Wednesday 25 December 2019

సక్కనోడు





సీతమ్మ వాకిట్లో సిరిమల్లె తోట...సిరిమల్లె తోటల్లో సీతమ్మ పాట

చిత్రం : సక్కనోడు
సంగీతం : KV.మహదేవన్
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం, ప.సుశీల

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె తోట
సిరిమల్లె తోటల్లో సీతమ్మ పాట
సిరిమొగ్గ లయ్యింది తొలి సిగ్గు మూటా
మనసైన రామయ్య మనువాడు పూటా

చిక్కుళ్ళ పువ్వెరుపు చిలకా ముక్కెరుపు
చిగురంటి చిన్నారి సొగసంత ఎరుపు
పసుపంటి నారోజు పారాణి ఎరుపు
మనువాడు తనవాడు మాణిక్య మెరుపు
సిగ్గంత ముగ్గేసి నవ్వాలా
శ్రీలక్ష్మి చిందేసి ఆడాలా

పన్నెండు స్తంబాల పందిళ్ళు వేసి
పన్నీటి జల్లంటి వానల్లు కురిసి
నాగళ్ళు ఆడేటి మాగాణి పండి
లోగిళ్ళలో సిరులు కలకాలముండి
గోరంత దీపాలు నవ్వాలా
గోరింట మాయింట పండాలా

పుట్టింటి ప్రేమంత నట్టింట పోసి
మెట్టింట తిరిగేటి పురుషుణ్ణి చూసి
ఏడేడు జన్మాల వేవిళ్ళు మోసి
ఏలేటి దేవుళ్ళ ఉయ్యాల వేసి
పచ్చంగా నూరేళ్ళు ఉండాలా
ముత్తైదు గా బ్రతుకు పండాలా

https://www.youtube.com/watch?v=PRF_nas-498&feature=youtu.be
Seethamma Mungita Full Video Song || Sakkanodu Movie || Sobhan Babu, Vijayashanti
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

No comments:

Post a Comment