Friday 30 October 2015

02.రెండు రెళ్ళు ఆరు (1985) , 03యముడికి మొగుడు (1988) ,04. మరణ మృదంగం (1988) ,05మనసారా (2010),06ఉయ్యాల జంపాల (1965) ,07కాళహస్తి మహత్మ్యం, 09భూకైలాస్ (1958), 09డాక్టర్ చక్రవర్తి, 10ఆత్మ బంధువు , 11 మంచి మనసులు

ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

సర్వేజనాసుఖినోభవంతు 










కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి...కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..

చిత్రం : మరణ మృదంగం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి:

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా...

చరణం 1:

కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా
ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా...
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా
ఎద ఎద కలిపేది ప్రేమా....
శృంగార వీధిల్లోనా షికారు చేసి
ఊరోళ్ల నోళ్ళలోనా పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారు కెక్కించి
మాటిస్తే వినుకోదు
లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు
ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలుపు చిలిపి పిలుపు కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

చరణం 2:

మళ్లీ మళ్లీ అంటుంది మారాముగా
ఒల్లోకి వోచి తాకుతుంది ప్రేమా..
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా
చెల్లించేయ్ ఆ కాస్త ప్రేమా..

మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలు ఎన్నో మలాము వేసి
వయస్సుని వసంత మాడించే
మనస్సులో తుళ్ళింత పుట్టించే
చూపుల్తో శ్రుతి కాదు
మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు
ముట్టందే చలి పోదు
ఈ మనసు మధన తనువు తపన కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..

https://www.youtube.com/watch?v=eAaGcE7M1Qk
Marana Mrudangam Full Songs - Kottandi Tittandi Song - Chiranjeevi, Radha, Ilayaraja
Click here to watch Dalapathi Movie Full Songs - http://www.youtube.com/watch?v=YPc3UHKhk7U&list=PLB...







పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా..ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

చిత్రం : మనసారా (2010)
సంగీతం : శేఖర్‌చంద్ర
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : గీతామాధురి

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

పరవాలేదు పరవాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వు ఎవ్వరైనా పర్లేదు
ఓ... నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు
ఎందుకే దాగుడుమూతలు అర్థమే లేదు
మచ్చేదో ఉన్నాదనీ మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ అయినా మరి పర్లేదు
మసిలాగ ఉంటుందని
తిడతామా రాతిరిని తనలోనే కనలేమా
మెరిసేటి సొగసులనీ అందంగా లేను అనీ
నిన్నెవరూ చూడరని నువ్వెవరికి నచ్చవనీ
నీకెవ్వెరు చెప్పారు ఎంత మంచి మనసో నీది
దాని కన్న గొప్పది లేదు
అందగాళ్లు నాకెవ్వరూ ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

హాఅ..ఆఆహహహాఅ..హా...
అంతలేసి కళ్లుండకున్నా నాకు పర్లేదు
కోరమీసం లేకున్నా గాని మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్లిలాఅని నిన్నే అడగమనీ
సరదాగా తరిమిందే మదినీపై మనసుపడి
మురిపించే ఊహలతోఒకచిత్రం గీసుకొని
అది నువ్వు కాదోననిసందేహం ప్రతిసారీ
చేరదీసి లాలించలేదునన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరూ ఇంత నచ్చలేదు
ఎవరేమన్నా సరేనా చేయి నిన్నింక వదిలేదిలేదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

https://www.youtube.com/watch?v=VkNRIbmchc0
Manasara Telugu Movie HD Video Song | Paravaledu Song | Sri Divya | Ravi Babu
Manasara Telugu Movie, Starring Vikram, Sri Divya, Bhanu Chander, George Vincent, Ramaraju, Ravi Pra...




మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా...నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా...

చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)

రచన: తోలేటి

గానం: ఘంటసాల

సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం

ఓమ్

ఓమ్ నమః శివాయా...

నవనీత హృదయా.

తమః ప్రకాశా..

తరుణేందు భూషా.

నమో శంకరా! దేవదేవా..

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా

మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా

భక్తియేదొ, పూజలేవో తెలియనైతినే |భక్తియేదొ|

పాపమేదొ, పుణ్యమేదో కాననైతినే దేవా |పాపమేదొ|

మహేశా పాపా వినాశా కైలాస వాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా

మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా.. |మంత్రయుక్త|

మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే.. |మంత్రమో|

నాదమేదొ, వేదమేదో తెలియనైతినే |నాదమేదొ|

వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ |వాదమేల|

మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా! నీలకంధరా

ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువొ రుద్రయ్య |ఏక చిత్తమున|

ప్రాతకముగ చిరు వేట చూపి నా ఆకలి దీర్పగ రవయ్య |ప్రాతకముగ|

దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపుమా రుద్రయ్యా |దీటుగ నమ్మితి|

వేట చూపుమా రుద్రయ్యా, వేట చూపుమా రుద్రయ్యా |వేట చూపుమా|
https://www.youtube.com/watch?v=5gATjEKv2w0
Kalahasti Mahatyam Superhit Songs - Telugu Movie Golden Hits
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...

   
తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ...

చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ
తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
పాపకర్ము దుర్మదాంధు నన్ను సేపక దయ చూపి నేలా...
హర... తగునా వరమీయా ఈ నీతి దూరునకు పరమా పాపునకూ

చరణం 1:

మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా

తాళజాలను.. సలిపిన ఘనపాప.. సంతాప భరమీనిక
చాలును.. కడ తేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము
ఓనాటికి మతి వేరేగతి మరిలేదూ
ఈ నీచుని తల ఇందే తునకలు కానీయ్..
వేణియద వసివాడి
మాడి మసి మసి కానీ
పాపము బాపుమా నీదయ చూపుమా నీదయ చూపుమా...

చరణం 2:

చేకొనుమా దేవా శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా..
శిరము చేకొనుమా దేవా ..
చేకొనుమా దేవా శిరము... చేకొను మహాదేవా

మాలికలో మణిగా నిలుపూ
కంఠమాలికలో మణిగా... నిలుపూ
నా పాప ఫరము తరుగు విరుగు
పాప ఫరము తరుగూ విరుగూ...
పాప ఫరము తరుగూ విరుగూ
చేకొనుమా దేవా శిరము చేకొను మహాదేవా
https://www.youtube.com/watch?v=H3soyvaB8R4
Thagunaa Varameeya - "Telugu Movie Full Video Songs" - BhooKailas(NTR,ANR,Jamuna)
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...


పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా...నేనే ...పరవశించి పాడనా

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా...
నేనే ...పరవశించి పాడనా
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చరణం 1:

నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే ఆ ఆ ఆ ఆ
నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే
నీకుగాక ఎవరికొరకు నీవు వింటే చాలు నాకు
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చరణం 2:

చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై
చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై
ఆ పూవులన్ని మాటలై వినిపించు నీకు పాటలై
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా

చరణం 3:

ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడజాలకపోయినా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడజాలకపోయినా
నీ మనసులో ఈనాడు నిండిన రాగమటులే ఉండనీ
అనురాగమటులే ఉండనీ
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా
https://www.youtube.com/watch?v=mW3hm68v0us
DrChakravarthi - padamani Nannadagavalenaa
ANR - Geetanjali - Shavukaru Janaki's Old Melodious Beautiful Song - Duets - Dance - Telugu -Teluguo...
 మంచి మనసులు
అహో ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా!
ఈ శిధిలాలలో చిరంజీవి వైనావయా
శిలలపై శిల్పాలు చెక్కినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
కనుచూపు కరువైన వారికైనా
కనుచూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా
శిలలపై శిల్పాలు చెక్కినారు
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు
ఒకప్రక్క ఉరికించు యుద్ధభేరీలు
ఒక చెంత శృంగారమొలుకు నాట్యాలు
నవరసాలొలికించు నగరానికొచ్చాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
ఏకశిలరథముపై లోకేశు వడిలోన
ఓరచూపులదేవి ఊరేగి రాగా
ఏకశిలరథముపై లోకేశు వడిలోన
ఓరచూపులదేవి ఊరేగి రాగా
రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి
సరిగమా పదనిసా స్వరములే పాడగా
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
రాజులె పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు మారినా గాడ్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టిపాల్జేసినా
ఆ... ఆ... ఆ... ఆ...
చెదరనీ కదలనీ శిల్పాల వలెనే
నీవు నా హృదయాన నిత్యమై సత్యమై
నిలిచివుందువు చెలీ
నిజము నా జాబిలీ


Manchi Manasulu Songs - Silalapai Silpalu Movie: Manchi Manasulu, Cast: Akkineni Nageswara Rao,…

Thursday 29 October 2015

. లీడర్ (2010)


ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.

చిత్రం : లీడర్ (2010)
సంగీతం : మిక్కీ జె. మేయర్
సాహిత్యం : వేటూరి
గానం : నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..
మూగమైనా రాగమేనా
నీటిపైనా రాతలేనా
ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..

తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు
కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు
నింగి నేలా ఏకమైనా పొద్దులో సింధూరాలు
నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
దొరికింది దొరికింది తోడల్లే దొరికిందీ హొ..
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా... ఓఓఓ..

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..

ఆఆఅ.ఆఅ..ఆఆఆఅ....ఆఆ..
నానన..నానన..ఆఅఆఆ...
ఆశలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా
పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే
రాసలీల రక్తధార భాదలై పోయేనా
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది
ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా...

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..

https://www.youtube.com/watch?v=Jfvfh2aPyno
Leader Songs With Lyrics - Avunanaa Kadhanaa Song - Rana, Richa Gangopadhyay, Priya Anand
Listen & Enjoy Leader Movie,Avunanaa Kadhanaa Song ,Starring Rana, Richa Gangopadhyay, Priya Anand S...





వంశీ కృష్ణా. యదు వంశీ కృష్ణా...గోప వనిత హృదయ సరసి.. రాజ హంసా...కృష్ణా..కృష్ణా

చిత్రం : వంశవృక్షం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ

పల్లవి :

వంశీ కృష్ణా.. యదు వంశీ కృష్ణా
వంశీ కృష్ణా. యదు వంశీ కృష్ణా
గోప వనిత హృదయ సరసి.. రాజ హంసా
కృష్ణా..కృష్ణా
గోప వనిత హృదయ సరసి.. రాజ హంసా
కృష్ణా..కృష్ణా..
వంశీ కృష్ణా... యదు వంశీ కృష్ణా

చరణం 1 :

పుట్టింది రాజకుమారుడుగా.. పెరిగింది గోపకిశోరుడుగా
తిరిగింది యమునా తీరమున.. నిలిచింది గీతాసారంలో

గోప వనిత హృదయ సరసి.. రాజ హంసా..
కృష్ణా..కృష్ణా..
వంశీ కృష్ణా.. యదు వంశీ కృష్ణా..

చరణం 2 :

నోటిలో ధరణి చూపిన కృష్ణా..
గోటితో గిరిని మోసిన కృష్ణా..
ఆటగా రణము నడిపిన కృష్ణా..
ఆటగా రణము నడిపిన కృష్ణా..
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా...
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా...
కిల కిల మువ్వల కేళీ కృష్ణా..
తకదిమి తకదిమి తాండవ కృష్ణా..

కేళీ కృష్ణా.. తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!

https://www.youtube.com/watch?v=4Uh_IQGz2Ck

Vamsi Krishna Yadu Vamsi Krishna - Vamsa Vruksham - 1980
http://raaji-telugusongslyrics.blogspot.in/2012/08/blog-post.html వంశీ కృష్ణా .. యదు వంశీ కృష్ణా గోప...
కోడెకారు చిన్నవాడా.. వాడిపోని వన్నెకాడా...కోటలోనా పాగా వేసావా.. చల్ పువ్వుల రంగా

చిత్రం : ముందడుగు (1958)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : మాధవపెద్ది సత్యం, జానకి

పల్లవి:

కోడెకారు చిన్నవాడా.. వాడిపోని వన్నెకాడా
కోడెకారు చిన్నవాడా.. వాడిపోని వన్నెకాడా
కోటలోనా పాగా వేసావా.. చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా.. చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా..

చింత పూల రైక దానా.. చిలిపి చూపుల చిన్నాదానా
చింత పూల రైక దానా.. చిలిపి చూపుల చిన్నాదానా
కోరికలతో కోటే కట్టావా.. చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా.. చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా.. చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా..

చరణం 1:

చెట్టు మీద పిట్ట ఉంది.. పిట్ట నోట పిలుపు ఉంది
చెట్టు మీద పిట్ట ఉంది.. పిట్ట నోట పిలుపు ఉంది
పిలుపు ఎవరికో తెలుసుకున్నావా.. చల్ పువ్వుల రంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా.. చల్ పువ్వుల రంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా..

పిలుపు విన్నా తెలుసుకున్నా.. పిల్లదానా నమ్ముకున్నా
పిలుపు విన్నా తెలుసుకున్నా.. పిల్లదానా నమ్ముకున్నా
తెప్పలాగా తేలుతున్నానే.. చల్ నవ్వుల రాణీ
నాకు జోడుగా నావా నడిపేవా.. చల్ నవ్వుల రాణీ
నాకు జోడుగా నావా నడిపేవా..

చరణం 2:

నేల వదిలి నీరు వదిలి.. నేను నువ్వను తలపు మాని
నేల వదిలి నీరు వదిలి.. నేను నువ్వను తలపు మాని
ఇద్దరొకటై ఎగిరిపోదామా.. చల్ పువ్వుల రంగా
గాలి దారుల తేలి పోదామా.. చల్ పువ్వుల రంగా
గాలి దారుల తేలి పోదామా..

ఆడదాని మాట వింటే.. తేలిపోటం తేలికంటే
ఆడదాని మాట వింటే.. తేలిపోటం తేలికంటే
తేల్చి తేల్చి ముంచుతారంటా.. చల్ నవ్వుల రాణీ
మునుగుతుంటే నవ్వుతారంటా.. చల్ నవ్వుల రాణీ
మునుగుతుంటే నవ్వుతారంటా..

కోడె కారు చిన్న వాడా.. వాడిపోని వన్నె కాడా
కోటలోనా పాగా వేసావా.. చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా.. చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా..

చింత పూల రైకదానా.. చిలిపి చూపుల చిన్నాదానా
కోరికలతో కోటే కట్టావా.. చల్ నవ్వుల రాణీ
దోర వలపుల దోచుకున్నావా.. చల్ నవ్వుల రాణీ
దోర వలపుల దోచుకున్నావా..
https://www.youtube.com/watch?v=P1CL17U2Jm4
Mundadugu | Kodekaaru song
Watch the classical romantic song Kodekaaru Chinna Vada sung by Madhavapeddi Sathyam and S Janaki fr...
 
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం

చిత్రం: జానకిరాముడు (1988)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు.. ఏడేడు జన్మాలు…

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు…

నీ చరణం కమలం

చరణం 1:

మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు
మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు

అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు
అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు
ఎదుటే నిలిచిన చాలు.. ఆరారు కాలాలు…

చరణం 2:

జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు
జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు
అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు
అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు
ఎదురై పిలిచినా చాలు.... నీ మౌన గీతాలు

https://www.youtube.com/watch?v=zOu44L3eJHM
Nee Charanam Kamalam Song - Janaki Ramudu Movie Songs - Nagarjuna - Vijayashanti - Jeevitha
Watch Nee Charanam Kamalam Song From Janaki Ramudu Movie, Starring Nagarjuna, Vijayashanti, Jeevitha...
 
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..

చిత్రం : అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

చరణం 1:

నిన్ను ఎలా నమ్మను? ఎలా నమ్మించను..?
ఆ ఆ..ప్రేమకు పునాది నమ్మకము..
అది నదీ ..సాగర సంగమము...

ఆ ఆ.. కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము...

అది వెలిగించని ప్రమిదలాంటిది...ఈ..ఈ..
వలచినప్పుడే వెలిగేది...

వెలిగిందా మరి? వలచావా మరి..
వెలిగిందా మరి? వలచావా మరి..
యెదలో ఏదో మెదిలింది..అది ప్రేమని నేడే తెలిసింది...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ...

చరణం 2:

ఏయ్.. వింటున్నావా?..
ఊ.. ఏమని వినమంటావ్?
ఆ..ఆ.. మనసుకు భాషే లేదన్నావు..మరి ఎవరి మాటలని వినమంటావు?
ఆ..ఆ..మనసు మూగగా వినపడుతోంది?
అది విన్నవాళ్ళకే భాషవుతుంది ...

అది పలికించని వీణ వంటిది...మీటి నప్పుడే పాటవుతుంది...
మిటేదెవరని...పాడేదేమని...
మిటేదెవరని...పాడేదేమని...
మాటా..మనసు ఒక్కటని..
అది మాయని చెరగని సత్యమని...

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నా వాడూ...నేడు... రేపు... ఏనాడూ...


https://www.youtube.com/watch?v=f0h9k6H-YGQ
Abhimanyudu Songs | Suryudu Chustunnadu | Sobhan Babu, Radhika
Abhimanyudu Songs | Suryudu Chustunnadu Watch more movies @ http://www.youtube.com/volgavideo http:/...


ఆరాధన
https://youtu.be/WX2ZjvWZuPA
పల్లవి:
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
చరణం1:
నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానే
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
చరణం2:
నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించరావే
పల్లవిగా పలుకరించరావే
నీ వెచ్చని నీడ .....వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే....
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ............


naa hr
naa hrudayam lo nidurinche cheli original- aaradhana1962
Naa Hrudayam lo nidurinche cheli- ANR- Aaradhana ori
naa hrudayam lo nidurinche cheli original- aaradhana1962
Naa Hrudayam lo nidurinche cheli- ANR- Aaradhana original song
బాల భారతం

FILM: BALA BHARATAM
గాయకులు: ఘంటసాల
రచన: ఆరుద్ర
దర్శకులు: సాలూరు రాజేశ్వరరావు
మానవుడే మహనీయుడు - మానవుడే మహనీయుడూ
శక్తి యుతుడు, యుక్తి పరుడు - మానవుడే మాననీయుడూ
మంచిని తలపెట్టినచో మనిషి కడ్డులేదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే
దివిజ గంగ భువి దిపిన భగీరథుడు మానవుడే
సుస్థిర తారగమారిన ద్రువుడు కూడ మానవుడే
సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే
జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే
మానవుడే మహనీయుడు - మానవుడే మహనీయుడూ
గ్రహరాశుల నధిగమించి, ఘనతారల పథమునుంచి
గ్రహరాశుల నధిగమించి, ఘనతారల పథమునుంచి
గగనాంతర రోదసిలో గధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా, దేవేంద్ర లోకమైనా . . చంద్రలోకమైనా, దేవేంద్ర లోకమైనా
బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే
మానవుడే మహనీయుడు - మానవుడే మహనీయుడూ
శక్తి యుతుడు, యుక్తి పరుడు - మానవుడే మాననీయుడూ





ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది

చిత్రం: గౌతమ్ SSC (2005)
సంగీతం: అనూప్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: శ్రేయా ఘోషల్

పల్లవి:

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది ..నిశీధిలో ఉషోదయంలా..
ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది...ఎపుడూ జాడ లేనిది...

చరణం 1:

నీ లాలిని పాడే లాలన నేనోయ్
జాబిలికై ఆశ పడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్
చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్
సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ....

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది....

చరణం 2:

నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాడవై నావెంట నిను నడిపించాలోయ్
జానకై జన్మంతా జంటగా నడవాలోయ్
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల....

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది ..నిశీధిలో ఉషోదయంలా..

https://www.youtube.com/watch?v=HCMuPG1D-c0
Gowtam SSC Songs | Edo Asha | Navdeep, Sindhu Tolani | HD
Movie: Gowtam SSC, Cast: Navdeep, Sindhu Tolani, Madhu Sharma, Bhanupriya Director: P.A. Arun Prasad...


Wednesday 28 October 2015

06.శ్రీ మహాలక్ష్మీ అష్టకమ్,07.ఉమా మహేశ్వర స్తోత్రమ్-- ,08.డమరుకం, 09.శ్రీ అన్నపూర్ణాష్టకం, 10.స్వాతికిరణం(11),జగదేక వీరుని కథ

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
Giant Sea Holly:  "Miss Wilmot's Ghost".  I'd forgotten about Miss Wilmot!

సర్వేజనా సుఖినోభవంతు








శ్రీ మహాలక్ష్మీ అష్టకమ్

(1)నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||

తాత్పర్యము :— అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ !
గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.

(2).నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి!
సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||

తాత్పర్యము :— గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ!
సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.

(3)సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి!
సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

తాత్పర్యము :— సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ!
అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు.

(4)సిద్ధిబుద్ధిప్రదే! దేవి! భుక్తిముక్తిప్రదాయిని !
మంత్రమూర్తే ! సదాదేవె ! మహాలక్ష్మి! నమోస్తుతే ||

తాత్పర్యము :— సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ!
దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.

(5).ఆద్యంతరహితే ! దేవి! ఆద్యశక్తి ! మహేశ్వరి !
యోగజ్ఞే ! యోగసంభూతే ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

తాత్పర్యము :— ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో
గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.

(6).స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే !
మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

తాత్పర్యము :— స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ !
గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు
నమస్కారము.

(7). పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి !
పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

తాత్పర్యము :— పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ !
మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

(8) శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే !
జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

తాత్పర్యము :— తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి
కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.

ఫలశ్రుతి
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
 ఇంద్రకృతం శ్రీ మహాలక్ష్మీ అష్టకం సంపూర్ణం ||[
   
 


నిధిచాల సుఖమా
రాగం: కల్యాణి
తాళం: చాపు
త్యాగరాజ కృతి

పల్లవి:

నిధిచాల సుఖమా
రాముని సన్నిధి సేవ సుఖమా
నిజముగ బల్కు మనసా
(నిధిచాల)

అనుపల్లవి:

దధి నవనీత క్షీరములు రుచియో
దాశరథి ధ్యాన భజన సుధారసము రుచియో
(నిధిచాల)

చరణం:

దమ శమమను గంగా స్నానము సుఖమా
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా
మమత బంధన యుత నరస్తుతి సుఖమా
సురపతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా
(నిధిచాల)


జగదేక వీరుని కథ
కధ చిత్రంలోని ఈ పాట ఆ పాత మధురాలలో ఒకటే కాదు సంగీత సాధకులకు ఒక పరిక్ష లాంటిది. పెండ్యాల గారి సంగీత సారధ్యంలో పింగళి గారి రచించిన ఈ పాట మన ఘంటసాల గారి గాత్రంతో మనందరినీ అలరిస్తూనే ఉంది
పల్లవి::
శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి
శివశంకరీ..శివానందలహరీ..శివశంకరీ
శివానందలహరి..శివశంకరీ
చరణం::1
చంద్రకళాధరి..ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..
చంద్రకళాధరి ఈశ్వరీ
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా..మహిమ జూపవా
దీనపాలనము చేయవే..ఏ
శివశంకరీ..శివానందలహరీ..శివశంకరీ
శివశంకరీ..శివానందలహరీ..శివానందలహరి..శివశంకరీ
శివశంకరీ..శివా..నంద..లహరీ..శివశంకరీ
శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ
చరణం::2
చంద్రకళాధరి..ఈశ్వరీ..రిరి సని..దనిసా
మపదనిసా..దనిసా..దనిసా..దనిసా
చంద్రకళాధరి..ఈశ్వరీ..రిరి సనిపమగా
రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప
చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస
సరిమ గరి మపని..దనిస..మప..నిరి..సరి..నిస..దనిప
మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని
సని పని పమ..పమ..గమరి సనిస
సని పని పమ..పమ..గమరి సనిస
సరి మపని దానిస..సరి మపనిదానిస..సరిమపని దానిస
చంద్రకళాధరి..ఈశ్వరీ..ఆ..ఆ..ఆ
చంద్రకళాధరి..ఈశ్వరీ..శివశంకరీ..శివశంకరీ
తోం..తోం..తోం..దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరితోం
దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం
దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా
దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం
దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం
చరణం::3
దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం
నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని
సగగ..రిగగ..రిస సరిరి..సరిరి..సని
నిసస..నిసస..నిద..దనిని దనిని దప
నిని దద..ససనిని..రిరిసస..గగరిరి
గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస
రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ
నినిని రిరిగరిమా
రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ
సరి సస..మప మమ..సరి సస..సససస
సరి సస..పని పప..సరిసస..సససస
మప మమ..పని దద..మపమ..పనిద
మపమ..పనిద..పదపప..సరి సస
ప ద ప..సరిస..పదప..సరిస..మమమ
పపప..దదద..నినిని..ససస..రిరిరి
గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
శివశంకరీ..
https://www.youtube.com/watch?v=VpLiKdqPIqc

B&W to Color conversion - Sivashankari
Colorization of Sivashankari Song from Jagadekaveerunikadha (low resolution footage).
YOUTUBE.COM
Jagadeka Veeruni Katha Movie | Shiva Sankari Siva Nandh
B&W to Color conversion - Sivashankari
Colorization of Sivashankari Song from Jagadekaveerunikadha (low resolution footage).
youtube.com

B&W to Color conversion - Sivashankari
Colorization of Sivashankari Song from Jagadekaveerunikadha (low resolution footage

ఆనతి నీయరా.. హరా...సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా...
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : వాణీజయరాం
పల్లవి :
ఆ.... ఆ... ఆ.... ఆ.....
ఆనతి నీయరా.. హరా
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా...
సన్నిధి చేరగా... ఆనతి నీయరా.. హరా
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...
సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా...

నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనమ్
వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
ఆనతి నీయరా.. హరా
చరణం 1 :
ని ని స ని ప నీ ప మ గ స గ... ఆనతి నీయరా!
అచలనాధ అర్చింతునురా... ఆనతినీయరా!
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసని... ఆనతినీయరా!
జంగమ దేవర సేవలు గొనరా...
మంగళ దాయక దీవెనలిడరా!
సాష్ఠాంగముగ దండము సేతురా... ఆనతినీయరా!
చరణం 2 :
సానిప గమపానిపమ
గమగ పాప పప
మపని పాప పప
గగమ గాస సస
నిసగ సాస సస
సగ గస గప పమ పస నిస
గసని సాగ సాగ
సని సాగ సాగ
సగ గాస సాస
సని సాగ గ
గసగ గా
పద గస గా స ని పమగమ గా... ఆనతినీయరా!
శంకరా... శంకించకురా!
వంక జాబిలిని జడను ముడుచుకొని...
విసపు నాగులను చంకనెత్తుకొని...
నిలకడనెరుగని గంగనేలి... ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి.. నీ కింకరుణిక సేవించుకొందురా!
ఆనతినీయరా...
చరణం 3 :
పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా
గామాపని గమాపాని స మపానీసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ.. తక తకిట తకధిమి
మమ పప నినిసమ.. తక తకిట తకధిమి
పపనినిసస గని.. తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా
రక్షా... ధర శిక్షా దీక్షా దక్ష!
విరూపాక్ష! నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక..
పరీక్ష సేయక.. రక్ష.. రక్ష.. యను ప్రార్ధన వినరా!
ఆనతినీయరా... హరా!
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...
సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా


శరణవరాత్రులకి ఆహ్వానం పలుకుతూ.., ఆ అమ్మవారిపై సిరివేన్నలవారు సాహిత్యాభిషేకం తయారు చేయగా., బాలు జానకిల గాత్ర కలశంతో ఆ అమ్మవారికి స్వాతికిరణాభిషేకించిన "శివాని.. భవాని.. శర్వాణి..... " భక్తితో మనందరికి ఆశిసులు అందాలని ఆశిస్తూ

శివాని.. భవాని.. శర్వాణి..
గిరినందిని శివరంజని భవభంజని జననీ
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..

శృంగారం తరంగించు సౌందర్యలహరివని ...
శృంగారం తరంగించు సౌందర్యలహరివని ...
శాంతం మూర్తీభవించు శివానందలహరివని...
శాంతం మూర్తీభవించు శివానందలహరివని...
కరుణ చిలుకు శ్రీనగవుల కనకధారవీవని ..
నీ దరహాసమే దాసుల దరిచేర్చే దారియని ..
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..

రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి అభయపాళి నీవని
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి అభయపాళి నీవని
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని .. భీషణాస్త్ర కేళివని
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావని
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..

   Like
   Comment
   Share




శ్రీ అన్నపూర్ణాష్టకం
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీనిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 1
 

నానా రత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ |కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 2
 

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీచంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 3
 

కైలాసాచల కందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీకౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ |మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 4
 

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీలీలానాటక సూత్రఖేలనకరీ విఙ్ఞానదీపాంకురీ |శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 5
 

ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియే శాంకరీకాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీధరీ |స్వర్గద్వారకవాట, పాటనకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 6
 

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీనారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ |సాక్షాన్మోక్షకరీ, సదా శుభకరీ, కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 7
 

దేవీ సర్వ విచిత్రరత్నరచితా దాక్షాయిణీ సుందరీవామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 8
 

చంద్రార్కానల కోటికోటి సదృశా, చంద్రాంశుబింబాధరీచంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ |మాలాపుస్తకపాశ సాంకుశధరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 9
 

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీసాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీభిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ|| 10
 

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభేఙ్ఞానవైరాగ్య సిద్ద్యర్థం బిక్షాం దేహిచ పార్వతి |మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరఃభాందవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం || 11
 

చిత్రం : డమరుకం (i2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల
గానం : శంకర్ మహదేవన్
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ... డమరుకం (2012)
భం భం భో ..... భం భం భో ......భం భం భో ..... భం భం భో ....
భం భం భో ..... భం భం భో ....భం భం భో .... భం భం భో ....
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !! 2
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా !
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా !! 2
ఓం పరమేశ్వరా ! పరా !! ఓం నిఖిలేశ్వరా ! హరా !!
ఓం జీవేశ్వరేశ్వరా ! కనరారా !!
ఓం మంత్రేశ్వరా ! స్వరా !! ఓం యుక్తేశ్వరా ! స్థిరా !!
ఓం నందేశ్వరామరా ! రావేరా !! !! శివ !! 1
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !! 2
ఆకశాలింగమై ఆవహించారా ,
డమ డమమని డమరుఖ ధ్వని సలిపి జడతని వదిలించరా !
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా !!
భస్మం చేసేయ్ ! అసురులను అగ్నిలింగమై లయకారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా !!
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరునించరా !! !!శివ !!
విశ్వేశ లింగమై కనికరించరా
విదిలిఖితమునిక బర బర చెరిపి అమృతం కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా ,
పలు శుభములు గని అభయములిడి హితము సతతము అందించరా !!
గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వరా !
ప్రాణం నీవై ఆలింగనమీరా
ఎదలో కొలువై హర హర ఆత్మా లింగమై నిలబడరా ! *
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా !! !! శివ !! 2
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా .(కోరస్ ....భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ ((కోరస్ ...భం భం భో
అర్పింతుము శంకర !! 2
చిత్రం : డమరుకం (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : జొన్నవిత్తుల
గానం : శంకర్ మహదేవన్



ఉమా మహేశ్వర స్తోత్రమ్--

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 1 ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 2 ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 3 ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 4 ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 5 ||

నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 6 ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 7 ||

నమః శివాభ్యామశుభాపహాభ్యాం
అశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 8 ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 9 ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 10 ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 11 ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 12 ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని
భుంక్తే శతాయురాంతే శివలోకమేతి || 13 ||

రచన: ఆది శంకరాచార్య


Tuesday 27 October 2015

1. గోరింటాకు ,2. రక్తసంబంధం, 3ఆత్మీయులు ,4నీరాజనం,5ఇంటింట రామాయణం, 6మాతృదేవో భవ, 7మాయా బజార్ ,8భక్త తుకారం, 9రెండు రెళ్ళు ఆరు, 10.రామచిలక, 11.నీరాజనం,

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం
 ప్రాంజలిప్రభ - సంగీత ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు 

చిత్రం: గోరింటాకు
గానం: పి సుశీల ,ఎస్ పి బాలు
మ్యూజిక్ :కే వి మహదేవన్
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి 

నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ...

చిత్రం: నీరాజనం (1988)
సంగీతం: ఓ.పి. నయ్యర్
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: జానకి

పల్లవి:

ఓహోహో... ఆహాహా...
ఓహోహో... ఆహా ఆహా ఆహా

నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ

చరణం 1:

ఆహాహహా ఆహహా ఆహహా

హద్దులో అదుపులో ఆగనీ గంగలా
నీటిలో నిప్పులో నిలువనీ గాలిలా
విశ్వమంత నిండియున్న ప్రేమకూ
ప్రెమలోన బ్రతుకుతున్న ఆత్మకూ
విశ్వమంత నిండియున్న ప్రేమకూ
ప్రెమలోన బ్రతుకుతున్న ఆత్మకూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ

చరణం 2:

ఆహాహహా ఆహహా ఆహహా

వెలగనీ దివ్వెనై పలకనీ మువ్వనై
తియ్యనీ మమతకై తీరనీ కోరికై
వేచి వేచి పాడుతున్న పాటకూ
పాటలోన కరుగుతున్న జన్మకూ
వేచి వేచి పాడుతున్న పాటకూ
పాటలోన కరుగుతున్న జన్మకూ

నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ
https://www.youtube.com/watch?v=x3zY7y0lUdI
Neerajanam Songs - Nene Sakshyamu - Saranya - Viswas
Saranya Viswas's Neerajanam Telugu Movie Song Music : O P Nayyar Lyrics : Acharya Athreya C Narayana...

మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంటా..

చిత్రం : రామచిలక (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి

పల్లవి :

లాలిలాలో..ఓఓఓ..లాలిలాలో..ఓ..ఓ..
లలిలాలిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

నా మావయ్య.. వస్తాడంట..
మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంటా
మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంటా
మరదల్ని మెచ్చీ.. మరుమల్లె గుచ్చీ
ముద్దిచ్చి పోతాడంటా.. ఆ ముద్దర్లు పోయేదెట్టా

నా బుగ్గలే ఎరుపెక్కెనే..
మొగ్గేసినా నును సిగ్గులు..
ఆ..మొగ్గేసినా తొలిసిగ్గులు..
పడుచోడు నవ్వాడంట... పగలంత ఎన్నెల్లంట
వలపల్లె వచ్చి.. వరదల్లె ముంచి..
వాటేసుకొంటాడంటా.. ఆడ్ని పైటేసుకొంటానంట

మావయ్య వస్తాడంట.. మనసిచ్చిపోతాడంట

చరణం 1 :

కల్లోకి వచ్చీ.. కన్ను కొట్టాడే..
కన్నె గుండెల్లో.. చిచ్చు పెట్టాడే..
కల్లోకి వచ్చీ.. కన్ను కొట్టాడే..
కన్నె గుండెల్లో.. చిచ్చుపెట్టాడే..

గుండెల్లో వాడు ఎండల్లు కాసే.. కన్నుల్లో నేడు ఎన్నెల్లు కురిసే..
వన్నెల్లు తడిసే.. మేనేల్ల మెరిసే ..
పరువాలే పందిళ్ళంట.. కవ్వించే కౌగిళ్ళంట..
మురిసింది ఒళ్ళు.. ఆ మూడుముళ్ళూ..
ఎన్నాళ్ళకేస్తాడంటా.. ఇంకెన్నాళ్ళకొస్తాడంట..

మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంట..

చరణం 2 :

కళ్యాణ వేళా.. సన్నాయి మోగ..
కన్నె అందాలే.. కట్నాలు కాగా
కళ్యాణ వేళా.. సన్నాయి మోగ..
కన్నె అందాలే.. కట్నాలు కాగా
మనసిచ్చినోడు.. మనువాడగానే..
గోరింక నీడ.. ఈ చిలకమ్మ పాడే..
చిలకమ్మ పాడే.. చిలకమ్మ పాడే ...

ఇంటల్లుడౌతాడంట.. ఇంక నా ఇల్లు వాడేనంటా..
ఇంటల్లుడౌతాడంట.. ఇంక నా ఇల్లు వాడేనంటా..
మదిలోని వాడూ.. గదిలోకి వస్తే..
కన్నీరు రావాలంటా.. అదే పన్నీరై పోవాలంటా ..
కన్నీరు రావాలంటా.. అదే పన్నీరై పోవాలంట..

https://www.youtube.com/watch?v=y9VZf5tKxYA
mavayya vastadanta .... Ramachilaka
Excellent song from movie Ramachilaka starring Vanisree


విరహ వీణ ...హా...నిదుర రాక వేగే వేళలో..శృతిని మించి రాగమేదో పలికే వేళలో...

చిత్రం : రెండు రెళ్ళు ఆరు (1985)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి

పల్లవి :

విరహ వీణ ...హా...నిదుర రాక వేగే వేళలో..
శృతిని మించి రాగమేదో పలికే వేళలో...
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో...ఓ..
విరహ వీణ...నిదుర రాక వేగే వేళలో..
ఆ..ఆ..వేగే వేళలో...

చరణం 1 :

జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా..
సా..పదసరిగ...గా..దపదసరి...గా
దపాగ..
గాపరీగ.. సరిగరి..సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ...
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...ఆ ఆ ఆ ఆ ఆ

జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా..
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...
లేలేత వలపు..సన్నాయి పిలుపు ..రావాలి సందిళ్ళ దాకా..
మన పెళ్ళిపందిళ్ళ దాకా..ఆ ఆ ....

విరహ వీణ ..హా....నిదుర రాక వేగే వేళలో..ఆ..వేగే వేళలో...

చరణం 2 :

ఎదలో కదిలే ఏవో కథలు ఏమని తెలిపేదిరా..
చీకటిపగలు ..వెన్నెల సెగలు... నీ నీడ కోరేనురా..
ఈ నాటకాలు మన జాతకానా రాశాయిలే ప్రేమలేఖా..
ఈ దూరమెన్నాళ్ళ దాకా...ఆ..ఆ..

విరహ వీణ ..హా...నిదుర రాక వేగే వేళలో..
శృతిని మించి రాగమేదో పలికే వేళలో...
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో... ఓ..
విరహ వీణ ...నిదుర రాక వేగే వేళలో..వేగే వేళలో
https://www.youtube.com/watch?v=KbRxPvhovyo
Rendu Rellu Aaru Movie Songs - Veeraha Vela Song
Watch


మాతృదేవో భవ
వేణువై వచ్చాను

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం

ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి

Venuvai Vachanu Song - Nassar Songs - Matru Devo Bhava Movie Songs - Madhavi, Nassar, Y Vijaya
Venuvai Vachanu Song - Nassar Songs - Matru Devo Bhava Movie Songs Movie: Matru Devo Bhava, Starring..

ఇంటింట  రామాయణం
వీణ వేణువైన సరిగమ విన్నావా . ఓ.. తీగ రాగమిన మధురిమ కన్నావా ..
తనువు  తహ తహ లాడనల.. చెల రేగ఺ల.. చెలి ఊగ఺ల.. ఊయలీవేళలో...
||వీణ వేణువ ైన||
ఊపిరి తగిలిన వేళ.. తూ ఴం఩ులు తిరిగిన వేళ.. న్న వీణలో తూ వేణువే.. ఩లికే ర఺గమాల..
చూ఩ులు రగిలిన వేళ.. ఆ చుకకలు వ లిగిన వేళ.. న్న తనుఴున అణుఴణుఴున్న.. జరిగే ర఺సలీల..
||వీణ వేణువ ైన||
ఎదలో అందం ఎదుట.. ఎదుటే వలచిన వనితా ఴతుతన.. తూ ర఺కతో న్న తోటలో వ లసే ఴనదేఴత..
కదిలే అందం కవిత.. అది కౌగిలికొచ్చే యువత .. న్నతృ఺టలో తూ఩లలవే.. నఴతన నఴా మమత..
వీణ వేణువైన సరిగమ విన్నావా.. ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా .
తనువు తహ తహ లాడనల.. చెల రేగ఺ల.. చెలి ఊగ఺ల.. ఉయ్ాాలలీవేళలో...
||వీణ వేణువ ైన||

https://www.youtube.com/watch?v=QebPpYEBJ-w

ఓ పి నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన నీరాజనం చిత్రం..
ఎంత గొప్ప మ్యూజికల్ హిట్టో వేరేగా చెప్పనక్కర్లేదు.
ఈ చిత్రంలోని ఆచార్య ఆత్రేయ గారి రచనలో జాలువారిన
ఆణిముత్యం "మనసొక మధు కలశం" గీతం..నాకు చాలా చాలా ఇష్టం.
మనసొక మధు కలశం
పగిలే వరకే అది నిత్య సుందరం
మరిచిన మమతోకటి మరి మరి పిలిచినది
ఒక తీయని పరితాపమై ..
మనసొక మధు కలశం
పగిలే వరకే అది నిత్య సుందరం
తొలకరి వలపొకటి తలపుల తొలిచినది
గత జన్మల అనుబంధమై ...
మనసొక మధు కలశం
పగిలే వరకే అది నిత్య సుందరం.

Neerajanam Songs - Manasoka Madhukalasam - Saranya - Viswas
Saranya Viswas's Neerajanam Telugu Movie Song Music : O P Nayyar Lyrics : Acharya Athreya C Narayana..

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు...

చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
ప్రేమించామంటారు పెద్దగ చెబుతుంటారు
పెళ్ళి మాట ఎత్తగానే చల్లగ దిగజారతారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు
డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు
లవ్ మ్యారేజీలంటూ లగ్నం పెట్టేస్తారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

కట్నాలు పెరుగునని కాలేజీకెళతారు
కట్నాలు పెరుగునని కాలేజీకెళతారు
హాజరు పట్టి వేసి గైరు హాజరవుతారు
మార్కుల కోసం తండ్రుల తీర్ధయాత్ర తిప్పుతారు
ఇంజనీర్లు డాక్టర్లయి ఇక చూస్కోమంటారు

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు

చరణం 1:

వరండాలోన చేరి వాల్చూపులు విసురుతారు
వరండాలోన చేరి వాల్చూపులు విసురుతారు
సినిమాలు షికార్లంటూ స్నేహం పెంచేస్తారు
తళుకు బెళుకు కులుకులతో పైట చెంగు రాపులతో
చిటికెలోన అబ్బాయిల చెంగున ముడివేస్తారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

చరణం 2:

ఆస్తి వున్న పిల్లయితే అందం జోలికి పోరు
కుంటిదైన కురూపైన పెళ్ళికి యస్సంటారు
పెళ్ళి అయిన మర్నాడే శ్రీవారిని చేతబట్టి
బయటికి అత్తామామల దయచేయండంటారూ

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

చరణం 3:

దిమ్మతిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు
వలపు దాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు
మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...

మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...

మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...
https://www.youtube.com/watch?v=Sn5_WfxT10c
Amma Babu Nammaraadu Song - Aathmeeyulu Movie Songs - ANR - Vanisri
Watch Aathmeeyulu Full Movie / Aathmeeyulu Movie Starring with ANR, Vanisri, Chandhra Kala, Directed...


బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే...కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
చిత్రం : రక్తసంబంధం (1962)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : అనిసెట్టి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
చరణం 1 :
ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే...
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
చరణం 2 :
అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
చరణం 3 :
మనసైన వాడు వరుడు.. నీ మదినేలుకొనెడు ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళ ళ ళ –హాయి
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే