Sunday 22 December 2019

బంగారు బుల్లోడు (1993)





స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెభామ..

చిత్రం : బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్ - కోటి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి:

వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా.. వాగు వంకా మెచ్చేనంటా.. ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెభామ...
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లొనలోన...
హల్లో మల్లో... అందాలెన్నోనాలో లా లా...
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెభామ...
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లొనలోన...

చరణం 1 :

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగేవేళ...
మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ...
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళా...
శ్రావణ సరిగమ యవ్వన గుమగుమ లయనీదమ్మా...
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా...
సిగ్గు ఎగ్గు చెల్లప్పా కాదయ్యొ నీ గొప్పా...
నీలో మేఘం.. నాలో దాహం.. యాలో యాలా...
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెభామ...
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లొనలోన...

చరణం 2 :

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన...
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన...
జన్మకు దొరకని మన్నధ తళుకులు ముదిరే వాన...
చాలని గొడుగున నాలుగ అడుగుల నటనే వాన...
వానల్లోన సంపెంగ వళ్ళంతా ఓపెంగా...
గాలివానా గుళ్ళోన ముద్దెలిజె గంట...
నాలో రూపం.. నీలో తాపం.. నాలో యాలా...
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెభామ...
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లొనలోన...
హల్లో మల్లో... అందాలెన్నోయాలో యాలా...

https://www.youtube.com/watch?v=_3zfAG5cBLA
Swathilo Mutyamanti Video Songs Bangaru Bullodu HD 1080p Balakrishna

No comments:

Post a Comment