Sunday 31 January 2016

Students Special for the month of 2/2016

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - విద్యార్ధులకు (వ్యాసాల) ప్రభ 

సర్వేజనా సుఖినోభవంతు

ఎపుడో 1950 లలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తీయాలని సంకల్పించి.. ఒక పాటను కూడా రికార్డు చేసారు. గీత రచయిత పడాల . ఆ పాట సాహిత్యము ఇది. నిన్న ఘంటసాల పాటలు వింటుంటే మా మిత్రులు శ్రీ రమేష్ పంచకర్ల గారు సౌండ్ క్లౌడ్ లో పెట్టిన ఈ అపురూప ఆడియో వినబడితే దాని సాహిత్యము వ్రాసి పెట్టాను.


పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
ఓహో.. హర హరం ప్రణవమున ఓంకార నాదాన
హర హరం ప్రణవమున ఓంకార నాదాన

పర ప్రభుత్వపు నీడ సీమదొరలా జాడ
కుంటుతూ బ్రతుకుటే జాతికే సిగ్గురా
ముక్కోటి తమ్ముళ్ళను ఒక్కటిగా నిలబెట్టి
మెడ బట్టి తెల్లోళ్ళ నెట్టి గెంటాలిరా
మెడ బట్టి తెల్లోళ్ళ నెట్టి గెంటాలిరా

పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
ఓహో.. హర హరం ప్రణవమున ఓంకార నాదాన
హర హరం ప్రణవమున ఓంకార నాదాన

పలనాటి చంద్రుని వెలుగు విక్రమ ధాటి
నాగులేటి నాగు బుగ బుగల పగ కాటు
రాణి రుద్రమ రౌద్ర రోషాన లజ్జానా
స్త్రీ మహా శక్తిరా.. శ్రీరామ రక్షరా
స్త్రీ మహా శక్తిరా.. శ్రీరామ రక్షరా

పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
స్వాతంత్ర్య విప్లవ సమర రంగానా
ఓహో.. హర హరం ప్రణవమున ఓంకార నాదాన
హర హరం ప్రణవమున ఓంకార నాదాన

గోదావరి పరుగు కృష్ణవేణి ఉరకా
పర్వతాలే రగులు మన్య తేజముతో
తెలుగు గడ్డే నీకు నివ్వాళులెత్తా
తొడగొట్టి జైకొట్టి జయము కొనరారా
తొడగొట్టి జైకొట్టి జయము కొనరారా









\



ఫిబ్రవరి నెల చివరిరోజు :: ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం (Last Day of February:: World Rare Diseases Day) (29-02-2016)

అమితాబ్ బచ్చన్’ ప్రొజీరియా’ అనే అత్యంత అరుదైన వ్యాధిగ్రాస్తునిగా నటింఛిన “పా”, అమీర్ ఖాన్ నటించిన “ తారే జమీన్ పర్” సినిమాలో డిస్లెక్సియా వ్యాధులు గుర్తుండే ఉంటాయ్యి. ప్రతీ 2000 జనాభాలో ఒక్కరికే మాత్రమే సంక్రమించే వ్యాధిని అరుదైన వ్యాధియనీ, వైద్య పరిభాషలో ‘అనాధ వ్యాధి’ యని కూడా పిలుస్తారు. ఈవ్యాధికి అరుదైనప్పటికీ వ్యాధిగ్రస్తులూ, వారి కుటుంబాలూ అనుభవించే బాధవర్ణనాతీతం. కొన్ని ప్రాంతాల్లో అరుదైన వ్యాధి మరికొన్ని ప్రాంతాల్లో సర్వజనీనం. వంశానుగతంగా సంక్రమించే తలసేమియా, రక్తలేమి వ్యాధులు తూర్పు ఐరోపాలో అరుదుగా ఉంటే మధ్యధరా ప్రాంతం‌లో సాధారణం. సంవత్సరకాలంలో సంభవించే కొన్ని వ్యాధులు ఫ్రాన్స్‌లో కొద్ది నెలలకు పరిమితమైతే అమెరికాలో అదొక సాధారణ వ్యాధి.

జన్యుపరంగా సంభవించే వ్యాదుల్లో అధికం అరుధైన/అనాధ వ్యాధులే. ఇవి వేలకొద్దీ ఉన్నాయి. ఇప్పటికి వైద్యశాస్త్రం సుమారు 6 నుండి 7 వేలవరకు అరుదైన వ్యాధులను గుర్తించడంతోపాటు కొత్త కొత్త వ్యాధులను ఆవిష్కరించే ప్రయతనం చేస్తూనే ఉంది.
అరుదైన వ్యాధులు హానికరమైనవే కాకుండా దీర్ఘకాలికమైనవి. ఈ వ్యాధులు అత్యంతవెగంగా అభివృధ్ధి చెందుతాయి. ప్రాక్సిమల్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, న్యూరో ఫైబ్రోమాటాసిస్, ఆస్టొ జెనసిస్ ఇంపర్ఫెక్టా, కాండ్రోడిస్ప్లాసియా/ రెట్ సిండ్రోమ్ (proximal spinal muscular atrophy, neurofibromatosis, osteogenesis imperfecta, chondrodysplasia or Rett syndrome) వంటి వ్యాధులను పుట్టుకలోనే గుర్తించ గలిగినప్పటికీ, హంటింగ్‌టాన్ వ్యాధులు, క్రోన్ వ్యాధి, కార్కట్- మేరీ- టూత్ డిసీజ్, అమ్యోట్రోఫిక్ లాటెరల్ స్లెరోసిస్, క్పోసీ సర్కోమా (Huntington diseases, Crohn disease, Charcot-Marie-Tooth disease, amyotrophic lateral sclerosis, Kaposi's sarcoma or thyroid cancer) వంటి అనేక వ్యాధులు యుక్తవయసులోనే బయటపడతాయి.

అరుదైన వ్యాధులకు సరిపోయే వైద్యం, చికిత్సలకు అవసరమైన పరిజ్ఞానం సహజంగానే తక్కువగా ఉంటుంది. కొద్దికాలం క్రితంవరకు ప్రభుత్వాలూ, వైద్య శాస్త్రం, ప్రణాళికాకర్తలూ అరుదైన వ్యాధుల ఉనికిని గుర్తించలేదు. కొన్ని వ్యాధులకు కారణాలనూ, చికిత్సనూ ఆవిష్కరించినప్పటికీ అనేకానేక అరుదైన వ్యాధులకు ప్రారంభస్థాయి చికిత్సకూడా కనుగొనబడలేదు.

“ మా సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనూ మాతో కలపండి” ఇదీ ఈ సంవత్సరపు అనుష్టానం.

ఏ వ్యాధినివారణకైనా అత్యంత ప్రాధమికమైనదీ, ప్రాముఖ్యమైనదీ ‘అవగాహన’. అరుదైన వ్యాధిగ్రస్తులకు మనం చేయూతనిచ్చి, వారితో గొంతుకలుపుదాం

 
27 ఫిబ్రవరి అంతర్జాతీయ ధృవప్రాంత ఎలుగుబంటి దినొత్సవము
                          
ధృవప్రాంతమనగానే మనకు ఎలుగుబంటి, పెంగ్విన్ పక్షి గుర్తుకువస్తాయి. తూర్పు ధృవం‌లో (ఆర్కిటిక్) ఎలుగుబంటి నివసిస్తే దక్షిణ (అంటార్క్టిక్) ధృవం‌లో పెంగ్విన్ పక్షి జీవిస్తుంది. ఈ రెండు ప్రాణులు ఒకదాన్నిమరొకటి జీవితకాలం‌లో కలుసుకోవు. ఆర్కిటిక్ ఘనీభవించిన సముద్రమైతే, అంటార్కిటికా ఒక మంచు ఖండం. ఆర్క్టిక్ ధృవంపై శీతాకాలం‌లో -60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, వేసవిలో 0 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.

ధృవప్రాంత ఎలుగుబంటి ఆర్కిటిక్ సముద్రాన్ని ఆవరించిన ఆర్కిటిక్ వలయం‌లో జీవిస్తుంది. ఇది బహుచరి (నేల, నీళ్ళు, మంచు ప్రాంతాల్లో కూడా జీవించగలుగుతుంది) మరియు మాంసాహారి. ఇంకా నరమాంసభక్షిణి. ఈజంతువును జంతుశాస్త్రం‌లో ఉర్సస్ మరిటిమస్ అంటారు. మగ ఎలుగుబంటి 4 అడుగులపైగానూ, ఆడ ఎలుగుబంటి మూడున్నర అడుగులకు కొంచెం ఎత్తుగానూ ఉంటుంది. మగ ఎలుగుబంటి 450 కిలోలు, ఆడ ఎలుగు బంటి 150 నుండి 250 కిలోల బరువుంటుంది.

ధృవప్రాంతపు ఎలుగుబంట్లలో 19 ఉపజాతులున్నాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతారు. వీటిలో 80% వరకు కెనడాలొ ఉన్నాయి. కొన్ని దేశాలు ఈజంతువులను అరుదైనవిగా గుర్తిస్తే, మరికొన్ని దేశాలు ఇవి ప్రమాదములో ఉన్నజాతులనీ, ఇంకొన్ని దేశాలు ఈ ఎలుగుబంట్లు అత్యంత ప్రమాదం‌లోనున్నాయని గుర్తించాయి. అంతిమంగా ధృవప్రాంతపు ఎలుగుబంటి అంతరించిపోయే ప్రమాదం‌లో నున్నదని ఐక్యరాజ్యసమితి ప్రకటింఛింది.
పర్యావరణవేత్తలు, జంతు శాస్త్రజ్ఞులు 1973నుండి వీటిని అధ్యయనం చేస్తున్నారు. ఐరోపా, రష్యా మరియు అమెరికాదేశాలవారుకుచెందిన వేటగాళ్ళు క్రీ. శ. 1600 సం. నుండి అప్పటివరకు (1973) వరకు సాగించిన అదుపులెని వేటవల్ల ధృవప్రాంతపు ఎలుగుబంట్లు ప్రమాదకర పరిస్థికిలోకి నెట్టబడ్డాయని గుర్తించారు. కెనడా, అమెరికా సమ్యుక్త రాష్ట్రాలు, డెన్మార్క్, నార్వేలతోపాటు నాటి సోవియట్ రిపబ్లిక్ దేశాలు వాణిజ్యంకోసం ఎలుగుబంట్ల వేటనునిషేధిస్తూ “అంతర్జాతీయ ధృవప్రాంత ఎలుగుబంట్లు మరియు వాటి ఆవాస పరిరక్షణ ఒప్పందా”న్ని రూపొందించారు. అమెరికా ప్రభుత్వం వీటిని “అంతరించిపోతున్న జాతులు”గా గుర్తించింది.

“సేవ్ పోలార్ బీర్” సంస్థ ఈ జంతువులు అంతరించిపోవడానికి గల కారణాలను గుర్తించారు: వాతావరణ మార్పులు, ఆర్క్‌టిక్ దేశాలకు చెందిన ఆదివాసులకు ఎలుగుబంటి సాంప్రదాయక ఆహారం. తమ ఆరోగ్యకర జీవనానికి ఎలుగుబంటి ఆహారమే సరియైనదనీ, అది తమ హక్కుయనీ భావిస్తారు. .

ఇదంతా చదివాక మనకో సందేహం వస్తుంది “ఎక్కడొ ఆర్కిటిక్ ధృవంలో అంతరించిపోతున్న ఎలుగుబంటికీ మనకూ సంబంధమేమిటి?”
ధృవప్రాంతపు ఎలుగుబంటి జీవించగలిగే వాతావరణం ప్రపంచ పర్యావరణానికి గీటురాయి. వాతావరణ మార్పులవల్ల ధృవప్రాంత ఎలుగుబంటి మనుగడ ప్రమాదం‌ వచ్చిందంటే మొత్తం ప్రపంచ పర్యావరణ
వ్యవస్థ విధ్వంసమైందనేదానికి సంకేతం. ఇదెలాగో చూద్దాం.

భూతాపంవల్ల ఆర్కిటిక్‌లోని ఘనీభవించిన సముద్రం కరిగి మంచు ప్రాంతం కుంచించుకుపోవడంతో భూగోళవ్యాప్తంగా సముద్రాల నీటిమట్టాలు పెరిగి తొలుతగా తీరప్రాంతాలు ముంపుకు గురికావడం మొదటి అంశమైతే .... . .

ఘనీభవించిన మంచుకరిగి గ్లేసియర్ తగ్గిపోవడం వల్ల ధృవప్రాంతపు ఎలుగుబంటి సాగరజీవుల బారిన పడుతుంది. తనస్థానబలిమిని కోల్పోవడంవల్ల అత్యంత వేగంగా జనాభా తగ్గిపోతుంది. అందువల్ల ధృవప్రాంత ఎలుగుబంటి ప్రధాన ఆహారమైన సీల్ చేపల సంతతి తామరతంపగా వృధ్ధి చెంది, తమకు ప్రధాన ఆహారమైన ఇతర రకాల చేపలను ఇబ్బడీముబ్బడిగా తినేస్తాయి. దాంతో ప్రాణాంతకమైన నాచు శరవేగంగా సప్త సముద్రాలకు విస్తరిస్తుంది, శరవేగంతో భూమిని ఆవరించిన పలు పర్యావరణ వృత్తాలు దెబ్బతింటాయి.
అంతిమ ఫలితం: సముద్రాల్లో నేటి మట్టాలు పెరగడం, పర్యావరణ స్థితిగతుల్లో మార్పులు..

ఇంక మన భవితవ్యం....... ?????????????????

అందుకే Think Globally and Act Locally !!!!!!!!!!.,

మనవంతుగా పర్యావరణానికి విఘాతం కల్గించే జీవన విధానాన్ని మార్చుకుందాం. ధృవ ప్రాంతపు ఎలుగుబంటిని కాపాడుదాం.
కాస్తా పొడుగ్గా, రాజుగారి ఏడు చేపల కధలా ఉందికదూ!!


 తెలుగు భాషా దినోస్చవం 

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకొండ
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స

దేసభాశలందు తెలుగు లెస్స అంటే లెస్ అని అనుకుంటునారు మన జనాలు. లెస్స అంటే గొప్పది అని తెలుసుకునే వారు లేక పోయారు.. ప్రభుత్వ పాలకులదీ అదే తీరు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిరబంధ తెలుగు ప్రవేశ పెటడములో ప్రభుత్వాలు అలసత వహిస్తున్నాయి. ప్రజలూ ఆలాగే ఉన్నారు.
ఎవరికైనా వారి వారి మాతృభాష అంటే అంత ప్రేమ ఉంటుంది.. కానీ మన తెలుగు వారికన్నా మిగతా భాషీయులకు వారి మాతృభాష అంటే ఇంకాస్త ప్రేమ ఎక్కువ. మనం మన తోటి తెలుగు వారితో ఆంగ్ల సంభాషణ చేయడం గొప్ప అనుకుంటాము.. అదే ఏ మలయాళీ నో , కన్నడిగుడో , అమితంగా తమిళీయులనో చూడండి. వారి తమిళ్ వారిని చూస్తే టక్కున వారి భాషలో సంభాషించడం మొదలు పెడతారు. మరి మనవారో, మన పక్కింటి పుల్లారావును చాలాకాలం తరువాతా కలిస్తే కూడా మనం మాటాడేది.. ఇంగ్లీష్ లో పలకరింపే. ఈ జాడ్యం 1990 ల తరువాత మరీ మితిమీరిపోయింది. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాటాడితే శిక్షించే ప్రబుద్ధులు అధ్యాపకులు అయ్యారు. ఆంగ్లములో మాటాడితే నాగరీకమా? మరి మన మాతృభాషలో సంభాషిస్తే అది అనాగరీకమా? వేమన , సుమతి పద్యాలు నేర్చుకోవడం పాత పద్దతులు అయ్యాయి.

తెలుగు భాష శబ్ద సంపదలో, శబ్ద సౌష్టవంలో, భావ వ్యక్తీకరణలో, శ్రావ్యతలో తెలుగుతో మిగతా దేశ భాషలు సాటి రావు. వీనుల విందుగా ఉన్న మన ఆనాటి తెలుగు గీతాలు , మన పూర్వీకులు రచించిన పదాలు , కీర్తనలు వినండి . తెలుగు భాషలోని మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. జన్మతః తమిళుడైన మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఏమన్నారో తెలుసా? సుందరమైన తెలుగు పాట పాడుతూ సింధూ నదిలో పడవ నడుపుదాం అంటూ.. అద్భుత గీతాన్ని వ్రాస్తూ సుందర తెనుంగు అని మెచ్చుకున్నారు. మన విశ్వనాథులవారి మాటల్లో చెప్పాలి అంటే "ఒక్క సంగీతమేదో పాడునట్లు, మాట్లాడునప్పుడు విన్పించు భాష తెలుగు భాష. భాషలొక పది తెలిసిన ప్రభువు చేత భాషయన యిద్దియని అనిపించుకున్న భాష". కేరళ మహారాజు స్వాతి తిరునాళ్ తెలుగు భాషా సౌందర్యం తెలిసినవాడు కావున తనకు తెలుగు నేర్పించేందుకు ఆంద్ర దేశం నుండి ఏకంగా ఒక తెలుగు పండితున్నే తెప్పించుకుని ఈ భాషను నేర్చుకున్నారు. ఇంక ఏకంగా త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలకు ఆద్యురాలు "విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ " గారు జన్మతః కన్నడ దేశము , పెరిగింది తమిళ దేశములో అయినా నాకు అత్యంత ప్రియమైనది తెలుగే అని గర్వంగా చెప్పుకున్నారు. ఎందఱో మహా మహులు కీర్తించిన తెలుగు నేడు మన వారికే కాక పోతున్నది. తెలుగు పతాకం యెరుగని దేశమే లేదు, తెలుగు దివ్వె వెలుగునట్టి దిశయే లేదు" అని తెలంగాణా దార్శనికుడు శ్రీ దాశరథి రంగాచార్య గారు వెలుగెత్తి చాటారు.. తెలుగు నేల మీద పుట్టి , తెలుగు నేల మీద పెరిగి తెలుగు మాటాడ్డం రాదనీ చెప్పుకునే కుసంస్కారులను మన కాళోజీ " తెలుగు బిడ్డవయుండి, తెలుగు రాదంచు, సిగ్గులేకా ఇంక చెప్పడమెందుకురా?, అన్య భాషలు నేర్చి, ఆంధ్రమ్ము రాదంచు, సకలించు ఆంధ్రుడా చావవెందుకురా అని తీవ్రంగా మందలించారు. అయినా తెలుగు భాష తీయదనాన్ని నేర్చుకుని ఆస్వాదించే ప్రజలు కరువైపోతున్నారు. సాక్షాత్ జాతిపిత మహాత్మా గాంధి తెలుగు నేర్చుకోవాలని తెలుగు వారి గూర్చి ఏమన్నారో తెలుసా ? తెలుగు భాష మధురమైనది. ఆ భాష నేర్చుకోవాలని నేను చేసిన ప్రయత్నం అక్షరక్రమంతోనే ఆగిపోయింది. తెలుగువారు అమాయకులు, మధుర స్వభావులు, త్యాగనిరతులు. మనం మధుర స్వభావులమే పరభాషలను నెత్తిన పెట్టుకోవడములో , మనం త్యాగ నిరతులమే .. తలన పెట్టుకుని గర్వంగా నేను తెలుగు వాడిని , నాది తెలుగు భాష అని చెప్పుకోవడానికి వెనుకాడటములో.


దర్శకబ్రహ్మ కాశీ విశ్వనాథుని 86వ జన్మదినం సందర్భంగా : (19-02-2016)

కాశీనాథుని విశ్వనాథ్ ఈ పేరు వింటేనే చాలామంది తెలుగు వారు పులకితులైపోతారు.. ప్రతి ఒక్క నటుడు, నటీమణి ఆయన దర్శకత్వములొ ఒక్కసారి అయినా నటించాలి అని తెగ ఉవ్విళ్ళూరుతారు . తెలుగు చలనచిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత వారిది. మొదట వారు ఎందఱో ఉద్దండ దర్శకుల చిత్రాలకు పని చేసిన తరువాత 1964 లో అన్నపూర్ణా వారి ఆత్మగౌరవం చిత్రముతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆత్మగౌరవాన్ని నిలువెత్తుగా నిలబెట్టారు. ఆ చిత్రములో ప్రతి ఒక్క పాటా సుమధురం అయినా.. అతిథి దేవోభవ అనేది మన ఘన భారతీయ సంస్కృతీ కాబట్టి , ఈ ఆతిథ్యం ఇవ్వడమ అనేది చిన్న తనం నుడి ప్రతి ఒకరికీ అబ్బాలని వారు " మారాజు లొచ్చారు, మహా రాజులొచ్చారు" అన్న పాట ఆ చిత్రములోని బాలపాత్ర దారుల ద్వారా పాడించడం, వారు అతిథులకు తెలుగు వంటకాలు వడ్డిస్తూ ఆ దృశ్యం ఎంత అద్భుతం. అలాగే అందులో క్షేత్రయ్య మువ్వగోపాల పదం "నిన్నటి వలే నాపై నెనరున్నదా స్వామి" అంటు సాలూరి వారి రసాలూరు సంగీతం , కాంచన రాజశ్రీల అద్భుత నృత్యం మరువలేనివి.

ఆ తరువాత కొన్ని చిత్రాలు తీసినా వారి అత్యద్భుత ప్రతిభకు నిదర్శనం "ఉండమ్మా బొట్టు పెడతా" అందులో మామ మహదేవన్ చేత చేయించుకున్న ప్రతీ స్వరం సజీవమే .. ఇక దేవులపల్లి వారి సాహిత్యం ఏమని చెప్పగలం . రావమ్మా మహాలక్ష్మి అని పల్లె పడచుల చేత సంక్రాంతి పౌష్యలక్ష్మిని ఆహ్వానించడం.. గాదెల్లో ధాన్యాలు చావిళ్ళ భాగ్యాలు ఇపుడు అంతగా కనబడక పోయినా ఇప్పటికీ వినబడుతూనే ఉన్నాయి. పాలిచ్చే గోమాతకు పసుపు కుంకాలు పెట్టించి , పనిచేసి మన అందరి కడుపులు నింపే బసవనికి పత్రీ పుష్పము ఇప్పించి తమ కృతజ్ఞత తెలియ జేసారు .. ఇంటింటి ముంగిటా రంగవల్లులు.. ఇప్పటికీ ఆ సంక్రాంతి శోభ ప్రతి సంక్రాంతికి మన తెలుగువారింటా వినబడుతూ ఆవిష్కృతం అవుతుంది. "అడుగడుగునా గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది అదియే దైవం " అంటూ ప్రతి ఒక్కరిలో హృదయమనే గుడి ఉంది .. "ఇల్లూ వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువనిపించాలి, ఎల్ల వేళలా మంచు కడిగిన మల్లె పూవులా ఉండాలి ".. అందులో "దీపం మరి మరి వెలగాలి తెరలు పొరలు తొలగాలి" అంటూ అద్భుతమైన భారతీయ వేదాంతాన్ని చెప్పించారు. ఇక రైతుల కష్టాన్ని చెబుతూ .. ఉమ్మడి కుటుంబ ఆవశ్యకతను తెలియచేస్తూ " పాతాళ గంగమ్మ పైకెగసి రా రా " అంటూ పంటలు పండించేందుకు సర్వజన జీవధార ఆయిన గంగమ్మను రప్పించారు.. ఇందులో ప్రతి ఒక్క పాటా ఆణిముత్యమే.

ఇంక వారు తీసిన చెల్లిలి కాపురములో ఘోస్ట్ రైటర్స్.. భావ చోరుల గూర్చి చెప్పిన తీరు అద్భుతం.. "కాలం మారింది" అంటూ కులాల తెరలను నిరసించారు. "ఓ సీత కథ " ద్వారా స్త్రీల కష్టాలు తెరపై చూపించారు.. "సిరి సిరి మువ్వ" తో మన తెలుగు అందాల జయప్రదను హిందీ కి కూడా పరిచయం చేసి జాతీయనటిని చేసారు. వారు తీసిన "శుభోదయము" లో ఇప్పటికీ మన అందరికీ నచ్చిన పాటలు " కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేవో చెప్పమ్మా.. త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ వంటివి ఎంత అద్భుత ప్రయోగాలు " , "గంధము పుయ్యరుగా" త్యాగరాజ కీర్తన రసగంగలో మనలను ముంచి తేలుస్తాయి.

ఇంక తరువాత వచ్చిన శుభలేఖ, సప్తపది, స్వాతిముత్యం , శృతిలయలు,స్వయంకృషి, సిరివెన్నెల, సాగరసంగమం , సూత్రధారులు , శుభ సంకల్పం, స్వర్ణకమలం ,ఆపద్భాందవుడు ఇవన్నీ ఒక ఎత్తు. తెలుగు చలనచిత్ర ఖ్యాతిని అంతర్జాతీయ ఖండాంతరాలు దాటించిన "శంకరాభరణం" ఒక ఎత్తు. మా అమ్మ నాన్న ఈ చిత్రాన్ని నేను కడుపులో ఉండగా చూసారట.. అందుకేనేమో నాకు శ్రావ్యమైన సంగీతం అన్నా , సాహిత్యం అన్నా అంత మక్కువ. ఇందులో శంకర శాస్త్రి పాత్ర ద్వారా భారతీయ సంగీత గొప్పదనం గూర్చి చెప్పించడం నభూతో నభవిష్యతి. అందులో స్టార్ హీరోలు లేరు , స్టార్ నాయికలు లేరు. ఉన్నది హృద్యమైన కథ , సంగీతం .. పాత్రలకు తగ్గ నటులు . ఎక్కడో సబ్ కలెక్టర్ గాఉంటూ అపుడపుడు తెలుగు నాటకరంగం మీద మక్కువతో కన్యాశుల్కం వంటి నాటకాలు ప్రదర్శించిన జె. వి సోమయాజులు గారిని చిత్ర సీమకు తెచ్చారు. ఇంక స్వయంగా అత్యద్భుత నర్తకి అయినా క్లబ్ డాన్సు లు చేస్తూ వచ్చిన మంజు భార్గవి ద్వారా అద్భుత సెమి క్లాసికల్ నృత్యాలు చేయించారు. ఆ పాత్ర ప్రభావముతో ఆమె మళ్ళీ అటువంటి క్లబ్ డాన్సు పాత్రలు చేయను అని ప్రతిజ్ఞ పూనుకునేలా చేసిన అద్భుత చిత్రం. ఇంక మలయాళం వంటి భాషలలోకి ఈ చిత్రం అనువాదం అయినా పాటలు మాత్రం తెలుగువే ఉంచేసుకున్నారు అంటే ఇంక ఆ పాటలు గూర్చి ఏమని చెప్పగలము. నా మలయాళ స్నేహితులు ఇప్పటికీ అత్యంత ప్రేమగా పాడుకునేవి ఈ శంకరాభరణం చిత్ర గీతాలు .ఈమధ్యనే ఈ చిత్ర తమిళము లోనికి అనువాదం అయింది కూడా కువైట్ లో ఆ మధ్య ప్రముఖ నటుడు వినీత్ నాట్య ప్రదర్శన ఉంటే వెళ్ళాము అందులో ఈ శంకరాభరణం చిత్రములోని రెండు పాటలకు వారు అద్భుతంగా నర్తించారు. ఇంక మొన్న ఫిబ్రవరిలో రామేశ్వరం వెళ్లి ఉంటే అక్కడ గుడి ఆవరణలో జరుగుతున్నా సాంస్కృతిక కారయక్రమములో సైతం " శంకరా నాద శరీరాపరా" పాడారు అంటే అర్థం అవుతుంది అవి ఇప్పటికీ ఎంత ప్రఖ్యాతి పొందాయో


పిడుగంటే ?

ఆవిరి రూపంలో ఉన్న నీటితో కూడిన మేఘాలు పరస్పరం ఒకదానితో మరోటి ఢీ కొనడం వల్ల సంభవించేదే పిడుగు. ఇలా రెండు మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొన్న సమయంలో కలిగే ఒత్తిడితో విద్యుత్ తరంగాలు బయటకు ఉత్పత్తి అవుతాయి. ఈ విద్యుత్ తరంగాల శక్తి లక్షల ఓల్టుల్లో ఉంటుంది. ఆ సమయంలో వచ్చే శబ్ధం లక్షల డెసిబుల్స్లో ఉంటుంది.

మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్, ధ్వని తరంగాలు భూమిపైకి చేరేందుకు వీలుగా సన్నటి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం గుండా ధ్వని, విద్యుత్ తరంగాలు భూమిని చేరుతాయి. ఈ సమయంలో అవి ప్రవహించే మార్గంలో 50 వేల డిగ్రీల వేడి నమోదవుతుందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలా భూ ఉపరితలం మీద నుంచి అవి భూమిలోకి వెళ్తాయి. ఇలా వెళ్లాలంటే వాటికి మరో సాధనం కావాలి. అవి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ఆలయాల్లోని ధ్వజస్తంభాలు వంటి వాటి ద్వారా ఈ విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్లిపోతాయి. ఒక్కోసారి మైదాన ప్రాంతాల్లో కూడా విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న మనుషులు, జంతువులు వాటికి సాధనంగా మారతారు. అప్పుడే మరణాలు సంభవిస్తాయి.

ఆకస్మిక వర్షాల సమయంలోనే అధికం??

ప్రకృతి సిద్ధంగా రుతువుల ప్రకారం కురిసే వర్షాల సమయంలో మేఘాలు భూమికి చాలా ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో వాటి మధ్య ఏర్పడే విద్యుత్ తరంగాలు ఉరుములు, మెరుపులుగానే బీభత్సం సృష్టిస్తాయి. ఇలాంటి సమయాల్లో పిడుగులు పడే అవకాశం అరుదు. ఆకస్మికంగా వర్షాలు కురిసే సమయంలో మాత్రం మేఘాలు తక్కువ ఎత్తులో ఉంటాయి. ఈ సమయంలోనే వాటి నుంచి ఏర్పడే విద్యుత్ తరంగాలు భూమిని చేరుతుంటాయి. భూమిపైకి వచ్చి పిడుగులుగా మారి ప్రాణాలు హరిస్తుంటాయి. ఒక్కోసారి ఇవి ఆస్తి నష్టాలను కలగజేస్తాయి.

మెరుపు - ఉరుము - పిడుగు??

ఆకాశంలో మేఘాలు పరస్పరం ఢీకొన్న సమయంలో విద్యుత్, ధ్వని తరంగాలు వెలువడతాయి. వీటిల్లో విద్యుత్ తరంగాలు ముందుగా మెరుపు (కాంతి) రూపంలో మనకు కనిపిస్తాయి. తరువాత ధ్వని తరంగాలు శబ్ధం (ఉరుము) రూపంలో మనకు వినిపిస్తాయి. శబ్ధ తరంగాలు వినిపించే క్షణాల్లోనే పిడుగు పడుతుంది. మెరుపు కనిపించిన క్షణంలోనే అప్రమత్తమైతే కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంటుంది.

మైదాన ప్రాంతాల్లోనే ప్రమాదం..??

జిల్లాలో పిడుగుపాటు మరణాలను ఒకసారి పరిశీలిస్తే 95 శాతం మైదాన ప్రాంతాల్లోనే సంభవించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే సమయంలో మైదాన ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలి.

• మైదాన ప్రాంతాల్లో ఉన్న వారు మెరుపులు కనిపించిన సమయంలో నేలపై మోకాళ్ల మీద కూర్చుని తల కిందకి వంచి ఉంచాలి. దీంతో పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చు.
• ఎత్తయిన చెట్ల కింద, శిథిల భవనాల కింద నిల్చోవడం చేయకూడదు.
• మెరుపులు కనిపించే సమయంలో వ్యవసాయ పనుల్లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చోట గుంపుగా ఉండకూడదు. ఒక్కొక్కరుగా ఉండటం శ్రేయష్కరం.
• ఒక్కోసారి నేలపై బోర్లా పడుకుంటారు. ఇలా చేయడం సరికాదు. ఖచ్చితంగా మోకాళ్లపైనే తల కిందకు వాల్చి కూర్చోవాలి.
• గొడుగులు వాడకూడదు. చేతిలో పలుగు, పార వంటి వస్తువులు ఉంచుకోకూడదు.
• ఇళ్లపై పిడుగు పడే అవకాశం అరుదు కనుక వీలైనంత త్వరగా నివాసాలకు చేరుకుంటే మంచిది.
• మెరుపులు, ఉరుముల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు వినియోగించకూడదు.
• పిడుగు పాటుకు గురైన వాళ్లు ప్రాణాపాయం నుండి బయటపడటం అరుదు. ఒక్కోసారి అదృష్ట వశాత్తు బయటపడితే వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలి.



మాఘ మాస విశిష్టత

"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు
"దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!"
అని చేసిన తరువాత
"సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!"
అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.
ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు.కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. "మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.

అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.

సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే.
కులం కులాంతరం వర్ణ సంకరం!
( శ్రీ Vvs Sarma గారి విశ్లేషణ నామిత్రులకు పంచుతున్నాను.)
.
కర్ణుని కులమేమిటి?
కృష్ణుని యాదవ వంశాన్ని తమ పురు (కురు, భరత) వంశం కంటె తక్కువదని దుర్యోధనుడు ఎందుకు అధిక్షేపిస్తాడు?
వర్ణాలు గుణకర్మల మీద, కులాలు వృత్తులపైన, జాతులు సమూహాల పైన ఆధారపడి వచ్చిన తరగతిభేదాలని చూచాము.
ఎన్టీఆర్ తన దాన వీర శూరకర్ణ చిత్రంలో కర్ణునిది తక్కువ కులమని (BC), ఏకలవ్యునిది తక్కువ జాతి (tribal, ST, dalit) అని ద్రోణాచార్యుని బ్రాహ్మణిజం (అంటే ఏమిటొనాకు తెలియదు) కారణం వలన కుల వివక్ష జరిగి వాళిద్దరు అణచివేయబడ్డారని ప్రతిపాదిస్తాడు.
.
వర్ణాలు ఉన్నాయి కాని వర్ణాంతర వివాహాలు ఎప్పుడూ ఉన్నాయి.
కర్ణుని సూత పుత్రుడు అంటారు. ఒక సూతుడు గంగలో కుంతిచేత వదలివేయబడిన కర్ణుని పెంచుకుంటాడు. సూత శబ్దానికి అర్థమేది?
क्षत्रियाद्विप्रकन्यायां सूतो भवति जातितः విప్రకన్యకు క్షత్రియునివలన పుట్టినవాడు The son of a Kshatriya by a woman of the Brâhmaṇa caste (his business being that of a charioteer); ఇది విలోమ వివాహం.
అనులోమ ఎప్పుడూ ఒప్పుకున్నారు. ( ఉదా: వేయిపడగలులో రామేశ్వర శాస్త్రి.) బ్రాహ్మణులు నాలుగు వర్ణాల నుండి, క్షత్రియుడు మూడు వర్ణాల నుండి, వైశ్యుడు రెండు వర్ణాల నుండి, శూద్రుడు తన వర్ణం నుండి స్త్రీలను వివాహం చేసుకోవచ్చు.
పిల్లలకు తల్లి కులమే వస్తుంది. కాని ఆమధ్య సుప్రీం కోర్టు ఒక దళిత మహిళకేసులో బిడ్డకు ఒక ఉన్నతకులాని చెందిన తండి కులమే వస్తుందని తీర్పు నిచ్చింది.
కేరళలో నంబూద్రి బ్రాహ్మణ, నాయరు కులాల మధ్య సంబంధం ఇదే. మొన్న రోహిత్ వేముల కేసులో ఈ సమస్యే వచ్చింది.
.
సూతులకు ఉపనయన సంస్కారం ఉన్నది. రాజ్యాధికారం కూడా ఉన్నది.
క్షత్రియులతో వివాహ సంబంధాలుకూడా ఉన్నాయి. విరాట్రాజు భార్య ఉత్తర తల్లి సుధేష్ణ సూత స్త్రీయే. ద్రౌపది కీచకుడిని సూతపుత్ర అని సంబోధిస్తుంది. అందుకే దుర్యోధనుడు కర్ణునికి అంగ రాజ్యాభిషేకంచేస్తే వర్ణ ప్రసక్తి రాలేదు. పాండవుల తల్లి కుంతీదేవి యాదవ కన్య. కురు వంశీయులు, యదు వంశీయులు చంద్రవంశీయులే.
కాని యదువు యయాతికి బ్రాహ్మణ భార్య దేవయాని యందు, పురుడు క్షత్రియభార్య శర్మిష్ఠ యందు జన్మించారు. అందుచేత కృష్ణుని మూల పురుషుడు సూతుడే.
కృష్ణుడు పార్థ సారథియై కులధర్మం పాటించాడు. ఆయన ది సూతకులం, క్షత్రియ వర్ణం అంతే కాదు, భీష్ముడు కృష్ణుని సుబ్రహ్మణ్య అని సంబోధిస్తాడు.
కర్ణుడి ముగ్గురుభార్యలలో ఇద్దరు క్షత్రియులే. వాళ్ళ పేర్లు తెలుసా? వృషాలి, సుప్రియ, ఊర్వి. పశ్చిమ భారతంలో ఈ పేర్లు ధరిస్తారు.
.
ఏకలవ్యుడు నిషాద రాజు హిరణ్యధన్వుని కుమారుడు. భీముడు హిడింబను వివాహముచేసుకోవడానికి అడ్డం రాని జాతిభేదం ద్రోణుని కి రాలేదు
. కేవలం అర్జునుని మించిన విలుకాడు ఉండడని తన శపధం నేపథ్యంలోనే బొటనవేలు గురుదక్షిణగా అడుగుతాడు. ద్రోణుడు, అశ్వత్థామ దుర్యోధనునికి సేవకవృత్తిలో ఉండి
స్వధర్మం మరచిపాయిన నామ మాత్ర బ్రాహ్మణులు.
.
రామాయణ భారతాల నూతన అనుసృజనలు, విమర్శలు ఆ నాటికాలాన్ని,
ఆనాటిధర్మాలను మరచిపోయి ప్రస్తుత విలువలతో శిక్షాస్మృతితో మూల్యాంకనం చేస్తున్నారు. మనం రామాయణ భారతాలు ఎలా చదవాలి?
నేను ౘాలా కాలం క్రితం on the meaning of the Mahabharata అని ఒక అద్బుతమైన పుస్తకం చదివాను. 1942 లో బొంబాయి విశ్వవిద్యాలయంలో వి. ఎస్. సుక్తాంకర్ ఇచ్చిన 4 ఉపన్యాసాల సంకలనం ఇది. ఆయన భండార్కర్ ఇన్స్టీట్యూట్ తరఫున Critical Edition of Mahabharata సంపాదకుడు. ఆయన రచన రామాయణానికి అన్వయిస్తుంది. ఆయన సూచన ప్రకారం ఇవి three planes - mundane, ethical, and metaphysical లో చదివి అర్థం ఛెసుకోవాలి. తెలుగులో చెప్పాలంటే ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవిక పరిమాణాలలో అన్వయంచేసుకోవాలి
మన భారతదేశంలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు

ప్రపంచంలోనే భారతదేశంలో అనేక మిస్టీరియస్ సన్నివేశాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. భారతదేశంలో ప్రతీది ఒక మిస్టరీనే తలపిస్తుంది.
సంపన్నమైన పురాణగాధలు, అపార పరిమాణం, మరిచిపోలేని ఇతిహాసాలకు పుట్టినిల్లు భారతావని. కొన్ని చూసి తరించేవి అయితే.. మరికొన్ని ఆశ్చర్యం, భయం కలిగించేవి. మరికొన్ని సందేహాలతో సతమతపెట్టేవి చాలా ఉన్నాయి.

: హిందూ ఆలయాల వెనకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యం ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఇండియా చాలా ప్రత్యేకం. ఎక్కడ చూసినా, ఎటు వెళ్లినా భారతదేశం చుట్టూ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలే కనిపిస్తాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ.. మిస్టరీతో మిలితమై ఉన్నాయి. ఎవరికీ అంతుచిక్కని గొప్ప గొప్ప రహస్యాలు ఆ దేవాలయాలు, కట్టడాల్లో దాగున్నాయి. ఏ పురావస్తు శాఖ ఖచ్చితంగా చెప్పలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు సృష్టించారు. ఇండియాలో అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం కలిగించే దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. మీలో అంతులేని ఆలోచనలు, ఆశ్చర్యాలు తీసుకొచ్చే కొన్ని పుణ్యక్షేత్రాల విశేషాలు, మిస్టరీలు మీకోసం..

పంజాబ్ లోని మోహాలి జిల్లాలో ఉంది .
...గురుద్వార. ....
1659లో సిక్కుల ఏడో గురువు గురు హర్ రాయ్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గురుద్వారలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇక్కడున్న మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టుకు ఏడాది పొడవునా.. మామిడి పండ్లు ఉంటాయి. సీజన్ తో సంబంధం లేకుండా పండ్లు కాస్తూనే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న .......యాగంటి ఉమామహేశ్వర ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్న పెద్ద నందీశ్వరుడి విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వస్తోందని భక్తులు నమ్ముతారు. మొదట్లో చాలా చిన్నగా ఉన్న విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి.. ఇప్పుడు ఆలయం ప్రాంగణం అంతా వ్యాపించిందని స్థానికులు చెబుతారు. అయితే ఆ రాయి స్వభావం పెరిగే తత్వం కలిగి ఉందని.. ఆ రాయి 20 ఏళ్లకు 1 ఇంచు పరిమాణం పెరుగుతుందని పురావస్తు శాఖ సర్వే తెలియజేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించారు. విజయానగర్ స్టైల్లో ఈ రాతి కట్టడ నిర్మాణం జరిగింది. ఇక్కడ స్తంభం కింద క్లాత్ ని ఈజీగా పట్టించవచ్చు. అంటే.. స్తంభానికి, కింద ఫ్లోర్ కి గ్యాప్ ఉంటుంది. అంటే స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండానే ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ కి తాకకుండా.. ఆలయాన్ని అంతా ఎలా సపోర్ట్ చేస్తుందో.. ఎవరికీ అర్థంకాని రహస్యం.
మరో విచిత్రం.
90 కేజీల రాయి పూనెలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ 11 మంది మనుషులు అంతకంటే ఎక్కువ కాదు.. తక్కువ కాదు.. కరెక్ట్ గా 11 మంది ఒక రాయికి కేవలం ఒక వేలుతో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమర్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకి ఎత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 11 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూ ఉంటుంది. భక్తుల తల పైనే ఆ రాయి తేలుతూ ఉంటుంది. అప్పుడు కమర్ అలీ దర్వేష్ అని భక్తులు గట్టిగా అరుస్తారు.
తంజావూర్ లోని శివాలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయమంతా గ్రానైట్ స్టోన్స్ తోనే కట్టారు. అది కూడా అక్కడ దగ్గరి ప్రాంతాల్లో ఎక్కడా స్టోన్ లభించేది కాదు. 216 అడుగుల అతి పెద్ద నిర్మాణం ఈ తంజావూర్ ఆలయం. ఆలయ సమీపంలో ఎలాంటి సదుపాయాలు లేవు. పెద్ద గాలి, వర్షాలతో ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అయినా కూడా వెయ్యి ఏళ్ల క్రితం ఈ ఆలయం ఇంత పెద్దగా.. ఎలాంటి మెటీరియల్ లేకుండా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ.

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివారాధన చేయడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం గమనించారు. తర్వాత ఆ పాము ఆలయంలో ఉన్న బిల్వ చెట్టు ఎక్కి బిల్వ పత్రాలు సేకరించి.. తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించింది.

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి అయిన ప్రాంతాలలో. .... పూరి .......నాలుగోది. ఛార్ ధామ్ క్షేత్రాలలో ఇదొకటి. విష్ణువునే ఇక్కడ జగన్నాథ స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయ విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రతిమ రాయి కాదు... వేప బెరడుతో తయారు చేస్తారు. ఈ విగ్రహాన్ని బ్రహ్మ అంటారు. ఈ విగ్రహాలను 12 ఏళ్లకొకసారి అంటే నబ కళేబర ఉత్సవ సమయంలో మారుస్తారు. అదే ఇక్కడున్న స్పెషాలిటీ.

మహారాష్ర్టలో ఉన్న శని షింగాపూర్ చాలా ఫేమస్.
ఎందుకంటే ఈ ఊళ్లో ఏ ఒక్క ఇంటికి తలుపులు ఉండవు. తలుపులు లేకపోయినా.. ఇంతవరకు ఎప్పుడూ దొంగతనాలు కూడా జరగలేదు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్లకు శని దేవుడే శిక్ష విధిస్తాడని గ్రామస్తుల నమ్మకం. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే.. 2011లో ఇక్కడ ఒక బ్యాంక్ కూడా ప్రారంభించారు. అది కూడా ఎలాంటి తాళం లేకుండా. దేశంలో మొదటిసారి ఇలాంటి విశేషం జరిగింది.

కైలాశ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది.
దీని నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎలాంటి కట్టడమైనా.. పునాది నుంచి మొదలవుతుంది. కానీ.. కొండలనే శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.
మహారాష్ర్టలోని షోలాపూర్ జిల్లా షేప్టాల్ గ్రామంలో పాముల పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేకంగా కొంత ప్రదేశం కల్పిస్తారు. ప్రతి ఇంట్లో మనుషులు మాదిరిగా... పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎవరినైనా పాము కరిచినట్లు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు

. ఉత్తరప్రదేశ్ లోని సితాపూర్ జిల్లాలోని.
.... ఖబీస్ బాబా ఆలయం ... చాలా విచిత్రం కలిగిస్తుంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.. పూజారీ ఉండరు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతారు. ప్రచండమైన శివ భక్తుడు ఖబీస్ బాబా ఇక్కడ ఉంటారు. ఇతను సాయంత్రం భక్తులు సమర్పించే మద్యం సేవించి.. భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం.

శ్రావణబెళగలలోని గోమతేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. దీన్నే బాహుబలి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకే రాతితో ఈ విగ్రహాన్ని చెక్కడం విశేషం. 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూడవచ్చు. గోమతేశ్వర జైనుల గురువు.

అమ్రోహా ఉత్తరప్రదేశ్ లోని ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం షార్ర్ఫుద్దీన్ షా విలాయత్ గా ప్రసిద్ది చెందింది. ఈ పుణ్యక్షేత్రం మతాధికారి ఆలయ రక్షణగా తేళ్లను పెట్టారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు వీటిని పట్టుకోవచ్చు. కానీ అవి వాళ్లకు ఎలాంటి హాని చేయవు. అదే ఇక్కడి స్పెషాలిటీ.

మమ్మీస్ ....
అంటే అందరికీ ఈజిఫ్టే గుర్తొస్తుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని గ్యూ అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాకిస్తోంది. సంఘా టెంజింగ్ అనే టిబిట్ కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ కూర్చొని ఉంది. అది కూడా చెక్కుచెదరని చర్మం, జుట్టుతో ఈ మమ్మీ కనిపిస్తుంది.











మధుమేహ వ్యాధికి(sugar) వేపను మించిన చక్కటి మందు:

మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినమని చెప్పండి క్రమేనే మోతాదు పెంచుకుంటే సరిపోతుంది అంటా...!!

మనకు షుగర్‌ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం _/|\_
*బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ :-

పురుగులు , కీటకాలు కుట్టిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాసి రుద్ది తే ఎర్రదనం , వాపు తగ్గుతాయి .
కందిరిగా కుట్టిన, పాము కాటు వేసిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుని పేస్ట్ లాగా చేసి పెడితే విశాం విరుగుడు అవుతుంది .
అధెవిధం గా ఫంగస్ వల్ల వచ్చే వ్యాదుల ప్రదేశం లో ఈ బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాస్తే తగ్గుతాయి .

*బిళ్ళ గన్నేరు మొక్క వేరు :-

బిళ్ళ గన్నేరు మొక్క వేరు ని తీసుకొని మట్టి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి .. 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిళ్ళ గన్నేరు వేరు ముక్కలని వేసి సన్నని సెగ పై న పెట్టి కాషాయం లాగా చెయ్యాలి ( ఒక గ్లాస్ నీటికి అర – సగం నీరు వచ్చేంతరవరకు కాయలి ) తరువాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో మూత్రం లో షుగర్ లెవెల్ తగ్గుతుంది . కిడ్నీ లో వాపు , కిడ్నీ వ్యాధులు ఏమిన ఉన్న పోతాయి . క్యాన్సర్ ని రానివ్వధు మరియు షుగర్ వ్యాధి ని రాని వద్దు .

*బిళ్ళ గన్నేరు పువ్వులు :-

బిళ్ళ గన్నేరు పువ్వులని 5 లేక 10 పువ్వులని తీసుకొని నీటిలో వేసి కషాయం ( ఈ కషాయం లేత పచ్చరంగు లోకి రావాలి ) లాగా కాచి వడ పోసి దాంట్లో మిరియాల పొడి కాస్త వేసి తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు క్యాన్సర్ , మరుయు షుగర్ వ్యాధి రానివ్వదూ .మరియు behaviour disorder వారికి కోడా ఉమాయోయగా పడుతుంది .
మరియు చిముతో ఉన్న మొలలు కోడా తగ్గుతాయి . పెద్ద పేగు క్యాన్సర్ అయిన తగ్గుతుంది .

మొలల దగ్గర ఎరపడిన చీము తో పుల్లూ మరియు పగ్గులు లాంటివి ఉంటే ఈ కాషయ౦ లో మిరియాల పొడి వెయ్యకుండ పువ్వుల తో పాటు ఆకులు కోడా వేసి కాషాయం చేసి ఈ నీటి తో కదుకుంటే తగ్గుతాయి


త్రిఫల చూర్ణం
త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. మన శరీరాన్ని శుభ్రం చేయడంతో మనకు ఎంతగానో ఉపకరించే ఆయుర్వేద ఔషధం త్రిఫల చూర్ణం. త్రిఫలా చూర్ణాన్ని త్రిదోష రసాయనంగా చెబుతారు. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను ఈ చూర్ణం సరిచేస్తుంది
ఉసిరి గుణాలు:
ఉసిరి: ఉసిరిలో సి విటమిను అత్యధికంగా ఉంటుంది. ఉసిరిలో టానిక్‌ ఆమ్లం, గ్లోకోజ్‌, ప్రొటీన్‌, కాల్షియం లు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్ధమును తగ్గిస్తుంది. విరోచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది.
బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిను ఉసిరిలో ఉంది.
తానికాయ గుణాలు:
తానికాయ: తానికాయ వగరు, ఘాటు రుచి కలిగి ఉంటుంది. దీనిలో విటమిను ఎ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది.
కరక్కాయ గుణాలు:
కరక్కాయ: త్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్ని ఇస్తుంది. శారీరక బలహీనతను, అనవసరపు ఆదుర్దాలను తొలగిస్తుంది. జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది.
వాడే విధానం, ఉపయోగాలు
త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలపడం వలన ఇది శక్తివంతమౌతుంది. సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు.
· త్రిఫల తయారీకోసం వాడే మూడు ఫలాలను విడివిడిగా, నిర్ణీత మోతాదులో వాడాలి. ఈ మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి వుంది.
· కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది.
· అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్‌ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి.
· మలబద్ధము బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది.
· ఒక చెంచా త్రిఫలచూర్ణం రెండు చెంచాల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్‌లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.
· చర్మరక్షణలో త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మం కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.
· త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.
మరిన్ని ఉపయోగాలు
· కళ్లకు, చర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
· జుట్టును త్వరగా తెల్లగా అవనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
· ముసలితనం త్వరగా రానీయదు.
· జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది.
· ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.
· రోగనిరోధక వ్యవస్థ ను బాగా శక్తివంతం చేస్తుంది.
· ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
· ఆమ్లత(అసిడిటీ) ను తగ్గిస్తుంది.
· ఆకలిని బాగా పెంచుతుంది.
· యురినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది.
· సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.
· శ్వాస కోశ సంబంధమైన సమస్యలు రావు. ఒక వేళ ఉన్నాకూడా అదుపు లో ఉంటాయి.
· కాలేయమును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
· శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.
· పెద్ద ప్రేవు లను శుభ్రం గా ఉంచి, పెద్ద ప్రేవు లకుఏమీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
· రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
· జీర్ణశక్తి ని పెంచుతుంది.
· అధిక బరువును అరికడుతుంది.
· శరీరం లోని లోని చెడు పదార్ధాలను బయటకు పంపిస్తుంది.
· శరీరం లో బాక్టీరియా ను వృద్ధి కాకుండా ఆపుతుంది.
· కాన్సరు ను కూడా నిరోధిస్తుంది.
· కాన్సరు కణములు పెరగకుండా కాపాడుతుంది.
· రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
· ఎలర్జీ ని అదుపులో ఉంచుతుంది.
· సీరుం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.
· చక్కగా విరోచనం అయేలా చేస్తుంది.
· హెచ్ ఐ వీ ని కూడా నిరోధించ గల శక్తి త్రిఫల చూర్ణమునకు ఉంది.
· నేత్రవ్యాధు లను నిరోధించే శక్తి త్రిఫలకు ఉం
త్రిఫల చూర్ణం
త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ ...

2 ఫిబ్రవరి తత్త్వవేత్త బెర్టాండ్ రసెల్ వర్ధంతి (2 Feb Death Anniversary of Philosopher Bertrand) Russel)

బ్రిటన్‌కు చెందిన తత్త్వవేత్త బెర్టాండ్ రసెల్ (18 మే 1872- 2 ఫిబ్రవరి 1970) తర్కవేత్త, గణితవేత్త, చరిత్రకారుడు, రచయిత, సామజిక విశ్లేషకుడు.,, క్రియాశీల రాజకీయవేత్త. తనజీవితపు పలుసందర్బాలలో బెర్టాండ్ రసెల్ ఎన్నడూ ప్రగాడ భాగస్వామి కానప్పటికీ తానొక ఉదారవాదిగానూ, సోషలిస్టుగానూ, శాంతికాముడిగానూ వ్యవహరించాడు. భారతప్రజల స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు ప్రకటించాడు. భారతదేశానికి స్వీయ పరిపాలనకోరే బ్రిటన్‌లోని ఇండియాలీగ్ ప్రధాన కార్యదర్శి వికె కృష్ణమీనన్‌కు రసెల్ తన మద్దతు ప్రకటించేవాడు.

మొదటి ప్రపంచ యుధ్ధం‌లో సామ్రాజ్యవాదాన్ని, యుధ్ధాన్నీ వ్యతిరేకింఛినందువల్ల జైలుపాలైన రసెల్ అడాల్ఫ్ హిట్లర్‌ జాత్యహంకారాన్నీ, స్టాలిన్ ఏకస్వామ్య వ్యవస్థను, వియత్నాం యుధ్ధం‌లో అమెరికా పాల్గొనడాన్నీ ఖండించేవాడు. అణ్వస్త్ర నిషేధాన్ని సమర్ధించేవాడు. బెర్టాండ్ రసెల్ సాహిత్యం‌లో 1950 సం. అత్యున్నత నోబెల్ బహుమానం వచ్చింది. తదుపరి సంవత్సరం బీజింగ్‌లో జరిగిన తత్త్వవేత్తల సమావేశానికి హాజరైన బెర్టాండ్ రసెల్ విశ్వ కవి రవీంద్రుడినీ, విద్యావేత్త జాన్ డీవీని కలుస్తాడు.

విశ్వ విఖ్యాత తత్వవేత్త బెర్టాండ్ రసెల్ “ఆమన్ (శాంతి)” అనే హిందీ చిత్రం‌ అతిధి పాత్రలో కన్పిస్తాడు. వైద్య విద్యనుపూర్ర్తిచేసుకున్న గౌతందాస్ (నటుడు రాజెంద్రకుమార్) తాను రెండవ ప్రపంచ యుధ్ధం‌లో అణ్వాయుధాల ధ్వంసంతోనూ దుష్ప్రభావంతోనూ బాధపడ్తున్న జపాన్‌కు సేవచేయడానీకి వెళ్తున్నానని, తనను ఆశీర్వదించమని లండన్‌లో బెర్టాండ్ రసెల్ ను కలుస్తాడు, అప్పుడు బెర్టాండ్ రసెల్ “ జానీ (బుజ్జీ), నువ్వు మష్‌రూమ్ క్లౌడ్ (అణ్వాయుధాల దుష్ప్ష్ప్రభవం) తో పోరాడు, నీకు విజయం కలగాలని నేను పైవాణ్ణి ప్రార్ధిస్తాను” అంటాడు. ఈ సినిమా విడుదలైన మూడూ సంవత్సరాలకు బెట్రాండ్ రసెల్ మరణిస్తాడు.

ఈ శాంతికాముకుడి వర్ధంతి రోజున మనం నివాళులర్పిద్దాం.

ఆమన్ చిత్రం‌లో అతిది పాత్రలో తత్త్వవేత్త వీడియో క్లిపంగ్‌ను వీక్షించండి.
https://www.youtube.com/watch?v=Jy_45kPyP1M
Bertrand Russell: Rajendra Kumar (1967)
Dr. Gautamdas (Rajendra Kumar) seeks Lord Bertrand Russell's wise counsel, prior to departing for Hi...


2 ఫిబ్రవరి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (February 2 World Wetlands Day)

భూమినీ, నీటినీ అనుసంధానం చేసే ప్రాంతాన్ని చిత్తడి నేలలంటారు. ఇవి పర్యావరన వ్యవస్థలో అత్యంత కీలకమైనవి. వీటినే ముద్దనీటి నేలలు, బురదనేలలనికూడా పిలుస్తారు ఆయా చిత్తడిన్నేల స్వభావాన్నిబట్టి కొన్ని ప్రాంతాలలు చేట్లతోనూ, మరికొన్నన్ని ప్రాంతాల్లో గడ్డితోనూ, ఇంకొన్ని చోట్ల పొదలతోను నిండిఉంటాయి. సంవత్సర కాలం‌లో కనీసం కొన్నాళ్ళపాటు తడిగాఉండే నేలలను “చిత్త్తడి నేలాలు” అంటారు. ఇవి సహజమైనవి కావచ్చు లేక కృత్రిమమైనవీ (మానవ నిర్మితమైనవీ) కావచ్చు

మానవాళికీ వన్యప్రాణికీ జవజీవాలను అందివ్వడంలో చిత్తడినేలలు ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నాయి.

పలురకాలైన మొక్కలకూ, వణ్యప్రాణులకు ఆవాసం కల్పిస్తున్నాయి.

నీటిని వడగట్టి, శుభ్రపరిచి నిలవచేస్తాయి.

వరదనీటిని సేకరించి నిల్వ చేస్తాయి.

గాలి, నీటి తుఫానులను పీల్చుకుంటాయి.

ప్రకృతికి అందాన్ని చేకూరుస్తాయి.

స్పాంజి మాదిరిగా నీటిని పీల్చుకొని నదుల గమనాన్ని సాధారణవేగానికి పరిమితం చేస్తున్నాయి. చిత్తడినేలలగుండా ప్రవహించే నీటిని వడగట్టి శుధ్ధిపరుస్తాయి. చిత్తదినేలలలోఉండే మొక్కలు నీటి క్షయాన్ని నిలువరించడానికి ఉపయోగపడ్తాయి.

కుంచించుకుపోతున్న చిత్తడినేలల పరిరక్షణ, సముధ్ధరణలకై కార్యాచరణ చేపట్టడానికి యునెస్కో ఇరాన్ దేశం రామసర్ నగరం‌లో 1971 సం. ఫిబ్రవరి 2 వతేదీన 169 దేశాలతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని “ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని” నిర్వహిస్తారు.

భారతదేశం‌లో నదులు, సెలయేళ్ళు, వ్యవసాయభూములు మినహా భారతదేశం‌లో 41లక్షల హెక్టార్ల చిత్తడినేలలు ఉండేవి. వీటిలో 15 లక్షలు సహజమైనవికాగా 26 లక్షలు మానవ నిర్మితమైనవి. తీరప్రాంత చిత్తడినేలలు దాదాపు 7వేల చదరపుకిలోమీటర్లు. వ్యాపారత్మక ధోరణి మరియు ఆర్ధిక దోపిడీలవిధానాలవల్ల చిత్తడినేలలు అత్యంత కనిష్టానికి కుదించుకుపోవడం తద్వారా పర్యావరణం‌లో అనూహ్యమైన వికృత మార్పులు సంభవించాయి. ఆప్రభావంతో వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమ వంటివి కోలుకోలేకుండా దెబ్బతిన్నాయి.

జీవపర్యావరణ వ్యవస్థ తిరిగి జవజీవాలుపొందడానికి చిత్తడినేలాల పునరుధ్ధరణ అత్యంత యుధ్ద్ధప్రాతిపదికన చేపట్టవలసిన సమయం ఆసన్నమైంది. విధ్వసమైన చిత్తడి నేలలపునరుధ్ధరణ కంటే ముందుగా ఇప్పటికి మిగిలిఉన్నవాటిని కాపాడుకోవాలి. ప్రభుత్వ ఆదేక్శాలు, కార్యక్రమాలకంటే చిత్తడినేలల పరిరక్షణలో పౌరభగస్వామ్యాన్ని పెంచాలి. నగరాల్లో ఇంటిచుట్టూ సిమెంటు పూతపూస్తున్నారు. దీనితో నీళ్ళు భూమిలో ఇంకే అవకాశం‌లేక వరదగామారి లోతట్టుప్రాంతాలను మూంచివేయడం జరుగుతున్నది. సహజసిధ్ధంగా నీళ్ళు నిలిచే అవకాశమున్నచోట అది మురికిగుంటగా మారకుండచూసుకోవదం తొలి ప్రాధాన్యత.

చిత్తడినేలాల పరిరక్షణ పౌరఉద్యమంగా మారినప్పుడే జీవపర్యావరణాలు సమగ్రాతను సంతరించుకుంటాయి. ఈ అవగాహన కుటుంబ స్థాయినుండి సమాజానికి చేరినప్పుడే ఆశవహమైన మార్పులు వస్తాయి.


1 ఫిబ్రవరి జాతీయ తీరప్రాంత రక్షణాదళాల దినోత్సవం (1 Feb INDIAN COAST GUARD Day)

సముద్ర తీరాల్లో నివసించే ప్రజలకు, వారిఆస్తులకు రక్షణ కల్పించడం కొరకు ప్రత్యేక సేవావిభాగం అత్యవసరమనే భావన భారతదేశ ప్రభుత్వానికి బలంగా ఏర్పడింది. తీరప్రాంతాన్ని సముద్ర జలాల్లోనికి 12 నావికా మైళ్ళదూరం (సుమారు 22 కిమీ) ఆయాదేశాల సరిహద్ధుగా గుర్తించాలని, ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అమెరికా, బ్రిటన్ వంటి అభివృధ్ధి చెందిన దేశాలు, చాలాకాలం క్రితమే, తీరప్రాంత రక్షణాదళాలను ఏర్పాటు చేసుకున్నాయి.

సముద్రతీరప్రాంతాల పరిరక్షణే కాకుండా, సముద్ర జలాలద్వారా దొంగ రవాణా అరికట్టడం వంటి సమస్యలను అధ్యయనం చేసి, నివారణకు మార్గాలు సూచించాల్సిందిగా, భారతప్రభుత్వం సెప్టెంబర్ 1974లో నావికా రక్షణదళాల నిపుణుడు కే యఫ్ రుస్తుంజీ అధ్యక్షుడుగా కమిటీనినియమించింది. కమిటీ సూచనమేరకు భారత పార్లమెంటు 25 ఆగస్టు 1976 తేదీన నావికాదళ ప్రాంతాల రక్షణ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టంద్వారా 21లక్షల చదరపు మైళ్ల సముద్రతీర ప్రాంతాన్ని తన అన్వేషణలకూ, సహజవనరుల వినియోగానికీ పూర్తిహక్కులను ప్రకటించింది. 1 ఫిబ్రవరి 1977 తేదీన తాత్కాలికంగా/ మధ్యంతర తీర  ప్రాంత రక్షణా దళాల విభాగాన్ని ఏర్పరిచి, త్రివిధ దళాధిపతుల సూచనలతో దీ 18 ఆగస్టు 1978వతేదీన పూర్తిస్థాయిలొ నిర్మించబడింది. “స్వయం రక్షమా” (మేము రక్షిస్తాం )అనే ధర్మ సూత్రమును (మోటో) ప్రకటించింది

సముద్రజలాలద్వారా దొంగ రవాణాను నిరోధించడానికి, సుంకాల విభాగం (కస్టంస్ విభాగం) సరిపడా సిబ్బందిలేదు. దొంగరవాణా చట్ట విరుధ్ధమైన వ్యవస్థ. దీన్ని నిర్మూలించాలంటే పోలీస్‌వంటి రక్షణ విభాగం అవసరం. తీరప్రాంత రక్షణాదళాలతో దిగువపేర్కొన్న పలు సమస్యలకు పరిష్కారం జరుగుతింది.

ఏడున్నర వేల కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం రక్షణా కవచం‌లోనికి వస్తుంది.
తీరప్రాంత రక్షణాదళాలు మత్స్య కార్మికులవివరాలను నమోదు చేసుకోవడం వలన దొంగ రవాణావంటి కార్యకలాపాలపై నిఘావేయవచ్చు. అక్రమ ప్రవేశాలను అరికట్టవచ్చు.

పాకిస్తాన్  తీవ్రవాదులు పలుమార్లు పశ్చిమ తీరజలాలద్వారా భారతదేశం‌లోకి చొరబడడం మరీ ముఖ్యంగా 26/11 (26 నవంబర్) బొంబాయ్ దాడుల నేపధ్యం‌లో తన నావిక సామర్ధాన్ని100 విమానాలు, 150 ఓడలకు పెంచుకోవాలని నిర్ణయించింది. వాతావరణ మార్పులకు ప్రభావితమై ప్రళయాన్ని సృష్టించే సముద్రజలాలు, ఊహించని తీరులో దాడిచేసే తీవ్రవాదులు, సముద్రదొంగలని ఎదుర్కొవడంలో ప్రాణాలు ఫణంగా పెట్టె తీరప్రాంతాల రక్షణా సిబందికి “

జాతీయ తీరప్రాంతాల రక్షణాదళాలకు “ జేజేలు చెబుదాం!

• మొదటి చిత్రం ప్రధమ తీరప్రాంత రక్షణాదళం (తాత్కాలిక/ మధ్యంతర)


  

 
   

ఓ కవీ మేలుకో

ఓ కవీ
అనుక్షణం నీ మదిలోని భావాలే
నీ జాతి జీవనానికి భాగ్యాలై
నీ కలంనుండి జాలువారే
ప్రతి యక్షరం ఓ యంకుశమై
దారితప్పుతున్న సమాజమనే
మదగజాన్ని సక్రమ పథంలో
పయనింపజే సే బాధ్యత నీవే గ్రహించు
అర్థం పర్థం లేని
పదాల పొంకం కోసం
అలంకారాల అందం కోసం
ప్రేమ పల్లవులు,.....,అధరామృతాల
చరణాల భావగీతాల సృజియించి
కీర్తి ఖండువాల కప్పుకోవాలనే
కుహనా సాహిత్య సేవ వీడు
జాతి జీవన స్రవంతి కోసం
శుభోదయాల భూపాలరాగాల
నాలాపించ శ్రమైక జీవన
మాధుర్యాన్ని జాతికందించు.
  

మర్మమెరిగి సాగిపో!

జన్మభూమిని స్పర్షించిన తనువు
పిత్రుభూమి చేరు వరకు సాగించే
ప్రస్థానం.. అదే .. ఓ మహా ప్రస్థానం

కాలతరంగాల పెను ఆటుపోటులలో
ఊగిసలాడుతు కదిలే ఈ జీవననౌక
ఏ కొండను ఢీ కొనునొ..
ఏ సుడిగుండపు పాలవునో....
యెరిగెడు వాడెవడు లేడు
తీరాలని చేరలేని జీవనయానమందు

అడుగడుగున తిమింగలాలు
ఆదమరచియున్నవేళ
ఉదరమ్మున దాచునిన్ను...
ఒద్దికగా సాగించుము
నీవు మునిగే వరకు

కూటికొరకె పోరాటం...
కోట్ల కొరకె ఆరాటం
అర్థంపర్థం లేని
ఆశావహ జీవనం
గోచిగూడ తెచ్చుకోని
బ్రతుకు కేల ఉబలాటం

ఆశలేమో ఆకాశం
ఆశయాలు పాతాళం
స్వార్థానికి అందలాలు
మానవతకు శృంఖలాలు
ఛేదించుము బంధనాలు
సృష్టించుము నందనాలు
మనిషిగాను తరతరాలు
నిలిచిపోను యత్నించు
మహనీయుల చరితలొని
మర్మమెరిగి సాగించు


Saturday 30 January 2016

01.చెన్నకేశవ రెడ్డి ,02.అనగనగా ఓ ధీరుడు 03.విజృంభణ (1986),04. శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960) ,05.మంత్రిగారి వియ్యంకుడు ( 1983) 06.దేవదాసు (1953) ,07.ప్రేమించి చూడు (1965) ,08.పెళ్లి కానుక (1960) 09.మంచి కుటుంబం (1967) ,10. సిరి సంపదలు (1962) 11 లంబాడోళ్ల రామదాసు (1978)



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ
image not displayed
సర్వేజనా సుఖినోభవంతు




హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి..వలదు లడాయి ఇది వలపు జుదాయి

చిత్రం : చెన్నకేశవ రెడ్డి
రచన : వేటూరి
సంగీతం : మణిశర్మ
గానం : బాలు & సునీత.

హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి గజ్జాలీయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
తోడు నువ్వు లేక పోతె తోచదోయి
తోటి రాగం పాడుతుంటె నచ్చదోయి
దాని పెరు హల్లోవొయి తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనొయి తకదిన్న తకదిన్న తందాన
గిల్లి గిల్లి గజ్జాలొయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి ఇది వలపు జుదాయి

కొట్టే కన్ను పెట్టె నిన్ను నాలో దాచుకున్నానె
అద్దమంటి అందాలోయి తకదిన్న తకదిన్న తందాన
అంటుకుంటె ఆరట్లోయి తకదిన్న తకదిన్న తందాన
పట్టె పిచ్చి పుట్టె వెర్రి ఇట్టె తోసిపుచ్చావె
ఒంటిచేతి చప్పట్ట్లోయి తకదిన తకదిన తందాన
అల్లుకున్న బంధాలోయి తకదిన్న తకదిన్న తందాన
మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర
మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర
కూచిపుడి ఆడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
కుర్రదాన్ని ఓడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
దాని పెరు అల్లోఒవియి తకదిన్న తకదిన్న తందాన
దాని పరువు తీయద్దోయి తకదిన్న తకదిన్న తందాన

సిగ్గా ఎర్ర బుగ్గా నిన్ను తాకీ కందిపోయింది
ముద్దులింక మద్దెళ్ళేలె తకదిన్న తకదిన్న తందాన
ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తకదిన్న తకదిన్న తందాన
ప్రేమొ చందమామొ నిన్ను చూసీ వెళ్ళిపోయింది
ములక్కాడ ఫ్లూటౌతుందా తకదిన్న తకదిన్న తందాన
ముట్టుకుంటె ముద్దౌతుందా తకదిన్న తకదిన్న తందాన
ఒడిచేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు
ఒడిచేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు
కన్నె మొక్కు చెల్లించేస్తా తకదిన్న తకదిన్న తందాన
చెమ్మ చెక్కలాడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు అల్లోవియి తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వెనోయి తకదిన్న తకదిన్న తందాన

https://www.youtube.com/watch?v=ZIn8P2MwU8A
C K Reddy Song Hayi Hayi HQ
Nandamuri Balakrishna's Chennakesava Reddy


చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో...చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో

చిత్రం : అనగనగా ఓ ధీరుడు
సంగీతం : మిక్కీ జే మేయర్
సాహిత్యం : చంద్రబోస్
గానం : కార్తీక్, సాహితి

చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో
చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో
కలలాగా వచ్చేదెవరో అరచేయి పట్టేదెవరో
అనురాగం పంచేదెవరో ఎవరో వారెవరో
ఎవరంటే నీ వెంట నేనేలే
నేనంటే నిలువెల్లా నీవేలే
నీవంటే తనువెల్లా ప్రేమేలే
ప్రేమించే వేళయిందో
ప్రేమ లేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమ రేఖ దాటెనే ఇలా పాదాలు
ప్రేమ కేక వేసెనే ఇలా ప్రాయాలు
తన మాయ ఏంచేస్తుందో
ప్రేమ లేఖ రేసెనే ఇలా పెదాలు
ప్రేమ లాలి కోరెనే ఇలా క్షణాలు
ప్రేమ లోతు చేరెనే పది ప్రాణాలు
ఈ హాయి ఎటుపోతుందో
చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో
చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో

నవ్వావంటే నువ్వు ఆ నవ్వే గువ్వై తారాజువ్వై నాలో ఏమాయనో
రువ్వావంటే చూపు ఆ చూపే చేపై సిగ్గే చెరువై లోలో ఏమాయనో
ముసినవ్వుకు మనస్సే లేక మొగ్గ వేసెనో
కొనచూపుకు వయస్సే రేకు విచ్చునో
పసిరేకుల సొగస్సే నేడు పూతపూసెనో
ఆ పువ్వు ప్రేమైందో ఏమో

ప్రేమ లేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమ రేఖ దాటెనే ఇలా పాదాలు
ప్రేమ కేక వేసెనే ఇలా ప్రాయాలు
తన మాయ ఏంచేస్తుందో
ప్రేమ లేఖ రేసెనే ఇలా పెదాలు
ప్రేమ లాలి కోరెనే ఇలా క్షణాలు
ప్రేమ లోతు చేరెనే పది ప్రాణాలు
ఈ హాయి ఎటుపోతుందో

https://www.youtube.com/watch?v=Zi7VX1ad11U
Anaganaga O Dheerudu - Premalekha raasene ilaa pedaalu (telugu video song)
Movie: Anaganaga O Dheerudu Cast : Siddharth Narayan, Shruti Haasan, Lakshmi Manchu Merchant Song: P...
 








కలగా.. కమ్మని కలగా...మన జీవితాలు మనవలెగా..

చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

కలగా.. కమ్మని కలగా..
మన జీవితాలు మనవలెగా..
కలగా.. కమ్మని కలగ..

అనురాగమె జీవన జీవముగా..
ఆనందమె మనకందముగా...
కలగా.. కమ్మని కలగ..

చరణం 1 :

రాగవశమున మేఘమాలిక.. మలయ పవనుని కలిసి తేలదా
ఆ.. ఆ... ఆ.. ఆ...
రాగవశమున మేఘమాలిక.. మలయ పవనుని కలిసి తేలదా..
కొండను తగిలి గుండియ కరిగి... నీరై ఏరై పారునుగా

కలగా.. కమ్మని కలగా..
మన జీవితాలె ఒక కలగా.. కమ్మని కలగా

చరణం 2 :

వెలుగు చీకటుల కలబోసిన...
యీ కాలము చేతిలో కీలుబొమ్మలము

భావనలోనే జీవనమున్నది..
మమతే జగతిని నడుపునది..
మమతే జగతిని నడుపునది..
కలగా... కమ్మని కలగా...

చరణం 3 :

తేటి కోసమై తేనియ దాచే.. విరికన్నియకా సంబరమేమో?
వేరొక విరిని చేరిన ప్రియుని.. కాంచినప్పుడా కలత యేమిటో?
ప్రేమకు శోకమె ఫలమేమో.. రాగము.. త్యాగము.. జతలేమో

కలగా.. కమ్మని కలగా...
ఆ.. ఆ... ఆ.... ఆ...ఆ.....ఆ...
ఆ.. ఆ... ఆ.... ఆ...ఆ.....ఆ...
ఆ.. ఆ... ఆ.... ఆ...ఆ.....ఆ...
కలగా.. కమ్మని కలగా...

https://www.youtube.com/watch?v=BWJvvrJ2pHE
Sri Venkateswara Mahatyam Telugu Movie Songs | Kalaga Kammani | NTR | S Varalakshmi | Savithri
NTR | S Varalakshmi | Savithri's Sri Venkateswara Mahatyam Songs Cast - NTR, S Varalakshmi, Savithri...


మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ...భవ బంధనమో భయ కంపనమో ..

చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు ( 1983)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి:

మనసా.. శిరసా.. నీ నామము చేసెదనీ వేళ
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో .. శివశంకర వణికింపగ శరణని
మనసా.. శిరసా.. నీ నామము చేసెదనీ వేళ

చరణం 1:

తాండవమాడే నటుడైనా..ఆ..ఆ..ఆ... తలిచిన వేళ హితుడేలే
తాండవమాడే నటుడైనా... తలిచిన వేళ హితుడేలే
గిరిజనులే ఆ శివున్ని గురి విడక ధ్యానించు
ఆ శివ శంకర నామము చేసిన నీకిక చింతలు ఉండవులే
బెరుకుమాని ప్రేమించి .. ప్రేమ మీద లాలించె
యముడు చూపు తప్పించి .. తప్పులున్న మన్నించేయ్
ఇష్టదైవమతని మీద దృష్టిని నిలిపి శివుని పిలవ వేళ ..
ఓ మనసా.. శిరసా.. నీ నామము చేసెదనీ వేళ

భవ బంధనమో భయ కంపనమో .. శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

చరణం 2:

సప్త మహర్షుల సన్నిధిలో ..గరి రిస సని నిద దప
పగమ పదస పద సరిగమ గ .. సప్త మహర్షుల సన్నిధిలో
సప్త మహర్షుల సన్నిధిలో .. సప్త స్వరాల ప్రియ శృతిలో
గౌరి వలె ఆ శివుని గౌరవమే కాపాడు

ఆ నవజాతకు ఈ భువజాతకు కలిసిన జాతకమీ వరుడే
లంక చెరను విడిపించి .. శంకలన్నీ తొలగించి
ఈసులన్నీ కరిగించి .. నీ సుశీల మెరిగించె
లగ్నమైన మనసుతోడ పెళ్ళికి లగ్నమిపుడు కుదురు వేళ ..
ఓ మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధనమో భయ కంపనమో .. శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
https://www.youtube.com/watch?v=-Q8C5JDrhyo
Manasa Sirasa Video Song - Mantri Gari Viyyankudu
Watch

పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో...అల్లరి చేదాం చలో చలో... ఓఓఓ

చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో
పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో
అల్లరి చేదాం చలో చలో... ఓఓఓ

పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో
అల్లరి చేదాం చలో చలో...ఓ..
ప్రొద్దువాలే ముందు గానే ముంగిట వాలేమూ
ప్రొద్దువాలే ముందు గానే ముంగిట వాలేమూ

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో
అల్లరి చేదాం చలో చలో

చరణం 1:

ఆటా పాటలందు కవ్వించు కొంటె కోణంగీ..ఈ..ఈ..ఈ..
ఆటా పాటలందు కవ్వించు కొంటె కోణంగి
మనసేమో మక్కువేమో.. మనసేమో మక్కువేమో
నగవేమో వగేమో.. కనులార చూతమూ..ఊ..ఊ..

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో
అల్లరి చేదాం చలో చలో..

చరణం 2:

నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో..ఓ..ఓ..ఓ..
నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నా దరికి దూకునో.. నా దరికి దూకునో
తానలిగి పోవునో.. ఏమౌనో చూతమూ..ఊ..ఊ..

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో
అల్లరి చేదాం చలో చలో..

ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ..ఊ..ఊ..
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో.. చలో.. చలో..

https://www.youtube.com/watch?v=MPFJcg0Diwc
Devadas Movie || ANR and Savitri || Palleku Podam Chalo Chalo Song
Wacth


వెన్నెల రేయి ఎంతో చలీ చలీ...వెచ్చనిదానా రావే నా చెలీ...

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల

పల్లవి:

ఓ...ఓ....ఓ...ఓ....ఓ...ఓ....

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ

చరణం 1:

చూపులతోనే మురిపించేవూ ..
చూపులతోనే మురిపించేవూ
ఆటలతోనే మరిపించేవూ..
ఆటలతోనే మరిపించేవూ
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా..
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా ...
పొరపాటైతే పలకనులే... పిలవనులే... దొరకనులే.. ఊరించనులే...

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ...
నా మనసేమో పదమని సరేసరే

చరణం 2:

నా మనసేమో పదమని సరే సరే..
మర్యాదేమో తగదని పదే పదే ..
మూడు ముళ్ళు పడనీ...
ఏడు అడుగులు నడవనీ ...
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
వాదాలెందుకులే అవుననినా..కాదనినా..ఏమనినా.. నాదానివిలే...

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ..
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ..

అహా...అహా..అహ..ఆ

https://www.youtube.com/watch?v=Qm-0OCw3s9U
Vennela Reyi Song - Preminchi Choodu Movie Songs - ANR - Kanchana - Raja Sri
Watch Vennela Reyi Song From Preminchi Choodu Movie, starring Akkineni Nageshwara Rao, Kongara Jagga...


పులకించని మది పులకించు... వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు... మనసునే మరపించు గానం

చిత్రం : పెళ్లి కానుక (1960)
సంగీతం : ఏ.ఎం. రాజ
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : జిక్కి

పల్లవి:

పులకించని మది పులకించు... వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు... మనసునే మరపించు గానం
పులకించని మది పులకించు... వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు... మనసునే మరపించు గానం
మనసునే మరపించు..

చరణం : 1

రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం
జీవమొసగును గానం మది చింతబాపును గానం

చరణం : 2

వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
కూలిపోయిన తీగలైనా కొమ్మనలికి ప్రాకును
కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మదిలో
దోరవలపే కురియు... మదీ దోచుకొనుమని పిలుచు

పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
ప్రేమా... మనసునే మరపించు

https://www.youtube.com/watch?v=vThrTWa5kSc

Pulakinnchani Madi Pulakinchu Song From Pelli Kanuka Telugu Movie
Watch

మనసే అందాల బృందావనం...వేణు మాధవుని పేరే మధురామృతం...

చిత్రం : మంచి కుటుంబం (1967)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

చరణం 1:

రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే...

మనసార నెరనమ్ము తనవారినీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ....
మనసార నెరనమ్ము తనవారిని
కోటి మరులందు సుధలందు తనియింతునే..

చరణం 2:

మనసే అందాల బృందావనం
దనిస దని నిదదమ
మదని నిదదమ
గమద దమమగస
గగ మమ మగస దని
గసా మగా దమా నిద
గమదనిస బృందావనం

మాగ మగస
దామ గమద
నీద నిసమ
గమ మద దనినిస
నిసమద మగస
గమ దనిసగ బృందావనం

సమగస గమదని
గదమగ మదనిస
మనిద మదనిసగ
ఆ...........
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

https://www.youtube.com/watch?v=aJK7yl6MLJ4

Manchi Kutumbam Telugu Songs Manase Andala Brundavanam


వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...

చిత్రం : సిరి సంపదలు (1962)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : జిక్కి, సుశీల, జానకి

పల్లవి :

ఓ.... ఓ.. ఓ.. ఓహో....

వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...
వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...
వేణుగానమ్ము వినిపించెనే...

చరణం 1 :

దోరవయసున్న కన్నియల హృదయాలను..
దోచుకున్నాడని విన్నాను చాడీలను..
దోరవయసున్న కన్నియల హృదయాలను...
దోచుకున్నాడని విన్నాను చాడీలను..

అంత మొనగాడటే ...వట్టి కథలేనటే...
ఏడి కనబడితే నిలవేసీ అడగాలి వాడినే ...

వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే..
వేణుగానమ్ము వినిపించెనే...

చరణం 2 :

మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట...
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట...
లేదు లేదనుచూ లోకాలు చూపాడట

అంత మొనగాడటే... వింత కథలేనటే ...
ఏడి కనబడితే కనులారా చూడాలి వానినే ...

వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...
వేణుగానమ్ము వినిపించెనే...

చరణం 3 :

దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట...
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట...
దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట...
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట

ఘల్లు ఘల్ఘల్లన ...ఒళ్లు ఝుల్ఝుల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట...

వేణుగానమ్ము వినిపించెనే... చిన్ని కృష్ణయ్య కనిపించడే...
వేణుగానమ్ము వినిపించెనే...

https://www.youtube.com/watch?v=6l74MbrQfys

Sirisampadalu - Venu Ganammu Vinipinchenee
Nice Melody Love Song from Sirisampadalu Movie,starring Mahanati Savitri,Girija


ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు...

చిత్రం : లంబాడోళ్ల రామదాసు (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..
ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..
ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు
ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు

ఈ పాల వెన్నెల్లో... నా జాలి కళ్ళల్లో
ఈ పాల వెన్నెల్లో... నా జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..
ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..

చరణం 1 :

చుక్కలే నిను మెచ్చీ.. పక్కనే దిగి వచ్చీ
చుక్కలే నిను మెచ్చీ.. పక్కనే దిగి వచ్చీ
మక్కువే చూపితే.. నన్ను మరచేవో
నన్ను మరచేవో

చుక్కలు వేలువున్నా.. నా చుక్కి ఒక్కతే కాదా
చుక్కలు వేలువున్నా.. నా చుక్కి ఒక్కతే కాదా
లక్షల మగువలువన్నా... నా లక్ష్య మొక్కటే కాదా...
నా లక్ష్మి ఒక్కతే కాదా...

ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..
ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు
ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..

చరణం 2 :

తుంటరీ చిరుగాలీ.. కొంటెగా నును చూసీ
తుంటరీ చిరుగాలీ.. కొంటెగా నును చూసీ
పైటనే కాజేస్తే... ఏమి చేస్తావో..
ఏమి చేస్తావో..

పైటే ఏమౌతుంది.. నీ చేతిలోన అదివుంటే
పైటే ఏమౌతుంది.. నీ చేతిలోన అదివుంటే
స్వర్గం దిగి వస్తుందీ.. నా సామితోడుగా వుంటే
నా రాముని... నీడ వుంటే...

ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..
ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు
ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..
ఆహా... హా.. ఊ.. ఊహ్.. ఊహ్మ్...

https://www.youtube.com/watch?v=eNIMnllHlH4

chalam sweet song