Thursday 2 January 2020

***Rendu Jalla Seetha Kobbari Neellaa Jalakaalaadi


కొబ్బరి నీళ్ళ జలకాలాడి...కోనసీమ కోక గట్టి..

చిత్రం : రెండు జెళ్ళ సీత (1983)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :

కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..
కోనసీమ కోక గట్టి.. ఆహా..ఆహా..ఆహా..
పొద్దుటెండ తిలకాలెట్టి.. ముద్ద పసుపు సందెల కొస్తావా
ముద్దు తీర్చే సందిటి కొస్తావా..ఆ.. ముద్దు తీర్చే సందిటి కొస్తావా

కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..
కోనసీమ కోక గట్టి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..
పొద్దుటెండ తిలకాలెట్టి.. ముద్ద పసుపు సందెల కొస్తాలే
ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే..ఏ.. ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే

చరణం 1 :

ఆకాశ వీణల్లో నేను..ఊ.. అనురాగమే పాడుకుంటా
గొంగూర పచ్చట్లో నేను.. ఉల్లిపాయే నంజుకుంటా.. స్స్.. నీరుల్లిపాయే నంజుకుంటా

ఆకాశ వీణల్లో నేను... అనురాగమే పాడు కుంటా
శృంగార వీధుల్లో నేను.. రసనాట్యమే ఆడుకుంటా..
ప్రేమ రసనాట్యమే ఆడుకుంటా

మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా..
వదిలేస్తే వంకాయ వండించుకుంటా..
Ah.. I am sorry..
వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి
అన్నారు కదండి.. అందుకే అలా పాడాననమాట..

చరణం 2 :

అమ్మవారి ఎదుట నేనూ..ఊ..
నీ కుంకుమే దిద్దుకుంటా.. నీ కోసమే కాచుకుంటా
అమ్మతో చెప్పి నేనూ..ఊ.. అప్పచ్చులే తెచ్చుకుంటా..

అమ్మవారి ఎదుట నేనూ..ఊ..
నీ కుంకుమే దిద్దుకుంటా.. నీ కోసమే కాచుకుంటా
అసుర సంధ్యవేళ నేనూ..ఊ..
ఆలయంలో వేచి వుంటా.. నీ హారతే అందుకుంటా

మాగాయలోన పెరుగేసుకుంటా..
వదిలెస్తే నా దారి నే చూసుకుంటా..
హ్మ్.. చూడండి..
మాగాయ మహాపచ్చడి.. పెరుగేస్తే మహత్తరి.. అది వేస్తే అడ్డ విస్తరి
మానిన్యా మహాసుందరి.. అన్నారు కదండి.. అందుకే అలా పాడాననమాట..
హహహ..

https://www.youtube.com/watch?v=7Hu8_OPnGOg
Rendu Jalla Seetha Kobbari Neellaa Jalakaalaadi
Lyrics : Veturi Sundara Rama Murthy Gaaru Music : Ramesh Naidu Gaaru Actors : Naresh, Pradeep, Subha...

No comments:

Post a Comment