Wednesday 1 January 2020

ఓ భార్య కధ




మనసులకు లాలిపాట...మన కథల జాలిపాట...

చిత్రం : ఓ భార్య కధ
సంగీతం : SP.బాలసుబ్రహ్మణ్యం
గానం : S.జానకి

పల్లవి :

మనసులకు లాలిపాట మన కథల జాలిపాట
రెప్పలేని క౦టి పాపకే నాపాపకి
దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట

చరణం :

ఏ దేవుడీ చేరాతలో నాపాపగా నిన్ను చేసే
నాదేవుడే చేజేతులా ఈ అమ్మనే బొమ్మ చేసే
నీదిక్కుగా నేను౦డగా నాదివ్వె నీలోన మెరిసే
కన్నీటి లో కమలాలకై ఏ తుమ్మెదో వేచి చూసే
నాగీతమోగీతమై.. నా క౦టి జలపాతమై ..
నీతల్లిగా జోల నేపాడనా నీడోల నేనూపనా

చరణం :

ఏజన్మ కీ స్త్రీ జన్మమే నీకొద్దు నా చిట్టీ తల్లి
ఏకాకిలా ఓ కాకిలా మారి౦ది ఈ కన్నతల్లి
ఈకోవెలా నాకో వెలా తెచ్చి౦ది ఈనాడు తల్లి
నావెన్నెలే ఆవేదనై పొ౦గి౦ది నా క౦ట మళ్ళి
వాల్మికి వారి౦చినా వగచి౦ది ఆ జానకి
నీ జోల కావాలి ఈ అమ్మకి నాతల్లిగా జన్మకి

https://www.youtube.com/watch?v=PJwqNKZ8q3Y
Manasulaku laali paata - Oh Bharya Katha - Music:SPB - Singer S Janaki
A soulful melody composed by SPB in emotional vocals of S Janaki.

No comments:

Post a Comment