Monday 6 January 2020


సరిలేరు నీకెవ్వరు (టైటిల్) సాంగ్ ల
BluelabelSarileru Neekevvaru

Album : Sarileru Neekevvaru

Starring: Mahesh Babu, Rashmika Mandanna
Music : Devi Sri Prasad
Lyrics-Deepak Blue
Singers :Devi Sri Prasad
Producer: Ramabrahmam Sunkara
Director: Anil Ravipudi
Year: 2020


భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా..
జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు..

 పెలపెలమంటూ మంచు తుపాను వచ్చినా..
వెనుకడుగేలేదంటూ దాటేవాడే సైనికుడు
దడ దడ దడ దడమంటూ... తూటాలే దూసుకొచ్చినా...
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు...
మారణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురుపంపేవాడు... ఒకడే ఒకడు వాడే సైనికుడు


సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్ళే రహదారికి జోహారూ..
సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు
--(())--



ala vaikuntha puram




బంటు గానికి ఇరవై రెండు
బస్తిల మస్తు కటౌట్
బచ్చగాండ్ల బ్యాచ్ ఉండేడి
వొచ్చినమంటే సుట్టు
కిక్ యే చాలకా ఓ నైటు
యెక్కి డోక్కు బుల్లెట్టు
సంధు సంధు మండు కోసం
ఎతుకుతాంతే రూటు
పట్టు చీర కట్టుకోని
చైల్డ్ బీర్ మెరిసినాట్టు


పొట్లం కటినా బిర్యానికి
బొట్టు బిల్లా పెట్టినట్టు
బంగ్లా మీధ నిలుసోనుందిరో
ఓ సంధమమ
సుక్కాధాక చక్కర్ అచెరో
యమంధం మామా
జింకా లెక్కా డుంకుతుంటెరో
ఆ చందమమ జుంకీ జారి
Chikkukundhiro ...
నా ధిల్లుకు మామా

రాములూ రాముల
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో
రాములూ రాముల
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో

[MUSIC]

రాములూ రాముల ..
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో
రాములూ రాముల
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో

యే తమలపాకే యెస్తుంటే
కమ్మగా వాసన వోస్తవే
Yerraga pandina buggalu rendu
Yaadhikosthaaaye
ఆరే పువ్వులా ఆంజి యస్తుంటే
గుండి నువ్వై పూస్తావే
పాండుకున్న గుండేలో ధూరి
గుల్లె జెస్తావ్

ఆరే ఇంటీ ముండు లైట్
మినుకు మినుకు మంటాంటే
నువ్వ కన్న కొట్టినట్టు
సిగ్గు పుట్టింధే
సీరా కొంగు తలుపు సాతు
Sikkukuntaante
నువ్వు లాగినాట్టు వోలు జల్లుమంతండే

నాగస్వరం ood ధుతుంటే
నాగుపాము og గినట్టు
యెంటాబాది వస్తున్న నీ
నీ పట్టా గోలుసు సప్పుడింటు
పట్టానట్టే తిరుగుత్తున్నవే
ఓ సంధమావ పక్కకి పోయి
తోంగి సూస్తావ్
ఎమ్ టేకురా మావా

రాములూ రాముల
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో
రాములూ రాముల
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో

రాములూ రాముల
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో
రాములూ రాముల
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో

Ramuloo ...
రాములూ రాముల
నన్నగం జెసింధిరో
రాములూ రాముల
నా పనం తీసింధిరో
Baṇṭu gāniki iravai reṇḍu


Bantu ganiki twenty-two
Basthila masthu cut-outu
Bacchagandla batch undedi
Vocchinamante suttu
Kick ye chaalaka o nightu
Yekki dokku bullettu
Sandhu sandhula mandhu kosam
Ethukuthante routeu
Silk cheera kattukoni
Child beer merisinattu
Potlam kattina biryaniki
Bottu billa pettinattu
Bangla meedha nilusonundhiro
O sandhamama
Sukkadhaagaka chakkar occhero
Yemandham maama
Jinka lekka dhunkuthuntero
Aa chandamama junkhee jari
Chikkukundhiro…
Naa dhilluku mama

Ramuloo ramulaa
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro
Ramuloo ramulaa
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro

[MUSIC]

Ramuloo ramulaa..
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro
Ramuloo ramulaa
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro

Ye thamalapaake yesthunte
Kammaga vaasana vosthave
Yerraga pandina buggalu rendu
Yaadhikosthaaaye
Arey puvvula angi yesthunte
Gundi nuvvai poosthaave
Pandukunna gundelo dhoori
Gulle jesthave

Arey inti mundhu light
Minuku minuku mantaante
Nuvvu kannu kottinattu
Siggu puttindhe
Seera kongu thalupu saatu
Sikkukuntaante
Nuvvu laaginattu vollu jhallumantaandhe

Nagaswaram oodhuthunte
Naagupaamu ooginattu
Yentabadi vasthunna nee
Nee patta golusu sappudintu
Pattanatte thiruguthunnave
O sandhamaava pakkaki poyi
Thongi soosthave
Em tekkura maava

Ramuloo ramulaa
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro
Ramuloo ramulaa
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro

Ramuloo ramulaa
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro
Ramuloo ramulaa
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro

Ramuloo...
Ramuloo ramulaa
Nannaagam jesindhiro
Ramuloo ramulaa
Naa paanam theesindhiro






Saturday 4 January 2020



5. వెలిగింది నా ప్రాణదీపం ...ఈ జన్మంత నీ పూజకోసం

నీ నీడ దేవాలయం ...మది నీకు నీరాజనం
చిత్రం: గౌతమి (1987)
సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
చీకటి కాటుక చారల చెంపల వాకిట వ్రాసిన కన్నీటి అమవాసలో...
చిగురాశల వేకువరేఖల కెంపుల ముగ్గులు వేసిన నీ చూపు కిరణాలలో...
వెలిగింది నా ప్రాణదీపం ...ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం ...మది నీకు నీరాజనం
ప్రతి అణువు... పూలహరం..ఉం...
వెలిగింది నా ప్రాణదీపం... ఈ జన్మంత నీ పూజకోసం
చరణం 1:
నలుపైన మేఘాలలోనే ...ఇల నిలిపేటి జలధారలేదా
నలుపైన మేఘాలలోనే... ఇల నిలిపేటి జలధారలేదా
వసివాడు అందాలకన్నా ...నీ సుగుణాల సిరి నాకు మిన్నా
వసివాడు అందాలకన్నా ...నీ సుగుణాల సిరి నాకు మిన్నా
తీయని ఊహలతీరము ...చేరువ చేసిన స్నేహము... ఏనాటి సౌభాగ్యమో
వెలిగింది నా ప్రాణదీపం... ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం ...మది నీకు నీరాజనం
ప్రతి అణువు... పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం... ఈ జన్మంత నీ పూజకోసం
చరణం 2:
నూరేళ్ళ బ్రతుకీయమంటు ...ఆ దైవాన్ని నే కోరుకుంటా
నూరేళ్ళ బ్రతుకీయమంటు ...ఆ దైవాన్ని నే కోరుకుంటా
ప్రతిరోజు విరిమాలచేసి ...నీ పాదాల అర్పించుకుంటా
ప్రతిరోజు విరిమాలచేసి ...నీ పాదాల అర్పించుకుంటా
మాయని మమతల తావున... నిండిన జీవనవాహిని... ప్రతిరోజు మధుమాసమే..
వెలిగింది నా ప్రాణదీపం ...ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం... మది నీకు నీరాజనం
ప్రతి అణువు ...పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం... ఈ జన్మంత నీ పూజకోసం
http://n3.filoops.com/telugu/Gowthami%20%281987%29/Veligindi%20Naaprana%20Deepam.mp3




ఆనతి నీయరా.. హరా...సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా...

చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : వాణీజయరాం

పల్లవి :
ఆ.... ఆ... ఆ.... ఆ.....

ఆనతి నీయరా.. హరా
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా...
సన్నిధి చేరగా... ఆనతి నీయరా.. హరా
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...
సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా...


నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనమ్

వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
ఆనతి నీయరా.. హరా

చరణం 1 :

ని ని స ని ప నీ ప మ గ స గ... ఆనతి నీయరా!
అచలనాధ అర్చింతునురా... ఆనతినీయరా!

పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసని... ఆనతినీయరా!
జంగమ దేవర సేవలు గొనరా...
మంగళ దాయక దీవెనలిడరా!
సాష్ఠాంగముగ దండము సేతురా... ఆనతినీయరా!

చరణం 2 :

సానిప గమపానిపమ
గమగ పాప పప
మపని పాప పప
గగమ గాస సస
నిసగ సాస సస
సగ గస గప పమ పస నిస
గసని సాగ సాగ
సని సాగ సాగ
సగ గాస సాస
సని సాగ గ
గసగ గా
పద గస గా స ని పమగమ గా... ఆనతినీయరా!

శంకరా... శంకించకురా!
వంక జాబిలిని జడను ముడుచుకొని...
విసపు నాగులను చంకనెత్తుకొని...
నిలకడనెరుగని గంగనేలి... ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి.. నీ కింకరుణిక సేవించుకొందురా!
ఆనతినీయరా...

చరణం 3 :

పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ

గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా
గామాపని గమాపాని స మపానీసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా

గగ మమ పప నిగ.. తక తకిట తకధిమి
మమ పప నినిసమ.. తక తకిట తకధిమి
పపనినిసస గని.. తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా

రక్షా... ధర శిక్షా దీక్షా దక్ష!
విరూపాక్ష! నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక..
పరీక్ష సేయక.. రక్ష.. రక్ష.. యను ప్రార్ధన వినరా!
ఆనతినీయరా... హరా!
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...
సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా

https://www.youtube.com/watch?v=m3G5iD-NZhU
Swati Kiranam Movie Songs - Anathineya Raa Song - Mammootty, Radhika, K Vishwanath, KV Mahadevan
Watch Swati Kiranam Telugu movie songs, starring Mammootty ( Dalapathi, Surya Puthrulu, Railway Cool...





పల్లవి:
మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేనెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో …ఓ…
చరణం:1
నీవు పిలిచే పిలుపులో జాలు వారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలు వారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేనెందుకో
చరణం:2
మొలకసిగ్గూ బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గూ బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మధునితో జన్మవైరం చాటినపుదే
ఆరిపొని తాపమూ అంతు చూసేదెప్పుడో
ఆరిపొని తాపమూ అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులై నప్పుడే
మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేనెందుకో
చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయ రాజా
రచన : ఆత్రేయ
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానక




Friday 3 January 2020


3. సరిగమపదని స్వరధారా...రస సాగర యాత్రకు ధ్రువతారా...
చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : SP.బాలు

తననం తననం తననం
గమప మపని దానిసా....
సనిదప సనిదప
దపగరి దపగరి
సనిద నిదప దపగ పగరిస సా పా గరి సా
సా సా సా సా
రీ రీ రీ రీ
గా గా గా గా
పా పా పా పా

పల్లవి:
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
వీణవై ...వేణువై ...మువ్వవై ...వర్ణమై
వీణవై జాణవై వేణువై వెలధివై
మువ్వవై ముదితవై వర్ణమై నా స్వర్ణమై
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె

సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

చరణం 1:
అరుణం అరుణం ఒక చీరా.....అంబర నీలం ఒక చీరా
అరుణం అరుణం ఒక చీరా.....అంబర నీలం ఒక చీరా
మందారంలో మల్లికలా..... ఆకాశంలో చంద్రికలా
అందాలన్నీ అందియలై..... శ్రుగారంలో నీ లయలై
అలుముకున్న భూతావిలా... అలవికాని పులకింతలా
హిందోళ రాగా గంధాలు నీకు ఆందోళికా సేవగా

ఆ.............
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

చరణం 2:
హరితం హరితం ఒక చీరా.....హంసల వర్ణం ఒక చీరా
హరితం హరితం ఒక చీరా.....హంసల వర్ణం ఒక చీరా
శాద్వరానా హిమదీపికలా ....శరద్వేలా అభిసారికలా
చరణాలన్నీ లాస్యాలై.....నీ చరణానికి దాస్యాలై
అష్ఠపదుల ఆలాపనే....సప్తపదుల సల్లాపమై
పురి విప్పుకున్న పరువాల పైట సుదతి నే వీవగా.....ఆ...

ఆ.......
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

For latest updates on ETV Network http://www.etv.co.in Subscribe for more latest...
youtube.com|By etvteluguindi

ఉండలేనంది నా కన్ను నిను కానక...వెన్నదొంగా మరి వేధించకు...శ్యామసుందర కృష్ణా కృష్ణా
2. చిత్రం : విశ్వరూపం
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : శంకర్-ఎహసాన్-లోయ్
గానం : శంకర్ మహదేవన్, కమల్‌హాసన్

సాకీ :
అధినవనీతా... అభినయరాజా..
గోకులబాలా కోటిప్రకాశా
విరహనరక శ్రీరక్షకమాలా
కమ్మని కలలను కదిపితె చాలా
కన్నియ కౌగిలి చేరగలేవా
ఊహల వాకిట ఉండకురా
కల వెన్నెల చిందు వరమ్మీరా
పూతన గర్వమణంచిన వాడా
పాపపు విరహము బలిగొనరారా
మనసుంటే మాయావీరా
రారా రారా (3)

పల్లవి :
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు॥
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా ॥॥
నింగి మేనైన నీలాల కల నీవు
అందిరావు అలా నన్ను విడిపోవు
కాస్తయినా మొరాలించవే
గుండె సడినాపి గుండె సడినాపి (2)
 

గమదనిసా నిదపమ గమ రిగరిస
గుండె సడినాపి నీ దారి కాచానిలా
వెన్నదొంగా మరి వేధించకు
నళిన మోహన శ్యామల రంగా
ధీం ధీం కిడతకధిన
నటన భావ శ్రుతిలయ గంగా
కిడ తక ధీం ధీం ధీన్నా
నిదురను నీకై త్యజించు
అనవరతము నిన్ను కొలుచు
రాధే నీ చెలియని నీ రాధే నేనని రారాదా


చరణం : 1
ఎవ్వేళ నువ్విలా రివ్వందువోయని
రవ్వంత ముస్తాబు పెంచుకున్నా
ఒళ్లంత కళ్లుగా వేచానొక్కో యుగం
వె ల్లువల్లె రారా క్షణమాగనిదే
నిన్ను చూపించదే జగం
వాడిపోదా ప్రియా సుమం
ఓ... దొంగచాటు కౌగిలింతై... ఈ...
పరిమళాల శ్వాసనివ్వు
తేనెలూరు పెదవంచుల్లోన
కేరింతగా ఫలించు
ఇక భూలోకమే ఉన్న స్పృహ లేదనే
తన్మయి నేనై తరించాలిరా


చరణం : 2
వదిలిపోని వలపై పైయ్యదగ
హత్తుకోలేవా చెలిని చెలిని కన్నా
తుడిచేసి నా నిదుర విడిచి వెళ్లకంటున్నా
కలని కలని...
ఇక ఈ జన్మలోన నువ్వు కనిపించులోన
చెలి ప్రాణాలు పోతే ఎలా
అని కొరగాని ఆరాటమేలా ప్రియా
నువ్వె ఊపిరిగా జీవించనా
తకతకతకధిం తకతకధిం తకతకధిం
తకతకధిం
తకధిం తకధిం తోం తోం తకిటితోం
తకధిళాంగుతోం తోంకిటత
తక తరికట తక తరికట (2)॥

Thursday 2 January 2020

Sarigamalu Movie







గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా...
నిండారి తెలుగింటి అందాలే వెలిగించే.....నండూరి వారెంకిలా ఓ...

చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బాంబే రవి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

ఆఆఆఅ..ఆఆఆ....ఆఆఅ..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
ఓ..ఓ..ఓఓఓఓఓ....
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా
నిండారి తెలుగింటి అందాలే వెలిగించే
నండూరి వారెంకిలా ఓ...

గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ
ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ

సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము...ఓఓ..
సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము
నన్నల్లుకోమంది వయ్యారము
కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో
నా స్వప్న లోకాలలో..ఓయ్.ఒయ్.ఒయ్..

గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
కవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో తుంటరి ఓతుమ్మెదవో
నా బాహు బంధాలలో..ఓయ్.ఓయ్..

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...
గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
ఓ..ఓ..ఓఓఓఓఓ....
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

https://www.youtube.com/watch?v=1vMaX9IoQSA
Sarigamalu Movie || Godavari Paiyedha Video Song || Vineeth, Rambha, J.V Somayajulu
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

ankusam


ankusam 
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం


ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమలకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు ( ఇది )

కళ్యాణిదండాలు కౌగిలికి తెలుసు
పారాణి మిసమిసలు పాదములకు తెలుసు
పడకింటి గుసగుసలు పానుపుకు తెలుసు
చిగురుటాకులో చిలిపిమాటలో
పసిడి బుగ్గల పలకరింపుల పడుచుజంటకే తెలుసు ( ఇది )

ముంగిట ముగ్గులు తొలిపొద్దు కనకం
శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
వెన్నెలకి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలిచూపులు ఇల్లాలి అందం
జన్మజన్మలా పుణ్యఫలముగా జాలువారినా
జాజిపువ్వులె ఆలుమగల వొక అందం ( ఇది ) .


"Idi Cheragani Premaku" Video Song - "Ankusam" || Rajasekhar | Jeevitha

Preminchu Pelladu Vayari Godavari amma



"నవ్వుల కీరీటి" మన రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ....
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై(వయ్యారి)

నిజము నా స్వప్నం కలనో లేనో
నీవు నా సత్యం అవునో కానో
ఊహ నీవే ఉసురు కారాదా...
మోహమల్లె ముసురుకోరాదా....
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ
మువ్వ గోపాలుని రాధిక
ఆకాశ వీణ గీతాలలోన ఆలపనై నే కరిగిపోనా(వయ్యారి)

తాకితే తాపం కమలం భ్రమరం
కుక్కితే మైకం అధరం అధరం
ఆటవెలది ఆడుతూ రావే
తేటగీతి తేలిపోనీవే
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింబాధరాల సూర్యోదయాలే పండేటి వేళ(వయ్యారి)



illayaraja,vamsi,rajendra prasad combination