Tuesday 26 March 2024

మనసమ్మెడి రవళితగా   

క్షణమొక సఖ్యత పిలుపుకు క్షేమము కొరకే 

వణకు చమట లూరుకళలు   

వినదగు దువ్వుచు నె కొంత విస్తరి ఐగుతాం  


నయన మూలాంచలములు స్విన్నంబు లయిన

గాల మేసేటి యీ ప్రాలు గాలికులుకు      

కారణంబెయ్యది వినోద కంటకంబు 

తనువు మార్చలేనివయసు తనము చేష్ట    

  

వనితాబిగువుల కళ కను

గొణలను వాత్త్సల్యరసము కురియగ ప్రేమా  

కనుగొని ముద్దాడి చనువు 

కొనియెను తృణపరిమళముతొ గుర్తింపు కళల్    

    

సొగసు కళలకు బడలిక సొలుపు లేక 

కోక తడియారక  ఎగసి కోర్క పొగరు 

మగువ తెగువును ముద్దాడి మెడల లేక  

మరల యెంతటిప్రేమార్ద్ర మామెమనసు!          


ఓరగ చూపుల సొగసులు

వరమై లలిత సుఖజూపు వరదై పొంగెన్ 

తరుణము తరించ పిలుపై 

కరువేతీర్చుము వలువలు కేళీ పిలుపున్

 

***

*దివ్యత్వం*

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు.  కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.

ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద. వేదాలు పదేపదే చెప్పే విషయం.

దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.

శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని(శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.

ఏ అవకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం.

ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు- అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.

శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.

మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం నేను కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.

ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయు ష్మంతులుగా ఉండాలి.

పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు.

శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.

నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవ కాశం ఉంది అందరికీ.

జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది.

మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది.

దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.

దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు.

ఇలాంటి దివ్యానుభవాల ఇంద్రధనుస్సు చిదాకాశంలో వెళ్ళివిరియాలని ఆయన అభిలాష.

***

*ఆత్మ*

1) విడిచిపెట్టటానికీ వీలులేనిది..పట్టుకొనటానికీ వీలులేనిది.

మనకన్న వేరుగా నున్న వస్తువుని మనం పట్టుకుంటాం.. అవసరం లేదనుకుంటే విడిచిపెడతాం. ఆత్మ మనకన్న వేరైన వస్తువు కాదు. వేరైన భావమూ కాదు. అది నేనే అయినప్పుడు ఎలా విడిచిపెట్టటం... ఆత్మనైన నేను నా శరీరాన్ని విడిచిపెడతాను.. ఆలోచనలను విడిచిపెడతాను, మంచిభావాలను.. చెడ్డభావాలను విడిచిపెడతాను - చుట్టూ ఉన్న వస్తువులను, వ్యక్తులను, వారి తోటి గల బాంధవ్యాన్నీ విడిచిపెడతాను. నాలో ఉన్న వాసనలు, కర్మఫలాలను కూడా విడిచిపెడతాను జ్ఞానం పొంది; కాని నన్ను నేను ఎలా విడిచిపెట్టగలను. కనుక ఆత్మ విడిచిపెట్ట వీలులేనిది, 'అహేయం'.

అలాగే నాకన్న వేరుగా నున్న వస్తువులను పుస్తకాన్ని, పెన్నుని, కుర్చీని, బల్లని, మనిషిని, దొంగను - దేన్నైనా పట్టుకోవచ్చు. అలాగే ఆత్మనైన నేను ఈ దేహాన్ని పట్టుకున్నాను. ఈ మనోబుద్ధులను పట్టుకున్నాను. వాసనలను పట్టుకున్నాను. కాని ఆత్మను (నన్ను) పట్టుకోవటం ఎలా.. నన్ను నేనే పట్టుకోవటం ఎలా.. నా దగ్గర లేని దాన్ని నేను పట్టుకోవచ్చు. నాకు దూరంగా నాకన్న వేరుగా నున్నదాన్నీ పట్టుకోవచ్చు. అసలు నేనే అయినదాన్ని ఎలా పట్టుకోవటం.. కనుక ఆత్మను విడిచిపెట్టే వీలులేదు. పట్టుకొనే వీలులేదు. నేను శరీరాన్ని అనుకుంటే ఆత్మ నాకన్న వేరుగా ఉన్నట్లే గనుక పట్టుకోనూవచ్చు.. విడిచిపెట్టనూ వచ్చు. నేను శరీరాన్ని కాదే. అలా అనుకోవటం అజ్ఞానమే. కనుక 'అనుపాదేయం' పట్టుకొనే వీలులేనిది.

2) మనోవాచాం అగోచరం:-

మనస్సుకు వాక్కుకు అందనిది. ఆలోచనల ద్వారా అందుకోలేనిది. ఏదైనా ఒక వస్తువో ఒక వ్యక్తియో ఒక విషయమో ఒక భావమో ఉంటే దానిని గురించి మనస్సు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువూ కాదు వ్యక్తీ కాదు విషయమూ కాదు భావనా కాదు. పైగా ఒక తెలిసిన విషయాన్ని గురించి మనస్సు ఆలోచించ గలుగుతుంది. మరి ఆత్మ తెలిసిన విషయం కాదే అసలు విషయమే కాదు గదా. అలాగే తెలియని విషయాన్ని గురించైనా ఆలోచించి తెలియ లేదు అనైనా అనుకుంటాం. మరి ఆత్మ తెలియని విషయమా.. కాదే. అది తెలిసిన దానికి తెలియని దానికి వేరైనది గదా కనుకనే మనస్సుకు అందదు. అగోచరం. మనస్సుకు అందిన వాటినే మాటల్లో చెబుతాం. భాష నుపయోగించి శబ్ద శక్తితో చెబుతాం. మనస్సుకు అందని దానిని వాక్కుతో ఎలా చెప్పటం.. కనుక వాక్కుకు అగోచరం. అసలు ఇంద్రియాలు అన్నింటికి అగోచరమే.

ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో చెప్పటం జరిగింది. "నతత్ర చక్షుర్ గచ్ఛతి, నావాగ్గచ్ఛతి, నమనః..." అని. కళ్ళు, వాక్కు, మనస్సు అక్కడకు పోలేవు అని. ఆత్మయే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉండి ఆ ఇంద్రియాలు పనిచేయటానికి శక్తి నిస్తున్నది. అట్టి ఆధారమైన ఆత్మను ఇంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి.. మనం మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తుంటాం. పొలం అంతా మనకు కనిపిస్తుంది. అయితే మనం కూర్చున్న మంచెకు ఆధారంగా ఉన్న కొయ్యబాదుల్ని చూడగలమా.. చూడలేం. కనుకనే 'మనోవాచాం అగోచరం' అనటం.

3) అప్రమేయం:-

సాటిలేనిది. మరొక దానితో పోల్చటానికి కొలవటానికి అసలు రెండవ వస్తువు లేదు. సత్యవస్తువు ఆత్మ ఒక్కటే. సత్య వస్తువును అసత్య వస్తువుతో కొలవలేము.

ఇక్కడ ఒక బస్తా బియ్యం కుమ్మరించి మిమ్మల్ని కొలవమన్నాను. దేనితో? మానికలతో. అలా కొలిచి ఎన్ని మానికలో చెప్పాలి. ఓ.. ఇంతేగదా.. అని అందరూ పైట బిగించారు. అయితే ఒక షరతు చెప్పాను. మీరు కొలవవలసింది రాత్రి కలలో కనిపించిన మానికలతోనని అంతే ఆగిపోయారు. మీరేమైనా తెలివి తక్కువ వారా.. రాత్రి నాకు మానిక కలలోకి రాలేదండి. ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు అన్నారు. సరే. అయితే ఇదిగో ఈ మానికతో కొలవండి అని ఒక పేపరు మీద మానిక బొమ్మను గీచి చూపించాను.  మరి కొలవగలరా. సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేం. కనుక ఆత్మను దేనితోనూ కొలవలేం. అన్నీ అసత్యవస్తువులే గనుక.

4) ఆద్యంత రహితం:-

పుట్టుక చావులు లేని నిత్యసత్యం ఆత్మ, అనంతం. దానికి ఆది అంతం అనేవి ఉండవు.

5) మహ:-

తేజో రూపం. రూపం లేదు. తేజస్సే దాని రూపం. అదీ కనిపించని తేజస్సు. ఈ కన్నులు చూచి తట్టుకోలేవు. కనుకనే అది కన్నులకు కనిపించదు. 

6) అహం పూర్ణం బ్రహ్మ:-

అట్టి పరిపూర్ణ బ్రహ్మమును, పరమాత్మను, శుద్ధ చైతన్యాన్ని నేనే, నాలో ఉన్న ఆత్మ అనటం తప్పు. నేనే ఆత్మను. నాలో ఇంకేమీ లేదు. కాకపోతే నేను దీనిలో ఉన్నట్లుగా భావన.. అంతే.

***

Monday 25 March 2024

సోమవారం పద్యాలు, కథలు

 శుభోదయంa***

మిత్రులందరికీ  హోళీ పండుగ శుభాకాంక్షలు 


సోమవారం ప్రాంజలి ప్రభ పద్యాలు 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ, Rtd. Accounts officer, 


శీర్షిక -హోళి.. తేటగీతి మాల 


హృదయ సంబరాలానాంద హాయి గొలుపు  

కోయిలమ్మ రాగం కళ కొత్త వెలుగు 

ఏడువర్ణాల జల్లులు యెల్లరాడు 

ధ్వనుల కోలాహలముగాను ధరణి యందు 


మధురస తరంగ చేష్టలు మానసమ్ము 

అదియు హోళి సంబరమేను యల్లరవదు 

మంజరి సుగంధ పరిమళం మధుర కళలు 

భరత ఖండ మందున జనం భలిరె యాట 


బాల బేలా కలసి వసంతాలు చల్లు

కరుణ కవ్వించు కుంటూను కదలి యాడు 

ఇదియు భిన్నత్వ  యేకత్వ ఇచ్ఛ యాట 

సంస్కృతియు ఉత్సాహపుకేళి సౌరుభమ్ము 


పడుతులు ఎగిరెగిరికేళి  పడుతు యాడు 

లయలు సంతోష సంబరాలకళ యదియు 

పలకరింపుల కళలతో పలుకు కేళి 

పూల బంతులన్నివిసిరి పూజ్యు లాట 


అలక ఆత్మీయ యనురాగ ఆట యదియు 

హరిహరులతొ బృందావనం హోలి కళలు 

భారతీయ పర్వదినము భజన లీల 

దాగియున్న మహత్వమ్ము దారి తెలుపు

***


సీస పద్యమాలిక 


మధువనిలో లీల  మధుమాస రంగులే 

మాధవ చిరుహాస మాయ మెరిసి 

పువ్వులే నవ్వులై పున్నమి కలువలు

వెల్లువెత్తెడికళ వింత మెరుపు 


 పుప్పొడి రంగులు పురమునజల్లిరి 

గోపెమ్మ కళకళ గొప్ప లీల 

బుగ్గలు ఎరుపెక్కె బుద్ధులు పరుగులై 

వాడలన్ని మురిసె వరద పొంగు 


పొదపొదలో రొద పోరుగా యాటలే 

రత్నాల కాంతులు రంగుజల్లె

నగధారి పలుకుల నటనల కళకళ 

నవ్వినదే రంగు నటన కళలు 


వన్నెలొలక వేళ వర్ణము లే జల్లు 

కాముని పున్నమి కళల వేళ

కొంటెవాని చిలుకు  కొసరి అల్లరిలోన 

జంటకలిసెకధ జాతి నందు


చిమ్మినదేను విచిత్ర రంగులకళ 

వెంటబడి వనిత విలవిలవల 

తడిపినదె తడిపి తకధుమ యాటలు 

రాచకేళియంబర రంగుల కళ

***

కం..నరుడై సహకారముగన్ 

హరుడై సహనమ్ము మానవాకారముగన్ 

సిరులే యందించు కళల్ 

హరిమాయ పరమ్ముగా యధార్ధమ్ముగనెన్

***


శా..ఆదిత్యా సకలమ్ము నీ దయ సమానమ్మేను సద్భావమే 

వేదమ్మే తెలిపే విధమ్ము సహనం వేదాత్మ నిర్వాహమే 

నీ దాతృత్వముగాను మేము బ్రతికే నీశక్తి మమ్మేలుటే 

సాదాతత్త్వముగానుసాగు విధిగా సాధ్యమ్ము సర్వమ్ముగన్


శా..రాధాకృష్ణుల కేళివేడుకమనో రక్తీ యతీతం వసం 

తా ధారా ఋతువై సుహాసినివేదాంతమ్ము కోలాహలం 

ప్రాధాన్యమ్ము కళేను హోలి రమణీ ప్రాబల్య ప్రేమమ్ముగా 

చేదేతీపిగనే మనస్సు కదిలీ చిందేసె రంగుల్ కళే 


శా..చిన్నారుల్మది చేష్టలే చిలిపిగా చింతల్లొ చిన్మాయగా

పన్నీరుల్మది నిత్య మాటలగుటే పంతమ్ము యాటల్లుగా 

వెన్నాముద్దలనే తినేటి కళలే వేళల్లొ చూపేనుగా 

వెన్నెల్లో విహరించు నేస్తములతో విందుల్లొ గోపాలుడే


ఉ..రంగుల హోలికేళియగు రమ్యత లోకము జూప కల్గుటే 

రంగులు రాసి యాటలగు రత్నపు కాంతులు వెళ్ళు వవ్వుటే 

రంగుల హావభావములు రవ్వల మెర్పులు సందడేయగన్ 

రంగుల యాటలై రమణి రాజ్యపు లీలలు హోలి పండుగే


ఉ..ముద్దర జీవమేయగుట ముఖ్యమనోగతి కాల మాయగన్ 

ప్రొద్దున మేలుచేయుటయు మ్రొ క్కెద గుర్వుకు తల్లి తండ్రికిన్

ఒద్దిక పొందగల్గెడిది నొయ్యది నేస్తము నిర్మలమ్ముగన్ 

పెద్దల గౌరవించు మది భిన్నము కాకయు ప్రేమ జూపుటన్

****

సోమవారం ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ 


*🌹🎨  హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival,  Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All.  🎨🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*ప్రాంజలి ప్రభ 


*. హోళికా పూర్ణిమ / కాముని పూర్ణిమ ఎందుకు ? *

*🍀🎨. హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? 🎨🍀*


*తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి.  హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ,  ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.*


*🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀*


*రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు.  హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.*


*ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ  వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.*


*ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది.  కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగ పురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.*


*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.*


*🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀*


*శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.*

***

సేకరణ... ప్రాంజలి ప్రభ కథలు


ప్రాంజలి ప్రభ సోమవారం కధలు 

మల్లాప్రగడ రామకృష్ణ 

 

*నీకంటూ ఒకరు ఉన్నారా 


నీకంటూ ఒకరు ఉన్నారా  ఈ ప్రపంచంలో ఎవరైనా అంటే నీకు తెలియకుండానే ఇద్దరు ఉన్నారు  ఒకరు  ( తల్లి  ) మరొకరు ( దైవం ) .ఈ లోకంలో మనకంటూ ఒకరుండాలి.


పసితనంలో- అమ్మ ఉంటే చాలు. అన్నం లేకపోయినా ఫరవాలేదు. అన్నీ లేకపోయినా ఫరవాలేదు. అయితే అది కొంతవరకే. ఆ తరవాత మన అవసరాలకు అమ్మ చాలదు. ఎందుకంటే తెలివిమీరిన మనిషికి ప్రేమ ఒక్కటే చాలదు. అమ్మప్రేమ ఒక్కటే చాలదు. అందుకే అమ్మలా ఒకరు కావాలి- అమ్మకంటే మిన్నగా అవసరాలు తీర్చేవారు!


మనలోనే మన అణువణువునా ఉన్నాడంటే మనం నమ్మగలమా? కానీ తప్పదు. ఎందుకంటే... ఉన్నాడు.


మన అర్హతానర్హతలు ఆయనకు అవసరంలేదు. మన స్థితిగతులతో ఆయనకు పనిలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సకలం సమకూర్చిన మావిని బొడ్డుకోసి అవతల పడేసినట్టు, మనల్ని సృష్టించి పోషిస్తున్న భగవంతుడి ఉనికినీ మరచిపోయినా, అసలు గుర్తించకపోయినా- ఆయన మాత్రం మనల్ని వదలడు. అందుకే ఆయన ఉన్నాడు, ఉంటాడు. అంతే!..


90% అందరూ చేసే తప్పు ఇదే ఏవో ఏమో కావాలని పరుగులు తీస్తారు జీవితం చివరికి వారికి మిగిలింది ఉట్టిపోయిన శరీరం రోగాల కుప్పతో నిండిన శరీరం చీదరించుకున్న కుటుంబ సభ్యులు ఒక రోజు కబీర్ దాస్  ఒక ఊరిలో ఉండగా.. 

ఆ ఊరి ధనవంతుడు తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు. 

కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. ‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు. 


వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. కానీ, 


అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు.


 ‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు.


తెలియదని తల ఊపాడు యజమాని. ‘‘ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’  అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు. 

ఆత్మ, పరంగా అందరిలో ఉన్న భగవంతుడు మాత్రమే శాశ్వతం. 


ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు. 


ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు. 


మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు...

........

సోమవారం ప్రాంజలి ప్రభ  కధలు 

సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ 

 

వివేక వాణి   ( తేచ్చుకోవలసింది  బిక్ష కాని తిట్లుకాదు )


సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు . 


మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది . 


ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు . 


పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు . 


మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు . 


పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు . 


వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .  


ప్రశ్న - సమాధానం 


----------------


ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?


స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .


ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?


స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .


ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను  తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు . 


స : నిజమే స్వామీ !


మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం .( మనిషి నైజం ).


***

Sunday 24 March 2024

ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు

 

నేటి ఉదయ పద్యాలు 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ.. ప్రాంజలి ప్రభ 


తేనె టీగ కృషియెనిజం తప్పు కాదు 

బాటసారి కి తీపిగా బాగు జేయు 

కూడబెట్టి యందించుతూ కుమిలి పోదు 

కాల ధర్మము బట్టియే కదులు చుండు 

***

కట్లపాము చూడ భయము కదల గలుగు 

తూట్లు తూట్లుగా చంపేది తుచ్చ బుద్ధి 

నోట్ల కట్టలు చూడగా నోటిమాట 

కట్లు తెంచిన యాంబోతు కదల గలుగు 

***

రాలిపోవు పూలు ప్రకృతి రమ్య తయది 

నేలకొరుగు చెట్లు ప్రకృతి నిజమునిజము 

జాలిగుండె బ్రతుకు నిత్య జగతి వేట 

కూలి పోవ యాధునికమ్ము కూడు యాపె 

***

మల్లెపూలవంటి వయసు మనసు గెలుచు 

మాయమాటలన్నియు తెల్పు మగని తోడ 

మొగుడులేని బ్రతుకుమోజు మొండి గుండ 

సగటు మనిషి సంబరములు సమర మెండ

***

చిన్న దీపమ్ము పోగొట్టు చీకటులను

మంచి మాట యనుకరణ మాయత రుము 

నంత మొందించు నజ్ఞాన మను తమము 

ఎట్టి విద్యను లేక శోభించలేవు

***

బాధలోన ఓదార్పుయే బంధ మగును 

బతికి బతికించు బుద్దియు బలము యగును 

విధము యేదైన వినయుము విలువ గనుము 

కలము గళముతో తెలుపుము కాల గమన

***

అంగనా కదలిక వేగ కథలు గాను 

చూడ సుందరీమణులగా చూవు గాను 

చక్కనైన హావ భవము చంచెలిగను 

ఆనటిగ గంధ పరిమళం ఆత్మ తృప్తి

***

ప్రకృతి చూపినా యాసల ప్రాభవమ్ము 

ధనము కోరి వికృతి చేష్ట ధరణి నందు 

ద్రాక్ష పండక పండించు దారి గతియు 

రోగ భయముతో జనులెళ్ళ రొప్పు యేల

***

జన్మన యేవిద్య యేరూప జాగృతి మనసు మార్పు తీరే 

వెన్నెల యేనీడ కాంతుల్ల విద్యల గమనమేను మారే 

మన్నన సద్బోధ సామ్మోహ  మాయగ మనసు మార్పు కోరే 

అన్నము జీర్ణమ్ము నిత్యమ్ము యాకలి పిలుపు లమ్మ దేవీ

***

సూర్యుడు సాక్షాత్తు దర్శించు సూత్రధర భవభావ దేవా 

ఆర్యుడు యాద్యంప్రభావమ్ము యానతి సకలసేవ దేవా 

సౌర్యుడు సర్వమ్ము గమ్యమ్ము సోదన వినయ లక్ష్య దేవా 

వీర్యుడు విశ్వమ్ము విజ్ఞాన విద్యల కళకళమ్ము దేవీ 

**-

సమస్య:

ముట్టియొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్

ఉ.

పట్టిన తీపి చేదగుట పాకము మాదిరి పాడుయే యగున్ 

పట్టక పోయినా కళల పాఠము కాలము తీర్పుయే యగున్ 

గట్టిగ నన్నమాటవిని గానము చేయుచు లీద్దరీ గతిన్ 

ముట్టియొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్

****

ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ రామకృష్ణ 


తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!


కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు.

తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….


“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”


“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు.


“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”.


internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.


తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”


” ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు.

“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…

ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”,

అంటూ వివరించే ప్రయత్నం చేశాడు.


అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!


“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను.

ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.


నీకు తెలుసు నేను ఒంటరివాడిని.

నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే.

నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.


రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు.

నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.


కొన్ని రోజుల క్రితం…

అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది.

మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.


నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా?

పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా??

కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా???


ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే…

నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!


నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం.

నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?

కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి.


టెక్నాలజీ ఉండాలి కానీ…

అది మాత్రమే జీవితం కాకూడదు !

దానికి మనం బానిసలం కాకూడదు!


మనుషులతో జీవించండి…..

పరికరాలను వాడుకోండి…..


” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,

వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “….


( ” తెగిపోతున్న మానవ సంబంధాల”

గురించి ఒక్కసారైనా అలోచించండి.)


ప్రాంజలి ప్రభ కథలు 

Please share this...

...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼


ఆదివారం ప్రాంజలి ప్రభ కథలు 

మల్లాప్రగడ రామకృష్ణ 


```ఒక రాజ్యంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను రాజభవంతి దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవంతిలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు.


ఒకరోజు రాజుగారు ప్రజలందరికీ విందు ఇస్తున్నారు అనే వార్త విన్నాడు.

ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది.

తన దుస్తులు చూసుకున్నాడు అన్ని చిరిగిపోయాయి. ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు.

రాజభవనము దగ్గరకి వెళ్లి కాపలా వారిని బ్రతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు.

ఎంతో ధైర్యం కూడగట్టుకొని, చాలా వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు.

అతన్ని చూడగానే రాజు. “నీకేమి కావాలి?” అని అడిగాడు. 


దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు….

“రాజా! నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి."


రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ “ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు, మరకలు అంటవు. ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు” అన్నాడు.


బిచ్చగాడి కళ్ళ వెంట నీరురాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు.

వెంటనే ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని ధరించి అద్దములో చూచుకొని మురిసిపోయాడు బిచ్చగాడు.


అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజు గారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది.


ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంటనే ఉంచుకొని తిరిగేవాడు. ఎందుకంటే రాజుగారి దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని.


రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు కూడా తనకి ఆనందంగా లేదు. బైట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారవేస్తారేమో అని భయం తనకి.

క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు, అవి కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారంతో ఆ మూటను మాత్రం అస్సలు వదిలేవాడు కాదు. అతని తోటి వారు అతనిని చూసి, ‘ధరించిందేమో రాజుగారి దుస్తులు మోసేదెమో పాత గుడ్డలు!’ అని హేళన చేస్తూ “పీలిక గుడ్డల మనిషి” అని తనకి పేరు పెట్టారు.


చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి మంచం పై నుండి లేవలేక పోయేవాడు. పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న పాతబట్టల మూటను చూశారు. అది చూసి, ఎంతో విలువైన చిరగని తరగని దుస్తులు ధరించినా కూడా బిచ్చగాడికి ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి, ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా! అని బాధ పడ్డారు.```


ఇందులోని నీతి :

```ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం అందరమూ కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా ఇప్పటికి ఎప్పటికి అలానే మోస్తూ ఉంటున్నాము.

మనం మోస్తున్న మూటలో ఉన్నవి, అవి ఏమిటంటే శత్రుత్వము, ఈర్ష్య, ద్వేషము, కోపము, మన భాధలు మొదలగునవి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు. అంతే కాదు ఈ భావనలతో మాటి మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని గుర్తుతెచ్చుకుంటూ జీవితంలోని అందమైన, సంతోషమైన వాటిని అనుభవించలేకపోతున్నాం,

ఇలా ఉంటే జీవితంలో వేటినీ గుర్తించలేము ఆనందించలేం కూడా! ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటనలను ఎక్కడకిక్కడ, ఎప్పటికప్పుడు వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూటలాగా, ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, మనలోని అశాంతికి కారణము.


ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ రామకృష్ణ 


తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!


కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు.

తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….


“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”


“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు.


“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”.


internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.


తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”


” ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు.

“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…

ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”,

అంటూ వివరించే ప్రయత్నం చేశాడు.


అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!


“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను.

ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.


నీకు తెలుసు నేను ఒంటరివాడిని.

నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే.

నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.


రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు.

నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.


కొన్ని రోజుల క్రితం…

అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది.

మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.


నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా?

పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా??

కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా???


ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే…

నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!


నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం.

నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?

కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి.


టెక్నాలజీ ఉండాలి కానీ…

అది మాత్రమే జీవితం కాకూడదు !

దానికి మనం బానిసలం కాకూడదు!


మనుషులతో జీవించండి…..

పరికరాలను వాడుకోండి…..


” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,

వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “….


( ” తెగిపోతున్న మానవ సంబంధాల”

గురించి ఒక్కసారైనా అలోచించండి.)


ప్రాంజలి ప్రభ కథలు 

Please share this...

...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼



 

ఓ సినిమా కథ 

(1 ) ఆకాశం మేఘకృతం, ఎతైన భవనాలనుతాకుతున్నట్లు ఉన్నాయి, ఆ భవనాలపై కొందరుపిల్లలు  ఆడుతున్నారు, మరికొందరు గాలిపటాలు ఎగరేస్తున్నారు, గాలిపఠాలతో సమానంగా విమానాలు ఎగురుతున్నాయి. అప్పుడే పైకి వచ్చి వాచ్ మెన్ వచ్చి మీరందరు ఇక్కడ ఉండకండి, ఇక దిగిపోండి అని  గట్టిగా అరిచాడు, ఆమాటలకు అందరూ క్రిందకు దిగారు, తలుపులు తాళాల వేసి వెనక్కి పొయ్యాడు. 

అప్పుడే చీకటి పడుతున్నది, విద్యార్థులు కొందరు బైకుల్లో వచ్చారు, వాళ్ళతో కొందరమ్మాయి లు కూడా ఉన్నారు, ఇది ఒక అప్పార్ట్మెంట్ ఇతరులను లోపలకు రానియ్యరు అని ఆపాడు, వాచ్ మెన్ .   నేను ఇక్కడే ఉంటాను,  అంటూ ఒకతను ముందుకొచ్చి నేను గెట్ టుగెథెర్  సందర్భముగా పిలిచాను, అయితే అందరి పేర్లు,  వెహికల్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు ఇందులో వ్రాయండి అని బుక్ ఇచ్చినాడు అంటే అందరూ వ్రాసి సంతకాలు పెట్టారు. అంతా చీకటిమయం దూరంగా వాహనాల శబ్దాలు వినవస్తున్నాయి. 

పార్టీ లో విద్యారులు బాగా త్రాగి పాడుకుంటున్నారు 

ఎంత మధురం, మరచి పోని ఆనందం మనలో 

సంతసమ్ము వేళాయే, అమానందరి మదిలో 

  

తొలి పొద్దు మేలు గొలుపు, మలి రాత్రి ముద్దు సలుపు, 

తొలి కాంతి ఆశ మెరుపు,  మలి హాయ్ సద్దు వలపు 

తొలి సేవ నిత్య మెరుపు,  మలి మాయ వద్దు గెలుపు 

తొలి  పూజ రక్తి తలపు,  మలి వెన్నె లద్ది  మలుపు  


తొలి వేళ వెచ్చ దనము, మలి నీడ చల్ల దనము 

తొలి గంధ పచ్చ దనము, మలి మౌన సేవ తనము 

తొలి హంస పంచు దనము, మలి హంస ప్రేమ తనము      

తొలి వంట ఇచ్చు తనము, మలి పంట  వెచ్చ తనము 


ఎంత మధురం, మరచి పోని ఆనందం మనలో 

సంతసమ్ము వేళాయే, అమానందరి మదిలో 

కాంతి కిరణం చల్లదనం తరుము, ప్రేమ మాధుర్యం కోపం తరుము, మత్తులో మనం మనం మరిచెదము, మనము ఒకరికొకరం పంచుకుందాము, అంటూ ఊగి పొయ్యారు. వాళ్ళు  

***

  తెళ్ల వారుతున్నది అప్పుడే ఎత్తైన భవనం మీద నుండి ఎవరో దూకారు, పడటంతోనే ప్రాణం కోల్పాయారు, వాతావరణం ప్రశాంతం ... 

తెల్లారాక పాపర్ బాయ్ వచ్చాడు చూసి భయంతో వెనక్కి వెళ్ళాడు పోలీసులకు ఫోన్ చేసాడు..., పాలుతెచ్చిన వాడు " అరవటం " వాళ్ళం అందరూ క్రిందకు దిగారు, నలుగురు నాలుగు రకాలుగా మాటలు వెలువడినాయి. అప్పుడే పోలీసులు వచ్చారు అందర్నీ ప్రశ్నల వర్ష కురిపించారు. అక్కడ వున్న యజమానులతో 

***

" అందరూ ఒకే మాట మేము చూడలేదు ఆమె ఎవ్వరో మాకు తెలియదు అన్నారు"   

మరలా గద్దించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ 

ఆమె మీకు తెలియదా 

ఏమంటున్నారు, నన్ను నమ్మమంటారా అని గట్టిగా లాఠీ ఝళిపించాడు 

అక్కడ ఉన్నవారిలో ఒకడు ఈమె రోజూ కారులో వస్తుంది ఎక్కడినుండి వస్తుందో తెలియదు ఫోర్త్ బ్లాక్ లో 420 ఎపార్టుమెంటులో ఉంటుంది అన్నాడు ఒకడు.

అవును మీకందరికీ తెలుసు ఈమె చెప్పండి లేదా అందరిని స్టేషన్ లో పెట్టి మా ప్రకారము అడగమంటారా అని గద్దించాడు. 

అప్పుడే ఒక వ్యాను వచ్చింది శవాన్ని పరిశీలించి చుట్టూ గుర్తులు గీసి వ్యాన్ ఎక్కించారు 

అప్పుడే అపరిగెడుతూ మా అమ్మాయి అంటూ ఒకతను వాచ్చి మా అమ్మాయిని ఎవరో పై నించి తోసేశారు అని ఏడవడం మొదలు పెట్టాడు. 

అన్ని విషయాలు మేము తెలుసుకుంటాం, ముందు మొరు ఏడుపు ఆపండి, మా ప్రయత్నం మమ్మల్ని చెయ్యనివ్వండి, మీరు వ్యానులో ఎక్కండి, డాక్టర పరీక్షా చేసి, ఎఫ్. ఐ. ఆర్. నోట్ చేసి,  అన్ని వివరాలు కోర్టులో తెలిపాక శవాన్ని ఇస్తాము. మీరు ఏడవకండి, మాతో సహకరించండి అన్నారు. 

ఎస్ . ఐ . రామకృష్ణ మరలా వస్తాము, మీ అందరి సహకారం కావాలి అని అడిగాడు 

అందరూ ముక్తకంఠంమ్ముగా మీరు ఎప్పుడన్నా అడిగినా తెలుపగలము అన్నారు వారు.

ఆడవాళ్లు మరణానికి కొందరు భర్తలు కారణం అవుతున్నారు అని ఒకరు చెప్పడం మొదలు పెట్టారు   

అప్పుడే వ్యాను బయలుదేరే ముందు పత్రికా విలేకరులు ప్రశ్నలవర్షం కురిపించారు. ఎస్ ఐ రామకృష్ణ చెప్పాడు, మాపనికి అడ్డురాకండి అన్నీ మీకు వివరించగలను త్వరలో  .

420 యపార్ట్మెంటూ తాళం పగలగొట్టి లోపల అన్నీ వెతికారు, ఒకచివర ఖాళీ మందుసీసా, గ్లాస్ జాగర్తగా తీసుకొచ్చారు. 

ప్రక్క ఇంటిలో వారిని పోలీసులు అడిగారు కస్తూరి గురించి చెప్పండి. 

నిన్న చాలామంది విద్యార్థులు వచ్చారు వారితో ఈమె కూడా పాల్గొన్నది, రాత్రియేమైనదో మాకు తెలియదు అనిచెప్పారు. విద్యార్థులను ప్రశ్నించేందుకు వెన క్కొచ్చారు పోలీసులు.

అక్కడ విద్యారులు లేరని తెలిసి మరలా 420 రూంలోకి వచ్చారు పోలీసులు, వెతకటం మొదలు పెట్టారు,  మరలా అక్కడ ఒక మూల డైరీ కనబడింది, కొన్ని పేజీలు ఏదో వ్రాసినట్లు  గమనించగలరు ఆ పోలీసులు, చదవటానికి ప్రయత్నించిన అర్ధం కాలేదు నిపుణులద్వారా చదివిద్దామని తీసుకు వెల్లారు వారు. ఇంకా వెతుకుతున్నారు.

 "నాలో నేను నిర్ధారణ చేసుకోలేక, నన్ను నేనుగా నమ్ము కోలేక, జరిగినది చూసీ ఎవ్వరికీ చెప్పలేక, రాజకీయము ఇంత దుర్మార్గమా నమ్మించి మోసం చెయ్యటమా, ఇంకా ఇంకా కావాలని వేంపర్లాడు బుద్ధి ఎందు కిచ్చాడో దేవుడు, ఓట్లకోసం నోట్లు పంచడం సర్వసా ధారణం, వారు మానవులను నమ్మించి, ఏడిపించి, కుక్కకు వేసే బిస్కెట్లులా కొన్ని వరాలు ఇచ్చి లొంగ దీసుకుంటున్నారు. అందులో హరిచంద్ర ప్రసాద్ (మంత్రి) లాంటి వారు రాజకీయములో ఉండటమే ద్రోహం,  ఒక వైపు ప్రేమకురిపిస్తూ అడ్డు వచ్చిన వారిని చంపుతున్నాడు. అందులో నేను కూడా వున్నాను కారణం మంత్రి కొడుకు నాతోటి స్త్రీని బలాత్కరించి చంపటం నాకళ్ళు చూసాను అప్పటి నుండి నన్ను వేడుకుతున్నాడు అతడు. అని వ్రాసియున్నది డైరీలో " 

మంత్రి పై కేసుపెట్టారు కస్తూరి తండ్రి. 

కోర్టులో వాదోపువాదాలు జరిగాయి, మంత్రి నిరపరాదని నిర్ధారణ కొచ్చారు జడ్జిగారు. తీర్పు చెప్ప బోతున్నారు.

లాయరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కుమారుని ప్రశ్నించాల్ని అనుమతి కోరారు అంటూ ఒక పత్రం అంద జేశారు.

వెంటనే ఈ కేసు రెండు రోజులకు వాయిదా వేస్తున్నాను అని ముగించారు.

ఎటువంటి ఆధారాలు చూపలేకపోవడం మంత్రి కొడుకు కూడా నిరపరాదని నిర్ధారణ అయింది. 

అప్పుడే కస్తూరి తండ్రి గట్టిగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నాకు అనుమతివ్వండి నేను నిరూపిస్తాను అన్నాడు. 

బోనులోకి వచ్చి చెప్పండి అన్నారు జడ్జి గారు. 

యీ ఆడియోను విని మీరు తీర్పు చెప్పండి అన్నాడు.

ఆడియో అంతా మంత్రి, మంత్రి కొడుకు సంభాషణలు వా రుచేసినతప్పులు వాక్కులు అవి విన్నారు జడ్జిగారు.

దాన్ని లాయర్ కిచ్చి మీరుకూడా వినండి అని ఇచ్చారు అదివిన్న తర్వాత యిది అసలైనదికాదు మంత్రి పై గిట్టని వారు చేసిన పని అని వాదించారు. 

కస్తూరి తండ్రి మా అమ్మాయి వచ్చి సాక్షము చెప్పితే నమ్ముతారా జడ్జిగారు అని ఆవేశంగా అన్నాడు. 

లాయారు ఆత్మను ప్రవేశ పెడతారా అని హేళన జేశారు. 

అనుమతి కోరింది నేను మీరు నవ్వకండి అన్నాడు పెద్దగా కస్తూరి తండ్రి.

కేసు తప్పు దోవపట్టించాలని మాట్లాడుతున్నారు జడ్జిగారు అంటూ లాయర్ వాదన మంత్రి మంత్రి కొడుకు నిరపరాధిగా తీర్పుఇవ్వండి, అన్నాడు. 

బోనులోకి నెమ్మదిగా కుంటుతూ వచ్చి నిలబడి కస్తూరి. 

భగవద్గీత పై ప్రమాణము చేసే అంతా నిజమే చెపుతున్నాను అబద్ధం చెప్పుటలేదు 

మీరు నాటకమాడటం కోర్ట్ సమయాన్ని దుర్వినియోగం చేయటం తప్పని పించలేదా?

లాయర్ గారు నేను మమ్మల్ని అడగవచ్చా 

అడగొచ్చు 

మంత్రి గారివద్ద ఎంతలాంచం ఫీజు గా తీసుకున్నారు అనగా బ్లాక్ మని 

అక్కడున్న సభ్యులందరు పెద్దగా చప్పట్లు కొట్టారు 

మీరు అట్లా అడగవచ్చా?

లాయర్ గా సత్యాన్ని ధర్మాన్ని గెలిపించే విధంగా వాదిస్తాం, తగ్గ పారితోషికం తీసుకుంటాం.

మంత్రి మరియు వారి కుమారుడు నిరఫరాదులా ?

జడ్జి గారు.. ఆధారాలు ఉంటే అందరూ దోషులే 

మీదగ్గర ఆధారాలు ఉంటే పొందు పరచండి.

లాయర్.. ఇప్పడిదాకా వీళ్ళనాన్న దొంగ ఏడుపులు, ఇప్పుడు ఈమె?

అవునండీ.. ఒక దుర్మార్గుణ్ణి చట్టానికి పట్టించాలంటే చాలా తెలివి వుండాలి. కదండీ.

లాయర్.. మంత్రి గురించి మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. 

జడ్జి గారు మానాన్నగారు మంత్రి దగ్గర డ్రైవర్ గా పనిచేసేవారు, ఒకనాడు మంత్రిగారు దొంగనోట్లు చెలామణి చేయటం తెలిసికొని పోలీస్  వీడియో తీసి రిపోర్ట్ చేసారు కానీ పోలీసులు మంత్రిగారితో చేతులు కలిపి వీడియో తొలగించి కోర్టులో మంత్రిగారు నిజాయితీ పరుడని కొట్టేసారు కదండీ ఆనాడు

మంత్రిగారు ఆ కక్ష తో డ్రైవర్ నుండి తొలగించారు, పనిచేసిన పైకము ఇచ్చి చివరగా పార్టీలో త్రాగిచ్చి మరీ పంపారు ఇంటికి వచ్చేంగ పడిపోయ్యాడు డాక్టర్ చూపించాగా బ్రాందీలో ఏదోమందు కలిపటం వల్ల అప్పటినుండి పిచ్చిగా తిరుగుతున్నాడు.

లాయర్.. అనవసర విషయాలు చెపుతున్నారు, ఒక మంత్రిని అవమానిస్తున్నారు అన్నాడు.

అవునది నేను అవమానించటం లేదు నా ఆలోచనలు ఎస్ .ఐ .కు డాక్టర్ కు ముందే చెప్పా ను, వారికీ నపధకమునకు సహకరించారు. 

అసలు ఏమి జరిగిందంటే నేను యధా ప్రకారము రాత్రి ఆలస్యముగా ఇంటికే వచ్చా అప్పుడే కొందరు విద్యరుల బైకులు వచ్చాయి ఎందుకో నాకు అనుమానం వచ్చి చూసాను అందులో 4 గురు మంత్రి దగ్గర ఉండే గుండాలు వున్నారు నన్ను చంపటానికి వచ్చారని ఊహించాను అప్పటికప్పుడే ఏంచెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాను ఒక్కసారే ఆ నలుగురు మృగంలా నా మీద పడ్డారు తప్పించుకోవడానికి నిద్ర మాత్రా వేసుకున్నాను కింద పది పొయ్యాను వెంటనే వచ్చినవారు నన్ను మోసుకొని క్రిందదాకా వచ్చారు ఎవరో అలికిడి వచ్చిందని నన్ను క్రింద పడేసారని తెలిసింది తరువాత ఎట్లాగా డాక్టర్ ద్వారా నేను కోలుకున్నాను. 

మంత్రిగారికి దీనికి సంబంధమేమిటి అని లాయర్ వాదించారు 

జడ్జ్ గారు మీరు అనుమతిస్తే కొన్ని వీడియోలు మీకు చుపిస్తాను చూడండి తరువాత తీర్పు చెప్పండి 

మొదటి వీడియో .. దొంగనోట్లు మార్చుతూ మంత్రిగారు ...

రెండవ వీడియో .. బలవంతం చేసి అమ్మాయిని చంపుతున్న వీడియో 

మూడు .. మాఇంటిలో నాపై దాడిచేస్తూ వచ్చినవారి మాటలతో మంత్రిగారే పంపించారని 

తెలిసింది..                 

ఇంట వరకు మా నాన్న గారు కోలుకోలేదు దీనికి కారణమున్న వారికి శిక్ష పడటం తప్పా నేను జాగర్తగా మీకు వీడియోలు అందరికి చూపండి అని అరుస్తూ క్రింద పడి పోయింది.

జడ్జ్ గారు లాయర్ కు విడియాలు చూపించి 

వెంటనే మంత్రిగారు,వారికుమారుడు నేరాలు చేసినట్లు రుజువు ఉన్నందున 14  వత్సరాలు జైల్ శిక్ష మంత్రిగారికి, హత్య గూడా చేసినందుకు కొడుకుకు ఉరిశిక్ష వేయటం జరిగింది. వెంటనే పొలిసు వారు అదుపులోకి తీసుకోవాలని మరియు ఎంతోధైర్యముగా        

ముందుకు వచ్చి కస్తూరి ని కోర్టు గౌరవించి ఆమె సాహసానికి మెచ్చుకొని ఆమెకు ఆమె తండ్రికి మంచి వైదేము ప్రభుత్వం తరుఫున కహ్రుచు పెట్టాలని కోర్టు తీర్పు ఇవ్వడం అయినది 

***

జోక్ 

(2 ) ఏమిటండి ఇప్పుడు బాటిల్ తీసుకోని వాకింగ్ పోతున్నారు,   

అవునే డాక్టర్ చెప్పారుగా ఉదయం సాయంత్రం నాలుగు రౌండ్లు కొట్టమన్నారు. 

నేను వస్తానండి మీతో రెండు రౌండ్లు కొడతాను నన్నది, అప్పుడే వాచ్ మెన్ పెళ్ళాం           

మీ బుద్ది పోనిచ్చారు కాదు జాగర్తగా ఉండండి ఆసలే రోజులు బాగోలేదు.


 

*_భర్త - స్థితి,గతి-పరిణామక్రమాలు....ఎలా ఉంటాయో చూడండి. 


‘లేలేత’భర్తలు:  భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం..

భార్య చూపు తగిలితే చాలనుకోవడం..,

”అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ పెళ్ళవదు”,అనుకోవడం..!

భార్య దగ్గరే స్వర్గం ఉంది అని భావించడం..

అసలు సృష్టిలో భార్య, తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం...!

అన్నీ పనులూ వచ్చని చెప్పడం..!

తమ జీవితంలో సంఘటనలన్నీ,అడిగినా అడక్కపోయినా స్వచ్ఛందంగా,అమాయకంగా ఉన్నది ఉన్నట్టు  భార్యకు చెప్పేసుకోవడం..!

కొన్ని బలహీన క్షణాల్లో ..భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్ధానాలు చేయడం..

{“ఈ దశ పెళ్ళైన పదహారు రోజుల పండగ వరకు ఉంటుంది..!”}


‘దోర’భర్తలు:

పదహార్రోజులంత ఉత్సాహం ఉండదు కానీ , కొంత పచ్చి మిగిలుంటుంది....

“అన్నీ చెప్పేసామే..!

కొన్ని దాచ వలిసిందే “అని అలోచిస్తూ ఉండడం..

పర్లేదులే పరాయిది కాదుకదా కట్టుకున్న భార్యేగా అర్థం చేసుకుంటుంది లే ,అయినా మా మధ్య రహస్యాలు ఉండకూడదు” అని నమ్మకంగా ఉండటం..

కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనపడుతూ ఉండడం.

భార్యని చీటికి మాటికి సినిమా-షికార్లకి తిప్పడం..

అడక్కపోయినా చీరలు -నగలు కొనిస్తూ ఉండడం..!

భార్యకి చిన్నగాయం అవడానికి కొన్ని క్షణాల ముందునుండే కంగారు దిగులు..

కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకోవడం..

విలవిల్లాడిపోవడం..

భార్య వైపు బంధువులను కూడా అతి ప్రేమగా చూడ్డం..

భార్య పని చేస్తుంటే లాక్కుని ‘నే చేస్తాలే’అనడం..

తనని పని చేయనివ్వక పోవడం...

{“ఈ స్థితి పెళ్ళైన ఆర్నెల వరకూ ఉంటుంది..!”}


‘వగరు’భర్తలు:

అన్నీ అనవసరంగాచెప్పేసాం అని దిగులు పెరగడం..!

ఆఫీస్ అయి పోయిన వెంటనే స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా వెంటనే ఇంటికి వచ్చేయడం..

“ఉద్యోగం చేసి ఇంటి పనులూ చేయడం నా వల్ల కాదు “అని అనుకోవడం..

అప్పుడప్పడూ మాట మాట పెరిగి, మళ్ళీ సర్దుకు పోవడం..

కొంచెం భార్యని అదుపులో పెట్టుకోవాలి అనే విపరీత ఆలోచనలు రావడం..!

బైటకి తిప్పడం తగ్గించడం. భార్య ఏదైనా కొనమని చెప్తేనే కొనడం..!

భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగిలి తనకి చూపిస్తూ తిరిగితే “ఏదైనా మందు వేసుకో “ఎంతసేపని అలా పనిచేస్తూఉంటావ్”అని పేపర్ చదవుతూ రెండు వేళ్ళతో పేపర్ వొంచి ..నిర్లిప్తతగా చెప్పడం..

కానీ భార్య వల’పు’ వల్ల కాదులే మనం కూడా ఇంటి పని చెయ్యాల్లే కాస్త ,పాపం తను ఒక్కతే కష్టంకదా చేసుకోవడం..అని భావించడం..!

{“ఈదశ  పెళ్ళైన ఆర్నెల్ల నుండి మెదటి సంవత్సరం వరకూ ఉంటుంది..!”}


‘పండిన’భర్తలు:

భార్యకి తన విషయాలు అన్నీ చెప్పడం తప్పని నిర్థారించుకోవడం..!

భార్యతో కాస్త ముభావంగా ఉండడం ..ముక్తసరిగా మాట్లాడ్డం..!

భార్యని ఖశ్చితంగా అదపులో పెట్టాలి ..

లేకపోతే  కష్టం అని నిర్ణయించుకోవడం..

ఆఫీస్ అయ్యాక ఊరంతా తిరిగి ఉసూరుమంటూ ఇంటికి రావడం రావడం తోనే భార్య సంధించే, “ఎందుకు లేటైంది?  ఆఫీస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళారా..?....”

లాంటి ప్రశ్నలు .. తట్టుకోలేక కోప్పడ్డం (ఇది మొదటి స్వచ్ఛమైన  కోపం)

‘ఏమనుకుంటోందో నేనంటే??’ అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండడం..

ఇంట్లోపని నేను చెయ్యను చేస్తే చేస్తుంది లేకపోతే మానేసుకుంటుంది...అయినా ఆడవాళ్ళపని మనం చేయడమేంటి..?అని నిశ్చయించుకోవడం..!

{“ఈదశ మొదటి సంత్సరం దాటాకా ఆర్నెల్లు ఉంటుంది..!”}


‘పొగరు’భర్తలు: 

నేను మగాణ్ణి నా ఇష్టం ..

అనే భావనతో మెలగడం..భార్య ఏమైనా ప్రశ్నలు అడిగినా ,తన గతం ఎత్తి దెప్పుతూంటే 

చిరాకు పడ్డం ..

కోపంగా అరవడం..ఇంట్లోంచి ఆవేశంగా వెళిపోవడం..

రాత్రికి చల్ల బడ్డం..తనే ముందుగా,భార్యతో మాట్లాడ్డం “అన్నం తిందామా”అని అడగడం..

మళ్ళీ ఉదయం మామూలే..

{“ఈదశ ఆర్నెల్లు ఉంటుంది..!అంటే పెళ్ళయ్యి అప్పటికి రెండేళ్ళు ముగుస్తుంది..ఈ దశ దాటాక క్రొత్త కష్టాలు మొదలౌతాయి...!”}

‘విసుగు’భర్తలు:

పిల్లల ఏడ్పులతో విసుగు చెందడం..!

భార్య, ”పిల్లల్ని చూస్తూండండి”అని చెప్పినప్పుడు.

కోపం-చికాకు అణుచుకోవడం..

ఓర్పు క్షీణించడం..

“ఛ ఛ కొంపలో మనశ్శాంతి లేదు” అని వీధుల్లో తిరగడం..

పాత మితృలను కలవడం..

పుట్టింటిని,అమ్మా నాన్న ను ఎక్కువ తలుచుకుంటూ ఉండటం...

చదుకున్న రోజులు గుర్తు తెచ్చుకోవడం..

ఇంటికి వెళ్ళాలంటేనే చికాకు రావడం..

భార్యపై అరుస్తూ ఉండడం..

భార్యతో వాదనకు దిగడం..

భార్య తన గతం ఎత్తి దెప్పుతుంటే, వస్తువులు పగలకొట్టడం..

ఆవేశంగా బైటకి వెళిపోవడం..

ఈ దశలో భార్య తనకి కనిపించేలా తన అనారోగ్యం..

దెబ్బలు చూపిస్తూ,ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉన్నా..

భర్త అస్సలు పట్టించుకోరు ఏమీ స్పందించరు..

”ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి ఏం చిన్న పిల్లా??”అని మనసులో అనుకోవడం....

“ఇంకా పెళ్ళికాని తన స్నేహితులకి చేసుకోవద్దురా నామాట విను”అని సలహాలు చెప్తూండడు..

పెళ్ళి చేసుకున్న వాళ్ళపై జాలి ,సానుభూతి చూపడం..

{“ఈ దశ పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చే వరకూ ఉంటుంది...!”}


’దిగులు’భర్తలు:

ఆదాయం కంటే ఖర్చులు పెరగడం..

అప్పులు చేయడం..

ముందు ఘోరం ఊహించక,భార్యని “ఏమైనా మీ ఇంట్లో వాళ్ళని అడుగుతావా??”

అని అభ్యర్థించడం..!

భార్య తెచ్చిచ్చి,గొడవలైనప్పుడల్లా “మా పుట్టి0టివాళ్ళు ఇస్తేనే గానీ దిక్కు లేదు”అనే ఈ అతి ప్రమాదకరమైన అస్త్రం ప్రయోగించినపుడు..

భార్యని ఏమీ అనలేక,మానసికంగా కుంగిపోవడం..కుమిలిపోవడం..

గిలగిల్లాడిపోవడం..!

భార్య”ఏం మా వాళ్ళు ఇంటికొస్తే నోరు పెగల్దే ..? 

మొహం మాడ్చుంటావ్..అదే మీ వాళ్ళొస్తే చంద్రబింబం అయిపోతుంది అయ్యగారి మొహం..మా వాళ్ళని చూడలేవు కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటావ్.పలకరిస్తే నీ ఆస్తులు కరిగిపోతాయా??.”లాంటి మాటలు..

భర్త వైపు చుట్టాల ఫంక్షన్లకి వెళ్ళొచ్చాక కొన్ని నెలలపాటు భార్య,”చూసావా మీ వాళ్ళు ఎలాంటి చీర పెట్టారో !ఇల్లు తుడవడానికి కూడా పనికిరాదు!ఓ మంచిగా పలకరింపు లేదు.!తిన్నావామ్మా?అని అడిగింది లేదు..!గొప్పకుటుంబాలు ..!గొప్ప వంశం మీది..!”

లాంటి మాటలు వింటూ..

“పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను”

అని పశ్చాత్తాప పడడం..

మా నాన్నగారు”పెళ్ళైంది ..ముందులా కాకుండా జాగర్తగా ఉండాలి”అని చెప్పిన మాటకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది...!అని బాధపడడం..

శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తూ నవ్వకోవడం చిన్న చిన్న మానసిక,శారీరక అనారోగ్యాలు..!

ముఖంలోదిగులు -బెంగ-నిరాశ,ఎదుటివారికి  కొట్టొచ్చినట్టు కనపడ్డం...

{“ఈదశ చాలా ప్రమాదకరమైన దశ,ఈదశలోనే చాలా మంది వ్యసనాలు అలవాటు చేసుకోవడం, పూర్వపు ఆడ స్నేహితురాళ్ళకు దగ్గర కావడం..

ఇలా చాలా ఘోరంగా ఉంటుంది..

లేదా దేవునిపై విపరీతభక్తి ..

గుళ్ళకి ,గోపురాలకి ఎక్కువ తిరగడం..

పూజలు,ఉపవాసాలు, ఎక్కువగా చేస్తూ ఉండడం...

ఎక్కువగా దేవుని ప్రవచనాలు వింటూండడం..

అమ్మ నాన్నలపై విపరీతమైన ప్రేమ కలిగే దశ...!ఇది సుమారు పిల్లలు డిగ్రీకి వచ్చే వరకూ ఉంటుంది...!}


‘బరువు’ భర్తలు:

పిల్లలకి పెళ్ళి సంబంధాలు చూడ్డం అనే బరువు మీద పడి.....

తన బాధలు మర్చిపోవడం..

(ఇక్కడే భర్త తన భర్త తత్వాన్ని కోల్పోయి ఏదోచేద్దాం అనుకున్నవి మరిచిపోయి)

నేను తండ్రిని ..నేను తండ్రిని ..

‘పిల్లలకి పెళ్ళి చేసెస్తే ప్రశాంతంగా ఉండచ్చు’అని అనుకోవడం...

{“ఈ దశ పిల్లలకు పెళ్ళి చేసి ..ఆ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు ఉంటుంది ..

అంటే ఒకప్పటి భర్త ..తండ్రి దశ దాటి తాత అవ్వడం..”}


‘చల్లారిన’భర్తలు: పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూంటారు..

వీరికి ఇక ఏ బాధ్యతలు ఉండవు..

ఓపికా ఉండదు..కానీ అప్పటికింకా భార్యకి ఓపిక ఉండటం ..ఒకప్పుడు తను తిట్టాలనుకున్నవి..

అనాలని ఆపుకున్నవి అన్నీ గట్టిగా భర్తకి వినిపించేలా తిట్టడం..జరుగుతుంది..

కానీ ఏమీ వినపడనట్టు “వంటైందా..?”

అని అమాయకంగా అడగడం పడక్కుర్చీలో కళ్ళ జోడు సర్దుకుంటూ పేపరు చదివినట్టు అడ్డు పెట్టుకుని ..”అన్నీ గుర్తున్నాయ్ దీనికి ఎన్నెన్ని మాటలంటోంది నాయనో పెళ్ళంత నరకం లేదు..

నడుం వొంగాక పూర్తి జ్ఞానం వచ్చి ఏం ప్రయోజనంలేదు..

పోనీ ,తిట్టుకుంటే తిట్టుకోని మనకింత ముద్దపాడేస్తోందిగా ఎవరి పాపాన వారే పోతారు ప్రొద్దున్నేగా టివి లో ప్రసంగం విన్నాంగా..అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు”అని సమాధాన పడతారు..ఈలోపు “మింగడానికి తగలడు”

అని పిలుపు వినపడగానే ..కిక్కురుమనకుండా వచ్చి అన్నంతిని కాలం గడుపుకుంటూ ఉండడం..

{“ఈదశ చివరి దశ ఇక్కడితో భర్త పాత్రకు శుభం పడుతుంది...”}


అంకితం: భర్తగా మారిన వారికి..,

భర్తగా మారాలనుకునే వారికి..,

భర్తగా మారకూడదు ,అని అనుకునే వారికి..  ఈ వ్యాసం అంకితం.....

***