Monday 21 January 2019

Pranjali Prabha-3
ఈ నెలలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగ మిత్రులకు చిరుకానుక "స్నేహ లీల"

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


నేనెవరో మీకు తెలియదు
మీ స్నేహం నేను మరువలేను
కాల గమనం ఏకం చేసింది
అదే స్నేహం సాస్విత మైనది


నిత్యం ఆపని చెయ్ ఈ పనిని చెయ్ అనేటి నీస్నేహం
- నాలో నవ్వు  మారేదాకా మరువలేను ఓ మిత్రమా
కనురెప్పలా పూర్తి సహకారామ్ అందించిన స్నేహం
- మనస్సు లోన ఉన్నంత వరకు మారదు మిత్రమా

కనుచూపులతో చూపే మమకారం అనేటి స్నేహం
- కను మగురుగయ్యే దాకా నాలో ఉంటుంది మిత్రమా
తీపి మాటలతో మనస్సును మెప్పించిన నీ స్నేహం
- అధరం కంటే మధురాతి మధురం నాకు మిత్రమా


ఎన్నో ఎన్నెన్నో మంచి సలహాలు చెప్పిన నీ స్నేహం
- హృదయం లోని మాటను చెప్పాలని ఉంది మిత్రమా
కాల మార్పుతో ప్రళయం వచ్చినా మారదు నీ స్నేహం
- ఏ స్థితిలో నైనా పిలిస్తే సాహకరిస్తా మిత్రమా


అణువణువు ఆత్మీయతతో ఆదుకున్న నీ స్నేహం
- మానవత్వాన్ని మరచి ఉండనే ఉండను మిత్రమా
పదవి విరమణ చేసినా మారదు మన స్నేహం     
- ఉద్యోగులందరి తరుఫున సన్మానమే మిత్రమా


నేనెవరో మీకు తెలియదు
మీ స్నేహం నేను మరువలేను
కాల గమనం ఏకం చేసింది

అదే స్నేహం సాస్విత మైనది


Pranjali Prabha (2)


Pranjali Prabha (1)
(ఇది నా పాట)
ఎందుకురా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతావు 
నిన్ను మోసం చేసి వెళ్లిన దాన్ని మరిచిపోలేకున్నావా అన్న స్నేహితునితో 

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

చరణం -1
నకసక పర్యంతము దోచుకో మన్నది
చక చక నడిచి దరిచేరి సుఖపడ మన్నది
భువిలోని స్వర్గ సుఖాలు పొంద మన్నది
తనువు తపనలను  తగ్గించు కోమన్నది  

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -2
 తపనకు నవనీతంలా కరుగుతా నన్నది
 వేడికి కర్పూరం వెలుగు నందిస్తానన్నది
 తనువుకు తరుణోపాయము చేపుతానన్నది
 వయసుకు తగ్గ సరి జోడై సై సై అంటున్నది   

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

చరణం -3

చల్లని మనసును పంచి సుఖపడ మన్నది
తల్ల డిల్లకు తరుణము ఇదే రా రమ్మన్నది
కళ్ళ బొల్లి మాటలకు నమ్మక రా రమ్మన్నది
కళ్ళు కళ్ళు కలిపి తన్మయం చెంద మన్నది 

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

-((**))--

Friday 4 January 2019

2. పాతాళ భైరవి (1951)

పల్లవి:
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే... ||ఎంత||

చరణం: 1 
ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే ||ఎంత||

చరణం: 2 
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
విరహములో వివరాలను విప్పి జెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో

చరణం: 3 
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే
ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో.. ||ఎంత||



2. చిత్రం : రోబో (2010) 
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ 
రచన : వనమాలి 
గానం : విజయ్ ప్రకాష్, శ్రేయ ఘోషల్ 

నీలో వలపు అణువులే ఎన్నని 
neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని 
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే 
అయ్యో...సన సన ప్రశ్నించన 
అందం మొత్తం నువ్వా 
ఆ newton సూత్రమే నువ్వా 
స్నేహం దాని ఫలితమంటావా 
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా 
అందం మొత్తం నువ్వా 

నువ్వు బుద్దులున్న తింగరివి 
కానీ ముద్దులడుగు మాయావి 
మోఘే ధీం తోం తోం ధీం తోం తోం 
ధీం తోం తోం మదిలో నిత్యం 
తేనె పెదవుల యుద్ధం 
రోజా పువ్వే రక్తం 
ధీం తోం తోం మదిలో నిత్యం 

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ 

సీతాకోక చిలకమేమో 
కాళ్ళను తాకించి రుచి నెరుగు 
ప్రేమించేటి ఈ మనిషేమో 
కన్నుల సాయంతో రుచి నెరుగు 
పరిగెత్తు వాగుల నీటిలో oxygen మరి అధికం 
పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం 
ఆశవై రావ! ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావా 
వలచే వాడా స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు 
గుండె వాడుతున్నది 
వలచే దాన నీలోన నడుము చిక్కి నట్టే బతుకులోన 
ప్రేమల కాలం వాడుతున్నదే 

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ 

నీలో వలపు అణువులే ఎన్నని 
neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని 
నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగేనే ..అయ్యో 
సన సన ప్రశ్నించన 
అందం మొత్తం నువ్వా 
ఆ newton సూత్రమే నువ్వా 
స్నేహం దాని ఫలితమంటావా 
నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా 
అందం మొత్తం నువ్వా 

ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే 
ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ 

https://www.youtube.com/watch?v=5CttV9rxhic





Neelo Valapu Official Video Song | Robot | Rajinikanth | Aishwarya Rai | A.R.Rahman
Neelo Valapu Official Video Song | Robot | Rajinikanth | Aishwarya Rai | A.R.Rahman Movie: Robot Sta...

Thursday 3 January 2019

నిన్ను కోరి

చిత్రం నిన్ను కోరి
రచన sreejo

అడిగా..అడిగా ఎదలో లయనడిగా...కదిలే క్షణమా చేలియేదనీ...
నన్నే మరిచా, తన పేరునె తలిచా..మదినే అడిగా తన ఊసేదనీ...
నువ్వే లేని నన్ను ఊహించలేను.. నా ప్రతీ ఊహలోనూ వెతికితే మన కథే...
నీలోనె ఉన్నా నిన్ను కోరి ఉన్నా...నిజమై నడిచా జతగా....

గుండె లోతుల్లో ఉంది నువ్వేగా...నా సగమే నా జగమే నువ్వేగా..
నీ స్నేహమే నన్ను నడిపే స్వరం...నిన్ను చేరగా ఆగిపో ఈ పయనం... 
అలుపే లేని గమనం...

అడిగా..అడిగా ఎదలో లయనడిగా...కదిలే క్షణమా చేలియేదనీ...
నన్నే మరిచా, తన పేరునె తలిచా..మదినే అడిగా తన ఊసేదనీ...
నువ్వే లేని నన్ను ఊహించలేను.. నా ప్రతీ ఊహలోనూ వెతికితే మన కథే...
నీలోనె ఉన్నా నిన్ను కోరి ఉన్నా...నిజమై నడిచా జతగా....