Tuesday 31 December 2019

subhodayam



కళా తపస్వి కాశినాధుని విశ్వనాధ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు... smile emoticon
నటనం ఆడెనే... భవ తిమిరహంశుడా పరమ శివుడు...నటకావతంశుడై తక ధిమి తక యని
చిత్రం : శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత : త్యాగయ్య
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :
తా..తకజం తకజం తరికిటతక
తత్తకజం తకజం తరికిటతక
తాతకజం తరికిటతక తత్తకజం తరికిటతక

తాతకజం తత్తకజం తజం తజం తరికిట తక
తాతత్తకజం తజం తజం తరికిటతక
తాతకజం తకజం తకజం తరికిటతక
తత్తరిత్తధిమితద్దిమ తక్కిట
తక్కిట తఝుణు తరిగిడ తరిగిడ తోం
తత్తరిత్తధిమితద్దిమి తక్కిట తక్కిట
తఝుణు తరిగిడ తరిగిడతోం

తకతరిత్తధిమి తరిగిడ తరిగిడతోం
తరిగిడ తరిగిడతోం తరిగిడ తరిగిడ
తరిగిటతక తరిగిటతక - తత్తరికిట
తత్తరి తఝుణు తళాంగుతోంకిట తరిగిటతోం
తత్తరి తఝణు తళాంగుతోం కిట తరిగిట తోం

నటనం ఆడెనే...
నటనం ఆడెనే... భవ తిమిరహంశుడా పరమ శివుడు
నటకావతంశుడై తక ధిమి తక యని
నటనం ఆడెనే... భవ తిమిరహంశుడా పరమ శివుడు
నటకావతంశుడై తక ధిమి తక యని
నటనం ఆడెనే...

చరణం 1 :
ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారాద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల
నటనం ఆడెనే...

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల
ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారాద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల
నటనం ఆడెనే...

చరణం 2 :
శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా
హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము
గరుడనాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడెనే.. ఆడెనే... ఆడెనే

శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా
శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా

హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము
హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము
గరుడనాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడెనే.. ఆడెనే... ఆడెనే

చరణం 3 :
వసుధ వసంతాలాలపించగా.. సురలు సుధను ధరలో కురిపించగా
వసుధ వసంతాలాలపించగా.. సురలు సుధను ధరలో కురిపించగా
రతీ మన్మధులు కుమార సంభవ.. శుభోదయానికి నాంది పలుకగా
రతీ మన్మధులు కుమార సంభవ.. శుభోదయానికి నాంది పలుకగా
నటనం ఆడెనే.. భవ తిమిర హంశుడా పరమశివుడు
నటకావతంశుడై తక ధిమి తక యని
నటనం ఆడెనే....
భవ తిమిర హంశుడీ పరమశివుడు
నటకావతంశుడై తక ధిమి తకయని
నటనం ఆడెనే...

అపరిచితుడు




కుమారీ...నా ప్రేమే వెక్కిమొక్కి బక్క సిక్కిన..
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి క్రుంగుసున్నదే....కుమారీ..

చిత్రం : అపరిచితుడు
సంగీతం : హ్యారిస్ జయరాజ్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్,హరిణి

షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో

ఓ సుకుమారి ఓ శృంగారి నా అలంగారిణి /2/
ఓ సుకుమారి..................
ఓ సుకుమారి ఓ శృంగారి
ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి

కుమారీ...నా ప్రేమే వెక్కిమొక్కి బక్క సిక్కిన
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి క్రుంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే /2/
నే ఓడిపోయా ననుకుంటినే
నా ప్రేమను కాస్తా వాయిదా వెస్తినే
రఘుమారి సుకుమారీ నా మనసొక విరినది వీరులలో అలజడి
కుమారీ...నా ప్రేమే వెక్కిమొక్కి బక్క సిక్కిన
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి క్రుంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే
షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో /2/

తొలి ప్రేమ అంటే పెను భారమా
ఇది కాన్పు రాని నిండు గర్భమా
ప్రేమ గుట్టు దాస్తే బరుఓపలేకా ఊపిరి ఆగదా ఊర్వశి
ప్రేమని తెలిపి కాదని అంటే ప్రేమే సచ్చిపోదా ప్రేయసీ
ప్రేమ లేఖతో అయినా మా మదిలో వున్నది పూర్తిగ సెప్పలేము కదే
నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రేమను తెలిపే వేరొక మార్గం లేదే
కుమారీ...కుమారీ....ఆ ఆ ఆ ఆ

ప్రేమ భాష రాని మూగ వాడినే
వాడి పోవుచున్నా ఇట చూడవా
దోసిలి నిండా పూవ్వులు నిండీ గువ్వల కోసం ఎతికినా
పువ్వుల నొసగి పూజను సేసి కోరిక అడుగుతా మరిసినా
ఆ దేవుడికన్నా బలమగువాడు వేరొకడున్నాడులే
కళ్ళను చూసి వలపును తెలిపే ధైర్యం గలవాడతడే అతడే ఓ కుమారీ

కుమారీ...నా ప్రేమే వెక్కిమొక్కి బక్క సిక్కిన
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి క్రుంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే /2/
నే ఓడిపోయా ననుకుంటినే
నా ప్రేమను కాస్తా వాయిదా వెస్తినే
రఘుమారి సుకుమారీ నా మనసొక విరినది వీరులలో అలజడి
కుమారీ...నా ప్రేమే వెక్కిమొక్కి బక్క సిక్కిన
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి క్రుంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే
షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో /2/

https://www.youtube.com/watch?v=VI1gBXMr6-8
Kumari..Aparichithudu
Good and some what funny song from the movie Aparichithudu....Vikram--Great Actor!
https://old.vocaroo.com/i/s0dAuM7Dt5cf

సంపూర్ణ రామాయణం (1971)



ఊరికే కొలను నీరు.. ఉలికి ఉలికి పడుతుంది...ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది
చిత్రం : సంపూర్ణ రామాయణం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :
ఊరికే కొలను నీరు.. ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది

ఎందుకో ఎందుకో ప్రతి పులుగు యేదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది

చరణం 1 :
అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి
ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి
నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో

అసలే ఆనదు చూపు.. ఆ పై ఈ కన్నీరు
తీరా దయ చేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఏలాగో.. నా రామా.. ఏదీ.. ఏదీ.. ఏదీ..
నీల మేఘమోహనము.. నీ మంగళ రూపము

చరణం 2 :
కొలను నడిగి తేటనీరు.. కొమ్మ నడగి పూల తేరు
గట్టు నడిగి.. చెట్టు నడిగి.. పట్టుకొచ్చిన ఫలాలు.. పుట్ట తేనె రసాలు

దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని
ముందుగా రవ్వంత చూసి విందుగా అందీయనా...
విందుగా అందీయనా

Monday 30 December 2019

పదహారేళ్ళ వయసు



నాకు నచ్చిన పాత పాట మీకు నచ్చవచ్చు 

కట్టు కధలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే...బంగారూ పాల పిచ్చుకా...

చిత్రం : పదహారేళ్ళ వయసు
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,S.జానకి

కట్టు కధలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే
బంగారూ పాల పిచ్చుకా
నా మల్లి నవ్వాలా పకా పకా
మళ్ళీ మళ్ళీ నవ్వాలా పకా పకా

అనగనగా ఓ అల్లరి పిల్లోడు
ఒకనాడా పిల్లాడిని చీమ కుట్టింది
సీమ కుట్టి సిన్నోడు ఏడుస్తుంటే
సీమా సీమా ఎందుకు నువ్వు కుట్టావంటే
పుట్టలో ఏలెడితే కుట్టనా....నా పుట్టలో ఏలెడితే కుట్టనా
అంటా కుట్టనా అన్నది
ఆదివిన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఎడ్చాడు
కుయ్యో మర్రో కుయ్యో మర్రో

పల్నాడూ పడుచు పిల్లా కోటి పల్లి రేవు దాటి
బంగారి మావకోసం గోంగూరా చేను కొస్తే

ఎన్నెలంటి నావోడూ సేందురూడా
ఎంత దెబ్బ తీశాడూ సెందురూడా
బుగ్గ మీద నా వోడూ సెందురూడా
ముద్దరేసి పోయాడూ సెందురూడా
పోయినోడు పోకుండా రాత్రే నా కల్లో కొచ్చాడు
సిన్ననాటి ముచ్చటే సిలక పచ్చనా
ఒకనాటి మాటైనా నూరేళ్ళా ముచ్చటా నూరేళ్ళా ముచ్చట

నీలాటి రేవులో నీడల రాగం సాకిరేవులో వుతుకుడు తాళం
తదరిన తా...తదరిన తా ఆ..ఆ.. తదరిన తదరిన తదరిన.....

https://www.youtube.com/watch?v=NUkSWe3DQ4Q

Padaharella Vayasu Songs - Kattukathalu cheppi nenu Naviste - Sridevi,Chandramohan
Movie: Padaharella Vayasu, Starring: Sridevi, Chandramohan, Mohanbabu, Nirmalamma, Director: K. Ragh...

Madhavaaih gari manavudu




నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం...ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం...

చిత్రం : మాధవయ్య గారి మనవడు
సంగీతం : విద్యా సాగర్
గానం : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

పల్లవి :

నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం - 2
ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం
నీ పాట పాడి నే పల్లవైతి
నీ పదము తప్ప యే పదములు దొరకక - నీ చూపు

నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం - 2
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ జంట కోరి నే కీర్తనైతి
నీ స్వరము తప్ప యే వరములు అడగక

చరణం :

పూతల్లో పురివిడిచిన పులకింత
చేతల్లో మునుపెరగని చమరింత
వులికి పడిన నీ నలక నడుములో
మెలిక పడితినే వీణాలో తీగానై
తగిలిందే తాళం రగిలిందే రాగం
చినుకల్లే నా ఒణుకేతీరా తాడికోరేటి తాపాలలో - నీ చూపు

చరణం :

ఓ కే లే ముద్దెరగని సాయంత్రం
ఛీ పో లే సిగ్గేరిగిన తాంబూలం
కధలు తెలిసెలే యదల కనులలో
పురుడుకడిగిపో పువ్వుకే తేనెతో
నులిపెట్టే దీపం శీలలోనే శిల్పం
వలపల్లేరా వయసేతీరా జతలూగేటి జంపాలలో - నేనేమో

http://www.dailymotion.com/video/x1bieyg_madhavayya-gaari-manavadu-songs-nee-choopu-suprabhatham-song-anr-sujatha_fun
Madhavayya Gaari Manavadu Songs - Nee Choopu Suprabhatham Song - ANR, Sujatha - Video Dailymotion

jodi




కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం...రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా

చిత్రం : జోడి (1999)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : భువనచంద్ర
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..

కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
లాలాలాలాలాలా...

కవితలనే మాటలుగా కన్నులతో రాసాను...
మాటల్లో నింపుకున్నవి నా ప్రాణాలాయ్య...
మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచాను
చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా...
ప్రియుడా నీ ఉహలతో కరిగే పొతున్నా
వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా...

కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా

చెలియ నీ అందియనై, పాదాలను ముద్దిడనా
మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా...
నా కాలి అందియవో, నాలోని ఊపిరి వో
ప్రియుడా నువ్వు సుగంధము ఐతే.. వసంతమై పోనా...
జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా
ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచి ఇయ్యవా...
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...

కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా

https://www.youtube.com/watch?v=vY0CT2eBd8c#t=123
Kadile Kaalame Song - Jodi Movie Songs - Prashanth - Simran - Vijayakumar - Trisha
Watch Kadile Kaalame Song From Jodi Movie, Starring Prashanth, Simran, Vijaya kumar, Nassar, Srividy...

Gentilman


కొంటెగాణ్ణి కట్టుకో ...కొంగుకేసి చుట్టుకో...కోటి వన్నెలున్నదానా...
చిత్రం : జెంటిల్ మాన్ (1993)
గానం : బాలు, s. జానకి
సాహిత్యం : రాజశ్రీ
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్

కొంటెగాణ్ణి కట్టుకో
కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో
అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే
అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే
చిన్నారి మైనా చిన్నదానా
నే గాలం వేసానంటే పడితీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనిదేది లేదే

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

కొంటెగాణ్ణి కట్టుకో
కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో
అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా

కొనచూపుతోనే వేసావు బాణం
రేపావు నాలో నిలువెల్ల దాహం
కొరగాని వాడితో మనువు మహఘోరం
ఈ, మొనగాడే నావాడైతే బ్రతుకు బంగారం
చిగురాకు పరువం సెగ రేగే అందం
Watch Kontedanni Kattuko Song from the movie Gentleman, Starring Arjun, Madhubala / Madhoo,…

adollu miku joharulu




ఆడాళ్ళు.... మీకు జోహార్లు..ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు ..మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు

చిత్రం: ఆడాళ్ళు మీకు జోహార్లు (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఆడాళ్ళు.... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు.... మీకు జోహార్లు

చరణం 1:

ఒకరు దబ్బ పండు... ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం... ఒకరిది కానరాని తియ్యదనం
ఒకరు దబ్బ పండు... ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం... ఒకరిది కానరాని తియ్యదనం

ఇద్దరి మంచితనం... నాకు ఇస్తుంది ప్రాణం
ఇది తలచుకుంటే... మతిపోతుంది ఈదినం

ఆడాళ్ళు.... మీకు జోహార్లు

చరణం 2:

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం

ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం
ఇదే పనా మీకూ... ఇందుకే పుట్టారా

ఆడాళ్ళు.... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు.... హ హ హ హ...

https://www.youtube.com/watch?v=2fW7kCHTMvI
Aadavallu Meeku Joharlu | Aadaallu Meeku song
Listen to the heartwarming melody,"Aadaallu Meeku" sung by SP Balasubramaniam from the hit film Aada...

punyasree




మౌనమా కోపమా...మౌ...నమా కోపమా..
నా కౌగిలింతలో కలవరమా ప్రణయ కలహమా నా ప్రియతమా ..

చిత్రం : పుణ్యస్త్రీ
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి

మౌనమా కోపమా...మౌ...నమా కోపమా..
నా కౌగిలింతలో కలవరమా ప్రణయ కలహమా నా ప్రియతమా ..

దూరమేల ఈవేళా నేరమెంచగా ఏలా
ప్రాణములన్నీ నీకై వేణువులూదే వేళా
ఈ ఒడి విడిచి బతకగలనా
ఈ ముడి యముడు తెంచగలడా
పాదాల పారాణినై విధిని గెలవలేనా

శివుడు పార్వతుల జంటా ఇలను వెలిసె మనఇంటా
నీడను నేనై లేనా బిడ్డను నేనై రానా
నీజత నేను వీడగలనా
నీ వ్యధ నేను చూడగలనా
ఈ జన్మలో సంగమం పసుపు కడలిగా మారి

https://www.youtube.com/watch?v=ygkj1ppd3qM
Punyastree - mounama kopama full song
Punyastree - Karthik ( Murali) rajendra prasad, ali, samyuktha, acted in this film..

విజృంభణ (1986)




గెలుపు మాదే సుమా.. గెలుపు మాదే సుమా...గగనమే రగిలినా....

చిత్రం : విజృంభణ (1986)
సంగీతం : సత్యం
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :

గెలుపు మాదే సుమా.. గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....
జీవితం ప్రతి పదం.. సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం.. సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...

చరణం 1 :

చీకటి ముసిరిన వేళా.. చిరు నవ్వె రవ్వల దీపం
మౌనం మూగిన వేళ.. ఒకమాటే మువ్వల నాదం
చీకటి ముసిరిన వేళా.. చిరు నవ్వె రవ్వల దీపం
మౌనం మూగిన వేళ.. ఒకమాటే మువ్వల నాదం
పదుగురు ఏమన్నా విధి పగ పడుతున్నా
ఎద చాచి ఎదిరించి కదిలేదే జీవితం

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....
జీవితం.. జీవితం
ప్రతి పదం.. ప్రతిపదం
సమరమై సాగనీ...
జీవితం.. జీవితం
ప్రతి పదం.. ప్రతిపదం
సమరమై సాగనీ...
చరణం 2 :

కమ్మని మనసులు కళకళలాడే కాపురం
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా
తడ బడకా వడి వడి గా నడిచెదే జీవితం...

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
https://www.youtube.com/watch?v=7KdwnBpiyHs
Evergreen Tollywood Hit Songs 60 || Gelupu Maade Sumaa Video Song || Sobhan Babu, Jayasudha
Watch Evergreen Tollywood hit Song from Vijrumbhana movie, Starring Shoban Babu, Jayasudha, Gummadi,...

శ్రీకృష్ణ పాండవీయం (1966)



చాంగురే... బంగారు రాజా...చాంగు చాంగురే బంగారు రాజా...

చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జిక్కి

పల్లవి :

చాంగురే... చాంగు.. చాంగురే..
చాంగురే... బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
అయ్యారే.... నీకే మనసియ్యాలని వుందిరా
చాంగురే... చాంగురే.. బంగారు రాజా
చాంగు చాంగురే... బంగారు రాజా

చరణం 1 :

ముచ్చటైన మొలక మీసముంది.. భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది.. మేటి దొరవు అమ్మక చెల్లా!
నీ సాటి ఎవ్వరునుండుట కల్లా...

చాంగురే... చాంగురే బంగారు రాజా..
చాంగు చాంగురే బంగారు రాజా

చరణం 2 :

కైపున్న మత్సకంటి చూపు... అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో... గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...

చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

చరణం 3 :

గుబులుకొనే కోడెవయసు లెస్సా... దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచుదనపు గిలిగింత.. గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురా కైదండలేక నిలువలేనురా

చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

https://www.youtube.com/watch?v=K_HQkfVRkN8
Changure Bangaru Full Video Song || Sri Krishna Pandaveeyam || N.T.R, K.R.Vijaya
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll..

Friday 27 December 2019

శాంతినివాసం (1960)




రావే రాధ రాణి రావే...రాధ నీవే కృష్ణుడు నేనే

చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల
నేపధ్య గానం : ఘంటసాల, జిక్కి

రావే రాధ రాణి రావే
రాధ నీవే కృష్ణుడు నేనే
రమ్యమైన శారద రాత్రి
రాసలీల వేళ ఇదే !
రాసలీల వేళ ఇదే !
రార కృష్ణ రార కృష్ణ
రాధనేనే కృష్ణుడ నీవే
రమ్యమైన శారద రాత్రి
రాసలీల వేళ ఇదే !
రాసలీల వేళ ఇదే !

వో౦పులతో సంతపరి
ఇంపోసగే యమునేది
సుందరి నీ వాలుజడ
సొగసైన ఆ వాలుజెడ
నాటితార కోర్కెలు తీరే
నాటి పున్నమ జాబిలి నేనే
రాధనేనే కృష్ణుడ నీవే
రాసలీల వేళ ఇదే !
రాసలీల వేళ ఇదే !

విరసిన పూపొదలెవీ
విరిమల్లెలో విభుడేడి
వికసించే నీ కనుల
వెలిగేనే నీ విభుడు
ఓ !మూగబోయే మానస మురళీ
మురిసి ఊదే మోహనమురళి
రాసలీల వేళ ఇదే !
రాసలీల వేళ ఇదే !
ఏమి రాధ మాధవ లీల
పావనంలో బృందావనము
మనము రాధాకృష్ణులమేలే
మధురమాయేనే జీవనం
మధురమాయేనే జీవనం

https://www.youtube.com/watch?v=T4X-F1lJG6Y
Santhi Nivasam Movie Songs || Raave Radha Rani Raave || ANR || Rajasulochana
Dr.ANR and Rajasulochana-Kanta Rao and Devika's Santhi Nivasam Movie -Santhi Nivasam Movie Songs Wit...

సిరి సిరి మువ్వ (1978)



అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ...అందరికీ అందనిదీ పూచిన కొమ్మ...

చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు

పల్లవి :

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిదీ పూచిన కొమ్మ
పుత్తడిబొమ్మా... పూచినకొమ్మా
ఆ..ఆ..ఆ..ఆ...

చరణం 1 :

పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక

పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక

ఎదకన్నాలోతుగా పదిలంగా దాచుకో
ఎదకన్నాలోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా.... పూచిన కొమ్మా

చరణం 2 :

ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో

ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో

ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో

గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
పుత్తడి బొమ్మా... పూచిన కొమ్మా...

చరణం 3 :

ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను....
ముందు జన్మవుంటే ఆ కాలి మువ్వనై పుడతాను....
పుత్తడి బొమ్మా... పూచిన కొమ్మా...
ఆ..ఆ..ఆ..ఆ..ఆ...

https://www.youtube.com/watch?v=Wsr7mYPzm8o
Andaaniki Andam Ee Puttadi Bomma - Chandra Moahn & Jayapradaha - Siri Siri Muvva
Andaaniki Andam Ee Puttadi Bomma - Chandra Moahn & Jayapradaha - Siri Siri Muvva. Enjoy this beautif...














బుద్ధిమంతుడు (1969)









తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా...

చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం 1:

కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
మా రాధ అనురాగం మారనిది..
అది ఏ రాసకేళిలోన చేరనిది ..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం 2:

జిలుగు పైట లాగకురా...
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది

తోటలోకి రాకురా ..ఆ..ఆ..ఆ

చరణం 3:

రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
కన్నెవలపు సన్నజాజి వాడనిది..
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది..

తోటలోకి రాకురా... తుంటరి తుమ్మెదా ...గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది.. అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

https://www.youtube.com/watch?v=HPEBF7o0rDo
Thotaloki Rakura Song - Buddhimanthudu Movie Songs - ANR - Shoban Babu - Vijaya Nirmala
Watch Thotaloki Rakura Song From Buddhimanthudu Movie, starring Akkineni Nageshwar Rao, Vijaya Nirma...

Thursday 26 December 2019

రాధాకృష్ణ (1978)





నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల...నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల...

చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

ఆహా లలలలలలా ఆహా లలలలలలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా

నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా

చరణం 1 :

మల్లెలు పూసే చల్లని వేళ మనసులు కలపాలీ
మల్లెలు పూసే చల్లని వేళ మనసులు కలపాలీ
అల్లరి చేసే పిల్లగాలిలో ఆశలు పెంచాలి
ఒంటరితనము ఎంత కాలము జంట కావాలి.. నీకొక జంట కావాలి
ఇటు చూడవా మాట్లాడవా.. ఈ మౌనం నీకేలా

నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా.. మాట్లాడవా.. ఈ బింకం నీకేలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల

చరణం 2 :

చల్లని వేళ నీ ఒళ్లంతా వెచ్చగా ఉంటుందా?.. హ్మ్.. ఉంటుంది
నడిరేయైనా నిదురే రాక కలతగా ఉంటుందా? .. అవును.. అలాగే ఉంటుంది
ఉండి ఉండి గుండెలోనా దడదడమంటుందా? ..అరే.. నీకెలా తెలుసు
ఓ మై గాడ్ ఇది చాలా పెద్ద జబ్బే..ఊ
ఈ పిచ్చికి ఈ ప్రేమకు ఇక పెళ్ళే ఔషధమూ.. హ హ హ

నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల

https://www.youtube.com/watch?v=GouJz2Fgs5A
Radha Krishna Songs - Neeve Jaabilee - Jayapradha - Sobhan Babu
Sobhan Babu Jayapradha's Radhakrishna Telugu Movie Song Music : S Rajeswara Rao Lyrics : Dasaradhi K...

వందేమాతరం (1985)


ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
చిత్రం : వందేమాతరం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా...
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. నిలువగలన నీపక్కన

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
చరణం 1 :
నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
ముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది.. నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..

ఆకాశమా... లేదక్కడ ...
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన

చరణం 2 :
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో నన్ను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నాపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా..
నేలపైనే తన మక్కువ... ఈ నేలపైనే తన మక్కువ


బాణం (2009)


నాలో నేనేనా ఏదో అన్నానా...నాతో నే లేని మై మరపులా...
చిత్రం : బాణం (2009)
సంగీతం : మణిశర్మ
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : హేమచంద్ర , సైంధవి

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపులా..
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావెమో
చిన్న మాటేదో నిను అడగనా..

నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపులా..
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావెమో
చిన్న మాటేదో నిను అడగనా..

అల సాగిపోతున్న నాలోన
ఇదేంటి ఇలా కొత్త ఆలోచన
మనసే నాది, మాటే నీది, ఇది ఏమి మాయో..
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపులా..
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావెమో
చిన్న మాటేదో నిను అడగనా..

అవును కాదు తడబాటుని, అంతో ఇంతో గది దాటని
విధి విడిపోనీ పరదానీ, పలుకై రానీ ప్రాణాన్ని
ఎద అంత పదాల్లోన పలికినా..
నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది, మాటే నీది, ఇది ఏమి మాయో..
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపులా..
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావెమో
చిన్న మాటేదో నిను అడగనా..

దైవం వరమై దొరికిందని నా సగమై కలిసిందని
మెలకువ కాని హృదయాన్ని, చిగురైపోనీ సిసిరాన్ని
నీతో చెలిమి చేస్తున్నా నిమిషాలు
నూరేళ్ళుగా ఎదిగిపోయాయి ఇలా
మనమే సాక్షం, మాటే మంత్రం, ప్రేమే బందం
నాలో నేనేనా ఏదో అన్నానా
నాతో నే లేని మై మరపులా..
ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావెమో
చిన్న మాటేదో నిను అడగనా..

Watch Naalo Nenena Official Song Video from the Movie Baanam Song Name - Naalo Nenena Movie - Baanam Singer - Hemachandra & Saindhavi…
youtube.com

అన్నయ్య (2000)



హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో...మునిమాపుల్లో ఎల్లో మురిపాలలోయల్లో
చిత్రం : అన్నయ్య (2000)
రచన : వేటూరి
సంగీతం : మణిశర్మ
గానం : హరిహరన్, హరిణి

పల్లవి :
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాలలోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలివిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో

చరణం :
సోసో కాని సోయగమా ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వావా అంటే వందనమా అభివందనమా
వయసంతా నందనమా
మొహమాటమైనా నవ మోహనం
చెలగాటమైనా తొలి సంగమం
మది వదిలే హిమ మహిమ ఓ...
అది అడిగే మగతనమా నీదే భామ
పడుచు పంచదార చిలక పలుకగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో

చరణం :
మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీదు ఎండ పొడి
సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం
పరువాల గుళ్ళో పారాయణం
రవి కలనే రచన సుమా... ఓ...
సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా
పెదవి ప్రేమలేఖ ఇదని చదవగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలివిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే


Watch the song 'Himaseemallo...' featuring Chiranjeevi and Soundarya from the movie 'Annayya'. Hariharan and Harini have sung the song to which Mani Sharma h...

--(())--

అమరావతి
 .... కొన్ని చేదు  నిజాలు .. అందరికీ Digest కావు... కానీ తప్పదు ....

1)  సచివాలయం కి వెళ్ళాలి అంటే కష్టం... కానీ కనీసం మంచి కాఫీ తాగుదాము అంటే బెజవాడ వెళ్ళాలి. కారణం అక్కడ restaurant కట్టాలి అన్నా భూములు CRDA కేటాయించాలి, లేదా CRDA రైతులకి  కేటాయించిన స్థలం  కొని కట్టాలి.  ఎకరా 10కోట్లు పెట్టి కొని  కాఫీ ఎంతకీ అమ్మాలో  ఆలోచించండి.
ఈ కారణం వలనే చిన్న చిన్న వ్యాపారులకు అక్కడ స్థానం ఉండదు.
ఇది CRDA కి సింగపూర్ వాళ్ళు propose సేసిన model. ఇదే model లో సింగపూర్ ఉంది. అక్కడ పరిస్థితులు వేరు... అక్కడ అన్నీ vertical buildings .... మనది Horizontal buildings ....
మనం 3 /4/5 bedrooms అంటాం ... అక్కడ 3 bedroom ఇల్లులో paying guest కోసం 1 లేదా 2 bedrooms ఇస్తారు.

సింగపూర్ కి  టూరిజం ఆదాయం ఉంది. మన అమరవతికి ఆ ఆదాయం లేదు.  రాదు .

2)  ఎవరైనా పెట్టుబడి దారుడు రావాలి అంటే  గన్నవరం airport నుండి సచివాలయం వరకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవి పోవాలి.
అవి పోవాలి అంటే  కృష్ణా నది మీద ఇంకొక bridge కట్టాలి.  ఉండవల్లి నుండి అమరావతి సచివాలయం వరకు seed access రోడ్డు వెయ్యాలి. ఇవి పూర్తి కావడానికి 2  నుండి 3 ఏళ్ళు పడుతుంది. 5 నుండి 7వేల కోట్లు అవుతుంది . ఆ తర్వాత ప్రభుత్వానికి ఉండే సమయం ఏడాది .... ఏడాదిలో ఏమి సాదించగలమో ఆలోచించండి .

3) అమరావతిలో  కొత్తగా కంపెనీ పెట్టాలి అంటే ఎకరం మినిమమ్ 3 నుండి 10 కోట్లు. ఎలాంటి సదుపాయాలు లేని  ఈ ఊరిని ఎన్నుకుంటారా లేక 1 కోటి రూపాయలతో అన్ని సదుపాయాలు ఉన్న వేరే ఊరు వెళ్తారా ?

4) start up & manpower , వచ్చే ప్రతి కంపెనీ అన్నీ వెతుక్కోవాలి .  security gaurds నుండి CEO ల వరకు.  అందరూ ప్రస్తుత పరిస్థితులలో 20 నుండి 50 కిలోమీటర్ల దూరం రోజు ప్రయాణం చెయ్యాలి. ఇందాక మనం చెప్పుకున్న రోడ్డు కాకుండా ఇటు మంగళగిరి అటు గుంటూరు వరకు రోడ్ల విస్తరణ చేపట్టాలి . సమయం 2 ఏళ్ళు , డబ్బు 10 నుండి 15 వేల కోట్లు (land aquire చెయ్యాలి. )

5)  Cost of living ... సింగపూర్ వాళ్ళు propose చేసిన విధానం వేరు.. మన జీవన శైలి వేరు.  మనం ఇళ్ళలో పనుల కోసం ధోబి , పని మనిషి, driver మీద ఆధారపడతామ్. ఇది అమలాపురం నుండి ఇండియా లో ప్రతి ఊరిలో దాదాపు 90శాతం  మంది ఇళ్ళలో  సొంత పనులు వారే చేసుకుంటున్నారో లేదో ఆలోచించండి.  ఈ ధోబి ,, ఇళ్ళలో పని చేసే వారు , drivers ఎక్కడ నుండి రావాలి.. జీతాలు ఎంత  ఇస్తే వీరు ఎక్కడ  ఉంటారు.  వీరికి ప్రభుత్వం ఉచితంగా ఇల్లు ఇవ్వగలదా ? అప్పుడు ఈ కర్చు ఎవరు భరించాలి ? .

6)  వోటు bank ....  YSRCP కూడా నష్టపోతుంది. బలమైన  4 గ్రామాలలో రెడ్లు కూడా నష్టపోతారు.

7) what next and reality ,   చాలమందికి నచ్చదు. ఈ నిజం .. జగన్ అన్న  కాంప్ ఆఫీసు ముందు ఉండే పొలం మా తాతయ్య గారిది. 2016  నవంబర్ 8 demonitization రోజున  అమ్మారు. ఎకరం 4 కోట్ల 60 లక్షలు. తరవాత  అక్కడ ventures రావడం తో 8 కోట్ల వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పాత రేటుకు కొంచం అటు ఇటుగా  వస్తుంది .... నిలబడిపోతుంది....

8) రాజధాని రైతులు అప్పుడు 33 వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేశారో లేదో అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు చెయ్యబోతుందే  అసలైన త్యాగం ...

ఇప్పటి వరకు గ్రామ కంఠాల విషయంలోనే clarity ఇవ్వలేదు .

9)  1 నుండి 5 వరకు అన్నీ నగ్న సత్యాలు. చంద్రబాబు గారి ఈ విషయాలన్నీ 2018 March లోనే తెలుసు. అందుకే 2018 March తర్వాత కొత్త proposals ఏమీ చేయలేదు.. High court కూడా తాత్కాలికం అని చెప్పిన  కారణం ఇదే. High Court judges వచ్చే దారి కరకట్ట రోడ్డు ట్రాఫిక్ సాక్షిగా ఎవరైనా తెలిసిన  వారు ఉంటే నేరుగా వారినే అడగండి.

10) చంద్రబాబు చెప్పినట్లు self financing project అయితే ఈ 3 ఏళ్ళు ఎందుకు ఆ దిశగా వెళ్లలేదు ?
initial గా కావలసిన ఆ 40 వేల కోట్ల funding ఎక్కడ నుండి వస్తుంది ?

11) అసలు సిసలైన సమస్య.... అమరావతి లో వచ్చే roads ఇప్పటి పొలాల కన్నా 2 అడుగులు ఎత్తు వస్తాయి... అంటే basement ఇంకో 2 అడుగులు కనీసం ఎత్తు పెంచాలి అంటే కనీసం 4 అడుగులు. ఈ 4 అడుగులు 33 వేల  ఎకరాలలో పెంచాలి అంటే రైతుల వాటాగా ఎకరానికి అయ్యే కర్చు 30 నుండి 45 లక్షలు.  ఈ స్థోమత ఎంత మంది రైతులకి ఉంటుంది? కచ్చితంగా developers మీద ఆధారపడాల్సిందే . cellar  ప్రశ్నే ఉండదు. కారణం కృష్ణా నది ఊట వస్తుంది.

ఎవరినో Blame చెయ్యాల్సిన పని లేదు.

చివరిగా ,,,, సచివాలయం బయట కాపలా ఉండే drivers కి కూడా కనీసం tea తాగాలి అంటే మందడం వెళ్లాల్సిన పరిస్థితి ..... వచ్చిన investors 10 మంది మంత్రులను వారి చాంబర్స్ లో కలవాలి అంటే చూసిన వారికే ఆ పరిస్థితి అర్ధం అవుతుంది. అందుకే చంద్రబాబు అనేక మీటింగ్స్ విజయవాడ లేదా vizag hotels లో పెట్టారు కానీ సచివాలయంలో పెట్టలేదు.

చంద్రబాబు చేసిన ఏకైక తప్పిదం ఆ geographic location ఎన్నుకోవడం .. అదే గన్నవరం ప్రాంతం అయి ఉంటే సగం ఇబ్బందులు పోయేవి.... ఆయన అన్న మాట తాత్కాలిక కట్టడం అనేది నిజం...
అమరావతి శాశ్వతంగా తాత్కాలికం గానే మిగిలిపోతుంది.

🕉🌞🌎🌙🌟🚩

*మనసు తన బలహీనతలను తెలుసుకొని బుద్ధిచూపిన గొప్పదైన మరియు సంపూర్ణమైన ఆదర్శపుదిశగా తనను తాను శృతిచేసుకొనే మానసికస్థితే "యోగ" యొుక్క నిజమైన నిర్వచనం.*

 *- స్వామి చిన్మయానంద/Swamy Chimayananda*

*Yoga in its right sense is only that state of mind in which the mind having recognised its weaknesses attunes itself to a greater and more perfect Ideal which the intellect has shown it.*

🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Dec 19._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - డిసెంబరు 19._*

*Come up, O lions, and shake off the delusion that you are sheep; you are souls immortal, spirits free, blest and eternal; ye are not matter, ye are not bodies; matter is your servant, not you the servant of matter.*

*ఓ సింహాల్లారా రండి! 'మేము గొర్రెలం' అని మీరు అనుకొనేలా చేసే ఆ మాయను విసిరిపారేయండి. మీరు అనంతమైన ఆత్మస్వరూపులు, స్వేచ్ఛాజీవులు, ధన్యులు, శాశ్వతులు. మీరు వస్తువులు కాదు, శరీరాలు కాదు. వస్తు సంపదలు మీ బానిసలు. మీరు వస్తుసంపదకు బానిసలు కారు.*

🕉🌞🌎🌙🌟🚩
-
-(())--
🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Dec 20._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - డిసెంబరు 20._*

*This world will always be a mixture of good and evil, of happiness and misery; this wheel will ever go up and come down; dissolution and resolution is the inevitable law.*

*ఈ లోకం ఎప్పుడూ పుణ్యపాపాల, సుఖ దుఃఖాల మిశ్రమం. ఈ చక్రం పైకి, కిందికి తిరుగుతుంటుంది. జననమరణాలు అనేవి అనివార్యమైన విధి నిర్ణయాలు.*

🕉🌞🌎🌙🌟🚩

*SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...*
*_FAITH - THE SOURCE OF STRENGTH_*

*If you have faith in all the three hundred and thirty millions of your mythological gods...and still have no faith in yourselves, there is no salvation for you. Have faith in yourselves, and stand upon that faith and be strong; that is what we need.*

*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_విశ్వాసమే బలం_*

*పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ, మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలగదు. ఆత్మవిశ్వాసంతో ధీరుడవై నిలబడు, అదే మనకిప్పుడు కావలసింది.*

🕉🌞🌎🌙🌟🚩

--(())--

🕉🌞🌎🌙🌟🚩

 *_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Dec 23._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - డిసెంబరు 23._*

*Always keep your mind joyful; if melancholy thoughts come, kick them out.*

*నిరత్సాహపరచే ఆలోచనలు వస్తే వాటిని బయటకు పారద్రోలు. నీ మనస్సును ఎల్లప్పుడూ ఉన్నత ఆశయాలతో నింపు.*

🕉🌞🌎🌙🌟🚩

 *SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...*
*_FAITH - THE SOURCE OF STRENGTH_*

*Whatever of material power you see manifested by the Western races is the outcome of this Shraddha, because they believe in there muscles and  if you believe in your spirit, how much more will it work! Believe in that infinite soul, the Infinite power, which with consensus opinion, your books and sages preach. That Atman which nothing can destroy, in It is infinite power only waiting to be called out...Be strong and have this Shraddha, and everything else is bound to follow.*

*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_విశ్వాసమే బలం_*

*పాశ్చాత్య దేశాలలో మీరు చూసే భౌతిక అభివృద్ధి అంతా వారికున్న శ్రద్ధ వలన కలిగినదే. వాళ్ల కండరాలను వాళ్లు విశ్వసిస్తారు. ఆత్మబలాన్ని విశ్వసిస్తే ఇంకెంత అధికతర ప్రయోజనం కలుగుతుందో కదా! మీ శాస్త్రాలు, ఋషులు ముక్తకంఠంతో బోధిస్తున్న అనంతశక్తి సమన్వితమైన ఆ అనంతాత్మను విశ్వసించండి. నాశరహితమైన ఆ ఆత్మల నుంచి అనంత శక్తి బయల్పడడానికి సంసిద్ధంగా ఉంది. ధైర్యంగా ఉండండి. శ్రద్ధ కలిగి ఉండండి. మిగిలినది దానంతట అదే వచ్చి తీరుతుంది.*

🕉🌞🌎🌙🌟🚩

--(())--

🕉🌞🌎🌙🌟🚩

 *_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Dec 24._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - డిసెంబరు 24._*

*If you want to help othets, your little self must go.*

*ఏ సందర్భంలోనైనా స్వార్ధత్యాగంతోనే విజయం సాధించగలం. ఎంతగా నిస్వార్ధులమైతే అంతగా విజయానికి చేరువవుతాం.*

🕉🌞🌎🌙🌟🚩

 *SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...*
*_FAITH - THE SOURCE OF STRENGTH_*

*Have faith as Nachiketa...ay, I wish that faith would come to each of you; and everyone of you wood stand up a gaint, a world-mover with a gigantic intellect - an infinite God in every respect. That is what I want you to become.*

*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_విశ్వాసమే బలం_*

*నచికేతుని శ్రద్ధ వంటి శ్రద్ధ మీ అందరికీ కలగాలని ఆశిస్తున్నాను. మీరందరూ అసాధారణ ప్రతిభావంతులు - మీ అసాధారణ మేధతో మీరు ప్రపంచాన్నే కదిలిస్తారు -  అనంత పరబ్రహ్మలుగా భాసిస్తారు. మీరందరూ ఇలా కావాలి అని నేను కోరుకుంటాను.*

🕉🌞🌎🌙🌟🚩

🕉🌞🌎🌙🌟🚩

 *_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Dec 25._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - డిసెంబరు 25._*

*Youth and beauty vanish, life and wealth vanish, name and fame vanish, even the mountains crumble into dust. Friendship and love vanish. Truth alone abides.*

*యౌవనం, సౌందర్యం అదృశ్యమవుతాయి; జీవితం, సంపద మాయమౌతాయి; పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి; పర్వతాలు సైతం దుమ్ము ధూళిగా మారతాయి; సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి. సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది.*

🕉🌞🌎🌙🌟🚩

 *SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...*
*_FAITH - THE SOURCE OF STRENGTH_*

 *Make men first. Men we want, and how can men be made unless Shraddha is there?*

*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_విశ్వాసమే బలం_*

*మనుషులను తయారు చేయాలి. వ్యక్తులు కావాలి. - శ్రద్ధ లేకుండా వ్యక్తులు ఎలా తయారవుతారు?*

🕉🌞🌎🌙🌟🚩

Wednesday 25 December 2019

మేఘసందేశం (1982)



పాడనా వాణి కళ్యాణిగా...స్వరరాణి పాదాల పారాణిగా...

చిత్రం : మేఘసందేశం (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలమురళీకృష్ణ

పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

గమదని సని పామా నిరిగమ రిగ నిరి స
మామాగా గాదప దపమ గానిద నిదప మాదని
సాని గారి సనిద పసాని దపమ
నిసని దపమ నిసని గమదని సని పామరిగా...

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకూ శర్వాణిగా నా భాషకూ గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచక మధురగాన సుఖవాణిగా
ఆ.. ఆ..

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

చరణం 1:

తనువణువణువును తంబుర నాదము నవనాడుల శృతి చేయగా ఆ....

గరిస్స నిదని మద నిదా నిదపద గమ సని దపమ

ఎద మృదంగమై తాళ లయగతులు గమకములకు జతగూడగా
అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా
అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా
తరంతరము నిరంతరము గానాభిషేకమొనరించి తరించగ

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

చరణం 2:

స్వర ముఖరిత నిర్ఝరులు లహరులై దేవి పాదములు కడుగగా

గనిగరి రినిమగ రిగదమ గమనిద గనీరిద మ నిదామగ రి మగారి

లయ విచలిత గగనములు మేఘములై తానములే చేయించగా
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
తరంతరము నిరంతరము గీతాభిషేకమొనరించి తరించగ

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకూ శర్వాణిగా నా భాషకూ గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచక మధురగాన సుఖవాణిగా
ఆ.. ఆ..

http://m3.linksden.xyz/telugu/Megha%20Sandesam%20%281983%29/04%20Paadana%20Vani%20Kalyaniga.mp3
m3.linksden.xyz

Nannu Lalinchu Sangeetam



Director : Vikraman
Music Director : SA Rajkumar
Producer : Venkata Shyam Prasad
Banner : SP Entertainments
Released Date : 24th Sep, 2004

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

నదిలాగ నువ్వూ కదలాడతుంటే
నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా
నిశిరాత్రి నీవు నెలవంక నేను
నీతోపాటూ నిలిచే కాలం చాలందునా
మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ
కలలే నాకిచ్చీ కనులను దోచావూ
ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వూ
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

భువిలోన గాలి కరువైన వేళా
నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా
నీళాల నింగీ తెలవారకుంటే
నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా
శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా
అలలా నువు రాగా అలజడి ఔతున్నా
దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా నీలో సగం అవ్వనా

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

c Songs - Nannu Lalinchu Sangeetam - Venu Ashima Bhalla
Cheppave Chirugali Songs - Nannu Lalinchu Sangeetam Watch more movies @ http://www.youtube.com/volga...