Tuesday 5 January 2016

01శుభోదయం (1980), 02జయసుధ (1980) 03.ప్రేమ సంకెళ్లు (1982) ,04.ఆలీబాబా 40 దొంగలు (1970) ,05.మల్లీశ్వరి (1951) , 06.బంగారు పంజరం (1969), 07.బంగారు పాప (1954) ,08.బొబ్బిలి యుద్ధం (1964),09.లేత మనసులు (1966):10. దేవదాసు (1953) 11.ప్రేమించి చూడు (1965)

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ

Heart locked tight. But I keep it in a pretty package!!!!! TGF
సర్వేజనాసుఖినోభవంతు




రాయైతే నేమిరా దేవుడు...హాయిగా ఉంటాడు జీవుడు...

చిత్రం : శుభోదయం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

రాయైతే నేమిరా దేవుడు...
హాయిగా ఉంటాడు జీవుడు...
ఉన్నచోటే గోపురం
ఉసురులేని కాపురం
అన్నీ ఉన్న మహానుభావుడు...

చరణం :

రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు
పన్నీటి జలకాలు పాలాభిషేకాలు
కస్తూరి తిలకాలు కనక కిరీటాలు
తీర్ధ ప్రసాదాలు దివ్య నైవేద్యాలు
ఎవరికి జరిగేను ఇన్ని వైభోగాలు
రంగ రంగ వైభోగం...రంగ రంగ వైభోగం

చరణం :

బృందావనిలో లీలా విలాసాలు
అందాల రాధామ్మతో ప్రేమ గీతాలు
బాలవాక్కు బ్రహ్మ వాక్కురా
నువ్వంటే నకుదక్కురా
స్వాతంత్రం జన్మ హక్కురా
భావి భారత వీర పౌర భయము వీడి సాగిపోరా...

https://www.youtube.com/watch?v=xU8VuT7MBBA
Subhodayam Telugu Movie Songs | Raayaitenemiraa Devudu | Chandramohan | Sulakshana
Subhodayam Telugu Movie Songs,Chandramohan and Sulakshana's Subhodayam Movie,Raayaitenemiraa Devudu ...





మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...కన్ను తెరిచి చూసేలోగా...

చిత్రం : ప్రేమ సంకెళ్లు (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ఓహో... ఓ..
ఓహో... ఓ...

ఓహో... ఓ...

మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు....
నిన్నలలో నిలిచావు...

చరణం 1:

మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది
లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో...
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో ...
దోసిట నా ఆశలన్నీ... దోచి వెళ్ళిపొయావు ...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు

చరణం 2:

ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి...
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...
ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...

పసుపైనా కానీవా... పదాలంటుకొనీవా ....
పాదాలకు పారాణై... పరవశించిపోనీవా...
పలకరించిపోలేవా...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

చరణం 3:

వేకువంటి చీకటి మీద... చందమామ జారింది...
నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది...
తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి బెదిరిపోతున్నాను

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...

మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా..
నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు ...

https://www.youtube.com/watch?v=_MC8Ycw8ktY
merupula..merisaavu..valapulaa
prema..sankellu..movie



చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే

చిత్రం: ఆలీబాబా 40 దొంగలు (1970)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: జయలలిత

చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే
ఒంటిగా నేనుండజాలరా నా వన్నెకడా
వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ

చల్లగాలి సోకితే ఒళ్ళు ఝల్లు మంటాది
నీళ్ళు జల్లుకుంటేనే నిప్పులా వుంటాది
నివురాక నిదుర రాదురా నా సిన్నవాడ
నివు లేక బతుకులేదురా నా సిన్నవాడ

నీడలా నీవెంట తోడుగా ఉండల
నీ కౌగిట ఉయ్యాల నేను ఉగుతుండల
నా కలలు నిజాము చేయరా
నకోడేకాడ నా అందం విందు చేతురా

https://www.youtube.com/watch?v=HX8vDAjTuo8
Alibaba 40 Donaglu Songs | Challa Challani Video Song | NTR, Jayalalitha | Sri Balaji Video
Watch & Enjoy Alibaba 40 Dongalu Movie Video Songs (720p) Starring NTR, J.Jaya Lalitha, Director B.V...



మనసున మల్లెల మాలలూగెనే...కన్నుల వెన్నెల డోలలూగెనే...

చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : భానుమతి

పల్లవి:

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే

ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో

చరణం 1:

కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
అలలు కొలనులో గలగలమనినా

దవ్వుల వేణువు సవ్వడి వినినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా

నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని

గడియ యేని యిక విడిచిపోకుమా
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా

ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
ఎంత హాయి యీ రేయి నిండెనో

https://www.youtube.com/watch?v=CF1v6M6m86U
Manasuna mallela.._ Malleeswari.flv
Devulapalli Krishnasastry_S.Rajeswararao


పగలైతే దొరవేరా...రాతిరి నా రాజువురా...

చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : జానకి

పల్లవి:

పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...

చరణం 1:

పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
రేయైతే వెన్నెలగా బయలంత నిండేరా..
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...

చరణం 2:

నే కొలిచే దొరవైనా...నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా...నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననే
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి..ఈ...ఈ.. పున్నమి రా...

పగలైతే దొరవేరా...
రాతిరి నా రాజువురా...
రాతిరి నా.... రాజువురా...

https://www.youtube.com/watch?v=QZA4mCIG7AI
Pagalaite Doravera Song - Bangaru Panjaram Movie Songs - Saluri Rajeswara Rao Songs
Watch Pagalaite Doravera Song From Bangaru Panjaram Movie Parts, starring Shoban Babu, Vanisri, Ravi...


ఈ వెన్నెల మల్లి విరిపందిరిలోన...చిరునవ్వుల హారతి శేఖరుకీనా ఆ ఆ ఆ ...

చిత్రం : బంగారు పాప (1954)
సంగీతం : అద్దెపల్లి
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఏ. ఎం. రాజ, సుశీల

పల్లవి:

ఈ వెన్నెల మల్లి విరిపందిరిలోన...
చిరునవ్వుల హారతి శేఖరుకీనా ఆ ఆ ఆ ...

వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన
పండు వెన్నెల... మనసు నిండా వెన్నెల..
కొండపైన కోనపైన కురిసే వెన్నెల... విరిసే వెన్నెల...

చరణం 1:

ఆ.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మబ్బుల దారి.. ఓ బాటసారి... నీ వొంటరి పయణం కాదా...
నీ జంటగ నీ సఖి లేదా ...
నీ వొంటరి పయణం కాదా ...నీ జంటగ నీ సఖి లేదా

నాకై వేచె నవ్వులు పూచె నా చెలి కన్నుల కాచే వెన్నెల...
పైన వెన్నెల మనసులోన వెన్నెల...
పైన లోన చందమామ పరచే వెన్నెల... పాలవెన్నెల ...

చరణం 2:

ఓ.. ఓ.. ఓ.. ఓ... ఓ ...ఓ... ఓ ..ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చల్లని రేయి మెలమెల్లని గాలి...
అలనల్లన మమతలు మూగే తియతీయని తలపులు రేగే
అలనల్లన మమతలు మూగే తియతీయని తలపులు రేగే

తీయని వలపులు తెచ్చేదెవరు... నాకై పరుగున వచ్చేదెవరొ..
పండు వెన్నెల... మనసు నిండా వెన్నెల...
కొండపైన.. కోనపైన... కురిసే వెన్నెల... విరిసే వెన్నెల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

https://www.youtube.com/watch?v=-137RC3j3D8
Vennela pandirilona వెన్నెల పందిరిలోన
www.youtube.com

Movie: Bangaru Papa(1954) Lyricist: Devulapalli Krishnasastry Music: Ogiraala Ramachandra Rao Singer...

చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతమ్ : సాలూరి రాజేశ్వర రావు 
రచయత: c. నారాయణ రెడ్డి 
స్వరం: ఘంటసాల, సుసీల 

ఊయల లూగినడోయి మనసే
తీయని ఊహల తీవెల పైన 
ఊయల లూగినదోయి మనసే 

వెన్నెల పూవులు విరిసే వేళ 
సన్నని గాలులుసాగే వేళ 
వలపులు ఏవో పలికెను నాలో 
తెలుపగా రానిది ఈ హయీ

కమ్మని రాతిరి రమ్మని పిలిచె 
మల్లెల పానుపు మనకై నిలిచె
ప్రాయము నీవై పరువము నేనై
పరిమలించాగా రావోయీ ..... 
 
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ...నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా...

చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల

పల్లవి :

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

చరణం 1 :

మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
కురుల మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

చరణం 2 :

మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
కురుల మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడి సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో

అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

చరణం 3 :

నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే

నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

https://www.youtube.com/watch?v=-xABIn89YGo
ANDAALA O CHILAKA ANDUKO NAA LEKAHA NAA MADILONI KALALANNI EKA CHERALI...CHITRAM:-LETHA MANASULU.mp4
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా....చిత్రం :- లేతమనసులు (1960) పాట గు...


పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో...అల్లరి చేదాం చలో చలో... ఓఓఓ

చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో
పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో
అల్లరి చేదాం చలో చలో... ఓఓఓ

పల్లెకు పోదాం పారును చూదాం.. చలో చలో
అల్లరి చేదాం చలో చలో...ఓ..
ప్రొద్దువాలే ముందు గానే ముంగిట వాలేమూ
ప్రొద్దువాలే ముందు గానే ముంగిట వాలేమూ

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో
అల్లరి చేదాం చలో చలో

చరణం 1:

ఆటా పాటలందు కవ్వించు కొంటె కోణంగీ..ఈ..ఈ..ఈ..
ఆటా పాటలందు కవ్వించు కొంటె కోణంగి
మనసేమో మక్కువేమో.. మనసేమో మక్కువేమో
నగవేమో వగేమో.. కనులార చూతమూ..ఊ..ఊ..

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో
అల్లరి చేదాం చలో చలో..

చరణం 2:

నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో..ఓ..ఓ..ఓ..
నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో
నా దరికి దూకునో.. నా దరికి దూకునో
తానలిగి పోవునో.. ఏమౌనో చూతమూ..ఊ..ఊ..

పల్లెకు పోదాం పారును చూదాం... చలో చలో
అల్లరి చేదాం చలో చలో..

ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ..ఊ..ఊ..
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో.. చలో.. చలో..

https://www.youtube.com/watch?v=MPFJcg0Diwc
Devadas Movie || ANR and Savitri || Palleku Podam Chalo Chalo Song
Wacth


వెన్నెల రేయి ఎంతో చలీ చలీ...వెచ్చనిదానా రావే నా చెలీ...

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల

పల్లవి:

ఓ...ఓ....ఓ...ఓ....ఓ...ఓ....

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ

చరణం 1:

చూపులతోనే మురిపించేవూ ..
చూపులతోనే మురిపించేవూ
ఆటలతోనే మరిపించేవూ..
ఆటలతోనే మరిపించేవూ
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా..
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా ...
పొరపాటైతే పలకనులే... పిలవనులే... దొరకనులే.. ఊరించనులే...

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ...
నా మనసేమో పదమని సరేసరే

చరణం 2:

నా మనసేమో పదమని సరే సరే..
మర్యాదేమో తగదని పదే పదే ..
మూడు ముళ్ళు పడనీ...
ఏడు అడుగులు నడవనీ ...
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
వాదాలెందుకులే అవుననినా..కాదనినా..ఏమనినా.. నాదానివిలే...

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ..
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ..

అహా...అహా..అహ..ఆ

https://www.youtube.com/watch?v=Qm-0OCw3s9U
Vennela Reyi Song - Preminchi Choodu Movie Songs - ANR - Kanchana - Raja Sri
Watch Vennela Reyi Song From Preminchi Choodu Movie, starring Akkineni Nageshwara Rao, Kongara Jagga...

పాండురంగ మహత్యం



మిత్రులకు శుభోదయం
Thodu Needa Movie Songs - Attha Odi Song - K V Mahadevan Songs
Thodu Needa Movie Songs, Thodu Needa Songs, Thodu Needa Film Songs, Thodu Needa Video Songs, Attha O...



3 జనవరి సావిత్రీ బాయీ ఫూలే జయంతి

మహారాష్ట్ర సతారా జిల్లా నయీగాఁవ్ గ్రామం‌లో జనవరి 3 1831 న జన్మించిన సావిత్రీబాయికి తొమ్మిదవఏటనే పూణేవాసియైన జ్యోతీబా ఫూలేతో వివాహమైంది. అణగారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతీబాకు తోడుగా నిలిచింది. విద్యతోనే అసమానతలు తొలగిపోతాయని, విద్యతోనే విప్లవాత్మక మార్పులు సాధ్యమనీ విద్యావ్యాప్తికి కృషిచేస్తూ అగ్రవర్ణాల గుత్తాధిపత్యాన్ని, సాంఘీక దురాచారాలను నిరసించింది. బాల్య వివాహాల నిరసన, వితంతు వివాహాల ప్రోత్సాహం, అనాధబాలల దత్తత వంటి సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించింది. స్త్రీవిద్యావ్యాప్తికోసం దళిత బహుజన బాలికల పాఠశాలను పూణేలోని బిధేవాడలో 1852వ సం. ప్రారంభించింది. దేశం‌లో బాలికలకోసం ప్రారంభించిన మొదటి పాఠశాల అదే. తాగునీటికోసం తల్లడిల్లే దళితులకు తమ ఇంటిబావి నీళ్ళు తోడుకోవడానికి 1868లో ద్వారాలు తెరిచింది.

సావిత్రీ ఫూలే ఆధునిక మరాఠీ కవిత్వానికి ఆద్యురాలు కూడా. స్త్రీవిద్యావ్యాప్తికోసం, స్త్రీలలో చైతన్యంకోసం ఆమే అర్ధవంతమైన కవిత్వం రాసింది. అందులొ ఒక కవిత చూద్దాం.

వెళ్ళు , వెళ్ళి నీ విద్యను సాధించు
శ్రమించు, స్వయం సమృధ్ధి సాధించు
కృషించు- విజ్ఞాన సౌభాగ్యాలను సాధించు
నువ్వెంత దాచుకున్నా అజ్ఞానఫలితంగా మిగిలేదిశూన్యమే
అజ్ఞానంతో మనం మిగిలేది జంతువుగానే
ఇక వృధా కబుర్లు కట్టిపెట్టి,
సాగుముందుకు, సాధించు నీ విద్య
అణగదొక్కబడ్డామనీ, అన్నీ కోల్పోయామనే నిరాశను నిర్జించు
నేర్చుకోవడానికి నీకిదే గొప్ప అవకాశం
నేర్చుకో, కుల వివక్షా సంకెళ్ళను కసిగా కత్తిరించు
బ్రాహ్మణవాద పురాణాలను దూరంగా తోసేయ్

మహారాష్ట్రలో 1876- 1898 ప్రాంతాలలో సంభవించిన భయంకరమైన కరువుకాలంలో సావిత్రీబాయి ధైర్యంగా భర్తకు తోడుగా కరువువధిగమించడానికి అనేకసూచనలు చేసింది. ఫూలేదంపతులు పలుప్రాంతాల్లో కరవుబాధితులకు ఉచితంగా ఆహారపధార్ధాలు సరఫరా చేశారు. ప్లేగువ్యాధిగ్రస్తులకు ఉపచర్యలుచెస్తూ అదేవ్యాధితో మార్చ్ 10 1897న మరణించింది

దురాచారాలకు వ్యతిరేకంగానూ, స్త్రీవిద్యావ్యాప్తికోసం కృషిచేసిన సావిత్రీబాయిఫూలే సేవలనిప్పుడిప్పుడే సమాజం గుర్తిస్తున్నది. లింగవివక్ష, కులవివక్షలను నిరసిస్తూ భర్త జ్యోతీరావు ఫూలేకు తోడుగా పోరాడిన ఆ మహామనీషిని మహాత్మా జ్యోతీరావు ఫూలేకు భార్యగానే కాకుండా ఆమెనుసైతం ఒక ఉద్యమకారిణిగా నివాళులర్పిస్తున్నది.

జాతీయ స్థాయిలో ఒక విద్యా విశ్వవిద్యాలయాన్నీ మరొక మహిళా విశ్వవిద్యాలయాన్ని సావ్విత్రిబాయి ఫూలే పేరున నెలకొల్పాలి. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని వ్యవస్థాపించాలి. ఆమెజీవిత చరిత్రనూ, సేవలనూ దేశం‌లోని అన్ని స్థాయిల్లో ప్రవేశపెటాలి.
ఆడపిల్లలను సతీసావిత్రి వంటి ధర్మపత్నివి కావాలని కాకుండా సావిత్రీ బాఫూలే కావాలని ఆశీర్వదించాలి. చదువులతల్లి సరస్వతి కమ్మనటంతోపాటు సావిత్రిఫూలే మాదిరిగా చదువులు చెప్పమని ఆశీర్వదించాలి.

ఆ సామాజిక ఉద్యమకారిణికి మనం కూడా జెజేలు చెబుదాం.


1 comment: