Monday 23 December 2019

కలిసివుంటే కలదు సుఖం



Kalasi Vunte Kaladu Sukham - Telugu Songs - Melimi Bangaru - NTR - Savitri
Watch NTR Savitri's Kalasi Vunte Kaladu Sukham Telugu Old Movie Song With HD Quality Music - Master ...



వేణు గానమ్ము వినిపించెనే...చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే... మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా...

చిత్రం : కలిసివుంటే కలదు సుఖం
సంగీతం : మాస్టర్ వేణు
గీత రచయిత : ఆరుద్ర
నేపధ్యగానం : పి. సుశీల

మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా
మీ దేహములో చిరు లోపములున్నా ప్రేమ కరువౌనా

సింహము కాల్ళు చిక్కుపడిననూ శౌర్యము కొరవడునా -2
చేతలు మాటలు ఒకటే అయితే త్యాగము కరువగునా
త్యాగము కరువగునా - మేలిమి

కాళ్ళే లేని కమ్మని చమ్ద్రుడు నిరతము పయనించునే - 2
కరములు చాపే కలువను చేరి ముదము కలిగించునే
ముదము కలిగించునే - మేలిమి

పతి పదసేవా భాగ్యము నేనే సతతము నోచితినీ -2
మీ చల్లని మదిలో సౌఖ్యములొసగే స్వర్గము చూచితిని
స్వర్గము చూచితిని - మేలిమి

https://www.youtube.com/watch?v=Rj1KRoMTzIg

1 comment: