ఖేదం
కీర్తిం చ దిక్షు వితనోతి,తనోతి లక్ష్మీం
కిం కిం న సాధయతి కల్పలతేన విద్యా

అర్థము:--చేతిలో వున్న విద్య కల్ప వృక్షపు లతలా దేనినయినా సాధించి పెట్టగలదు.తల్లి రక్షించినట్టు రక్షిస్తుంది.తండ్రి లాగా ధర్మ మైన కార్యాలలో నియోగిస్తుంది.భార్యలా దుఖం పోగొట్టి సంతోష పరుస్తుంది. కీర్తిని అన్ని దిక్కులకూ వ్యాపింప జేస్తుంది.సంపదను కలిగిస్తుంది,విద్య సాధించ లేనిది ఏమి వుంది?

సభ ముగిసిన తర్వాత ముంజుడి మంత్రి ఒక సలహా యిచ్చాడు.
పనిలో పనిగా భోజుడి జాతకం ఎలా వుందో చూడ మని అడగరాదా?అని.నిజమే భోజుడి భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిస్తే ముంజుడి భవిష్యత్తు కూడా
తెలిసినట్టే. అందువల్ల భోజుడి జనంకుండాలి చూపించి జాతక ఎలా వుంటుందో చెప్పమన్నాడు.యువరాజును స్వయంగా చూస్తేనే జాతకం సరిగ్గా చెప్పగలను అన్నాడు.జ్యోతిష్కుడు మున్జుడు భోజుడిని గురుకులం నుంచి పిలిపించాడు.భోజుడి వినయ విధేయతలు, శరీర సౌందర్యం,అతనిలో ఉట్టిపడే రాజ తేజస్సూ చూసి జ్యోతిష్కుడు అబ్బుర పడ్డాడు. ఈ బాలుడి జాతకం స్వయంగా బ్రహ్న్మదేవుడు చెప్ప వలిసిందే. ఇతన్ని గురుకులానికి పంపివేయండి. అని భోజుడు వెళ్ళిపోయాక యిలా చెప్పాడు.
.
పంచాశత్ పంచ వర్షాణి సప్త మాసాః దినత్రయం
భోజ రాజేన భోక్తవ్యః శ గౌడో దక్షణ పథః

యాభయిసంవత్సరాల, ఏడునెలల మూడు రోజుల కాలం,గౌడ దేశం తో సహా ఈ దక్షిణాపథం అంతా భోజుడి చేత పాలించ బడుతుంది.
యీమాటలు విన్న ముంజుడు ముఖంలో సంతోషాన్ని ప్రకటించినా మనసులో మాత్రం ఈ భవిష్య వాణి రుచించ లేదు.మందిరానికి వెళ్లి దీర్ఘంగా ఆలోచించాడు.ఈ రాజ్యం భోజుడి చేతిలోకి పొతే తను జీవచ్చవం లా బ్రతుక వలిసిందే అసలు యిదొక విచిత్రం అధికారం సంపదా లేకపోతె మనిషికి విలువే మారిపోతుంది.ఎన్ని తెలివి తేటలు వున్నా అధికారము,ధనమూ కోల్పోతే ఆ మనిషి మరో మనిషిగా మారిపోతాడు.ఈ ఆలోచనల వాళ్ళ ఏమి ఉపయోగం?ఏది చేస్తే లాభమో అదే తక్షణ కర్తవ్యమ్.ఎక్కువ పాపభీతి,దయా,నలుగురూ
ఏమనుకుంటారో నని సంకోచము వుంటే సంపద మనల్ని వదిలి వెళ్ళిపోతుంది.
.
అతి దాక్షిణ్య యుక్తానాం,శంకితానం పదే పదే
పరాపవాడ భీరూణాం,దూరతః యాన్తి సంపదః

ఎక్కువ దయకలిగి ప్రతిదానికీ సంకోచిస్తూ లోక నిందకు భయపడే పిరికి వాళ్ళ నుంచి సంపదలు దూరంగా వెళ్లి పోతాయి. అందుకే తాత్సారం చేయకుండా మన స్వార్థమెదొ అది సాధించుకునే ప్రయత్నం చెయ్యటం
యిప్పటి కర్తవ్యమ్ శత్రువును గానీ,వ్యాధిని గానీ నాశనం చెయ్యక పొతే అవి మనల్ని నాశనం చేస్తాయి.

ఇలా ఆలోచించి ముంజుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.తన మిత్రుడూ మహా బలశాలీ అయిన వత్స రాజును దూతను పంపి పిలిపించాడు.అతనికి జ్యోతిష్కుడు చెప్పిన భవిష్య వాణి గురిచి చెప్పి భోజుడిని ఎలాగై నా చంపించాలి అని చెప్పాడు..వత్సరాజు నవ్వాడు.ముంజరాజా!కేవలం జ్యోతిష్యం విని చర్య తీసుకునే ముందు బాగా ఆలోచించు.అవతార పురుషుడయిన రాముడి పట్టాభిషేకం కోసం బ్రహ్మ పుత్రుడు వసిష్టుడు ముహూర్తం పెట్టాడు.ఏమయింది?రాముడు భార్యా సమేతంగా అడవులకు పోవలిసి వచ్చింది.

ఎవరో పొట్టకూటికి చెప్పిన భవిష్య వాణి ఆధారంగా భోజుడిని చంపేస్తే ఆ పాపం నీవు చచ్చే వర్ఫకూ వెంటాడుతుంది.అదలా ఉంచినా యిప్పుడు నువ్వు యువరాజును చంపితే నీ కొలువులోవున్న సింధుల రాజు సన్నిహితులు తిరగబడి అల్లకల్లోలం సృష్టిస్తారు ఎందుకంటె వాళ్ళ దృష్టిలో భోజుడే రాజు.నీవు అతడి సంరక్షకుడివి మాత్రమే జాగ్రత్తగా ఆలోచించు.అని సలహా యిచ్చాడు.ముంజుడికి కోపం వచ్చింది.రాజు నీవా?నేనా?రాజాజ్ఞ నిర్వహించడమే సామంతులపని.అన్నాడు.

ఇక గత్యంతరం లేక వత్సరాజు భోజుడిని గురుకులం నుండి నేరుగా భువనేశ్వరీ ఆలయానికి పిలిపించాడు. యువరాజా!జ్యోతిష్యుడు నీ గురించి చెప్పిన జోస్య విని ముంజరాజు నిన్ను చంపమని నన్నాదేసించాడు..
నేను రాజాజ్ఞ పాటింపక తప్పదు కదా! అన్నాడు.గుండె నిబ్బరం ,ధైర్యం భోజరాజు సహజ లక్షణాలు.ఓ! వత్సరాజా చావు బ్రతుకులు కాలవశాన జరిగేవి.
రామే ప్రవ్రజనం,బలే :నియమనం పాండో: సుతానాం వనం వృష్ణీ నాం నిధనం నలస్య నృపతే రాజ్యాత్ పరిభ్రంశనం కారాగార నిషేవణం చ మరణం సంచితస్య లంకే స్వరే సర్వః కాలవశేన నశ్యతి నరః కో వా పరిత్రాయతే
అర్థము:--రాముడి చరిత్రలో అరణ్య వాసం, బలిచక్రవర్తి గర్వభంగం, పాండు సుతుల వనవాసం, యాదవకుల నాశనం,నలమహారాజుకు రాజ్యనష్టం,లంకేశ్వరుడు రావణుడికి కార్తవీర్యార్జునుని చెరసాల లో నివాసం,మరణం యివన్నీ ఆలోచించి చూస్తే మనిషికి నాశనం కాలవశాన కలుగుతుంది.ఎవరు రక్షించ గలరు?ఈశ్వరేచ్చనుఅనుసరించి సముద్రం యింకి పోయి స్థలం గా మారుతుంది.స్థలం గా వున్నది సముద్రం గామారు తుంది.చిన్న దుమ్ముకనం కొండంతగా మారుతుంది,మేరు పర్వతం యిసుక రేణువు అయిపోతుంది.గడ్డిపోచ వజ్రాయుధ మవుతుంది,అగ్ని చల్ల బడుతుంది మంచు దహించి వేస్తుంది.ఈ లీలలన్నీ చూపగల ఆ ఈశ్వరుడికి నమస్కారం.విధి లిఖితం.

శాసన ప్రాయం, అని దగ్గరలో వుండే మర్రి చెట్టు ఆకులు రెండు తెచ్చాడు.తన కత్తితో పిక్క దగ్గర గాయం చేసుకొని ధారగా కారిపోతున్న రక్తాన్ని ఆ దొప్పలో పట్టాడు.ఒక గడ్డిపోచను ఆ రక్తంలో ముంచుతూ రెండో ఆకుమీద ఒక శ్లోకం వ్రాశాడు.యిది మా చిన్నాన్న ముజుడికి సందేశం గా అందించమని వత్సరాజుకు యిచ్చి నీ రాజాజ్ఞను నిర్వర్తించ మన్నాడు.వత్స రాజుతో బాటు అతడి తమ్ముడు కూడా అక్కడ వున్నాడు.అతను అన్నా!మరణాంతరం కూడా మనల్ని వదలక అనుసరించే మిత్రుడు ధర్మమొక్కటే శరీరానికి సంబంధించిన వన్నీ శరీరం తో బాటు నాశన మయ్యేవే .

ఏక ఏవ సుహృత్ ధర్మః నిధనేప్యను యాతి యః
శరీరేణ సమం నాసం సర్వం అన్యత్ తు గచ్చతి

అర్థము:-- మరణం అనంతరం ప్రయాణం లో తల్లీ,భార్యా బిడ్డా మిత్రుడూ ఎవ్వరూ తోడూ రారు.ధర్మం ఒక్కటే మనకు తోడుగా వచ్చేది.వృద్ధాప్యం,శారీరక రుగ్మతలూ వాట్కి చికిత్స సత్కర్మలు చేయగల శక్తి వున్నా వయసులోనే చేసుకోవాలి ఆ తర్వాతి కాలం మందులు లేని ప్రదేశం లాంటిది.చికిత్స సాధ్యం కాదు.

ఈ సమయం లో అధర్మ కార్యాలు చేసి పాపం మూటకట్టుకుంటే తర్వాత చింతిస్తావు.ఇలా బోధ చేయగా వత్సరాజుకు వైరాగ్య భావం కలిగింది.నిర్దోషి అయిన యువరాజును చంపటానికి మనసు రాలేదు.భోజుడిని తన రథం లో క్పోర్చో పెట్టుకొని రహస్యంగా తన యింటికి తీసుకొని వెళ్లి నేల మాళిగ లోసురక్షితంగా దాచాడు.భోజుడి తలను పోలిన తలను శిల్పుల చేత తయారు చేయించి దాన్ని తీసుకెళ్ళి ముంజుడికి చూపి భోజుడు చనిపోయాడని నమ్మించాడు.తరువాతి కథ సశేషం. భోజుని తలను చూసిన ముంజుడు వత్సా నువ్వు కత్తితో తల నరుకుతున్నప్పుడు భోజుడు ఏమీ అనలేదా?అని అడిగాడు.
ఏమీ అనలేదు కానీ ఈ మర్రి ఆకు మీద ఒక సందేశం రాసి యిచ్చాడు.అని వత్సుడు ముంజ రాజుకు ఆ మర్రి ఆకును అందించాడు.రాజు దీపం తెప్పించి ఆ ఆకు మీది శ్లోకం చదివాడు.

మాం ధాతా చ మహీపతి: కృత యుగాలంకార భూతః గతః
సేతు:యేన మహా దధౌ విరచితః క్వాసౌ దశా స్యాంతకః ?
అన్యే చాపి యుధిష్టిర ప్రభ్రుతయః యాతాః దివం భూపతే
నైకే నాపి సమం గతా వసుమతీ నూనం త్వయా యాస్యతి

అర్థము:--కృత యుగానికి అలంకార భూతమైన మాంధాత చక్రవర్తి వెళ్ళిపోయాడు.త్రేతాయుగం లో సముద్రానికే సేతువు కట్టించిన రావణ సంహారి శ్రేరాముడు ఎక్కడున్నాడు?(క్వ- అసౌ- దశా స్య -అంతకః ఎక్కడ ఆ రావణ సంహారి?)యుధిష్ఠిరుడు మొదలైన యితరులు కూడా దివంగతులైనారు.ఈ మహారాజులలో ఒక్కరి తోనూ ఈ భూమి వెళ్ళలేదు కానీ నీతో మాత్రం నిశ్చయంగా వచ్చేస్తుంది.నీ తాపత్రాయమూ,దురాశా,దుర్బుద్దీ చూస్తే ఈ భూమిని శాశ్వతంగా నీతో బాటు నెత్తిన పెట్టుకొని తీసుకెళ్ల గలను అని అనుకున్నట్టున్నావు అందుకే ఇలాంటి పాపకార్యాలు చేసుకుంటున్నావు.
ఈ వ్యంగ్యాస్త్రం ముంజుడికి తగల వలిసిన చోటే తగిలింది.తను చేసిన దెంత పొరపాటో తెలిసి వచ్చింది.

పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు.మంత్రినీ పురోహితుల్నీ పిలిచి తన పాపానికెలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమని ప్రార్థించాడు.
మాజీ మంత్రి బుద్ధిసాగారుడు వచ్చి రాజును తీవ్రంగా దూశించాడు.నువ్వు రాజుఅల్లొ అధముడివి.నీ అన్న నీ మీద ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసి ఆయన రాజ్యం దొంగిలించి ఆయన నీ సంరక్షణ లో వదిలి వెళ్ళిన పుత్రుడిని నిర్దాక్షిణ్యంగా చంపావు.నీ లాంటి పాపిష్టి రాజుల పాలనలో ప్రజలు కూడా పాపాత్ములే అవుతారు.

రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టా:పాపే పాపపరాః సదా
రాజాన మను వర్తన్తే యధా రాజా తధా ప్రజాః

రాజు ధర్మ మార్గం లో వుంటే ప్రజలు ధర్మిష్టులు గా వుంటారు.రాజు పాపి అయితే ప్రజలూ సదా పాపులే అవుతారు.యెందుకంటే ప్రజలు రాజును  అనుసరిస్తారు.రాజేలాంటి వాడైతే ప్రజలూ అలాగే వుంటారు.

ఈ పాపానికి అగ్ని లో దూకి ప్రాణత్యాగం చెయ్యడమే ప్రాయశ్చిత్తం అన్నారు పురోహితులు.
పశ్చాత్తాప భారం తో అగ్నిలో ప్రవేశించాలని నిశ్చయించు కున్నాడు ముంజుడు.
రాజు కళ్ళు తెరిపించేందుకు మంత్రి బుద్ధి సాగరుడూ,వత్సరాజూ కలిసి , చిన్న నాటకం ఆడారు.

ఒక కాపాలిక మాం త్రికుడిని పిలిపించి అతని చేత స్మశానం లో హోమాలు చేయించి భోజుడిని బ్రతికించి నట్లు నాటకం నడిపించారు.అప్పుడు రహస్యంగా దాచి ఉంచిన భోజుడిని రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు.
రాజు భోజుడిని గాడంగా కౌగలించుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని భోజుడికి అప్పగించి తన సొంత కొడుకులందరికీ తలా ఒక గ్రామం యిప్పించాడు. తనకు యిష్టుడయిన జయంతుడనే కొడుకును మాత్రం భోజుడి ఆస్థానం లో భోజుడికి సహాయంగా ఉండేందుకు ఏర్పాటు చేశాడు.భోజ పట్టాభిషేకం అయిన తర్వాత తన భార్యల తో సహా వానప్రస్థా శ్రమానికి అడవులకు తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.

భోజుడు నిరాటంకంగా ప్రజానురంజకంగా పాలించటం ప్రారంభించాడు.
.ఆ కాలం లో కనుక అలా పశ్చాత్తాప పడ్డారు.న్యాయ మేదో తెలుసుకొని యువరాజుకు రాజ్యాన్ని అప్పగించారు.యిప్పటి మన నాయకులతో పోల్చుకుంటే అప్పటి వాళ్ళు యెంత ధర్మాత్ములో కదా! అని అనిపించక 
మానదు.తపు చేసినా అది తప్పని గ్రహించి తప్పుదిద్దుకున్నవాడు మహాత్ముడే అవుతాడు కదా!
--------------- శుభరాత్రి -------------------

ప్రకృతి సత్యం


*ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.*

*బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.*

*ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.*

*అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.*

*ఎందుకంటే*

*ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.* 

*ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.*

*చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.*

*సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..*

*కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.*

*అందుకే కదా*

*భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.*

*యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.*

 *మేలు కోరుకోవడం మనవంతు.వినకపోతే* *అనుభవించడంవాళ్ళ*

 *వంతు.*

__(())__ 

మానవ దేహము -మహావృక్షము వంటిది-

మానవ దేహం వృక్షంతో సమానం. అది ఎలా? అనే విషయాన్ని వివరించి చెప్పేదే ఈ కథ. మహాభారతం అశ్వమేధపర్వం ముప్పైఅయిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విషయాలను వివరించి చెప్పాడు.

మానవ దేహం అక్షరాలా ఓ వృక్షం లాంటిది. అజ్ఞానం అనేది ఈ వృక్షానికి మూలమైన బీజం. బుద్ధి దాని బోదె. అహంకారం ఆ చెట్టుకు ఉండే కొమ్మలు. ఇంద్రియాలు ఆ చెట్టు మానుకు ఉన్న తొర్రలు. పంచ మహా భూతాలు ఆ వృక్షానికి ఉన్న విశేషమైన అవయవాలు.

ఆ పంచభూతాల విశేష భేదాలు కొమ్మల నుంచి పుట్టు కొచ్చిన చిరుకొమ్మలు. ఈ కొమ్మలకు, చిరు కొమ్మలకు నిరంతరం సంకల్పాలు అనే ఆకులు పుడుతుంటాయి. కర్మలు అనే పూలు పూస్తుంటాయి. అయితే మనిషి పిచ్చి మొక్కల్లా మిగలగూడదు.

తాను చేసే శుభ, అశుభ కర్మలవల్ల కలిగే సుఖదుఃఖాదులే ఫలాలు (ఆ చెట్ల పండ్లులాగా ) ఇలా బ్రహ్మరూపమైన బీజం నుంచి పుట్టుకొచ్చి ప్రవాహ రూపంగా నిరంతరం ఉండే దేహం అనే వృక్షాన్ని, జాగ్రత్తగా పరిశీలిస్తే, అది అంత సామాన్యమైనదేమీ కాదు చాలా గొప్పదే.

ఎందుకంటే అది ఎన్నెన్నో ప్రాణుల బతుకులకు ఆధారంగా ఉంటుంది. ఆ దేహమనే వృక్షతత్వాన్ని అందరూ గ్రహించ గలగాలి. ఆ తత్వం అర్థం కావాలంటే సద్గురువుల ఉపదేశాలు అవసరం. అయితే ఒకసారి అలా ఉద్భవించిన దేహం సంసార సముద్రంలో పడి తాను, తనవాళ్లు అని కొట్టు మిట్టాడుతూ స్వార్థంతో నిండిపోతే కష్టమే.

నిస్వార్థంగా నిజమైన చెట్టులాగా అందరికీ సహాయపడాలే తప్ప పిచ్చి మొక్కల్లాగా పనికిరాని తీరులోనూ అందరికీ ఇబ్బంది కలిగించే చెట్ల లాగా మనిషి దేహం, ప్రవర్తన మారకూడదు.

తన దేహం అలా మారుతోంది అని సందేహం కలిగినప్పుడు సద్గురువు సూచనల మేరకు జ్ఞానం అనే ఉత్తమ ఖడ్గాన్ని తీసుకొని అజ్ఞాన అడవులు, పిచ్చికొమ్మలు, అనే ఆలోచనలను నశింపచేసుకోవాలి. అప్పుడే మానవ దేహం అందరికీ నీడనిచ్చే మంచి చెట్టులాగా పేరు తెచ్చుకుంటుంది. అలా కానప్పుడు ముళ్లచెట్టు లాగా, కలుపుమొక్కల లాగా అందరి నిరాదరణకు గురవుతుంది.

మంచి చెడ్డలు అవగాహనతో సనాతన జ్ఞానవిషయం ధర్మాన్ని అనుసరిస్తూ అలా మనిషి తన దేహాన్ని, జీవన విధాన్నన్ని,అన్ని ధర్మకార్యాలకు సాధనంగా వినియోగిస్తుండాలి. ఈ విషయం తెలిసిన వారే జీవితం ఫలవంతం చేసుకోగలరు. వారే విద్వాంసులు, సిద్ధులు అని పేరు పొందుతారు.

పూర్వకాలంలో దక్షప్రజాపతి, భరద్వాజుడు, గౌతముడు, శుక్రుడు, వసిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, అత్రి అనే మహర్షులు తమతమ జీవన మార్గాలలో పెద్దపెద్ద వృక్షాలు గా మానవాళికి ఎంతో విలువైన, సమగ్ర జ్ఞానాన్ని జీవిత విధాన్నన్ని ఆన్దించి, అందరికీ సుఖాన్ని,, ఆనందాన్ని కలగచేశారు.అయితే దేహమైనా, వృక్షమైనా కొద్దికాలంపాటే భూమ్మీద ఉండగలిగేది. కనుక కొంత కాలానికి వారికి అలసట వచ్చింది.

అప్పుడు వారంతా కలిసి అంగీరస మునిని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. వెళ్లి అంత,,,,కాలంపాటు తామెన్నో పనులు చేశామని ఆ పనులన్నీ మంచివేనా? లేకపోతే శ్రేష్ఠకర్మ ఎలా చేయాలి? ఒకవేళ పాపం చేసి ఉంటే ఆ పాపం నుంచి ఎలా బయట పడాలి? అనే విషయాలను గురించి చెప్పమన్నారు.

అప్పుడు బ్రహ్మదేవుడు వారందరికీ మంచి పనులు, పుణ్య కార్యాల విషయాలను తెలియ చెప్పాడు. బ్రహ్మ చెప్పిన విషయాలతోపాటు తాము చేసిన పనులు సరిపోల్చుకొని ఆదర్శ వంతమైన జీవితాన్ని మళ్లీ సాగించారు ఆ ఋషులు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియ చెప్పాడు.

ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసినది, గమనించాల్సిన విషయం మనం మన జీవితంలో అనుసరించాల్సిన దేమిటంటే, మనిషి నిస్వార్థంగా ఓ మంచి మహా వృక్షంలాగా అందరికీ సహాయ పడుతూ ఉండాలి.

ఎన్ని మంచి పనులు చేస్తున్నా చివరకు అనుభవజ్ఞుల దగ్గర తమ పనులను సమీక్షించుకుంటూ మంచి, చెడులను బేరీజు వేసుకుంటూ మందుకు నడవాలనే జీవన సత్యాన్ని, ఉత్తమ మార్గదర్శక సూత్రాన్ని మనకు తెలియపరుచును.

--(( ))--

🧘‍♂️సూక్ష్మంలో మోక్షం🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩               

మనం సాధారణంగా మోక్షమంటే అదేదో చాలా పెద్దది, దానిని సాధించాలంటే మనం ఎంతో ఎదగాలి అనుకుంటాం. 


కానీ ఈ సృష్టిలో చూస్తే పెద్ద పెద్ద ప్రాణులే త్వరగా బంధింపబడతాయి. ఒక పులినో, జింకనో బంధించినంత తేలికగా ఒక ఎలుకనో, చీమనో బంధించగలమా? 


అలాగే పెద్ద చేపలు తేలికగా వలలో పడతాయి కానీ ఎంత చిన్న చేప అయితే వలలో నుండి అంత తేలికగా తప్పించుకోగలుగుతుంది.


అసలు "నేను చాలా పెద్దవాణ్ణి, లేదా గొప్పవాణ్ణి" అనుకోవడమే పెనుమాయ. 
అంతకు మించిన బంధనం ఏముంటుంది? నేను చాలా చిన్నవాడిని, భగవద్భక్తుల దాసానుదాసుడిని అనుకోవడమే మోక్షానికి దగ్గరి దారి.


’సురస’ పెద్ద నోటిలో చిక్కినపుడుగానీ, లంకలో రాక్షసులు త్రాళ్ళతో తనను బంధించినపుడుగానీ హనుమంతుడు సూక్ష్మరూపాన్ని ధరించే కదా ఆ బంధనములనుండి విడివడగలిగింది? 
"సర్వహీన స్వరూపోహం" అని పరమాత్మ తత్వాన్ని తేజోబిందూపనిషత్ నిర్వచిస్తోంది. 


"అణోరణీయాం" అయినవాడే "మహతోమహీయాం" కాగలడు. అయితే మానవుడు ఈ సత్యాన్ని గుర్తించలేక లేనిపోని అహంకారాన్ని తెచ్చిపెట్టుకొని "నా అంతటివాడు లేడు" అని విర్రవీగి చివరికి ఆ మాయకు బద్ధుడై అనేక జన్మలను ఎత్తుతున్నాడు. 


తన నిజస్థితియైన ఆత్మతత్వాన్ని గుర్తించిననాడు అదే ఆత్మతత్వం సర్వేసర్వత్రా వ్యాప్తమై ఉన్నదనే జ్ఞానం కూడా కలుగుతుంది. 


అప్పుడింక ఒకరు గొప్ప ఇంకొకరు తక్కువ అనే భావనే కలుగదు.


ఈ చరాచర సృష్టి అంతా పంచభూతాలతోనే నిర్మించబడినప్పటికీ వివిధ నిష్పత్తులలో వాటి వాటి కలయిక వల్ల మనకు స్థూలంలో ఇన్నిన్ని వస్తుభేదాలతో కనిపిస్తోంది. ఈ స్థూల దృష్టి ఉన్నంతకాలం ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భేదభావన తొలగదు. అదే మనం సూక్ష్మదృష్టితో చూస్తే సృష్టిలోని ప్రతి వస్తువూ, ప్రాణీ అణువులతోనూ, పరమాణువులతోనూ నిర్మితమైనవే కదా. మరి ఈ పరమాణువులన్నీ ఒకే విధమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడినవే కదా! ఇలా సైన్సు ప్రకారం చూసుకున్నా సర్వసమానత్వం మనకు గోచరిస్తుంది.


ఇక భక్తుడవై చూస్తే ఈ సమస్త సృష్టి పరమాత్మనుంచే వచ్చింది కదా? మరి అలాంటప్పుడు ఇక హెచ్చుతగ్గులకు తావెక్కడ? 


మరి జ్ఞాని దృష్టితో చూస్తే ఈ సర్వమూ తన(పరమాత్మ) స్వరూపమే. ఇలా ఏవిధంగా చూసినా సరైన పరిశీలన చేసినవాడికి హెచ్చుతగ్గులు లేవని అర్థమౌతుంది.


మానవుడు ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోలేక కేవలం స్థూల దృష్టితో మాత్రమే చూసి అహంకార మమకారాలకు లోనై బంధనాలను కొనితెచ్చుకుంటున్నాడు.


సూక్ష్మదృష్టి, లేదా సూక్ష్మ భావన అంటే దేనికి అంటకపోవటం. "యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే! సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే" అని భగవద్గీత చెబుతోంది. 


ఆకాశం సర్వవ్యాపమై ఉన్నా దాని సూక్ష్మత్వం చేత దేనికీ అంటకుండా ఉంటోంది. నిజానికి ఆకాశంకన్నా పెద్దది విశాలమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు కదా. అంత పెద్దదైనా దాని గుణం సూక్ష్మత్వం. అందుకే అది దేనిచేతా బంధింపబడదు. అలాగే దేహమంతా వ్యాపించియున్నా తన సూక్ష్మత్వం చేత ఆత్మ కూడా దేనికీ అంటదు, దేనిచేతా బంధింపబడదు.


ఇదే సూక్ష్మంలో మోక్షమంటే. బంధన లేకపోవడమే మోక్షం కదా! నిజానికి మన నిజస్థితి సదా మోక్షస్థితే. అయితే అట్టి సదాముక్తయైన ఆత్మను నేననే సూక్ష్మాన్ని గుర్తించలేక ఈ స్థూలదేహం నేననే భ్రమలోపడి మనం బంధితులం అయ్యామని తలపోస్తున్నాం, ముక్తిని కోరుకుంటున్నాం. శ్రీగురుదేవులు బోధించినట్లుగా "ముక్తి అనేది పొందేది కాదు. అది నీ స్వరూపమై/స్వభావమై  ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా దానిని గుర్తించడమే." దానికోసం మనం ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోవాలి. ఆథ్యాత్మికంగా ఎదగడం అంటే సమానత్వ దృష్టి సాధించడమే. సమదృష్టి కలవాడే పండితుడని, జ్ఞానియని భగవద్గీతలో అనేకమార్లు చెప్పబడింది.


నేలమీద ఉన్నవాడికి కొన్ని ఎత్తుగానూ, కొన్ని పల్లంగానూ కనిపిస్తాయి కానీ విమానంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్నవాడికి ఈ భేదాలు తెలుస్తాయా? వాడికి క్రింద అంతా సమతలంగానే గోచరిస్తుంది. అలాగే ఆథ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడే ఇంకా "నేను గొప్ప, నువ్వు తక్కువ" అని మాట్లాడుతాడు కానీ ఉన్నతిని సాధించినవాడు ఎన్నడూ ఈ తరతమ భేదాలు చూడడు.

🕉️🌞🌏🌙🌟🚩

🧘‍♂️తత్వబోధ🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

" నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ "


1-జన్మించటము- మరణించటము కర్మే. కదలిక కదలాలంటే ఆ కదలిక వెనుక ఉన్న శక్తి పేరు కర్మ.


2- నేనన్న ఉనికి ఉనికిగానే ఉంటే స్వరూపం - వ్యవహరిస్తే జీవుడు. 


3- ఆత్మకు కర్మ జడం - జీవునికి కర్మ చేతనం. ఆత్మ నిత్య తృప్తం - జీవుడు నిత్య అసంతృప్తి.... అసంతృప్తి వలన కర్మకు వశుడవుతున్నాడు. 


4- అంత: కరణాన్ని ఎవరైతే స్వాధీనపరచుకున్నారో వారికే ఉపరమ ..... జ్ఞానాన్ని ఉపయోగించి కర్మను పనిముట్టుగా చేసుకోవాలి. 


5- సహస్రారం నుంచి కిందకు దిగక- వాసనలతో - గుణములతో కూడక వ్యవహరించు ... కట్టెలు వేయకు - గాలి కొట్టకు. 


6- సృష్టి ధర్మము నెరిగి యజ్ఞభావం తో కర్మచెయ్యటం శరీర ధారులకెల్ల నియమము.


7- స్వరూప జ్ఞానం ... సర్వాధారమై - సర్వాన్ని ఎరిగి- సర్వ వ్యాపకమై - సర్వాన్ని మింగి వేయగలది సమ్యక్ జ్ఞానం.


8- సాధకులు ... సాత్వికఅహం పోగోట్టు కోలేరు ... ఇది అనుకూల శతృవు - నీడవలే వెన్నంటి ఉంటుంది. రాజసిక , తామసిక అహము ప్రతికూల శతృవులు. 


9- కాల కర్మ వశమైన దానిని కూడా దాటించగలంత బలంగా శమాది షట్క సంపత్తి సాధించబడాలి.


10- ప్రళయ కాలంలో కూడాకాపాడేది ఏదో అది స్వధర్మం.. అటువంటి స్వధర్మాన్ని అనుష్టించటమే శ్రేయస్సు. స్వధర్మం కానిది పరధర్మం. 


11- నిత్యం - శుధ్ధం- బుధ్ధం- ముక్తం- అద్వయం ... వ్యష్టి సాక్షి. సత్యం- చైతన్యం- జ్ఞానం- ఆనందం- ప్రకాశం ... సమిష్టి సాక్షి.
 

12- స్వధర్మానుష్టానమే ..... స్వస్థితిలో నిలకడ చెంది ఉండటమే మడి కట్టుకోవటం .. జీవాత్మ పరమాత్మల అభేధ దర్శనాన్ని కల్గి ఉండటమే స్వధర్మం. జీవాత్మ- పరమాత్మ ల అభేధ దర్శనమనే అంత: సన్యాసాన్ని పొందినవాడికి పరమాత్మ స్థితి యందు నిలకడ చెంది ఉండటమే స్వధర్మం. 

🕉️🌞🌏🌙🌟🚩
🧘‍♂️దివ్యత్వం🧘‍♀️
🕉️🌞🌍🌙🌟🚩

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు.  కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.


ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద. వేదాలు పదేపదే చెప్పే విషయం.


దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.


శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని(శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.


ఏ అవకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం.
 

ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు- అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.


శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.


మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం నేను కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.


ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయు ష్మంతులుగా ఉండాలి.


పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు.
 

శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.


నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవ కాశం ఉంది అందరికీ.


జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది.


మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది.


దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.


దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు.
 

ఇలాంటి దివ్యానుభవాల ఇంద్రధనుస్సు చిదాకాశంలో వెళ్ళివిరియాలని ఆయన అభిలాష.
***