Tuesday 17 July 2018

అప్పుచేసి పప్పుకూడు (1959 )



చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959 ) 
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు 
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు 
గానం : ఘంటసాల, పి.లీల . 
********** 

ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ.... 
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ .... 
ప్రకృతినెల్ల హాయిగా 
తీయగా, మాయగా పరవశింపజేయుచు 
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 

జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ 
జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా ఆ ఆ ఆ .... 
మనసు మీద హాయిగా 
తీయగా, మాయగా మత్తుమందు జల్లుచు 
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 

హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ 
హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ . .. 
ప్రకృతినెల్ల హాయిగా 
తీయగా, మాయగా పరవశింపజేయుచు 
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 
ఈ చల్లని గాలి.
 

సి.ఐ.డి (1965)


నిను కలిసిన నిముసమున...నిను తెలిసిన క్షణమున...కనుల పండువాయెనే..

చిత్రం : సి.ఐ.డి (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

చరణం 1 :

ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే .. పరవశించి పోతినే..
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

చరణం 2 :

చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే.. మేను కందిపోయెనే..
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ... ఊ ఊ ఊ ఊ ...

https://www.youtube.com/watch?v=g6ASYRbxvGI
NENU KALISINA NIMISHAMUNA NINU TELISINA KSHANAMUNA.....CHITRAM:- C.I.D.1965.mp4
నిను కలసిన నిముషమున నిను తెలిసిన క్షణమున కనుల.......చిత్రం :- సి.ఐ.డి.1965 పాట గురించి :-గాయకులూ :- ...

Friday 13 July 2018

చుట్టాలున్నారు జాగ్రత్త (1980)




చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980) 
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా.. 
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా 
రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా.. 
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా 

వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది 
వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది 
మనసే వెంబడించింది...నిమిషమాగకా... 
మనసు వెంబడించిందీ..నిమిషమాగకా... 

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా....రివ్వంటుంది కోరికా..ఆ..ఆ.. 

చరణం 1: 

చెంతగా... చేరితే....చెంతగా చేరితే.. వింతగా ఉన్నదా 
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా... 
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా 

నిన్న కలగా ఉన్నది... నేడు నిజమౌతున్నది 
నిన్న కలగా ఉన్నది.. నేడు నిజమౌతున్నది 
అనుకున్నది అనుభవమైతే అంత కన్న ఏమున్నది 

ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది 
మనసు వెంబడించింది...నిమిషమాగకా... 
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా... 

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా.....రివ్వంటుంది కోరికా...ఆ..ఆ.. 

చరణం 2: 

కళ్ళతో... నవ్వకు...కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది 
గుండెలో చూడకు...గుబులుగా ఉన్నది... 
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది 

తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది... 
తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది... 
ఆ చూపుల అల్లికలోనే పెళ్ళిపిలుపు దాగున్నది... 

ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది 
మనసు వెంబడించింది...నిమిషమాగకా... 
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా... 

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా.. 
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా 

హ..హా...ఆ..ఆ... 

https://www.youtube.com/watch?v=pyDcAv8zsVQ
Chuttalunnaru Jagratha - Rekkalu Todigi
Nice song By Sridevi And Krishna

ప్రేమించి చూడు (1965)



వెన్నెల రేయి ఎంతో చలీ చలీ...వెచ్చనిదానా రావే నా చెలీ... 

చిత్రం : ప్రేమించి చూడు (1965) 
సంగీతం : మాస్టర్ వేణు 
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 

పల్లవి: 

ఓ...ఓ....ఓ...ఓ....ఓ...ఓ.... 

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ 
వెచ్చనిదానా రావే నా చెలీ 
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ 
వెచ్చనిదానా రావే నా చెలీ 

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ 
అల్లరి వాడా నీదే ఈ చెలీ 

చరణం 1: 

చూపులతోనే మురిపించేవూ .. 
చూపులతోనే మురిపించేవూ 
ఆటలతోనే మరిపించేవూ.. 
ఆటలతోనే మరిపించేవూ 
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా.. 
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా ... 
పొరపాటైతే పలకనులే... పిలవనులే... దొరకనులే.. ఊరించనులే... 

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ 
వెచ్చనిదానా రావే నా చెలీ... 
నా మనసేమో పదమని సరేసరే 

చరణం 2: 

నా మనసేమో పదమని సరే సరే.. 
మర్యాదేమో తగదని పదే పదే .. 
మూడు ముళ్ళు పడనీ... 
ఏడు అడుగులు నడవనీ ... 
మూడు ముళ్ళు పడనీ 
ఏడు అడుగులు నడవనీ 
వాదాలెందుకులే అవుననినా..కాదనినా..ఏమనినా.. నాదానివిలే... 

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ 
అల్లరి వాడా నీదే ఈ చెలీ.. 
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ 
వెచ్చనిదానా రావే నా చెలీ.. 

అహా...అహా..అహ..ఆ 

https://www.youtube.com/watch?v=Qm-0OCw3s9U
Vennela Reyi Song - Preminchi Choodu Movie Songs - ANR - Kanchana - Raja Sri
Watch Vennela Reyi Song From Preminchi Choodu Movie, starring Akkineni Nageshwara Rao, Kongara Jagga...

దేవదాసు (1953)



పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో...అల్లరి చేదాం చలో చలో... ఓఓఓ 

చిత్రం: దేవదాసు (1953) 
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్ 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: ఘంటసాల 

పల్లవి: 

పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో 
పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో 
అల్లరి చేదాం చలో చలో... ఓఓఓ 

పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో 
అల్లరి చేదాం చలో చలో...ఓ.. 
ప్రొద్దువాలే ముందు గానే ముంగిట వాలేమూ 
ప్రొద్దువాలే ముందు గానే ముంగిట వాలేమూ 

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో 
అల్లరి చేదాం చలో చలో 

చరణం 1: 

ఆటా పాటలందు కవ్వించు కొంటె కోణంగీ..ఈ..ఈ..ఈ.. 
ఆటా పాటలందు కవ్వించు కొంటె కోణంగి 
మనసేమో మక్కువేమో.. మనసేమో మక్కువేమో 
నగవేమో వగేమో.. కనులార చూతమూ..ఊ..ఊ.. 

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో 
అల్లరి చేదాం చలో చలో.. 

చరణం 2: 

నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో..ఓ..ఓ..ఓ.. 
నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో 
నా దరికి దూకునో.. నా దరికి దూకునో 
తానలిగి పోవునో.. ఏమౌనో చూతమూ..ఊ..ఊ.. 

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో 
అల్లరి చేదాం చలో చలో.. 

ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ..ఊ..ఊ.. 
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో 
అల్లరి చేదాం చలో చలో.. చలో.. చలో.. 

https://www.youtube.com/watch?v=MPFJcg0Diwc
Devadas Movie || ANR and Savitri || Palleku Podam Chalo Chalo Song
Wacth
--((**))--