Tuesday 19 November 2019

జరిగిన కథ ( 1969 )

ఏనాటి కైనా ఈ మూగ వీణా...రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

చిత్రం: జరిగిన కథ ( 1969 )
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

క్రిష్ణా...క్రిష్ణా...క్రిష్ణా.....

ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా
ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

నిను చెరి నా కధా వినిపించలేను...ఎద లోని వేదనా ఎలా తెలుపను
నిను చెరి నా కధా వినిపించలేను...ఎద లోని వేదనా ఎలా తెలుపను
మనసేమో తెలిసి మనసారా పిలిచీ...మనసేమో తెలిసి మనసారా పిలిచీ
నీలోన నిన్నే నిలుపుమూ స్వామీ...

ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

ఏ వన్నె లేనీ ఈ చిన్ని పూవూ...నా స్వామి మెడలో నటియించునా
ఏ వన్నె లేనీ ఈ చిన్ని పూవూ...నా స్వామి మెడలో నటియించునా
ఏలాటి కానుక తేలేదు నేనూ...ఏలాటి కానుక తేలేదు నేనూ
కన్నీట పాదాలు కడిగేను స్వామీ

ఏనాటి కైనా ఈ మూగ వీణా..
రాగాలు పలికి రాణించునా..ఆ...ఆ..రాణించునా

క్రిష్ణా...క్రిష్ణా...క్రిష్ణా.....

https://www.youtube.com/watch?v=VXh3OnNpsQI

Yenaatikainaa Song - Jarigina Katha Movie Songs - Krishna - Kanchana - Jaggaiah
Watch Yenaatikainaa Song From Jarigina Katha Movie, Starring Krishna, Jagayya, Vijayalalita among Ot...

No comments:

Post a Comment