Saturday 3 October 2015

ప్రాంజలి ప్రభ- 3. పుణ్యవతి 4. సంఘం 5. అప్పుచేసి పప్పుకూడు 6. సాక్షి 8. ముకుంద 7. సూపర్డుపురమ్ పోలీస్టేషన్ 8. లవ్ బర్డ్స్ 9. చలంజ్ 10. పెళ్ళిసందడి చిన్ని కృష్ణుడు


ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -సంగీత ప్రభ 

సర్వేజనాసుఖినోభవంతు 
అలనాటి పాత సినమా పాటలు రోజుకొకటి పేస్ బుక్ లో పెట్ట దలిచాను (కొత్తసినిమా పాటలు కూడా ఉన్నది ఎవరైనా నా మేలుకు పంపితే పొందు పరచగలను మీ అభిరుచి కొరకే న ప్రయత్నం )   ఒక్క నెలలో రోజుకు 200 మంది ప్రాంజలి ప్రభను చూస్తున్నట్లు తెలిసింది   నాకన్నా పెద్దవారికి పాదాభి వందనములు చిన్నవారికి ఆశిస్సులు . 


సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...నా అందచందములు దాచితి నీకై... రావేలా...

చిత్రం : సంఘం (1954)
సంగీతం : ఆర్. సుదర్శనం
గీతరచయిత : తోలేటి
నేపధ్య గానం : సుశీల, టి. ఎస్. భాగవతి

పల్లవి :

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా...
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా...

ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా...
ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా...
ఆ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ...
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ...

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా....

చరణం 1 :

నీలి కనులలో వాలుచూపుల ఆ వేళా...
నను చూసి కనుసైగ చేసితివోయీ... రావేలా
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా....
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా....

ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ....
మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై రావేలా...

చరణం 2 :

హృదయవీణ తీగలు మీటీ ఆ వేళా...
అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా
హృదయవీణ తీగలు మీటీ ఆవేళా....
అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా

మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా....
మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా..
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే...
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై రావేలా...
https://www.youtube.com/watch?v=0FF2asdtXoM
Sangham - Telugu Movie Superhit Songs - N. T. Rama Rao,Anjali Devi
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...
 కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
తరుణం కాని తరుణంలో నా..మది ఈ గుబులెందుకనో..

చిత్రం : అప్పుచేసి పప్పుకూడు
సంగీతం : S.రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : పి.లీల,సుశీల

చిగురుల పూవుల సింగారముతో...తీవెలు సొంపులు గనలే..దు
ముసి ముసి నవ్వుల గిలిగింతలతో...వసంత ఋతువా రానేలే..దు

కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
తరుణం కాని తరుణంలో నా..మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...

వలపులు మీటగ తీయని పాటలు...హృదయవీణపై పలికెనుగా
ప్రియతము గాంచిన ఆనందములో..మనసే వసంత ఋతువాయెనుగా..
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో నీ ..మది ఈ గుబులందుకనే ..

తళుకు బెళుకుల తారామణులతో...శారద రాత్రులు రాలేదు
ఆకాశంలో పకపక లాడుచూ రాకాచంద్రుడా... రానేలేదు
కాలం కాని కాలంలో..చల్లని వెన్నెల ఎందుకనో...
తరుణం కాని తరుణంలో నా..మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో..చల్లని వెన్నెల ఎందుకనో...

తలచిన తలపులు ఫలించగలవని...బులపాటము బలమాయెనుగా..
పగటి కలలుగను కన్యామణులకే...ప్రియుడే...రాకాచంద్రుడుగా...
కాలం కాని కాలంలో..చల్లని వెన్నెల అందుకనే...
తరుణం కాని తరుణంలో నీ ..మది ఈ గుబులందుకనే ..
కాలం కాని కాలంలో..చల్లని వెన్నెల అందుకనే...

https://www.youtube.com/watch?v=25J_3hEnEgY

Appu Chesi Pappu Koodu || Kalam Kani Kalamlo Full Video Song || NTR, Savitri, Jamuna, SVR
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Fol



నీతోనే ఢంకాపలాసు...ఇది ప్రేమాటైనా పేకాటైనా...నువ్వే నా కళావరాసు...

చిత్రం : స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు

నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సూ... హా

నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
నీ చూపే తగిలాక జోహారు అన్నాను నీ జోరుకే
ఉలికిపడి మెలికపడె తళుకులతో
క్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా
చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా
క్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా
చెలి చకోరికా ఛలో ఇక
కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా...ఆ..

ఆఆ..నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
హోయ్ నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు

పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి ..హహహ..
పరువములే పరిచయమౌ ప్రియలయలో
పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి
పరువములే పరిచయమౌ ప్రియలయలో
హే... శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా
శ్రీరస్తు సిగ్గే చిందిస్తా
తొలి వయస్సుకే వసంతుడా
యావత్తు నీకే అందిస్తా..

హా.. నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు
మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు
రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే
నువ్వే నా రంభావిలాసు
నువ్వే నా రంభావిలాసు
చలి సయ్యాటైనా ముద్దాటైనా
నీతోనే చేస్తా రొమాన్సు
నీతోనే ఢంకాపలాసు
ఇది ప్రేమాటైనా పేకాటైనా
నువ్వే నా కళావరాసు
https://www.youtube.com/watch?v=GGADMy7jO9Q
Stuartpuram Police Station || Neethone Dankapalasu Video Song || Chiranjeevi, Nirosha
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...
 రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు...

చిత్రం : లవ్ బర్డ్స్(1996)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉన్నికృష్ణన్, సుజాత

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు
రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు
కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే కన్నుల నింపుకుని
ముందుకు ఒరిగీ ఆఖరిసారిగా ప్రేమగా భువికే ముద్దులిచ్చీ
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు

రేపేలోకం.. రేపేలోకం ముగిసేనంటే నువ్వేం చేస్తావూ
ఒక నూరేళ్ళ జీవితమంతా ఈనాడే జీవిస్తా
నీ పెదవులపైన పెదవులు చేర్చి కన్నులేమూసుకుంటా
మరణం వరకూ మమతలు పంచి మరణాన్నే మరిపిస్తాలే

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు
రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు
కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే కన్నుల నింపుకుని
ముందుకు ఒరిగీ ఆఖరిసారిగా ప్రేమగా భువికే ముద్దులిచ్చీ
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే

వలపు అనేది నిలిచెవరకూ భూలోకం ముగియదులే
కోటి మెరుపులు కోసేస్తున్నా ఆగగనం చీలదులే
ప్రణయాలెన్నో రానీపోనీ జీవన యానం సాగునులే
తనువే మైనా మనమేమైనా అనురాగం ఆగదులే

రేపేలోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు
రేపేలోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు
నింగికి నేలకి వందన మంటూ నిను నాఒడిలో చేర్చుకుంటా
వన్నెల విరుల పానుపువేసి నాలో నిన్నే నిలుపుకుంటా
నాలో ఊపిరి ఉన్నంత వరకూ నీ కావలినై నిలిచివుంటాలే

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు

https://www.youtube.com/watch?v=y3JrrqJwqN0


సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక...తియ్యని పిలుపే శ్రావణ గీతం..

చిత్రం : చూపులు కలసిన శుభవేళ
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : బాలు, జానకి

సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
అక్షర లక్షా ముద్దుల బిక్ష
కందిన మొగ్గా కమ్మని బుగ్గా
చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ

జాజిమల్లి తీగనై జూకామల్లి పువ్వునై
నీ చెంత చేరేనులే
ఋతు పవనాలలో రస కవనాలతో
తీర్చాలి నా మోజులే
రాజీ లేని అల్లరి రోజాపూల పల్లవి
నీ పాట కావాలిలే
కధ రమణీయమై చిరస్మరణీయమై
సాగాలి సంగీతమై అనురాగ శ్రీగందమై

చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ
అక్షర లక్షా ముద్దుల బిక్ష
కందిన మొగ్గా కమ్మని బుగ్గా

తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక

రాగాలన్ని నవ్వులై రావాలంట మువ్వవై
నా ప్రేమ మందారమై
తగు అధికారము తమ సహకారమూ
కావాలి చేయూతగా
బుగ్గ బుగ్గ ఏకమై ముద్దే మనకు లోకమై
నూరేళ్ళు సాగాలిలే
ఇది మధుమాసమై మనకనుకూలమై
జరగాలి సుముహుర్తమే కళ్యాణ వైభోగమే

సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
అందిన వలపే ఆమని గానం
లాలాలా ఆహాహాహా..లాలాలా ఆహాహాహ

సిరిమల్లీ శుభలేఖా చదివావా నెలవంక
తియ్యని పిలుపే శ్రావణ గీతం
https://www.youtube.com/watch?v=g1RXaKUgtgs
Chupulu Kalasina Subhavela - Siri Malle Subhalekha
Watch HD Quality Telugu Movie Song From Chupulu Kalasina Subhavela


భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా..

చిత్రం : ఛాలెంజ్ (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..

తప్పంటూ చేయక పోతే తగలాటము..
నిప్పంటి వయసులతోనా చెలగాటము
ఐతే మరి ఎందుకు చెప్పు మోమాటము
ఆడదాని మోమాటమే ఆరాటము
వానాకాలం ముసిరేస్తుంటే
వాటేసుకునే హక్కేఉంది
ఇదివానో గాలో పొంగో వరదో
రారా మలిపొద్దులు పుచ్చక
సుద్దులతో ఈ వేళా

మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..

ఏదిక్కూ లేని చోటే ఏకాంతము
నా దిక్కూ మొక్కూ నువ్వే సాయంత్రమూ
ఇప్పట్లో వద్దూ మనకు వేదాంతము
సిగ్గంటూ బుగ్గివ్వడమే సిద్దాంతము
కవ్వింతల్లో కసిగా ఉంటే
కౌగిలి కన్నా దారేముంది
అది రైటో కాదో నైటో పగలో
రావే చెలి ఆకలి తీర్చకు
చూపులతో ఈ వేళా

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
https://www.youtube.com/watch?v=WLYoPQAvX60
Challenge Songs - Bhama Ee Tippalu Song - Chiranjeevi, Ilayaraja, Vijayashanti
Download my mango app on your android phone now https://play.google.com/store/apps/details?id=com.wh...
  చమక్ చమక్ తారా
  జనక్ జనక్ సితారా
ఓహొ హో ఓహో ఓహో ఓహో .........
ఆమె  చమక్ చమక్ తారా     జనక్ జనక్ తారా  ఈ తారను  విడిచి పోతారా
 అతడు  చమక్ చమక్ తారా     జనక్ జనక్సితారా నాతారాను విడిచి  పోతానా

ఆమె కలల మైకంలో కనుమూసి నేను ఉంటె....కలల మైకంలో కనుమూసి నేను ఉంటె
  తలఉహ చూడ కుండా  పోతారా తరలిపోతారా  

చమక్ చమక్ తారా     జనక్ జనక్ తారా నాతారాను విడిచి  పోతానా

 కాలికి భందాలై నీ అంద  చందాలు కాలికి భందాలై నీ అంద  చందాలు 
కలకాలం నన్ను నీ ఖైదీ చేసెను


ఈ రాగాల సరాగాలు  ఏనాటికి  సాగి పోవును ముమ్మాటికి
 ఎచోటనున్ను ఏనాటికి ఆయిన నా చెలిమి  నీవె నయినను
 చమక్ చమక్ తారా     జనక్ జనక్ తారా నాతారాను విడిచి  పోతానా
ఆహా హా హా హా హా  
ఓహో ఓహో ఓహో ఓహో .........
రిపబ్లిక్ వారి పెళ్ళిసందడి చిత్రం నుంచి చమక్ చమక్ తార పాట రచన సముద్రాల జూనియర్ ఘంటసాల మాస్టర్ గారు స్వరపరిచి ఆర్.బాలసరస్వతి తో పాడిన పాటకు అభినయ అక్కినేని అంజలీ ద్వి గార్లు

రిపబ్లిక్ వారి పెళ్ళిసందడి చిత్రం నుంచి చమక్ చమక్ తార పాట రచన సముద్రాల జూనియర్ ఘంటసాల మాస్టర్ గారు స..

No comments:

Post a Comment