Thursday 23 February 2023

 

 



ప్రాంజలి ప్రభ... సమస్యను పరిష్కరించడం..... 01 -౦౩-2023

కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్ 

...

ఉ:: జీరయు కాదులే మగువ జేష్టలు మగ్గుత మారమేమియున్

నేరము ఏలనో ఇపుడు. నీడల పంచన సేవచేయుటన్

సారము నాది నీదియగు సాధణ శోధన చెందుటే అహం

కారము కన్నులన్ జొనిపి కాంతుని పిల్చెను కామకే ళి కిన్ 

.....


వర్ణన....28=02=2023

చేతి కలము   (పెన్ను)

🛑🛑🛑🛑🛑✳️👌👌✳️

తే. చిత్ర గుప్త వ్రాత కలము జీవ యాత్ర

మనిషి నడవడికల వ్రాత మనసు కలము

కథల వినికిడి యే వ్రాత కలము నిజము

తాళ పత్ర కంఠము వ్రాత తరతరాలు

.......


సమస్యా పూరణ: 27-02-2023

న్యస్తాక్షరి......... వా .. ర ... ణా  ... సి     పద్య పాదం చివర రావాలి      చివర రావాలి....

న్యస్తాక్షరి ఆటవెలది 


*...వారణాసినందు వారాహి వరమువా

రణము నందు  లలిత సైన్యధీర

కాశిపురిన తిరుగు కాలభైరవరణా

చిన్మ యాన శివవు చిత్రవాసి

సమస్యా పూరణ: దత్తపది27-02-2023

*క్యారె,జారె, ఆరె, ఖారె*

*మణి ప్రవాళము*
************
తే ..సౌమ్య సౌక్యా రెపరెపలు స్వారి చేయు
వినయ వనజా రెపరెపలు విద్య గాను
సహన విధి గా ఆ రెపరెపలు సమయ మేను
కదలె చెరఖా రెపరెపలు కాల చెక్ర
...........
తే. క్యారె పలుకులో అర్ధము కాదుకా దు
జారె అక్కడకు వినుము జాగు ఏల
ఆరె అర్ధమవనులేద ఆగు టేల
ఖారె మాంసమని అనకు ఖరము ఖరము
.........
తే. *క్యారె* బడుగుల వెతలను కనగ లేవ,
*జ్యారె*  కూడగట్టు జనుల సాయపడగ,
*ఆరె* బీదల నాదుకో యన్న మిచ్చి,
*ఖారె* వారితో సహపంక్తి గర్వముగను

న్యస్తాక్షరి.....

మాం
సా
హా
రం

పద్య పాదాది న రావాలి

🏵️🏵️🏵️
కం..మాంగళ్యబంధము ఇదే
సాంగత్యం ఇది సుఖముకు ఆ అపరంజీ
హారము జిలుగు వెలుగులుగా
రంజిల్లు మనసు హృదయము రమ్యచరితమే
.........

మాం ద్య మంటిన బుద్ధికి మంచి నేర్ప,

సా రముడిగిన భూమిని సాగు చేయ,

హా ల వ్యసనుడికి తెలుప పాల రుచి, త

రం బగునె యేరి కైన సారంగమందు!

****

హాల= సారా

సారంగము = భూమి

🔴🔴🔴25=02=2023

సమస్యను పరిష్కరించడం.......

కప్పకు సంపంగి నూనె కావలె వింటే


🙏🙏🙏

కప్పా కబురే నూతి న

చెప్పా దలిచే కధలను చిలిపి తలపుగా

కప్పకు తల శుభ్రతగను

కప్పకు సంపంగి నూనె కావలె వింటే

.........

కప్పము కట్టక తిరిగెడి

చెప్పక తప్పులన్ని యునె చేయ గలుగుటే

గొప్పగ పలుకులు తా వేం

కప్ప సంపంగి నూనె కావలె వింటే

........

న్యస్తాక్షరి.......  ధ ర్మ యు ద్ధం       ...... ....... .... 101  

******

తే. ధరణి మ్రాక్కి జీవిత గమ్య దరి దరి ధ మ

ర్మ మగు కళలన్ని అడవిలో రకరకముల

యురక నురుగుల జలములే యుదయం మగు యు

ద్దం అనుకరణంగ మనుషులే ధర్మ బ్రతుకు

.....

ఆ:: ధ ర్మ మార్గ మందు తప్పక జరుపు క

ర్మ లను, బ్రతుకు వరకు, మదిని కమ్మి

యు న్న మాయ పోయె నన్న తొలగు నిషి

ద్ధము లగు  తలపులును  తమకు తామె.

ప్రాంజలి ప్రభ ... వర్ణన.......... 24 -02 -2023

ఆంధ్ర మాత.( తెలుగు తల్లి) వర్ణన

......

తీరనివ్యధ అనుటేల తీరు ఆంధ్ర 

తప్పు తెలిసికొనిన జీవి తృప్తి వెతక

ధైర్య వచనాలు చెలిమిగా దైవ పూజ

నిగ్రహము నుంచి బ్రతుకులో నిజము తెలుగు

......

తే. అంధ కారము వల్లనే ఆంధ్ర మాత

కనులు విప్పినా చూడకే కదలి కదలి

శాప మిచ్చె కర్మలవల్ల శాంతి కరువు

ఆంధ్ర నుద్ధారణ జరుగు అదును బట్టి

......

తే:: చింత లేని ప్రభుత్వము చిత్రమిది యు

దగ్గ లేక కక్క నులేక ధరణి దూత

ఈ గతి అరణ్య రోదన ఈప్సి తమ్ము

ఆంధ్ర చదువుల అర్ధము ఆట యగుట

......

శ్రీ స్వచ్ఛసువర్ణప్రభాం ,

శ్రీస్వామిప్రియతమహృత్స్థాం ,  వనజామ్..

భాస్వద్భాస్కరకాంతిం ,

 లక్ష్మీం + అనపగామినీం భజే !!! 

---

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

****


దత్తపది..గుడ్, బ్యాడ్, రాంగు, రైటు

తే:: గురువు ఓర్పు పాఠము నేర్పు గుడ్ యనుటయె
బాధ మాపక తిట్టటే బ్యాడ్ యనుటయె
రవ్వవెలుగులో చదువుట రాంగనుటయె
రైతులాకష్ట పడుటయే రైటగుటయె
......