Wednesday 22 August 2018




ప్రధానమైన గీతం...
-----------------
మూలం... అహో ఆంద్ర భోజా
చిత్రం.. మంచిమనసులు
--------------------------
అహో సత్తి రాజా .... శ్రీ బాపు నామ ధేయా... మమ్మొదిలి యాడకీ పోలేవయా.... ఈ జగతిలో... నువ్వె...నిలిచేవయా...
ప. తెలుగుకే వన్నెలను అద్దినావూ మన జాతికే గర్వకారకుడవైనావు....తెలుగుకే.....
చ 1. ఈ వైపు ఒక బొమ్మ ఆ వైపు బొమ్మొకటి ఏ వైపు చూసినా నీ బొమ్మలేగా.... మనసునే మరిపించు మరువ లేమే బొమ్మ ఇటువంటి బొమ్మలూ ఇక ముందు రావూ....తెలుగుకే...
చ 2. సీగాన పెసునాంబ బుడుగులే పిడుగులూ బాబాయి, గోపాయి బామ్మలే బెటరూ లావింటి పిన్నినీ జెడల సీతను బట్టి నీ చేతితో మలచి ఇంకెట్ట యెళతావు...తెలుగుకే....
చ 3. రాత రాదని మాకు బాధయే లేదూ మా బాపు ఫాంటులే మాకెన్నొ నేర్పూ రామ రాజ్యములోన సాక్షితో పని యేల బుద్ధి మంతుల మగుదు దీవించవోయీ...తెలుగుకే ....
===============================
మామూలు... గీతాలు...
---------------------
1. మూలం... పాడమని నన్నడగ వలెనా... చిత్రం... డాక్టర్ చక్రవర్తి ------------------------------ ప. రాయమని నన్నడుగ వలెనా నాకు నేనై రాయనా...... మిత్రా.... నాకు నేనై రాయనా...
చ 1.జనము గోడే పట్టదెవరికి స్వార్థమొక్కటె పెచ్చరిల్లిన స్థితిగతులకే తల్లడిల్లుచు నేను పాటలె రాయనా....రాయమని...
చ 2. అన్ని రంగములొక్కలెక్కయి ఏది స్వచ్ఛము కాదు కాదని తేలిపోవగ, మనసు మండగ కఠిన పదములె వాడనా .... రాయమని ...
చ 3. అక్కడక్కడ మినుకుమంటూ మంచి కొంతయె మిగిలి యుండే అదియె మనసుకు చాలుననుకుని అదియె స్ఫూర్తిగ తలపు నిడుకుని కవితలిట్లే రాయనా... రాయమని ...
రాయమని నన్నడుగ వలెనా నాకు నేనై రాయనా...... మిత్రా.... నాకు నేనై రాయనా...
-----------------------------------
2. మూలం... అహో ఆంధ్ర బోజా... చిత్రం. మంచి మనసులు --------------------------------- అహో ఆంగ్ల భోజా .... శ్రీ తెలుగు పాత్రికేయా... దారిడిచి దూరాన సాగేవయా.... ఈ పత్రికలలో... బాస...చిదిమేరయా...
ప. తెలుగుకే పత్రికల శృంఖలాలూ నా తల్లి బాసకే పనికిమాలిన గట్లు ....తెలుగుకే.....
చ 1. ఒక వైపు ఆంగ్లానికే పెద్ద పీట ఈ వైపు అమ్మపై చిన్న చూపేంటో అడిగితే అంటారు " అయితే ఏంటంట " ఇటువంటి పెద్దలతొనే గద తంటా....తెలుగుకే...
చ 2. "వాకు", "టాకు", "క్యూ లు .. వై" పదాలకె రూలు ఋణము, గుఱ్ఱము పోతె దుఃఖమొస్తోందంటె లైటు తీస్కోమనుట సరికాదు యని జెపితె రుస రుసా బుస బుసా.... అయ్యొ నా బాసా...తెలుగుకే....
చ 3. వర్ణమేదని మీరు వాదించ వలదూ ఈ పరికరమ్ములో మీట వాడితే చాలు కాదు, ఎవరో పెద్దలేమొ చెప్పారంటూ వీరాభిమానులా విజృంభణాలూ....తెలుగుకే ....
చ 4. జె, జడ్డు, ఎస్యీ ల వాడకం తెలుసూ బ్రౌను వర్ణాలేన కంటిలో నలుసూ ?! మీ పత్రికలు చూసి వాహికలునూ నేర్చి బాస నింకింతగా బాది వదిలేస్తుండె.....తెలుగుకే...
అడిగితే అంటారు " అయితే ఏంటంట" ఈ పత్రికా పండితులతొనె తంటా....
తెలుగుకే పత్రికల శృంఖలాలూ నా తల్లి బాసకే పనికిమాలిన గట్లు...తెలుగుకే...
-------------------------------------------------------
3. మూలం... కోడి ఒకా కోనలో... పుంజు ఒకా కోనలో... చిత్రం.. లెత మనసులు...(పాతదే) ---------------------- ప. డాడి ఫేసుబుక్కులో మమ్మీ లేడీస్ క్లబ్బులో ( లేదా కిచెన్ వర్కులో..) పిల్లలేమొ తోడు లేక ఏదో చానల్ మాయలో.....\\డాడీ//
చ 1. కవ్వు, క్రోలు, స్పారోలు బొమ్మలేమొ తెలుసునూ కోకిలమ్మ గొంతు ఎపుడు మేము విననె లేదులే... గ్రానీ చెప్పవా చాచీ చూపవా గ్రానీ చెప్పవా చాచీ చూపవా నేచరునె మాకు ఎపుడు లైవు కాస్టు చేయరా లైవు ... కాస్టు ... సేయరా ......\\డాడీ//
చ 2. తెలుగు వాళ్ళ కిడ్స్ మేము అ ఆ లే రావులే భాష తెలుసుగాని మేము ఓ న మాలె దిద్దలే.. అమ్మా చెప్పవేం ... నాన్నా నేర్పరేం మీకు వీలు కాకుంటే తాతయ్యలె రావాలీ అమ్మమ్మ , బామ్మ నేర్పాలీ.....
డాడి ఫేసుబుక్కులో మమ్మీ లేడీస్ క్లబ్బులో ( లేదా కిచెన్ వర్కులో..) పిల్లలేమొ తోడు లేక ఏదో చానల్ మాయలో....
-------------------------------
4. మూలం ... చేతిలో చెయ్యేసి చెప్పు బావా... చిత్రం... దసరా బుల్లోడు -------------------------------- ప. చేతిలో చెయ్యేసి చెప్పు నేతా .... మద్యం ఇక వద్దనీ, చట్టం తెస్తాననీ ... చేతిలో ...
చ 1. పాత కాలపలవాట్లూ ... పాతరేసి ఊరుకో ఇకనైనా సంఘంలో ... ప్రజ శ్రేయసె కోరుకో... చేతిలో ...
చ 2. మద్యం మాన్పించినా .... ముప్పు లేదు తెలుసుకో ఆ డబ్బే పోయినా .... జబ్బుండదు మేలుకో .... చేతిలో ...
చ 3. మాట వినక పోతివా .... మంచిగుండదిక నీకూ ... తిరిగి ఎన్నికొస్తాదీ .... నీ గెలుపు ఒట్టిదే యినుకో ....
చేతిలో చెయ్యేసి చెప్పు నేతా .... మద్యం ఇక వద్దనీ, చట్టం తెస్తాననీ ... చేతిలో ...
---------------------------------------
5. మూలం... అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే... చిత్రం... బాబూ మూవీస్ వారి తేనె మనసులు ----------------------------------------------------------- ప. శతాబ్దిగా .... సంఘమంత కలుషితంబె ఆయెనే అదేమిటో ... స్వార్థమొకటె రాజ్యమేలుచుండెలే .... శతాబ్దిగా...
చ 1. నువ్వూ, నీకు యనే ఒక నాటీ మంచి లక్షణాలూ కాల మహిమ పేరుతోనె కాలరాచినారూ... ఎవరో ఒకరన్నారని అదే సంప్రదాయ మనీ అయిన వారినెవ్వరినీ ఆదరించడము లేదే.....శతాబ్దిగా....
చ 2. పెరుగుతున్న ఆశ్రమాలె, పెంచుతుండె ప్రమాదాలు అయినా మనవారిలోనె కలగదదేం స్పందనా కాలం మారిందంటారు, సంఘం మారిందంటారు మార లేదు మారలేదు ఏనాటీ బందాలూ మన పేగు సంబందాలూ.... శతాబ్దిగా ....
చ 3. పెద్దలపై గౌరవాలు, వీరి పట్ల బాధ్యతలూ ఏనాటికి తెలియును యీ తండ్రులకూ, తల్లులకూ తెలియజెప్పు వారేరీ తెలిపితె విను వారేరీ..... అను బావం పోవాలీ మారాలిక మనవారే ....
శతాబ్దిగా .... సంఘమంత కలుషితంబె ఆయెనే అదేమిటో ... స్వార్థమొకటె రాజ్యమేలుచుండెలే .... శతాబ్దిగా....
------------------------------------------------------------
6. మూలం... నందామయా గురుడ నందామయా... చిత్రం... వాహిని వారి పెద్దమనుషులు ------------------------------------------------- ప. విందామయా తెలుసుకుందామయా తర తరమ్ముల మేలు పొందాలయా...
చ 1. తాతయ్య, బామ్మలే ఉండాలయా అమ్మమ్మ, తాతైన ఫర్లేదయా మనకు పిల్లలు ఎట్లొ పెద్దలకు మనమట్లె గౌరవముతో ఆదరించాలయా ... విందామయా ...
చ 2. మనము బైటకు పోతె వారె ఇంట్లో ఉండి పిల్లకు బుద్ధులూ చెపుతారయా మగ పిల్లలకు తాత, అమ్మాయికీ బామ్మ లేద అమ్మమ్మైన నేర్పేనయా ... విందామయా ...
చ 3. పెద్దలింట్లో ఉంటే ముప్పు లేదనవచ్చు మనసుకే రుగ్మతా రాబోదయా అడుగడుగు వైద్యులతొ అవసరమ్మే రాదు వంటింటి చిట్కాలె వదిలించు జలుబూ ...విందామయా ...
విందామయా తెలుసుకుందామయా తర తరమ్ముల మేలు పొందాలయా...
---------------------------------------------
7. తెలుగు వీర లేవరా....(అల్లూరి సీతారామ రాజు) -------------------------------------------------------------- ప. భరత పుత్రి కదలుమా ... నీకు నీవె రక్షమా సాహసించి సమస్యలూ ఛేదించుట నేర్వుమా..... భరత పుత్రి ...
చ 1. ఎవడు వాడు, ఎందుకైన, నీ జోలికి వస్తె చూడు తరిమి తరిమి గొట్టుమా, తగిన శాస్తి చేయుమా ..... భరత పుత్రి ..
చ 2. చట్టాలే కావు మనకు చుట్టాలని గ్రహియించీ ప్రతి యువతీ ఝాన్సీకీ, రుద్రమకే సుతయై అరచేతినె చుర కత్తిగ పైకెత్తాలీ..... దుండగీడు పని తానే చూస్కోవాలీ..... భరత పుత్రి ...
చ 3. " చట్టాలను మార్చాలీ, బెయిళ్ళు రద్దు చేయాలీ" అంటూ నువు నినదిస్తూ ఇలనే కదిలించేస్తూ అడుగేయాలీ... ప్రతినిధులను కడిగేయాలీ....
భరత పుత్రి కదలుమా ... నీకు నీవె రక్షమా సాహసించి సమస్యలూ ఛేదించుట నేర్వుమా..... భరత పుత్రి ...
------------------------------------------------------------------------
8. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా...(సాక్షి) ------------------------------------------------------------ ప. లోకమంత మెచ్చగా, కన్న కడుపు నిండగా పురుషుడా తెలుసుకో మసలుకో.... నీకు నీ నడతే ఎప్పుడూ రక్షరా....రక్షరా...లోకమంత మెచ్చగా...
చ.1. ధర్మ పథం దాటి నీవు పోకురా అర్థానికి నీ యర్థమె వేరురా కామమంటె నీ భాష్యం తప్పురా ... మోక్షమంటె చావేమీ కాదురా... కాదురా... లోకమంత ...
చ 2. అమ్మ వయసు వారంతా తల్లులేరా ఆలి కాకపోతె చెల్లెలగునురా అమ్మాయిల జోలికెపుడు పోకురా.... గిరి దాటితె నీ భవితకె ముప్పురా... ముప్పురా... లోకమంత ...
చ 3. ఆలికె నువు అమ్మ, నాన్న నిజమురా గురువు, దాత, దైవమన్న నీవెరా విద్య నేర్పి, పురుషుడుగా నిలువురా నీ పౌరుషమ్మె కొట్టుటలో కాదురా...కాదురా...
లోకమంత మెచ్చగా, కన్న కడుపు నిండగా పురుషుడా తెలుసుకో మసలుకో.... నీకు నీ నడతే ఎప్పుడూ రక్షరా....రక్షరా...
------------------------------------------------
9. పిల్లలూ, దేవుడూ చల్లనివారే...
చిత్రం ... లేతమనసులు (పాతదే)
------------------------------------------------------------
ప. ఎండలూ ముదిరితే కష్టమె మనకూ
చెట్లనేవి లేకుంటె చేటు ఇదేలే ....
చల్లని నీడిచ్చుటే చెట్లకు నైజం
అది తెలుసుకునీ పెంచాలి మొక్కలు మనము ... ఎండలూ ...
చ 1. పెరుగుతున్న మొక్కలకూ నీరు కావలే
నీరు పోసేసి ఊరుకుంటె ఎదగలేవులే
ఎరువు వేసి సాకినపుడె మొక్క ఎదుగులే
అల ఎదిగినపుడె మనకు చాల మేలు చేయులే ... ఎండలూ ...
చ 2. మొక్క నెపుడు పిల్లలతో పోల్చవలయునూ
సామెతదే మనకెపుడూ నేర్పుచుండునూ
వాలినట్టి మొక్కకే సపోర్టు పెట్టితే
నేర్చినట్టి పిల్లల్లా ఎదగ సాగునూ.... ఎండలూ ...
చ 3. పెరిగి పెరిగి మొక్కలే మ్రానులగునులే
ఆ చెట్లే మనకు గాలి నీడ ఫలములూ
ఇచ్చి తుపానులను కూడ అడ్డుకొనునులే
మొత్తానికి చెట్లన్నీ మేలు చేయులే....ఎండలూ...
ఎండలూ ముదిరితే కష్టమె మనకూ
చెట్లనేవి లేకుంటె చేటు ఇదేలే ...ఎండలూ...
-------------------------------------------------------
10. మూలం ... పాడుతా తీయగా చల్లగా...
చిత్రం ... మూగమనసులు...
-------------------------------
ప. అల్లుతా పద్యమూ పిచ్చగా నువు కొనుక్కో స్పేరు డ్రస్సులెన్నెనో... యెన్నెనో...
చ..1. కోపమొస్తె పద్యమొకటె మార్గమవుతదీ చందసొస్తే పదాలన్ని ఆయుధాలులే ప్రాస యతులె పగవారిని పట్టగలవుగా ఆ గణమె లేకపోతె లెక్క సెయరూ....అల్లుతా...
2చ . రాసినోల్లు అందరూ రాచ్చసులా సదవనోళ్లె సక్కనీ స్నేహితులా రాయకుంటె నాకు యేమి తోచి చావదూ నువు సదవకుంటె నూనెట్టా కర్చు అవుతదీ ...అల్లుతా...
చ 3. సూత్రమేమి తెలియకుంటె నష్టమేమిటీ సవ్యంగా రాసుకుంటె గొప్ప యేమిటీ తోచి నట్లు రాసుకుంటె నవ్వలొస్తవీ ఆ నవ్వులతో ఈ కూటమి యెలిగిపోతదీ...
ప. అల్లుతా పద్యమూ పిచ్చగా నువు కొనుక్కో స్పేరు డ్రస్సులెన్నెనో... యెన్నెనో...
-------------------------------------------------------------





గోపాల కృష్ణలీల -1  (సితార సినమాపాట రి .మిక్స్) 

తననననన తననననన... 
తననననన తననననన... 
తననననన తననననన... తననననన 

చమకు చమకు జింజిన జింజిన.. 
చమకు చమకు జిన్న జిన్న జిన్న.. 
బాల కృష్ణుడు వచ్చాడమ్మా వెన్నెలను తెచ్చాడమ్మా  
జమకు జమకు జింజిన జింజిన.. 
జమకు జమకు జిన్న జిన్న జిన్న.. 
బాల కృష్ణుడు వచ్చాడమ్మా వెన్నెలను తెచ్చాడమ్మా 
యసోదమ్మ పిలుపై ... అది విరుల తేనెచినుకై.. 
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై.. 

పచ్చని చేలా.. తనననన.. 
గోచి గుడ్డ కట్టి .. తనననన 
పచ్చని చేలా.. .. 
నెమలి పించము కొప్పునబెట్టి 
వచ్చేముద్దు కృష్ణా .. మా వన్నెల నవ్వుల కృష్ణా  

బాల కృష్ణుడు వచ్చాడమ్మా వెన్నెలను తెచ్చాడమ్మా 
బాల కృష్ణుడు వచ్చాడమ్మా వెన్నెలను తెచ్చాడమ్మా 

చరణం 1 : 

ఎండల అంటే సోకని కృష్ణా . పల్లెకు కృష్ణా  పల్లవ పాణి.. 
కోటను విడిచీ.. పేటను విడిచీ.. 
కోటను విడిచీ.. పేటను విడిచీ.. 

కనులా గంగా పొంగే వేళ.. నదిలా తానే సాగే వేళ.. 
రాగా రాదారి పూదారి ఔతుంటే.. 
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే.. 
బాల కృష్ణుడు వచ్చాడమ్మా వెన్నెలను తెచ్చాడమ్మా 
బాల కృష్ణుడు వచ్చాడమ్మా వెన్నెలను తెచ్చాడమ్మా 

చరణం 2 : 

మాగాణమ్మా చీరలు నేసే.. మలిసందెమ్మ కుంకుమ పూసే.. 
మువ్వలబొమ్మా.... ముద్దులగుమ్మా.. 
మువ్వలబొమ్మా.... ముద్దులగుమ్మా.. 

గడపా దాటి నడిచే వేళ.. 
అదుపే విడిచీ ఎగిరే వేళ.. 
వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే.. 
ఈ వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే 
బాల కృష్ణుడు వచ్చాడమ్మా వెన్నెలను తెచ్చాడమ్మా 
బాల కృష్ణుడు వచ్చాడమ్మా వెన్నెలను తెచ్చాడమ్మా 
యసోదమ్మ పిలుపై ... అది విరుల తేనెచినుకై.. 
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై.. 

పచ్చని చేలా.. తనననన.. 
గోచి గుడ్డ కట్టి .. తనననన 
పచ్చని చేలా.. .. 
నెమలి పించము కొప్పునబెట్టి 
వచ్చేముద్దు కృష్ణా .. మా వన్నెల నవ్వుల కృష్ణా  

 --((**))--


తెలుగువాడి ఆహార పుష్టి ౹౹ 
🙏🙏💐💐🙏🙏 
మినపట్టు 
పెసరట్టు 
రవ్వట్టు 
పేపర్ దోసె 
మసాల దోసె 
ఉల్లి దోసె 
కొబ్బరి అట్టు 
గోధుమ అట్టు 
అటుకుల అట్టు 
సగ్గుబియ్యం అట్టు 
బియ్యపు పిండి అట్లు 
పుల్లట్టు 
ఊతప్పం 
పులి బొంగరం 
ఉప్మా అట్టు 
రాగి దోసె 
చీజ్ పాలక్ దోసె 
ఇడ్లీ 
మసాల ఇడ్లీ 
రవ్వ ఇడ్లీ 
ఆవిరి కుడుము 
సాంబారు ఇడ్లి 
బొంబాయి రవ్వ ఉప్మా 
గోధుమ రవ్వ ఉప్మా 
సేమ్యా ఉప్మా 
టమోటా బాత్ 
ఇడ్లీ ఉప్మా 
బియ్యపు రవ్వ ఉప్మా 
నూకలుప్మా 
మరమరాల ఉప్మా 
కొబ్బరి ఉప్మా 
ఉప్పిడి పిండి 
పూరి 
చపాతి 
వడ 
సాంబారు వడ 
పప్పు పొంగలి 
కంచి పులిహోర 
నిమ్మ పులిహోర 
కొబ్బరి అన్నం 
పుదీనా పులావ్ 
బిర్యాని 
దధ్యోదనం 
చక్రపొంగలి 
కట్టుపొంగలి 
వెజ్ ఫ్రైడ్ రైస్ 
జీరా రైస్ 
పులగం 
ఉల్లిపాయ చట్నీ 
ఎండుమిరపకాయ చట్నీ 
కొబ్బరి చట్నీ 
మినప చట్నీ 
వేరుశనగపప్పు చట్నీ 
శనగపప్పు చట్నీ 
శనగపిండి చట్నీ (బొంబాయిచట్నీ) 
శనగపప్పు పొడి 
ధనియాల పొడి 
కొబ్బరి పొడి 
వెల్లుల్లిపాయ కారప్పొడి 
కరివేపాకు పొడి 
కందిపొడి 
మునగాకు చట్నీ 
గుమ్మడి చట్నీ 
అటుకుల పులిహార 
చింతపండు పులిహార 
నిమ్మకాయ పులిహార 
మామిడికాయ పులిహార 
రవ్వ పులిహార 
సేమ్యా పులిహార 
ఆలు పరోట 
చపాతి 
పరోట 
పుల్కా 
పూరి 
రుమాల్ రోటీ 
కాలీఫ్లవర్ పరోటాలు 
పాలక్ పన్నీర్ 
కొత్తరకం పూరీలు 
ముద్దపప్పు 
దోసకాయ పప్పు 
బీరకాయ పప్పు 
టమోటా పప్పు 
మామిడి కాయ పప్పు 
తోటకూర పప్పు 
గుమ్మడి పప్పు 
చింత చిగురు పప్పు 
కంది పచ్చడి 
కొబ్బరి పచ్చడి 
క్యాబేజి పచ్చడి 
క్యారెట్ పచ్చడి 
దొండకాయ పచ్చడి 
దోసకాయ పచ్చడి 
బీరకాయ తొక్కు పచ్చడి 
బెండకాయ పచ్చడి 
మామిడికాయ పచ్చడి 
వంకాయ పచ్చడి 
వెలక్కాయ పచ్చడి 
టమోటా పచ్చడి 
మెంతికూర పచ్చడి 
పొట్లకాయ పెరుగు పచ్చడి 
బీరకాయ పచ్చడి 
సాంబారు 
సాంబారు పొడి 
పులుసు (తీపి) 
పొట్ల కాయ పులుసు 
సొరకాయ పులుసు 
మజ్జిగ పులుసు 
పప్పు పులుసు 
ఉల్లిపాయ పకోడి 
క్యాబేజి పకోడి 
గోధుమ పిండి పకోడి 
పాలక్ - పకోడి (పాలకూర పకోడి) 
బియ్యపు పిండి పకోడి 
మసాల పకోడి 
మెత్తటి పకోడి 
బ్రెడ్ పకోడి 
పల్లీ పకోడీలు 
సేమ్యా పకోడి 
కాలీఫ్లవర్‌ పకోడి 
ఆలూ పకోడి 
ఖాండ్వీ 
అటుకుల పోణీ 
అప్పడం బజ్జి 
అరిటికాయ బజ్జి 
ఉల్లిపాయ బజ్జి 
టమటా బజ్జి 
బంగాళదుంప బజ్జి 
బీరకాయ బజ్జి 
బ్రెడ్ బజ్జి 
మిరపకాయ బజ్జి 
వంకాయ బజ్జి 
క్యాప్సికమ్ బజ్జి 
కొర్ర బజ్జీ 
గుమ్మడికాయ బజ్జీలు 
దోసకాయ బజ్జి 
గుంట పునుగులు 
పునుగులు 
మైసూర్ బోండ 
సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు) 
మసాల గారె 
నేతి గారె 
పప్పు వడ 
మసాల వడ 
వెజిటబుల్ వడ 
పెసర గారెలు 
మినపచెక్క వడలు 
సగ్గుబియ్యం బోండా 
బఠాణీ బోండా 
పచ్చి బఠానీ బోండాలు 
మామిడి అల్లం పచ్చడి(అల్లంపచ్చడి) 
ఉసిరి ఆవకాయ 
ఉసిరికాయ పచ్చడి 
కాకరకాయ పచ్చడి 
కొత్తిమీర పచ్చడి 
గోంగూర పచ్చడి 
చింతకాయ పచ్చడి 
టమోటా పచ్చడి 
దబ్బకాయ ఊరగాయ 
పండు మిరపకాయల పచ్చడి 
మామిడికాయ ఆవకాయ 
మామిడికాయ తురుంపచ్చడి 
మామిడికాయ (మాగాయ) 
ముక్కల పచ్చడి 
మునక్కాయ ఆవకాయ 
పెసర ఆవకాయ 
కాలీఫ్లవర్ పచ్చడి 
చిలగడదుంపల పచ్చడి 
క్యాబేజీ ఊరగాయ 
వంకాయ పచ్చడి 
నిమ్మకాయ ఊరగాయ 
వెల్లుల్లి పచ్చడి 
కాజాలు 
బూంది 
చక్రాలు 
కారప్పూస 
చెగోడి 
చెక్కలు 
తపాళ చెక్కలు 
పెసర చెక్కలు 
చెక్క పకోడి 
పెరుగు చక్రాలు 
సగ్గుబియ్యం చక్రాలు 
శనగపప్పు చక్రాలు 
వాంపూస 
గవ్వలు 
ఆలూ చిప్స్ 
బనానా చిప్స్ 
మసాల బీన్స్ 
కారం చెక్కలు 
అలూతో చక్రాలు 
కొబ్బరి చెక్కలు 
జొన్న మురుకులు 
మైదా కారా (మైదాచిప్స్) 
వెన్న ఉండలు 
పన్నీర్ చట్ పట్ 
సోయా సమోస, సమోస 
చిలకడ దుంప చిప్స్ 
కాకరకాయ చిప్స్ 
జంతికలు 
గుమ్మడి వరుగు (చిప్స్) 
అరిసెలు 
బూరెలు 
కొబ్బరి బూరెలు 
పచ్చి బూరెలు 
తైదు బూరెలు 
మైదాపిండితో పాల బూరెలు 
సజ్జ బూరెలు 
గోధుమ బూరెలు 
చలిమిడి 
కొబ్బరి పూర్ణాలు 
గోధుమ పిండితో పూర్ణాలు 
పూతరేకులు 
జొన్న బూరెలు 
బూంది లడ్డు 
రవ్వ లడ్డు 
తొక్కుడు లడ్డు 
మినప ముద్దలు 
సున్నుండలు 
బాదుషా 
మడత కాజా 
తీపి కాజాలు 
మైసుర్ పాకు 
జాంగ్రి 
పూస మిఠాయి 
కోవా 
కజ్జి కాయలు 
తీపి గవ్వలు 
జీడిపప్పు పాకం 
శనగపప్పు పాకం 
వేరుశనగపప్పు ముద్దలు 
మరమరాల ముద్దలు 
డ్రైఫ్రూట్స్ హల్వా 
నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద) 
కోవా కజ్జికాయ 
మిల్క్ మైసూర్‌ పాక్ 
కాజు క్యారెట్ 
బటర్ బర్ఫీ 
కిస్‌మిస్ కలాకండ్ 
బూంది మిఠాయి 
పాపిడి 
చాంద్ బిస్కట్స్ 
ఖర్జూరం స్వీట్ 
సేమ్యాతో అరిసెలు 
కొబ్బరి ఖర్జూరం 
బాదంపాకము 
బాంబే హల్వా 
వీటిల్లో మీకు ఇష్టమైనది చేసుకొని తినండి. 
చేయించుకొని తినండి. 
చేసుకున్నవాళ్ళింటికెళ్ళి కూర్చోండి. 
వాళ్ళు పెడితే తినండి. 
లేకపోతే అడగండి. 
హోటల్లో కొనుక్కొని తినండి. 
అంతే గానీ తినడం మాత్రం మానకండి



@ భావ కవితా ఝరీ ...రాధికా స్వాంతనము ౹౹ 

ఓ జగన్మోహనాకారా ,శ్రీ రాధికా ప్రియా ... 
నీ నవరస మురళీ గానము 
కొండ కోనల్లోని కోకిల పాడింది 
నా మనసు పులకించి నవగీతమొలకించింది 
నీ మురళి స్వరములు రమ్యముగా మాధవా 
నవ భావనలతో నర్తన చేస్తున్నాయి 

వన్నెలను దాల్చిన చిన్ని చిగురాకులా 
కన్నె మనసుకు మల్లె కలత పడసాగింది 
చల్లగాలికి కదిలి మెల్లగా వికసించు 
మల్లెపువ్వుకు మల్లె మనసు విప్పారింది 

పూదేనియలు ఒలికి పుప్పొడి చిందేటి 
వనలతకు వలే మనసు వయ్యారమొలికింది 
పండు వెన్నెలయందు పరవసమునొందాను 
కాంత కోర్కెను తీర్చి కనికరము చూపుమా 

...ఓ నీరాజాక్ష ౹౹


సినీ సంగీత ఝరీ ... కరుణా రసమయ చిత్రం ...మాతృ దేవో భవ ౹౹

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మాచిలకా పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే

చెదిరింది నీ గూడు గాలిగా
చిలకా గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతీయవే రాలిపొయే

అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై నీ జతకే వెన్నియవై రాలిపోయే....౹౹.