Sunday 24 March 2024

ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు

నేటి ఉదయ పద్యాలు 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ.. ప్రాంజలి ప్రభ 

తేనె టీగ కృషియెనిజం తప్పు కాదు 

బాటసారి కి తీపిగా బాగు జేయు 

కూడబెట్టి యందించుతూ కుమిలి పోదు 

కాల ధర్మము బట్టియే కదులు చుండు 

***

కట్లపాము చూడ భయము కదల గలుగు 

తూట్లు తూట్లుగా చంపేది తుచ్చ బుద్ధి 

నోట్ల కట్టలు చూడగా నోటిమాట 

కట్లు తెంచిన యాంబోతు కదల గలుగు 

***

రాలిపోవు పూలు ప్రకృతి రమ్య తయది 

నేలకొరుగు చెట్లు ప్రకృతి నిజమునిజము 

జాలిగుండె బ్రతుకు నిత్య జగతి వేట 

కూలి పోవ యాధునికమ్ము కూడు యాపె 

***

మల్లెపూలవంటి వయసు మనసు గెలుచు 

మాయమాటలన్నియు తెల్పు మగని తోడ 

మొగుడులేని బ్రతుకుమోజు మొండి గుండ 

సగటు మనిషి సంబరములు సమర మెండ

***

చిన్న దీపమ్ము పోగొట్టు చీకటులను

మంచి మాట యనుకరణ మాయత రుము 

నంత మొందించు నజ్ఞాన మను తమము 

ఎట్టి విద్యను లేక శోభించలేవు

***

బాధలోన ఓదార్పుయే బంధ మగును 

బతికి బతికించు బుద్దియు బలము యగును 

విధము యేదైన వినయుము విలువ గనుము 

కలము గళముతో తెలుపుము కాల గమన

***

అంగనా కదలిక వేగ కథలు గాను 

చూడ సుందరీమణులగా చూవు గాను 

చక్కనైన హావ భవము చంచెలిగను 

ఆనటిగ గంధ పరిమళం ఆత్మ తృప్తి

***

ప్రకృతి చూపినా యాసల ప్రాభవమ్ము 

ధనము కోరి వికృతి చేష్ట ధరణి నందు 

ద్రాక్ష పండక పండించు దారి గతియు 

రోగ భయముతో జనులెళ్ళ రొప్పు యేల

***

జన్మన యేవిద్య యేరూప జాగృతి మనసు మార్పు తీరే 

వెన్నెల యేనీడ కాంతుల్ల విద్యల గమనమేను మారే 

మన్నన సద్బోధ సామ్మోహ  మాయగ మనసు మార్పు కోరే 

అన్నము జీర్ణమ్ము నిత్యమ్ము యాకలి పిలుపు లమ్మ దేవీ

***

సూర్యుడు సాక్షాత్తు దర్శించు సూత్రధర భవభావ దేవా 

ఆర్యుడు యాద్యంప్రభావమ్ము యానతి సకలసేవ దేవా 

సౌర్యుడు సర్వమ్ము గమ్యమ్ము సోదన వినయ లక్ష్య దేవా 

వీర్యుడు విశ్వమ్ము విజ్ఞాన విద్యల కళకళమ్ము దేవీ 

**-

సమస్య:

ముట్టియొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్

ఉ.

పట్టిన తీపి చేదగుట పాకము మాదిరి పాడుయే యగున్ 

పట్టక పోయినా కళల పాఠము కాలము తీర్పుయే యగున్ 

గట్టిగ నన్నమాటవిని గానము చేయుచు లీద్దరీ గతిన్ 

ముట్టియొకండు సచ్చె మఱి ముట్టక చచ్చె నొకండు సూడగన్

****

ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ రామకృష్ణ 

తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!

కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు.

తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….

“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”

“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు.

“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”.

internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.

తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”

” ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు.

“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…

ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”,

అంటూ వివరించే ప్రయత్నం చేశాడు.

అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!

“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను.

ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.

నీకు తెలుసు నేను ఒంటరివాడిని.

నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే.

నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.

రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు.

నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం…

అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది.

మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.

నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా?

పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా??

కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా???

ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే…

నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!

నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం.

నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?

కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి.

టెక్నాలజీ ఉండాలి కానీ…

అది మాత్రమే జీవితం కాకూడదు !

దానికి మనం బానిసలం కాకూడదు!

మనుషులతో జీవించండి…..

పరికరాలను వాడుకోండి…..

” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,

వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “….

( ” తెగిపోతున్న మానవ సంబంధాల”

గురించి ఒక్కసారైనా అలోచించండి.)

ప్రాంజలి ప్రభ కథలు 

Please share this...

...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

ఆదివారం ప్రాంజలి ప్రభ కథలు 

మల్లాప్రగడ రామకృష్ణ 

```ఒక రాజ్యంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను రాజభవంతి దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవంతిలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు.

ఒకరోజు రాజుగారు ప్రజలందరికీ విందు ఇస్తున్నారు అనే వార్త విన్నాడు.

ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది.

తన దుస్తులు చూసుకున్నాడు అన్ని చిరిగిపోయాయి. ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు.

రాజభవనము దగ్గరకి వెళ్లి కాపలా వారిని బ్రతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు.

ఎంతో ధైర్యం కూడగట్టుకొని, చాలా వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు.

అతన్ని చూడగానే రాజు. “నీకేమి కావాలి?” అని అడిగాడు. 

దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు….

“రాజా! నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి."

రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ “ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు, మరకలు అంటవు. ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు” అన్నాడు.

బిచ్చగాడి కళ్ళ వెంట నీరురాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు.

వెంటనే ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని ధరించి అద్దములో చూచుకొని మురిసిపోయాడు బిచ్చగాడు.

అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజు గారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది.

ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంటనే ఉంచుకొని తిరిగేవాడు. ఎందుకంటే రాజుగారి దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని.

రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు కూడా తనకి ఆనందంగా లేదు. బైట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారవేస్తారేమో అని భయం తనకి.

క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు, అవి కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారంతో ఆ మూటను మాత్రం అస్సలు వదిలేవాడు కాదు. అతని తోటి వారు అతనిని చూసి, ‘ధరించిందేమో రాజుగారి దుస్తులు మోసేదెమో పాత గుడ్డలు!’ అని హేళన చేస్తూ “పీలిక గుడ్డల మనిషి” అని తనకి పేరు పెట్టారు.

చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి మంచం పై నుండి లేవలేక పోయేవాడు. పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న పాతబట్టల మూటను చూశారు. అది చూసి, ఎంతో విలువైన చిరగని తరగని దుస్తులు ధరించినా కూడా బిచ్చగాడికి ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి, ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా! అని బాధ పడ్డారు.```

ఇందులోని నీతి :

```ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం అందరమూ కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా ఇప్పటికి ఎప్పటికి అలానే మోస్తూ ఉంటున్నాము.

మనం మోస్తున్న మూటలో ఉన్నవి, అవి ఏమిటంటే శత్రుత్వము, ఈర్ష్య, ద్వేషము, కోపము, మన భాధలు మొదలగునవి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు. అంతే కాదు ఈ భావనలతో మాటి మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని గుర్తుతెచ్చుకుంటూ జీవితంలోని అందమైన, సంతోషమైన వాటిని అనుభవించలేకపోతున్నాం,

ఇలా ఉంటే జీవితంలో వేటినీ గుర్తించలేము ఆనందించలేం కూడా! ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటనలను ఎక్కడకిక్కడ, ఎప్పటికప్పుడు వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూటలాగా, ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, మనలోని అశాంతికి కారణము.

ఆదివారం...ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ రామకృష్ణ 

తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!

కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు.

తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….

“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”

“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు.

“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”.

internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.

తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”

” ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు.

“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…

ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”,

అంటూ వివరించే ప్రయత్నం చేశాడు.

అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!

“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను.

ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.

నీకు తెలుసు నేను ఒంటరివాడిని.

నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే.

నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.

రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు.

నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం…

అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది.

మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.

నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా?

పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా??

కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా???

ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే…

నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!

నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం.

నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?

కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి.

టెక్నాలజీ ఉండాలి కానీ…

అది మాత్రమే జీవితం కాకూడదు !

దానికి మనం బానిసలం కాకూడదు!

మనుషులతో జీవించండి…..

పరికరాలను వాడుకోండి…..

” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,

వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “….

( ” తెగిపోతున్న మానవ సంబంధాల”

గురించి ఒక్కసారైనా అలోచించండి.)

ప్రాంజలి ప్రభ కథలు 

Please share this...

...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

No comments:

Post a Comment