Tuesday 17 July 2018

అప్పుచేసి పప్పుకూడు (1959 )



చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959 ) 
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు 
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు 
గానం : ఘంటసాల, పి.లీల . 
********** 

ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ.... 
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ .... 
ప్రకృతినెల్ల హాయిగా 
తీయగా, మాయగా పరవశింపజేయుచు 
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 

జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ 
జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా ఆ ఆ ఆ .... 
మనసు మీద హాయిగా 
తీయగా, మాయగా మత్తుమందు జల్లుచు 
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 

హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ 
హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ . .. 
ప్రకృతినెల్ల హాయిగా 
తీయగా, మాయగా పరవశింపజేయుచు 
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి 
ఈ చల్లని గాలి.
 

No comments:

Post a Comment