Tuesday 30 August 2016





జమున గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు :)
అనురాగము విరిసేనా ఓ రే రాజా...అనుతాపము తీరేనా

చిత్రం: దొంగరాముడు (1955)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: సుశీల

పల్లవి:
ఆఅ ఆఅ ఆఆ........
అనురాగము విరిసేనా ఓ రే రాజా
అనుతాపము తీరేనా
విను వీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా ఓ రే రాజా
అనుతాపము తీరేనా

చరణం 1:
నిలిచేవు మొయిలూ మాటునా పిలిచేవూ కనులా గీటునా
నిలిచేవు మొయిలూ మాటునా పిలిచేవూ కనులా గీటునా
పులకించు నాదు డెందము ఏ నాటి ప్రేమాబంధమో...
ఓ రే రాజా...అనురాగము విరిసేనా

చరణం 2:
మునుసాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో
మును సాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమొ తేటగా తెనిగించవయ్య మహరాజా
ఓ రే రాజా...అనురాగము విరిసేనా..
విను వీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా....

Movie: Donga Ramudu (1955) Cast: ANR, Savithri, Jamuna Music: Pendiala Nageswara Rao Songs 1.Anuragamu Virisena 2.Balagopala 3.Levoyi…

Wednesday 3 August 2016

01. అమరజీవి (1983),02. పసివాడి ప్రాణం (1987),03.దేవత,04. అంతా మన మంచికే (1972) ,05. చక్రపాణి,06.విప్రనారాయణ (1954), 07.చండీరాణి (1953) 08.సంకీర్తన (1987)- 09.కిల్లర్ (1993), 10. చంద్రలేఖ 11.సతీ సక్కుబాయి

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ ఆమ్     ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
 సుఖినోభవంతు 





ఇదేదో గోలగా ఉంది...ఎదంతా వేడిగా ఉంది...అదేం గుబులో ఇదేం తెగులో...
చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్
ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ

చరణం 1:
ఒంటిగా పండుకోనీదు కంటికే మత్తు రానీదు
అదే ధ్యాస అదే ఆశ నేనాగేదెట్టాగా
పువ్వులే పెట్టుకోనీదు బువ్వనే ముట్టుకోనీదు
అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగా
కోరికే తహతహమంటాది ఊపిరే చలిచలిగుంటాది
అదేం సెగలో ఇదేం పొగలో అదేలే ఈడంటే..హే

ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ

చరణం 2:
బుగ్గకే సిగ్గు రాదాయే మనసుకే బుద్ధి లేదాయే
అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగా
చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే
అదేం కిలకో అదేం పులకో నే బతికేదెట్టాగా
రెప్పలో రెపరెపగుంటాది రేతిరే కాల్చుకు తింటాది
అవేం కలలో అవేం కథలో అదేలే ప్రేమంటే..హాయ్

ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హే
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్

Megastar Chiranjeevi and Vijashanthi fe

ature in this song from 'Pasivadi Pranam'
youtube.com



స రి గ మ ప పాట పాడాలి.. పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి...
చిత్రం: అంతా మన మంచికే (1972)
సంగీతం: సత్యం
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: భానుమతి

పల్లవి :
స రి గ మ ప పాట పాడాలి
పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి

చరణం 1 :
పాటలె పూవుల బాట వెయ్యాలి
ఆ బాటలో సూటిగ సాగిపోవాలి
శృతిలో కలవాలి.. జతగా మెలగాలి..
అంతా ఒకటై సంతోషంగా ఆడుకోవాలి

చరణం 2 :
ఆనందం మధురానందం
అనుభవ సారమె సంగీతం
పశువులనైనా.. శిశివులనైనా
పాములనైనా జో కొట్టేది చల్లని గీతం
సనిదపమగరిస.. సనిదపమగరిస..
అబ్బబ్బ సనిదపమగరిస.. సనిదపమగరిస..
నో నో నో సనిదపమగరిస


మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా....
చిత్రం : చక్రపాణి
సంగీతం : పాలువాయి భానుమతి రామక్రిష్ణ,
రచయత : రావూరి రంగయ్య
గానం : పాలువాయి భానుమతి రామక్రిష్ణ,

మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా....

వెన్నెల డోలికాలా పున్నమి జాబిలి పాపవై
కన్నులనూగవే చల్లగా రావే నిదురా హాయిగా...

పిల్ల తెమ్మెరలా వూదిన పిల్లన గ్రోవివై
జోల పాడవే తీయగా రావే నిదురా హాయిగా....

కలువ కన్నియాలా వలచిన తుమ్మెద రేడువే
కన్నుల వ్రాలవే మెల్లగా రావే నిదురా హాయిగా..

మెల్లమెల్లగా చల్లచల్లగా రావే నిదురా హాయిగా...చిత్రం:- చక్రపాణి,…

సావిరహే తవ దీనా రాధ...సావిరహే తవ దీనా రాధ...
చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : జయదేవుడు
నేపధ్య గానం : భానుమతి

పల్లవి :
విరహే.. ఏ.. ఏ.. ఏ.. ఏ.. తవ దీనా... ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా

చరణం 1 :
నిందతి చందన మిందు కిరణమను విందతి ఖేద మదీరం
వ్యాల నిలయ మిలనేన గరళమివ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వ్యాల నిలయ మిలనేన గరళమివ కలయతి మలయ సమీరం
సావిరహే తవ దీనా

చరణం 2 :
కుసుమ విషిఖసర తల్పం అనల్ప విలాస కళా కమనీయం
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం
సావిరహే తవ దీనా

చరణం 3 :
ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ
నిగదతి మాధవ
నిగదతి మాధవ తవ చరణే పతితాహం
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం

సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా
కృష్ణ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తావవిరహే తవ దీనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సావిరహే తవదీనా రాధా..విందతి చందన...చిత్రం :- విప్రనారాయణ…

ఓ తారకా నవ్వులేల ననూగనీ...అందాలు చిందెడి చందమామ నీవని
చిత్రం: చండీరాణి (1953)
సంగీతం: విశ్వనాథన్, రామ్మూర్తి
గీతరచయిత: సముద్రాల
నేపధ్య గానం: ఘంటసాల, భానుమతి

పల్లవి:
ఓ తారకా నవ్వులేల ననూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని
ఓ జాబిలీ ..ఓ.. ఆ తారక నవ్వునోయి నినూగనీ

చరణం 1:
వినువీథిలోని తారాకుమారీ
దరిజేరనౌనా ఈ చందమామా
చేరువే తారా రేరాజుకు.. ఊ..

ఆ తారకా నవ్వునోయి నినూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని
ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ

చరణం 2:
మనోగాథ నీతో నివేదించలేను
నివేదించకున్నా.. జీవించలేను ఊ...
నెరజాణవేలే ఓ జాబిలీ ఓ..
ఆ తారకా నవ్వునోయి నినూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని

ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ
చరణం 3:
తొలిచూపులోని సంకేతమేమో
చెలినవ్వులోని ఆ శిల్పమేమో...
నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలీ..ఓ
ఆ తారకా నవ్వునోయి నినూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని

ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ


నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు :)
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే...మనసే పాడెనులే

చిత్రం : సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :
తందన్న తానన్న తననననా నాన
తందన్న తానన్న తననననా నాన...
తందన్న తానన్న తందన్న తానన్న తందన్న తందన్ననా

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా
ఏటి మలుపులా విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే

చరణం 1 :
ఆ ఆ ఆ.....
కోయిలలై పలికే... తీయని నీ పిలుపే...
కురిసెను కోనల్లో రాగాలేవో
కోయిలలై పలికే... తీయని నీ పిలుపే
కురిసెను కోనల్లో రాగాలేవో

అందియలై మ్రోగే సందెలోనే... అంచులు తాకే అందాలేవేవో
జిలుగులొలుకు చెలి చెలువం.... లల్లా లల్లా లల్లా లల్లా
కొలను విడని నవ కమలం... లల్లా లల్లా లల్లా లల్లా
జిలుగులొలుకు చెలి చెలువం... కొలను విడని నవ కమలం
అది మీటే నాలో ఒదిగిన కవితల

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా.. విరితోట పిలుపులా
ఏటి మలుపులా.. విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే

మనసే పాడెనులే మైమరచి.. మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి.. మనసే పాడెనులే

Manase Padenule - Superhit Song - Sankeerthana - Ramya Krishna & Nagarjuna. Enjoy this beautiful…

సింధూరపూ పూదోటలో చిన్నారి ఓ పాపా...ఏ పాపమో ఆ తోటలో వేసిందిలే పాగా
చిత్రం: కిల్లర్ (1993)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:
సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే..ఏ..ఏ..
ఆ కథ ఎందుకులే..ఏ..

చరణం 1:
తనువే.. కధలల్లే.. కనుపాపే నా బొమ్మగా
మనసే.. తెరతీసే.. పసిపాపే మా అమ్మగా
కనులు పగలు కాసే.. చల్లని వెన్నెల కాగా
చిలక పలకగానే.. గూటికి గుండెలు మ్రోగ
విధి చదరంగంలో.. విష రణరంగంలో
గెలవలేని ఆటే.. ఎన్నడు పాడని పాట

చరణం 2:
రాబందే కాదా.. ఆ రామయ్యకు బంధువు
సీతమ్మను విరహాలే.. దాటించిన సేతువు
కోవెల చేరిన దీపం.. దేవుడి హారతి కాదా
చీకటి మూగిన చోటే.. వేకువ వెన్నెల రాదా
ఈతడు మా తోడై.. ఈశ్వరుడే వీడై..
కలిసి ఉంటే చాలూ.. వేయి వసంతాలూ

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
పాపనికే.. మా తోటలో.. లేదందిలే జాగా

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి

చిత్రం : చంద్రలేఖ
సంగీతం : సందీప్
రచన : సిరివెన్నెల
గానం : రాజేష్

పల్లవి :

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి, పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసా..ని…

కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై, చిలిపిగ చిందాడవే కిన్నెరసా…ని..
మెలకల మందాకిని కులుకుల బృందావని, కనులకు విందీయవే ఆ అందాన్ని…

చరణం :

చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతి పూట దీపావళి

మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మ్రోగే వేళ
ఆ సందడే ఆనందమై, ప్రేమించు ప్రాణం పాడే వేళ…

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై.
తొలకరి మేఘానివై రా కల్యాణి

పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

చరణం :

నడయాడే నీ పాదం నట వేదమేనంటు
ఈ పుడమే పులకించగా
నీ పెదవే తనకోసం అనువైన కొలువంటు
సంగీతం నిను చేరగా

మా గుండెనే శృతి చేయవా నీ వీణగా
ఈ గాలిలో నీ వేలితో రాగాలు ఎన్నో రేగేవేలా
నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగులై సాగేవేళ

ఉరుములు నీ మువ్వలై, మెరుపులు నీ నవ్వులై.
తొలకరి మేఘానివై రా కల్యాణి

పరుగులు నీ గానమై, తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని

http://l3.linksden.xyz/telugu1/Chandralekha%20(1998)/06%20-%20Urumulu%20Ni%20Muvvalai%20[DRGM].mp3