Saturday 29 May 2021








ఓ మనిషి తెలుసుకో  ( కత ) 

ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు...

లే, లేచి నిలబడు..  అన్వేషించు , ఆలోచించు , ఆచరించు ,మనోనిగ్రహ శక్తిని ఉంచు, గుండె ధై ర్యాన్ని పైకి తేవాలి. అప్పుడే అసాధ్యలు సుసాధ్యం అయ్యేది... అద్భుతాలు జరిగేది...


మన మార్గ మధ్యలో విమర్షించే వాళ్ళు ఉంటారు... ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు.... 

తిట్టే వాళ్ళు ఉంటారు... పొగిడే వాళ్ళు ఉంటారు.... అందులో నీకు ఏది అవసరమో అదే తీసుకో... 

నిన్ను నీవు నమ్మి నడుచుకో నిర్మలమైన మనస్సుతో జీవితాన్ని తెలుసుకో  


ముందుకు సాగిపో... ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకు...సోమరిలా మేరకు, నీవు చేసే కృషి ఆపకు  

విజయం దాని అంతట అదే నీ దరికి చేరుతుంది..అంత దాకా ఓర్పు వహించటం మానవజన్మకు ప్రధానమైనది.  


 *ఋతువులు మారినప్పుడు శరీరాన్ని...* 

 *పరిస్థితులు మారినప్పుడు మనస్సుని ధృడ* *పరుచుకోవాలి అప్పుడే జీవితాన్ని*  *కొనసాగించగలం....* 

 *లేకపోతే శరీరానికి అస్వస్థత...* 


*నమ్మ కముతోనే జీవితాలు సాగు *

 *మనస్సుకు గాయాలు రెండూ తప్పవు...* 

 *ఏది ఎలా ఉన్నా శరీరానికైనా..* 

 *మనస్సుకైనా దృఢత్వం చాలా ముఖ్యం....* 


 *శాంతాన్ని మించిన తపస్సు లేదు,* 

 *సంతోషానికి సమానమైన సుఖంలేదు.* 

  *కోరికలను మించిన అనారోగ్యం లేదు,* 

 *కరుణను మించిన ధనం లేదు.* 


 *మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు..* 

 *మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి.* 

 *భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి* .

      

కవుల అనుభవం సాహిత్య సంపద , అందరికీ ఉపయోగపడే సంపద బాట  పూలతో లక్ష్యాన్నిచ్చేది,  గతుకులతో అనుభవాన్నిచ్చేది బాట సత్య మార్గమ్ము చూపేది, ప్రశ్నకు జవాబయ్యెది.   

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 


మౌలిక అభిప్రాయాలు🧘‍♀️

(Four basic ideas) 


మొదటిది - సృష్టిలో సర్వత్ర గోచరించే ఏకత ( the fundamental unity of all existence )

ఈ గ్రంథంలో ` ఏకత " అనే పదం ( unity ) ఒక ప్రత్యేకార్థంలో వాడబడింది. ఏకత , ఐకమత్యం అనే పదాలు , దేశం యొక్క ఐక్యత సైన్యంలోని ఐక్యత , గ్రహాలలోని పదార్థం ఆకర్షణ శక్తిచే ఒక్కటిగా నుండుట అనేది సామాన్యమైన అర్థం. 

కానీ ఈ పదం ఈ గ్రంథం లో ప్రత్యేకార్థం కలిగి ఉంది .. ఉన్నదంతా ఒక్కటే ( all existence is one thing ) ఇక్కడ విభిన్న పదార్థాలు ఒక్కటిగా వుండటం కాదు. విభిన్న పదార్థాలే లేవు. ఉన్నదంతా ఒక్కటే ( విభిన్నంగా ఉన్నట్లు మనకు గోచరిస్తున్నాయి ) అనే అర్థం స్పురించాలి.. ఇదే సత్ ( being ) ఉండేది ఒక్కటే అయినా రెండుగా వ్యక్తమవుతూ ఉంది. విద్యుత్ శక్తి ఒక్కటే అయినా ధనము - ఋణము ( positive - negative ) అనే రెండుగా వ్యక్తమవుతూ ఉంది. రెండుగా వ్యక్తమయ్యే ఒకే పదార్థం అయిన సత్ పదార్థము చైతన్యం - పదార్థం ( consciousness - substance ) అని రెండుగా వ్యక్తమవుతూ ఉంది.

 ఈ ఒకే పదార్దామైన సత్ పూర్ణం ,, అభిన్నం. భిన్న వస్తువులు ఎప్పటికీ పూర్ణ వస్తువులు కాలేవు. రెండవది ఉన్నప్పడే పోల్చుట సాధ్యమవుతుంది. కానీ ఉండేది ఒక్కటే అయినప్పుడు పోల్చుట అనే ప్రసక్తే ఉండదు. ఈ సత్ అప్రమేయము ( కొలతకు వీలుకానిది ) , అద్వతీయము , పరిపూర్ణము అయినది. ఇట్లాంటి సత్ అన్ని రూపాల్లో పూర్ణంగా వెలసివుంది . అన్ని రూపాలు దాని రూపాలే ... మానవుడు , దేవుడు , అణువు , మహాత్తు, ఇవి వ్యవహారం లో వేరుగా తోచినా తత్వ్తతః అవి పూర్ణములే - పరిపూర్ణతయే వీని లక్షణం.

2. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు.( There are no dead matter )

సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు. ప్రతీ అణువు కూడా జీవంతో తొణకిసలాడుతూ ఉంది. సూక్ష్మ లోకాల్లో అన్ని అంతస్తుల్లో వుండే ప్రతీ ఒక్క సూక్ష్మాణువు జీవంతో నిండి ఉంది.

3. విశ్వమంతా మానవునిలో సూక్ష్మంగా వెలసి ఉంది.

మానవునిలో దేవతలు దేవతాగణాలు నివాసం చేస్తూవున్నారు . చిన్న , పెద్ద అనేది వ్యవహార దృష్టిలో మాత్రమే. అంతా బ్రహ్మపదార్థమే అయినప్పుడు చిన్న లేదు , పెద్ద లేదు , అన్ని పరబ్రహ్మమే.

4. ఒకే జీవం _ ఒకే ధర్మం (One life one law )

బయట లోపల , క్రింద పైన , చిన్న పెద్ద ఇవన్నీ పరిమితం , స్థూలము అయిన సంకుచిత దృష్టికి మాత్రమే. ఉండేది ఒక్కటే అయినప్పుడు , ఈ భేదాలకు అవకాశమే లేదు. పరిమితమైన మనసు ఈ భేదాలను సృష్టిస్తుంది. ఉన్నది ఒకే ఒక్క జీవం. ఒకే అంతర్లీనమైన ధర్మం. 

ఈ సత్యాన్ని హెర్మయస్ అనే గ్రీక్ తత్వజ్ఞుడు బోధించారు.

****


విశ్వాసం (చిన్న కధ ) 

ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది, " నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.
వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు), మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి, ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,

" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ డికాషన్ వచ్చింది........
అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,

" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.

కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?
మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది.
గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి, నీటిరంగునే మార్చింది.. అవునా..!!
ఇప్పుడు చెప్పు..

వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు? మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. ) గట్టిపడిపోతావా..?
పరిస్థితులను మారుస్తావా...?

ఇక్కడ నీదే ఎంపిక, దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.
ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు. దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..

" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది.

--((***))--

🧘‍♂️ఆత్మావలోకనం🧘‍♀️

ఆత్మ పరిపూర్ణత్వాన్ని మనం అర్థం చేసుకునే వరకు, అనుభూతి పొందేవరకు అపరిపూర్ణమైన ప్రాపంచిక విషయాలపై మక్కువ కలిగి ఉంటాం. పసివాళ్లు వాళ్ల పరిమిత జ్ఞానాన్ని బట్టి వస్తువులకు ఆకర్షితమవుతారు. 

పెరిగి, వ్యక్తిత్వాన్ని సమకూర్చుకున్న వ్యక్తి అందుకు తగిన వస్తువుల పట్లే ఆకర్షితుడవుతాడు. పిల్లలాశపడే అర్థం లేని వస్తువుల్ని చూసి వాళ్ల అమాయకత్వానికి, అజ్ఞానానికి నవ్వుకుంటాడు.

 ప్రస్తుతం మన పరిస్థితీ అదే. పసివాడి పరిస్థితి. మానవజన్మ ఔన్నత్వాన్ని గ్రహించక, పరిమిత వస్తుజాలానికి ఆశపడుతూ వాటితో తృప్తిపడుతున్నాం. మనం పశుపక్ష్యాదులకంటే తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నాం. ఆశపడుతున్నాం.

పులి, సింహం లాంటి మృగాలు ఎంత ఆకలి గొన్నా గడ్డి తినవు. గోవు, ఏనుగు మాంసాహారాన్ని ముట్టవు. చకోరపక్షులెంత దాహార్తితో ఉన్నా మేఘాలు వర్షించే శుద్ధజలాన్ని తప్ప నేల మీది నీటికి ఆశపడవు. అవి అసంకల్పితంగానే, అజ్ఞాన దశలోనే వాటి వాటి ఆభిజాత్యాన్ని అనుసరిస్తాయి. జాతి మూల తత్వాన్ని నిలుపుకొంటాయి. మరచిపోవు. 

మనిషి మాత్రమే... మానసికంగా, శారీరకంగా ఎంతో ఉన్నతదశలో ఉన్న మనిషి మాత్రమే దురదృష్టవశాత్తూ తానేమిటో, తానెవరో మరచిపోయాడు. తాహతుకు తగని అల్ప వ్యక్తిత్వంతో తగ్గిపోయాడు. చిన్నబోయాడు. చిన్నపిల్లాడు సరదాపడి పెద్దల పెద్ద చొక్కా వేసుకుంటే వినోదంగా బాగానే ఉంటుంది. కానీ, పెద్దమనిషి చిన్నపిల్లాడి దుస్తులు వేసుకుంటే పరిహాసాస్పదంగా ఉంటుంది. అసహ్యంగానూ ఉంటుంది. మన పరిస్థితి అది అదే.

ఒక చిన్న మొలక మొలకలాగే ఉండదు. ఎదుగుతుంది. వృక్షమవుతుంది. ఫల పుష్పాదుల నిస్తుంది. శీతలఛాయలు పరుస్తుంది. గోవత్సం వత్సగానే ఉండదు. గోవు అవుతుంది. లేదా కోడెదూడ అవుతుంది. వృషభం అవుతుంది. మొనగాడవు తుంది. రైతు బరువుల్ని, బాధల్ని ఒక్క మెడమీద మోస్తుంది. మూపున కాస్తుంది. 

శిశువుగా పుట్టిన మనిషి శరీరాన్ని పెంచుకుంటున్నాడు. శరాన్ని పెంచుకోవడం లేదు! ఆభిజాత్యాన్ని గుర్తించే శరం, ఔన్నత్యాన్ని గ్రహించే శరం... బేశరం! ఏం చూసుకుని తలెత్తుకు తిరుగుతున్నాం? అద్దంలో శరీరాన్ని చూసుకుని మురవటమేనా? లోపలేముందో గమనించవద్దా?

గుప్తనిధుల కోసం గుళ్లూ, గోపురాలూ తవ్వి చరిత్ర గుండెలు ఛిద్రం చేయటం కాదు. కొలతలకు, అంచనాలకు అందని అపారనిధి ఉంది మన అంతః మందిరంలో, అంతరంగంలో. దాన్ని తవ్వవద్దా, లోతులు తెలుసుకోవద్దా? లోపల ఏ అద్భుత, అపురూప నిధి ఉందో తెలుసు కోవద్దా?  మాటల కోతలు పెట్టి అవమానించటం మాత్రమే మనకు తెలిసింది. 

మలమూత్రాలు, రక్తమాంసాలు నిండిన తుచ్ఛశరీరమా ఇది? కాదు. ముక్కోటి దేవతల మురిపాల మందిరం. మేరుదండ విపంచిపై రుద్రవీణకులా నిట్టనిలువుగా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మక ప్రతీకలుగా నిలిచిన చక్ర సముదాయం. అధిష్ఠాన దేవతలుగా గణపతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుతీరిన నిటారు పవిత్ర ప్రాంగణం. శివపార్వతుల సమ్మేళన కేంద్రం సహస్రార కమలం. రాత్రింబవళ్లు, శుక్ల కృష్ణ పక్ష నియమభేదాల్లేని సూర్యచంద్రుల సదా విరాజమాన సదనాలు నయనాలు.

సుషుమ్న ద్వారా ఎప్పుడు పైకెగబాకుతుందో తెలీని కుండలినీ మాత రాకకై సుషుమ్నకు ఇరువైపులా ఇడా పింగళ నాడులుగా శ్వాస అనే వింజామరలు వీస్తూ పైకీ కిందకూ లయబద్ధ విన్యాసం చేస్తున్న అదే సూర్యచంద్రులు. మానవ శరీరంలోని త్రికోణాకార మూలాధార చక్రాన్నే మణిద్వీపంగా మూడున్నర చుట్టలుగా ఒదిగి రాజసంగా నిద్రిస్తున్న దేవి. ఇవేనా? ఎన్నో. ఇదీ మన దేహం. మనం. 'నేను' అనే పవిత్రాత్మ శిలలోని జలలా, టెంక చుట్టిన నారికేళంలోని అమృత తీర్థంలా విరాజమానమై ఉన్న... దేహం.

అద్భుతమైనది ఏదైనా వ్యర్థం మధ్యే ఉంటుంది.. నిగూఢంగా. ఆత్మ అయినా అంతే. ఈ విషయం మనం గ్రహిస్తే ఈ ఆత్మ వజ్రాన్ని ధరించిన ఈ దేహాన్ని 'నేను' అనుకుంటున్న ఈ దేహశకల సముదాయాన్ని ఎంత అజ్ఞానంగా, ఎంత వ్యర్థంగా, ఎంత అర్థరహితంగా వినియోగించుకుంటున్నామో అర్థమవుతుంది.

నేను' పరిమితం అనుకున్నప్పుడే పరిమితమైన ఆలోచనలు. అంచనాలు, కోరికలు. నేను అని భ్రమ పడుతున్న ఈ శరీరాన్ని శిశువును మోసే పవిత్ర గర్భకోశంలా వికసించనీ, విస్తృతం కానీ. అప్పుడు... తాను ఎంత పవిత్రమో, ఎంత ఘనమో, ఎంత విశాలమో, ఎంత అనంతమో అర్థమవుతుంది.

--(())--

✍ _*ఒక మాస్టార్ని ఓ విద్యార్థి అడిగాడు. సార్, మీరు నేర్పించిన విద్యతో మేము చాలా ఎత్తుకి ఎదిగినప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ రాదా అని. ఎందుకు అని ఆయన అడిగితే "మీరు చేరలేని స్థాయికి మేము చేరుకున్నాం కానీ మీరు మాత్రం ఇలాగే ఉండిపోతున్నారు కదా" అని.*_

_దానికి మాస్టారు శైలిలో కొంత విడమరిచి చెప్పాల్సి వచ్చింది._

_"ఓ యాభై అంతస్తులున్న బిల్డింగ్ ఎవరు కడతారు. యాభై అడుగుల మనిషి కాదు కదా. ఆరు అడుగుల లోపే ఉన్న మనిషి కడతాడు. అంటే ఎంత ఎత్తున బిల్డింగ్ కట్టడానికి అంత ఎత్తున్న మనిషి కావాలి అంటే ఎలా??_

_ఎందరికో నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదే అని ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు. తను నీడ గురించి ఆలోచించకుండా ఉంటేనే నలుగురికి నీడనివ్వగలదు. టీచర్ కూడా అంతే. తన నీడలో ఎందరు ఎదిగినా అది తన ఎదుగుదలగా గుర్తించి ఒదిగి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. అది నేను ఆస్వాదించాను" అని చెప్పాడు._

💐 *Dedicated to all Teachers* 💐

--(())--

 *🧘‍♂️'నేను'ను వదలడమే అసలైన వేదాంతం🧘‍♀️*

*హిమాలయాల నుండి వేదాంతం నేర్చుకోవడానికి ఓ నవయువకుడైన సన్యాసి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త వద్దకు వెళ్లాడు. అతనిలో ‘నేను గొప్పవాణ్ని’ అనే అహం ఉంది.*

 *‘నాకు అన్నీ తెలుసు కానీ గురువు ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చాను’ అనే తెంపరితనం ఆ యువ సన్యాసిలో ఉంది. ఆ అహంతోనే.. ఆశ్రమం గేటు దగ్గరికి వెళ్లి ‘నేను వచ్చాను’ అనే మాట ఓ చీటీపై రాసి లోపలికి పంపించాడు.* 

*లోపలున్న ఆధ్యాత్మికవేత్త ఆ చీటి వెనక్కి త్రిప్పి ‘‘నేను’ చచ్చాక లోపలికి రమ్మను’- అని జవాబురాసి పంపించాడు. ‘‘నేను’- అనే అహంకారం చచ్చాక రమ్మని చెప్పు’ అని దీని అర్థం.* 

*దీంతో ఆ యువ సన్యాసి తలతిరిగిపోయింది. అహంకారం, మమకారం.. మన వేదాంత శాస్త్రాలన్నీ ఈ రెండు మాటలపైనే ఎక్కువ శ్రద్ధపెట్టాయి. ఆ రెండూ నశిస్తే వచ్చేది మోక్షమే. ఈ ‘నేను’లో కులం, మతం, అందం, రూపం, గుణ, భాష, ప్రాంతం, ధనం, పేరు, పదవి - ఇలా ఏదో ఒకటి ఉంటుంది.* 

*వీటిలో దేనిపైనా వ్యామోహం చెందకుండా జీవించడమే నిజమైన వేదాంతి లక్షణం. దేన్నో తెలుసుకోవడం కన్నా మనల్ని మనం తెలుసుకోవడమే నిజమైన సత్యాన్వేషణ. ఆదిశంకరుడు ఈ విషయాన్నే ‘అద్వైతం’ అనే సిద్ధాంతాన్ని అందించి చూపిస్తే రమణమహర్షి లాంటి వాళ్లు ఆచరించి చూపించారు.*

 *‘నేను’ అనే వలయంలో చిక్కుకొన్నవారు సత్యాన్వేషణ చేయలేరు. వాళ్లు చేసే ప్రతి పనికి అది అడ్డుగా నిలబడుతుంది. అది ఉన్నవాళ్లు ఆత్మజ్ఞానం కన్నా అర్థజ్ఞానం గొప్పది అనుకుంటారు. దానికోసం అనేక విషవలయాల్లో చిక్కుకొంటారు. అన్నీ నాకే కావాలనుకొంటారు. అది వదలడం అంత సులభం కాదు.*

*‘నేను’ అన్న అహంకారమే రావణబ్రహ్మను, దుర్యోధనుణ్ని అధ:పాతాళంలోకి తొక్కివేసింది. ఆ అహంకార, మమకారాలను తగ్గించడమే వేదాంతం లక్ష్యం. అందుకే మన పెద్దలు వాటిని తగ్గించేందుకు ఆ రెండిటి చుట్టూ రకరకాల కథలల్లారు.*

--(())++

*🧘‍♂️గురువులు🧘‍♀️*


🔥ఓంశ్రీమాత్రే నమః🔥

*గురువులు ఎన్ని రకాలు ఉంటారు ? గురువుల వలన నీకు ఏమిటి ఉపయోగం ? ఏ గురువుని నువ్వు ఆశ్రయించాలి?*

*1) సూచక గురువు:- బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో  నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. వీరిని సూచక గురువు అంటారు. వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు.*

*2) వాచక గురువు:- ధర్మా ధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు. ( బ్రహ్మ చర్యము , గృహస్థము , వానప్రస్దానం , సన్యాసం )  వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో నివసిస్తావు.*

*3) బోధక గురువు:- మహా మంత్రాలను ఉపదేశిస్తారు లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని , అలౌఖిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని  వీరిని భోధక గురువు అంటారు. లోకికం నుండి అలౌఖికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు.*

*4) నిషిద్ద గురువులు:- మారణ ప్రయోగాలు , వశికరణాలు , వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది చిత్తాన్ని శుద్ధి చేయరు విత్తాన్ని హరిస్తారు. ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి.)*

*5) విహిత గురువు:- మన హితము గోరి సూచనలు సలహాలు ఇస్తారు , నశించి పోయే విషయ భోగాలు పై ఆసక్తి తగ్గించి, సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖం చేస్తాడు.( ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణతో జీవిస్తావు.)*

*6) కారణ గురువు:- ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు. ( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటావు.)*

*7) పరమ గురువు:- ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు. శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని "అహం బ్రహ్మస్మి" అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు అవగహన కల్పించి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళేవారు ఈ "పరమ గురువులు". వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. నీ నిజజీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీజన్మల విడుదలకు మార్గం చూపేవారు ఈ "పరమగురువు".*


[26/05, 18:53] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩


*ఆచార్య సద్బోధన*


*జీవితం నిరంతరం ప్రకాశంతో కూడుకునే ఉంటుంది. మంచి చెడుల ప్రభావంతో దానికి ప్రమేయం లేదు.*


*మనం సారవంతమైన దానిని కనుగొన్నప్పుడు దానిని పొందే ప్రయత్నం వెంటనే చేస్తాం. మన జీవనకాలమంతా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే, దాని ప్రభావం తప్పక ఇతరుల మీద కూడా కనిపిస్తుంది.*



*మన వద్దకు వచ్చిన వారెవరైనా, మనం ఎవరి వద్దకు వెళ్ళినా వారికీ ఆధ్యాత్మికతను తప్పక అందిస్తాం. మన అలవాట్లు, మనస్సు యొక్క స్వభావం పరిసర వాతావరణం మీద తప్పక ప్రభావాన్ని చూపిస్తుంది.*



*మన వద్ద ఉన్నది ఏదైనా ఇతరులతో పంచుకునేందుకు తహతహలాడతాం. అదే విధంగా మన మనస్సులోని ఆలోచనా తరంగాల ప్రభావం సమస్త మానవాళి మీద ప్రతిఫలిస్తుంది. ఈ విశ్వాన్ని మనదిగా చేసుకుంటే దానిని మించి మరొకటి లేదని ఆనందంగా జీవిస్తాం.*


*శుభం భూయాత్*


🕉🌞🌎🌙🌟🚩

[26/05, 18:53] +91 92915 82862: *బుద్ధుడు యోగం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


 సిద్దార్డునకు ఐహిక ప్రపంచపు కష్ట్టసుఖాలు తెలియకూడదని శుద్ధోధనుడు ఎంత ప్రయత్నించినా, తన 29వ ఏట, ఒక రోజు సిద్దార్డుడు, ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పీడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి ఛన్న (చెన్నుడు) ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది, ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు.



అప్పుడు సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ (మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం) లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు.



కాని సిద్దార్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు.తర్వాత సిద్ధార్దుడు, రాజగృహను విడిచిపెట్టి, ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేశాడు.



అలరకలమ అనే సన్యాసి, తన బోధనలలో సిద్ధార్దుని ప్రావీణ్యున్ని చేసి, తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని అ బోధనలవల్ల సిద్ధార్దుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో అ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు ఉదకరామపుత్త అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు.



కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు. తర్వాత సిద్ధార్దుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా, జ్ఞాన సముపార్జన కొరకు, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా త్యజించి సాధన చేసేవారు.



 ఈ విధంగా సిద్ధార్దుడు రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు, సిద్ధార్దుడు, నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్దుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు.



జ్ఞానోదయం:-


తర్వాత సిద్ధార్దుడు ధ్యానం, అనాపనసతి (ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యమ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్దుడు, బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు.



కాని కౌండిన్యుడు మరియు అతని ఇతర శిష్యులు, సిద్ధార్దుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడుగా భావించారు. చివరకు, తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది.



కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు బాధ్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని, ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్దునకు ఫాల్గుణమాసంలో జ్ఞానోదయమయ్యిందని చెప్తారు. అప్పటి నుండి గౌతమ సిద్ధార్దుడు, గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు.



జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు.



ఆయాచన సూక్తిలో ఉన్న కొన్ని గాథల ప్రకారం, జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. దీనికి కారణం, దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని అర్ధం చేసుకోలేడని బుద్ధుడు భావించాడు. కానీ బ్రహ్మ సహంపతి విన్నపంతో, గౌతమ బుద్ధుడు బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు. 



బౌద్ధమతంలో "నాలుగు పరమసత్యాలు" ప్రవచింపబడ్డాయి. అవి 

1. దుఃఖము

2. దుఃఖానికి కారణము

3. దుఃఖంనుండి విముక్తి

4. దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం

ఇవి గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహ సాధకులైన ఐదుగురు శ్రమణులకు చెప్పిన విషయాలు కనుక బుద్ధుడి మొదటి బోధనలు, "ధర్మ చక్ర పరివర్తన సూత్రం" అనే బుద్ధుని మొదటి బోధలో బుద్ధుడు మధ్యేమార్గం గురించి, అష్టాంగ సాధనామార్గం గురించి, నాలుగు పరమ సత్యాల గురించి చెప్పాడు.



 ఈ నాలుగు పరమ సత్యాలు అనే విషయాన్ని ఒక మత ప్రబోధంగా కాక అప్పటి కాలంలో ఉన్న ఉపశమన విధానం (కష్టాలు తీర్చే మార్గం)గా చెప్పాడు. 



థేరవాదుల భావం ప్రకారం ఈ నాలుగు పరమ సత్యాలూ ధ్యానానికి అర్హులైన సాధకులకు మాత్రమే తెలిసే ఉన్నత భావాలు. మహాయానుల భావం ప్రకారం ఉన్నత స్థాయి మహాయాన సూత్రాలను అందుకొనే స్థాయికి ఇంకా ఎదగని సాధకులకు ఆరంభ దశలో చెప్పవలసిన సూత్రాలు ఇవి. దూర ప్రాచ్య దేశాలలో వీటికి చెప్పుకోదగిన ప్రాచుర్యం లేదు.



అష్టాంగ మార్గం:


ధర్మ చక్రం లోని 8 ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు!



నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన దుఃఖ విమోచనా మార్గం అష్టాంగ మార్గం. ఆరంభ కాలపు బౌద్ధ గ్రంథాలలో (నాలుగు నికాయలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు.



అష్టాంగ మార్గం మూడు విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), సమాధి (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)

శీలము - మాటల ద్వారా, చేతల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:



1. "సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం,



2. "సమ్యక్ కర్మము" - హాని కలిగించే పనులు చేయకుండుట,



3. "సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం

సమాధి - మనస్సును అదుపులోకి తెచ్చుకోవడం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి.



4. "సమ్యక్ సాధన" - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట,



5. "సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం,



6. "సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలకు అతీతంగా మనస్సును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం

ప్రజ్ఞ - మనస్సును శుద్ధపరచే జ్ఞానము. ఇందులో రెండు అంగాలున్నాయి.



7. "సమ్యక్ దృష్టి" - అనిపించేలాగా కాకుండా (భ్రమ పడకుండా) ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం,



8. "సమ్యక్ సంకల్పము" - ఆలోచించే విధానంలో మార్పు

ఈ ఎనిమిది మార్గాలను పలు విధాలుగా వివరిస్తారు, విశ్లేషిస్తారు.



సాధనలో ఒకో మెట్టూ ఎదగవచ్చునని కొందరంటారు. అలా కాక అన్ని మార్గాలనూ ఉమ్మడిగా ఆచరించాలని మరొక భావన. నిర్వాణం చేర్చే బౌద్ధ మార్గం. ఇందులో ఎనిమిది అంశాలు ఉన్నాయి.



బుద్ధుడు చేసిన తొలి ఉపదేశాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధం. గౌతముడు జ్ఞానిగా పరిణామం చెంది, సారనాధ్‌ చేరి, అక్కడ పూర్వం తనతో తపస్సు చేసిన ఐదుగురు పరివ్రాజకులకు మొదటి సారిగా చేసిన ధర్మబోధలో ఇది భాగం.


1. సమ్మా దిట్ఠి (సమ్యక్‌ దృష్టి),


2. సమ్మా సంకప్ప (సమ్యక్‌ సంకల్పం),


3. సమ్మా వాచా (సమ్యక్‌ వాక్కు),


4. సమ్మా కమ్మంత (సమ్యక్‌ కర్మ),


5. సమ్మా ఆజీవ (సమ్యక్‌ ఆజీవిక),


6. సమ్మా వాయామ (సమ్యక్‌ కృషి),


7. సమ్మా సతి (సమ్యక్‌ స్మృతి),


 8. సమ్మా సమాధి (సమ్యక్‌ సమాధి). ఈ ఎనిమిది అంగాలతో కూడిన మార్గం అత్యున్నత స్థితిని (నిర్వాణాన్ని) పొందడానికి ఉపయోగపడేది. సమ్మా దిట్ఠి (సమ్యక్‌ దృష్టి). బాధలకు, వాటి నివారణకు సంబంధించిన పరమ సత్యాలను తెలుసు కొన లేకపోవడం అవిద్య. దానిని నిర్మూలించడం సమ్యక్‌ దృష్టి. మిచ్ఛా దిట్ఠి (మిధ్యా దృష్టి) కానిది సమ్మ దిట్ఠి. అంటే నాలుగు ఆర్య సత్యాల జ్ఞానం సంపాదించి ఉండటం.



సమ్యక్‌ సంకల్పం అంటే సదాశయాలను కలిగి ఉండటం, సదాలోచనలు చేయడం. వస్తువుల యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల ఇంద్రియ సుఖాల పట్ల విముఖత, ఎవరికీ హాని చేయకూడదనే వైఖరి, ద్వేష భావాన్ని తొలగించుకోవడం మొదలైన మంచి ఆలోచనలు కలగడం.



సమ్యక్‌ వాక్కు అంటే సత్యం పలకడం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడక పోవడం, దయతో, మర్యాద పూర్వకంగా మాట్లాడటం. సమ్యక్‌ కర్మ అంటే సాటివారి మనోభావాల పట్ల, హక్కుల పట్ల గౌరవంతో ప్రవర్తించడం. జీవ హింస చేయకపోవడం మొదలైనవి కూడా ఇందులో చేరతాయి.



సమ్యక్‌ జీవనం అంటే ఏ జీవికీ హాని కలిగించని వృత్తిని ఏదైనా జీవిక కోసం చేయడం. సమ్యక్‌ కృషి అంటే అవిద్యను తొలగించడానికి తొలి అడుగులు వేయడం. సమ్యక్‌ కృషికి నాలుగు ప్రయోజనాలను బుద్ధుడు చెప్పాడు.



అవి: అష్టాంగమార్గానికి విరుద్ధమైన మానసికి స్థితులు కలగకుండా చూసుకోవడం. అలాంటి మానసిక స్థితులు ఇదివరకే ఏర్పడి ఉంటే వాటిని తొలగించు కోవడం. అష్టాంగ మార్గానికి ఏవి అవసరమో అట్టి మానసిక స్థితులు కలిగేలా చూడటం.



ఇప్పటికే అట్టి మానసిక స్థితులు కలగి ఉంటే అవి మరింత వృద్ధి పొందడానికి దోహదం చేయడం. చెడ్డ భావనలు పెడదోవ పట్టించకుండా నిరంతరం మనస్సును జాగరితం చేసి ఉంచడం సమ్యక్‌ స్మృతి. అంటే శరీరాన్నీ, మనస్సునూ నిరంతరం జాగ్రతగా గమనిస్తూ, దుఃఖం కలిగించే పరిస్థితులు రాకుండా చూడటం.



 సమ్యక్‌ సమాధి అంటే ఏకాగ్రతను మించిన సమాధి స్థితి. సమాధిలో కేవలం మనస్సు ఏకాగ్ర స్థితిని చేరడమే జరుగుతుంది. దురాశ, ద్వేషం,అచేతనంగా, మందంగా ఉండటం, సందేహించడం, ఎటూ తేల్చుకొనలేకపోవడం అనే ఐదు సంకెళ్లను తెంచుకొని సరైన మార్గంలో నడచుకోవడం సమ్యక్‌ సమాధి.



ధ్యానం చేసే సమయంలో ఈ సంకెళ్లు బాధించకపోవచ్చునుగానీ, ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన తరువాత తిరిగి ఇవే మానసిక సంకెళ్లు పురోగమనానికి అడ్డం వస్తాయి. దుర్గుణాల నుంచి విముక్తుడు కావడం కూడా సమ్యక్‌ సమాధి సాధించే ఒక ప్రయోజనం.



బౌద్ధంలో ఎనిమిది శుభసూచకమైన చిహ్నాలున్నాయి.


1. ఛత్రము (గొడుగు గుర్తు)

2. బంగారు చేప

3. నిధి పాత్ర 

4. ధ్వజం

5. అంతులేని ముడి 

6. పద్మము

7. శంఖము

8. ధర్మ చక్రం


తాత్విక భావాలు:-


పాళీ భాషలోని రచనల ప్రకారం గౌతమ బుద్ధుడు కొన్ని తాత్విక సందేహాలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు.



 ప్రపంచం శాశ్వతమా, అశాశ్వతమా? ఆత్మ, శరీరం వేరు వేరా లేక ఒకటేనా? నిర్వాణం లేదా మరణం తరువాత ఉనికి ఉంటుందా? - ఇటువంటి ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం ఇవ్వకపోవడానికి కారణం జీవితంలో పనికివచ్చే జ్ఞానానికి అటువంటి అతివాద ప్రశ్నలు అడ్డుగా నిలుస్తాయన్న భావన - అని ఒక అభిప్రాయం. అంతే కాకుండా అటువంటి ప్రశ్నలు ప్రపంచం, ఆత్మ, వ్యక్తి అనే భావాలకు లేని వాస్తవాన్ని అంటగడతాయని కూడా కొందరంటారు.



పాళీ సూత్రాలలోనూ, చాలా మహాయాన, తాంత్రిక బౌద్ధ సూత్రాలలోనూ బుద్ధుడు ఇలా చెప్పినట్లు పేర్కొనబడింది - వాస్తవం (సత్యం) సామాన్యమైన మనస్సుకు, వాదానికి అతీతమైనది. ప్రాపంచిక దృష్టితో సత్యాన్ని తెలుసుకోవడం అసాధ్యం. "ప్రజ్ఞా పారమిత" సూత్రాలలో ఇది ఒక ప్రాథమిక అంశం. పఠనం, సాధన, ధ్యానం, విశ్వాసం, సూత్రాలపట్ల గౌరవం వంటి సాధనాల ద్వారా సత్యాన్వేషణకు మార్గం సుగమమౌతుంది. నిజమైన జ్ఞానం స్వయంగా తెలిసికోవలసిందే.



 "మహాపరినిర్వాణ సూత్రం" లేదా "ఉత్తర తంత్రం" అనబడే మహాయానసూత్రం ప్రకారం ధర్మాన్ని గురించిన వివేచన అవసరమే కాని వాదాలు, శాస్త్రాల పట్ల అతిగా ఆధారపడడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే నిజమైన జ్ఞానానికీ, వీటికీ సంబంధం లేదు. ఇదే భావం చాలా తంత్రాలలోను, సిద్ధాంతాలలోను చెప్పబడింది. మహాసిద్ధ తిలోపుడనే భారతీయ బౌద్ధ యోగి కూడా వాదాలను నిరసించాడు. వివిధ శాఖలలో భేదాలున్నాగాని అధికంగా బౌద్ధులు విశ్వసించే ప్రకారం పరమ లక్ష్యం (నిర్వాణం లేదా ముక్తి లేదా బోధి) అనేది మాటలకు అతీతమైనది అని.



బుద్ధుని నిర్యాణం:-

మహా పరనిభాన సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. తర్వాత, బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని (ఒక విషపు పుట్టగొడుగుల నుండి చేసిన వంటకం. పంది మాంసమని కొందరు భ్రమపడుతుంటారు.) భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు.



 అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తన అస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని ఒప్పించమని పంపాడు. కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణంగురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణమొందాడని ఒక వాదన ఉంది.



 తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరిని పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీఎవ్వరు, ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణమొందాడు.



 బుద్ధుని ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”.  బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత, అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు.



వీటిలో కొన్ని ఇప్పటికి భద్రంగా ఉన్నాయంటారు!  (శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపునుండే పన్ను ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినే టెంపుల్ ఆఫ్ టూత్ అంటారు). మరియు బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జునకొండ ప్రదర్శనశాల లో బంగారు డిబ్బీలో భద్రపరచబడి వున్నాయి!



 శ్రీలంకలో పాళీ భాషలో ఉన్న దీపవంశ మరియు మహావంశ శాసనాలను బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన 218 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ చైనాలో ఉన్న ఒక మహాయాన శాసనాన్ని బట్టి, అశోకుని పట్టాభిషేకం బుద్ధుడునిర్యాణమొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ రెండు ఆధారాలను బట్టి, బుద్ధుడు క్రీ.పూ. 486లో (ధేరవాద శాసనం) గానీ లేదా క్రీ.పూ. 383లో (మహాయాన శాసనం) నిర్యాణమొందాడు.



కానీ ధేరవాద దేశాలలో బుద్ధుడు క్రీ.పూ. 544 లేదా 543లోనిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం అశోకుని కాలం ప్రస్తుత అంచనాల కన్నా 60 సంవత్సరాల ముందని వీరు భావించడమే. బుద్ధుడు నిర్యాణ సమయంలో తన శిష్యులను, ఏ నాయకున్నీ అనుసరించవద్దని, తన సిద్ధాంతాలను, ధర్మాన్ని మాత్రమే అనుసరించమని చెప్పాడు. కానీ మహా మొగ్గల్లన మరియు సారిపుత్తలు అప్పటికే నిర్యాణమొందటంతో బౌద్ధ సంఘం మహాకశ్యపుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.   

నిజమైన జ్ఞానం 

స్వయంగా తెలిసికోవలసిందే!




*🧘‍♂️బుద్ధ జయంతి/బుద్ధుని జీవితంలో ప్రాముఖ్యత వహించిన వైశాఖ పౌర్ణమి🧘‍♀️*


ఆలోచనాపరులు , మానవ జాతి నాయకులు , జంతు జాలం , వృక్ష జాతి , ఖనిజ సంపద...ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. అనాదిగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో మహా వైశాఖిగా , తదుపరి కాలంలో ఇది బుద్ధ పూర్ణిమగానూ ప్రసిద్ధిగాంచింది.


వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజున ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా అధిక ఫలితం ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది.


బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.


గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు. దీనిని గమనించి బేతవన విహారదాత అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు.

శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు.

వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ

ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది.


రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి.

అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే *‘వట సావిత్రి’* మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం ఛాయవే అని అంటారు.


🕉️

Friday 28 May 2021

_

Feb 18, 2020 - This Pin was discovered by Út PhÚc. Discover (and save!) your own Pins on Pinterest.


శ్రీగురుభ్యోనమః🙏

భక్తులతో సాంగత్యం చేస్తే, మనకు ఉండేటటువంటి సంసారబాధలన్నీ కూడా క్రమముగా మనకి అంటని  ఒక స్థితి వస్తుంది. భగవత్ భక్తుల జీవితాల్ని తీసుకుంటే అపారమైనటువంటి కష్ట నష్టములుంటాయి. కష్టనష్టముల యందు భావన లేకుండా, భగవంతుని యందు భావన కలిగి ఉండడము చేత, ఆ కష్టము ఒక దూదిపింజ వలె, ఒక చెదిరిపోయిన మేఘము వలె వెళ్ళిపోతుంది.

దృష్టి సమస్య మీద కాక, దైవము మీద ఉంటుంది కాబట్టి, ఆ సమస్యను తీర్చాల్సిన బాధ్యత భగవంతుడు స్వీకరిస్తాడు.

యజ్ఞార్ధము, పురుషార్ధము, స్వార్ధము మూడున్నాయి.

యజ్ఞార్ధము: ఇతరుల శ్రేయస్సు కోసమే నేను బ్రతుకుతాను అనే దీక్ష పట్టిన వానికి  తన జీవితము మీద తనకు స్వామిత్వము వస్తుంది. నీ జీవితానికి నువ్వే రాజువైపోతావు. ఋషులు ఒక సూక్తినిచ్చారు.

 నిష్కారణముగా ఇతరుల శ్రేయస్సు కొరకై పనిచేసేవారు నిష్కారణముగా ఆనందంగా ఉంటారు.

*🧘‍♂️సహనమే సంస్కారం..!🧘‍♀️*_

*_-[అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసస్థలం]-_*

*_మన భారతీయ సనాతన సంప్రదాయాలు మనకు నేర్పినది ఏమిటి ? మనిషై పుట్టిన వానికి సహనం, శాంతం అవసరమని మన పూర్వీకులు నేర్పించారు. జీవితంలో ఆధ్యాత్మిక లక్షణాలను నేర్చుకోవాలన్నా, భౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి._*

*_చాలామంది ఎన్నో ముఖ్యమైన విషయంలలో 'అది నాకు సంబంధించింది కాదు' అని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రతిరోజూ తమ ప్రమేయం లేకుండానే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసో, తెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. ఇందులో గమ్మత్తేమిటంటే తను అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం.._*

_*సహనం అంటే ఏమిటి?*

*_నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకిత భావంతో చేసే కృషి, అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం, పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే శిఖరాలను అధిరోహించాలంటే సహనం తప్పనిసరి. ప్రపంచ మనుగడే సహనంతో ముడివడి ఉంది._*

*_మనిషి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణలు, ప్రేమరాహిత్యం అన్నింటినీ ఈ పుడమి భరిస్తూనే ఉంటుంది. అందుకేనేమో తత్వవేత్తలు సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పారు. ఎంత ప్రతిభ ఉన్నను ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా సహనం అవసరం._*

*_సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర పురాణాలే మనకు సాక్ష్యాలు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడం, గొప్ప నియంతలు మట్టిలో కలవడం లాంటివి ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసస్థలం. శ్రీకృష్ణుడు పాండవులకు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ నిజమైన యోగి లక్ష్యం స్థితప్రజ్ఞత అని అంటాడు._*

*_కొన్ని పరిస్థితుల్లో సహనం వేదనను రగిలిస్తుంది. మానసిక సమతుల్యతతో దాన్ని స్వీకరిస్తూ ఇష్టాయిష్టాలను పక్కనపెడితే విజ్ఞతతో ఒక కొత్త స్థాయిని చేరుకోవచ్చు. ఈ వేదన వలన భగవంతుడి తేజస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది._*

*_సహనం మానసిక స్వచ్ఛతకు దారిచూపి భగవదానుగ్రహానికి చేరువ చేస్తుంది. మనిషికి విలువైనదేదీ తొందరగా దక్కదు. లక్ష్యసాధనలో ఆటుపోట్లు తప్పవు._*

*_కష్ట, నష్టాలను భరించగలిగే సహనాన్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో జీవిస్తున్న మనిషి ద్వంద్వ వైఖరి లేకుండా చిత్త శుద్ధి ఎంతో అవసరం. స్పృహతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. నాణానికి బొమ్మ, బొరుసూ అంటు ఉంటాయి._*

*_మనిషి అన్ని తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజమే కానీ, ఎదో అదృశ్యశక్తి అనేది పరిస్థితుల్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనిషి యొక్క మంచి ఆలోచనలు సహనంతో ముడిపడి ఉంటాయి, ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి._*

*_ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనంలేని దుర్యోధనుడే కారకుడు అని ఉదాహరణగా చూసుకోవచ్చును. అసహనంవల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు._*

*_మత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. విచిత్రమేమిటంటే అన్నిమతాలు సహనాన్నే బోధిస్తాయి. వాటిని చదవడం, వినడంతో సరిపోదు హితభోదలు చేసే గ్రంథాల మర్మం కనుగొన్న వాడే సహనాన్ని అర్ధం చేసుకోగలడు !_*

*_మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి. ఈ విషయంలో మనిషి తప్పు కాని మతం కాదు, కులంకాదు గుణం ప్రధానం. సహనం ఉన్న వానికే తానేమిటి, తన కుటుంబం, ఊరు, దేశం గురించి ఆలోచన, విచక్షణలు కలుగుతాయి !!_*


--(())--

నిత్య సూక్తి

శిల్పి ఒక రాతిలో ముందు మూర్తిని కల్పన చేస్తాడు. తన మనస్సులో ముద్రించుకొన్న మూర్తిని ఆ రాతిమీద ప్రతిబింబింపచేస్తాడు.

రాతిలో కేవలం సుందరమూర్తిని మాత్రమే దర్శిస్తూ మూర్తి కాకుండా ఉన్న రాతిని తొలగించి వేసి అందమైన మూర్తిని తయారుచేస్తాడు.

సత్య సాక్షాత్కారము అవడానికి ఇదే దారి. సాధకుడు ఈ విధంగానే ముందు సత్యాన్ని అన్నింటిలో చూడటం మొదలుపెడతాడు.

రాతిలో మూర్తిని దర్శించినట్లు సత్యాన్ని అనుభవం పొందుతాడు. దానితో అసత్యరూపంలో ఉన్నదంతా దానికదే ప్రక్కకి వెళ్ళి పోతుంది.అప్పుడు సత్యమైన సుందర మూర్తి స్వరూపం వస్తుంది.

--(())--

*శ్రీగురుభ్యోనమః*

*వసంత ఋతువు నందలి ఉత్తరార్ధము వైశాఖమాసము. ఈ మాసము అత్యంత ప్రతిభావంతమైనది. సంవత్సరమునకు అభిజిత్ లగ్నము వంటిది. జ్యోతిషమున ఈ మాసమును వృషభమందురు. వృషభమనగా సూర్యకిరణము.*

*ఉభయసంధ్యల యందు ఆ కిరణముల ప్రభావమును ప్రార్ధనా మార్గమున గాని, ధ్యానమార్గమున గాని అందుకొనుట సాధకుని విధి. ఋషులు సహితము దైవబలమును పొందుటకు ఈ మాసమందలి సూర్యకిరణములను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధింతురు.*

*వైశాఖ మాసమునకు మధుమాసమని పేరు. ఆరోగ్యము, యశస్సు, బలము, దివ్యానుభూతిని కలిగించు ఈ మాసముననే గౌతమ బుద్ధుడు, శంకరాచార్యుల వారు, ఆంజనేయస్వామి జన్మించినట్లుగా చరిత్ర తెలుపుచున్నది. మాసాధిపతియగు శుక్రుడు అంతరంగమున అంతర్లోకములను ఆవిష్కరించి, సత్సాధకులకు తగిన రీతిని ఉన్నతి కల్పించుగాక!*

--(())--

*🧘‍♂️ఆత్మ-పరమాత్మ🧘‍♀️*

ఓంశ్రీమాత్రే నమః

 *ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?*

*నిద్రపోతున్నపుడు మన ఆత్మ పరమాత్మతో కలుస్తుందని మన వేదాంత శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ, నిజంగానే ఈ రెండు ఒక్కటిగా కలుస్తాయా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజంగానే ఈ రెండు కలుస్తాయట. ఇదెలాగంటారా...*

*సాధారణంగా మన శరీరాల్లో ఐదు కోశాలుంటాయని వేదాంత శాస్త్రం చెపుతోంది. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం.*

*ఇవి పొరపొరలుగా ఉంటాయి. అన్నింటికన్నా పై పొర అన్నమయ కోశం. అన్నిటికన్నా లోపలి పొర ఆనందమయ కోశం. ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే లక్క పిడతల్లాగా ఉంటాయట. వీటిలో నాలుగోది విజ్ఞానమయ కోశం. అంటే ఆత్మ. ఐదోది ఆనందమయ కోశం. అంటే పరమాత్మ. ఇందులో ముందు మూడు కోశాలు దేహం, మనస్సు, ప్రాణం అంటారు. అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మ , పరమాత్మ వరుసలో ఉంటాయి.*

*దీనికి తోడు ఇంద్రియాలన్నింటినీ కలిగి వుండేదే దేహం. నాలుగో తొడుగు అయిన ఆత్మ మనం మెలకువగా ఉన్నపుడు దేహం, మనస్సుల వైపు అంటే విషయాల వైపు తిరిగి ఉంటుందట. అదే గాఢ నిద్రలో ఉన్నపుడు దేహం, ఇంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి.*

 *ఆ సమయంలో ఆత్మ పరమాత్మ వైపు అంటే విజ్ఞానమయ కోశం అయినందున ఆనందమయ కోశానికి అభిముఖం అవుతుంది. మన రెండు అరచేతులు కలిపి నమస్కరించి నట్టన్నమాట. అదే ఆత్మ పరమాత్మను కలత లేని, నిలకడ గల గాఢ సుషుప్తిలో చేరుకోవడం. అంటే ఆత్మ పరమాత్మల కలయిక గాఢ నిద్రలో కలుస్తాయన్నమాట.*

*ఓం నమః శివాయ*:

*🧘‍♂️శరీరము-ఆత్మ🧘‍♀️*

ఓంశ్రీమాత్రే నమః

  *“దేన్నయితే మనస్సు గ్రహించలేదో – అయినప్పటికీ, దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో, దేన్నయితే కళ్ళు చూడలేవో – అయినప్పటికీ దేనిచేత కళ్ళు చూడగలుగు తున్నాయో,దేన్నయితే చెవులు వినలేవో – అయినప్పటికీ దేనిచేత చెవులు వినేశక్తి పొందగాలుగుతున్నాయో, దేన్నయితే ముక్కు వాసన చూడలేదో – అయినప్పటికీ దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో ,అదే ఆత్మ స్వరూపం” అని కేనోపనిషత్తులో సవివరంగా వివరించారు.*

*అంటే మన శరీరం, మనస్సు మరియు బుద్ధి అన్నియు ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ శక్తి (ఆత్మ) మాత్రమె శాశ్వతం, అదియే నీవు. ఈ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి వెళుతుందో అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది. అప్పుడు శరీరంలోనివి ఏవి కూడ పనిచేయవు.  మానవుని శరీరంలో ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు. ఆత్మ రాజయినప్పటికీ సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన మంత్రే (మనస్సు) స్వతంత్రించి నడుస్తూ అహంకారంతో ప్రవర్తించటం జరుగుతుంది. మనస్సనే మంత్రి రాజును మించిపోయి నడుస్తూ ఉన్నాడు.*

*ఎప్పుడైతే మనిషి ఆత్మే నేను (అనే జ్ఞానాన్ని తెలుసుకొని) అంటే రాజే నేను అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకొని పనిచేసుకుంటూ వెళ్ళినపుడు మంత్రి ఏమి చెయ్యలేదు. జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన మనస్సు ఆత్మలో లయించవలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహించి నేనే ఆత్మను (రాజును) అని తెలుసుకుంటూ ముందుకు వేలతామో అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది.*

*ఆత్మ ఎక్కడ ఉన్నదని వెదుకులాడవలసిన పని లేదు.*

*ఉన్నదంతా ఆత్మే అని గ్రహించండి. ప్రశ్నల్లా, మనిషి దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నది? అని ప్రశ్నించుకోవడంతో ఆత్మ విచారణ, ఆత్మానుభూతికై సాధన తీవ్రతరమౌతుంది. ఆత్మ నిత్యం, సత్యం, కాలాద్యవిచ్ఛిన్నం, అపరిమేయం, అది పరిణామానికి లోనుకాని శక్తి మూలం. ఆత్మ ఆకాశం వలె శూన్యం! గగనం వలె సంపూర్ణం. ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదు అని అర్థం. అంటే ప్రత్యేకంగా లేదని, ఉన్నదంతా అదేనని అసలు అర్థం. ప్రాణశక్తికి, ఇంద్రియ చలనాలకు కరచరణాది అవయవాల కదలికలకు, మెదలికలకు, సర్వకార్యకలాపాలకు మూలము ఆత్మే!*

*పంచభూతాలూ, ప్రాణం, ఆహారం, బుద్ధి వంటి సమస్త పదార్థమూ ఆత్మ నుండి పుట్టినవే! హృదయమనే ఖాళీ గుహ, మనిషి కుడి రొమ్మున ఉన్నది. అందులో నేను, నేను అంటూ నిస్వనంగా, నిరంతరంగా, అఖండంగా, వాఙ్మయంగా, జ్యోతిర్మయంగా ఆత్మ వెలుగుతూనే ఉన్నది. వెలుగులీనుతూనే ఉన్నది. కాలిగోటి నుండీ తల వెంట్రుక చివరి కొస వరకు ఆత్మే చైతన్యశక్తిగా శరీరాన్ని నడిపిస్తున్నది.*

*అంగాంగీభావంతో మనిషి తన దేహాన్ని శాశ్వత వస్తువుగా భావిస్తాడు. అవిద్య, అజ్ఞానం, అనాచారం, అస్పష్టత వంటి వ్యతిరిక్త శక్తుల వలన దేహం చుట్టూ తన ఆలోచనలను ఒక వలయంగా గూడు కట్టిస్తాడు. అందువల్లనే తాను ఆత్మనన్న భావన నుండి బహుదూరంగా వైదొలగుతుంటాడు. ఈ బహిరంగ వలయం నుండి మనిషి తన లోపలికి తాను తొంగి చూసుకోవడం ప్రారంభించడంతో ఆత్మానుభూతికి దారి దొరుకుతుంది. ధ్యానం ద్వారా ఆత్మానుభూతిని పొందినప్పుడు ఉనికి, అస్తిత్వం, అహం నశించి ఆత్మ ప్రకాశం అనుభవమౌతుంది.*

*ఈ స్థితిలో మరణ భయం నశించి అమరత్వ సిద్ధి కలుగుతుంది. తన శాశ్వతత్వం ఎరుకగా అనుభవంలోకి వచ్చినప్పుడు సదానందుడై పరమానందాన్ని తన సహజ స్థితిగా అనుభవిస్తూ అచలుడై శుద్ధాద్వైతంలో నిలకడ చెందుతాడు. మరణమంటే మార్పేనన్న భావన స్థిరమై మృత్యువును ఆహ్వానించడు! అలాగే కలకాలం ఉండాలని ఆశించడు!! ఇదొక అద్భుత స్థితి. ఇదే ఆత్మానుభూతి కలిగించే మహానంద స్థితి. -ఇప్పటిదాకా జరిగిన విచారణంతా ఆత్మవిద్యలో భాగమే!*

*ఆత్మానుభూతిని వేరెవ్వరూ కలిగించలేరు. ఎవరికి వారు తమ స్వీయ సాధన ద్వారా పొందాలి. అంతరంగ సాధన ద్వారా మనిషి తన జన్మను పారమార్థికంగా సార్థకం చేసుకోవాలి. జిజ్ఞాస ద్వారా సత్యాన్వేషణ కొనసాగించాలి. -ఆత్మ, ఆత్మ విచారణ, ఆత్మానుభూతి వంటి ఉదాత్త విషయాలను ఏకాగ్రచిత్తంతో, స్వానుభవంతో అర్థం చేసుకోవాలి. అనుభవించాలి..*

 *-పిప్పలాద మహర్షి తనను సమీపించి ప్రశ్నించిన జిజ్ఞాసువులకు ఆత్మవిద్యా వర దానం చేసి, మంగళా శాసనం చేశాడు!*

 *-జిజ్ఞాసువులందరూ సభక్తికంగా, పరమ ఋషి సత్తముడికి ప్రణామ సహస్రం సమర్పించి, సంపూర్ణ సమాధానాలను పొంది, ఆత్మనిష్ఠులైనారు! -ఒక మహర్షి, కొందరు జిజ్ఞాసువుల మధ్య సాగిన ప్రశ్నోత్తర సమాధానమే, ప్రశ్నోపనిషత్‌గా మనుష్య జాతికి లభించింది.*

--(())--

*లోకంలో వివేచన, విచక్షణ కలగలసిన ప్రత్యేక ప్రాణి మనిషి. హృదయస్పందనలతో, మేధస్సు నిండిన మస్తిష్కంతో ప్రాణికోటిలో శ్రేష్ఠుడై వెలుగొందుతున్నాడు. 'శుభకరమైనదీ, సుఖకరమైనదీ' అనే రెండు మార్గాలు మానవుని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు. సుఖం కంటే శ్రేయస్సే మేలని ఎన్నుకొంటాడు. కానీ బుద్ధి హీనుడు లోభాసక్తితో సుఖాన్నే కోరుకుంటాడు. విజ్ఞతకు సంబంధించిన సున్నితమైన ఆలోచన మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది.*

*ఏది శాశ్వతం, ఏది క్షణికం అనే వివేచన, సర్వదా సుఖాలపట్ల విముఖత, మన: ఇంద్రియ నిగ్రహం, ఆనందోల్లాసాలే పరమావధి కాకపోవడం, సహనం, శాంతి, శ్రద్ధ ఆలంబనగా చేసుకోవడం, మోక్షమా ర్గానికి అన్వేషణ సాధ్యం అనుకుంటే పొరపాటు. మాలిన్యం నుండి మనసు ప్రక్షాళన మయితే సత్య గ్రహణం సంభవం అని నిరూపించిన నచికేతుని వృత్తాంతమే కఠోపనిషత్తు రూపంలో భాసిల్లుతుంది.*

*శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరీత్య వివినక్తిధీర:|*

*శ్రేయోహి ధీరోభి ప్రేయసోవృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్‌ వృణీతే||'*

*విశ్వజిత్‌ యాగం చేసిన వాజస్రవసుడనే ఋషి కుమారుడు నచికేతుడు. వాజస్రవసుడు తన సంపద నంతా దానం చేస్తున్నాడని తెలుసుకున్న నచికేతుడు శ్రద్ధతో తండ్రిని గమనించసాగాడు. శక్తినశించి కృంగికృశించిన ఆవులను దక్షిణలుగా దానం చేయడం వల్ల నా తండ్రికి దుర్గతి కలుగుతుందనీ వేదనతో తండ్రీ! నీ సంపదలో నేను భాగస్థుడినే కదా! మరి నన్నెవరికిస్తావు? అని ప్రశ్నించగా స్పందించని తండ్రిని మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను అడుగుతాడు నచికేతుడు. వాజస్రవసుడు చిరాకులో నచికేతా! నిన్ను యమునికిస్తాను' అంటాడు.*

*కాలగతిలో ఎలాగూ నశించిపోయే క్షణికమైన జీవితం కోసం సత్యపాలన వదులుకోరాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మహాత్ములు సత్య నిష్ఠను కాపాడుకున్నారు. కనుక తండ్రీ నేను యమలోకానికి వెళ్లడానికి అనుమతినివ్వు' అని వేడుకుంటాడు నచికేతుడు. వాజస్రవసుని ఆశీస్సులతో యమపురికి చేరిన నచికేతునికి యమధర్మరాజు ఇంటలేడనే విషయం తెలిసి మూడు రోజులవరకూ నిరాహారుడై యమునికై వేచి ఉంటాడు.*

*నచికేతుడు యమపట్టణ ద్వారం దగ్గర మూడు రోజులుగా నిరాహారుడై ఉన్నాడన్న విషయం తెలుసుకున్న యముడు అతనికి మూడు వరాలను ప్రాయశ్చిత్తంగా అను గ్రహిస్తాడు. ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించి తగిన సత్కారం చేయాలి. అతిథిని నిర్లక్ష్యం చేసే గృహస్థుని ఆశలూ, ఆం క్షలూ, సత్ఫలి తాలూ, పుణ్య కర్మలూ అన్నీ నశిస్తాయి. అందుకే నచికేతుని సంతృప్తి పరచడానికి మూడు వరాలను అనుగ్రహిస్తాడు యముడు.*

*యమధర్మరాజును ధైర్యంగా నచికేతుడు అడిగిన మూడవ వరం కఠోపనిషత్తుకే తలమానికమై జీవితరహస్యాన్ని ఆవిష్క రిస్తుంది. 'మరణానంతరం ఆత్మ ఉంటుందా?' అని నచికేతుడు అడి గిన సందేహం సృష్టి అంతరార్థాన్ని సూచిస్తుంది. మృత్యుదేవతే యమ ధర్మ రాజు. మరణాంతర గతులను నిర్ణ యించే సమవర్తీ యముడే. కనుక మరణం తర్వాత మానవుని స్థితి గురించి చెప్పగలిగే శ్రేష్ఠులెవరు? యమధర్మరాజు తప్ప. సత్యమే అయినా అసా ధ్యమనిపించే నచి కేతుని కథా రూపం సంగతి కాసేపు పక్కన పెడితే...*

*జీవితరహస్యం మరణం లోనే ఉంది. నిష్ఫాక్షికంగా విచారిస్తే ఆత్మచైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధాన్యం నాటువేయడం, కోతలో రాలిపోవడం తిరిగి అదే బీజంగా మారి మొలకెత్తడం ప్రకృతిలో సహజం. మనిషి కూడా జనన మరణ చక్రాన్ని అనుస రిస్తాడు. మనిషి జన్మ మృత్యువును సూచిస్తుంది. మృత్యువే మనిషి పునర్జన్మను సూచిస్తుంది. అందుకే అనవసరంగా శోకించే పనిలేదు. అలాగని మితిమీరిన ఆనందమే సుఖమని భావించ క్కర్లేదు.*

*జంతువుల కంటే మనిషి ఆయుష్షు ఎక్కువ కావచ్చు. మనుషుల కంటే దేవతలు వందల సంవత్సరాలు అధి కంగా జీవించవచ్చు. కల్పాంతమైన బ్రహ్మదేవుని ఆయు: పరిమితి అందరికంటే దీర్ఘమై కొనసాగ వచ్చు.*

*కానీ ఆది అంతం లేని కాలంలో బ్రహ్మ జీవితమైనా ఎంతటి వైభవంతో అలరారు తున్నా జీవితం క్షణికమే, అంటూ జీవిత రహస్యాన్ని విశ్లేషిస్తూ కఠోపనిషత్తు 'ఆత్మ' చైతన్యదిశగా అడుగులు వేయ మంటుంది. కుటిలచిత్తం లేని, జననాది వికారాలు లేని పరబ్రహ్మానికి తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమే పట్టణం. హృదయ ధామంలో విరాజిల్లే పరమాత్మను రాగద్వేషాలు లేక తలచేవాడు జనన మరణరూప సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. పరమాత్మ నిత్యనిజరూపమే మానవునిలోని జీవాత్మ. హేతువాదానికి అందనిదీ, నిగూ ఢమైనదీ ఆత్మ.*

*ఏకరూపమైన అగ్ని ప్రపంచంలో ప్రవేశించి అది మండించే పదార్థాన్ని పోలిన రూపాన్నే ధరించినట్లు, అన్ని జీవులలోనూ ఉన్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన జీవుల రూపాలనే ధరించి కనబడుతుంది. వారిని మించి కూడా విశ్వవ్యాప్తమై అలలారుతుంది. జగన్నియామకుని సకల జీవుల అంతరాత్మగా, సకల ప్రాణుల జీవాత్మలే పరమాత్మగా అనుసంధానం చేయబడే రహస్య తత్త్వమే శాశ్వతం. వస్తు ప్రపంచం ఎప్పుడూ అనిత్యమే.*

*''ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు|*

*బుద్ధింతు సారధిం విద్ధి మన: ప్రగ్రహమేవచ||''*

*శరీరమనే రథాన్ని నడిపే యజమాని ఆత్మ, బుద్ధే సారధి, మనస్సే కళ్లెం అని గ్రహించి జీవిస్తే ఇంద్రియాలనే గుర్రాలనూ, ఇంద్రియ విషయాలు అవి పరుగుతీసే మార్గాలనూ ఉంచుకొని నిజమైన జీవితానందాన్నీ, మోక్ష పదాన్నీ చేరుకోగలం. శరీరం, ఇంద్రియాలు, మనస్సులతో కూడిన ఆత్మయే చైతన్యం, శాశ్వతం అంటుంది కఠోపనిషత్తు. జనన మరణాలు లేక, మనుష్యాది రూపాలే శాశ్వతం కాక, జన్మ-వృద్ధి-పరిణతి-అపక్షయ-వ్యాధి-నాశాలనే వికారాలు.*

*పొందక శాశ్వతమై విశ్వంలో అలరారే ఆత్మ అత్యున్నతమైంది. అపూర్వమైంది.*

*మనోనిగ్రహం లేని మనిషి ఆత్మతత్త్వం తెలుసుకోలేక సంసార బంధంలో పదే పదే చిక్కుకుంటున్నాడు.*

*జ్ఞానంతో, మనోనిగ్రహంతో పరిశుద్ధుడైన మనిషి పుట్టుకను తిరిగి పొందక పరమపదాన్ని చేరుకోగలడు. ఇంద్రియాల కంటే శ్రేష్ఠమైనది మనస్సు. మనస్సుకంటే శ్రేష్ఠ తరం బుద్ధి. బుద్ధికంటే శ్రేష్ఠం ఆత్మ. మహత్తు కంటే అవ్యక్తం పరం. అవ్యక్తం కంటే మనిషి శ్రేష్ఠతరం.*

*పురుషుని కంటే పరమాత్మ శ్రేష్ఠతరం, సర్వావ సానం. కనుక ఆత్మచైతన్యమే ఆలంబనగా జీవితాన్ని స్వీకరించి, అనుభవించి పరమ పదంలో లీనం చేయగల మార్గమే మానవ జీవిత పార మార్థిక నిధి తత్త్వం. రహస్యం.*

--(())--

🧘‍♂️అరిషడ్వర్గాలు🧘‍♀️

-[ఎంతస్ధాయిలో ఉన్నవారినైనా దిగజార్చేవి]-

అరిషడ్వర్గాలు అని వేటిని అంటారు, వాటిని ఎలా అదుపులో ఉంచాలి..

అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి.

మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలే. ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. కామము –

కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.

2. క్రోధము – 

క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.

3. లోభము –

లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము !

4. మోహము -

తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

5. మదము –

మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

6. మాత్సర్యము -

తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండడము.

అరిషడ్వర్గాలను అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి !

--(())--

*🧘‍♂️తపస్సు అంటే ఏమిటి ?🧘‍♀️

🕉️🌞🌍🌙🌟🚩


*తపస్సు అంటే ఏమిటి ? ఒక మంత్రాన్నో..., ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే తపస్సు అనుకుంటే పొరపాటు.*



 *‘తపనే’ తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే..., ఆరాటపడడమే ‘తపస్సు. అలా తపించినంత మాత్రాన., ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే...మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము.... ఈ సృష్టిలో దేనికి లేదు. ఆయుధాన్ని వాడకుండా, ఓ మూల పడేస్తే తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది.*



 *ఆయుధాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి..దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ మీకో సందేహం రావచ్చు....*



*మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని.’ నిజమే... ఆలోచించడం వేరు.ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు.చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే., తపస్సు అంటారు.*



*అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు.*

 *తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా...ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా ? అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం ఉంది. సృష్టిలో అందమైన కీటకం ‘సీతాకోకచిలుక’. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది.*

*సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రావు.*

 *గొంగళిపురుగులు వస్తాయి. ఈ గొంగళిపురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో., రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ కాలం గడుపుతుంది. అలా కొంత కాలం గడిచాక తన జీవింతం మీద రోత కలిగి.,ఆహార, విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశానికి పోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితిలోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది.*

 *అయితే అది గొంగళిపురుగులా రాదు. అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడది ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది.*

 *ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక ఆత్మ సాక్షాత్కారం తో తరిస్తాడు.*

 *🧘‍♂️సృష్టి యెందుకు?🧘‍♀️*

ప్రశ్న: భగవంతుడు ఈ ప్రపంచాన్ని యెందుకు సృష్టించాడు?

జ్ఞానశిశువు : అందరికీ కలిసి ఒక ప్రపంచం లేనే లేదు.

యెవడి ప్రపంచంలో వాడున్నాడు.

యెవడి స్వప్నప్రపంచం వాడిదే అన్నట్టుగా.


నీ కలలో ఇదే విధమైన సంభాషణే జరిగిందనుకో...

ప్రశ్నించేవాడు, సమాధానమిచ్చేవాడు ఇద్దరూ నీవే కదా అవుతావు....


ఎవడి కలకు వాడే కర్త.

ఎవడి జగత్తుకు వాడే కర్త.


స్వప్న జగత్తుకు, జాగ్రత్ జగత్తుకు ఇంచుకైనా భేదం లేదు.


"భగవంతుడు ఎందుకు సృష్టించాడు?" అని ప్రశ్నించేవాడు, ఆ భగవంతునికి అభిన్నం


ఆడించేవాడూ భగవంతుడే.

ఆడేవాడూ భగవంతుడే.


తన మూలం వెళ్లి...

తనలో కలిసిపోయి...

తాను  ఒక్కడే శేషించినప్పుడు...

ఆ తాను భగవంతుడే అని అనుభవమాయ్యాక...

ఆ ఏకాత్మస్థితిలో...

సృష్టితో పాటు ప్రశ్న, ప్రశ్నించేవాడు కూడా మాయమౌతారు...


"ఎందుకు" అన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం వాచా ఎప్పటికీ దొరకదు.

మనం(ప్రపంచం) భగవంతునిలో అంతర్భాగమై ఉన్నప్పటికీ...


మనం "అదే" అయినప్పటికీ....మనకు తెలియడం లేదు.


ఒకడు గూబ గుయ్యమనేట్టు చెంపమీద కొట్టాడు...

ఎందుక్కొట్టావు? అని అడిగితే...

నా బలమేమిటో నీకు తెలియడానికి అన్నాట్ట...



ఈ సృష్టి యెందుకు చేశావు? అని భగవంతుణ్ణి అడిగితే,

నేనొకడ్ని ఉన్నానని నీకు తెలియడానికి అన్నాట్ట.



ఇది హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ.



 సృష్టి కారణమేమి? అన్న ప్రశ్నకు ఇంతకు మించి సమాధానం లేదనిపిస్తుంది.



గొంతెత్తి పాట పాడకుంటే అతడు గాయకుడు అని ఎలా తెలుస్తుంది?



వీణ పై స్వరాల్ని మీటకుంటే అతడు వైణికుడు అని తెలుస్తుంది?



రాతిని శిల్పంగా మలచుకుంటే అతడు శిల్పి అని తెలుస్తుంది?



చిదాకాశమనే తెరపై విశ్వసృష్టిని గీయకుంటే అతడు భగవంతుడు అని ఎలా తెలుస్తుంది?  



బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠమహర్షి పుట్టుకతోనే శుద్ధబ్రహ్మజ్ఞాని...అతనికి బంధంగానీ, దుఃఖంగానీ తెలియవు.



నీవు గడియకాలం అజ్ఞానానికి లోనవుదువుగాక

 అని అకారణంగా...ఓ సదుద్దేశంతోనే వశిష్ఠునికి శాపం పెట్టాడు బ్రహ్మ. 



వశిష్ఠుడు అజ్ఞానవశుడై విచారవదనంతో 

తన అకారణ దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్థించగా అందుకు బ్రహ్మ చేసిన ప్రబోధమే  యోగవాశిష్ఠం అయ్యింది.



 కష్టసుఖాలనేవి ఎలా ఉంటాయో అనుభవంలో ఉన్నప్పుడే 

వాటి నుంటి బయటపడడానికి అనువైన బోధ లోకులకు చేయగలిగే సమర్థత వశిష్ఠునికి వస్తుంది.



అదే బ్రహ్మగారి సదుద్దేశము.



మితం అనేది తెలియకపోతే

అమితం అనేది ఎలా తెలుస్తుంది?



అంతం అనేది తెలియకపోతే 

అనంతం అనేది ఎలా తెలుస్తుంది?



బాధ అనేది తెలియకపోతే 

ఆనందం అనేది ఎలా తెలుస్తుంది?



అజ్ఞానం అనేది తెలియకపోతే 

జ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది?



భగవంతుడు చేసిన సృష్టికార్యము కూడా అలాంటిదే.



ఏకంగా ఉన్న తాను ఏకంగా ఉండక

అనేకమైనాడు అది లీల అయ్యింది.



తిరిగి అనేకం నుండి ఏకం వైపుకు ప్రయాణమయ్యాడు. 

అది జీవితం అయ్యింది.



"ఎందుకు?" అని అడిగితే,

లోకవత్ లీలా కైవల్యం అంటుంది బ్రహ్మసూత్రం.

"లీల" అన్నాక ఇంకేం మాట్లాడగలం?

"లీల యెందుకు?" అని అడగలేం.



ఆనందం కోసం ఆడేది క్రీడ.

ఆనందంగా ఉండి చేసేది లీల.



ఎందుకు దుఃఖిస్తున్నావు? అని అడుగుతామే గాని

ఎందుకు ఆనందంగా ఉన్నావు? అని అడగం.



దుఃఖానికి కారణం ఉంటుందేగాని,

ఆనందానికి కారణం ఉండదు.



శిశువు అకారణ ఆనందానికి బాహ్యచేష్టలే కేరింతలు.

శివుని అకారణ ఆనందానికి బాహ్యరూపమే ప్రపంచం.



శివుని ఆనందసాగరంలో తేలియాడే నురగలు 

ఈ ద్వంద్వాలు, త్రిపుటులు.



ప్రశ్న: ఈ సృష్టి ఎలా జరిగింది?


జ్ఞానశిశువు: మలం తొక్కావు...కడుక్కోవాలి అంతే.

ఎలా తొక్కాను? అనే విచారణ అనవసరం.



మాయ ఎలా తొలగించుకోవాలో అనేది సందర్భానుసారంగా ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక్క  మార్గం చెప్పారు ఋషులు.



మాయ ఎందుకు కలిగింది? అనేదానికి సమాధానం మాత్రం వారు ఇవ్వలేదు.



పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి మిఠాయి ఇచ్చి సముదాయించినట్టే ఈ గురువులు చెప్పిన సమాధానాలన్నీ.

అవన్నీ కంటి తుడుపు సమాధానాలేగాని...అసలు కావు.



 ప్రశ్న: సమాధానం చెప్పడం ఋషులకు కూడా సాధ్యం కాలేదన్న మాట...


జ్ఞానశిశువు: యెందుకంటే "తానే" సమాధానం.

తనకు సమాధానం కాదు కాబట్టి.



ఋషికి సృష్టీ ఉండదు, బంధమూ ఉండదు.



ప్రశ్న: జన్మలకు వాసనలే కారణమంటారు?

తొలి వాసన ఎప్పుడు వచ్చింది?


జ్ఞానశిశువు : "ఎప్పుడు?" అనేది కాలానికి సంబంధించినది.

కాలం అనేది నీ తలపులలో తప్ప...దానికి స్వయం ఉనికి లేదు.



మనం నిద్రనుండి మేలుకోగానే

"నేను" అనే తొలి ఆలోచన కలిగాకే

మిగతా ఆలోచనలు, వ్యవహారాలూ కలుగుతాయి.



అలాగే భగవంతుని "తొలి ఆలోచన" అయిన "నేను" నుండే సర్వసృష్టీ జరిగింది.



అందుకే సృష్టిలోని ప్రతివ్యక్తిలోనూ, వస్తువులోనూ దివ్యత్వం ఉందనడానికి కారణం.



ప్రశ్న: నేను కనే ఈ సృష్టి నాదేనంటారా?


జ్ఞానశిశువు : అక్షరాలా....


ఈ సృష్టి నీ మనో వైచిత్ర్యమే...

ఇది తెలిసి ఓ మహాత్ముడుగా ఈ జగత్తులో చరించు...



ప్రశ్న: ఈ జగత్తు ఇంత సత్యంగా కనిపిస్తుంటే

ఇది కల అని యెందుకు అనుకోవడం?


జ్ఞానశిశువు : నిజమే.  ఆధ్యాత్మికంలో అత్యుత్తమస్థాయికి చేరుకునే వరకు దీనిని కలగా భావించాలి తప్పదు.

ఇదొక మంచి సాధన.



మూలసత్యం వైపుకు నీ దృష్టి మరలే వరకు

నీవనుకునే సత్యాలన్నీ అసత్యాలే అని చెప్పాల్సి ఉంటుంది....



ఆ కోణంలో జగత్తు అసత్యమన్నారేగాని,

నిజానికి సత్యంవైపు నుండి చూస్తే 

జగత్తు కూడా సత్యమే.



చైత్యన్యస్థాయిలో ఈ జగత్తు కూడా చైతన్యపు తునకే.

చైతన్యస్థాయిలో ఈ జీవితం కూడా ఆనందపు సారమే.



నిద్రలో కలిగే మెలకువ - కల.

మెలకువలో కలిగే కల - మెలకువ.



మొదటి కల - జీవునిది.

రెండవ కల - దేవునిది.



అందుకే ముందు నీవు ఈ మెలకువ నుండి మేలుకో.... అంటాను...



నిద్ర నుండి మేలుకుంటే కల చెదిరిపోయినట్టు.

ఈ మెలకువ అనే కల నుండి మేలుకుంటే ఈ సృష్టి చెదరిపోతుంది(కల ఉన్న ప్పటికీ కలకు బాధితుడై ఉండడు అని భావము)



కల కనేవాడు ఒకడే శేషిస్తాడు.

ఇదే ఆధ్యాత్మిక లక్ష్యం.



వచ్చిన కలను విధిలేక కనేవాడు - జీవుడు.

నచ్చిన కలను స్వేచ్ఛగా కనేవాడు - దేవుడు.



ప్రశ్న: భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు?



జ్ఞానశిశువు : సృష్టి కూడా తానే కాబట్టి....

తనకు విడిగా రెండవ వస్తువు లేదు కాబట్టి...

ఎందుకు అన్న ప్రశ్నకు తావులేదు.



బంగారం సదా బంగారంగానే ఉంది.

నీవెందుకు ఆభరణాల్ని సృష్టించావు?

అని బంగారాన్ని నిలదీయగలమా?



అవునా....నేనెప్పుడు ఆభరణమయ్యాను?

నేను నేనుగానే ఉన్నానే! అని అది ఆశ్చర్యపోతుంది.



ఆభరణసృష్టి మనం చేసుకున్న రూపకల్పనే తప్ప

బంగారం సదా బంగారంగానే ఉన్నది.

జగత్సృష్టి కూడా  మనో విక్షేపమే తప్ప

బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది.



ఆభరణం అనేది వ్యావహారిక సత్యం.

బంగారం అనేది పారమార్థిక సత్యం.



ప్రపంచం అనేది వ్యావహారిక సత్యం.

బ్రహ్మం అనేది పారమార్థిక సత్యం.



ఒకటి యెప్పుడూ రెండు కాలేదు.



ఒకటి(ఏకం) అనేది - ఆత్మకు సంబంధించినది.

రెండు(అనేకం) అనేది - మనసుకు సంబంధించినది.



ఒకటి అనేది - ఉన్నది.

రెండు అనేది - ఉన్నట్లున్నది.



ఒకటి అనేది - సత్యము.

రెండు అనేది మిథ్య.



ఒకటి అనేది - దైవము.

రెండు అనేది - ప్రపంచము.



తెల్లకాగితం - దైవం.

అక్షరాలు - ప్రపంచం.



జడమైన ఈ సకల నామరూపాల మరుగున ఆత్మచైతన్యమే ఉండేది.



 ప్రశ్న: ఇదంతా నా మనస్సృష్టే అనేది నమ్మలేకపోతున్నాను...


జ్ఞానశిశువు : జ్ఞానంలో నీవు మేలుకుంటే గాని తెలియదు

ఈ జాగ్రదవస్థ అనేది నీ మనస్సృష్టే అనేది.

అప్పుటి వరకు వాస్తవంగా ఉండి బాధిస్తుంది.



ఆ జ్ఞానమెలకువలో స్వప్నం కూడా జ్ఞానప్రకాశంతో(సంపూర్ణ ఎఱుకతో) ఉంటుంది.



ఇది కల, ఇది మెలకువ, ఇది నిద్ర అనే తేడా చూచేవాళ్లకేగానీ తన అనుభవంలో "జ్ఞానం" తప్ప మరొక అవస్థ ఏదీ ఉండదు.



ఇదే తురీయం.

ఆ తురీయాన్ని  సద్గురు సన్నిధిలో మాత్రమే సాధించగలం.



గుర్వనుగ్రహమే ప్రధానం.

ఇతరత్రా సాధనలన్నీ ద్వితీయం.

అని రమణులు చెప్పి ఉన్నారు.


🕉️🌞🌍🌙🌟🚩