Thursday 26 December 2019


--(())--

అమరావతి
 .... కొన్ని చేదు  నిజాలు .. అందరికీ Digest కావు... కానీ తప్పదు ....

1)  సచివాలయం కి వెళ్ళాలి అంటే కష్టం... కానీ కనీసం మంచి కాఫీ తాగుదాము అంటే బెజవాడ వెళ్ళాలి. కారణం అక్కడ restaurant కట్టాలి అన్నా భూములు CRDA కేటాయించాలి, లేదా CRDA రైతులకి  కేటాయించిన స్థలం  కొని కట్టాలి.  ఎకరా 10కోట్లు పెట్టి కొని  కాఫీ ఎంతకీ అమ్మాలో  ఆలోచించండి.
ఈ కారణం వలనే చిన్న చిన్న వ్యాపారులకు అక్కడ స్థానం ఉండదు.
ఇది CRDA కి సింగపూర్ వాళ్ళు propose సేసిన model. ఇదే model లో సింగపూర్ ఉంది. అక్కడ పరిస్థితులు వేరు... అక్కడ అన్నీ vertical buildings .... మనది Horizontal buildings ....
మనం 3 /4/5 bedrooms అంటాం ... అక్కడ 3 bedroom ఇల్లులో paying guest కోసం 1 లేదా 2 bedrooms ఇస్తారు.

సింగపూర్ కి  టూరిజం ఆదాయం ఉంది. మన అమరవతికి ఆ ఆదాయం లేదు.  రాదు .

2)  ఎవరైనా పెట్టుబడి దారుడు రావాలి అంటే  గన్నవరం airport నుండి సచివాలయం వరకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవి పోవాలి.
అవి పోవాలి అంటే  కృష్ణా నది మీద ఇంకొక bridge కట్టాలి.  ఉండవల్లి నుండి అమరావతి సచివాలయం వరకు seed access రోడ్డు వెయ్యాలి. ఇవి పూర్తి కావడానికి 2  నుండి 3 ఏళ్ళు పడుతుంది. 5 నుండి 7వేల కోట్లు అవుతుంది . ఆ తర్వాత ప్రభుత్వానికి ఉండే సమయం ఏడాది .... ఏడాదిలో ఏమి సాదించగలమో ఆలోచించండి .

3) అమరావతిలో  కొత్తగా కంపెనీ పెట్టాలి అంటే ఎకరం మినిమమ్ 3 నుండి 10 కోట్లు. ఎలాంటి సదుపాయాలు లేని  ఈ ఊరిని ఎన్నుకుంటారా లేక 1 కోటి రూపాయలతో అన్ని సదుపాయాలు ఉన్న వేరే ఊరు వెళ్తారా ?

4) start up & manpower , వచ్చే ప్రతి కంపెనీ అన్నీ వెతుక్కోవాలి .  security gaurds నుండి CEO ల వరకు.  అందరూ ప్రస్తుత పరిస్థితులలో 20 నుండి 50 కిలోమీటర్ల దూరం రోజు ప్రయాణం చెయ్యాలి. ఇందాక మనం చెప్పుకున్న రోడ్డు కాకుండా ఇటు మంగళగిరి అటు గుంటూరు వరకు రోడ్ల విస్తరణ చేపట్టాలి . సమయం 2 ఏళ్ళు , డబ్బు 10 నుండి 15 వేల కోట్లు (land aquire చెయ్యాలి. )

5)  Cost of living ... సింగపూర్ వాళ్ళు propose చేసిన విధానం వేరు.. మన జీవన శైలి వేరు.  మనం ఇళ్ళలో పనుల కోసం ధోబి , పని మనిషి, driver మీద ఆధారపడతామ్. ఇది అమలాపురం నుండి ఇండియా లో ప్రతి ఊరిలో దాదాపు 90శాతం  మంది ఇళ్ళలో  సొంత పనులు వారే చేసుకుంటున్నారో లేదో ఆలోచించండి.  ఈ ధోబి ,, ఇళ్ళలో పని చేసే వారు , drivers ఎక్కడ నుండి రావాలి.. జీతాలు ఎంత  ఇస్తే వీరు ఎక్కడ  ఉంటారు.  వీరికి ప్రభుత్వం ఉచితంగా ఇల్లు ఇవ్వగలదా ? అప్పుడు ఈ కర్చు ఎవరు భరించాలి ? .

6)  వోటు bank ....  YSRCP కూడా నష్టపోతుంది. బలమైన  4 గ్రామాలలో రెడ్లు కూడా నష్టపోతారు.

7) what next and reality ,   చాలమందికి నచ్చదు. ఈ నిజం .. జగన్ అన్న  కాంప్ ఆఫీసు ముందు ఉండే పొలం మా తాతయ్య గారిది. 2016  నవంబర్ 8 demonitization రోజున  అమ్మారు. ఎకరం 4 కోట్ల 60 లక్షలు. తరవాత  అక్కడ ventures రావడం తో 8 కోట్ల వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పాత రేటుకు కొంచం అటు ఇటుగా  వస్తుంది .... నిలబడిపోతుంది....

8) రాజధాని రైతులు అప్పుడు 33 వేల ఎకరాలు ఇచ్చి త్యాగం చేశారో లేదో అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు చెయ్యబోతుందే  అసలైన త్యాగం ...

ఇప్పటి వరకు గ్రామ కంఠాల విషయంలోనే clarity ఇవ్వలేదు .

9)  1 నుండి 5 వరకు అన్నీ నగ్న సత్యాలు. చంద్రబాబు గారి ఈ విషయాలన్నీ 2018 March లోనే తెలుసు. అందుకే 2018 March తర్వాత కొత్త proposals ఏమీ చేయలేదు.. High court కూడా తాత్కాలికం అని చెప్పిన  కారణం ఇదే. High Court judges వచ్చే దారి కరకట్ట రోడ్డు ట్రాఫిక్ సాక్షిగా ఎవరైనా తెలిసిన  వారు ఉంటే నేరుగా వారినే అడగండి.

10) చంద్రబాబు చెప్పినట్లు self financing project అయితే ఈ 3 ఏళ్ళు ఎందుకు ఆ దిశగా వెళ్లలేదు ?
initial గా కావలసిన ఆ 40 వేల కోట్ల funding ఎక్కడ నుండి వస్తుంది ?

11) అసలు సిసలైన సమస్య.... అమరావతి లో వచ్చే roads ఇప్పటి పొలాల కన్నా 2 అడుగులు ఎత్తు వస్తాయి... అంటే basement ఇంకో 2 అడుగులు కనీసం ఎత్తు పెంచాలి అంటే కనీసం 4 అడుగులు. ఈ 4 అడుగులు 33 వేల  ఎకరాలలో పెంచాలి అంటే రైతుల వాటాగా ఎకరానికి అయ్యే కర్చు 30 నుండి 45 లక్షలు.  ఈ స్థోమత ఎంత మంది రైతులకి ఉంటుంది? కచ్చితంగా developers మీద ఆధారపడాల్సిందే . cellar  ప్రశ్నే ఉండదు. కారణం కృష్ణా నది ఊట వస్తుంది.

ఎవరినో Blame చెయ్యాల్సిన పని లేదు.

చివరిగా ,,,, సచివాలయం బయట కాపలా ఉండే drivers కి కూడా కనీసం tea తాగాలి అంటే మందడం వెళ్లాల్సిన పరిస్థితి ..... వచ్చిన investors 10 మంది మంత్రులను వారి చాంబర్స్ లో కలవాలి అంటే చూసిన వారికే ఆ పరిస్థితి అర్ధం అవుతుంది. అందుకే చంద్రబాబు అనేక మీటింగ్స్ విజయవాడ లేదా vizag hotels లో పెట్టారు కానీ సచివాలయంలో పెట్టలేదు.

చంద్రబాబు చేసిన ఏకైక తప్పిదం ఆ geographic location ఎన్నుకోవడం .. అదే గన్నవరం ప్రాంతం అయి ఉంటే సగం ఇబ్బందులు పోయేవి.... ఆయన అన్న మాట తాత్కాలిక కట్టడం అనేది నిజం...
అమరావతి శాశ్వతంగా తాత్కాలికం గానే మిగిలిపోతుంది.

No comments:

Post a Comment