Saturday 6 April 2019

అభినందన (1988)*

ప్రాంజలి ప్రభ నేటి పాత గీతం (1 )
నాకిష్టమైనది - మీకు ఇష్టమైనది  
సేకరణ : మల్లాప్రగడ రామకృష్ణ 

చిత్రం: అభినందన (1988) 
గీతరచయిత: ఆచార్య ఆత్రేచిత్రం: అభినందన (1988) 
సంగీతం: ఇళయరాజా య 
నేపధ్య గానం: బాలు, జానకి

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో 
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
మంచు కురిసే వేళలో

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో 
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో 
జలకమాడి పులకరించే సంబరంలో 
జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో 
జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో 
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో..

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో 
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
మంచు కురిసే వేళలో…

మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో 
మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో 
మన్మధునితో జన్మ వైరం చాటినపుడో 
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో 
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో..
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో..

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో 
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో 
మంచు కురిసే వేళలో…
--((**))--