Wednesday 13 January 2016

01. జయసింహ (1955),02. సారంగధర (1957) 03.దసరా బుల్లోడు (1971)04.గోరంత దీపమ్ 05.మనసారా ,06.సక్కనోడు 07.వీరాభిమన్యు (1965) ,08.వెలుగు నీడలు,09.బుద్ధిమంతుడు (1969),10.జస్టిస్ చౌదరి (1982),11. ఆరాధన

ఓం శ్రీ  రాం        ఓం శ్రీ  రాం       ఓం శ్రీ  రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ

Susan Bourdet || Artwork:
సర్వేజనా సుఖినోభవంతు
చిత్రం : జయసింహ (1955)
రచన: సముద్రాల
గానం: ఘంటసాల, బాల సరస్వతి 

ఓ .... ఓ .... ఓ .... 
మదిలోని మధుర భావం 
పలికేను మోహన రాగం
మదిలోని మధురభావం..... 
పలికేను మోహన రాగం

సవరించు విణారావం 
వివరించు ప్రేమానురాగం 
మదిలోని మధురభావం... 
 పలికేను మోహన రాగం

ఆ ......    ఆ ....... ఆ ...... 
అరుణ సంద్యా కిరణాలలోన 
తరుణ పవనాల గిలిగింత లోన 
మురిసే నాలోన మొహాల తలపు 
మురిసే నాలోన మొహాల అలపు 
విరసె మురిపాల కలలేమో మరి

ఓ ... ఓ .....   ఓ .... 
కలల తేలే మాధుర్య లీల 
వెలుగులే ఇక మన జీవితాలు 
కలసి రవళించు హృదయాల పాట 
 కలసి రవళించు హృదయాల పాట 
వలపు పయనాల విరిబాట చెలి 

మదిలోని మధురభావం 
పలికేను మోహన రాగం


https://youtu.be/Gt6yCQAXjOA
చేతిలో చెయ్యేసి చెప్పు బావా (sad)
చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల

పల్లవి:
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

పాడుకొన్న పాటలూ పాతవని ఊరుకో
పాడుకొన్న పాటలూ పాతవని ఊరుకో
ఆ మాటలన్ని మాపేసి కొత్తపాట పాడుకో

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

మాట తప్పిపోయినా మనిషి బ్రతికితే చాలూ
మాట తప్పిపోయినా మనిషి బ్రతికితే చాలూ
మన మమత చంపుకొన్న ఒక మంచి మిగిలితేచాలు

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చరణం 1:
తెలియక మనసిచ్చినా తెలిసికుమిలిపోతున్నా
తెలియక మనసిచ్చినా తెలిసికుమిలిపోతున్నా
మిమ్ము కలపమనీ ముక్కోటి దేవతలకు మొక్కుతున్న

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ..మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా


Watch Dasara Bullodu Telugu movie songs, starring Nageswar Rao / Nageshwar Rao / ANR, Vanisri,…
చిత్రం  : గోరంత  దీపమ్
రచయత : C.నారాయణ  రెడ్డి 
పాడినవారు : బాలు , సుసీల 
సంగీతమ్: కె వి. మహదేవన్

గోరంత దీపమ్ కొండత వెలుగు
చిగురంత ఆశ జగమంతా వెలుగు

కరిమబ్బులు కమ్మెవెళ - మెరుపు తీగె వెలుగు
కారు చీకటి  ముసిరే వేళ - వేగుచుక్కే వెలుగు --2
మతి తప్పిన కాకుల రొదలో -మౌనమే వెలుగు
దహియించే భాధలు మధ్యన  - సహనమే వెలుగు --2



గోరంత దీపమ్ కొండత వెలుగు
చిగురంత ఆశ జగమంతా వెలుగు  


కడలి నడుమ పడవ మునిగేతే - కడదాకా ఈదాలి
నీల్లు లేని ఎడారిలో - కన్నీళ్ళు అయినా తాగి బతకాలి --2
ఎ తోడూ  లేని నాడు - నీనీడె నీకు తోడూ
జగమంతా దగా చేసేనా - చిగురంత ఆశను చూడు --2



నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

చిత్రం : మనసారా
సంగీతం : శేఖర్ చంద్ర
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
గానం : కృష్ణ చైతన్య

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగ ఇన్నిన్ని కవ్వింతలా
నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

చూడాలి చూడాలి అంటు నీ తోడే కావాలి అంటు
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల
ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటు ఏ మూల ఉంది
గుండెల్లోన గుచ్చేస్తుంది సూటిగా
పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది
అంతా చిత్రంగా ఉందె ఈ రోజు ఎమైందిలా

నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

చంద్రున్నె మింగేసిందేమొ వెన్నెల్ని తాగేసిందేమొ
ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా
తారల్ని ఒళ్ళంత పూసి మబ్బుల్తొ స్నానాలు చేసి
ముస్తాబై వచేసిందేమొ దేవతా
మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే
నన్నే లాగేస్తునట్టు నీపై తోసేస్తునట్టు
ఎంటో దొర్లేస్తునట్టు ఎదేదో అవుతోందిలా

నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

https://www.youtube.com/watch?v=7eiKP8XGShs
Manasara Movie Songs | Nuvvila Song | Ravi Babu | Sri Divya | Vikram
Manasara is a love story casting Vikram and Sri Divya in the lead roles and Manasara movie is direct...

రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు

చిత్రం : వీరాభిమన్యు (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె?
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు!

రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు

ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు

చరణం 1 :

తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా?
తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా?

పరవశించీ పడుచువానికి మధువు కానీ సొగసేలా?
పరవశించీ పడుచువానికి మధువు కానీ సొగసేలా?

రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు

చరణం 2 :

కలికి సరసన పులకరించీ కరగి పోవని తనువేలా?
కలికి సరసన పులకరించీ కరగి పోవని తనువేలా?

ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా?
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా?

రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు
కన్నెక రతియే కాబోలు .. మన్మధుడితడే కాబోలు

https://www.youtube.com/watch?v=CY9YvFlNt3c
Veerabhimanyu Songs - Ramba Urvasi Taladanne - Kanchana - Sobhan Babu
NTR Sobhan Babu Kanchana's Veerabhimanyu Telugu Old Movie Song Music : K V Mahadevan Lyrics : Aarudr...
 
కలకానిది... విలువైనదీ..
..
నాకు ఇష్టమైన ఇన్స్పిరేషన్ సాంగ్ "కలకానిది విలువైనదీ"
"వెలుగు నీడలు" సినిమాలోని ఈ పాటకు "శ్రీ శ్రీ" గారు రచించిన అద్భుతమైన సాహిత్యం
ఈ పాటను చిరస్థాయిగా మనస్సులో నిలిచేలా చేసింది.
ఈ పాట అప్పడు... ఇప్పుడు
ఒక ఆణిముత్యమే.
"అగాధమౌజలనిధిలోనఆణిముత్యమున్నటులే
శోకాలమరుగునదాగిసుఖమున్నదిలే"
"ఏదీతనంతతానైనీదరికిరాదు
శోధించిసాధించాలిఅదియేధీరగుణం
https://www.youtube.com/watch?v=kIEz9AtpqwI


వేయి వేణువులు మ్రోగేవేళా..హాయి వెల్లువై పొంగేవేళా...
రాస కేళిలో తేలే వేళా...రాధమ్మను లాలించే వేళ....

నను పాలింపగ నడచి వచ్చితివా..
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా...
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా..

చరణం 1:
అర చెదరిన తిలకముతో.. అల్లదిగో రాధమ్మా..
అర జారిన పైయ్యెదతో.. అదిగదిగో గోపెమ్మా..
ఎరుపెక్కిన కన్నులతో.. ఇదిగిదిగో సత్యభామా..
పొద పొదలో.. యెద యెదలో.. నీ కొరకై వెదకుచుండగా

నను పాలింపగ నడచి వచ్చితివా
చరణం 2:
కంసుని చెరసాలలో.. ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో.. ఖైదీవై పెరిగావు
కరకురాతి గుళ్ళలో.. ఖైదీవై నిలిచావు
ఈ భక్తుని గుండెలో.. ఖైదీగా.. ఉండాలనీ

నను పాలింపగ నడచి వచ్చితివా
చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల

ఆరాధన
https://youtu.be/WX2ZjvWZuPA
పల్లవి:
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
చరణం1:
నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానే
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
చరణం2:
నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించరావే
పల్లవిగా పలుకరించరావే
నీ వెచ్చని నీడ .....వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే....
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ............

naa hr
naa hrudayam lo nidurinche cheli original- aaradhan


Naa Hrudayam lo nidurinche cheli- ANR- Aaradhana original song

No comments:

Post a Comment