Tuesday 9 February 2021

010-02-2021

 


నాకునచ్చినవి పాత పాటలు ఒక్కసారి చదువుతూ పాడుకోండి 

సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (1)

                               

నీ మది చల్లగా....

స్వామీ! నిదురపో!  దేవుని నీడలొ

వేదన మరచిపో - నీ మది చల్లగా....

వేదన మరచిపో - నీ మది చల్లగా


ఏ సిరు లెందుకు?  ఏ నిధు లెందుకు? ఏ సౌఖ్యము లెందుకు?               

- ఆత్మ శాంతి లేనిదే ?                                !! ఏ సిరు!!

మనిషి బ్రతుకు నరక మౌను - మనసు తనది కానిదే


నీ మది చల్లగా

స్వామి నిదురపో - దేవుని నీడలొ

వేదన మరచిపో - నీ మది చల్లగా


చీకటి ముసిరినా - వేకువ ఆగునా? - ఏ విధి మారినా

దైవం మారునా?                                       !!చీకటి!!

కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో


నీ మది చల్లగా...

స్వామీ! నిదురపో దేవుని నీడలో

వేదన మరచిపో! - నీ మది చల్లగా....


జానకి సహనము - రాముని సుగుణము - ఏ యుగమైనను

- ఇలకే ఆదర్శము.                                    !!జానకి!!

వారి దారి లోన నడచు - వారి జన్మ ధన్యము


నీ మది చల్లగా...

స్వామీ! నిదురపో దేవుని నీడలో


                                          --: 0 :--


చిత్రం : ధనమా? దైవమా? (1973)

గానం : సుశీల

సంగీతం : టీ. వీ. రాజు

రచన : సి. నారాయణ రెడ్డి

==(())--


నాకునచ్చినవి పాత పాటలు ఒక్కసారి చదువుతూ పాడుకోండి 

సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (2)

  .మంచిమనసుకు మంచి రోజులు (1958)

గాత్రం: బాల సరస్వతి , సంగీతం : ఘంటసాల 
రచయా: జ్ర్. సముద్రాల 

ధరణికి గిరి భారమా 
గిరికి అరువు భారమా
తరువుకు కాయ భారమా 
కని "పెంచే తల్లికి పిల్ల భారమా"

మును నే  నోచినా నా నోము పండగా
నా ఒడిలో వెలిగే నా చిన్నీ నాయనా
పూయని తీవెననీ  అపవాదు రానీక
తల్లివనే దీవెనతో తనియించి  నాపయా  .... ధరణి 

ఆపద వేళలా అమ్మ మానసు చెదురునా 
పాపాల రోదనకే ఆ తల్లీ విసుగునా 
పిల్లల కనగానే తీరేనా స్త్రీ విధీ 
ప్రేమతో పాపలను పెంచనిదొక తల్లియా

ధరణికి గిరి భారమా 
గిరికి అరువు భారమా
తరువుకు కాయ భారమా 
కని "పెంచే తల్లికి పిల్ల భారమా"



No comments:

Post a Comment