Saturday 30 November 2019

పల్నాటి సింహం (1985)

చిత్రం : పల్నాటి సింహం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

ఈ కుంకుమతో.. ఈ గాజులతో.. కడతేరిపోనీ స్వామీ..
కనుమూయనీ నన్ను స్వామీ...
ఓ...చెన్నకేశవా.. పసుపు కుంకుమ
జంట కలిశాయి దీవించరా... జంట కలిశాయి దీవించరా...

చరణం 1 :

పల్నాటి సీమంతా పండు మిరప చేలు
పసుపు కుంకాలిచ్చి సీమంతాలాడేను
మాంచాల మాదేవి మాంగళ్యం మాదేను
పేదైన మగసిరుల పేరంటాలాడేను
పౌరుషమున్న బ్రతుకులలోన పాశం కన్నా దేశం మిన్న
బ్రతికే ఉన్నా చితిలో ఉన్నా అశువులకన్నా పసుపే మిన్న
పచ్చని సీమ పల్నాడంతా వైకుంఠమై వెలిగే వేళ

ఈ కుంకుమతో... ఈ గాజులతో... కడతేరిపోనీ స్వామీ..

చరణం 2 :

ఏడడుగులు నడిచాను ఏనాడో మీ తోడు
ఏడేడు జన్మలకి అవుతాను మీతోడు
జననాలు మరణాలు కాలేవు ఎడబాటు
నిండు ముత్తైదువుగా ఎదురొచ్చి దీవించు
ఆలిగా నేను అంతిమ జ్వాల హారతి పడితే అంతే చాలు
జ్వాలలు కూడా పావనమయ్యే జ్యోతివి నువ్వు జోతలు నీకు
మళ్ళీ జన్మ మనకే ఉంటే పల్నాటిలోనే పుడుదామంట

ఈ కుంకుమతో... ఈ గాజులతో... కడతేరిపోనీ స్వామీ..
కనుమూయనీ నన్ను స్వామీ...

Palnati Simham Songs - Ee Kumkumatho - Radha - Krishna
Watch Krishna Jayasudha Radha's Palnati Simham Telugu Movie Song With HD Quality Music : Chakravarth.

స్వర్ణ కమలం




స్వర్ణ కమలం 
ఓం నమో నమో నమఃశివాయ

మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగ యాతరంగితొత్తమాంగతే నమఃశివాయ

ఓం నమో నమో నమఃశివాయ

శూలినే నమో నమః కపాళినే నమఃశివాయ
పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ

ఆందెల రవమిది పదములదా

అందెల రవమిది పదములదా
అంబర మంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా

సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా

మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై

మేను హర్ష వర్ష మేఘమై
వేణి విసురు వాయువేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేల

జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ

ఆందెల రవమిది పదములదా

నయన తేజమె న కారమై
మనో నిశ్చయం మ కారమై
శ్వాస చలనమె శి కారమై
వాంచితార్ధమె వా కారమై
యోచన సకలము యః కారమై

నాదం న కారం మంత్రం మ కారం స్తొత్రం శి కారం వేదం వా కారం యఙం య కారం

ఓం నమఃశివాయ

భావమె మౌనపు భవ్యము కాగ
భరతమె నిరతము భాగ్యము కాగ
పురిల గిరులు తరిగేల తాండవమాడే వేళ

ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిద
Swarna Kamalam - Telugu Songs - Andelu Ravali
Telugu Videos Songs From Venkatesh & Bhanupriya's Swarna Kamalam

చిత్రం - శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)


*శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం* జీతెలుగు ఛానల్ లో వింజమూరి అనూహ్య & వైష్ణవి కలిసి పాడిన వీడియో యిది.
చిత్రం - శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
గీతరచన - ఆరుద్ర
ంగీతం - కె.వి.మహదేవన్
గానం - పి.సుశీల, బి.వసంత


శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం
శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం
దధిక్షీరమ్ములకన్నా ఎంతో
మధుర మధుర నామం
సదా శివుడు ఆ రజతాచలమున
సదా జపించే నామం
కరకుబోయ తిరగేసి పలికినా
కవిగా మలచిన నామం
రా... మరా... మరామ... రామ
రామ రామ రామ రామ
రాళ్లు నీళ్లపై నిల్చిన నామం
రక్కసి గుండెల శూలం
శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం
వేయి జపాల కోటి తపస్సుల
విలువ ఒక్కనామం
నిండుగ దండిగ వరములొసంగే
రెండక్షరముల నామం
ఎక్కడ రాముని భజన జరుగునో
అక్కడ హనుమకు స్థానం
చల్లని నామం మ్రోగే చోట
చెల్లదు మాయాజాలం
రామ రామ రామ సీతా
రామ రామ రామ రామ
రామ రామ రామ సీతా
రామ రామ రామ రామ
శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం

Tuesday 19 November 2019

జరిగిన కథ ( 1969 )



ఏనాటి కైనా ఈ మూగ వీణా...రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

చిత్రం: జరిగిన కథ ( 1969 )
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

క్రిష్ణా...క్రిష్ణా...క్రిష్ణా.....

ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా
ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

నిను చెరి నా కధా వినిపించలేను...ఎద లోని వేదనా ఎలా తెలుపను
నిను చెరి నా కధా వినిపించలేను...ఎద లోని వేదనా ఎలా తెలుపను
మనసేమో తెలిసి మనసారా పిలిచీ...మనసేమో తెలిసి మనసారా పిలిచీ
నీలోన నిన్నే నిలుపుమూ స్వామీ...

ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

ఏ వన్నె లేనీ ఈ చిన్ని పూవూ...నా స్వామి మెడలో నటియించునా
ఏ వన్నె లేనీ ఈ చిన్ని పూవూ...నా స్వామి మెడలో నటియించునా
ఏలాటి కానుక తేలేదు నేనూ...ఏలాటి కానుక తేలేదు నేనూ
కన్నీట పాదాలు కడిగేను స్వామీ

ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

క్రిష్ణా...క్రిష్ణా...క్రిష్ణా.....

https://www.youtube.com/watch?v=VXh3OnNpsQI

Yenaatikainaa Song - Jarigina Katha Movie Songs - Krishna - Kanchana - Jaggaiah
Watch Yenaatikainaa Song From Jarigina Katha Movie, Starring Krishna, Jagayya, Vijayalalita among Ot...

Friday 15 November 2019

: కళ్యాణ మండపం

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే...వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి

చిత్రం : కళ్యాణ మండపం
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమ విధాత జీవననేత ప్రేమ విధాత
అను గుడిగంట విను ప్రతిజంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే

తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
జీవనగంగా వాహిని కాదా , జీవనగంగా వాహిని కాదా
అను ప్రతిజంట – విను గుడిగంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
https://www.youtube.com/watch?v=J_a7wUd8sFM


Kalyana Mandapam Movie Songs || Sarigama Padanisa || Shoban Babu || Kanchana
Sobhan Babu - Kanchana - Anjali Devi`s Kalyana Mandapam Telugu Movie - Sarigama Padanisa Palike Varu...

Tuesday 12 November 2019

భైరవద్వీపం (1994)

ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన...అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే

చిత్రం : భైరవద్వీపం (1994)
సాహిత్యం : సిరివెన్నెల,
సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన
అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే
నిజమెరుగవె పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలుగునులె

కోరుకున్నవాడే తగు వేళ చూసి జతకూడే సుముహూర్తం ఎదురైనదీ
అందమైన ఈడే అందించమంటూ దరచేరే సందేశం ఎదవిన్నదీ
లేనిపోని లోనిశంతా మానుకోవె బాలికా
మేలుకోవ గోరువంకా లేతనైన కోరికా
కులుకా రస గుళికా కలలొలుకా తగు తరుణము దొరికెనుగా

ఘాటైన ప్రేమ ఘటన ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలుగునులె

పూజలన్ని పండే పురివిప్పి నేను జతలాడే అనురాగం శృతి చేయగా
మోజులన్ని పిండే మగతోడు చేరు ఈనాడూ సుఖభోగం మొదలౌనుగా
ఊసులన్ని మాలగా పూసగుచ్చి వేయనా
రాసకన్నె మేనక దూసుకొచ్చి వాలనా
కరిగా తొలకరిగా రసఝరిగా అణువణువొక చినుకవగా

ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన
అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే
నిజమెరుగవె పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలుగునులె

https://www.youtube.com/watch?
v=xFIJnDWqZbshttps://www.youtube.com/watch?v=xFIJnDWqZbs

Ghatina Prema Gahatana Video Song || Bhairava Dweepam Movie || Balakrishna, Roja, Rambha
Subscribe For More Full Movies: http://goo.gl/auvkPE Subscribe For More Video Songs: http://goo.gl/7..

Sunday 10 November 2019

స్వాతి ముత్యం




 Music: Ilayaraja
Lyricist: C.Narayana Reddy
Singer: P.Suseela

లాలి లాలి లాలి లాలి
లాలి లాలి లాలి లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
 

మురిపాల కృష్ణునికి....
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
లాలి లాలి లాలి లాలి
లాలి లాలి లాలి లాలి

కళ్యాణ రామునికి కౌసల్య లాలి
కళ్యాణ రామునికి కౌసల్య లాలి
యదు వంశ విభునికి యశోద లాలి
యదు వంశ విభునికి యశోద లాలి
కరి రాజ ముఖునికి ....

కరి రాజ ముఖునికి గిరితనయ లాలి
కరి రాజ ముఖునికి గిరితనయ లాలి
పరమాంశ భవునికి పరమాత్మలాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
జోజో జోజో జో... జోజో జోజో జో...

అలమేలు పతికి అన్నమయ్య లాలి
అలమేలు పతికి అన్నమయ్య లాలి
కోదండ రామునికి గోపయ్య లాలి
కోదండ రామునికి గోపయ్య లాలి

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి

 ఆగమఋతునికి త్యాగయ్య లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
 

జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
లాలి లాలి లాలి లాలి

Saturday 9 November 2019

కలవరమాయేమదిలో


కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే...అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే..

చిత్రం : కలవరమాయేమదిలో
సంగీతం : శరత్ వాసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : చిత్ర

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో
కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే

మనసునే తొలి మధురిమలే వరించెనా
బతుకులో ఇలా సరిగమలే రచించెనా
స్వరములేని గానం మరపు రాని వైనం
మౌనవీణ మీటుతుంటే కలవరమాయే మదిలో

ఎదగని కలే ఎదలయలో వరాలుగా
తెలుపని అదే తపనలనే తరాలుగా
నిదురపోని తీరం మధురమైన భారం
గుండెనూయలూపుతుంటే కలవరమాయే మదిలో

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో

https://www.youtube.com/watch?v=BgjdKAZbxxg

Kanule Kalipe Song - Kalavaramaye Madilo Songs - Kamal Kamaraju - Swathi Reddy
Watch Kanule Kalipe Song From Kalavaramaye Madilo Movie, Starring Kamal Kamaraju, Swati Reddy, Vikra..

Friday 8 November 2019

బలమిత్రుల కధ





బలమిత్రుల కధ
మా ఇంట్లో ఈ విటుంటే ఎందుకో చెప్పలేని హాయ్

Music: Sathyam

Lyricist: C.Narayana Reddy

Singer: S.Janaki

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది

ఐనా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది

ఐనా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

పొద్దున్న చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే

పొద్దున్న చిలకను చూడందే ముద్దుముద్దుగ ముచ్చటలాడందే

చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయల

హోయ్ ... గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయ్ ఒక జట్టుగ తిరుగుతాయ్

ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్

ఒక పలుకే పలుకుతాయ్ ఒక జట్టుగ తిరుగుతాయ్

ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్

రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా

రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా

చిలకా కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి

హోయ్ ... గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

--(())--