Friday 2 October 2015

1. చిన్నారి చిట్టిబాబు 2. సిరిసిరి మువ్వ 3. జానకిరాముడు 4. పసివాడి ప్రాణం 5. మరణ మృదంగం 6. మాంగల్య బలం 7. జమిందారు 8. చక్రపాణి 9. ఘర్షణ 10. దొంగరాముడు11. అంతఃపురం

ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

సర్వేజనాసుఖినోభవంతు


సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే...మాకంటి చలువ కోనేటి కలువ

చిత్రం: అంతఃపురం (1999)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: జానకి

పల్లవి:

ఓ.. ఓ.. ఓ.. ఓ...
సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే
నడిరేయి జాములో తడి లేని సీమలో...

సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే

చరణం 1:

బతుకే బరువు ఈ నేలకి.. కరుణే కరువు ఈ నీటికి
వెలుగే రాదు ఈ వైపుకి.. శ్వాసే చేదు ఈ గాలికి
ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి
ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి
నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు
అందాల చిలక అపరంజి మొలక అల్లాడకే అంతగా
పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్ని కరిగించగా

చరణం 2:

ఏవైపునందో ఏమో మరి జాడే లేదే దారి దరి
ఏమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి
నీ గుండెల్లో గోదావరి నేర్పాలి ఎదురీతని
నీకళ్ళలో దీపావళి ఆపాలి ఎద కోతని
పరుగాపని పాదలతో కొనసాగని నీ యాత్రని

శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య
ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా
శ్రీ వేంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనం ఎన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల వున్నావయ్య
https://www.youtube.com/watch?v=EJQpn64-Wk0
Anthapuram Movie | Suridu Puvva Video Song | Sai Kumar, Jagapathi Babu, Soundarya
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

Movie: Chinnari chitti babu (1981)
Lyricist: C.Narayana Reddy
Music: Ilayaraja
Singer: P.Susheela and Gangai Amaran
Simply Superb Lyrics..

ఏవో గుసగుసలు పాడే సరిగమలు
కోయిల కువకువలూ..కోర్కెల రెపరెపలు
ఊహల తోటలో ఊయల పాటలో
వలపులు కలసిన మమతల మనసున
ఏవో గుసగుసలు పాడే సరిగమలు...
ఆహాహా..ఓ హోహో..లలలల లలలల
ఆ తొలిచూపులొ ఆశల తొందర
ఆ తొలిచూపులొ ఆశల తొందర
ఆ సిరినవ్వులో వసంతమాడు వెన్నెల
ఆ గిలిగింతలో ఈ పులకింతలే ఆనంద భైరవి పాడే వేళలో...
ఏవో గుసగుసలు పాడే సరిగమలు
ఆఆఆ అ అ ఆ లా లా లా లాలలా
ఏ అనుభంధమో ప్రేమసుగంధమై
ఏ అనుభంధమో ప్రేమసుగంధమై
పూ పొదరింటిలో మా తొలి జంటలో ..తుమ్మెద రొదలై కమ్మని కధలై
మోహన రాగమే మోగే గుండెలో
ఏవో గుసగుసలు పాడే సరిగమలు
కోయిల కువకువలూ..కోర్కెల రెపరెపలు
ఊహల తోటలో ఊయల పాటలో
వలపులు కలసిన మమతల మనసున
ఏవో గుసగుసలు పాడే సరిగమలు...
ల లా లలలా ల లా ల ల లా...

https://www.youtube.com/watch?v=FYyC6NM4Pi8

Evo Gusa Gusalu
Provided to YouTube by Sa Re Ga Ma Evo Gusa Gusalu · P Susheela Chinnari Chitti Babu ℗ Saregama Indi

అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా

పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...

పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక
పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా...
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా

ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో
ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా...

అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా

ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మ వుంటే ఆకాలి మువ్వనై పుడతాను
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ.
..
Andaaniki Andam Ee Puttadi Bomma - Chandra Moahn & Jayapradaha - Siri Siri Muvva
Andaaniki Andam Ee Puttadi Bomma - Chandra Moahn & Jayapradaha - Siri Siri Muvva. Enjoy this beautif...
   

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా...పాడవే పాడవే కోయిలా...

చిత్రం: జానకిరాముడు (1988)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

హా తానానె తననానా
ఆ.....

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మ జన్మలా

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మ జన్మలా

నా గొంతు శృతిలోనా... ఆ...నా గుండె లయలోనా

చరణం 1:

ఒక మాట పదిమాటలై అది పాట కావాలనీ
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలనీ
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలనీ
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలనీ
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలనీ....
పాడవే.. పాడవే.. కోయిలా
పాడుతూ పరవశించు జన్మజన్మలా

నా గొంతు శృతిలోనా...ఆ.. నా గుండె లయలోనా

చరణం 2:

ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలనీ
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడినీ చేరాలనీ
కోరికే ఒక జన్మ కావాలనీ
అది తీరకే మరు జన్మ రావాలనీ
కోరికే ఒక జన్మ కావాలనీ
అది తీరకే మరు జన్మ రావాలనీ
వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా
ఎగిరిపోవాలనీ...
పాడవే.. పాడవే.. కోయిలా
పాడుతూ పరవశించు జన్మజన్మలా

నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా
పాడవే పాడవే కోయిలా
పాడుతూ పరవశించు జన్మజన్మలా

తానానె తననానా.....
తానానె తననానా....
https://www.youtube.com/watch?v=2gb7V8hSEEA
Naa Gonthu Sruthilona---Jaanaki Ramudu___SHASHI
Naa Gonthu Sruthilona---Jaanaki Ramudu___SHASHI



కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో...ఓ సందమామ ఓ సందమామ...

చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే
చెమ్మాచెక్క చేత చిక్క
మంచమల్లె మారిపోయె మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ

చరణం 1:

తేనీటి వాగుల్లో తెడ్డేసుకో
పూలారబోసేటి ఒడ్డందుకో
శృంగార వీధుల్లో చిందేసుకో
మందార బుగ్గల్ని చిదిమేసుకో
సూరీడుతో ఈడు చలికాచుకో
పొద్దారిపోయాక పొద చేరుకో
గుండెలోనే పాగా గుట్టుగా వేశాక
గుట్టమైన సోకు నీదే కదా
అరె తస్సా చెక్క ఆకు వక్క
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము
పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ

చరణం 2:

సింధూర రాగాలు చిత్రించుకో
అందాల గంధాల హాయందుకో
పన్నీటి తానాలు ఆడేసుకో
పరువాలు నా కంట ఆరేసుకో
కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో
చిలక పచ్చ రైక బిగి చూసుకో
గూటి పడవల్లోన చాటుగా కలిశాక
నీటికైనా వేడి పుట్టాలిలే
పూత మొగ్గ లేత బుగ్గ
సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు
హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు

అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగలేసినాడే
చెమ్మాచెక్క హా చేత చిక్క హా
మంచమల్లె మారిపోయె మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు

https://www.youtube.com/watch?v=Rm33Xnds2n0
Kashmiru loyalo- Song from "Pasivadi Pranam"
Yester year super hit song from "Pasivadi Pranam"--Megastar Chiranjeevi, Vijayashanthi

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి...కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..

చిత్రం : మరణ మృదంగం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి:

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా...

చరణం 1:

కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా
ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా...
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా
ఎద ఎద కలిపేది ప్రేమా....
శృంగార వీధిల్లోనా షికారు చేసి
ఊరోళ్ల నోళ్ళలోనా పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారు కెక్కించి
మాటిస్తే వినుకోదు
లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు
ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలుపు చిలిపి పిలుపు కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

చరణం 2:

మళ్లీ మళ్లీ అంటుంది మారాముగా
ఒల్లోకి వోచి తాకుతుంది ప్రేమా..
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా
చెల్లించేయ్ ఆ కాస్త ప్రేమా..

మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలు ఎన్నో మలాము వేసి
వయస్సుని వసంత మాడించే
మనస్సులో తుళ్ళింత పుట్టించే
చూపుల్తో శ్రుతి కాదు
మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు
ముట్టందే చలి పోదు
ఈ మనసు మధన తనువు తపన కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..

https://www.youtube.com/watch?v=eAaGcE7M1Qk
Marana Mrudangam Full Songs - Kottandi Tittandi Song - Chiranjeevi, Radha, Ilayaraja
Click here to watch Dalapathi Movie Full Songs - http://www.youtube.com/watch?v=YPc3UHKhk7U&list=PLB...

వాడిన పూలే వికసించెనే...చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..

చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే

తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ...
తీయని కలలే ఫలియించెనే

చరణం 1:

వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము...
లోటు లేదిక మనదే సుఖము ...

తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ...
తీయని కలలే ఫలియించెనే

చరణం 2:

పగలే జాబిలి ఉదయించెనేలా..
వగలే చాలును పరిహాసమేలా...
పగలే జాబిలి ఉదయించెనేలా...
వగలే చాలును పరిహాసమేలా...
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెలరేని వలెనే..

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే

చరణం 3:

జీవితాలకు నేడే వసంతం...
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం...
ఆలకించగ మధురం మధురం ...

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే
https://www.youtube.com/watch?v=VfCmQCFVqvQ
Mangalya Balam Songs - Vaadina Poole - ANR - Savithri
Watch ANR Savithri's Mangalya BalamTelugu Old Movie Song With HD Quality Music - Master Venu Lyrics ...

ఉలికిపాటుతోనే...పులకరించిపోతావు...నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...
కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...

చిత్రం: జమిందారు (1966)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు...
నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో..ఓ...మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..

ఉలికిపాటుతోనే...పులకరించిపోతా
వు
నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...

చరణం 1:

మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును..
జిలుగుపైట నీడలోన పరవశింతును ..
మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును ..
జిలుగుపైట నీడలోన పరవశింతును...

సొగసులొలుకు నడుముహొయలు చూడనీయను
సొగసులొలుకు నడుముహొయలు చూడనీయను
కడకొంగున నిను బిగించి నడచిపోదునూ

ఉలికిపాటుతోనే...పులకరించిపోతా
వు
నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...

చరణం 2:

పువ్వునై కురులలో పొంచియుందును...
నవ్వునై పెదవిపై పవ్వళింతును ..
పువ్వునై కురులలో పొంచియుందును..
నవ్వునై పెదవిపై పవ్వళింతును...

పూలతోడ నిన్ను కూడ ముడుచుకొందును
పూలతోడ నిన్ను కూడ ముడుచుకొందును
పెదవిపైన ఒదిగిన నిను కదలనియ్యను..ఊ..

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు...
నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో..ఓ...మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..

చరణం 3:

కలలనైన నిన్ను నేను కలుసుకొందును
దొంగనై దోరవలపు దోచుకొందును ...
కలలనైన నిన్ను నేను కలుసుకొందును...
దొంగనై దోరవలపు దోచుకొందును...

చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును ..ఊ..
చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును ...
తొలివలపుల తియ్యదనం తెలుపమందును

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు...
నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో..ఓ...మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..

ఉలికిపాటుతోనే...పులకరించిపోతా
వు
నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...
https://www.youtube.com/watch?v=JzG_7ezQKM0
Zamindar | Palakarinchithene song
Watch the melodious song, "Palakarinchithene" sung by Ghantasala and P Susheela from thefilm Zaminda...

మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా....
చక్రపాణి


చిత్రం :
సంగీతం : పాలువాయి భానుమతి రామక్రిష్ణ,
రచయత : రావూరి రంగయ్య
గానం : పాలువాయి భానుమతి రామక్రిష్ణ,

మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా....

వెన్నెల డోలికాలా పున్నమి జాబిలి పాపవై
కన్నులనూగవే చల్లగా రావే నిదురా హాయిగా...

పిల్ల తెమ్మెరలా వూదిన పిల్లన గ్రోవివై
జోల పాడవే తీయగా రావే నిదురా హాయిగా...

కలువ కన్నియాలా వలచిన తుమ్మెద రేడువే
కన్నుల వ్రాలవే మెల్లగా రావే నిదురా హాయిగా...

https://www.youtube.com/watch?v=9CCm5m-ZSQ0
MELLA MELLA GA CHALLA CHALLAGA RAVE NIDHURA HAIGA ...CHITRAM:-CHAKRAPANI.mp4
మెల్లమెల్లగా చల్లచల్లగా రావే నిదురా హాయిగా...చిత్రం:- చక్రపాణి, పాటగురించి:- గాయకులూ :-డాక్టర్. పాలు...

నిన్ను కోరి వర్ణం వర్ణం
సరే సరే కలిసే నీ నయనం నయనం
కురికిన వాగల్లే
తోలకరి కవితల్లే
తలపులు కధిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము

నిన్ను కొరి

వుడికించే చిలకమ్మ నిన్నురించే
వోలికించే అంధాలే ఆలదించే
ముథ్యాల బంధాలే నీకందించే
అచట్లు ముచట్లు తాలసించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కల్లలే విందు చేసనే
నీతో పొందు కోరనే
వుందాలని నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు

నిన్ను కొరి

ఈ వీన మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వగతం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం
కానిరాగ సంగమం
నీ జ్ఞాపకమ్నా లోనే సాగేనులే ఈ వేల సరసకు




గాంధీ జయంతి సందర్భంగా ఈ మంచి పాట మనందరి కోసం

భలే తాత మన బాపూజీ - బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ - చిన్నీ పిలక బాపూజీ

కుల మత భేదం వలదన్నాడు - కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు - మనలో జీవం పోసాడు || భలే తాత ||

నడుం బిగించి లేచాడు - అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ - దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం - మనకు లభించెను స్వరాజ్యం || భలే తాత ||

సత్యాహింసలే శాంతి మార్గమని - జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు - మహాత్ముడై ఇల వెలిశాడు || భలే తాత ||
Donga Ramudu - Telugu Songs - Bhale Tata Mana Bapuji - ANR - Savithri
Watch ANR Savitri's Donga Ramudu Telugu Old Movie Song With HD Quality Music - Pendyala Nageswara Ra...

1 comment: