Monday 30 December 2019

శ్రీకృష్ణ పాండవీయం (1966)



చాంగురే... బంగారు రాజా...చాంగు చాంగురే బంగారు రాజా...

చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జిక్కి

పల్లవి :

చాంగురే... చాంగు.. చాంగురే..
చాంగురే... బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
అయ్యారే.... నీకే మనసియ్యాలని వుందిరా
చాంగురే... చాంగురే.. బంగారు రాజా
చాంగు చాంగురే... బంగారు రాజా

చరణం 1 :

ముచ్చటైన మొలక మీసముంది.. భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది.. మేటి దొరవు అమ్మక చెల్లా!
నీ సాటి ఎవ్వరునుండుట కల్లా...

చాంగురే... చాంగురే బంగారు రాజా..
చాంగు చాంగురే బంగారు రాజా

చరణం 2 :

కైపున్న మత్సకంటి చూపు... అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో... గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...

చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

చరణం 3 :

గుబులుకొనే కోడెవయసు లెస్సా... దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచుదనపు గిలిగింత.. గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురా కైదండలేక నిలువలేనురా

చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

https://www.youtube.com/watch?v=K_HQkfVRkN8
Changure Bangaru Full Video Song || Sri Krishna Pandaveeyam || N.T.R, K.R.Vijaya
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll..

No comments:

Post a Comment