Tuesday 6 October 2015

1. మర్యాద రామన్న 2. యముడికి మొగుడు 3. విప్రనారాయణ 4. జయం 5. ఏప్రియల్ 1 విడుదల 6. ఎలా చెప్పను 7. పసిహృదయాలు 8. డబ్బు డబ్బు డబ్బు 9. నామనసుకేమైంది 10. జాతర 11. చదువుకున్న అమ్మాయిలు 12. అదృష్టం


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - మధురగీతాలు 

సర్వే జనాసుఖినోభవంతు

1. మర్యాద రామన్న 
2. యముడికి మొగుడు 
3. విప్రనారాయణ 
4. జయం 
5. ఏప్రియల్ 1 విడుదల 
6. ఎలా చెప్పను 
7. పసిహృదయాలు
8. డబ్బు డబ్బు డబ్బు 
9. నామనసుకేమైంది 
10. జాతర 
11. చదువుకున్న అమ్మాయిలు 
12. అదృష్టం 

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా...నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా...

చిత్రం : యముడికి మొగుడు (1988)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే .. లయలే చూసి లాలించుకో

ఓ.. వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ..
వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా

చరణం 1 :

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో .. వద్దు లేదు నా భాషలో
మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో .. హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరి తాకితే.. ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే.. కోరికన్నదే రేగదా?
వడగట్టేసి బిడియాలనే .. ఒడి చేరాను వాటేసుకో..
వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా... నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా

చరణం 2 :

అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా... చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా... జారుపైట తానాగునా
క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే .. గొడుగేసాను తలదాచుకో
వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ..

https://www.youtube.com/watch?v=0DGVHjeJWhQ

Yamudiki Mogudu: 'Vaanajallu gilluthunte...' song!
Watch the song 'Vaanajallu gilluthunte...' featuring Chiranjeevi and Vijayashanthi from the film 'Ya...


అష్టపది....బాపుగారి ఇష్ట పది .
,శ్రీ సూర్యనారాయణా మేలుకో అంటూ సాక్షాత్తు సూర్యభగవానుడ్నే గద్దించి నిదుర లేప గల సత్తా ఉన్న భానుమతమ్మ తొలినాళ్ళలో మధురంగా ఆలపించిన ఈ పాట వినని తెలుగు వాళ్ళు ఉంటారని నేను అనుకోను, బహుశా ఈ తరం యువతకి చేరి ఉండకపోవచ్చేమో తెలియదు. జయదేవుని అష్టపదినుండి కొన్ని పంక్తులను తీసుకుని రసాలూరు సాలూరి వారి స్వరసారధ్యంలో కూర్చిన ఈ అందమైన పాట మీకోసం..
.
చిత్రం : విప్రనారాయణ
సాహిత్యం : జయదేవుడు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : భానుమతి
విరహే..ఏ.ఏ.ఏ.ఎ.ఎ.ఎ.ఎఎ
తవా...ఆఆఆ...ఆఆఅ....
దీనా ఆఆఆఆ....ఆఆ.ఆఅ.అ.అ.అ.అ...
సా విరహే తవదీనా రాధా..
సా విరహే తవదీనా రాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవదీనా....
నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేద మధీరం.....
వ్యాళనిలయ మిళనేన గరళమివా..ఆఆ..ఆఆ.ఆఆ.ఆఆఆఅ
వ్యాళనిలయ మిళనేన గరళమివా కలయతి మలయ సమీరం
సా విరహే తవ దీనా
కుసుమ విశిఖశరతల్పమనల్ప విలాస కళా కమనీయం
వ్రత మివ తవ పరి రంభసుఖాయా...
వ్రత మివ తవ పరి రంభసుఖాయా కరోతి కుసుమ శయనీయం
సా విరహే తవ దీనా
ప్రతిపద మిద మపి నిగదతి మాధవ.. నిగదతి మాధవ..
నిగదతి మాధవ తవచరణే పతితాహం....
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే.. తనుదాహం
సా విరహే తవ దీనా రాధా..
సా విరహే తవ దీనారాధా..
సా విరహే తవదీనా...
కృష్ణా...ఆఆఆఆఆఆఆఆ....
తవ విరహే..ఏఏఏ....దీనా... ఆఆఆఆఆ..ఆఅ.అ.అ.ఆఆఆ...
.
ఈ పాటలో ఉపయోగించిన లైన్స్ కి అర్ధం ఇదట : ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి. యమునా తీరంలో ఒక పొదరింటిలో చంచల మనస్కుడై రాధను తలుస్తున్న కృష్ణుణ్ణి సమీపించి, రాధ పడే బాధనీ, నానా అవస్థలనీ ఆమె చెలికత్తె చెప్తుంది.
"రాధ విరహం చేత చల్లని వస్తువులయిన గంధాన్నీ, వెన్నెలనీ, మలయమారుతాన్నీ తట్టుకోలేక దూరంగా మసలుకుంటున్నది. ఇవేవీ రాధకి శాంతినివ్వడం లేదు. నీవెప్పుడు వస్తావో అని తహతహలాడుతూ పూలపానుపుని పరిచి వుంచింది. ఆ పడకపై నిన్ను కౌగిలించుకొని ఆనందంగా పడుకోవాలని రాధ కలలు కంటున్నది. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు నీ పేరునే ఆమె జపిస్తుంది. నీ ఉదాసీనత వల్ల ఆమెను చంద్రుడు కూడా కాల్చి వేధిస్తున్నాడు."
https://www.youtube.com/watch?v=dajvUguUfig









కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని...

చిత్రం : డబ్బు డబ్బు డబ్బు
గానం : జానకి
సంగీతం : శ్యాం
సాహిత్యం : వేటూరి

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..

కుహు కుహూ... కుహు కుహూ...

నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీహృదయం లోన.. మరుమల్లెల వానా..
నీహృదయం లోనా.. మరుమల్లెల వానా..
కురిసి..మురిసి..పులకించాలంటా..
.
కురిసీ..మురిసీ..పులకించాలంటా..
.

కుహు కుహూ... కుహు కుహూ...

గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
కలసి... మెలసి... తరియించాలంట...
కలసీ... మెలసీ... తరియించాలంట...

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..
https://www.youtube.com/watch?v=WPoE4tmVEII

Dabbu Dabbu Dabbu Movie Songs - Kuhu Kuhu Kuse koyila Song
Watch

ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా...ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా...

చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
నేపధ్య గానం: కే.కే

పల్లవి:

ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే
మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే
కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా
దైవం కరుణిస్తే మాదే విజయమా

ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా

చరణం 1:

కనులే కరువైతే అందమెందుకు
వనమే ముళ్ళైతే కంచె ఎందుకు
కలలే కథలై బ్రతుకే చితులై
సాగే పయనం ఉందా ప్రేమా

ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే
మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే
కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా
దైవం కరుణిస్తే మాదే విజయమా

చరణం 2:

చెలియ శిల లేక కోవెలెందుకు
జతగా నువు లేక నేను ఎందుకు
మమతే కరువై మనసే బరువై
లోకం నరకం కాదా ప్రేమా

https://www.youtube.com/watch?v=G0jAVe4Q6pw
Jayam Prema Prema
Prema Prema song -Singer kk


ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ ... ఇంపుగ చూపవే వయ్యారీ...

చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ ... ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ ... అల్లరి ఆకలీ ... ఎందుకు పోకిరీ చాలు మరీ
మోవినీ ... మగతావినీ ... ముడి వేయనీయవా
కాదనీ ... అనలేననీ ... ఘడియైన ఆగవా
అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ ..హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ

ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో

చరణం 1:

"మాంగల్యం తంతునానేన... మమజీవన హేతునా
కంఠే భద్రామి శుభకే...త్వం జీవ శరదస్యకం
త్వం జీవ శరదస్యకం... త్వం జీవ శరదస్యకం "

కాంక్షలో కైపు నిప్పూ... ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా... మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం... గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం... మరయాగ వాటికా

కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
హో హో...

ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ... హో

చరణం 2:

నిష్ఠగా నిన్ను కోరీ... నీమమే దాటినా
కష్ఠమే సేద తీరే... నేస్తమే నోచనా
నిద్రహం నీరు గారే... జ్వాలలో నింపినా
నేర్పుగా ఈది చేరే... నిశ్చయం మెత్తనా

సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో
హో హో...

ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ
వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో...

https://www.youtube.com/watch?v=Nbqpr2ghHS4

April 1 Vidudala - Ompula Vaikari - Rajendra Prasad - Sobana - Romantic Song
April 1 Vidudala Songs, April 1 Vidudala is a Super Hit Telugu Movie Starring : Rajendra Prasad, Sob...

మన్నించు ఓ ప్రేమ! మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
మన్నించు ఓ ప్రేమ! మరుగేల చెప్పమ్మా
దరిచేరు దారేదైనా చూపించుమా
చెప్పనంటు దాచడానికైన
అంత చెప్పరాని మాట కాదు అవునా
ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
పట్టరాని ఆశ పెంచుకున్నా
అది మోయరాని భారమవుతున్నా
చెప్పుకుంటె తప్పులేదు అయిన
నువ్వు ఒప్పుకోవు ఏమో అనుకున్న
జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా
కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా
రెండు చేతుల అందుకోమని అనవేం స్నేహమా
చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా
చొరవగా పొదువుకో నడిపే ప్రణయమా
బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా
తగిన తరుణమని ఉదయ కిరణమై
ఎదురు పడిన వరమా
అన్ని వైపుల చెలిమి కాపల అల్లే బంధమా
మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా
నిదురలో అలా నిలిపోకలా మెరిసే స్వప్నమా
కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా
తలపులే తెలుపవే నాలో ప్రాణమా
పెదవిపై పలకవేం ఊహాగానమా
మదిని మీటినది నీవు కాద మరి మధురమైన స్వరమా....
Manninchu O Prema Song - Ela Cheppanu Movie, Shriya, Tarun, Koti
Watch Manninchu O Prema Song From Ela Chepanu Movie. starring Shriya, Tarun, Sunil among others , Di...
   

కలలు కన్న రాధ...కనులలో మనసులో గోపాలుడే...

చిత్రం: పసి హృదయాలు (1973)
సంగీతం: జి.కె. వెంకటేశ్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

కలలు కన్న రాధ...కనులలో మనసులో గోపాలుడే...
కలలు కన్న రాధ... కనులలో మనసులో గోపాలుడే...

చరణం 1:

నీ జతలో శృతి చేసుకుంది హృదయం
నీ జతలో శృతి చేసుకుంది హృదయం
నీవు తాకగానే నిలువెల్ల వేణుగానం
ఔనా...ఔనా...ఔనా.....

కలలు కన్న రాధ ...కనులలో మనసులో గోపాలుడే...
కలలు కన్న రాధ...

చరణం 2:

నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా..
నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా
నీడలాగ నీతో బ్రతుకెల్ల సాగిపోనా
ఔనా...ఔనా...ఔనా.....

కలలు కన్న రాధ... కనులలో మనసులో గోపాలుడే
కలలు కన్న రాధ...

చరణం 3:

ఈ వలపే నిలవాలి యుగ యుగాలు..
ఈ వలపే నిలవాలి యుగ యుగాలు
ఎన్ని జన్మలైనా ఈ బంధమున్న చాలు
ఔనా...ఔనా...ఔనా.....

కలలు కన్న రాధ ...కనులలో మనసులో గోపాలుడే...
కలలు కన్న రాధ

https://www.youtube.com/watch?v=OSwbMb7QlXw
Kalalu Kanna Radha - Pasi Hrudayaalu
Singer:P.Suseela Music:G.K.Venkatesh Lyrics:Dr.C.Narayana reddy Movie:Pasi Hrudayaalu

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని...

చిత్రం : డబ్బు డబ్బు డబ్బు
గానం : జానకి
సంగీతం : శ్యాం
సాహిత్యం : వేటూరి

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..

కుహు కుహూ... కుహు కుహూ...

నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీహృదయం లోన.. మరుమల్లెల వానా..
నీహృదయం లోనా.. మరుమల్లెల వానా..
కురిసి..మురిసి..పులకించాలంటా..
.
కురిసీ..మురిసీ..పులకించాలంటా..
.

కుహు కుహూ... కుహు కుహూ...

గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
కలసి... మెలసి... తరియించాలంట...
కలసీ... మెలసీ... తరియించాలంట...

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..
https://www.youtube.com/watch?v=WPoE4tmVEII
Dabbu Dabbu Dabbu Movie Songs - Kuhu Kuhu Kuse koyila Song
Watch
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపల
మనకిద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికిపడుతు ఉంది
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమా
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడీ
పెంచుకున్న మత్తులో మరీ మతే చెడీ
|అతడు|
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదనీ
.
ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా
ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదు కళ్లలో ఉన్న నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగా
లోకమంటే ఇద్దరే అదే మనం అనీ
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అనీ
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథనీ
||నా మనసుకేమయింది||
|| మనకిద్దరికీ తెలియంది||
Naa Manusukemayindi Song - Nuvve Nuvve Movie, Tarun, Shreya, Koti, Trivikram
Watch Naa Manusukemayindi Song From Nuvve Nuvve Movie, starring Tarun, Shriya Saran, Prakash Raj amo...
 

మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...ఓ...

చిత్రం : జాతర (1980)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : ఎస్. పి. శైలజ

పల్లవి:

మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...ఓ...
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...

చరణం 1:

పెళ్ళిపీఠపైన ఏ రాజు దాపునా...
చూపుచూపులోనా నూరేళ్ళ దీవన
ఆ సమయమందు నేను...
ఆ సమయమందు నేను... ఈ బిడియమోపలేను...

గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..

చరణం 2:

వెన్నెళ్లనడుగు.. మరుమల్లెనడుగు..
ఇల్లాలి మనసే కడు చల్లన...
వెన్నెళ్లనడుగు.. మరుమల్లెనడుగు..
ఇల్లాలి మనసే కడు చల్లన...

ఈ గుండెనడును.. నిట్టూర్పునడుగు..
ఈ గుండెనడును.. నిట్టూర్పునడుగు..
తొలిరేయి తలపే నులివెచ్చన...
తొలిరేయి తలపే నులివెచ్చన...

గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..

చరణం 3:

మా ఊరు తలచుకుంటూ నీతోటి సాగనీ
నిన్ను తలచుకుంటూ నా ఊరు చేరనీ
ఈ రాకపోకలందే...
ఈ రాకపోకలందే... నను రేవు చేరుకోనీ...

గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...
మాఘమాస వేళలో.. ఒకనాటి సంధ్యలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో...

http://nssrb.com/chirumovies/JATHARA/Magamasa%20Velalo%28www.cinemelody.com%29.MP3

nssrb.comఇద్దరమ్మాయిలు 

’కిలకిల నవ్వులు చిలికిన –పలుకును నాలో బంగారు వీణ
కరిగిన కలలే నిలిచిన –నింపెను నాలో మందార మాల
రమ్మని మురళీ రవళులు పిలిచే –ఆణువణువూ బృందావని లో నిలిచే
తళతళ లాడే తరగల పైన –ఆందీ అందని అందాలు మెరిసే
నీ ఉన్న వేరే సింగారములేల? –మమతలు నీ పాద ధూళి సిందూరము కాదా ?
నీ కురులే నను సోకిన వేళ –హాయిగా రగిలెను తీయని జ్వాల
గలగల పారే వలపుల లోన –సాగెను జీవన రాగాల నావ
ఇద్దరు –కిల కిల నవ్వులు చిలికిన –పలుకును నాలో అన్గారు వీణ
అతడు నవ్వుల్నీ కిల కిలా చిలికిస్తే – ఆమే మదిలో బంగారు వీణ పలుకుతుందిట
కిలకిల అన్న మాటల్లో నవ్వును అద్భుతం గా పలికించాడు సినారె .
ఆ నవ్వుల్నీ అంత అందం గానూ చిలికించాడు రస బ్రహ్మ సాలూరి .
ఇద్దరి కలయికతో మహా ఆనంద మందిరం వెలసిన్దిక్కడ .కలలు కరిగి నిలిచాయట
.అప్పుడామే కు మందారా మాల మేడలో నిమ్పినట్లయింది .
మందార మాల అనటం లో వివాహం అవబోతుందనే చక్కని ధ్వని ఉంది.
https://www.youtube.com/watch?v=z1JBBqsVb2E
.




ఇవన్నీ ఒకనాడు మన పెద్దలు కన్న కలలు..తెలుగులందరు ఒకతాటిన నడవాలి అని.. ఆ కలలు అన్నీ మన కళ్ళ ముందే కల్లలుగా మారి.. ఆశా సౌధమ్ కూలి తెలుగు వెలుగులు చీకట్ల పాలయి పోయాయి.. రావు బాల సరస్వతీ దేవి పాడిన ఆనాటి ఈ పాట మీకోసం.

మేలుకోరా తెలుగువాడా
ఏలుకోరా తెలుగువాడా

కులమత వర్గ విభేదాలు మాని
తెలుగులందరు ఏక భావమూని
వివిధ కళామయ సంపదలందగ
విశాలాంధ్ర రాష్ట్రం జనించగ

ఎదురు లేని నీ ధాటి
భరతావని లేదుర నీసాటి
జగజగాల అధికారపు పోటీ
ఖతము చేసి శాంతిని నెలకొల్పగా

ప్రజలందరూ సమదారిని నడువగా
నడుము కట్టి ముందడుగు వేయరా
మేలుకోరా తెలుగువాడా
ఏలుకోరా తెలుగువాడా
Melukora Teluguvaada
Provided to YouTube by Sa Re Ga Ma Melukora Teluguvaada · Rao Balasaraswathi Golden Hour Rao Balasar...

No comments:

Post a Comment