Tuesday 16 January 2018

గండికోట రహస్యం (1969)



నీలాలనింగి మెరిసిపడే నిండుచందురుడా...నిరుపేద కలువ వేచెనని మరచిపోదువా

చిత్రం: గండికోట రహస్యం (1969)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా
నిరు పేద కలువ వేచెనని మరచిపోదువా
అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా
నెలరాజు కలువ చెలిమి మరచి నిలువగలుగునా

చరణం 1:
నీ కోసము కుసుమించెను శతకోటి తారలు
నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు
నీ కోసము కుసుమించెను శతకోటి తారలు
నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు
ఆ తళుకలలో పరవశించి కరగిపోదువా
అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా
నెలరాజు కలువ చెలిమి మరచి నిలువగలుగునా

చరణం 2:
అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకొంటిని
ఎద నిండ ప్రణయ పరిమళాలు పొదుగుకుంటిని
అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకొంటిని
ఎద నిండ ప్రణయ పరిమళాలు పొదుగుకొంటిని
ఎన్నెన్ని జన్మలైన గాని నిన్ను మరతునా



Watch Neelaala Ningi Video Song from Gandikota Rahasyam Starring N.T.R, Jaya Lalitha, Devika…
youtube.com

భీష్మ


భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు

గంగా శంతనుల అష్టమ పుత్రుడైన దేవవ్రతుడు (గాంగేయుడు) తండ్రి మనోరథం చెల్లించడానికి ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని భీషణ శపథం చేసి భీష్ముడుగా వాసికెక్కాడు. అందుకు ప్రతిగా తండ్రి నుండి స్వచ్చంద మరణం కలిగేలా వరం పొందుతాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని చేత గాయపడి, అది దక్షిణాయనం అవడం వలన ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చేవరకు పార్థుడు అమర్చిన అంపశయ్యపై విశ్రమించి, తనను జిజ్ఞాసతో సమీపించిన ధర్మజునికి శ్రీ విష్ణు సహస్రనామం వినిపించి, ఏకాదశి శుభదినాన తుది శ్వాస విడుస్తాడు శాంతనవుడు. అదే భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. భీష్ముడు తన సవతి తమ్ముల కోసం కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను జయించి తీసుకుని వస్తాడు. అయితే అంబ అంతకు మునుపే సాళ్వ రాజును వరించినదని తెలుసుకుని ఆమెను ఆమె ప్రియునివద్దకు పంపేస్తాడు భీష్ముడు. అయితే భీష్ముడు గెలుచుకున్న అంబను చేపట్టనని సాల్వుడు అనగా, అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చి తనను పరిగ్రహించమంటుంది. అందుకు నిరాకరించిన భీష్ముని గెలిచే వరంకోసం అంబ పరమ శివుని గురించి తపస్సు చేస్తుంది. అంబ శివుని ప్రార్థించే పాట "మహాదేవ శంభో" పి.సుశీల గళంలో వినండి. అంబగా అంజలీదేవి నటించింది. 

చిత్రం:      భీష్మ (1962)
రచన:      ఆరుద్ర
గానం:      పి. సుశీల
సంగీతం:  సాలూరు రాజేశ్వర రావు

మహాదేవ శంభో..ఓ..ఓ..  మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించ రావా                 | మహా దేవ |

జటాజూట ధారీ శివా చంద్రమౌళి నిటాలాక్ష నీవే సదా నాకు రక్షా        | జటాజూట |
ప్రతీకార శక్తి ప్రసాదించ రావా  ప్రసన్నమ్ము కావా! ప్రసన్నమ్ము కావా!
మహాదేవ శంభో..ఓ..ఓ.. మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా  మొరాలించి పాలించ రావా 
మహా దేవ శంభో..
శివోహం శివోహం శివోహం శివోహం  
మహాదేవ శంభో..ఓ..ఓ.. మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించ రావా
మహా దేవ శంభో..
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం

మంచి మనసుకు మంచి రోజులు


ధరణికి గిరి భారమా - మంచి మనసుకు మంచి రోజులు నుండి
చిత్రం: మంచి మనసుకు మంచి రోజులు (1958)
రచన: సముద్రాల జూనియర్
సంగీతం: ఘంటసాల


గానం: రావుబాలసరస్వతీదేవి

పల్లవి: ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: మును నే నోచిన నా నోము పండగా

నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా

పూయని తీవెననే అపవాదు రానీక - 2

తల్లిననే దీవెనతో తనియించినావయ్య

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: ఆపద వేళల అమ్మమనసు చెదరునా

పాపల రోదనకే ఆ తల్లి విసుగునా

పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి - 2

ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?


మిస్సమ్మ


రావోయి చందమామ - రంగుల్లో


అలనాటి మిస్సమ్మ (1955) అనగానే ఎవరికయినా ముందుగా గుర్తుకు వచ్చే పాట శ్రీమతి పి. లీల, ఎ.ఎం.రాజా కలసి పాడిన "రావోయి చందమామా". నలుగురు మహా నటులు ఎన్.టి.ఆర్., సావిత్రి, ఎ.ఎన్.ఆర్. ఎస్.వి.ఆర్. నటించిన మణిహారం మిస్సమ్మ. చక్కని భావ ప్రకటనకు పెట్టింది పేరు సావిత్రి గారు. ముఖంలో అన్ని భావాలను అలవోకగా చూపించగల మహానటి ఆమె.  పింగళి నాగేంద్ర రావు గారి రచన, ర'సాలూరు' రాజేశ్వర రావు గారి స్వర రచన, చక్కని గాయనీ గాయకుల సమ్మేళనం, తగినంత హాస్యం అన్నీ చక్కగా కుదిరిన విజయా సంస్థ యొక్క అద్భుత చిత్రం "మిస్సమ్మ".  రంగుల్లో "రావోయి చందమామ"ను చూడండి.


Color

Black & White



A.M.రాజా:    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్       | సామంతము |
               సతి పతి పోరే బలమై సతమతమాయెను బ్రతుకే
లీల:          రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్      | ప్రతినలు |
               మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
A.M.రాజా:    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               తన మతమేమొ తనదీ మన మతమసలే పడదోయ్     | తన మతమేదో |
               మనమూ మనదను మాటె అననీయదు తాననదోయ్
లీల:          రావోయి చందమామా మ వింత గాధ వినుమా           | రావోయి |
               రావోయి చందమామా
               నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో           | నాతో తగవులు |
               ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
ఇద్దరు:       రావోయి చందమామా మా వింత గాధ వినుమా
               రావోయి చందమామా

రాజ నందిని



హర హర పురహర శంభో


చిత్రం: రాజ నందిని (1958)
రచన: మల్లాది 
సంగీతం: టి.వి.రాజు 
గానం: ఎం.ఎస్.రామారావు, బృందం



లక్ష్మీ కటాక్షం.


లక్ష్మి స్థిరంగా ఉండాలంటే చేయకూడని పనులేమిటి?

ఎప్పుడో 1970 లో విడుదలయిన చిత్రం లక్ష్మీ కటాక్షం.  ఇందులో ఎన్నో చక్కని పాటలున్నాయి. అందులో ప్రత్యేకమైనది ఈ శుక్రవార మహిమ గురించి చెప్పే పాట. నిజంగా మన పూర్వీకులు ఎంతో ఆలోచించి చెప్పేరు. మన దైనందిన జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, మనము పాటించవలసినవి, మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని చక్కని పాట లేదా పద్య రూపంలో చెబితే సులభంగా గుర్తు వుంటుంది.  అటువంటి కోవకు చెందుతుంది ఈ పాట. ఇది శ్రీ చిల్లర భావనారాయణ గారి రచన. పాడినది శ్రీమతి ఎస్.జానకి గారు. ఈ పాటలో ఎన్‌.టి.ఆర్. చక్కని ముఖకవళికలు ప్రదర్శించారు. 


.

చిత్రం:లక్ష్మీ కటాక్షం 
రచన:చిల్లర భావనారాయణ 
సంగీతం:ఎస్.పి.కోదండపాణి
గానం:ఎస్.జానకి




శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు 

దివ్వె నూదగ వద్దు, బువ్వ నెట్టొద్దు 

తోబుట్టువుల మనసు కష్ట పెట్టొద్దు 

తొలి సంజె, మలి సంజె నిదురపోవద్దు 

మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు | మా తల్లి |




ఇల్ల్లాలు కంటతడి పెట్టనీ యింట 

కల్లలాడని యింట గోమాత వెంట 

ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో

పూలల్లో.. పాలల్లో..

పూలల్లో, పాలల్లో, ధాన్య రాశుల్లో

మా తల్లి మహలక్ష్మి స్థిరముగా నుండు | మా తల్లి |

సంఘం.

హృద్యమైన చిత్రీకరణ గల "సుందరాంగ మరువగలేనోయ్" - సంఘం చిత్రం నుండి

1954 లో విడుదలైన చిత్రం సంఘం. కులాంతర వివాహాల నేపథ్యంలో శృంగార, హాస్య చిత్రమిది. ఇందులో రామారావు, అంజలి, వైజయంతిమాల నటించారు.  హిందీ చిత్ర రంగంలో ప్రఖాతి పొందిన అలనాటి తెలుగు-తమిళ తార వైజయంతిమాల ఈ పాటలో ఎంతో అందంగా కనిపిస్తుంది.  పాట చిత్రీకరణ చూస్తే అంత పాత చిత్రంలో కూడ సాంకేతిక విలువలు ఎంత గొప్పగా వున్నాయో తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం ఆర్. సుదర్శనం. సుందరాంగ మరువగలేనోయ్" పాట అలనాటి సూపర్ డూపర్ హిట్. ఈ పాటలో వైజయంతిమాల, అంజలి నటించారు.ఈ పాట రచయిత శ్రీ తోలేటి. గానం పి.సుశీల, టి.ఎస్.భగవతి.


ప.    సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..
        నా అందచందములు దాచితినీకై రావేలా                    
| సుందరాంగ |
  
చ.   ముద్దు నవ్వుల మోహన కృష్ణా రావేలా                | ముద్దు |
      నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు      | నవ్వులలోనా |
      సుందరాంగ  మరువగ లేనోయ్ రావేలా
      నా అందచందములు దాచితి నీకై రావేలా

ప.   నీలికనులలో వాలు చూపుల ఆవేళా
      నను చూసి కనుసైగ చేసితివోయీ ఆవేళా             | నీలి కనులలో |
      కాలి మువ్వలా కమ్మని పాట ఆవేళా                   | కాలి మువ్వలా |
      ఆ మువ్వలలో తెలుపు అదే మనసు
      మురిసే మన కలగలుపు                                | ఆ మువ్వల |  

చ.    హృదయ వీణ తీగలు మీటీ ఆవేళా... 
        అనురాగ రసములే పిండితివోయీ...రావేలా                 | హృదయ |
        మనసు నిలువదోయ్ మగువసొంతమోయ్...రావేలా..   | మనసు |
        పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పల్లవించే.....      | పువ్వులు |
        సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..
        నా అందచందములు దాచితినీకై రావేలా

"సీతారామ కల్యాణం"


పాడవే రాగమయి వీణా....పాడవే రాగమయి...లంకా నాధుని రమణీయ గాధా

చిత్రం : సీతారామ కళ్యాణం
గానం : సుశీల
సాహిత్యం : సీ.సముద్రాల
సంగీతం : నరసింహారావు

వీణా.......పాడవే....రాగమయీ.......
పాడవే రాగమయి వీణా....
పాడవే రాగమయి...లంకా నాధుని రమణీయ గాధా
పాడవే రాగమయి ...

రాగములో అనురాగముకలిపి...
శివయోగములో భోగముతెలిపి
జగమే ప్రేమకు నెలవును జేసే
రసికావతంసుని రామణీయగాధా

వీణా మాధురి శివు మురిపించి
విక్రమ ధాటిని అమరులనుంచి
కనులా సైగల నామనసేలే
కైకసి శూరుని కమనీయగాధా...

పాడవే రాగమయి వీణా....
పాడవే రాగమయి...లంకా నాధుని రమణీయ గాధా

https://www.youtube.com/watch?v=wrtj0xQoC6c
Padave Ragamayi Veena Padave Ragamayi Song - Seetharama Kalyanam Movie, NTR, Kanta Rao, Gitanjali
Watch Padave Ragamayi Veena Padave Ragamayi Song From Seetharama Kalyanam Movie, Starring Harinath, ...


తెలుగువారింట పెళ్ళి జరిగితే ఈ పాట తప్పనిసరిగా వినిపించవలసిందే!

తెలుగు వారి ఇండ్లలో పెళ్ళిళ్ళు జరిగినపుడు ఖచ్చితంగా వినిపించే పాట "సీతారాముల కళ్యాణము చూతము రారండి".  ఈ పాట విననిదీ, భజంత్రీల వాళ్ళు మాంగల్య ధారణ సమయంలో వాయించనిదీ పెళ్లి జరిగినట్లు అనిపించదు. అంతటి చక్కని బాణీ, చక్కని రచన ఈ పాటది. ఇది 1961 లో విడుదలైన, ఎన్.టి.రామారావు గారు రావణుడుగా నటించి, దర్సకత్వం వహించిన "సీతారామ కల్యాణం" చిత్రం కోసం శ్రీ సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) వ్రాయగా, అలనాటి మేటి సంగీత దర్శకులు శ్రీ గాలి పెంచల నరసింహారావు మధ్యమావతి రాగంలో కట్టిన బాణీ ఇది. వీరి ఇంటి పేరు గాలి, మిగిలిన పేరు పెంచల నరసింహారావు. అయితే చాలామంది "గాలిపెంచల" అని వ్రాతలలోనూ, మాటల లోను పేర్కొనడం వలన ఆయన గాలిపెంచల నరసింహారావు అయారు.  పెళ్ళిళ్ళలో, సంప్రదాయాలలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి.   పెళ్లి అలంకారాలలో వాడే పదాలు, చిహ్నాలు - మణి బాసికము, కళ్యాణపు బొట్టు, పారాణి, తలంబ్రాలు, కస్తూరి నామము మొదలయినవి ఇన్నేళ్ళయినా మరచిపోకుండా ఉండాలంటే ఈ పాట వింటే సరి. అంత చక్కగా పదికాలాలు నిలిచి పోయేలా పాడారు శ్రీమతి పి.సుశీల. ఇక్కడ వున్న యూ ట్యూబ్ వీడియోలోనూ, సినిమా డివిడి లోను మూడు చరణాలు మాత్రమె వున్నాయి. కాని నిజానికి ఇది ఆరు చరణాల పాట. పాట సంపూర్ణంగా ఆడియో ఫైలులో వినవచ్చును.

వీడియోలో మూడు చరణాలే వున్నాయి

ఆరు చరణాల పూర్తి పాట ఆడియో ఫైలు


సముద్రాల (సీ)             గాలిపెంచల           పి.సుశీల
చిత్రం:     సీతారామ కల్యాణం (1961)

రచన:     సముద్రాల రాఘవాచార్య
సంగీతం: గాలి పెంచల నరసింహా రావు

గానం:     పి.సుశీల 
   
   

            పల్లవి: 
కోరస్:   సీతారాముల కళ్యాణము చూతము రారండి
           శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
            చరణం-1:
సుశీల:  చూచువారలకు చూడ ముచ్చటట, పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
కోరస్:   చూచువారలకు చూడ ముచ్చటట, పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
సుశీల:  భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  భక్తి యుక్తులకు ముక్తిప్రదమట, సురలను మునులను చూడవచ్చురట
కోరస్:   కళ్యాణము చూతము రారండి
            చరణం-2:
సుశీల:  దుర్జన కోటిని దర్పమడంచగ, సజ్జన కోటిని సంరక్షింపగ
కోరస్:   దుర్జన కోటిని దర్పమడంచగ, సజ్జన కోటిని సంరక్షింపగ
సుశీల:  ధారుణి శాంతిని స్థాపన చేయగ
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  ధారుణి శాంతిని స్థాపన చేయగ, నరుడై పుట్టిన పురుషోత్తముని
కోరస్:   కళ్యాణము చూతము రారండి
            చరణం-3:
సుశీల:  దశరథ రాజు సుతుడై వెలసి, కౌశికు యాగము రక్షణ జేసి
కోరస్:   దశరథ రాజు సుతుడై వెలసి, కౌశికు యాగము రక్షణ జేసి
సుశీల:  జనకుని సభలో హరువిల్లు విరచి
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  జనకుని సభలో హరువిల్లు విరచి, జానకి మనసు గెలిచిన రాముని
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
           చరణం-4:
సుశీల:  విరి కళ్యాణపు బొట్టును బెట్టి
కోరస్:   బొట్టును బెట్టి
సుశీల:  మణి బాసికమును నుదుటను గట్టి
కోరస్:   నుదుటను గట్టి
సుశీల:  పారాణిని పాదాలకు బెట్టి
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  పారాణిని పాదాలకు బెట్టి, పెళ్ళి కూతురై వెలసిన సీతా
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
           చరణం-5:
సుశీల:  సంపగి నూనెను కురులను దువ్వి
కోరస్:   కురులను దువ్వి
సుశీల:  సొంపుగ కస్తూరి నామము తీర్చి
కోరస్:   నామము తీర్చి
సుశీల:  చెంపగ వాసి చుక్కను బెట్టి
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  చెంపగ వాసి చుక్కను బెట్టి, పెండ్లి కొడుకై వెలసిన రాముని
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
             చరణం-6:
సుశీల:  జానకి దోసిట కెంపుల ప్రోవై
కోరస్:   కెంపుల ప్రోవై
సుశీల:  రాముని దోసిట నీలపు రాశై
కోరస్:   నీలపు రాశై
సుశీల:  ఆణిముత్యములు తలంబ్రాలుగా
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  ఆణిముత్యములు తలంబ్రాలుగా, శిరముల మెరసిన సీతారాముల
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
వీ

చిత్రం: సుఖ దుఃఖాలు (1967)

దేవులపల్లి భావ కవిత్వంలో కలికితురాయి పి. సుశీల పాడిన ఈ పాట

దేవులపల్లి కృష్ణశాస్త్రి
"ఇది మల్లెల వేళ" చక్కని భావుకతను వ్యక్త పరిచే మధుర గీతం. అలాటి పాటలు వ్రాయడం శ్రీ దేవులపల్లి వారికే చెల్లు. ఏ అమ్మాయికైనా తన భవిష్యత్తును తీర్చి దిద్దుకునే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం. తొందరపడి వేసిన అడుగు వలన ఇబ్బందుల పాలవచ్చు. ఈ నేపధ్యంలో ఎందరినో ప్రభావితం చేసే పాత్రలో వాణిశ్రీ నటించిన ఈ చిత్రం కోసం ఆ భావాన్ని, ఆ సందర్భాన్ని ప్రతిబింబించేలా దేవులపల్లి వారు వ్రాసిన పాట "ఇది మల్లెల వేళయని". ఇది ఆ రోజుల్లో శ్రీమతి సుశీల గారి సూపర్ హిట్ పాట. ఆ రోజులలో ఎక్కడ పాటల పోటీలు జరిగినా ఈ పాట ఎవరో ఒకరు పాడి బహుమతి కొట్టేసేవారు. ఈ పాటలో శాస్త్రి గారు "మొగసాల" అనే చక్కని పదం వాడారు. "మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కింది" అనే సామెతలో వాడటం వింటాం ఈ పదం. "మొగసాల" లేదా "ముఖసాల" అంటే "తలవాకిలి" అని అర్ధం.
   


        చిత్రం:         సుఖ దుఃఖాలు (1967)
        రచన:         దేవులపల్లి కృష్ణశాస్త్రి
        సంగీతం:      ఎస్.పి.కోదండపాణి  
        గానం:         పి.సుశీల
 
        ఓ.. ఓ.. ఓ.. ఓ..
ప.     ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమని
        తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చ.     కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని
        ఇక కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని
        ఎరుగని కోయిల ఎగిరింది                                                 | ఎరుగని |
        చిరిగిన రెక్కల ఒరిగింది నేలకు ఒరిగింది                                 | ఇది మల్లెల |

చ.     మరిగిపోయేది మానవ హృదయం
        కరుణ కరిగేది చల్లని దైవం                                                | మరిగిపోయేది |
        వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
        వసివాడని కుసుమ విలాసం                                             | ఇది మల్లెల |

చ.     ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం                   | ద్వారానికి |
        మోసం, ద్వేషం లేని సీమలో                                              | మోసం ద్వేషం |
        మొగసాల నిలిచెనీ మందారం                                             | ఇది మల్లెల |
        ఓ.. ఓ.. ఓ.. ఓ.. 

అనగనగా ఒక రాజు




తెలుగువారికి శ్రీ శ్రీ సందేశం - 'అనగనగా ఒక రాజు' డబ్బింగ్ చిత్రం నుండి ఘంటసాల గళంలో

1958 లో నిర్మించబడిన "నడోడి మన్నన్‌" (The Vagabond King) అనే తమిళ చిత్రాన్ని తెలుగులో "అనగాఅనగా ఒక రాజు" గా డబ్బింగు చేశారు. ఈ చిత్రం ఆరోజుల్లో రూపొందిన అతి పెద్ద చిత్రం. ఇది 5 గంటల సినిమా. అయితే కొంత ఎడిటింగ్ చేసాక 3.5 గంటలకు వచ్చింది.   ఎం.జి.రామచంద్రన్ దర్శకత్వంలో ఆయన ద్విపాత్రాభినయంతో పి.భానుమతి,బి.సరోజాదేవి తో కలసి నటించిన ఈ చిత్రానికి ఘంటసాల ఒక పాట పాడారు. దీనిని మహాకవి శ్రీ శ్రీ వ్రాసారు. సందేశాత్మక గీతాలు వ్రాయడం లో శ్రీశ్రీది అందె వేసిన చెయ్యి. డబ్బింగ్ పాటలో కూడ తన పదాల వాడిని తెలుగువాడికి చూపించి ప్రభావితుడ్ని చేశారు ఆయన. ఈ చిత్రం కోసం శ్రీశ్రీ వ్రాసిన "సుఖపడుటే సుఖమై పరుగిడ నీజన్మం" అన్న పాటలోని భావం అక్షర సత్యం. అయితే ఇది మరుగున పడి వున్న ఒక ఆణి ముత్యం. తమిళంలో ఈ పాటను గోవిందరాజన్‌ పాడారు. అయితే చలన చిత్ర శైశవ దశలో శ్రీ శ్రీ ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలకు పాటలు వ్రాసేవారు. తరువాత ప్రముఖులు రాజశ్రీ.  అయితే డబ్బింగు పాటలకుండే ఇబ్బందులు పద విచ్చేదనలో స్పష్టంగా తెలుస్తాయి. ఉదాహరణకు - కల్మి, కాన్‌పడదు, కాల్లు చేతుల్ మొదలయినవి. అవి పెదవుల కదలికలకు కూడ అతికినట్టు ఉండాలి మరి.ఈ చిత్రానికి సంగీత దర్శకులు టి.ఎం.ఇబ్రహీం. అయితే తమిళ చిత్రానికి సంగీత దర్శకులు ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు (సంగీతయ్య).
వీడియో మూలంఘంటసాల గానామృతం


చిత్రం: అనగాఅనగా ఒక రాజు (1959)
రచన: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల
సంగీతం: టి.ఎం.ఇబ్రహిం

పల్లవి: సుఖపడుటే సుఖమై పరుగిడ నీ జన్మం
శోకాలు తెచ్చేనోయ్ తెలుగోడా! | సుఖపడుటే |

సుఖపెట్టుటే గుణమై పరగిన నీ జన్మం - 2
లోకాలు మెచ్చేనోయ్ తెలుగోడా! | సుఖపెట్టుటే |

చరణం: కల్మినెంతో మెచ్చి గర్వించ నీ జన్మం
కలత పడు చూడూ తెలుగోడా! | కల్మినెంతో |

అల్లాడు పేదలను సేవింప యిలయందే | అల్లాడు |
కాన్పడదా స్వర్గం తెలుగోడా! | కాన్‌పడదా |

చరణం: ఘనమైన కాల్లు చేతుల్ కల్గియుండె బిచ్చమునెత్తు | ఘనమైన |
జన్మ దుఃఖాల చేసే తెలుగోడా! -2
అందరు పనిచేసి ఆ ఫలమున్‌ పొంద
అద్భుతమౌను జన్మం తెలుగోడా! | అందరు |
అద్భుతమౌను జన్మం తెలుగోడా!

చరణం: బ్రతుకంతా పదవి జొరబడితే జన్మం | బ్రతుకంతా |
హీనమయ్యేనయ్యా తెలుగోడా! | హీనమయ్యే |
ఉసురిచ్చి తల్లి నేలన్‌..ఆ..ఆ..ఆ..
ఉసురిచ్చి తల్లి నేలన్‌ గౌరవించితే జన్మం | ఉసురిచ్చి |
లోకాలు మెచ్చేనోయ్ తెలుగోడా! | లోకాలు |

కృతజ్ఞతలు: ఆడియోను పొందుపరచిన సఖియా.కామ్ వారికి, వివరాలు సమకూర్చిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగులకు హృదయపూర్వక 

Saturday 13 January 2018

జస్టిస్ చౌదరి (1982)


చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని పాట
చిత్రం : జస్టిస్ చౌదరి (1982)
రచన : వేటూరి,
సంగీతం : చక్రవర్తి
గానం : బాలు, సుశీల, శైలజ
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని
పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు
అందాలకెందుకు గంధాల పూతలు
అందాలకెందుకు గంధాల పూతలు
కళ్లకే వెలుతురు మా పెళ్లికూతురు
ఈ పెళ్లికూతురు...
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని
అలుసు చేయవద్దు మీరు తానేమి అడగదని
ఆడగబోదు సిరిసంపదలు ఏనాడూ పెనిమిటిని
అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని
చెప్పలేని మూగబాధ చెప్పకనే తెలుసుకో
మాటలకే అందని మనసు..
చూపులతో తెలుసుకో..
రెప్పవలే కాచుకో..
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం


Thursday 11 January 2018



పంతులమ్మ



మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......


శ్రీరామనవమి శుభాకాంక్షలతో ......

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

ఎరిగినవారికి ఎదలో ఉన్నాడు ...... ఎరుగనివారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడైనాడు .....
తలచినవారికి తారకనాముడు ...... పిలిచిన పలికే చెలికాడు సైదోడు ......
కొలువై ఉన్నాడూ కోదండరాముడు ...... మనతోడుగా నీడగా రఘురాముడు

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

కరకుబోయను ఆది కవిని చేసిన పేరు ...... గరళకంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపరసాధనకు ఇహమైన పేరు ......
శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు ...... హనుమ ఎదలో భక్తి ఇనుండించిన పేరు
రామ ...... రామ ...... అంటే కామితమే తీరు ...... కలకాలమూ మము కాపాడు పేరు

మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......

చిత్రం : పంతులమ్మ
సాహిత్యం : వేటూరి గారు
సంగీతం : రాజన్-నాగేంద్ర గార్లు
గానం : పి. సుశీల గారు



Tuesday 9 January 2018

నచ్చావే.. నచ్చావులే


నిన్నే నిన్నే కోరా..... నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా..... నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా

ప్రతి జన్మలోనా.... నీతో ప్రేమలోనా
ఇలా ఉండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే.... నచ్చావే.. 
ఓ నచ్చావే.. ...నచ్చావులే

అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు
వేరే పనేం లేదా నీకు నన్నే వదలవూ
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేని నిన్ను నేను గుర్తురానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుందీ సీతాకోకలాగా

నిన్నే నిన్నే కోరా..... నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా

నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది
పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది
మనసునేమో దాచమన్న అస్సలేమీ దాచుకోదూ
నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదూ
ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా
ఇలా ఉండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే.. నచ్చావులే
నచ్చావే.. నచ్చావులే

ఆపద్భాంధవుడు

ఆపద్భాంధవుడు 
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఆనందలాలా....ఆనందలీల

దేవుళ్ళు (2001)


మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధీష్ఠించు అధిశక్తి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

చిత్రం: దేవుళ్ళు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: ఎస్. జానకి

నన్ను వదిలి నీవు పొలేవులే


నన్ను వదిలి నీవు పొలేవులే అది నిజములే 
పూవు లేక తావి నిలువలేదులే లేదులే
నన్ను వదిలి నీవు పొలేవులే అది నిజములే 
పూవు లేక తావి నిలువలేదులే లేదులే

తావి లేని పూవు విలువలేనిదే ఇదీ నిజములే 
నేను లేని నీవు లేనే లేవులే లేవులే 
తావి లేని పూవు విలువలేనిదే ఇదీ నిజములే 
నేను లేని నీవు లేనే లేవులే లేవులే

నా మనసేచిక్కుకునే నీ చూపుల వలలో 
నా మనసు నా సొగసు నిండేను నీ మదిలో 
నా మనసేచిక్కుకునే నీ చూపుల వలలో 
నా మనసు నా సొగసు నిండేను నీ మదిలో 
చిరకాలపు నా కలలే ఈ నాటికి నిజమాయె 
చిరకాలపు నా కలలే ఈ నాటికి నిజమాయె 
దూర దూర తీరాలు చేరువైపోయే.. ఓ... ఓ..

తావి లేని పూవు విలువలేనిదే ఇదీ నిజములే 
నేను లేని నీవు లేనే లేవులే లేవులే

సిగ్గు తెరలలో కనులు దించుకొనీ తలను వంచుకొనీ 
బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ 
సిగ్గు తెరలలో కనులు దించుకొనీ తలను వంచుకొనీ 
బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ 
రంగులీను నీ మెడలో బంగారపు తాలికట్టి 
పొంగిపోవు శుభదినము రానున్నది లే...
ఓ... ఓ...

నన్ను వదిలి నీవు పొలేవులే అది నిజములే 
పూవు లేక తావి నిలువలేదులే లేదులే

తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెలమెల్లగా నీవు రాగా
నీ మేని హోయలు 
నీ లోని వగలు 
నా లోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి 
ఆకాశమే అందుకొనగా
పైపైకి సాగి మేఘాలు దాటి 
కానరాని లోకాలు కనగా
ఆహా.. ఓహో.. ఉమ్హు.....
ఆ ఆ ....ఓ ఓ ...
నిన్ను వదలి నేను పోలేనేలే 
అది నిజములే 
నీవు లేని నేను లేనేలేనులే లేనులే