Wednesday 20 January 2016

01. బొబ్బిలి బ్రహ్మన్న (1984), 02,తాండ్ర పాపారాయుడు (1986)03.స్వయంవరం,04 ఇద్దరు దొంగలు (1984) 05అందాల రాశి (1980),06అద్దాల మేడ (1981) 07.శ్రీకృష్ణ పాండవీయం (1966), 08.శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)09.మహామంత్రి తిమ్మరుసు (1962) 10.గులేబకావళి కథ (1962), 11.కళ్యాణ మండపం

ఓం  శ్రీ రాం       ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - వారపత్రిక - సంగీత ప్రభ 

Major Mitchell's...one of by absolute favorite birds. They have beautiful flame like markings on their mohawks:
సర్వేజనా సుఖినోభవంతు


చలిగాలి వీచింది.. సనజాజి పూసింది...సందిళ్ళకే చేరుకో...
చిత్రం : బొబ్బిలి బ్రహ్మన్న (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. అ.. ఆ..
చలిగాలి వీచింది.. సనజాజి పూసింది
సందిళ్ళకే చేరుకో...
ఏ గాలికి సంధివ్వకు.. ఏ పూలకి ముద్దవ్వికు
నీ ముద్దు నాదైన వేళా...

ఆ.. ఆ.. ఆ.. అ.. ఆ..
చెలి గాలి వీచింది... సనజాజి పూసింది
కౌగిళ్ళకే చేరుకో...
ఏ గాలికి సంధివ్వకు.. ఏ పూలకి ముద్దవ్వికు
నీ ముద్దు నాదైన వేళా...

చరణం 1 :
వేళకు వచ్చి.. వెచ్చగ ఇచ్చి.. కౌగిలితోనే కమ్ముకుపోనా
ఆ.. బుగ్గలు గిచ్చి.. సిగ్గులు పెంచే చక్కిలిగింతే చల్లుకుపోనా

జరిగి జరిగి జంటకు రానా
అడిగి అడిగి అల్లుకుపోనా
చలిగా మారే సావాసంలో..
జతనే కోరే సాయంత్రంలో...
పొదరిల్లు మనదైన వేళా ... ఆ.. ఆ..

ఆ.. ఆ.. ఆ.. అ.. ఆ..
చలిగాలి వీచింది.. సనజాజి పూసింది
సందిళ్ళకే చేరుకో...

చరణం 2 :
చీకటి నేసే.. చీరలు తెచ్చి.. చేతికి చెండై చెంతకు రానా
వెన్నెలకైనా .. వేడిని పెంచే.. సోకుల పండు కోసుకుపోనా

మరిగి మరిగి మాపటి వేళా..
చెలికి చలికి దుప్పటి కానా
నిశిరాత్రైనా నిదరే రాదు
వయసొచ్చాక వరసే వేరు
మసకెస్తే మతిపోవు వేళా.. ఆ.. ఆ.. ఆ..

ఆ.. ఆ.. ఆ.. అ.. ఆ..
చలిగాలి వీచింది.. సనజాజి పూసింది
సందిళ్ళకే చేరుకో..


అభినందన మందార మాల.. అభినాయక స్వాగత వేళ..ఆ..
చిత్రం: తాండ్ర పాపారాయుడు (1986)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఏసుదాస్, సుశీల

పల్లవి:
అభినందన మందార మాల..
అభినందన మందార మాల..
అభినందన మందార మాల.. అభినాయక స్వాగత వేళ..ఆ..
అభినందన మందార మాల..

స్త్రీజాతికీ.. ఏనాటికీ.. మననీయ మహనీయ వీరాత్రనికి..
అభినందన మందారమాల.. అభినాయక స్వాగత వేళ..ఆ..

చరణం 1:
వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా
వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా

వెన్నెల కన్నెలు నిన్నే చూడగా..
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.. నీ చూపు నారూపు వరియించెనా
నీ చూపు నారూపు వరియించెనా..

నా గుండె పై నీవుండగా.. విరితానే భువిపైనే దిగివచ్చెనా
అభినందన మందారమాల.. అలివేణి స్వాగత వేళ..ఆ..
అభినందన మందారమాల..

సౌందర్యం సౌశీల్యం.. నిలువెల్ల నెలకొన్న కల భాషిణికి
అభినందన మందారమాల..

చరణం 2:
వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో
వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో

సగం మేనిలో ఒదిగిన దేవత..
సగం మేనిలో ఒదిగిన దేవత.. నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో..

ప్రియ భావమే లయ రూపమై.. అలలెత్తి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల.. ఉభయాత్మల సంగమమేళ..ఆ..
అభినందన మందారమాల..

ర"సాలురు" రాజేశ్వరరావు గారంటే మనకి అమితమైన ప్రేమ, వారు చేసిన పాటలు ఆణిముత్యాలు, తాండ్రపాపారాయుడు చిత్రానికి కూడా వారే సంగీతం అందించారు, కృష్ణంరాజు గారే నిర్మ...


హరివిల్లూ పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్నీ అందరికోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీకోసం

చిత్రం : స్వయంవరం
సంగీతం : సత్యం
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం, P.సుశీల

పల్లవి :
హరివిల్లూ పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్నీ అందరికోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీకోసం

సిరిమల్లీ జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్నీ అందరికోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీకోసం

చరణం :
తలిరాకులు మొగ్గలుగా...చిరుమొగ్గలు పూవులుగా...
అవి నీ చిరునవ్వులుగా...మారేనూ...
నెలవంకే జాబిలిగా...ఆ జాబిలి వెన్నెలగా...
అది నీ కొనచూపులుగా...తోచెనూ...
నీ చూపులలో నా నవ్వులలో..మధురిమలే పెరిగేనూ...

చరణం :
నీ అలకే సింధూరం...నీ పలుకే సంగీతం...
నీ సొగసే అందాలా...బృందావనం..
నీ మాటే మకరందం...నీ మనసే మందారం...
నీ యదలో ఆణువణువూ...నా సొంతం...
తియ తీయనిది వసివాడనిది...మనఇద్దరి అనుబంధం

Shoban Babu and Jayapradha's Swayamvaram Telugu Movie - Harivillu Podarillu Song with HD…

ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
చిత్రం : ఇద్దరు దొంగలు (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :
ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..

ఏమి లయలు.. ఎంత హొయలు.. ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో

ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ.. హా..

చరణం 1 :
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా

నీ కొంటెచూపు మనసంత వెలుగు వేదాలు పాడగా
అల్లారుపొద్దు అల్లారుముద్దు నీకే జవాబులిస్తాగా

బదులైనా బతుకైనా..ముద్దుకు ముద్దే చెల్లంటా
వయసుకు వయసే వళ్ళంటా..
కన్ను తుదల.. ఎన్ని ఎదల తీపి సుధలు నీలో..
వెచ్చని ముద్దులుగా.. అవి అచ్చులు పడెనాలో
వెచ్చని ముద్దులుగా.. అవి అచ్చులు పడెనాలో

ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..

చరణం 2 :
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో

వీచే పెదాల చిలిపీ సిరాల.. చిరు సంతకాలతో
నా జీవితాలు చెలి కాగితాలు..నీకంకితాలు చేస్తాగా

కలలైనా.. నిజమైనా.. కౌగిలి పెట్టిన ఇల్లంటా
ఇద్దరి పేరే ప్రేమంటా..
ఎన్నిజతులు.. ప్రేమ జతలు.. పూలరుతులు నీలో..

తుంటరి తుమ్మెదనై.. అవి తొందరపడెనాలో
తుంటరి తుమ్మెదనై.. అవి తొందరపడెనాలో

ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..

ఏమి లయలు.. ఎంత హొయలు.. ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
వెచ్చని ముద్దులుగా.. అవి అచ్చులు పడెనాలో

లలలల.. లా.. లల.. లాలలల.. లలలాలా..




కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...ఊ..

చిత్రం: అందాల రాశి (1980)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:
కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...ఊ..

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

చరణం 1:
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..

నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...

నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ...

పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పెదవులకెంత ఆశ... ఎంత ఆశ.... ఎంత ఆశా...
పదే పదే పదే పదే ఒదిగి ఉండాలని...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

చరణం 2:
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...

కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ...

హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
హృదయం కోరుతుంది... కోరుతుంది... కోరుతుంది...
ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ....

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...



స్వాగతం కురసార్వభౌమా.. స్వాగతం.. సుస్వాగతం..
శతసోదర సంసేవిత సదనా.. అభిమాన ధన సుయోధనా..ఆ..ఆ..

చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : పి. లీల, సుశీల

పల్లవి :
స్వాగతం..
స్వాగతం సుస్వాగతం..

స్వాగతం కురసార్వభౌమా.. స్వాగతం.. సుస్వాగతం..
శతసోదర సంసేవిత సదనా.. అభిమాన ధన సుయోధనా..ఆ..ఆ..
స్వాగతం.. సుస్వాగతం..

చరణం 1 :
మచ్చలేని నెల రాజువు నీవే.. మనసులోని వలరాజువు నీవే
మచ్చలేని నెల రాజువు నీవే.. మనసులోని వలరాజువు నీవే

రాగ భోగ సురరాజువు నీవే..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అహా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...

రాగ భోగ సురరాజువు నీవే.. రాజులకే రారాజువు నీవే..
ధరణి పాల శిరో మకుటమణి తరుణ కిరణ పరి రంజిత చరణా..

స్వాగతం.. సుస్వాగతం..
చరణం 2 :
తలపులన్ని పన్నీటి జల్లులై.. వలపులన్ని విరజాజి మల్లెలై..
ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆ..ఆ

తలపులన్ని పన్నీటి జల్లులై.. వలపులన్ని విరజాజి మల్లెలై
నిన్ను మేము సేవించుటన్నవీ.. ఎన్ని జన్మముల పుణ్యమో అది
కదన రంగ బాహు దండ సుధ గధా ప్రకట పటు శౌర్యాభరణ

స్వాగతం.. సుస్వాగతం..


స్వాగతం కురసార్వభౌమా.. స్వాగతం.. సుస్వాగతం..
శతసోదర సంసేవిత సదనా.. అభిమాన ధన సుయోధనా..ఆ..ఆ..

చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : పి. లీల, సుశీల

పల్లవి :
స్వాగతం..
స్వాగతం సుస్వాగతం..

స్వాగతం కురసార్వభౌమా.. స్వాగతం.. సుస్వాగతం..
శతసోదర సంసేవిత సదనా.. అభిమాన ధన సుయోధనా..ఆ..ఆ..
స్వాగతం.. సుస్వాగతం..

చరణం 1 :
మచ్చలేని నెల రాజువు నీవే.. మనసులోని వలరాజువు నీవే
మచ్చలేని నెల రాజువు నీవే.. మనసులోని వలరాజువు నీవే

రాగ భోగ సురరాజువు నీవే..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అహా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...

రాగ భోగ సురరాజువు నీవే.. రాజులకే రారాజువు నీవే..
ధరణి పాల శిరో మకుటమణి తరుణ కిరణ పరి రంజిత చరణా..

స్వాగతం.. సుస్వాగతం..
చరణం 2 :
తలపులన్ని పన్నీటి జల్లులై.. వలపులన్ని విరజాజి మల్లెలై..
ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆ..ఆ

తలపులన్ని పన్నీటి జల్లులై.. వలపులన్ని విరజాజి మల్లెలై
నిన్ను మేము సేవించుటన్నవీ.. ఎన్ని జన్మముల పుణ్యమో అది
కదన రంగ బాహు దండ సుధ గధా ప్రకట పటు శౌర్యాభరణ

స్వాగతం.. సుస్వాగతం..


వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ...
చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి నాగేంద్ర రావు
నేపధ్య గానం : జానకి, బాలమురళి కృష్ణ

పల్లవి :
వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ
వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ
తనువు మనసు ఊగి తూగి..
తనువు మనసు ఊగి తూగి.. ఒక మైకం కలిగేనులే
ఈ మహిమ నీదేనులే ప్రేమతీరు ఇంతేనులే

చరణం 1 :
రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా
రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా

తనువు మనసు ఊగి తూగి
తనువు మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులే
ఈ మహిమ నీదేనులే... ఆహా భలే హాయిలే
ఈ మహిమ నీదేనులే

చరణం 2 :
విలాస మాధురి వెన్నెల కాగా... విహార వీణలు విందులు కాగా
విలాస మాధురి వెన్నెల కాగా... విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనుపించెనే

ఈ మహిమ నీదేనులే... ప్రేమ తీరు ఇంతేనులే
ఈ మహిమ నీదేనులే...


మోహన రాగమహా మూర్తిమంతమాయె...నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన
చిత్రం : మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:
మోహన రాగమహా మూర్తిమంతమాయె
మోహన రాగమహా మూర్తిమంతమాయె...

నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
మోహన రాగమహా.. మూర్తిమంతమాయె..

చరణం 1:
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ...
చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా..
మోహన రాగమహా... మూర్తిమంతమాయె

చరణం 2:
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..
నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా...
మోహన రాగమహా... మూర్తిమంతమాయె

Watch NTR Varalakshmi's Mahamantri Timmarusu Telugu Movie Songs With HD Quality Lyrics - Pingali Nagendra Rao Music - Pendyala

కలల అలలపై తేలెను... మనసు మల్లెపూవై...ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్-కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:
కలల అలలపై తేలెను... మనసు మల్లెపూవై...
ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
కలల అలల పై..

చరణం 1:
జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
తడిసి తడియని కొంగున... ఒడలు దాచుకున్నందుకు..
తడిసి తడియని కొంగున... ఒడలు దాచుకున్నందుకు..

చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము... మరులు గొలుపుతున్నందుకు..
విరిసీ విరియని పరువము... మరులు గొలుపుతున్నందుకు..
కలల అలల పై..

చరణం 2:
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికాణిని... జంట గూడి రమ్మన్నది
జవరాలిని చెలికాణిని... జంట గూడి రమ్మన్నది

విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము... బిగికౌగిట కలదన్నది..
అగుపించని ఆనందము... బిగికౌగిట కలదన్నది..

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై...
ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
కలల అలల పై..

Watch Kalala Alalapai Telenu Manasu Mallepoovai HD Video Song from Gulebakavali Katha Movie,…

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే...వలచే మనసుకు బదులుగ బదులుగ

చిత్రం : కళ్యాణ మండపం
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమ విధాత జీవననేత ప్రేమ విధాత
అను గుడిగంట విను ప్రతిజంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే

తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
జీవనగంగా వాహిని కాదా , జీవనగంగా వాహిని కాదా
అను ప్రతిజంట – విను గుడిగంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
https://www.youtube.com/watch?v=J_a7wUd8sFM
Kalyana Mandapam Movie Songs || Sarigama Padanisa || Shoban Babu || Kanchana
Sobhan Babu - Kanchana - Anjali Devi`s Kalyana Mandapam Telugu Movie - Sarigama Padanisa Palike Varu...

1 comment: