Saturday 21 December 2019

కంచె

కంచె 







సర్వేజనా సుఖినోభవంతు 
ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో..అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

చిత్రం : కంచె (2015)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అభయ్ జోద్ పూర్కర్, శ్రేయఘోషల్

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో

ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారైందోయ్ సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచివెళ్ళిపోదా
తనోటి ఉందని మనం ఏలాగ గమనించం గనక
కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా
మనదరికెవ్వరు వస్తారు కదిలించగా
ఉషస్సెలా ఉదయిస్తోందో నిశీధెలా ఎటుపోతుందో
నిదుర ఎప్పుడు నిదురోతుందో
మొదలు ఎలా మొదలవుతుందో

ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

పెదాల మీదుగా అదేమీ గల గల పదాల మాదిరిగా
సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా
ఇలాంటివేళకు ఇలాంటి ఊసులు ప్రపంచభాష కదా
ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటవుండదుగా
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా
వినబోతున్న సన్నాయి మేళాలుగా..
ఓ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో

ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

https://www.youtube.com/watch?v=8tbOoGtQBBQ
Itu Itu Ani Chitikelu Evvarivo Song With Lyrics - Kanche Songs - Varun Tej, Pragya Jaiswal
Listen & Enjoy Itu Itu Ani Chitikelu Full Song With Lyrics - Kanche Movie Songs Song Name : Itu Itu ...







చిత్రం - కంచె (2015)
రచన : సీతారామశాస్త్రి
సంగీతం : చిరంతాన్ భట్,
గానం : శ్రేయాఘోషల్

ఆ ....  ఆ ....   ఆ ...
నిజమేనని నమ్మని
ఔనా అనే మనసుని
మనకోసమే లోకం అని
నిజమేనని నమ్మని

చరణం -1
కనుపాపలోని ఈ కలల కాంతి
కరిగేది కానే కాదని
గత జన్మలన్నీ మరు జన్మలన్నీ 
ఈ జన్మగానే మారని
ఈ జంటలోనే చూడని
నిజమేనని నమ్మని 

చరణం-2
కాలం అనేది లేని చోట
విలయాల పేరే వినని చోట
మనం పెంచుదాం ఏకమై ప్రీమగా ప్రేమని
నిజమేననీ నమ్మని .....(2)
 

---(())--

No comments:

Post a Comment