*మనసు తన బలహీనతలను తెలుసుకొని బుద్ధిచూపిన గొప్పదైన మరియు సంపూర్ణమైన ఆదర్శపుదిశగా తనను తాను శృతిచేసుకొనే మానసికస్థితే "యోగ" యొుక్క నిజమైన నిర్వచనం.*
*
*ఓ సింహాల్లారా రండి! 'మేము గొర్రెలం' అని మీరు అనుకొనేలా చేసే ఆ మాయను విసిరిపారేయండి. మీరు అనంతమైన ఆత్మస్వరూపులు, స్వేచ్ఛాజీవులు, ధన్యులు, శాశ్వతులు. మీరు వస్తువులు కాదు, శరీరాలు కాదు. వస్తు సంపదలు మీ బానిసలు. మీరు వస్తుసంపదకు బానిసలు కారు.*
*ఈ లోకం ఎప్పుడూ పుణ్యపాపాల, సుఖ దుఃఖాల మిశ్రమం. ఈ చక్రం పైకి, కిందికి తిరుగుతుంటుంది. జననమరణాలు అనేవి అనివార్యమైన విధి నిర్ణయాలు.*
*పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ, మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలగదు. ఆత్మవిశ్వాసంతో ధీరుడవై నిలబడు, అదే మనకిప్పుడు కావలసింది.*
*నిరత్సాహపరచే ఆలోచనలు వస్తే వాటిని బయటకు పారద్రోలు. నీ మనస్సును ఎల్లప్పుడూ ఉన్నత ఆశయాలతో నింపు.*
*పాశ్చాత్య దేశాలలో మీరు చూసే భౌతిక అభివృద్ధి అంతా వారికున్న శ్రద్ధ వలన కలిగినదే. వాళ్ల కండరాలను వాళ్లు విశ్వసిస్తారు. ఆత్మబలాన్ని విశ్వసిస్తే ఇంకెంత అధికతర ప్రయోజనం కలుగుతుందో కదా! మీ శాస్త్రాలు, ఋషులు ముక్తకంఠంతో బోధిస్తున్న అనంతశక్తి సమన్వితమైన ఆ అనంతాత్మను విశ్వసించండి. నాశరహితమైన ఆ ఆత్మల నుంచి అనంత శక్తి బయల్పడడానికి సంసిద్ధంగా ఉంది. ధైర్యంగా ఉండండి. శ్రద్ధ కలిగి ఉండండి. మిగిలినది దానంతట అదే వచ్చి తీరుతుంది.*
*ఏ సందర్భంలోనైనా స్వార్ధత్యాగంతోనే విజయం సాధించగలం. ఎంతగా నిస్వార్ధులమైతే అంతగా విజయానికి చేరువవుతాం.*
*నచికేతుని శ్రద్ధ వంటి శ్రద్ధ మీ అందరికీ కలగాలని ఆశిస్తున్నాను. మీరందరూ అసాధారణ ప్రతిభావంతులు - మీ అసాధారణ మేధతో మీరు ప్రపంచాన్నే కదిలిస్తారు - అనంత పరబ్రహ్మలుగా భాసిస్తారు. మీరందరూ ఇలా కావాలి అని నేను కోరుకుంటాను.
*యౌవనం, సౌందర్యం అదృశ్యమవుతాయి; జీవితం, సంపద మాయమౌతాయి; పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి; పర్వతాలు సైతం దుమ్ము ధూళిగా మారతాయి; సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి. సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది.*
*మనుషులను తయారు చేయాలి. వ్యక్తులు కావాలి. - శ్రద్ధ లేకుండా వ్యక్తులు ఎలా తయారవుతారు?*
🕉🌞🌎🌙🌟🚩
No comments:
Post a Comment