Sunday 10 July 2022


ఉత్తమ మహిళ గా ప్రభా శాస్త్రి జోస్యులు గుర్తించి నందుకు హృదయ్ పూర్వక శుభాకాంక్షలు   

తల్లి గా పాలించి తనయుల్ని ప్రేమించె 
చెల్లిగా లాలించి చెరితనే సృష్టించె 
భార్యగా ప్రేమించి బందాలను కలిపె 
ఆ తండ్రి కూతురుగా ఆశయాలను తీర్చె
హితురాలుగామంచి హితాన్ని కలిగించె 
దీవెనలను పొంది దివ్య వెలుగు పంచె 

*ఓ మహిళా నీవు ఓర్పు పలుకు తీరు
నీకెవరూ లేరు నిలకడ కళ పోరు*
ఓ ప్రభా శాస్త్రి జోస్యు లా ఇవే మా వందనాలు   
ఓ ఓ  చదువుల తల్లి సరస్వతి కి వందనాలు*
 
హృదయాల సృష్టించే హృద్య దేవత పలుకె  
సృష్టిలో ధర్మాన్ని స్థిరపరిచే వనితె  
మనసు అర్ధాలను మాయమర్మమమతె 
మనిషి మనుగడకు మంచిన డవడికె  

*ఓ మహిళా నీవు ఓర్పు పలుకు తీరు
నీకెవరూ లేరు నిలకడ కళ పోరు*
ఓ ప్రభా శాస్త్రి జోస్యు లా ఇవే మా వందనాలు   
ఓ ఓ  చదువుల తల్లి సరస్వతి కి వందనాలు*

అవనిపై తెల్పెటి అద్భుత తత్వమె   
కోమలత్వమ్మేను కోరుకవిత్వమె 
సున్నితత్వమ్మేను సుమధురతత్వమె  
వెరసి మెండైనది విధి మానవత్వమె

*ఓ మహిళా నీవు ఓర్పు పలుకు తీరు
నీకెవరూ లేరు నిలకడ కళ పోరు*
ఓ ప్రభా శాస్త్రి జోస్యు లా ఇవే మా వందనాలు   
ఓ ఓ  చదువుల తల్లి సరస్వతి కి వందనాలు*

కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా   
శయనేషు రంభగా, రూపేషు లక్ష్మిగా   
సత్కర్మ నారివి, ఇలధర్మ పత్నివి , 
భోజ్యేషు మాతవి, ఓర్పుగా  ధరిత్రివి 

ఆలనతో మార్చె ఆశ ప్రకృతి మాత 
లాలనతో మార్చె లహరి నీకు నడత 
లేరులే సరిజోడు లహరి ఈ సమహిత 
తెలుపుకవిత్వమ్ము తన విలువ జనత

*ఓ మహిళా నీవు ఓర్పు పలుకు తీరు
నీకెవరూ లేరు నిలకడ కళ పోరు*
ఓ ప్రభా శాస్త్రి జోస్యు లా ఇవే మా వందనాలు   
ఓ ఓ  చదువుల తల్లి సరస్వతి కి వందనాలు*

మీ
మీ విధేయుడు 
మల్లప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ప్రాంజలి ... ఉదయ రాగ గీతం 01/03/2023. ***** పాట సందర్భంపై నా విశ్లేషణ. ********* పార్వతీ పర మేశ్వర శృంగార ఆటవెలది సరస సల్లాప గీతమ్ ...! పల్లవి:- **** పా:: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ నాదు చిలిపి ఊహ నాట్య మాడె కోర మీస మేను కోరియు తిప్పంగ నాదు వలపు వీణ నాట్య మాడె ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... ప:: దోర వన్నె చేయి దోభూచు ఆడంగ నా తణువు అగ్గి నటన అయ్యె బుగ్గ గిల్ల చుంటె బురబుర పొంగేను సిగ్గు చీర విడిచి చిందు లయ్యె ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... ప. పా :: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ నాదు చిలిపి ఊహ నాట్య మాడె దోర వన్నె చేయి దోభూచు ఆడంగ నా తణువు అగ్గి నటన అయ్యె చరణం:- *** పా:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... పా :: మనసు దోచు చున్న మగ మహారాజువి సామ జవర గమన సాహ సంబు కొంత నాకు పంచు కోరిక తీర్చుమా అంత నీవు దోచు ఆశ గాను ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... ప. :: ఇదియు సంతసమ్ము ఇన్నాళ్ళు నాలోన అంద మంత నీది ఆత్ర మేను కొత్త దనము తెచ్చు కోరు వసంతము అందు కొమ్ము నన్ను ఆత్ర మేను పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... ప:: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... పల్లవి:- **** ప. పా :: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ నాదు చిలిపి ఊహ నాట్య మాడె దోర వన్నె చేయి దోభూచు ఆడంగ నా తణువు అగ్గి నటన అయ్యె చరణం:- **** పా:: ఎన్ని లక్షణాలు ఏలనమ్మాళిలే నీదు వేష మాయ నిజము యేన ఇన్ని నాళ్ళు నమ్మె ఇష్ట మాయా మగడా నీదు ఆశ తీర్చ నిజము గాను పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... ప:: గాలి లోని పలుకు గాళమై పట్టెనే గంధ పరిమళాలు గాయ మేను వెన్నె కళల మోము వేగమై పిలిచెను నీదు చుంభ నముయె నాదు జపము పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... పా:: ప్రాణ మేను నీది ప్రాయము దోచుకో కమ్ము కొమ్ము నన్ను కాల మిదియు ఈక్షణమ్ము నేను ఇష్టమ్ము చేసెద సత్య పలుకు నాది సమయ మిదియు పా :: ఆ ఆ ఆ ఆ ఆ అవునా ..... ఆ ఆ ఆ ఆ ఆ ..అవునా .... పల్లవి:- *** పా. ప:: ఓర చూపు నిన్ను ఓర్పుగా చూడంగ నాదు చిలిపి ఊహ నాట్య మాడె కోర మీస మేను కోరియు తిప్పంగ నాదు వలపు వీణ నాట్య మాడె ********** గోపాల లీలలు ... గొప్ప గొప్ప కళలు ...గీత మాధురి ..... నల్లనయ్యా, నల్లనయ్యా, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా అయినా మాదేవుడవు, మా రక్షకుడవు, నీవేనయ్యా మాకు గీతనందించిన పరమాత్ముడవు నీవేనయ్యా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే నీవేనయ్యా నుదుట కుంకుమ రవిభింబము గతి గాను కాటుక కనుల వెలుగులు కళలు గాను రత్న కాంచన హారము రమణ హృదయ గళమున మెరయగుట ధర్మ గీత కృష్ణ .... నల్లనయ్యా, శోభగాను పీతాంబర సమయ వస్త్ర నిండు కరముగా పట్టెను నియమ వేణు కరములకుకంకణము లన్ని కావ్య జగతి పదములకు సవ్వడి మువ్వలు పలకరింపు... నల్లనయ్యా, ఉండ బట్టలేక పలుక ఊహ ఇదియు మండు టెండలో నీవుగా మనసు నాది దండమును పెట్టుతున్నాను దయయు కృపయు చూపు బాలకృష్ణవు బాల వాక్కు మదియు ... నల్లనయ్యా, మరిమరి పిలిచావు నయన మనసు చోర మృధు మధుర మురళీ కృష్ణ మకుట ధీర మంగళస్వరూప వినయ మాయ వీర నన్ను మన్నించుము కపట నటన ధారి .... నల్లనయ్యా, కానల సరస గాన వివేక కృష్ణ వీనుల ముఖ వేణు స్వర వినయ కృష్ణ మేనులు మరపు చేసెడి మెత్తని కృష్ణ ప్రేమకై చిత్త మైతి కృతార్ధ కృష్ణ ... నల్లనయ్యా, నల్లనయ్యా, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా అయినా మాదేవుడవు, మా రక్షకుడవు, నీవేనయ్యా మాకు గీతనందించిన పరమాత్ముడవు నీవేనయ్యా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే నీవేనయ్యా ****.
 ఓం ..దైవమా... ఓం శ్రీ వేంకటేశా ఓం . దైవమా... ఓం శ్రీ శ్రీనివాసా చిలిపి పరుగులు చేసేటి జీవి నైతి మనిషిగా పరవము పంచు మనుగ డైతి పరుగులో పంతమును చూపి పలుక నైతి నీదు భక్తితో కొలిచితి నియమ మైతి...........ఓం ఎన్ని చూపుల కోసమో ఏదొ పూజ ఎంత ప్రేమ కోసము నిన్ను యదన పూజ తీగ నై చిరు పువ్వునై తీపి పూజ గాలిలో రాగములు తెల్ప గమనపూజ.........ఓం వాసు దేవ రక్ష వాస్తవమగు తృప్తి విశ్వ వినయ వాక్కు వినయ దీక్ష విద్య విలువ పెంచి విశ్వాసమును పంచె మేలుచేయు వెలుగు మేలుకొలుపు...............ఓం గుండె వేగాన్ని పలికించు గుర్తు ఇదియు గూటిలో స్వర్గ సుఖముగా పూజ ఇదియు చెట్టు నీడలో సౌఖ్యము తెరువు ఇదియు నా హృదయ మేను నీకుయే నిజము ఇదియు.. ఓం హారతి గొనుము నిత్యమూ హాయి కనుము భారమదియు కాదు ఇదియు బంధమిదియు ప్రేమతో ను ఆరాధన ప్రీతి గనుము వేగ ప్రియము కలుగచేయు వేంకటేశ.............ఓం మీ భక్తుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ...1 May be an illustration ఓం ..దైవమా... ఓం శ్రీ వేంకటేశా ఓం . దైవమా... ఓం శ్రీ శ్రీనివాసా నినుతలచి మైమరచి ఉంటిని మరువ కనె కనులు తీర్పు మహిమ నీది కథ లగుననె విడ మరచి చెప్ప లేనిది వీను లగనె వేడు కొంటిని ఇప్పుడే వేంకటేశ.... ...... ఓం శ్రద్దతో శ్రవణము ఇది శ్రమను గణవ నీదు దేహము ఇదియేను నిజము కనవ విన్న శాస్త్ర ననుకరణ వేగ మినవ వేదననకు ప్రేమ ఇదియే వేంకటేశ.......... ఓం విరిగినా పాలతొ మిఠాయి విలువ వుండు నలిగిన మనసు వాక్కులు నయన మెండు చిరిగిన వలువ దాహము చెప్పు చుండు విలువలన్నియు నీదృష్టి వేంకటేశ.........ఓం సంపద ప్రధానమగుట సమయ తృప్తి సంప్రదాయము నిలుపుటే సంఘ తృప్తి సంధి సల్పు సమస్యల సహన తృప్తి విధి విధాన రచయితవు వేంకటేశ........ ఓం నాకు విజయాలు సంక్షోభ నాట్య మేల నాకు వైఫల్యములు ఏల నేటి లీల నీకు చీకటి వెలుగులు నిర్మలమగు నీదు భక్తి కోరుటయేను వేంకటేశ ......... ఓం మీ భక్తుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ....2 శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ-- శ్రీదేవి, భూదేవి నీ ఎట్లా భరించవయ్యా ఒక్కరినే భారించటం మాకు kashtamu గా ఉన్నది -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ కలువలై జలమున నుండి నగవులై మమతను పంచి లతలులైపరిమళ మిచ్చి ఉరకలై మనసున చేరే -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ పదవు లై బతుకునమెచ్చి చిరుగులై ఉతుకుట నేర్చి శుభము లై కలుపుట వళ్ళ మెరుపు లై జగతిన ఓర్పు -- -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ పలుకు లై తనువును పంచు పగలు లోను నళిని లోను స్వచ్ఛ సెగలు లోను మెరుపులో ను తృప్తి కధల లోను కవిత లోను నేర్పు -- -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ వలపు లోను తలపు లోను నేర్పు మలుపు లోను కులుకు లోను మార్పు గిలక లోను చరఖ లోను కూర్పు తలుపు లోను తడిక లోను తృప్తి -- -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ వయసు లోను సొగసు లోను సమం చిగురు లోను చలము లోను శుభం కరువు లోను పరువు లోను ప్రాణం పరుల లోను గిరుల లోను స్నేహం -- -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ సిరుల లోను వెతల లోను శోభా కలువ లోను కణత లోను ప్రేమా పరిధి లోను వినతి లోను కామాం విదియ లోను తదియ లోను దాహం -- -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ మీ భక్తుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ --7 *** May be an image of 1 person హరేరామ హరేరామ రామరామహరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే పరుగేల పాల కొరకే గొల్లల గృహముల పాల గోలలగుటయే పలుకే బంగారముగా చిలికే నవ్వుల కళకళ చేష్టల కృష్ణా.... హ అన్ని దిశల నీవే యై యన్న నికను మాకు భయము ఏలను కృష్ణా కన్నా మనసే తెలిసియు యన్నన్ స్వజన సుఖమొసగు యోగపు కృష్ణా... హ వాయువు గగనము పుడమియు మాయా జగతిన సమయము మానస కృష్ణా చేయద లచినవి చేయుట యూయల లూగింతువు కద యోగపు కృష్ణా. హ కోపం అబ్బాయిలదే తాపం అమ్మాయిలకళ తప్పదు కృష్ణా శాపం గుణపాఠాలుగ పాపం చేయక మనసున ప్రార్ధన కృష్ణా... హ ఈ కాల నిర్ణయ కలలు అ హంకారం మనచు కథలు హాయిగ కృష్ణా ఓంకారం మన మానస ఘీకారం మన లొ బుద్ధి వీనుల కృష్ణా..... హ కళ్ళతొ కోరేది నరుడు గుళ్లకు వెళ్ళియు సుపూజ గూర్చిత కృష్ణా మళ్లక మనసును ఉంచే నీళ్లగ దాహమును తీర్చు నిర్మల కృష్ణా.... హ మీ భక్తుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ.....6 May be an image of 1 person ఓం దైవమా... ఓం శ్రీవేంకటేశ్వరాయణమ : ఓం దైవమా.. ఓం శ్రీ మాత్రే నమ : చినుకు పడ్డ పులకరింపు చిత్రమాయె లతలు పురివిప్పి పరిమళం లయలు మాయె నిత్య పరువమై వికసించు నియమఘడియె సర్వ సృష్టి మయ ప్రకృతి సమయ తృప్తి.... ఓం జగతి హితముగా చరియించు జపము కళలు బ్రతుకున మతిలో పగలేక బంధకళలు తెగిన గాలిపఠాలను తీర్చి దిద్దు సకలము తెలుపు సమయమే శ్రీనివాస... ఓం ధర్మ ముడుపు కట్ట ధరణి తీర్పనుచునే అర్ధ ముడుపులగుట ఆట ఏల కామముడుపు కట్టి కడుపుతీపి యనుచు మోక్షముడుపు జగతి మోహ మేల.. ఓం మల్లె తీగలా ఎగబాకు మనసునాది నిత్య సయ్యాట తోడుగా నిర్ణయమిది తడిసియుంటి వెచ్చని స్పర్శ తృప్తి చెంది ప్రకృతి పర్వము సుఖశాంతి ప్రతిభ నాంది... ఓం ఆంత రంగిక జీవన అలలు కలిగి పులకరింపు కళల వల పుడమి నందు అడిగి అడగలేక వయసు ఆటనాది విలువ తెలియక వేడుక వేంకటేశ.. బ్రహ్మ పరబ్రహ్మ జగతిన బ్రాహ్మణ గుట పుడమి నేలు సద్భుద్దిగా పుట్టుకేను నిత్య పూజ పునస్కార నియమ బ్రతుకు విద్య వినయమ్ము నీతోడు వేంకటేశ ఓం మీ భక్తుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ...5 . No photo description available. 0 ఓం దైవమా.... ఓం శ్రీ వేంకటేశాయ నమ : ఓం దైవమా.... ఓం శ్రీ మాత్రే నమ : వింత జగతిలో నిత్యమూ వేడుకగుట వింత సత్య జీవకధలే విజయమగుట వింత సంసార ఆరోగ్య వెత లగుటయె వినయ విడిదిగా విధిలోన వేంకటేశ.... ఓం లయల హొయలు పోతున్నాయి లాస్య మార్గ రుధిర చారల గోడలా రుద్ర మార్గ నడవ మడమ నాట్యమ్ముగా నయన మార్గ మెరుపు వేగమై ముసిరిన ముత్యమగుట..... ఓం మెదడు పురుగు కసిరినది మేలు చేయ తరుగు తల భత్యము కలుగు తపము చేయ ఇంట అలిగిన అగచాట్ల ఇష్ట మాయ వినయ వాక్యాలు తెలిపేది వేంకటేశ... ఓం త్యాగ బుద్ది నిరంతర తపన నాది స్వేచ్ఛ కోరి తెలుపు చున్న సమయ నాంది దృశ్య ము అదృశ్య కళయిక దారి నాది ఇవ్వగలిగిన దాన్నిస్తు ఇష్టమైంది... ఓం సర్వ భూతములకృషి వసించు మనసు సర్వ ము సమాన పరచు సమయమనసు సర్వ దృష్టికి మూలము చరితమిది యు సర్వ సర్వమే యనుచుండు శ్రీనివాస..... ఓం మీ భక్తుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ.....4 No photo description available. ఆకురాలును బ్రతుకున ఆశ చూపు మనసు చిగురించు నిత్యమూ మరల మరల వ్యథల మునిగి యున్ననూ వాక్కు పూజ ఆశ బ్రతికించు జీవితం మరల మరల నిప్పులో కాలి నిగ్గునూ తేల్పు తుంది పుత్తడి మెరుపు పుడమిలో పురుడు పోయు శ్రమకు జీవితం రానించు సమయమందు సిగ్గు లొలుకు దేవికి తోడు శ్రీనివాస దెబ్బలను తిన్న రాయియే దివ్య వెలుగు అందమైన శిల్పమగుటే దాని విలువ జీవితాన తాకెడి దెబ్బ జీవి విలువ మనసు గెలిపించు జీవితం మరల మరల గంధపు తరువు పరిమళం గగన తాకు పాములే చుట్టిన వాసన మాయమవదు మారిపోని మంచితనమే మనసు తాకు మనసు శోభించు జీవితం మరలమరల తిరిగిరాని గతముగూర్చి చింత ఏల తలచి తలచి శోకమ్మేల తప్పు లేల వచ్చును క్షణాలన్నియూ వేదానేల మనసు మురిపించు జీవితం మరలమరల ఏ తుఫానులు ఎదుర్కొంటు ఏల బ్రతుకు గళము లేకయే నిలుస్తుంది గడ్డిపోచ ధైర్యముగనులే ఎదిరించె ధైన్య శక్తి మనసు పుట్టించు జీవితం మరలమరల అలలు ఎగసి పడే గాలి ఆట ఇదియు తీరమునుచేరు జలముయే తీరుమారు పట్టుదలఏను గమ్యమ్ము పగలు రాత్రి విశ్వమై నడిపించు మనసు వేంకటేశ మీ భక్తుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ.....3 No photo description available. 
........
మూడు నెలలనుంచి ఆన్లైలో ప్రయత్నం చేస్తున్నాను శ్రీ స్వామి దర్శనానికి ఈరోజు వరకు అవకాశం కలగలేదు
****
ప్రాంజలి ప్రభ నేటి ఆ పరమాత్ముని ఉషోదయ ప్రార్ధన గీతము....27=02=2023.

తిరుమల తిరుపతి వేంకటేశ, నీవే మాకు దిక్కు
కష్టాలు కడతీర్చు కరుణ హృదయ నీవే దిక్కు
ఏమని చెప్పే దయ్యా, ఏకర్మ యిది మాకయ్యా
ఎదలోని మాట తెలప లేనయ్యా, ఏల నయ్యా

వేంకటేశ మమ్ము కలవ నీక ఏల
బాధ పెడు తున్నావు గదా నిదానముగనె 
నీవు ధర్మా న్కి అధికారి నిజము ఇదియు
దర్శనము మాకు కష్టమే దయయు లేదు

 ఎంత చెప్పిన తక్కువే యదలొ మాట....
ఎరుక నీవంతు ఇప్పుడు ఎల్ల వేళ....
ఉజ్వలభవిష్యతే నీది ఊయ లైన...
వేకువన చేరి కోరితి వేంకటేశ....

ఏమని చెప్పే దయ్యా, ఏకర్మ యిది మాకయ్యా
ఎదలోని మాట తెలప లేనయ్యా, ఏల నయ్యా

మంచితన అభిమానపు మనసు నాది 
ధనము బల బలగం లేదు ధరణి యందు
నేర్పు పాఠము న్యాయమై నాటి నుండి
నేటివరకు ప్రార్ధన లేను వేంకటేశ

నువ్వు నన్ను తిట్టక యున్న నూక కొరకు 
కోపగించుకుంటూయున్న పోరు కాదు 
అలక తో మౌన మదినాదిఆశ అనకు 
మార్చుకోలేను మనసునే వేంకటేశ

ఏమని చెప్పే దయ్యా, ఏకర్మ యిది మాకయ్యా
ఎదలోని మాట తెలప లేనయ్యా, ఏల నయ్యా

నువ్వు నేస్తమే కావచ్చు ముడుపు లిచ్చి 
నచ్చి నట్లుగా కొలచితి నటన కాదు 
గాయ పడ్డనిందించను గళము రాదు
విద్య లేని మనసు నాది వేంకటేశ

 ఆణువణువు ఋణ బంధము ఆస్తి నీవు
విత్తముకొరకు కృషిగాను వేద పఠన
సిరులు నిచ్చెడి కళయున్న చిత్త మివ్వు
వేడుకయు నాది నిన్నునే వేంకటేశ

ఏమని చెప్పే దయ్యా, ఏకర్మ యిది మాకయ్యా
ఎదలోని మాట తెలప లేనయ్యా, ఏల నయ్యా

 ధనబలానికి తల ఒగ్గి దాసు నైతి
అక్షరపలుకు సత్యమై ప్రకృతి తోడు
అర్ధ సంపద లేక ఆరాధ్య నైతి
నేడు నారాత మార్చుము వేంకటేశ

తిరుమల తిరుపతి వేంకటేశ, నీవే మాకు దిక్కు
కష్టాలు కడతీర్చు కరుణ హృదయ నీవే దిక్కు
ఏమని చెప్పే దయ్యా, ఏకర్మ యిది మాకయ్యా
ఎదలోని మాట తెలప లేనయ్యా, ఏల నయ్యా
గోవిందా... గోవిందా.. గోవిందా
.......

నేటిదినమున అనగా ది. 26వ మార్చి,2023 న నాదినచర్యలో భాగంగా క్రింది కీర్తన...విష్ణుకీర్తన భక్తి, జ్ఞాన వైరాగ్యములకు చెంది తేనెలూరే మధుర భక్తి..కోవలో చేరే విధముగా..... "నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే " అను ఆర్యుల వాక్కుననుసరించి...సంసార తరణమునకు భగవన్నామ కీర్తన కన్న సులభోపాయము లేదని పదము ( పద్యము/ లేదా కీర్తన ) భావము... శ్రీ వేంకటేశ్వర స్వామి, జూబ్లీహిల్స్ హైదరాబాద్,దర్శనం అనంతరం .. "భక్తి కాకున్న సంసార భజన లేల ? లోకకంటకములగుటే లోభ మేల? కాల కర్తవ్య మెరుగని కన్ను లేల? కామ్య తరుణ పాఠము చెప్ప కథలు ఏల?..పల్లవి.. వినదగు పలుకు విన్నాను విష్ణు భక్తి విష్ణుకీర్తన చెవికింపు వినయ భక్తి నదియె వేదాంతబోధగా నమ్మ భక్తి మనము గన వలసినది మధుర భక్తి యునికి ప్రాణ బ్రహ్మోపదేశంబు భక్తి...... భక్తి కాకున్న.. చదువు గనవలసి చెలిమి ధైర్య శక్తి సకల శాస్త్రము సమ్మత సమయ యుక్తి గనవలసినది నీరజాక్ష గతి ముక్తి హృదయ మర్పణ సేసెడి యోగ నిదుర | ...భక్తి కాకున్న.. వేంకటాధీశ్వరుని కృప వేల్పులగుట చేయు పరమానంద సుఖము చేరు వగుట గనవలసినను వైష్ణవాగార విధము సేయుట దనకు వైభవ సేవ పదము || ..భక్తి కాకున్న నమో నమో నమో వేంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా ........... శ్రీ వేంకటశ్వర స్వామి కీర్తనలు..25=02=2023 నామాలరాయుని నయనాలు వెలుగులే చూడాలి జనులెల్లా, వెయ్యేళ్ళ దీవెనలే కారుచీకటినా వెలుగులే, మాకు నింపావులే మా మనసునా అమ్మతో కలసి ఉన్నావులే.....2 నలుదిక్కులు నరులెల్ల సప్తగిరులు దాటి వత్తురు హృదయాలను అర్పించుటలో మేటి సతులు సుతులు పరిసర బంధువులు పోటి కొలిచేటి హితులు భక్తులు భజనలు భేటి..... 2 వత్తురు బహు వగల సంపదల తో కదలి వాన లున్న వరదలున్న వదలక కుమిలి ముడుపులు జాలెలుమొగి తలమూటల జాలి చరణాలవిందమునకు చేరి భక్తితో మునగాలి కురులు ధనమును అర్పించితి చూపు నీదయ గాలి నామాలరాయుని నయనాలు వెలుగులే చూడాలి జనులెల్లా, వెయ్యేళ్ళ దీవెనలే కారుచీకటినా వెలుగులే, మాకు నింపావులే మా మనసునా అమ్మతో కలసి ఉన్నావులే.....2 వాసుదేవుని రక్ష మనసు వాకిటగతి కాసులే ఇవ్వంగ కరుణ కామ్యత గతి రాసులే నీ ధనము దీక్ష రమ్య జగతి త్రాసులా కదిలే జన కాంక్ష ప్రగతి జన్మలుగా పెంచు కున్న చెలిమి గోవిందా వసంతాన్ని కొనితెచ్చే పంచెమి గోవిందా చల్లని మనసుకు పొందే వేడిమి గోవిందా తగిలిన గుండెకు పొంగే పెన్నిధి గోవిందా పచ్చని ప్రకృతి పరవశాలతో గోవిందా అక్షరాలు అల్లుకున్న ప్రార్ధన గోవిందా చల్లని నీరు సమీర పరవశం గోవిందా ఆరునోదయ వెలుగు నందించు గోవిందా విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ ****

నేటి తెలుగు పాట .. ప్రాంజలి ప్రభ ... 02 -2023 ఏమిటి ఈలోకం, ఎదారిన పోతున్నది, ఎవరికెరుకా ఎదను తట్టి, నిదురలేపి, నిశ్చయము తెలుప లేకున్నది, త్రిగుణాతీతమై విస్తరించి, జండాలా రెపరెప లాడుతున్నది పొందిక లేని ఈ పదాలకు, పొద్దు ఏది ప్రాసలసంధ్యకు మనుగడకు, అర్ధ మేది నిజాలు కక్కలేని రాతలకు, ధైర్య మేది రవ్వ వెలుగున జీవితాలకు, మార్గ మేది ఎదను తట్టి నిదురలేపి నిశ్చయము తెలుపలేకున్నది, త్రిగుణాతీతమై విస్తరించి జండాలా రెపరెపలాడుతోంది ఆవేదనాక్షరాలకు చూపే, ఆవకాశం ఏది ఆర్తి ఆక్రోశాలను ఆపే, నిగ్రహ శక్తి ఏది అగ్నిజ్వాలలను చల్లార్చే, యుక్తి యేది అభినందనలగా బ్రతుకుకు, చెలిమి ఏది ఎదను తట్టి నిదురలేపి నిశ్చయము తెలుపలేకున్నది, త్రిగుణాతీతమై విస్తరించి జండాలా రెపరెపలాడుతోంది లలిత లావణ్య స్వరాల, ప్రేమ ఏది దర్భలా బ్రతికే దర్పం అణిచే, శక్తి ఏది ప్రబుద్దులకు బుద్ధి చెప్పే కాలమ్ము, ఏది వ్యాకులత వ్యాపక జ్ఞాపకాల మార్పు, ఏది ఎదను తట్టి నిదురలేపి నిశ్చయము తెలుపలేకున్నది, త్రిగుణాతీతమై విస్తరించి జండాలా రెపరెపలాడుతోంది దేవతారాధనయు నిత్య దైవ పూజ, లేకున్నది దేవ తోపాసనయు ధర్మ దైవ పూజ, లేకున్నది దేవతాధ్యానము న్యాయ దైవ పూజ, లేకున్నది దేవతాకైంకర్యము దేహ దైవ పూజ, లేకున్నది ఏమిటి ఈలోకం ఎదారిన పోతున్నది, ఎవరికెరుకా ఎదను తట్టి నిదురలేపి నిశ్చయము తెలుపలేకున్నది, త్రిగుణాతీతమై విస్తరించి జండాలా రెపరెపలాడుతోంది ***** ప్రాంజలి ప్రభ ...నేటి తెలుగు పాట ... 24 -02 -2023 తెలుగే మనసు పూల తోట, పలుకే హృదయానికి శాంతి మాట వెలుగే ప్రగతికి ఆశల బాట ఆతోటలో ఆబాటలో శాంతియే ప్రతిపూట ఆతోటలో ఆబాటలో శాంతియే ప్రతి పూట అమ్మ ఒడిలో అధ్బుతాన్ని చూసా ఆనందతాండవమాడినట్లు అనుభూతిని పొందా పొద్దుపొడుపు పొడిచినట్లు పొత్తిళ్ళ పాపగా నవ్వా పాలకంకులు విరిసినట్లు పంటచేలు లా ఊగా ... 2 వెలుగే ప్రగతికి ఆశల బాట ఆతోటలో ఆబాటలో శాంతియే ప్రతిపూట చల్లగాలి వీచినట్లు, సన్నాయి మేళం విన్నా సప్త స్వరములు మీటినట్లు, సత్కవుల కవితలు విన్నా జాజిమల్లెలు విరిసినట్లు, సన్నజాజులు రాలినట్లు జాతి వజ్రం మెరిసినట్లు, జయకేతనమెగిరినట్లు బ్రతికా ... 2 వెలుగే ప్రగతికి ఆశల బాట ఆతోటలో ఆబాటలో శాంతియే ప్రతిపూట గతచరితలు విరిసి, ఘనకీర్తి అంతటచాటితి జ్ఞానగంగలొ మునిగి, జ్ఞానాన్ని బోధించితి పండితునిగా బోధించి, పామరులను మార్చితి విజ్ఞులందరు మెచ్చి, విశ్వానకీర్తిప్రభలు చూపితి ... ... 2 వెలుగే ప్రగతికి ఆశల బాట ఆతోటలో ఆబాటలో శాంతియే ప్రతిపూట కాలమేదైనా, కష్టమేదైనా, వదలును తెలుగును కంట నీరు స్థిరముకాదు, తెలుగు జాతి స్థిరమగుటేను తుది రక్త బిందువు వరకు తెలుగు తోట పెంచుతాను ముందు తరాలకు తెలుగే జీవనాధారముగా మారుస్తాను ... 2 తెలుగే మనసు పూల తోట, పలుకే హృదయానికి శాంతి మాట వెలుగే ప్రగతికి ఆశల బాట ఆతోటలో ఆబాటలో శాంతియే ప్రతిపూట ఆతోటలో ఆబాటలో శాంతియే ప్రతి పూట ఈ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ *****
pranjali prabha --- 02-2023 " నిన్నని మార్చలేం...... రేపుని ఊహించలేం.... నేడు అన్నదే వాస్తవం......ప్రేమా.... అది మనచేతుల్లో ఉంది. అది మళ్ళీ నిన్నలోకి మారేలోపే అనుకున్నది చేసేయ్యాలి. ప్రేమా.... ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా పంచడానికే గానీ ఉంచుకోడానికి కాదు.... ఆనందాలకే గానీ ఆరాటాలకు కాదు .... ఆశయాలకు గానీ ఆర్భాటాలకు కాదు ... అణువు అణువు కలియుట యే గానీ ... విడిపోవు బ్రతుకు కాదు ప్రేమా అవునా .... అవును ..... ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా సృష్టి లో ప్రతి అణువూ ప్రేమా ప్రతి ఒక్కరు ప్రేమకై తపన ప్రేమా ఆవిరిలామారి ఆకాసాన ప్రేమ సుఖ దుఃఖాల కలయిక ప్రేమ స్వార్ధ నిస్వార్ధ కలయిక ప్రేమ నీరు నిప్పు చెలిమిగా కలయిక ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా నింగికి నేలంటే ప్రేమ తో పలుకు గిరులకు శిఖరాలకు మబ్బులంటే ప్రేమ మబ్బులకు గాలంటే వల్లమాలిన ప్రేమ మంచి చెడుల మధ్య నలిగేది నిజమైన ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా ఏటికీ సెలయేటికీ కడలితో ప్రేమ పచ్చదనమై పరిశుభ్రత ప్రేమ ఊపిరిపోస్తూ ఊహలు నింపేది ప్రేమ గాలి వెలుగు జీవాధారం అయిన నిజమైన ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా కంటి పాపతో చుసిన దృశ్య ప్రేమ భావ మాత్రము పొందేటి మనసు ప్రేమ విశ్వ సాధన చైతన్య పరుచు ప్రేమ జీవి అంతర్గత కళల ఆత్మ ప్రేమా " నిన్నని మార్చలేం...... రేపుని ఊహించలేం.... నేడు అన్నదే వాస్తవం......ప్రేమా అది మనచేతుల్లో ఉంది. అది మళ్ళీ నిన్నలోకి మారేలోపే అనుకున్నది చేసేయ్యాలి. ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా *****
ఒక భక్తుడు అమ్మవారిని చూస్తూ పడుతున్న పాట అమ్మా నినుమించిన తల్లి లేదు ఈ లోకంలో అమ్మా నినుమించిన తల్లి లేదు ఈ లోకంలో మమ్మే లు మాయమ్మ నీవే నమ్మా, ఈ లోకంలో మమ్మే లు మాయమ్మ నీవే నమ్మా, ఈ లోకంలో నీవు నవకోమలీ మందహాస, మృధుభాషిణీ! తోజో స్వరూపిణీ, సందర్భ క్రిష్ణ, రమణీ! నిత్య విలాస విజయ, విశ్వ వినోదిణీ! సర్వులకు భుక్తి నిచ్చు ఆనందలీలా రమణీ ! .... ... .2 శ్యామా, మాధవీ, కిశోరీ, ఆత్మలకె తల్లీ! ప్రేమ ధారా శివ గంగా నారాయణ ప్రేమికా, మళ్ళీ! శాంభవీ, వ్యామోహినీ సరూప దర్శనీ! అందరి హృదయాల్లో ఉన్న రూపిణీ! ..... ...... ....... .2 అమ్మా నినుమించిన తల్లి లేదు ఈ లోకంలో అమ్మా నినుమించిన తల్లి లేదు ఈ లోకంలో మమ్మే లు మాయమ్మ నీవే నమ్మా, ఈ లోకంలో మమ్మే లు మాయమ్మ నీవే నమ్మా, ఈ లోకంలో పాదముపట్టీ పూజింతూ, లోక పావనీ! నను గావగ రజమివ్వూ జగత్పాలినీ! హే సంస్థిత జ్ఞాన రూపాయ రమణీ! హే సంహిత ప్రేమస్వరూపాయ జవ్వనీ! ..... .... 2 వలపు చూపుల ధాటి' వాలు కనుల రమణీ! కన్నుల్లో ప్రియుడి రూపం, వీనుల్లో శివ హృద్యణీ! నీ కనుబొమల వాలుచూపుల బాణాలు నీరజాక్షిణీ! నిజాయితీ, నిర్మలమైన చూపుల సాద్విణీ! ..... ... 2 అమ్మా నినుమించిన తల్లి లేదు ఈ లోకంలో అమ్మా నినుమించిన తల్లి లేదు ఈ లోకంలో మమ్మే లు మాయమ్మ నీవే నమ్మా, ఈ లోకంలో మమ్మే లు మాయమ్మ నీవే నమ్మా, ఈ లోకంలో
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
*****
***************************** నేటి నా పాట పాట సంఖ్య:-559. ****************************** 9640713717. రచన:-మహేష్ వూటుకూరి ✍️ దోర్నాల. 26/02/2023. ***************** పాట సందర్భంపై నా విశ్లేషణ. ఓ కన్నె మనసు తన మనసుకు నచ్చిన ప్రేమికుడితో తన మనసు విప్పి చెబుతు తన మనసులోని భావాలను తెలుసుకుంటు జీవితమంతా ఎలా ఉండాలో ఎలా ఉంటామో తెలుపుతు హుషారుకు రూపమొస్తే ఎలా ఉంటుందో అలా వున్న జంట సంతోషంగా పాడుతున్న పాట. ************************************************ పల్లవి:- ******** కన్న కలలు తీర్చు రాకుమారా రావోయి ఈ కన్నె మనసు దోచుకు పోవోయి ఈ కాంతామణి మెచ్చిన మహారాజువు నీవోయి ఈ కన్నె కోరికా కన్నుల్లో చూడవోయి కన్నెతనం గుట్టు విప్పే మార్గం చెప్పవోయి!! ఈ వెన్నెల కాంతిలో వెన్నముద్ద తినిపిస్తావా కన్నె దొంగ వై ఇంతి బుగ్గ ముద్దు రుచి చూస్తావా ముద్దు పొద్దుల్లో మురిపాలు ఇచ్చిపోతావా మొగలి పొదల్లో దూరి మత్తెక్కిస్తావోయి నీ కౌగిళ్ళ లోగిలి నాకు రాసియ్యవోయి కన్నెకలలు తీర్చు రాకుమారా రావోయి కన్నె మనసు దోచుకుపోవోయి!! చరణం:- ******** కన్నె సొగసు కోరిక తెలుసునే ముద్దు గుమ్మ మనసు నాదిలే మంగళగిరి తిరునాళ్ళలో చూసానే మందారపువ్వు ఇచ్చి మచ్చిక చేసుకున్నానే వింజామర విసిరానే తాజా ముంజలే తినిపించానే గజమాలతో స్వాగతమే పలికానే వందమాగిరధులతో గజారోహణమే చేయిస్తానే సందు సందున సంబరాలతో అంబరమే అందుకుందామే ఎంచెక్కా ఎంచెక్కా చెమ్మాచెక్కా ఎంచెక్కా అష్టాచెమ్మా ఆటాపాటా ఈడు తోడు సై ఆటా ఎంచెక్క ఎంచెక్క ఎంచెక్క ఎంచెక్క.. పల్లవి:- ******** కన్నె కలలు తీర్చు రాకుమారా రావోయి కన్నె మనసుదోచుకుపోవోయి!! చరణం:- ********* సింహాచలం కొండపైనా సింహభాగం నీకే రాసిస్తా కోన సీమ కొబ్బరంతా నీ కొంగున ముడివేస్తా కోయిలమ్మనే తీసుకొచ్చి పాట కచేరి పెట్టిస్తానే ఈ కోనంతా ఓ కూనా నీకోసం కోలన్నా ఆడేస్తారే ఐలెస్సాఅంటావో జెల్సాలే చేస్తావో తెలుగు లెస్స అంటు తెలుగు వీరా లేరా ధీరా ధీరా తెలుగు నాటా నీవే మహారాజా నిన్న నేడు రేపు అంతా అంతంతా ఒటుడింతైనట్టు ఏలేస్తావు ఏకబిగినా!! డుం డుం డుం డుం డిగా డిగా దండోరా డుం డుం డుం డుం నువ్వే మా దోరా కోఠి సెంటర్లో రంగోళి వేయించి అంగ రంగ వైభవంగా చార్మినార్ చౌరస్తాలో భజరంగ భళి బజనలే పాడించి బాజాబజంత్రీలతో హుషారుకే హుషారు పుట్టించేలా తుషారమై కురిసి మురిపిస్తానే అతిలోకసుందరి... పల్లవి:- ********* కన్న కలలు తీర్చు రాకుమారా వచ్చావోయి ఈ కన్నె మనసు దోచుకుపోయావోయి.!! ఎంచెక్కా ఎంచెక్కా చెమ్మ చెక్క అమ్మలక్క లంతా చుమ్మచుమ్మా యే యే యే యే యేయేయేయేయే!! ***************************************

***************************** నేటి నా పాట పాట సంఖ్య:-557. ****************************** రచన:- మహేష్ వూటుకూరి ✍️ 9640713717. దోర్నాల. 24/02/2023. ****************************** పాట సందర్భంపై నా విశ్లేషణ. ***************************** ఆడదాని జీవితం అరటి ఆకు లాంటిదంటారు కాని అంతకంటే ఘోరమైన ఓ బ్రతుకు చిత్రమే ఈ గాద పుట్టిన చోట తండ్రి చేతిలో కష్టాలు మోసింది బాధలను దిగమింగింది అయ్యో పాపం అని జాలి చూయించిన స్నేహితుడు మనసు పడ్డాడో లేదో వాడ్ని మట్టిలో కలిపేసుంది కాలం.. ఆశగా కళ్ళెత్తి చూడని లోకంలో నిరాశే చుట్టు చేరి మనసులేని వాడితో మనిషే కానివానితో ముడివేసింది మెట్టినింట అంతకంటే ఘోరం.. పెనం మీద నుండి పొయ్యి లో పడ్డట్టు ప్రతిపూట.. నిరంకుశం క్షణక్షణం అంకుశమై పొడిచేస్తుంటే ఆ ఆడతనం విధిని ప్రశ్నిస్తు దేవుడిని నిలదీస్తు చాలు ఇక ఈ నరక కూపమంటు తిరుగు పయనమవుతానంటు ఆవేదనను ఆక్రంధనను పాటగా చెబుతోంది కన్నీరై పాటై పాడుతోంది!! *********************************************** పల్లవి:- ********* విధిరాత ఇంతేనంటు విలపించనా చితి చేరువరకు ఏ దారియైనా అంతేనంటు గోదారి చూసుకోనా ఈ కట్టె ఎంత బరువైనా మోయగలను కడవరకు ఈ గుండె బాధను మాత్రం మోయలేకున్నా క్షణమైనా.!! ఆడ కూతురినని జాలి లేదా నీవు మగవాడివే కావునా పక్షపాతం చూపుతున్నావు నీకిది న్యాయమా రక్షకుడే భక్షకుడవడం ఇదెక్కడి విడ్డూరమే ఓరోరి దేవుడా ఎందుకింత కక్ష కట్టినావురా నా పైనా ఇంత పెద్ద రాక్షసుడితో ముడివేసినావెందుకు అంత పాపం నేనేమి చేసానురా జాలికూడా లేదా నీకు రాయివేమో నీవు మౌనంగా ఉన్నావంటే మనసు కూడా లేదని అర్ధం!! పల్లవి:- ******* విధిరాతంటు విలపించనా చితి చేరువరకు!! చరణం:- ********** పుట్టింటా మొదలైన కథ మెట్టింటా కొనసాగుతుంటే కన్నీటి ధార ఆకాశగంగలా నేలింకితే పుడమి కడుపు దాహం తీరుతుందా కలిమి చెలిమి చెంగు చెంగునా దూకుతుందా!! ఏమిటో ఈ వింత విన్యాసం ఎందుకో ఈ రోత జీవితం లక్షణాలన్ని కుళ్ళి కంపుకొడుతుంటే క్షణమైన బ్రతకాలనిపించని పయనం విరమించడమే మంచిదంటోంది అలసిన నా హృదయం!! పల్లవి:- ******* విధిరాత అంటు విలపించనా చితి చేరువరకు!! చరణం:- ****** తోడు ఎంత కఠినమో నీడై భయపెడుతుంటే పంచభూతాలు వంచనకు వంత పాడుతుంటే చూడు చూడు చూడు రాక్షసత్వం పడగవిప్పుతోంది పశుత్వం విశ్వరూపమై వీది కెక్కి విలయమై ప్రళయంగా విరుచుకు పడుతుంటే ఏంచేయను ఎందుకింక జీవించడం విరక్తి అణువణువునా పాకుతోంది పాడు జీవితం పువ్వుగా పూసానే కాని ఆ దేవుని పాదమే చేరకుండా రాలిపొమ్మని విధి రాత రాసాడు ఇలా కుళ్ళి కుళ్ళి ఏడవమని నుదుటి గీత గా గీసాడు..!! ఓరోరి దేవుడా ఎందుకింత కక్ష కట్టినావురా ఇంత రాక్షసత్వంతో నాకు ముడివేసినావురా!! పల్లవి:- ****** విధి రాతంటు విలపించనా చితి చేరు వరకు ఏ దారి లేదంటు గోదారి చూసుకోనా!! *********************************************





నేటి నా పాట పాట సంఖ్య:-556.
********** రచన:-మహేష్ వూటుకూరి ✍️ 9640713717. దోర్నాల. ప్రకాశం జిల్లా. 23/02/2023. ****** పాట సందర్భంపై నా విశ్లేషణ. ********* పల్లెటూరు లో పడుచు ప్రేమికుల మద్య సరస సల్లాపాల ఊహలు ఉయ్యాల లూగు వేళ మనసుతోటలో మల్లెలు పూసి వయసు గీతం పాడుతు సరదాగా రెచ్చగొట్టిన కన్నెదోర ఓర సూపుకు కాయ కష్ట పుష్టి కండ పొగరు మీసం మెలివేసి సీసంలా కాలిపోతు ముద్దుకావాలంటు సీకటినే సంక నెట్టు కొచ్చి సరసానికి సై అంటు పోతురాజులా కాలుదువ్వుతు కన్నె పరువంపై సమ్మ సమ్మగా కమ్మదనం మాటలతో పాట అందుకొని పసందుగా ఆడుతు పాడుతున్న పాట. *************** పల్లవి:- ఓ సిన్నదాన సన్నాసన్నని నడుము ఒయ్యారంగా తిప్పుతున్న ఓ సిన్నదాన నిను సూడంగానే నిను సూడంగానే సిమ్మ సీకటి సుట్టు సేరెనే చుమ్మ కావాలని కోరిక నా గుండెల్లో దురెనే. గట్టు తెగినా ఏరులా నువ్వురుకుతుంటే పిట పిటలా నీ పరువం ఊరిస్తుంటే ఎట్టాగా ఊరుకుండగలనే ఉట్టేసిసెబుతున్నానే నిన్నే మనువాడుతానే నీ మానాన్ని ముద్దాడనీయవే నా మందారపూవంటి అందాల సుందరి ఓ సిన్నదాన ఓహో సిన్నదానా సన్నాసన్నని నడుము ఒయ్యారంగా తిప్పుతున్న సిన్నదానా చరణం:- *** వందేళ్ళు నీ తోటి కాపురమే సెయ్యాలే వందల మంది పిల్లలనే కందామే నీవు ఒప్పుకుంటే ఇక్కడే ఇప్పుడే అందుకు శ్రీకారం చుట్టేద్దాం కాపురం పెట్టేద్దామే !!! పందెం కోడిలా కాలుదువ్వుతున్నానే సై సై అంటు నీపై దూకేస్తానే సరసంలో స్వర్గమే సూసేద్దామే రావే రావే రసగుల్లా నా రవ్వల రసగుల్లా పల్లవి:- **** ఓ సిన్నోడా ఓహో సిన్నోడా ఊరికే మొనగాడా ఉట్టికొట్టగల దిట్టగలోడివి నీవేరా చరణం:- *** ఆగరా ఆగరా వీరా వీరా డేగా కన్నుల డేగా కన్నుల వాడి వేడి గురి కలవోడా ఈ ఒడి నీదేరా నీ చేతిలో నీ ఓడుతానురా ఒట్టేసి సెబుతున్నా మాట ఇస్తున్నా మంచి ముహుర్తం వచ్చేవరకు ఆగరా తెల్లసీర మల్లెపూలతో మత్తెక్కించేలా వస్తానురా అంత వరకు ఒద్దురా మగాడా నన్ను మనువాడే మొగుడా!! నీవు ఊ అన్నాకా నే ఓ అంటానే నీ మాట నా మాటే నువ్వు గీసిన గీత జవదాటా నీవెట్టా చెబితే అట్టా చేస్తానే మంచి రోజు వస్తానే ఈ రోజా పువ్వును ముద్దులతో ముంచేస్తానే !!! పల్లవి:- ****
ఓ సిన్నదాన సన్నాసన్నని నడుము తిప్పుతున్న వయ్యారి నా సిన్నదానా!! ************
ఈశ్వర తత్వం
ఒకణ్ణే రమ్మనము, రమ్మనీ పొమ్మనము
పొమ్మనుట కాదన సందేహ మె ఈశ్వరా
ఒక్కణ్ణే పిలిస్తే, పిలస్తె ఇద్దరొస్తె
ఇద్దరూ వద్దంటే రారుగా ఈశ్వరా
ఇద్దరూ వస్తేను, వస్తె సంసారమను
సంసార పరమ లక్ష్యమే గా ఈశ్వరా
సంసారంలొ నేను, నేను పరమ పదమును
పదము దేహాత్మభావంతోనె ఈశ్వరా
వెలుపల నె జీవున్ని, జీవిలో దైవాన్ని
దైవంగా ముక్తి ప్రయత్నమే ఈశ్వరా
తాను తనువు రెండూ, రెండు మనుగడండూ
మనుగడ ఆనందంగానే ను ఈశ్వరా
వెలుపల సంసారిని, సంసార స్వామిని
స్వామి గా మనిషికి ఋషిగానె ఈశ్వరా
ఒకరికొకరు గాను లె, గాను ఒక్కరౌను లె
ఒక్కరై ఒదిగి పోవుట యేలె ఈశ్వరా
మంచిని పెంచాలీ, పెంచి మనసివ్వాలి
మనసిచ్చి మమతను పెంచానులె ఈశ్వరా
రక్తం ఎర్ర కణమె, కణమె తల్లని కణమె
కణాలు రెండు మిలితం వృద్ధి కె ఈశ్వరా
ప్రకృతి లో ధర్మమే, ధర్మము అధర్మమే
ఆధర్మాలు రెండు జీవితం ఈశ్వరా
ద్విపద
తహతహ తాపంబు తనువుళ్ళ తెరలు
సహనమ్ము కలయిక చన్నీళ్ల సెగలు
సంక్రాంతి సంబరం నెగళ్ల హొయలు
సుకృతిగా సుమధురం అలకళ్ళ మొలలు... తహ తహ
అమరెగదెను నేఁడు కళ్ళ సొబగులు
సమరతి చిన్నలు సతికళ్ళ చినుకు
చెలపల చెమటల చెక్కిళ్ళ కళలు
మొలకల నవ్వులు మొక్కిళ్ళ పలుకు..... తహతహ
సొలపుల వేడుక చొక్కిళ్ళ పొదలు
తొలఁగని యాసలు తొక్కిళ్ళ థలుకు
నెఱవగు చూపులు నిక్కిళ్ళ శిలలు
మెఱసెను తమకము మిక్కిళ్ళ ములుకు... తహతహ
గుఱుతునధరము గుక్కిళ్ళ వలలు
తఱచుగు వలపులు దక్కిళ్ళ చురుకు
నునుగోరి కొనలుగా నొక్కిళ్ళ తులలు
పొనుఁగని తములము పుక్కిళ్ళ కులుకు.... తహతహ
ఘనుఁలగు సతిపతి ఘనతళ్ళ లయలు
యెనసెను పంతము లెక్కిళ్ళ ఉలుకు
కనుసైగు కదలిక కులుకుళ్ళు కలలు
వినిపించు శబ్దమై వేవిళ్ళ వలకు......... తహతహ
అనిపించు ఆశయ అత్తిళ్ళఅలలు
చనువాయె ఆరాట చెక్కిళ్ళ బెరుకు
సమయాన బందించు సంకెళ్ళ చెరలు
మోమున మోహపు ముద్దుళ్ళ చెరకు.... తహ తహ
ఆమని హద్దుల్లొ రాత్రుళ్ళు గెలలు
కాముని పద్దుల్లొ కౌగిళ్ళు గరకు
పండుగ తెచ్చింది పందిర్ల జలలు
మెండుగా ఉన్నారు అల్లుళ్ల కెలకు..... తహతహ
తోడుగా నున్నారు కూతుర్ల తలలు
మొండిగా కదిలారు మోకాళ్ళ వణుకు
తరతరాలుకలసి తిరుణాళ్ళ సిరులు
విరజాజి మెరుపులా వెన్నెళ్ళ సరుకు
తరుణాన తకధిమ పంతుళ్లు విలలు
ఆరుణో దయ వెలుగు ఆస్తుళ్ల ములుకు.. తహ తహ
సంక్రమణలసాక్షి సెలయేళ్ల పవలు
ఆక్రమణల సృష్టి వెళయాల్ల అరకు
కారుణ్య కథలతో కమణీయ కలలు
సారూప్య సహకార సరిగమ లతలు
చక్రమై తిరిగేను చానాళ్ళు మరులు
సంక్రాంతి మురిసేను తారళ్ళు థలుకు... తహతహ
No photo description available.
Buchi Raju, Madhavi Reddy and 2 others

నేటి పాట రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

 

 ప్రేమ దాసుడు కాని వారు ఎవరు లేరనేందుకు, నిదర్శనం గా ఓ గొప్ప గాయని  ఓ అభిమాని ప్రేమలో పడి  ఎదుర్కొన్న సంఘటన లు నిరోధించడానికి ప్రయత్నించి  రక్త సంబంధాలను దాటుకొని  చేసిన ఒంటరిపోరాటంలో అభిమానిని చేరుకునే శుభ సమయంలో ప్రేక్షకుల మద్యన  పెద్ద ఆడిటోరియం,  వేదికగా ప్రేమ పరీక్షలో నెగ్గి   నింగి నేల కలవవు కాని

 ప్రేమ  దేనినై చేయగలదనేది ఋజువు చేసిన ప్రేమ సంగమ సందేశం..

*****

పల్లవి:-

****

ఉదయ రాగాలలో ఉజ్వల లీల 

సాధన ప్రేమలో సంగీత  గోల --2

చల్లని నీడలో చెలికౌగిలి లీల   

మెల్లని చూపుల మదిలోన హేల -- 2  

 చరణం   

 నీ చిరునవ్వుల అనుబంధం గా 

మల్లెపువ్వుల సుమగందమై హృదిని చేరగా -- 2  


పలుకరించిన ఈ శుభ సమయముగా 

హృదయం ఉప్పొంగిన ఈ క్షణంగా --- 


పల్లవి నీవై పెదవి తాకగా  

పిల్లన గ్రోవి నేనై స్వర గీతమై పాడగా  

స్వరార్చనలు  చేయగా


సంకీర్తనల సంగమంలో సుకీర్తననమై 

సంగీతాభిషేకమై తన్మయమై 

 జన్మంతకు సరిపడ ప్రేమమై  

అభినందన వెల్లువలో జీవమై ..

పల్లవి:-

***

ఉదయ రాగాలలో ఉజ్వల లీల 

సాధన ప్రేమలో సంగీత  గోల 

చల్లని నీడలో చెలికౌగిలి లీల   

మెల్లని చూపుల మదిలోన  హేల 


చరణం:-

****

అణువణువు సరిగమలు గా   

తనువంతా పదనిసలుగా


 తపనలుగా తపస్సునే చేయగా

 వరముగా నీవే రాగా 

 ఉత్తంగ తరంగమై 

అంబరమంత ఎగసేనుగా


ఈ ఆనంద క్షణాలను అంకితమై    

నిఘంటువులా ప్రేమమై 

గుడిగంటలై శబ్దమై  

నా గుండెలయల కాలమై  

దేవుడి హారతులతో స్వాగతమై  

ఆశీస్సులతో బంధమై  

దీవించరారా  నీ ప్రాణమై 

  

పల్లవి:-  

ఉదయ రాగాలలో ఉజ్వల లీల 

సాధన ప్రేమలో సంతస గోల 

చల్లని నీడలో చెలికౌగిలి లీల   

మెల్లని చూపుల మదిలోన హేల  


****


నేటి నాపాట - 24-07-2022 


కాలమాయ ఇదిలా, కళలు తీర్చే రోజులే 

కాలయాపన దేనికో, నీవే నన్నేలుకో 


కాల మాయ కాదులే, కళలు తీర్చే రోజులే 

పాలు త్రాగి మేలుకో, నీవే నన్నేలుకో     


మానంపై మచ్చవేసి, మౌనంగా నన్ను మార్చేసి, మనసంతా 

కుతంత్రాల  కుట్రతో మాయ చేసి, కన్నీటి కదగా ముంచేసి 

వేదన నే వంటికి చుట్టేసి, రోగమని ముద్రవేసి, చెరసాలలాగా చెరపట్టినావు. 


నీవేం తక్కువా నిరాశనే నీడగా మార్చేసి, కళలు తీర్చు అంటూ   వెంటాడి వేధించి, తనువే తపింప చేసి, శ్వాసే అందించక కౌగిలిలో నలిపేసి, నువ్వు నేను ఒకటేనని ముగ్గులో దింపేసి     

వేదన నే వంటికి చుట్టేసి, రోగమని ముద్రవేసి, చెరసాలలాగా చెరపట్టినావు. 



చెప్పలేని బాధ చేరువైనది, గుండెను చేరి గుబులు పెడుతుంది, నీ రూపు నన్ను నిదుర పో నీయనంటుంది 


చెప్పలేని బాధ చేరువైనది, గుండెను చేరి గుబులు పెడుతుంది, నీ ఛాతీ  నన్ను నిదుర పోనీయనంటుంది 

   

కంటీ నీరునే తుడిచే చేయాలని ఆశ గావుంది, కాల జూదాన్ని ఎదుర్కోవాలని వుంది, దిక్కు తోచని భయాన్ని తొలగించాలని వుంది, ఈశ్వర నిర్ణయం ఇదేనని కలసి బ్రతకాలని వుంది  

 

ఒంటరి పోరాటం ఇక ఆపాలని వుంది,  కరుణించే వాడ్ని నమ్మాలని వుంది, కాల మేదైనా న్యాయమే నాకు దిక్కని పిస్తుంది, ఇది దైవ నిర్ణయం అని భావించాలని వుంది 


కాలమాయ ఇదిలా, కళలు తీర్చే రోజులే 

కాలయాపన దేనికో, నీవే నన్నేలుకో 


కాల మాయ కాదులే, కళలు తీర్చే రోజులే 

పాలు త్రాగి మేలుకో, నీవే నన్నేలుకో     

      


🌹నేటి నాపాట🌹 పాట సంఖ్య 339🌹

************

రచన:- మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

21/07/2022.

********

 పాట సందర్భంపై విశ్లేషణ.

********

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటు

ఒక  మరదలు పై ఆశపడ్డ ఓ బావ ఉదంతం 

మానవత్వం మరచి కామ రచనకు  ఉసిగొల్నిన

మనిషి చేసిన అమానుష ఆటలో పావుగా మారిన యువతి ఆవేదన ఈ పాట. ఎవరికి చెప్పుకోలేక

 ఎలా బయట పడాలో తెలియక  పడే ఆవేదనలో

 దేవుడే దిక్కుగా  కాలం మార్చేసి  వేడుకోలులో

 కన్నీటితో దేవుడిని రక్షించమంటు జాలిగా అడుగుతు

 సాగుతున్ర పాట..

****************

పల్లవి:-

***

చెప్పలేని భాధ గుండెలోన చేరి

మంట పెడుతుంటే ఎలా కుదురుగా వుండను

ఎలా నిదుర పోను..


భారమైన ఆడుగు  బరువును మోయలేనంటు

దిగులుగా నిలుచుంటే   ఎలా భరించను

ఎలా గమ్యం చేరను.


పాపం చేయకున్నా శాపం తగిలిన నిర్భాగ్యురాలినంటుంటే 

నేరం చేయకున్నా శిక్షపడాలి  అర్భకురాలికంటుంటే

తీరం చేరినా తుఫానుకు విలవిలాడుతున్నా 

పూ పొదనైనా..


చెప్పలేని భాధ గుండెల్లోన చేరి

మంటపెడుతుంటే  కుదురుగా ఎలా వుండను

ఎలా నిదుర పోను.

చరణం:-1

*****

మానంపై మచ్చవేసి మౌనంగా నన్ను మార్చేసి

కుతంత్రాల  కుట్రతో భాగమే చేసి

వేదన నే వంటికి చుట్టేసి   కన్నీటి కదగా చేసేసినావు

చెరసాలలాగా చెరపట్టినావు.


నిరాశనే నీడగా వెంటాడుతుఃటే

శ్వాసే ఆగిపోతే బాగుండేలా తలచేలా

తనువే వదిలి వెళ్ళిపోవాలనీ పించేంతగా 

వ్యధ రచనలో సమిధనే అయ్యాను.

 

చెప్పలేని బాధ గుండెలోన చేరి

మంటపెడుతుంటే కుదురుగా వుండలేక నిదురే రాక

 చరణం:-2

****

మాటు వేసి వల పన్ని తల తీయలనీ చూస్తే

ఇంటి దొంగనే ఈశ్వరుడైనా పట్టుకోగలడా

కంటీ నీరునే తుడిచే చేయి అందుకోగలదా

కాలం జూదం ఆడకే  న్యాయం నాకు జరిగేలా చూడవే


జరిగేకొద్ది దిక్కుతోచక భయం గుప్పిట బ్రతుకుతున్నా

సాయానికి తోడే లేక ఒంటరి పోరాటం చేస్తున్నాడు

కరుణించరా ఓ దేవుడా కాపాడే మార్గం చూపి

న్యాయానికి న్యాయం చేయుమా


నిజం నిరూపణకు  నీ చేయూత కావాలిలే

చీకటిని తొలగించే వెలుగుకై వేచి చూస్తున్నా

రేపటితో కలత కన్నీరు తొలగే లా జరిగేలా చూడరా...

 పల్లవి:-

****

చెప్పలేని బాధ గుండెలోన చేరి

మంట పెడుతుంటే కుదురుగా ఎలా వుండను

నిదుర ఎలా పోగలను...

**************


🌹నేటి నా పాట🌹 పాట సంఖ్య:-341🌹

*************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

22/07/2022.

*****

పాట సందర్భంపై నా విశ్లేషణ.

****-*****

ఎదురుచూపుల నిరీక్షణలో విరహ మనసు పాడే

 విరహగీతం అతని రాకతో  రస హృదయ పరవశ పరవళ్ళ ప్రవాహమై  సాగిన వైనం ఈ పాట.

**************

పల్లవి:-

:***

నీకై నేను ఇలా ఎదురు చూస్తు  వుండగా

తొలకరికై  ప్రకృతి ఆకాశంకై  ఆశగా 

ఎదురు చూస్తున్నంతగా వుంది నాకు..


నీకై నేను అనుక్షణం ఆలోచిస్తు వుండగా

నా కోసమే నీవు పుట్టావని పిస్తోందిలే ప్రియతమా

ఇన్నాళ్లు ఎలా వున్నానో కాని

ఇపుడేమో ఒక్క క్షణమైనా వుండలేకున్నా తెలుసా


నీకై నేను ఇలా చూస్తూవుండగా

తొలకరికై ప్రకృతి ఆకాశంకై ఆశగా 

ఎదురు చూస్తున్నంతగా వుంది నాకు...

చరణం:-

***

గాలి కూడా ఆగి ఎందుకిలా ఎవరికోసం ఎదురు చూపులంటుంటే

సిగ్గును నేనై  మొగ్గలా ముడుచుకున్నా

 నీ పేరు  పెదవి దాటకా 

మల్లెపువ్వు ఆశగా  మెల్లగా గిల్లుతోంది 

ఇంకెంతసేపు నీ రాకని

చల్లని వెన్నెల కన్నార్పకుండా చూస్తోంది నాకై నీవు చూసినట్లుగా..


ఎందుకిలా చేస్తున్నావు నన్నెందుకిలా

ఆశపెట్టి కవ్విస్తున్నావు చెప్పుమా

ముందుకే పోకుండా ఆగిపొమ్మని కాలాన్ని వేడుకున్నా

పొందుకై  పెదవి ఆరాటపడుతు విందుకై సిద్దమై

కనువిందుగా  చేస్తున్నది చూడుమా

పల్లవి:-

**

నీకై నేను ఇలా ఎదురు చూస్తువుండగా

తొలకరికై ప్రకృతి  ఆకాశం కై ఆశగా

ఎదురు చూస్తున్నంతగా వుంది నాకూ..

 చరణం:-2

*****

 చీకటంతా నీ రాకతో వెలుగులై పూయగా

 రాతిరంతా   పండువెన్నెలే పిండార బోయగా

మనసు మమత  సరసం మధురం కలబోతగా

లయమై వశమై తపనై తపమై  తరించెనే ఒకటై నీ జతలో


 గతమంతా మరిచేలా మనసంతా మురిసేలా

 ఈ కౌగిలి లో ఎంతా ఆనందం ఇచ్చావో 

నా అణువణువు  చెబుతోందిలే  వయ్యారాల వలపు

 తీస్తున్న రాగమే  చెబుతోందిలే పరవశాల పులకింతలో

 పల్లవి:-

***

 నీకై నేను ఇలా ఎదురు చూస్తుండగా

 తొలకరికై ప్రకృతి ఆకాశంకై 

 ఆశగా ఎదురు చూస్తున్నంతగా వుంది నాలో..

***************


నేటి నా మనసు పాట --23-07-2022


చరణం:-

***

చల్లని గాలి సోకగా "హృదయ తపనలు దేనికో"  

ఎదురుచూపు ఎగతాళి అనుట మానుకో ఓ గాలి 

సిగ్గు మొగ్గ నన్ను తట్టి లేపుట దేనికో ఓ చిరుగాలి 

మల్లెపువ్వుల వాసన మెల్లగా తాకి వేదింపు మానుకోవాలి   

ఇంకెంతసేపు నీ రాకని కన్నార్పకుండా చూడాలి  --


"ఎందుకిలా చేస్తున్నావు " నన్నెందుకిలా చేస్తున్నావు

 చెప్పుమా ఆశతో మైమరిపించే గాలి 

పొందుకై  పెదవి ఆరాటపడుతు విందుకై సిద్దమై

వలపు పిలుపుల కలయిక మధ్య నీవెందుకే గాలి 

కాలము ఆగిపోతే ఎంతబాగుంటుందో ఓ గాలి 

 చిరుగాలి మత్తెకించే గాలి మైమరిపించే గాలి మనసుకు నచ్చే  గాలి ఈ మగువ మెచ్చే  గాలి  

పల్లవి:-

**

గాలి కదలికకు ఎదురు చూస్తువుండగా 

తొలకరికై ప్రకృతి వై నాన్నవహించినట్లు గా   

ఎదురు చూస్తున్నంతగా వుంది నాకూ..

 చరణం:-2

*****

చీకటంతా నిశ్శబ్ద వెలుగుకై ఎదురుచూడగా 

 పండు వెన్నెలే కలవరింత తో పిండార బోయగా

మనసు విమలం సరసం మధురం కలబోతగా

లయమై వశమై తపనై తపమై తరించెనే నీ జతలో ఓ చిరుగాలి  


 గతమంతా మరిచేలా మనసంతా మురిసేలా

 ఈ కౌగిలి లో ఎంతా ఆనందం ఇచ్చావో గాలి 

నా అణువణువు  చెబుతోందిలే  వయ్యారాల ఓ గాలి    

రాగమే  చెబుతోందిలే పరవశాల పులకింతలో చల్లని గాలి

ఓ గాలి 

 చిరుగాలి మత్తెకించే గాలి మైమరిపించే గాలి మనసుకు నచ్చే  గాలి ఈ మగువ మెచ్చే  గాలి  

 పల్లవి:-

***

గాలి కదలికకు ఎదురు చూస్తువుండగా 

తొలకరికై ప్రకృతి వై నాన్నవహించినట్లు గా   

ఎదురు చూస్తున్నంతగా వుంది నాకూ..

***************


【 🌹 నేటి నా పాట  నా పాట సంఖ్య331🌹】

*****************************************

రచన:-మహేష్ వూటుకూరి ,✍️

9640713717.

దోర్నాల.

12/07/2022.

****************

 పాట సందర్భంపై నా విశ్లేషణ:-

****************************

ఈ విశ్వంలో ప్రేమను మించింది లేదంటు

 ప్రేమతో   ప్రకృతి ఇష్టంగా ఒక ఆకృతిగా మారితే

అది  నీలా రూపుదిద్దుకున్న దంటు తన ప్రేయసిని  వర్ణిస్తు తన వర్ణనలతో తన్మయమైన ప్రేయసి  కి  

 సాటి రారు ఎవరంటు తన ప్రేమను ప్రేమాక్షరాలలో 

లిఖిస్తు పాడిన ఈ పాట...

*******************************************

పల్లవి:-

*********

మల్లెపువ్వు మరోజన్మ కావాలంటు

 నీలా పుట్టిందంటనే కల్ప వృక్షమా

 తెల్ల చీర నిన్నె చుట్టు కోవాలంటు

 తెగ ఆరాటపడిందంటనే  ఓ పారిజాత పుష్పమా


 జాతిపచ్చ  జగడమే వేసుకోని పారిపోయి వచ్చి

 నీ మెడలో సింగారమై కొలువు దీరిందంటనే

 నా కావ్యాంజలి..


మల్లెపువ్వు మరో జన్మంటు కావాలంటు

 నీలా పుట్టిందంటనే కల్ప వృక్షమా

 చరణం:-

**********

ఏమి అందమే నీది సిరి చందనమే నీ మేను

ఏమి రూపమే నీవు  అపు రూపమే నీ అందం.

ఋతువులన్ని మెచ్చి బహుమతులు ఇచ్చెనంటకదా

 దిక్కులన్ని నీ ముందు వాలి స్వాగతాలే పలికే నంట కదా


ఏమి అణుకువే నీ మోము హంసలా దీవిలా ఎంత ప్రశాంతంగున్నదో

ఏమి నడకనే నీదీ మయూరాలే  నేర్పమంటు

నీ ఇంటి ముందు తిష్టనే వేసినాయంటకదా

ఎన్నెన్నో గొప్పతనాలు నీ సొంతం కాగా

 అన్ని గొప్పతనాల  నీ సౌందర్యం

 నన్నే ప్రేమించమని వెంటపడడం వింతెకదా..

నా అదృష్టమే కదా...

పల్లవి:-

*******

మల్లెపువ్వు  మరోజన్మ కావాలంటు

 నీలా పుట్టిందంటనే కల్ప వృక్షమా...


 చరణం:-

 జాజీ కొమ్మే  రాజీకొచ్చే నీవు అలిగావని

రోజా పువ్వే నీదే నే  అందమంటు తాజాగా తీర్పే చెప్పి

 అందాల పూలకిరీటమే పెట్టి మిస్  వరల్డ్ గా కీర్తించెనే..

 పుత్తడి బొమ్మ  కు ప్రాణం పోస్తే నీవై నడిచొచ్చిందిలే


అణువణువు అనుకువల కువకువల రాగాలు

మెలుకువల నీ పలకరింపు ముత్యాల జల్లులే

అన్ని వేళలు నీకు ఆనుకూల ద్వారాలై

 స్వాగతాల గీతం స్వగతమై పాడగా..


 నా మనసు  ఇంద్రధనుస్సు గా మారి

 సప్త వర్ణాల మణులనే మాలగా నీ మెడలో వేసెనే

ఏడేడు జన్మల బంధమే శాశ్వతంగా నిలిచి పోయెనే

 నవ్వుల లోకమా పువ్వుల వనమా... నా ప్రేమా పారిజాతమా..

 పల్లవి:-

*********

మల్లె పువ్వు మరోజన్మ కావాలంటు

నీవై పుట్టిందంటా.....

**************************************

【🌹నేటి నా పాట🌹 పాట సంఖ్య:-330🌹】

***************

రచన:-మహేష్ వూటుకూరి ,,✍️.

9640713717.

దోర్నాల.

12/07/2022.

******

పాట సందర్భంపై నా విశ్లేషణ:-

***********

 ప్రేమ  పుట్టి ఎన్ని యుగాళలైందో కాని 

ఓ ప్రేమ జంటలో కొన్ని రోజులుగా ప్రేమ పుట్టి వారి మద్య 

చెప్పలేని ఆనందం పొంగుతుంటే పురివిప్పిన మయూరాలై  నర్తిస్తు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తు మైమరిచి పోతు పాడుతున్న పాట..

****************


పల్లవి:-

***

ప్రియతమా నీ పిలుపులే

నా హృదయమే చేరి

సరిగమలు పలికేను

నే సరసమై నీ ఒడిలో ఒదిగెనే..

   

ప్రియతమా నీ వలపులే

నా తనువునే  తాకి

ముత్యాల జల్లులే కురిపించగా

నే హరివిల్లునై  వికశించానే


చూసినా చూపులు మన్మథ బాణాలై

మేని అంద మంతా తాకేను

కురిసిన పువ్వులే అందుకు సాక్ష్యాలు..


 ప్రియతమా నీ పిలుపులే

 నా హృదయం చేరి

సరిగమలు పలికేను..

చరణం :-1

****

 చీకటంతా చేరువై

 రాతిరంతా జాతరై

కులుకులే  తలుపులు తీసి

స్వాగతమంటుంటే


వయసు తోటలో

మనసు  పాట పాడిందిలా

సొగసు  గీతమై  ప్రణయ కావ్యం

 రచించేను ఈ శుభ సమయం..

 పల్లవి:-

***

 ప్రియతమా నీ పిలుపులే

 నా హృదయం చేరి

 సరిగమలు పలికేను...

 చరణం :-2

***** 

 వెన్నెల పరిచిన వన్నెకాడు

 కన్నుగూటుతుంటే

మురిసినా ముద్దబంతి

ముసిముసి నవ్వుల హరివిల్లుగా మారేను.


సిరిమల్లెలే విరిజల్లులై కురువగా

మగసిరి గడసరి కౌగిళింతల చేరి

సరసాల సాంగత్యం లో తలమునకలై

 తరించెనే ఈ జన్మ...

పల్లవి:-

****

 ప్రియతమా నీ పిలుపులే

 నా హృదయం చేరి

 సరిగమలు పలికేను

నే సరసమై నీ ఒడిలో ఒదిగేను..

**********

చిగురు టాకుల మధ్య నున్నావులే 

ఆకులతో పువ్వుగా వెలిగిపోతున్నావు లే  

ఉండి ఉండనట్లుగా కదులుతున్నావు లే  

వానొచ్చినా ఎండొచ్చినా భయములేకున్నావులే  

 

ముత్యాల జల్లుకు గలగలా  

నినుచూడగా నాహృదయం విలవిలా 

ఉయ్యాలలు లూలుగుతున్నవేళ 

ఉలుకూ పలుకు నీ నుండి  రాదేలా


చుసిన చూపులు మన్మధ భాణాలై 

తాకీతాక నటులుగా నను చేరే ముద్దులై 

నీవు చేసే చిలిపి చేష్టలు గిలిగింతలై 

నయనాల చూపులు నాలో వింతలై 

 

కులుకులే  తలుపులు తీసి పిలుపులై 

మెరుపులై కలలు తీర్చు మది దోచే కళలై  

ఉరుములై హృదయాన్ని తట్టే శబ్దాలై 

సిరిమల్లెలై విరజాజులై గులాబీ గుబాళింపులై 


🌹 నేటి నా పాట 🌹నా పాట సంఖ్య329🌹】

*****************************************

రచన:-మహేష్ వూటుకూరి✍️

9640723717.

దోర్నాల.

11/07/2022.

**************

 పాట సందర్భంపై నా విశ్లేషణ:-

***************************

 అందం కావచ్చు అందమైన మనసు కావచ్చు

 ఒకోసారి మనసుకు ఈమే తనకోసం పుట్టిందా అనిపించే అంతగా ఇష్టం ఏర్పడి  ఆమె ప్రేమ పొందే వరకు 

 ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎందరినో ఎదిరించి మెప్పించి నీ ప్రేమ తప్ప నాకు ఇంకేమి వద్దు అన్నంతగా 

 తపస్సు చేసినంతగా చేసి ఆమె ప్రేమను పొందిన ఓ ప్రేమికుడి  మనసు ఉప్పొంగి పాడీన పాట...

**********************************************

పల్లవి:-

********

నీ ప్రేమకై జనియించినానే

 నీ ప్రేమకై తపించినానే

 ఓ అందాల ఎల్లోరా శిల్పమా

ఓ అపురూప అజంతా శిల్పమా


 నీ పేరే ద్యానమై 

నీ స్మరణే అనుక్షణం నా మదికి ఆలాపన గీతమై

 పల్లవిస్తున్నాయి నా  స్వరం పరిమళ సుగంధమై..


నీ ప్రేమకై జనియించినానే

నీ ప్రేమకై తపించినానే

చరణం:-1

**********

 ఇన్నాళ్ళకు కరుణించావు ఎంతో ఇష్టంగా  

ఇది వరమనుకోనే నా అదృష్టం అనుకుంటా

 కోరిన సంపదా ఎదురుగ కొలువై వస్తే

అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది నాకు


 కోరిక తీరినవేళ కమ్మని ముద్దులతో

 పొద్దునే మరచిపోయి నీ పొందులో విందులై

అందుకున్న ఈ ఆనంద హేళ

 జన్మ జన్మలకు మరచిపోను నేను

నీ  వెంట నడిచేస్తా ఇక ప్రతిక్షణమూ 

నీ ప్రేమ దాసుడనై నేను....

 పల్లవి:-

*********

నీ ప్రేమకై జనియించినానే

 నీ ప్రేమకై తపించినానే..

 చరణం :-2

*********

 మరణం వచ్చినా శరణం అనైనా

 నీ చరణం వీడకుండా శాశ్వతంగా నీతోనే వుండిపోతానే

ఉదయం  రాగానే నీ ముందు వాలిపోతాను

నీవు నిదురించే దాక నీతోనే వుండి పోతాను..


మోహం అనుకో ప్రేమ అనుకో పిచ్చి అనుకో ఓ లోకమా

తను అంటే  పిచ్చి ప్రేమనే నాకు

 ఈ తనువు మనసు అణువణువు  ఇష్టంగా పూజిస్తున్నాయి.. ప్రేమిస్తున్నాయి ఆరాదిస్తున్నా ప్రాణంకన్నా ఎక్కువగా...

 పల్లవి:-

**********

 నీ ప్రేమకై జనియించినానే

 నీ ప్రేమకై తపీంచినానే  ఓ ప్రేమా నాప్రేమా 

 ఓ ప్రియతమా

 నా ప్రేమ హృదరమా పా ప్రాణమా....

*************************************

🌹 నేటి నాపాట🌹 పాట సంఖ్య:-294🌹

**************************************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

దోర్నాల.

 02/06/2022.

********************

 పాట సందర్భంపై నా విశ్లేషణ:-

****************************

  ఒకొక్క సారి మనల్ని మనమే నమ్మలేని వింతలా అనిపిస్తుంది కడుపేద వాడికి ఓ చిన్న సంఘటన

 ఓ పెద్దింటి అమ్మాయి ప్రేమ పొందే అదృష్టం అవకాశం

 వచ్చినపుడు ఆ పేద వాడు ప్రేమికుడను అయ్యాను

అనే ఆనందాను భూతిలో పొంగిన హృదయ స్పందన

ఈ పాట..

***********************************************

పల్లవి:-

*********

సంతోషమే నీ రూపమై నా ఒడి చేరెనే

 ఆకాశమే ఆశల పల్లకి పంపెనే

 నీవే నా దేవతని

 ఆనుకోని అతిథిలా కలిసి  నా అంతా నీవై నిలిచావే

అనుకున్నదే తడవుగా తొలకరిలా తడిమినావే  నా హృదయాన్నే..


 సంతోషం మే నీ రూపమై

 నా ఒడిని చేరినావే..

చరణం:-1

 ఆకాశగగనంలా దిగివచ్చినావే 

 నిరాశ వాద నా వదనం వికశింప చేశావే...

 కాలమెంతగా వేచివుండమన్నా

నిరీక్షణంతా క్షణమల్లే  అనిపిస్తుంది.


 సరిలేరు నీ అందానికి భువిలోన ఏ సుందరి

 గురిచూసి వేసిన బాణంలా  చక్కగా చేరినావే 

నా హృదయ  నివాసానికి

ఏరి కోరి నన్నే కోరి  నాలో చేరిన  నారి మణి

నిను పొందు భాగ్యమే నా దేలే  సిరి రమణి

పల్లవి:-

*******

 సంతోషమే నీ రూపమై

 నా ఒడిని చేరిన సౌంధర్యమా.

చరణం:-2

ఎవరులేని ఏకాంతంలో

 నీ ఒడినే నందనవనంగా చేసి

ఆనందాలనే అనుభూతులుగా పదిలం చేశావే

అందాల ఓ బృందావనమా...


 వచ్చినానని తెలిసి నడి రోడ్డు పైనా

 ముద్దాడి నీ ప్రేమ ఎంతో లోకానికి చాటినావే

 నా గుండెలోన గుడి కట్టుకొని అపురూపం గా

 చూసుకుంటానే ప్రియతమా  నా హృదయమా

 నా ప్రాణమా నా సర్వస్వమా...

 పల్లవి:-

*********

 సంతోషమే నీ రూపమై

 నా ఒడిని చేరినా సౌందర్యమా

ఆకాశమే అందాల పల్లకి పంపే 

నీవే నా దేవతవని బహుమతిగా...

**********************************

🌹నేటి నా పాట🌹 పాట సంఖ్య:-317🌹

*************************************

9640713717.

రచన:- మహేష్ వూటుకూరి ✍️

దోర్నాల.

28/06/2022.

*********************************

పాట సందర్భంపై నా విశ్లేషణ.

******************************

అదో  ఉమ్మడి కుటుంబం బంధాలు అనుబంధాల పెనవేతల బలమైన సంబంధాల కలబోతగా సాగేది 

 మాట పట్టింపు కొంచెం పెద్దరికానికి  ఆటంకమనిపించి మాటలు కరువై మౌనం రాజ్య మేలుతుంది..ఇందులో

ఓ ప్రేమకథకు  ఇది ఇబ్బందికరమైన సంఘటనగా మారి

చురుకైన హీరో చెదిరినట్లుగా మారిన ఉమ్మడి కుటుంబాన్ని కమ్మని పొంగలిగా తన మాటలతో

అందరిని దగ్గరకు చేస్తాడు. దూర దూరంగా వున్న పెద్ద లు పిల్లలు అందరు హాయిగా ఒకటై వీరి ప్రేమను అంగీకరించడమే కాకుండా తప్ప ఒప్పుల సమీక్షతో

సమూహం ఒకటి గా అవుతుంది.ఉమ్మడి కుటుంబం

బలమెంతో  అందరికీ తెలియ వచ్చి 

మరింత పటిష్టమైన స్థితికి తెచ్చిన ఈ ప్రేమ జంటకు

 పెళ్ళి చేసి   అంతా శుభమ్ పలుకుతారు .అన్ని సందర్భాలు అందరి మానసిక పరిస్థితులు కలగలిపి

 సాగిన పాట.

******************************************

పల్లవి:-

*******

ముద్దు ముద్దు నీ మాటలు ముద్దులే పెడుతుంటే

తొలి పొద్దు కూడా బాసిపాటు వేసుకోని కూచోంది.

పోను పోనంటు  తొలి పొద్దు కూడ  సిగ్గు మొగ్గలై పూసింది..


రాను రానంటూనే రాగాల కోయిల

కొమ్మల్లో దాగి  గమ్మత్తుగ పాడుతోంది.

పలుకే బంగారమైన పుత్తడి బొమ్మ

పడిపడి నవ్వుతోంది.


 ముద్దు ముద్దు నీ మాటలు ముద్దులే పెడుతుంటే

 తొలి పొద్దు కూడా బాసిపాటు వేసుకొని కూచుంది..

చరణం:-

********

కోడికూతలో లేచిన లేగదూడలా

వేడి తాకి  వికసించిన తామరలా 

తాజా చిరునవ్వుల పూలతలా

ఎంత హాయిగా నవ్వుతున్నావే...


నయాగర జలపాతమే

జలజల జగమంత ప్రవహించినంతగా

 గలగల గోదారి నా వూరిలోకి వచ్చి పలుకరించినంతగా

 ఇంత ఆనందమే నా వశమై పరవశింపగా.....

పల్లవి:-

*******

ముద్దు ముద్దు నీ మాటలు ముద్దులే పెడుతుంటే

తొలిపొద్దు కూడా బాసిపాటు వేసుకోని కూచింందిగా..

 చరణం:-

**********

నిండు పున్నమి కొండే దిగి రాగా

కొండ కోన ఉనికి మరచి ఉయ్యాల లూగగా

మండు వేసవి మల్లెలుగా మారి

పువ్వులతో నవ్వులు కలిపీ  గతమే మరచి స్వాగతమీయగా


ఆనందం ఆకాశం నించి దిగి వచ్చి

ఆశీస్సులే ఇవ్వగా

నమ్మిన నమ్మకమే నిజమై నిలిచి 

ఆత్మానందమై జన్మకు సరిపడ సిరులే కురవగా..


ఈ సంతృప్తి సమయం  చాలురా  నీ పంచన

కలిమి లేముల భోగభాగ్యాల కొలువై వున్నాయని

ఋజువైనాదిలే...

పల్లవి:-

*******

ముద్దు ముద్దు నీ మాటలు

 ముద్దులే పెడుతుంటే

తొలిపొద్దు కూడా ముచ్చటపడి

 బాసిపాటు వేసుకోని కూచుంది గా.

*****************************************

🌹 నేటి నాపాట🌹 పాట సంఖ్య:-310.🌹

**************************************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717

దోర్నాల.

20/06/2022.

*******-******

 పాట సందర్భంపై నా విశ్లేషణ.

**************************

 అందానికి మేధస్సుకు మద్య ప్రేమ చిగురించి

 పేదరికానికి ధనవంతురాలికి మద్య ఇష్టం

 చేయికలిపింది. అంతరం అగాధమంత వుందంటు

వద్దంటే  ఆత్మీయత కొండంత నీవద్ద వుంది

 అది నాకు కావాలంటు ప్రియురాలి వాదనా

 వివరణ ఇలా  అభిప్రాయాలు వెలిబుచ్చిన ఇద్దరు

 చివరకు ప్రేమకే మొగ్గి  ఒకటైన ప్రేమ పాట..

****************************************

పల్లవి:-

********

సుందరి సుకుమారి

 నీ దారి పూలదారి

నేనో ఎడారి 

నాపై నీ ప్రేమ గురి 

సరి కాదే నారి

ఆలోచించవే మరోసారి...


సుందరి సుకుమారి

నీ దారి పూలదారి..

 

చరణం:-

ఏమిలేని నేను

ఈడు కానే కాను

గోదారిలా నీవు

ఎండిన ఏటిలా నేను..


పోలికే లేని మనకు

పొత్తు కుదరదులే

ఓనమాలే రాని నేను

ఓంకారమే అయినా నీతో నా జీవితం

ఊహలో కూడా ఊహించలేదు సుమా.

 పల్లవి:-

********

సుందరి సుకుమారి

 నీ దారి పూలదారి.

చరణం:-

*********

 ఒద్దు ఒద్దు అంటు దూరంగా వెళ్ళకు

 బాహ్యమే నేను బాగు బాగు

 నీ అంతరంగంతో పోల్చుకుంటే నేను

 ఆవగింజంత కూడా నీకు

 సరి జోడిని కాను నేను...


గుణ శేఖరుడివి నీవు

గణనాధులెందరో నీకు

దన్నుగా వున్నా

కధానాయకుడవు నీవు

 నీ ఎదపై పవళించే భాగ్యం నా కివ్వు

 నీ చేయి అందుకుని నడిచేనేను

ధరిత్రి లోకెల్లా అదృష్టవంతురాలిని నేను..

 పల్లవి:-

********

సుందరి సుకుమారి

నీదారి పూలదారి

నేనో ఎడారి

నాపై నీ ప్రేమ గురి

సరి కాదే నారి

ఆలోచించవే ఓ సారి..

సుందరి సుకుమారి.

***********************

【🌹నేటి నా పాట 🌹 పాట సంఖ్య:-299🌹】

౮*****౮************౮*******౮**********౮

 మహేష్ వూటుకూరి ✍️

దోర్నాల.

10/06/2022.

*********************

పాట సందర్భంపై నా విశ్లేషణ:-

***************************

ఓ నవయువకుడి మనోగతం తృప్తిగా ఫీలై

 ఇలా ప్రశాంతత ను కోరుకుంటు హాయిగా

 హ్యాపీ గా  వుండటమే జీవితమనుకొని తను వుంటు తనలా అందరిని మోటివేట్ చేసి  సంతోషం  తృప్తి లో వుందంటు  ఇదే హ్యాపీ కి అర్థమంటు హ్యాపీ హ్యాపీ గా

 వుండటమే హ్యాబీ రా అంటు నవ చైతన్య కెరటమై  హ్యాపీని పంచుతు హ్యాపీ ని పెంచుతు  సాగిస్తున్న జీవన వేద సారం  ఈ పాట...

***************************************౮********

శీర్షిక:-   తృప్తి.

**************

పల్లవి:-

********

హ్యాపీ హ్యాపీ రా  

నేను ఎప్పుడు హ్యాపీరా

నేను  ఉన్న చోటెల్లా

హ్యాపీతో నింపడమే నాకు హ్యాబీరా


హ్యాపీ హ్యాపీరా

నేను ఎప్పుడు హ్యాపీరా

నేను ఉన్న చోటెల్లా

హ్యాపీ తో నింపడమే నాకు హ్యాబీరా...

చరణం:-1

***********

పువ్వులా వికశించుదాం

నవ్వులే పంచుదాం రాత్రి పగలు

 పిల్లలు  పెద్దలు అందరు నా వాళ్ళే

అందుకే నేనందుకే వున్నంతకాలం నవ్వులే


పవ్వులై పూయించుతా 

మీ మనసులో ఉత్సాహమే పెంచుతా 

హ్యాపీగా వుండటమే 

జీవితానికి అర్ధమని చాటుతా..


 హ్యాపీ హ్యాపీ హ్యాపీగా సాగుదాం

 హ్యాపీ హ్యాపీ హ్యాపీ నినాదమై ఊగుదాం.

 పల్లవి:-

********

హ్యాపీ హ్యాపీరా

నేను ఉన్న చోటెల్లా హ్యాపీరా..

 చరణం:-2

ఎంతకష్టమైనా నవ్వుతు సాగితే

కష్టమే మన నవ్వుల ముందు  తలవంచుకోదా

అవిటి తనమని దిగులు పడకు

మనోధైర్యంతో దివిటీవై వెలుగు 


 మనపై మనకూ నమ్మకమే

 సంతోషాల సంబరానికి పునాదిరా

 మనలో మనకు గల ఆత్మవిశ్వాసం

 సంతోషాల నిది రా


తెలుసుకుంటే  అదే హ్యాపి

ఉన్నదాంట్లో తృప్తి పడితే 

అదే అదే అదే 

హ్యాపీరా హ్యాపీ హ్యాపీ రా..

పల్లవి:-

******

హ్యాపీ హ్యాపీరా

నేను ఎప్పుడు హ్యాపీరా

నేనున్నా చోటెల్లా

 హ్యాపీలతో నింపడమే  నా హ్యాబీరా....

***********************************

【 🌹నేటి నా పాట.🌹  పాట సంఖ్య:-301🌹】

*******************************************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

12/06/2022.

***********************

పాట సందర్భంపై  నా విశ్లేషణ.

***************************

 కాలం విచిత్రమైనది ఎవరిని ఎవరితో కలుపుతుందో కాలమహిమ కాలానికే తెలియాలి.  అతి పేదరాలు పల్లెటూరు లో పుట్టి  ఏమి చదువుకోని ఒక అమ్మాయిని

 ఆమెలోని స్వచ్ఛమైన మంచితనం చూసి  ఆమెనే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొని పెళ్ళి చేసుకొన్న వేల కోట్లకు వారసుడి మద్య  మంచిని మంచి ప్రేరేపిస్తే

 మానవత్వం వికశించి పేదతనం అమాయకత్వం

 నిరక్షరాస్యతలు  తొలగి  ఉన్నతమై వెలుగొందిన సమయంలో ఆ యువతి మది భావం ఈ పాట.

*******************************************

పల్లవి:-

*********

నీ కళ్ళలోకి  నే చూస్తూనే వుంటే

ఒళ్ళంతలో తుళ్ళింతలే

నీ మాటలు నే  వింటూనే వుంటే

మదిలోన గుసగుసల సరసాలే


చూడొద్దని హృదిలోని భావం

 చూసేయ్యని మదిలోన నీ ద్యానం

ఏంచెయ్యను  మది వైపు ఓటేసి

నీ ఊహలను వాటేసి.. 

సిగ్గులను పూయించి

 మొగ్గల్లె వికసించి  ఒగ్గినా నీ మనసెరిగి..


 నీ కళ్ళలోకి నే చూస్తూనే వుంటే

 ఒళ్ళంతలో తుళ్ళింతలే...

 చరణం:-

*********

 కారడవిలాంటి జీవితంలోకి

 జాబిల్లివై తొంగిచూశావు

 మోడులా వాడిన  రోజును

 మారాకు వేయించి రోజాలు పూయించి

 మహారాణిగా నీ మహారాణిగా చేసుకున్నావు...


మదిలోతుల్లోకి చూసి నదిలా పారించి

 చదువులమ్మ  చెంతలో సందిగ్ధలన్ని తీర్చి

 చుక్కలామార్చి  చక్కని బ్రతుకు బాటను పేర్చి

  పక్కనే నీ పక్కనే పవళించు భాగ్యమే కలిగించావు

 నన్ను కరిగించి మేలిమి గా మార్చావు..

 పల్లవి:-

********

 నీ కళ్ళలోకి  నే చూస్తూనే  వుంటే

 ఒళ్ళంతలో తుళ్ళింతలే...


 చరణం:-2

***********

మరచిపోలేని మధురాలు పంచి

అధరాలపై  అమృతాలు  తడిపి

మృదువైన బిగువులో   

ముద్దుల వర్షమే కురిపించి


 హద్దుల పొద్దులో  సూర్యుడై వెలిగి

 చిగురాకుపై నీ చిత్తం  లిఖించి

సౌఖ్యానికి స్వాగతం పలికావు

సౌభాగ్యనికి సంతోషాలు పంచావు...

 పల్లవి:-

*********

నీ కళ్ళలోకి నే చూస్తూపే వుంటే

 ఒళ్ళంతలో తుళ్ళింతలే

 నీ మాటలు నే వింటూనే వుంటే

మదిలోన గుసగుసల సరసాలే.

*****************************

*******************************************

【🌹నేటి నా పాట🌹 పాట సంఖ్య :-303🌹】

*******************************************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

***************************

9640713717.

దోర్నాల

14/06/2022.

************** 

పాట సందర్భంపై నా విశ్లేషణ:-

****************************

 వయసు అనుభవాలే   గొప్పవాడిగానో త్యాగధనుడిగానో  చేయగలవనుకోకూడదనేది

విధంగా ఆనాడు  బుద్ధుని  జననం జరిగినట్లు

 ఈనాడు ఈ మనిషి  మహా మనిషి గా సమాజంలో చిన్న

పెద్ద  ధనిక పేద  అసమానతలు పట్టక అంతా ఒకటే అనీ భావిస్తు ఏమి ఆశించని ఋషి లా అందరి బాగును కోరుతు సాగుతు మేలు చేసుకుంటు పోతుంటే

మేలు పొందిన వారు కీర్తిస్తున్న పాడిన పాట....

*****************************************

పల్లవి:-

********

నీ నా తేడా తెలియని

నీవైనా నేనైనా ఒకటేనని

తలచి మసిలే మహా మనిషతడు

 నీకైనా నాకైనా ఒకటే న్యాయమని

నినదించి ఆచరించి చూపిన 

చైతన్య స్వరూపమతడు..


నిజమే పలుకై  ఇజమే పసుపై

సహజమైన గుణవంతుడతడు

జనమే నేనని నేనే జనమని

సత్యమే పలికే సత్యహరిచంద్రుడతడు.


నీనా తేడా తెలియని

నీవైనా నేనైనా ఒకటేనని

తలచి మసిలే మహా మనిషతడు..

చరణం:-1

*************

 మెలుకువ లేకున్నా 

చుట్టు జరిగేవన్ని తెలుసుకోగల 

దివ్య జ్ఞానం కలిగిన  ఋషి అతడు

తనువంతా మానవతగా

నడిచొచ్చిన  శ్రీమంతుడతడు..


అందరి ఆనందమే

తన ఆనందంగా భావించే శ్రీరాముడతడు

కొసరి కొసరి వడ్డించే అమ్మలా

అనురాగాల కొమ్మకు పూసిన అనుబంధమతడు..

పల్లవి:-

********

 నీ నా తేడా తెలియని  

నీవైనా నేనైనా

ఒకటేనని మెలిగే ఋషి అతడు

తనువంతా మానవతగా

నడిచొచ్చిన శ్రీమంతుడతడు.

చరణం:-2

***********

ఎవరినీ ఏమీ ఆశించని

స్వచ్ఛమైన మనిషతను

ఎవరిని ఎప్పటికి నొప్పించని

 స్థితప్రజ్ఞతల  సహచరుడైన మనిషతను..


చిరు వయసైనా పెనుభారం మోసిన

కురు వృద్దుడు భీష్ముడంతడి

 పెద్ద మనసున్న  బంధాలకు పెన్నిది అతను


మనిషంటే ఇతనేరా

ఋషి అయినా ఇతని తరువాతేనురా

 మనసున్న మనిషి మా కోసం ఆ దేవుడే 

దిగివచ్చిన అవతార పురుషుడు ఇతడూ..


పల్లవి:- నీనా  తేడా తెలియని

 నీవైని నేనైనా ఒకటేనని

తలచి మసిలే మహా మనిషతను

తనువంతా మానవతగా

నడిచొచ్చిన శ్రీమంతుడతడు.


చరణం:-3

**********

మహారాజురా  ఉన్నదంతా ఇచ్చేసీ

ఉన్నపళంగా వీడ్కోలు పలికి

ఒంటరిగా నడిచి వెలుతున్న

ఏమి లేని  మనసున్న మహారాజురా..


మగసిరి అంటే అర్థం ఏముందో కాని

అసలు సిసలైనా మగసిరి గల మగాడురా

 ఓహోహోహో ఓహోహోహో.

స్వార్దం ఇసుమంతలేని  ఈ నవ యువతేజం

సాదించగలడు కాలంతో సమానమై  విజయం.

 పల్లవి:-

*********

నీ నా తేడా తెలియని

 నీవైనా నేనైనా ఒకటేనని మెలిగే ఋషి అతడు

తనువంతా మానవతగా

నడిచొచ్చిన శ్రీమంతుడతడు.

******************************

🌹నేటి నా పాట🌹 పాట సంఖ్య307🌹

************************************

 రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

18/06/2022.

****************

పాట సందర్భంపై విశ్లేషణ:-

************************

  పెండ్లీడుకొచ్చిన ఓ అమ్మాయి  మనసు

 ఏమి కోరుకుంటుందో  తనకు కాబోయే వాడు ఎలాగుండాలో  ఊహించుకుంటుందో అమ్మానాన్నలు  చూసీన సంబంధాలు నచ్చని పరిస్థితి లో  ఓ అధ్భుతమైన అందగాడు ఆజానుబాహుడు

 అన్ని విధాలుగా వున్న అబ్బాయి తారసపడగా

 ఎగిరి గంతేసి అతని అందాన్ని గుణగణాలు

 తెలుసుకొమ్మని  స్నేహితురాలతో చెబుతు తెలుసుకొని 

 చేసుకుంటే వీడినే చేసుకుంటానని లేకుంటే బ్రహ్మచారిగా నే వుండి పోతానని  ఆరాదిస్తు ఊహిస్తు పాడుతున్న ది ఈ పాటగా....

**********************************************

పల్లవి:-

*******

ఇంత అందగాడు ఇండియాలోనే వీడొక్కడే

ఏమి తీంటున్నాడో  చెలియా తెలుసుకోవే

నచ్చినాడే నాకు వీడు నా మనసు మెచ్చినాదే

ఈ అందగాడినే

చేసుకుంటానే వీడినే నా జతగాడిగా


తోడుగా నీడగా  కలిపేసుకుంటానే 

నా కౌగిళి లో కలకాలం ...

పెరుగు మీది మీగడలా  నిగనిగ లాడుతు

నోరూరిస్తున్న మగసిరి సొగసైన వాడే...


ఇంత అందగాడు ఇండియా లోనే వీడొక్కడే

ఏమి తింటున్నాడో  చెలియా తెలుసుకోవే

చరణం:-1

**********

వేయి రాగాల వెదురు వేణువులా

సప్థ స్వరాల విశ్వరూపుడై  సమ్మోహన కారుడై

సొగసంతా మల్లెపూవులా మార్చేశాడే ఒక్క చూపులో..


గుంటూరు మిర్చిలా పొగరుగా వున్నాడే

మాండియా బెల్లంలా కళకళ లాడుతు

తియ్య తియ్యగా ఊరిస్తున్నాడే  తిరుమ లేసుడు..


ఇంత అందగాడు ఇండియా లోనే వీడోక్కడే

ఏమి తింటున్నాడో చెలియి తెలుసుకోవే....

 

చరణం:-2

**********

అమ్మానాన్న ఎంతో మందిని చూయించారు

 పెళ్ళిచేసుకోమని  

ఒక్కడైనా వీడి కాలిగోటికి సరిపోరులే

అమ్మ తోడుగా చెబుతున్నా 

చేసుకుంటే ఇతన్నే చేసుకుంటా 

లేకుంటే జీవితమంతా బ్రహ్మచారిగా వుండిపోతా....


పాల బుగ్గలోడు  నిండు పున్నమి చంద్రుడోయి

 వెన్నెల జలపాతాన్నే ఒంటికి చుట్టుకున్నాడేమో

కన్నెమనసుకు ఈ కన్నె మనసుకు తెగ నచ్చేసినాడే

ఇన్నాళ్లు నా కళ్ళ పడకుండా ఎక్కడ దాక్కున్నావురా..

పల్లవి:-

********

ఇంతందగాడు ఇండియా లోనే వీడొక్కడే

ఏమి తింటున్నాడో ఏమో తెలుసుకోవే చెలియా..

చరణం:-

********

 నిదురే రాకుండా చేస్తున్నావురా రాతిరంతా

చందనమే పూసుకున్నా వేడి తగ్గకుందే ఒళ్ళంతా

వందనమే చేసి చెబుతున్నా నన్నే నీవు చేసుకోవాలి

నీవే నా జత గాడివై వందేళ్ళు ఒకరికి ఒకరం పాలు నీళ్ల లా కలిసి పోవాలి..

 పల్లవి:-

********

ఇంత అందగాడు ఇండియాలోనే వీడొక్కడే

ఏమి తింటున్నాడో ఏమో  బ్రహ్మాండమంతా అందం

 బ్రహ్మ దేవుడు వరముగ ఇచ్చి పంపినాడే నా కోసం

 నా కోసం నా కోసం....

***********************************************

🌹నేటి నా పాట  🌹పాట సంఖ్య;-311🌹

***************************************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

***************************

9640713717.

దోర్నాల.

22/06/2022.

****************

 పాట సందర్భంపై నా విశ్లేషణ.

***************************

 ఆమె అంటే ఎనలేని గౌరవం ఆమె అంటే

చెప్పలేని అభిమానం ఆమె అంటే మనసంతా

 ప్రేమతో నిండిన భావం.. చెప్పలేని

మనసులోని భావాలను పంచుకోవాలనే జీవితాన్ని

 పెంచుకున్న ప్రేమను వ్యక్తం చేస్తు ఊహల వలయంలో

విహరిస్తు పాడిన పాట

పల్లవి:-

********

నిండుదనం మెండుగ వున్న  

కన్నె మందారమా

నిను చూడకుండా వుండలేక  

పండు వెన్నెలనై వచ్చానే  కన్నె సింగారమా.


పచ్చని పైరులే 

స్వచ్చమైన గాలులే

పాడే కోయిల లే

నీ నవ్వుల్లో నాట్యం చేస్తుంటే

 నే పువ్వునై పులకిస్తు

నీకై నిరీక్షణై ఆస్వాదిస్తున్నానే

అరవిందమా  స్వర్గపు సురా భాండమా

సుఖములనొసగే సుందర మనోహరమా


నిండుదనం మెండుగున్న కన్నెమందారమా

 చరణం.1

**********

జాబిల్లి తోటలో  జాజిమల్లివై విరిశావే

తొలకరి జల్లులో   చేమంతి వై మురిశావే

కోరికోరి నిన్నే కోరి చేరి చేరి నిన్నే చేరి

మరిమరి  చెరి సగమై  కొరికేద్దాం పండుకొని


నిదురే  రాని ఈ రాతిరిలో 

 కుదురేలేని మనసులను

ముచ్చటగా ముడివేసి  

స్వచ్ఛమైన ప్రేమకు దాసోహమవుతు

అమ్మడి ఒడిలో కమ్మగా నిదురోతా..


 నిండు దనం మెండుగున్న కన్నె మందారమా

 చరణం:-2

*********

నన్నే నేను మరిచిపోయి నీ వెంట పడుతున్నానురా

గున్న మామిడి తోపు ముందున్నదంటా

నమ్మకమక్కడ  శాఖోపశాఖలుగా   పొదరిల్లుగా

 వెలసిందంట..


నిన్ను నన్ను ఇక్కడే కాపురం చేసుకుంటు

కాలమంతా కేరింతలుగా మలచుకోవాలంటా

గోలలే లేని ఏకాంతంలో  ఈ కాంతతోటే

శతకోటి సంవత్సరాలు   తోడునీడగా కలిసుండాలంటా..


మా కోరికలకే   ఆ కోవెల దీవెనలు 

కోకొల్లలుగా  అందుకోగా

ఎల్లలు లేని ఆనందమే మేమై  

తేనె జల్లుల తూనిగలమై

తేలిపోతున్నాములే  తియ్య తియ్యని  ఊహలమై..

పల్లవి:-

********

నిండుదనం మెండుగ వున్న

 కన్నె మందారమా

నిను చూడకుండా వుండలేక

 వెన్నెలనై వచ్చానే కన్నె సింగారమా...


***********************************************

*****************************************

【🌹నేటి నా పాట. 🌹పాట సంఖ్య:-314🌹】

******************************************* రచన:- మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

25/06/2022.

********************************************

 ఒక పల్లెటూరు లో  చిన్న పెద్ద కులాల ఇద్దరు పేద ప్రేమికుల మద్య ప్రేమ చీగురించింది.. కలువలేని పరిస్థితి

కదలలేని పరిస్థితి లో   పెద్దల మద్య గొడవలకు కారణమై వూరు భగ్గుమని జరగబోయే నష్టాన్ని గ్రహించిన

 పిల్లలు పెద్ద మనసుతో  ఎలా ఆలోచించి ప్రేమను త్యాగం చేసుకొని బాధతో దూరమవుతున్న జంట మనోవేదనకు అక్షర రూపం ఈ పాట.

*********************************************

పల్లవి:-

**********

చూడచక్కని చుక్కలాంటి చిన్నది 

 నా కోసమే ఎదురు చూస్తున్నది


 వీధి కాడ  కాపు కాసింది

 వాడి చూపులతో ఓరగా చూస్తున్నదే

 సొగసు మూటతో  మనసు మాటతో

వయసు వలపును మెలికలు తిప్పుతు

కులుకుల రాణి ముసిముసిగా నవ్వుతోంది.


చూడచక్కని చుక్కలాంటి చిన్నది

నా కోసమే ఎదురు చూస్తున్నది..

చరణం:-1

********

 పేదరికము  ప్రేమ   పెదవి దాటని ప్రేమ

దాచుకున్న మనసులోని భావం 

గోడ చాటునే ఆగిపోయి వేదనో బాధనో

అర్థమే కాని ఆడజన్మ రా నాది


ఆగిపోయిన గోడ గడియారమే మేలులే

ఆడిన వాడితో మనసు విప్పలేని మౌనమై

ప్రశ్నలే మింగిన గొంతులో పెగలని పెదవికి

సమాధానమే దొరకదులే...

పల్లవి;-

******

చూడచక్కనీ చుక్కలాంటి చిన్నది

మనసులోన మధనపడుతున్నది


 నీ మనసెరిగి నడుచుకునేదే నా ప్రేమ

నా ప్రేమను నీ పాదాలపై ముద్దు గా పెడుతున్నా

సద్ది చేస్తావో ముద్దు చేస్తావో  వద్దని  వద్దేవద్దని

వదిలేస్తావో  కన్నీటితో వీడ్కోలు పలుకుతవో

 చెప్పవే  ప్రేమా  చెప్పవే భామా..


చరణం:-2

*********

 దొంగలాగా నీకై తొంగి చూసి

 మనసు కోరిక తీర్చుతున్నా మగువను 

తెగువ లేక తెంపులేక

 చెప్పలేక తప్పకనే నీకై నిలుచున్నా

ఇష్టమే నీవైనా ఇంటికి పరువే ముఖ్యమై

ఎటు తేల్చుకోలేక నాలో నేను నలిగిపోతున్నా..


 నిన్నే మనసులో నిలుపుకున్నా చిత్ర మైన స్థితిలో

 విచిత్రమైన పరిస్థితి లో విధి నన్ను నిలిపింది.

అర్థం చేసుకోరా ఆకలిని మాడ్చుకోరా

ఇంతే అని ఇంతటితో ఆగిపోదాం...


చూడచక్కనీ చుక్కలాంటి చిన్నదాన

 నీవేమి చెబితే అదే నేను చేస్తానే

మాట ఇస్తున్నా...

చరణం:-3

**********

అందరు బాగుండాలని

త్యాగానికి మనం సిద్దమవుదాం

మనసులోన నిన్ను తొలగించుకుంటా

మనసారా ఒప్పుకోరా 


అనుకున్నవన్ని జరగవని అర్థం చేసుకోరా

 వెలుతున్నా ఇక ఎన్నటికి నిను కలవనే కలవను

 నీ దారి నీది నా దారి నాది

మనసును చంపూకుందాం మనుగడ కోసం


మలినం కాకుండా మేలిమిలా మెరిసిపోదాం

 చిన్న వాళ్ళమైనా పెద్ద నిర్ణయమే తీసుకొని

 పెద్దలను గౌరవిద్దాం సెలవికా సెలవికా

 నీవెవరో నేనెవరో ఇక  సెలవికా..

***********************************

【🌹నేటి నా పాట 🌹 పిట సంఖ్య 309🌹】

****************************************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

****************************

9640713717.

దోర్నాల.

20/06/2022.

**********************

పాట సందర్భం పై విశ్లేషణ.

************************

తొలిచూపుల ప్రేమ   యవ్వన గీతం పాడుతు

ఆశల తీరంచేరుతు  ప్రణయ బంధం బలీయమై విరహానికి వీడ్కోలు పలుకుతున్న  జంట 

మనోరంజితమై విహరిస్తు పాడిన పాట.

***************************************

పల్లవి:-

*********

కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసి

గుండెనే కొళ్ళగొట్టినావురా

 ఒంటి మీద చేయి వేసి

 ఒడిలో వేడి రగిలించావురా


ఇళ్ళంతా  మల్లెలతో నిండివుంది

వల్లంతా సెగల పొగలతో మండుతోంది.

రారా రసరాజా

రారా రవితేజ.


కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసి

గుండెనే కొల్లగొట్టినావురా...

చరణం:-

**********

 లాంతరు కాంతిలో  

 పరువాల పాల వెల్లువా

 వరదై పారుతుంటే

మనసు మత్తుగా హత్తుకోవాలని

 ఆరాటపడుతుంటే ఏమి హాయిరా

 ఈ రేయి మన్మథుడా...


 జోలపాడనా  గాలిలో తేలిపోయేలా

 ఊయలే ఊపనా హరివిల్లునే అందుకునేలా

పూలతోటలో వలపు ఆటలో తలమునకలై

తపనలకే  తహతహలు పుట్టేలా  రెచ్చిపోదామురా

 పల్లవి:-

********

 కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి

 గుండెనే కొల్లగొట్టావురా

చరణం:-

**********

మబ్బులు కమ్మిన వేళా

మనసులు  పురి విప్పిన వేళా

జబ్బ చరిచిన అంతరంగం  

జత కట్టమని నెట్టి వేసి 

పడదోసెనే నీ ఒడిపైకి..


కలిసిన ప్రతి సారి  

కల హంసల మది పూసే

కులికిన కుసుమం 

పలికెను చిరుమందహాసం

 నెచ్ఛెలి వణికిన  నీ పెదవి

చెప్పెనే ముద్దులతో సమాధానం.

 పల్లవి:-

********

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి

గుండెనే కొల్లగొట్టావురా..

**************************

🌹నేటి నా పాట🌹 పాట సంఖ్య:-【312】🌹

*****************************************

 రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

23/06/2022.

*************** 

పాట సందర్భంపై విశ్లేషణ:-

************************

 ఒకరిపై ఒకరికి నమ్మకం

 ఒకరంటే ఒకరికి ఇష్టం

 వేరు కాదనే భావం వేదమై

ఎన్నటికి  వేదన రాదనే తాత్పర్యం..

ఆత్మవిశ్వాసం  ప్రేమ తత్వం లో మునిగిపోయి విడదీయలేని బంధం గా మారి అన్యోన్యత కు

 అద్దం పట్టే  ప్రేమ జంట  పిడిన పాట...

****************************************

పల్లవి:-

*********

నీ అందం నాదేనులే 

నీ ఆనందం నేనేలే నవ వసంతమా

ఓ నా చెలి చందనాల పూల వనమా

నీ చూపు నేనేలే  నా కనుపాప నీవేలే

 ఓ సఖీ సుమధుర ఆలపన గీతమా..


కలకాలం  కమనీయం

దృశ్యకావ్యమై నిలిచి పోదామా ఇలా..


 నీ అందం నాదేనులే

 నీ ఆనందం నేనేలే నవ వసంతమా

చరణం:-1

*********

సఖి నీ ఒడి సుగంధాల లోగిలి

చెలి నీ చిరునవ్వే   నా శ్వాసకు ఊపిరి

 గాలి కెరటమల్లే సాగే  నీ నవ్వే

 నవ రత్నాల మూటలు నా ఇంట పాడిపంటలు


నీ మాటలు ముత్యమంత ముద్దులై

నాపై కురిపించే నవ కుసుమాల పరిమళాలు

పగలే వెన్నెలలా పరుచుకున్నదే నీ రాకతో

నా నయనాల వాకిళ్ళలో...

 పల్లవి:-

********

నీ అందం నాదేనులే

నీ ఆనందం నేనేలే ప్రియతమా

చరణం:-

********

నీ వగల వయ్యారాలకు

ఏడు వారాల నగలే 

నీ కుందనపు నడక


నీ మువ్వల సవ్వడులు

నయాగరా జలపాతాల

జాడలకు ఆనవాళ్ళు


తోడు నీడలో 

తొలకరి చినుకువై కురిశావే

పగలు రాత్రులకు  మద్య 

వారధివై నిలిచావు లే...

పల్లవి:-

******

 నీ అందం నాదేనులే

 నీ ఆనందం నేనేనులే


ఈ ఆశల పల్లకి లో ఆయువు నింపినావులే

నీ శ్వాసనే ఊయలగా  మలచి నావురా

స్థితిగతులు ఎన్ని మారినా

శృతి లయలుగా సాగుదాం..


 రోజులు గతించి జన్మలుగా  మారినా

 జాజులు పరచి చేరుకుంటానే నీ చెంతకు...

పల్లవి:-

********

 నీ అందం నాదేనులే

 నీ ఆనందం నేనేనులే  ప్రియతమా...

*******************************

🌹 నేటి నా పాట🌹 పాట సంఖ్య:-316🌹】

****************************************

రచన:- మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

27/06/2022.

********************** 

పాట సందర్భంపై నా విశ్లేషణ.

***************************

 ఒక మనిషికి కష్టానికి తగ్గ ఫలితం వస్తే

ఒక  మనిషిలో  తన శక్తి సామర్ధ్యాలు  లోకం గుర్తిస్తే

 ఒక మనిషికి  విజయం  కేరాఫ్   అడ్రస్ గా మారితే

 ఒక మనిషి  గతం గాయాలను చెల్లాచెదరు చేస్తు

 మధురమైన గేయంగా మారితే

 ఒక మనిషి ని మరో మనిషి నమ్మి  తనలో దాగిన

 కళను గుర్తించీ ప్రోత్సాహం అందిస్తే అంది  చెప్పలేని

ఆనందమై ఆకాశమంత సంబరమై ఇలా పాటకు

 రూపమైంది..

  చిన్న తనం  అందరు కనుమరుగై రోడ్డున పడ్డ

 ఓ పిల్లవాడు  అమ్మను తలచుకుంటు  బాధను మాటనుండి  ఆవేదన గా పాట రూపంలో పాడగా

 అది విన్న  ఓ హృదయమున్న మనిషి చేయూతతో

 అధ్భుతమైన గాయకుడిగా ఎదిగేలా చేస్తుంది.

అలా ప్రపంచం గుర్తింపు పొందిన గాయకుడు గతాన్ని

గుర్తుచేసుకుంటు వర్తమానంలో ఆనందంగా  

తనలో తను పరవశమై 

తన  అంతరంగాన్ని ఆత్మవిశ్వాసం తో ఆవిష్కరించుకున్న పాట ఇది.

*********************************************

 పల్లవి:-

********

నాలో నవ్వు నడుస్తోంది 

పువ్వు వికశించినట్టుగా

నాలో నవ్వు నడుస్తోంది 

అమ్మ ఒడిలోని చంటి బిడ్డలా...


నాలో నవ్వు నడుస్తోంది

నయాగరా జలపాతంలా

నవ్వు నడుస్తోంది

వెన్నెల కురిసినట్టుగా


నవ్వు నడుస్తోందో

అమ్మ దిగి వచ్చి దీవించినంతగా..


చరణం:-

*********

ఎంత చెప్పిన తరగని ఆనందం

గుండెలోన  గుప్పుమంది చందన  పరిమళమై

అంతులేని సంపద అనంతమైన పరిచయం

నిలువనీయకున్నదే నింగినే అందుకున్న సంబరం.


ఆశలే  నెరవేరి ఆకాశమంతగా ఎదిగిన వైనం 

ఈ క్షణం  సముద్రమంత సంతోషమైనా

గత గాయాలు వెంటవున్న జ్ఞాపకాలు

మరచి పోని మానిపోనివిలే.

 పల్లవి:-

*******

 నాలో నవ్వు నడుస్తోంది 

పువ్వు వికసించినంతగా

చరణం:-

********

జాలి లేని లోకంలో

ఒంటరిగా సాగినా కాలంతో

గాలితో కలిసి ధూళీలా ఎగిరీ పడినా

ఈర్ష్యాద్వేషాల  మనుషుల మద్యనా..


గమ్ముగా పడివున్నా రోజులు వీడి

దుమ్ము దులిపేసిన దమ్మును

నాదంటు ఒక రోజు దేవుడు వరముగా ఇచ్చి

సూర్యుడిలా వెలగమంటు 

తొలకరిలా వర్షించేలా

వసంతంలా వచ్చి వాలింది ఆనందం...


కోటి రాగాల  కోయిలనై   వికసిత గళమై

విశ్వ విపణిలో సప్తస్వర గాత్రమై

మదిమదిని పులకింపచేసి ధన్యమాయే నా జీవితం

చరితార్దమై చరిత్ర నే లిఖించిన

చెరగని ముద్రనై నిలిచినా చెప్పలేని ఆనందనమై...

 పల్లవి:-

******** 

నాలో నవ్వు నడుస్తోంది

పువ్వు వికసించినంతగా...

చరణం;-

*********

హృది ఉప్పొంగి పాడుతోంది 

గత గాయం స్మ్రుతులు

నెమరు వేతలే సుందర జ్జాపకాలు అలలై

అలా అలా స్పర్శించగా...


ఆనంద హేలగా మారినా మార్చినా

మరిచిపోనులే ఎన్నటికి ఎప్పటికి ప్రియతమా

నా ప్రియతమా నను మనిషిగా మార్చినా

స్నేహమా...

 నీ సహకారం  ఈ వెలుగును గొడుగై పట్టిందిలే...

పల్లవి:-

 నాలో నవ్వు నడుస్తోంది

 పవ్వు వికసించినంతగా...

******************************

【🌹 నేటి నా పాట🌹 పాట సంఖ్య:-319🌹】

*****************************************

 రచన:-మహేష్ వూటుకూరి✍️

9640713717.

దోర్నాల.

30/06/2022

***********************

 పాట సందర్భంపై నా విశ్లేషణ:-

*****************************

 అతిగారాబం లేదా పెరిగిన వాతావరణం వలన 

ఒక అమ్మాయి మగ రాయుడిలా బి హేవ్ చేస్తుండేది

 ఆ అమ్మాయికి అనుకోని సంఘటనలో  హీరోతో చిన్న గొడవతో పరిచయమై అది ప్రేమగా మారుతుంది..అంతవరకు లేనిది ఆ అమ్మాయి

 సిగ్గుపడుతు  నేను ఆడదాన్ని కదా నాలోని ఈ భావాలు

 ఇతనితో నేను ప్రేమలో పడ్డాను అని మనసుతో మాట్లాడుతు అతని  చూపుకి సిగ్గు పడుతుంది అతని  మాటకై ఎదురుచూస్తుంది   మాట్లాడుతుంటే

 మైమరచిపోతుంది.. వయసు మనసు సొగసు ఒకేసారి

 స్పందనలో చెలరేగిన  అమ్మాయి మగ రాయుడి నుండి అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిలా మారుతుంది

 కట్టు బొట్టు పూలు పెట్టి  అతనికి తనలోని  ప్రేమను

 తెలుపుతున్న ఈ పాట...

************************************************

  శీర్షిక:-నీ చూపు తాకి నేను.

*************************

పల్లవి:-

******

నీ చూపు తాకి సిగ్గేంటో నాకు తెలిసిందిలే

 నీ మాట తోటి మొగ్గైనా నేను మందారమల్లే వికసించానులే

నాలోని ఆరాటం నీ ఒడికి జత చేసిందిలే

నీలోని పోరాటం నాపై నీ గెలుపుకు 

దరహాసమై నా అధరాలలో విరిసిందిలే...


 నీ చూపు తాకి సిగ్గేంటే నాకు తెలిసిందిలే

 నీ మాట తోటి మొగ్గైన నేను మందారమల్లే

 వికసించానులే..


 చరణం:-1

 నీ అందాల తోటి ఆనందాన్ని చూసానులే పిల్లా

 నీ అధరాల తోటి మధువు కంటే మధురమైన

అమృతాన్ని గ్రోలానులే. ఆనందాల ఖిల్లా

సుఖమంటే ఇంత హాయని నీ ముఖారవిందం

 రుచిలే   ఋజువు గా చూపిందిలే..


సఖుడంటే  నీవేనని నీ సరసం మురిపించి 

మరీ మరీ చెప్పిందిలే..

వయసే వరదై  చుట్టుముట్టి గట్టిగా వాటేస్తే

 మనసే పరుగై ఆటపట్టిస్తు  సొగసును అల్లుకుంటే

 సిగ్గే చీరనొదిలేసిందిరా ముద్దై  నీతో ముసిముసిగా

 నవ్వేసిందిరా...

 పల్లవి:-

నీ చూపు తాకి  సిగ్గంటే ఏంటో తెలిసిందిలే

నీ మాట తోటి మొగ్గైనా నేను మందార మల్లే వికసించిందిలే..

 చరణం:-2

**********

 నా ఆశా దీపం నీవేనులే

 కోవెలలా వెలుగులలో నా శ్వాసగా మారావులే

 ప్రయాస పడకే యవ్వానమా

 ఆషాడం ఇంకా చాలా దూరం వున్నాదిలే


 కోరిక కొరివై కాలుస్తుంటే తీరిగ్గా వస్తావేందిరో

పెళ్ళి కొడుకులా

 వేకువ రాకుండా తూరుపుకు గొళ్ళెం పెట్టరో ప్రియుడా

 మక్కువ నాలో  పెరిగిందని మారాం చేయకే ప్రేయసి

తక్కువ అనుకోకు గుండె లోతుల్లోకి తొంగి చూడవే

 నీపై నా ప్రేమ హద్దులు లేని ఆకాశమంతగా కనిపించుతుందిలే...

 పల్లవి:-

*********

నీ చూపు తాకి సిగ్గంటే ఏంటో తెలిసిందిలే

నీ మాట తోటి మొగ్గైన నేను  మందారమల్లే వికసించానులే....

*********************

【🌹నేటి నాపాట 🌹పాట సంఖ్య:-313🌹.】

 రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

24/06/2022.

************************

 పాట సందర్భంపై విశ్లేషణ.

**************************

ఒక మనిషిలో తెగింపు వచ్చి భయపడే స్వభావం లేదంటే

నిజాన్ని నమ్మడమే ఎటువంటి పరిస్థితి లోనైనా 

మంచి వైపు నిలబడేవాడికి చెడును చూస్తే ఖండించేవాడికి ధైర్యమే శ్వాస న్యాయమే అడుగులు

 అలా నడవడిక గల హీరో పైనే ఈ పాట.

 ఎవరు లేని చిన్నతనమే  ఎదిరింపుకు తెగింపుకు

బాటలు వేసి  తప్పును చీల్చే కత్తి లా మారినోడిని చూసి

 ఓ ఆడది ప్రేమించి తను బ్రతకాలంటు  బ్రతుకుకు అర్దం చెబుతు అర్థాంగిగా మారి అర్థవంతమైన జీవిత పయనానికి మార్గం చూపుతు నాయకుడిగా మారుస్తుంది

సమాజం ఉనికిలో అతని పాత్రకు ప్రాధాన్యత ను

సంతరించి సమున్నతంగా తీర్చిదిద్దుతుంది. ఇదే ఈ పాటలో అంతర్లీనంగా వున్న కథ గమనం....

*****************************************

పల్లవి:-

**********

భయమే లేని వాడు

భయాన్నే భయపెట్టినోడు

దేవుడినైనా ఎదిరించినోడు

దేవుడిదే తప్పని తెలిసినాక

దేవుడికే ఎదురెల్లి  నిలదీసిన దమ్మున్నోడు.


నమ్మినదానికై  నరకడానికైనా సిద్దమైన 

కత్తి కంటే పదునైనవాడు

కష్టాలెన్ని వచ్చినా ఎదిరీదడానికే  సంసిద్దుడై

 సింగమల్లే  గర్జించినా గుండెలు కలవాడు.


భయమే లేని వాడు

భయాన్నే భయపెట్టినోడు.

చరణం:-1

********

కన్న వాళ్ళే కనుమరుగై

చిన్న తనమే  చిన్నబోయి

అయిన వాళ్ళే 

చిన్న చూపు చూసినా

చలించని నిబ్బరమై

జ్వలించిన జ్వాలా తోరణమై

వెలుగుల దివ్వెగా  వెలుగొందు తున్నాడు

సూర్యుడిలా.


కాలం కొరడా ఝులిపించినా

న్యాయానికై  ఎదురొడ్డి నిలిచి

నిజమై మొలిచి  మహావృక్షంలా

విస్తరించిన విశ్వనరుడతడు

విశ్వాసానికే ప్రథమ పుత్రుడతడు


 అతడే అతడే అతడే  రుద్రుడు ఈ వీరభద్రుడు

పల్లవి:-

*******

భయమే లేని వాడు

భయాన్నే భయపెట్టినోడు. 


చరణం:-2

**********

బండ బారిన మనిషిలో

బంధమంటే ఏమిటో  తెలిపిన ప్రేమా మొలకా

ఉండవలసినదేమిటో నిండుదనమై నిలచి

అనురాగం పంచింది భామా ఈ  చిలకా


అణువణువు జనం కోసం  

అంకితం చేసిన ఆశయంలో 

అణువంత అంశ తనకోసం ఇమ్మని

రేపటి తరానికి  నీవే నీ అంశ రూపంలో

నీలా మరో మహావృక్షం నీడ నిచ్చి నిలపమంది.

పల్లవి:-

********

భయమే లేని వాడు

భయాన్నే భయపెట్టినోడు.

 చరణం:-3

**********

ఆదుకోవాలనే  ప్రేరణకైనా ప్రేమ కావాలంటు

తన కౌగిళిలో కరిగి పొమ్మంటు

కానుకగా తననే  రమ్మంటు 

 ప్రేమగా హత్తుకుందిలే  తనలో కలుపుకుందిలే..


కుంతిలా మారినా ఆ ఇంతి త్యాగానికి

తలవంచి తాళికట్టి శ్రీమతిగా స్వీకరించి

చరిత్రలో మరో అధ్యాయమే  రాసినాడులే

 రారాజు మా రాజు మహారాజు


అతనితోనే ఆగిపోకుండా సాగిపోయేందుకు

చేయి చేయి కలిపి చిలకా గోరింకలు  మురిసి

ఆశయానికి  ప్రేమకు ముడి వేసి 

మనుగడనే మలుపులు తిప్పి 

మేలుకొలుపు వైపు సాగుతున్నాడు

 అతడే అతడే అతడే రుద్రుడు  ఈ వీర భద్రుడు.

 పల్లవి:-

******** 

భయమే లేనోడు

భయయాన్నే భయపెట్టినోడు..

దేవుడినైనా ఎందిరించినోడు

దేవుడికే ఎదురెళ్ళి నిలదీసిన దమ్మున్నోడు.

వీడే వీడే రుద్రుడు వీర భద్రుడు.

*****************************************

🌹నేటి నా పాట🌹 పాట సంఖ్య:-315🌹

**************************************

రచన:- మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

26/06/2022.

**********************

పాట సందర్భంపై నా విశ్లేషణ.

**************************

 ప్రేమించినాక ప్రేమకై జీవిస్తు  నిరీక్షణ తో నిత్యం

ఎదురుచూస్తు తనతో తను మమేకమై తనలో

 నిలుపుకున్న రూపంతో మౌనమే భాషగా రాక కోసం

ఎదురు చూస్తున్న ఓ అందాల సుందరి మధుర ప్రేమ

 ఈ పాట.

*****************************************

పల్లవి:-

********

నీకై నీకై నా ఆలోచనలంతా నీవై

నాలో నాలో నేనే లేక నీతో నిండే మది అంతా

 నీ వెంట పరిగెడుతు నా సర్వం నీ వనుకొని

 నీ అర్పణకై తపిస్తున్నా  నిరీక్షణ తపస్సే చేస్తున్నా


నీకై నీకై నా ఆలోచనలంతా నీవై

నాలో నాలో నేనే లేకా నీతో నిండి మది అంతా...

చరణం:-1

**********-

ప్రేమ ఎంత మధురం

మనసు మురిసే ప్రతిక్షణం

నీ నామ స్మరణం అనుక్షణం

చేసే నా హృదయం ప్రతి నిమిషం

సంతోషాల సంబరం..


పంచభూతాల దేహం

నీ పంచన చేరాలని తహతహల

తపనల ఆరాటాలతో కాలంతో స్నేహం చేస్తున్నా

అగుపించని నీ రూపాన్ని

కనిపించని నా మనసులోన దాచుకొని  

ఆరాదిస్తున్న కోవెలలో దేవుడిలా..

పల్లవి:-

********

నీకై నీకై నా ఆలోచనలంతా నీవై

నాలో నాలో నేనే లేకా నీతో నిండి మది అంతా

 చరణం:-2

**************

మల్లెపూలు నీకై ఎదురు చూస్తున్నయ్

వెన్నెలంతా నీకై నీకై  విరబూసివుంది

చల్లగాలి హాయిగా  పలకరిస్తుంటే

నీ ఆగమనానికై  అందాలన్ని  విందులా

సిద్దమైవున్నయ్ సుందరుడా...


లేలేత  ప్రాయం పూలతలా పరిమళ భరతమై 

నీకై కస్తూరి గంధాన్నై సునందాల వీచికలా  

సువాసనలా సుఖాల సోయగాల  సౌగంధి పుష్పంలా

మారిపోయి నీకై వేచి చూస్తున్నా వేయికళ్ళతో...

పల్లవి:-

*******

నీకై నీకై  నా ఆలోచనలంతా నీవై

నాలో నాలో నేనే లేకా నీతో నిండే మది అంతా...

🌹నేటి నా పాట🌹 పాట సంఖ్య:-320🌹

*************************************

 మహేష్ వూటుకూరి ✍️

9640 713717.

దోర్నాల.

02/07/2022.

*****--************

పాట సందర్భంపై నా విశ్లేషణ.

**************************

 యుక్త వయసులో అదీ కాలేజీలో ఓ యువకుడికి

అపుడే విరిసిన  ముద్దమందారంలా అద్భుతమైన సౌందర్యం తో కళ్ళు తిప్పుకోనీకుండా చేసే సౌందర్య రాశి ఎదురవుతుంది.. వున్నది వున్నట్టు గా భయమనెది లేని ఆ యువకుడు ప్రేమలో పడుతు ఆ అందాన్ని పొగుడుతు ఆ అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు.. ప్రేమ మాధుర్యం అనేది పిలిచే పిలుపులో  కొలిచే ఆరాధనతోనే 

మాధుర్యమై  ప్రేమగా  చిగురిస్తుంది .. అతనో సిన్సియర్

 సిన్సియర్ గా ఏది చేసినా సక్సస్  యాక్సప్ట్ చేసితీరవలసిందే కదా అదే కోవలో  ఆ సౌందర్యం ఆ సాహసవంతుడి ప్రేమకు దాసోహమవుతుంది..

***********************************************

 టైటిల్ :--  ఎంతందంగున్నావే.

********************************

హే  

ఎంత అందంగున్నావే

 హే హేయ్

 ఎంత మాయే చేశావే

 అమ్మానాన్నలనే మరిచేలా

 ప్రాణ స్నేహితులనే వదిలేసేలా 

 నీ అందాల తీరం వెంట నే నడిచేలా

నన్నే నేను మరిచేలా... చేసిందే నీ అందం.


 హే ఎంత అందంగున్నావే

 హే ఎంత మాయే చేశావే..

 చరణం:-

**********

  హే

ప్రేమ ప్రేమ అంటు నిన్ను చూస్తువుంటు

 కాలాన్నే మరచిపోయానే

 హేయ్ 

నీ చూపు నా వైపు పడితే చాలని మురిసానే

చలికాలమంతా నిను  చూస్తువుంటే

వెచ్చదనం ఒళ్ళంతా వచ్చివాలినాదే నా పైనా

హే 

తూరుపు వెలుగు రేఖవే నీవు నాకు

రేపు అన్నది వద్దేవద్దే  

నేడు నీ తోటే వుండటమే ముద్దు ముద్దు నాకు

హృదయం అంతా నిండి వుండి

 ఉదయం వరకు నిదురే 

పోనీయలేదే నీవే  నీవే నన్నే నన్నే..

పల్లవి:-

*********

 హే 

ఎంత అందంగున్నావే

హే 

ఎంత మాయే చేశావే

 చరణం:-

**********

 హే 

వూరికి వెళ్ళానని మెసేజ్ చేసి

 కాలేజీకి వచ్చి అబద్దమే ఆడేసి ఆటపట్టిస్తావా

 అపురూపమైనా అందమైన శిల్ప మల్లే నిలచి 

శిలగా నన్నే మార్చావే

అల్పమైన ఈ ప్రాణిలో   

పంచ ప్రాణాలై నిలిచావే


 హే 

 కళ్ళు మూసేస్తాను ఓ వింత చూపుతానే

ఒళ్ళు పులకరించే  ప్రేమ ప్రపంచ చిహ్నం

 తాజ్ మహల్  ఈ రాజా  నీ  ప్రేమ గుర్తుగా

 చూపిస్తున్నానే.

హే

  నీవే  నా మహారాణివి ఎపుడవుతావే

 నీకై నా కలల ప్రపంచంలో  

ఆకాశ సౌధమే నిర్మించానే

 నీ రాకతో అందులో నీ పాదం మోపి 

పునీతుడను చేయ  ఎప్పుడొస్తావే నా మది లోని కోవెలలోకి

 హే

అందాల నా దేవతా

హే

చందనాల సౌందర్యమా

 హే హే

ముగ్ద మందారాల మాధుర్యమా

 హే హే 

హంస నడకల దరహాసమా

 పల్లవి:-

*******

 హే

 ఎంతందంగున్నావే

 హే

 ఎంత మాయే చేసావే...

********************

【🌹నేటి నా పాట🌹  పాట సంఖ్య:-322🌹】******************************************

 రచన:- మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

04/07/2022.

***************

పాట సందర్భంపై నా విశ్లేషణ:-

****************************

ప్రేమలు పెళ్ళిళ్ళలో  క్రమ క్రమంగా   ఆకార్షణ  తగ్గి

ఇగో   పెరుగుతు ఇద్దరు ఉద్యోగం చేస్తు మనస్పర్థల

 తీవ్రత ప్రేమను మరచిపోయి  నిత్య ఘర్షణ తో

 సంసారం సముద్రంలో చిక్కుకున్న నావలా  

మాట ల తూటాలతో

అతుకుల  పంతాలతో తల్లడిల్లుతున్న  యువకుడు

అర్థం చేసుకోమంటు  ఎన్ని అవాంతరాలు వచ్చిన నిను వీడనంటు బ్రతిమాలుతున్న   సందర్భంలో ఈ పాట.


 దాంపత్యం లో ఇద్దరిలో ఇది నా సంసారం అనుకుంటే

ఎంత సమస్య ఐనా  కనురెప్ప పాటులో కరిగిపోతుంది ఇద్దరు ఒక్క మాటపై వుంటే ... అలా కాకుంటే ఇలా ఒకరు ఒకలా మరొకరు ఇంకోలా వుంటే సర్దుకుపోయే

 మనస్తత్వం ఒక్కరిలో వున్నా ఇలా  పరిష్కారం దిశగా

 అడుగులు పడతాయి.. ఇద్దరు ఇద్దరే  నా మాటే 

నెగ్గాలి అంటే మాత్రం  అది నరకం అని వేరే చెప్పాల్సిన పనిలేదు.. ఇక్కడ హీరో మద్యేమార్గం అనుసరించి

 పరిష్కారం వెతుకుతాడు..  చెప్పుడు మాటలు నమ్కకూడదు  అవి అనుమానాలకు దారి తీస్తాయి.

అనుమానం పెనుభూతం..  అది నిరూపణలు ఋజువుల  వరకు రాకూడదు .. నమ్మకమే  జీవితం.

 నమ్మకమే  ఆనందం.

************************************************

 

పల్లవి:-

విడువను నిను విడువను ఎన్నటికి

మరువను  నిను మరువను ఎప్పటికి

కరిగే మేఘంలా కదులుతానంటే ఎలా ప్రియతమా

కదిలే కాలం లా కనుమరుగవుతానంటే ఎలా చెలియా


కరుణే లేదా నీలో  

రుణమే తీరిందనుకుంటున్నావా మనకు 

మౌనం వీడవే 

నా ప్రశ్న కు జవాబు చెప్పవే..


విడువను నిను విడువనే విడువను ఎన్నటికీ

మరువను మరువనే మరువను  ఎప్పటికి...

చరణం:-1

**********

 కాలం నిను నాకు  కాకుండా చేయాలనుకున్నా

 నీకై నీవు వద్దని వెళ్ళాలనుకున్నా

 మనసులో నీతో మనువాడినా నేను ఎప్పుడో

తనువులోని తపనలే ఇక మిగులున్నా‌యిప్పుడు

మరుజన్మ వరకు నిను వీడనీయను


 నెలవంక అలకమానిఃదా రాకుండా

చిలుకమ్మ పలుకనన్నదా ఏనాడైనా

ఎన్ని అడ్డంకులు ఎదురైనా వీడిపోనీయనులే

నీ తోడునీ

 నీ  అలక తీరే మార్గం వెతుకుతానులే

 నీ మౌనం మాటగా మారేదాక వేచి చూస్తానులే..


చరణం:-2

********

బలమైన నా సంకల్పం  బ్రతుకంతా నీతోనేనని

బల్లగుద్ది చెబుతోంది వల్లమాలిన నా ప్రేమ

సడలని నా స్థైర్యం చలించదే  ఎన్ని సుడిగుండాలు 

 ఎన్నిసార్లు ముంచేసినా నీ చేయి నే విడువనే..


అవాంతరాలు  అగ్నిపర్వతాలుగా

మనమద్యనా విస్పోటనమై

బస్మేపటనం చేసినా  చిగురిస్తా నీకై చిగురాకులా

 చినుకై కురిసొస్తా చిరునవ్వులా..

 బిందువు బిందువు  సిందువై నేను  నీకై...

పల్లవి:-

*********

 విడువను నిను విడువనే విడువను

మరువను నిను మరువనే మరువను...

***********************************

 కరీగే మేఘంలా కరుగుతానంటే ఎలా

 【🌹నేటి నా పాట 🌹పాట సంఖ్య:-325🌹 】

*****************************************

రచన- మహేష్ వూటుకూరి :-✍️

9640713717

.దోర్నాల.

07/07/2022.

****************

 పాట సందర్భంపై నా విశ్లేషణ.

****************************

 చిన్న నాటి పరిచయం పెద్దల అంగీకారం

 అణువణువు ప్రేమ మదినిండా ఆనందం

 పెళ్ళి వైభవమై  ఒకరికొకరు సొంతమై

 ఆశల కోరికల తీరు శుభ సమయం

అడ్డు అదుపులేని ఆనంద ప్రవాహం ముంచెత్తగా 

ఓ నవ  జంట తమకపు విరహపు ఆరాటం పాట రూపమై

 ప్రశంసల హోరులో ప్రభవించి రవళించిన పాట.

*******************************************

 పల్లవి:-

**********

నీ పెదవుల తియ్యదనం

సముద్రమంత అమృత మకరందం

 నీ కౌగిళి కమ్మదనం

జుంటి తేనే ధారల మధురం మధురం


 ఆత్రేయ పురి పూతరేకులా

పలుచటి పరదాల మిసిమిసి అందానివే

హర్యానా జిలేబిలా నోరూరించే

నవ యవ్వన లావణ్యం నీ సొంతమే..


అవి  అన్నీ నాకే సొంతమైనాక

నేనైనా ఆనంద తీరం

పొంగెలే నాలోనా పరమానంద తన్మయత్వం

చూపిందిలే  మన స్వర్గాల సంగమం...


 నీ పెదవుల తియ్యదనం

 సముద్ర మంత అమృత మకరందం

 చరణం:-

**********

 పువ్వులన్ని పుప్పొడుల నవ్వులే రువ్వగా

 తుమ్మెదల ఆశలే హాయిగా తీరగా

 మల్లెలెన్నో చప్పుడే చేయగా

గుప్పుమంటు నా  గుండె కవాటమే కళ్ళు తెరవగా


 ఆనందాల సీమకై జంటగా గంట కొట్టి సాగగా

 పురివిప్పిన మయూరమై   నీవు ఆడగా

 నా చురుకుదనం ఓరగా చూసి

 ముసిముసిగా నవ్వుతు ముందుకే సాగగా..


సరసాల సాగరాల గట్టుకాడ

ముద్దు ముచ్చట్ల విందులై 

హద్దులు దాటిన కోడె వయసుకు

కోనసీమ కొబ్బరి  లేత సొగసు జున్ను లా దొరికే..

పల్లవి:-

******

నీ పెదవుల తియ్యదనం

సముద్రమంత అమృత మకరందం

నీ కౌగిలి కమ్మదనం

జుంటి తేనెల ధారలా మధురం మధురం..

 చరణం :-

***********

ఇంద్ర ధనస్సునే తుంచు కొచ్చా

తాళిగా చేసి కట్టి వేద్దామని

నక్షత్రాలనే కోసుకొచ్చా  

తలంబ్రాలుగా పోసుకుందామని

సూర్యుడిని వేడుకోగా  అగ్నిసాక్షిగా

అరుదెంచి ఆశీర్వదిద్దామని


ప్రకృతి ఒడిలో  

కొత్త జీవితం చిగురించగా

జన్మ జన్మల సుకృతం 

పొందెనే ఆనందం ఈదినం మన మది...


నీ ఒడి  సరసాల రాబడి

ఆ బడి  సంతాన సాఫల్య మడి 

వేడి వేడి  రాపిడి  సెగలే  చేరగా

గుసగుస సందడి 

ముసిముసి నవ్వుల లాహిరి పాడుతు

వయ్యారంగా  వచ్చిందే నా చెలి  ప్రియ మాధురీ..

పల్లవి:-

******

 నీ పెదవుల తియ్యదనం

సముద్ర మంత అమృత మకరందం.

*******************************

***************************

【🌹నేటి నా పాట 🌹పాట సంఖ్య. 327🌹】

*****************************************

 రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717.

 దోర్నాల.

 09/07/2022.

*******************

పాట సంధర్భం పై నా విశ్లేషణ.

 మనిషి జీవితం సుఖ దుఃఖాల నిలయం

కొందరిని మెప్పించడం కోసం

 మనస్సాక్షి ని  నొప్పించి కాలానికి వదిలేసిన బాధ

మానని గాయంగా మిగిలున్నా పైకి  ఎంతో నటనను

 పులుముకొని నెట్టుకొస్తు కాస్త వున్నవి లేనివి

 తగిలించుకొని తనువును మనసును నెట్టుకొస్తు

 సమాజంలో తక్కువ కాకూడదనే భావజాలంలో లేని హుషారును   చూపుతు ఓ మద్య తరగతి ఒంటరి మనిషి నలుగురిలో కలిసి  తనను తాను సమర్దించుకుంటు ఓ సంధర్భంలో  తన మనసులోని

 బాధను వదిలేసుకున్న అవకాశాలు అన్నింటిని

 మనోగతాన్ని పాట రూపంగా పాడుతున్న ఈ పాట.

**********************************************

 

శీర్షిక:- జబర్దస్తిరా నా జీవితం.

***************************

 పల్లవి:-

*********

 జాం జాం జాం జాం జాం


 జబర్దస్తీరా ఈ నా జీవితమని

 జబ్బచరిచి చెబుతున్నా

కుస్తీలు పట్టిన ఈ బాడీ

 వస్తాదునే చేసింది..


 వయసు పెరిగిన

 మనసు హుషారుగా జోరు మీదుందీ

ముద్దుగుమ్మలే ముచ్చట పడేలా 

పొద్దు పొడిచిన  ఉల్లాసం నాలో ఉరకలేస్తోంది..


సద్దికూడు తిన్న

సత్తెకాలం సత్తయ్య ను

ముద్ద పప్పు లొట్ట లేసుకు తిన్న 

ముత్తయ్య ను నేను

మటన్ చికన్ ముట్టని  మడి ఆచారాల  

నాంచారయ్యను నేను ..


 ఏమున్నా లెకున్నా  

గంజి తాగి మీసం మెలేసిన 

కొమరయ్యను నేను

ఎన్నో అవతారాలు ఎత్తిన 

దశవతారయ్యను నేను..


 లా లలలా లాలలా లలలా లాలాలలా లలలాలా

జబర్దస్తిరా నా ఈ జీవితం.

జబ్బ చరిచి చెబుతున్నాను రా

 చరణం:-1

**********

 కీరవాణి రాగాన్ని కీరదోసలా  తినేశా

ఆనంద భైరవి రాగాన్ని అప్పడంలా నమిలేశా

హంసద్వని రాగాన్ని హల్వాలా లాగించేశా

గాందార రాగాన్ని గారెలలో కలిపి స్వాహాచేశా..


 ఎన్నెన్నో నేర్చిన అరవై నాలుగు కళలలో

 ఆరితేరినా అందుకే  అందందుకే

 ముద్దుగుమ్మలు ముద్దు ముద్దుగుమ్మలు

ముద్దులతో ముంచెత్తుతారు నన్ను...

పల్లవి:-

*****

జబర్దస్తిరా ఈ నా జీవితమని

జబ్బచరిచి చెబుతున్నా..

 చరణం:-2

********

కష్ట నష్టాలు కావిళ్ళతో మోసినా

ఇష్టాఇష్టాలన్ని దండెం మీద ఆరవేసినా

కన్నె మనసు దోచినా

అమ్మ వద్దంటే మానేసినా

తట్టుకోలేక ఉన్న ఊరు వదిలేసి 

దేశదిమ్మరిగా తిరిగినా


ఎన్నో అనుభవాల గని ని 

అన్ని వద్దనుకొని

మీతోకలిసి హాయిగా జీవిస్తున్నా ముని ని

ఎవరు లేని ఏకాకి సన్యాసిని

 మీలా అందరు వచ్చి నన్ను చేసారు

 ఆనందాల విహారిని..


 జాం జాం జాం జాం  జాం జాం

 పల్లవి:-

****** 

జబర్దస్తిరా నా ఈ జీవితమని 

జబ్బచరిచి చెబుతున్నా....

**********************

【🌹నేటి నా పాట 🌹పాట సంఖ్య328🌹】

****************************************

రచన:- మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల

10/07/2022.

*************

పాట సందర్భంపై  నా విశ్లేషణ.

****************************

 మనలో ఉంటు మనలను ఆడిస్తు మనచుట్టు

 వైఫై కంటే వేల రెట్లు అధికంగా చుట్టుముట్టి మనలను

మట్టుబెడుతున్నది ఆబద్దం.. మనల్ని మనం గమనించక స్ప్రహలో లేక గమనించక గుడ్డిగా అవకాశ వాదంతో

అనుసరిస్తు అనుకరిస్తు బుద్ది గాడితప్పి చేస్తున్న గారడితో  మానవ నైజాన్ని  బ్రష్టుపట్టించింది

ఈ ఆబద్దం అనుక్షణం ఏ అవసరమైన  అబద్దాలను

ఆశ్రయించి పబ్బం గడుపుకుంటే చాలునని

 అబద్దాల చట్రంలో కి చేరి పోయి  జీవితం నాటకమైంది.

 అలా చిన్న అవసరం కోసం అబద్దం  పంచన చేరి వంచనకు కేరాఫ్ అడ్రస్ గా మారి బూటకం ముసుగులో

 ఓ మనిషి వ్యవస్థకే  సవాలు విసిరి మతం మత్తు చల్లి

 సర్వ సంగపరిత్యాగిలా  అవతారమెత్తి

 అబద్దాల మాయాజాలం లో చేస్తున్న అకృత్యాలను

 బద్దలుకొట్టి బయటపెట్టిన ఓ నిజాయితీ పరుడి ప్రశ్న ల బాణాలే ఈ పాట.....

 ********************************************

 పల్లవి:-

*******

అబద్దమా ఇదే  నీ వినాశక విశ్వరూపం

అబద్దమా ఇదే నీ నయ వంచన  నట జీవితం

అబద్దమా ఇదే  నీ కుట్రల కుతంత్రాల ధనార్జన మోసాల సామ్రాజ్యం

అబద్దమా ఇదే నీ   అవినీతి అక్రమాల చెర బట్టిన అరాచకాల పైశాచీక ప్రపంచం..


వికృత తత్వమే నీ ఆకృతీ

విశృలంకమే నీ ప్రాకారమై

అపశృతే నీ అహంకారమై

అప ప్రద  ఆపాదించడమే నీ నైజమై

 సంఘ విద్రోహక దుష్టపన్నాగ దాష్టికమై

ఓ అబద్దమా  సంఘ వినాశనకర రూపమా

చేస్తున్న మారణ హోమానికి కోకొల్లల ఈ సాక్ష్యాలు


అబద్దమా ఇదే నీ విశ్వరూపం

అబద్దమా ఇదే నీ నట జీవితం.

చరణం:-1

మానవ నైజం సమాది చేసి

నవ నిర్మాణం ఆయువు తీసి

చెలరేగుతున్న చితి మంటవు

కలతల కథను రచించి 

పడతుల పరువును తీసి

పడిపడి నవ్వుతున్నావా...


నవ్వరా నవ్వు అబద్దాల నవ్వు నవ్వరా..

నవ్వరా నవ్వు అనర్దాలను అక్కున చేర్ఛుకొని

పడిపడి నవ్వరా...

స్వార్థం పైశాచికత్వమై  సన్నాసి రూపంలో

 సన్నాయి నొక్కులు నొక్కుతు

 తప్పుడు పనులు చేస్తున్న కుక్కవి

 విశ్వాసం లేని కుక్కవి..

 అబద్దమా ఇదే  నీ విశ్లరూపం

పల్లవి:-

*******

అబద్దమా ఇ(దా)దే నీ విశ్వ రూపం

అబద్దమా ఇదే నీ నట జీవితం..

చరణం:-

*******

వికృతత్వమే నీ ఆకృతై

విద్వంసానికే సృష్టికర్తవై

ప్రళయాన్నే సృష్టించినావు

ప్రపంచాన్ని మాయల

మతం మత్తులో ముంచేసి

మాయలు చేస్తున్న మోసగాడివి

 అబద్దాల పుట్టవు అనర్దాల గుట్టవు...


ఏ నక్షత్రాన  నీ జననం  ఉధ్భవించిందో

ఆ క్షణమే ధరిత్రి పై శోకం కళ్ళు తెరిచింది

ఏ లక్షణాలు నీ కున్నాయో  ఆ మనిషి  దగ్గర

నమ్మకమే  నడిబజారులో  అమ్మేసినాడు.


క్రూరత్వమే కాపురమై ఇంటినే నరక కూపం చేస్తు

నర రూప రాక్షసులై వంచన ఒడిలో బంధం మరచి

 రాబంధులుగ మారి పొడిచి పొడిచి  హింసకు పరికాష్టగా

నర్తిస్తున్నా నీ నైజం పాశవికం పైశాచికత్వం

భరిస్తున్న స్త్రీ మూర్తులకు వందనాలు.

మీకు వేస్తాను శిక్షగా భయంకర దండనాలు..

పల్లవి:-

******* 

 అబద్దమా ఇదే నీ వినాశక విశ్వ రూపం.

అబద్దమా ఇదే నయవంచన నట జీవితం.

**************************************