Tuesday 27 October 2015

1. గోరింటాకు ,2. రక్తసంబంధం, 3ఆత్మీయులు ,4నీరాజనం,5ఇంటింట రామాయణం, 6మాతృదేవో భవ, 7మాయా బజార్ ,8భక్త తుకారం, 9రెండు రెళ్ళు ఆరు, 10.రామచిలక, 11.నీరాజనం,

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం
 ప్రాంజలిప్రభ - సంగీత ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు 

చిత్రం: గోరింటాకు
గానం: పి సుశీల ,ఎస్ పి బాలు
మ్యూజిక్ :కే వి మహదేవన్
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి 

నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ...

చిత్రం: నీరాజనం (1988)
సంగీతం: ఓ.పి. నయ్యర్
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: జానకి

పల్లవి:

ఓహోహో... ఆహాహా...
ఓహోహో... ఆహా ఆహా ఆహా

నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ

చరణం 1:

ఆహాహహా ఆహహా ఆహహా

హద్దులో అదుపులో ఆగనీ గంగలా
నీటిలో నిప్పులో నిలువనీ గాలిలా
విశ్వమంత నిండియున్న ప్రేమకూ
ప్రెమలోన బ్రతుకుతున్న ఆత్మకూ
విశ్వమంత నిండియున్న ప్రేమకూ
ప్రెమలోన బ్రతుకుతున్న ఆత్మకూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ

చరణం 2:

ఆహాహహా ఆహహా ఆహహా

వెలగనీ దివ్వెనై పలకనీ మువ్వనై
తియ్యనీ మమతకై తీరనీ కోరికై
వేచి వేచి పాడుతున్న పాటకూ
పాటలోన కరుగుతున్న జన్మకూ
వేచి వేచి పాడుతున్న పాటకూ
పాటలోన కరుగుతున్న జన్మకూ

నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ
https://www.youtube.com/watch?v=x3zY7y0lUdI
Neerajanam Songs - Nene Sakshyamu - Saranya - Viswas
Saranya Viswas's Neerajanam Telugu Movie Song Music : O P Nayyar Lyrics : Acharya Athreya C Narayana...

మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంటా..

చిత్రం : రామచిలక (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి

పల్లవి :

లాలిలాలో..ఓఓఓ..లాలిలాలో..ఓ..ఓ..
లలిలాలిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

నా మావయ్య.. వస్తాడంట..
మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంటా
మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంటా
మరదల్ని మెచ్చీ.. మరుమల్లె గుచ్చీ
ముద్దిచ్చి పోతాడంటా.. ఆ ముద్దర్లు పోయేదెట్టా

నా బుగ్గలే ఎరుపెక్కెనే..
మొగ్గేసినా నును సిగ్గులు..
ఆ..మొగ్గేసినా తొలిసిగ్గులు..
పడుచోడు నవ్వాడంట... పగలంత ఎన్నెల్లంట
వలపల్లె వచ్చి.. వరదల్లె ముంచి..
వాటేసుకొంటాడంటా.. ఆడ్ని పైటేసుకొంటానంట

మావయ్య వస్తాడంట.. మనసిచ్చిపోతాడంట

చరణం 1 :

కల్లోకి వచ్చీ.. కన్ను కొట్టాడే..
కన్నె గుండెల్లో.. చిచ్చు పెట్టాడే..
కల్లోకి వచ్చీ.. కన్ను కొట్టాడే..
కన్నె గుండెల్లో.. చిచ్చుపెట్టాడే..

గుండెల్లో వాడు ఎండల్లు కాసే.. కన్నుల్లో నేడు ఎన్నెల్లు కురిసే..
వన్నెల్లు తడిసే.. మేనేల్ల మెరిసే ..
పరువాలే పందిళ్ళంట.. కవ్వించే కౌగిళ్ళంట..
మురిసింది ఒళ్ళు.. ఆ మూడుముళ్ళూ..
ఎన్నాళ్ళకేస్తాడంటా.. ఇంకెన్నాళ్ళకొస్తాడంట..

మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంట..

చరణం 2 :

కళ్యాణ వేళా.. సన్నాయి మోగ..
కన్నె అందాలే.. కట్నాలు కాగా
కళ్యాణ వేళా.. సన్నాయి మోగ..
కన్నె అందాలే.. కట్నాలు కాగా
మనసిచ్చినోడు.. మనువాడగానే..
గోరింక నీడ.. ఈ చిలకమ్మ పాడే..
చిలకమ్మ పాడే.. చిలకమ్మ పాడే ...

ఇంటల్లుడౌతాడంట.. ఇంక నా ఇల్లు వాడేనంటా..
ఇంటల్లుడౌతాడంట.. ఇంక నా ఇల్లు వాడేనంటా..
మదిలోని వాడూ.. గదిలోకి వస్తే..
కన్నీరు రావాలంటా.. అదే పన్నీరై పోవాలంటా ..
కన్నీరు రావాలంటా.. అదే పన్నీరై పోవాలంట..

https://www.youtube.com/watch?v=y9VZf5tKxYA
mavayya vastadanta .... Ramachilaka
Excellent song from movie Ramachilaka starring Vanisree


విరహ వీణ ...హా...నిదుర రాక వేగే వేళలో..శృతిని మించి రాగమేదో పలికే వేళలో...

చిత్రం : రెండు రెళ్ళు ఆరు (1985)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి

పల్లవి :

విరహ వీణ ...హా...నిదుర రాక వేగే వేళలో..
శృతిని మించి రాగమేదో పలికే వేళలో...
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో...ఓ..
విరహ వీణ...నిదుర రాక వేగే వేళలో..
ఆ..ఆ..వేగే వేళలో...

చరణం 1 :

జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా..
సా..పదసరిగ...గా..దపదసరి...గా
దపాగ..
గాపరీగ.. సరిగరి..సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ...
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...ఆ ఆ ఆ ఆ ఆ

జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా..
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా...
లేలేత వలపు..సన్నాయి పిలుపు ..రావాలి సందిళ్ళ దాకా..
మన పెళ్ళిపందిళ్ళ దాకా..ఆ ఆ ....

విరహ వీణ ..హా....నిదుర రాక వేగే వేళలో..ఆ..వేగే వేళలో...

చరణం 2 :

ఎదలో కదిలే ఏవో కథలు ఏమని తెలిపేదిరా..
చీకటిపగలు ..వెన్నెల సెగలు... నీ నీడ కోరేనురా..
ఈ నాటకాలు మన జాతకానా రాశాయిలే ప్రేమలేఖా..
ఈ దూరమెన్నాళ్ళ దాకా...ఆ..ఆ..

విరహ వీణ ..హా...నిదుర రాక వేగే వేళలో..
శృతిని మించి రాగమేదో పలికే వేళలో...
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో... ఓ..
విరహ వీణ ...నిదుర రాక వేగే వేళలో..వేగే వేళలో
https://www.youtube.com/watch?v=KbRxPvhovyo
Rendu Rellu Aaru Movie Songs - Veeraha Vela Song
Watch


మాతృదేవో భవ
వేణువై వచ్చాను

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం

ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి

Venuvai Vachanu Song - Nassar Songs - Matru Devo Bhava Movie Songs - Madhavi, Nassar, Y Vijaya
Venuvai Vachanu Song - Nassar Songs - Matru Devo Bhava Movie Songs Movie: Matru Devo Bhava, Starring..

ఇంటింట  రామాయణం
వీణ వేణువైన సరిగమ విన్నావా . ఓ.. తీగ రాగమిన మధురిమ కన్నావా ..
తనువు  తహ తహ లాడనల.. చెల రేగ఺ల.. చెలి ఊగ఺ల.. ఊయలీవేళలో...
||వీణ వేణువ ైన||
ఊపిరి తగిలిన వేళ.. తూ ఴం఩ులు తిరిగిన వేళ.. న్న వీణలో తూ వేణువే.. ఩లికే ర఺గమాల..
చూ఩ులు రగిలిన వేళ.. ఆ చుకకలు వ లిగిన వేళ.. న్న తనుఴున అణుఴణుఴున్న.. జరిగే ర఺సలీల..
||వీణ వేణువ ైన||
ఎదలో అందం ఎదుట.. ఎదుటే వలచిన వనితా ఴతుతన.. తూ ర఺కతో న్న తోటలో వ లసే ఴనదేఴత..
కదిలే అందం కవిత.. అది కౌగిలికొచ్చే యువత .. న్నతృ఺టలో తూ఩లలవే.. నఴతన నఴా మమత..
వీణ వేణువైన సరిగమ విన్నావా.. ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా .
తనువు తహ తహ లాడనల.. చెల రేగ఺ల.. చెలి ఊగ఺ల.. ఉయ్ాాలలీవేళలో...
||వీణ వేణువ ైన||

https://www.youtube.com/watch?v=QebPpYEBJ-w

ఓ పి నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన నీరాజనం చిత్రం..
ఎంత గొప్ప మ్యూజికల్ హిట్టో వేరేగా చెప్పనక్కర్లేదు.
ఈ చిత్రంలోని ఆచార్య ఆత్రేయ గారి రచనలో జాలువారిన
ఆణిముత్యం "మనసొక మధు కలశం" గీతం..నాకు చాలా చాలా ఇష్టం.
మనసొక మధు కలశం
పగిలే వరకే అది నిత్య సుందరం
మరిచిన మమతోకటి మరి మరి పిలిచినది
ఒక తీయని పరితాపమై ..
మనసొక మధు కలశం
పగిలే వరకే అది నిత్య సుందరం
తొలకరి వలపొకటి తలపుల తొలిచినది
గత జన్మల అనుబంధమై ...
మనసొక మధు కలశం
పగిలే వరకే అది నిత్య సుందరం.

Neerajanam Songs - Manasoka Madhukalasam - Saranya - Viswas
Saranya Viswas's Neerajanam Telugu Movie Song Music : O P Nayyar Lyrics : Acharya Athreya C Narayana..

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు...

చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
ప్రేమించామంటారు పెద్దగ చెబుతుంటారు
పెళ్ళి మాట ఎత్తగానే చల్లగ దిగజారతారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు
డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు
లవ్ మ్యారేజీలంటూ లగ్నం పెట్టేస్తారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

కట్నాలు పెరుగునని కాలేజీకెళతారు
కట్నాలు పెరుగునని కాలేజీకెళతారు
హాజరు పట్టి వేసి గైరు హాజరవుతారు
మార్కుల కోసం తండ్రుల తీర్ధయాత్ర తిప్పుతారు
ఇంజనీర్లు డాక్టర్లయి ఇక చూస్కోమంటారు

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు

చరణం 1:

వరండాలోన చేరి వాల్చూపులు విసురుతారు
వరండాలోన చేరి వాల్చూపులు విసురుతారు
సినిమాలు షికార్లంటూ స్నేహం పెంచేస్తారు
తళుకు బెళుకు కులుకులతో పైట చెంగు రాపులతో
చిటికెలోన అబ్బాయిల చెంగున ముడివేస్తారు

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

చరణం 2:

ఆస్తి వున్న పిల్లయితే అందం జోలికి పోరు
కుంటిదైన కురూపైన పెళ్ళికి యస్సంటారు
పెళ్ళి అయిన మర్నాడే శ్రీవారిని చేతబట్టి
బయటికి అత్తామామల దయచేయండంటారూ

అమ్మబాబో నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

చరణం 3:

దిమ్మతిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు
వలపు దాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు
మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...

మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...

మనసు మనసు తెలుసుకుందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము...
https://www.youtube.com/watch?v=Sn5_WfxT10c
Amma Babu Nammaraadu Song - Aathmeeyulu Movie Songs - ANR - Vanisri
Watch Aathmeeyulu Full Movie / Aathmeeyulu Movie Starring with ANR, Vanisri, Chandhra Kala, Directed...


బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే...కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
చిత్రం : రక్తసంబంధం (1962)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : అనిసెట్టి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
చరణం 1 :
ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే...
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
చరణం 2 :
అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
చరణం 3 :
మనసైన వాడు వరుడు.. నీ మదినేలుకొనెడు ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళ ళ ళ –హాయి
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

No comments:

Post a Comment