Friday 3 January 2020


3. సరిగమపదని స్వరధారా...రస సాగర యాత్రకు ధ్రువతారా...
చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : SP.బాలు

తననం తననం తననం
గమప మపని దానిసా....
సనిదప సనిదప
దపగరి దపగరి
సనిద నిదప దపగ పగరిస సా పా గరి సా
సా సా సా సా
రీ రీ రీ రీ
గా గా గా గా
పా పా పా పా

పల్లవి:
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
వీణవై ...వేణువై ...మువ్వవై ...వర్ణమై
వీణవై జాణవై వేణువై వెలధివై
మువ్వవై ముదితవై వర్ణమై నా స్వర్ణమై
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె

సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

చరణం 1:
అరుణం అరుణం ఒక చీరా.....అంబర నీలం ఒక చీరా
అరుణం అరుణం ఒక చీరా.....అంబర నీలం ఒక చీరా
మందారంలో మల్లికలా..... ఆకాశంలో చంద్రికలా
అందాలన్నీ అందియలై..... శ్రుగారంలో నీ లయలై
అలుముకున్న భూతావిలా... అలవికాని పులకింతలా
హిందోళ రాగా గంధాలు నీకు ఆందోళికా సేవగా

ఆ.............
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

చరణం 2:
హరితం హరితం ఒక చీరా.....హంసల వర్ణం ఒక చీరా
హరితం హరితం ఒక చీరా.....హంసల వర్ణం ఒక చీరా
శాద్వరానా హిమదీపికలా ....శరద్వేలా అభిసారికలా
చరణాలన్నీ లాస్యాలై.....నీ చరణానికి దాస్యాలై
అష్ఠపదుల ఆలాపనే....సప్తపదుల సల్లాపమై
పురి విప్పుకున్న పరువాల పైట సుదతి నే వీవగా.....ఆ...

ఆ.......
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా
నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావె
సరిగమపదని స్వరధారా
రస సాగర యాత్రకు ధ్రువతారా

For latest updates on ETV Network http://www.etv.co.in Subscribe for more latest...
youtube.com|By etvteluguindi

No comments:

Post a Comment