సాహిత్యం:- వెటూరి సంగీతం:- మహదేవన్ గానం:- జానకి,బాలు పల్లవి గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన చరణం తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా ఎందుకుండవ్ కర్రావు కడుపున ఎర్రావు పుట్టద ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావు లుండవా కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్య ఆడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవఘటన చరణం పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు పాపం అల్లనమోవికి తాకితే గేయాలు పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లనమోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా | ||
|
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ |
హైలో హైలేసా హంసకదా నా పడవ...ఉయ్యాల లూగినది ఊగీస లాడినది... చిత్రం: భీష్మ రచన: ఆరుద్ర సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గానం : జమునారాణి హైలో హైలేసా హంసకదా నా పడవ ఉయ్యాల లూగినది ఊగీస లాడినది హైలో హైలేసా హంసకదా నా పడవ ఓహోహై ఓ హోహై, నదిలో నా రూపు నవనవ లాడినది, మెరిసే అందములు మిలమిల లాడినవి వయసూ వయారమా పాడినవి పదేపదే ఎవరో మారాజా... ఎదుట నిలిచాడుఎవో చూపులతో సరసకు చేరాడుమనసే చలించునే మాయదారి మగాళ్ళకి https://www.youtube.com/watch? | ||
|
నాకు నచ్చిన ఒకనాటి పాత పాటా
నిన్నే చూసిన నాలో మొదటిసారే
తెలియనీ ఓమాటా నీకోసం నిదురలేచింది నిజమిది
చిత్రం : మీనాక్షి
సంగీతం : ప్రభు
సాహిత్యం : శ్రీ హర్ష
గానం : సందీప్, ఉష
పల్లవి :
నిన్నే చూసిన నాలో మొదటిసారే
తెలియనీ ఓమాటా నీకోసం నిదురలేచింది నిజమిది
అవును అవునని అన్నా కాదు అన్నా
మనసులో ఓ మాటా నీకోసం ఎదురు చూసింది నిజమిది
ఆ...ఆ...ఆ...ఆ...........................
చరణం :
ఎన్నో గానాలు దాగు వీణ పైనా
ఏవో రాగాలు నేను మీటు కోనా
నిన్నే ఏ వేళ ఏలు రాణి కానా
నన్నే ఈ వేళ నీకు రాసి ఈయనా
కంటి పాప అద్దమై నీ బొమ్మ చూపెనా
కంటి చూపు నన్నిలా నీవైపు లాగెనా
నాలో ఏనాడు లేని భావమేదో నేనాఎనా
చరణం :
వన్నె వయ్యారమంత చిందులేసే
నన్నే కన్నార్పనీక విందు చేసే
ఏదో గుర్తొచ్చి బుగ్గ కందిపోయే
ముద్దా మందారమల్లె తొందరాయే
నిన్ను తాకి వచ్చినా ఈ గాలి నాదిలే
నిన్ను సోకి విచ్చినా ఈ సోకు నాదిలే
ఏమో ఈ తీరు పేరు ఏమిటోలే ఆ ప్రేమలే
https://www.youtube.com/watch?v=_TrMPysmccc
కోకిల కోకిల కూ అన్నది...వేచిన ఆమని ఓ అన్నది
చిత్రం : పెళ్ళిచేసుకుందాం
సంగీతం : కోటి
సాహిత్యం : సాయి శ్రీహర్
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
పల్లవి :
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో
చరణం : 1
గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మజన్మలందు నీడ కావా
లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా
చరణం : 2
వాలు కళ్లతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళపాళలు ఏలనమ్మా
వీలులేనిదట్టులేదులేమ్మా
మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం
కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కలలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మా
--(())--
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం...పరవశమై పాడేనా హృదయం
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం 1:
కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము...
చరణం 2:
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం 3:
అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం...
https://www.youtube.com/watch?
Mangalya Balam Songs - Teliyani Aanandam - ANR - Savithri Watch ANR Savithri's Mangalya BalamTelugu Old Movie Song With HD Quality Music - Master Venu Lyrics ... |
చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : పి.సుశీల
జోహారు శిఖిపింఛ మౌళీ...
జోహారు శిఖిపింఛ మౌళీ.. ఇదె
జోహారు రసరమ్య గుణశాలి వనమాలి
జోహారు శిఖిపింఛ మౌళీ
కరకు చూపులతోనే అరులను జడిపించి..
కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగారమొక కంట... జయవీరమొక కంట..
నయగారమొక కంట జయవీరమొక కంట
జోహారు శిఖిపింఛ మౌళీ
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు...
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావూ..
ఆఆ.ఆ.ఆఆఅ...
యుగ యుగాల దివ్యలీల నెరపిన
అవతారమూర్తి ఘనసారకీర్తి
జోహారు శిఖిపింఛ మౌళీ
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ములివిగో
ఝలమ్ ఝళిత సురలలనా నూపుర కలరవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు
సుందర నందన సుమమ్ములివిగో
జోహారు శిఖిపింఛ మౌళీ