Monday 21 January 2019

Pranjali Prabha-3
ఈ నెలలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగ మిత్రులకు చిరుకానుక "స్నేహ లీల"

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


నేనెవరో మీకు తెలియదు
మీ స్నేహం నేను మరువలేను
కాల గమనం ఏకం చేసింది
అదే స్నేహం సాస్విత మైనది


నిత్యం ఆపని చెయ్ ఈ పనిని చెయ్ అనేటి నీస్నేహం
- నాలో నవ్వు  మారేదాకా మరువలేను ఓ మిత్రమా
కనురెప్పలా పూర్తి సహకారామ్ అందించిన స్నేహం
- మనస్సు లోన ఉన్నంత వరకు మారదు మిత్రమా

కనుచూపులతో చూపే మమకారం అనేటి స్నేహం
- కను మగురుగయ్యే దాకా నాలో ఉంటుంది మిత్రమా
తీపి మాటలతో మనస్సును మెప్పించిన నీ స్నేహం
- అధరం కంటే మధురాతి మధురం నాకు మిత్రమా


ఎన్నో ఎన్నెన్నో మంచి సలహాలు చెప్పిన నీ స్నేహం
- హృదయం లోని మాటను చెప్పాలని ఉంది మిత్రమా
కాల మార్పుతో ప్రళయం వచ్చినా మారదు నీ స్నేహం
- ఏ స్థితిలో నైనా పిలిస్తే సాహకరిస్తా మిత్రమా


అణువణువు ఆత్మీయతతో ఆదుకున్న నీ స్నేహం
- మానవత్వాన్ని మరచి ఉండనే ఉండను మిత్రమా
పదవి విరమణ చేసినా మారదు మన స్నేహం     
- ఉద్యోగులందరి తరుఫున సన్మానమే మిత్రమా


నేనెవరో మీకు తెలియదు
మీ స్నేహం నేను మరువలేను
కాల గమనం ఏకం చేసింది

అదే స్నేహం సాస్విత మైనది


Pranjali Prabha (2)


Pranjali Prabha (1)
(ఇది నా పాట)
ఎందుకురా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతావు 
నిన్ను మోసం చేసి వెళ్లిన దాన్ని మరిచిపోలేకున్నావా అన్న స్నేహితునితో 

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

చరణం -1
నకసక పర్యంతము దోచుకో మన్నది
చక చక నడిచి దరిచేరి సుఖపడ మన్నది
భువిలోని స్వర్గ సుఖాలు పొంద మన్నది
తనువు తపనలను  తగ్గించు కోమన్నది  

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -2
 తపనకు నవనీతంలా కరుగుతా నన్నది
 వేడికి కర్పూరం వెలుగు నందిస్తానన్నది
 తనువుకు తరుణోపాయము చేపుతానన్నది
 వయసుకు తగ్గ సరి జోడై సై సై అంటున్నది   

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

చరణం -3

చల్లని మనసును పంచి సుఖపడ మన్నది
తల్ల డిల్లకు తరుణము ఇదే రా రమ్మన్నది
కళ్ళ బొల్లి మాటలకు నమ్మక రా రమ్మన్నది
కళ్ళు కళ్ళు కలిపి తన్మయం చెంద మన్నది 

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

-((**))--

No comments:

Post a Comment