Thursday 14 January 2016

Special days for the month of 1/2016

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 

sunrise:
సర్వే  జనా సుఖినోభవంతు
శుభరాత్రి

దేశభక్తి గేయం - గణతంత్ర దినోత్సవం-26-1-2016
సందర్భంగా విద్యార్థులకై

భారతదేశం ఇది భవ్యప్రదేశం
బహువిధ సంస్కృతి కలిగిన క్షేత్రం
పలుపలు భాషలు పలికెడు దేశం
ధరణికె ధర్మము తెలిపిన క్షేత్రము....

విజ్ఞానమ్మును ఒసగిన వేదము
విలసిల్లిన నా రమ్యప్రదేశం
జ్ఞానం శీలం ఏకాత్మభావం
యెదయెద నాటిన ధన్యప్రదేశం
దేశభక్తులూ త్యాగమూర్తులు
వీరులు శూరులు మహిమాన్వితులు
మహిలో వెలసిన మాతృ ప్రదేశం......||భారత||

ఆదిశంకరుని అద్వై తమ్ముయు
స్వామి వివేకుని జ్ఞాన బోధనలు
వీర శివాజీ ధర్మ పాలనము
రాణా ప్రతాప పౌరు షమ్మును
ఆటపట్టుయై నవని నిలిపిన
ఆదిభూమి యిది మహత్వ ధరణీ......||భారత||

ముని గణములు వెలసిన భూమి
సురులే నరులుగ మసలిన భూమి
దానము ధర్మము భగవద్భక్తికి
ప్రేరణ నిచ్చిన పుణ్య ధాత్రియిది
జనగణ వందిత నిత్యపూజిని
భారతజననీ హృదయ నివాసిని .....||భారత||

23 జనవరి నేతాజీ జయంతి
నేతాజీ మరణవార్త విని కాళొజీ స్పందన (1945)— నా గొడవ
నేతాజీ!!
బానిసత్వపు కారుచీకటి/పారదోలగ నుదయమందించగ
భారత జాతీయ జీవితభానుడా/ ఓ బోసుబాబూ
పట్టపగలే ప్రొద్దుగుంకిందా? / ఆ పాడుచావుకు కండ్లు గుట్టినవా?
పేరు ఊరు లేక పృధ్వికి/ భారమైన క్షుద్రజీవులు
పిరికిపందలు వేలు లక్షలు / చిరంజీవులుగా చరియింపగ
వీరుడా నీకింత వేగిరమా? లేక/ కరుణలేని కాలనిర్ణయమా?
శుక్లపక్షపు రోజులందును / చూడ పున్నమరేయినాడే
కటిక చీకటి క్రమ్ముకొనుటకు/ కారుమబ్బులు కారణము గావా? మా
మందభాగ్యమే కొంపముంచినదా?/ మా చందురునికమావాస్య వచ్చినదా?
గాంధి తాతతో జగడమాడి / గద్దెనెక్కిన గడుసుతనము
మాయకారి ఆంగ్ల నీతిని / మాయ చేసిన ఇంద్రజాలము
చావుకే చవిచూప జంకితివా? చాలు/ ఈ భవమని తలంచితివా
చచ్చుపనులు చేయలేదని / చచ్చువాడవు కానే కావని
చాటిచెప్పుచునుండ హృదయము- ఈ
చచ్చు వార్తల నమ్మమందువా?
స్వామీ వచ్చి దర్శనమివ్వనంటావా?
*****
23 జనవరి నేతాజీ జయంతి
నేతాజీ సేవలు, త్యాగం, స్థిరచిత్తం గురించి మనకు చాలావరకు తెలుసు. ఆయన మరణం గురించి తెలుసుకోలేని 100కోట్ల మంది భారతీయులలో మనందరం ఉన్నాము.
నేతాజీ విషయమై ప్రస్తావించడానికి ఆయన కుటుంబ సభ్యులు, దాయాదులు ఆరుసార్లు సమయం కావాలని అడిగినా కరుణించని మమతా బెనర్జీని అక్కయ్య (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి) ఆఘమేఘాలమీద పత్రికా సమావేశం ఏర్పాటుచేసి 64 ఫైళ్ళ ప్రతులను అందజేశారు. నేతాజీకి సంబంధించిన సమాచారాన్ని దేశప్రజలకు తెల్యజేయకుండా కెంద్రప్రభుత్వం ఇక ఏమాత్రం తప్పించుకోజాలదని ఆవేశంగా అన్నారు.
తదుపరి కొద్ది రోజులకు తనను కలిసిన నేతాజీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రధాని “నేతజీ జయంతియైన 23 జనవరి (2016)నుండి నేతాజీకి సంబంధించిన సమాచారమంతా దేశప్రజల ముందుకొస్తుందని” హామీ ఇచ్చారు.
మనం మరో 12 గం. వేచిచూస్తే నేతాజీ మరణానికి సంబంధించిన సమాచారాన్ని తెల్సుకుంటాం.

Like
Comment


~ జాతి నేత ~
నేతాజీ…

నేటికీ మీరే మాకు స్ఫూర్తి… స్వాతంత్ర్యం కోసం భరతజాతి నెరపిన సంగ్రామ చరితలో మిమ్మల్ని మించిన విలక్షణ నాయకుడెవ్వడు? సమకాలీన నేతలలో మిమ్మల్ని మించిన వివాస్పద నేత ఎవ్వరు?

నాలాంటి వారికి మీ జీవిత చరిత్ర చదువుతుంటే… ఎన్ని శిక్షలు… ఎన్నిదేశాలు… ఎన్ని పయనాలు… ఎన్ని వేషాలు… ఎంతటి ఆవేశం… ఎంతటి ఆలోచన… ‘నిజంగా ఒక నాయకుడి నిజజీవితంలో ఇంతటి నాటకీయత ఉంటుందా…. కేవలం నాయకుల్లో ఒక నాయకుడు కాదు నాయకులకే నాయకుడు...సాహస వీరుడితను…’ అని అనిపించకుండా ఉండదు. అందుకే జాతి గుండెల్లో నువ్వు ఒక్కడివే నేతాజీగా నిలచిపోయావ్.

అందరూ అహింసా మార్గం అని అంటున్న రోజుల్లో వలసవాదులకి వ్యతిరేకంగా భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో ఆజాద్ హింద్ ఫౌజ్ అంటూ భారత జాతీయ సైన్యాన్ని సింగపూర్ లో ఏర్పాటు చేసి, జపాన్, జర్మనీ తదితర దేశాల నాయకులు మిగిలిన దేశాలతో ఎలా ఉంటున్నారో మనకి అనవసరం శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు మన దేశ స్వాతంత్రమే నాకు ముఖ్యం అని నమ్మి రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ లాంటి నియంతతో చేతులు కలిపి ఆంగ్లేయులకి చెమటలు పట్టించిన ధీర యోధుడవు నీవు.

కేవలం సాయుధ పోరాటమే నీ పంథా అనుకునే చాలా మందికి తెలియని విషయం అనేకమంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకొని సంప్రదింపులు జరిపిన విషయం. తరువాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది ఎంత మందికి తెలుసు?

రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని స్వతంత్రం వచ్చిన తరువాత కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా మీ అభిప్రాయం. నిజమే ఆనాడు నియంతల్లా ఉంటేనే నేటి నాయకులకి క్రమశిక్షణ… భీతి ఏర్పడేవేమో…

దశాబ్దాలుగా వారసత్వ పాలనలో దేశం మగ్గిపోయి ఉండేది కాదేమో. మీ దార్శనికత లో పావువంతు మిగిలిన నాయకులకు ఉన్నా భారతదేశపు రాజకీయక్రీడలు ఇంత వికృత రూపం దాల్చేవి కావేమో.

1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా భోగరాజు పట్టాభిరామయ్య గారి మీద నీ గెలుపుని తన ఓటమిగా భావించిన గాంధీ గారి భావన చూసి ఆ పదవిని తృణప్రాయంగా వదులుకుని నువ్వెంతటి సంస్కారవంతుడవో చాటి చెప్పావ్.

ఈ తరంలోనే కాదు ఆ తరంలోనూ నీచ రాజకీయాలున్నాయని మీ చరిత్ర చదివినప్పుడే మాకు మొదటిసారి తెలిసింది. ఆ కుటిల రాజకీయాలకే మీరు బలైపోయావని నమ్మే నవ భారతీయులలో నేనూ ఒకడిని.

వివిధ సందర్భాలలో మీరు చెప్పిన ఈ మాటల కన్నా ఏ వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలు ఎక్కువ కాదేమో అనిపిస్తుంది. అనిపించటమే కాదు అదే నిజం కూడా…

"మీరు రక్తాన్ని ధారపోయ్యండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తాను.

స్వరాజ్యం అంటే ఎవరో ఇచ్చేది కాదు అది పుచ్చుకొనేది.

స్వేచ్ఛను ఎవరో ఇవ్వరు, మనమే తీసుకోవాలి.

ఆలోచనా పరుడికి మరణం ఉండవచ్చు కాని ఆలోచన వేలమందికి స్పూర్తినిస్తుంది."

నిజానికి మీరో నిరంతర యుద్ధం. మీకు మీరే ఒక యుద్ధరంగమై భారతదేశానికి విముక్తికోసం క్షణం క్షణం నిరంతర సాహస యజ్ఞం చేసిన ధీరత్వం మీ సొంతం.

విమానప్రమాదంలో మీరు మరణించారో లేదోనన్న విషయం ఎప్పటికీ అలానే ఉండి పోతేనే బాగుంటుంది మాలాంటి వాళ్లకి. మీ అదృశ్యానికి సంబంధించిన దస్త్రాలు అంటూ మళ్ళీ కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. కానీ కొన్ని కొన్ని రహస్యాలు రహస్యంగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. మీ మరణాన్ని జీర్ణించుకునే శక్తి మాకు లేదు.

కాకపోతే ఒకే ఒక్క కోరిక ఏమంటే మీ అదృశ్యం ఈ మలిన రాజకీయాలకి మళ్ళీ మళ్ళీ ఆజ్యం పోసే వస్తువు ఏమాత్రం కాకూడదని.

అప్పటి విమాన ప్రమాదంలో మరణించినా మరణించక పోయినా…. ప్రస్తుత వయసు రీత్యా చూస్తే మీరు స్వర్గస్తుడై ఉండి ఉంటారేమో…

ఏదైనా సరే దేహంగా మీరు వెళ్ళిపోయి ఉండవచ్చు గానీ ప్రతి భారతీయంలో ఎప్పటికీ రగిలేస్ఫూర్తిగా మీరు నిలిచే ఉంటారు సమరంలో నైనా మరి మరణంలో నైనా.

ఏదేమైనా మీ సమకాలీన నాయకుల్లో మీ అంతగా అంతర్జాతీయంగా చరిత్ర సృష్టించిన భారతీయ నాయకుడు లేడు.

వెన్నెముకలేని రాజకీయవారసత్వాల ఉనికిని మరుగు పరుస్తూ మీ లాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ రావాలి.


భారతీయుడు
 
ఆవు, మేక, కుక్క, పిల్లి

ఆవు పాలు అమ్మపాలుతో సమానం
ఆవు పంచకం  ఆరోగ్యానికి శుభకరం
గోవుకల్పం సహస్త్రదేవతల నిలయం 
గోవు హిందువుల పూజించతగ్గ  ప్రాణి

మేక పాలు త్రాగితే బలం పెరుగు
మేక బీర్జలు తింటే ధారుడ్యం పెరుగు
మేక మాంసం కొందరి ఆహారం
మేకపెంచి కసాయివాని బలిగా మారు

కుక్క విశ్వాసము గల జంతువు
కుక్క తోక వంకర ఎప్పటికి మారదు
కుక్క నమ్మినవారికి సహయముచేయు
కుక్క  కొందరికి  పెంపుడు జంతువు

పిల్లి 




   
శ్రద్దాంజలి (18-1-2016)

చారిత్రక పురుషుడు, తెలుగు దేశనాయకుడు, అనితర సాద్యమైన అద్భుత నటనలో ప్రజలకు వినోదం కలిగించిన నాయకుడు.
 
మహానటుడు, మహా నాయకుడు నందమూరి తారకరామారావు మనల్ని వీడి రెండు దశాబ్దాలు దాటినా తెలుగువారి మనసుల్లో మాత్రం నిత్యం వెలుగుతూనే ఉన్నారు. ఆ వెలుగులతోనే ఇంకా తెలుగునేల పులకిస్తోంది. ఈ నెల 18న ఎన్టీఆర్‌ ఇరవయ్యో వర్ధంతి సందర్భంగా తెలుగువారికి ఆనందమూరించిన నందమూరి ఘనచరితను స్మరించుకుందాం...
తెలుగు జాతి కీర్తి పతాకను దశదిశలా రెపరెపలాడించిన ఏకైక మహానటుడు నందమూరి తారకరామారావు. తెలుగు వెలుగును నిత్యం వెలిగేలా చేసిన ఘనత, చరిత ఎన్టీఆర్‌ సొంతం. అందుకే ఆయన కొందరికి రణజన్ముడు, కారణజన్ముడు. ఎందరికో ఓ అవతార పురుషుడు. ఆయన ఘన చరితను స్మరించుకోగానే తెలుగువారి మది పులకించిపోవలసిందే.
తెలుగువారి సొత్తు అని మనం గర్వంగా చెప్పుకుంటున్న పౌరాణికాల్లో ఎన్టీఆర్‌దే పైచేయి. పురాణాల్లోని శిష్ట పాత్రలకే కాక, దుష్ట పాత్రలకూ తనదైన బాణీ అద్ది రంజింపజేశారు రామారావు. ఆయన ధరించిన తొలి పౌరాణిక పాత్ర ‘మాయారంభ’లోని నలకూబరుడు. ఆ తరువాత జానపద చిత్రం ‘జయసింహ’లోని ఓ స్వప్నగీతంలో అర్జునునిగానూ మెప్పించారాయన. ఆ తరువాత ఎన్నెన్నో పౌరాణిక పాత్రల్లో ఆయన అలరించిన తీరు ఇతరులు దరిచేరనివిధంగా సాగింది. ‘మాయాబజార్‌’లో ఎన్టీఆర్‌ను సాక్షాత్తూ శ్రీకృష్ణునిగా జనం మదిలో కొలువై ఉండేలా చేశారు దర్శకుడు కేవీ రెడ్డి.

ఎన్టీఆర్‌ పేరు చెప్పగానే ఆయన పౌరాణిక పాత్రల్లో ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణ పాత్రే. ఆ పాత్ర పోషణలో ఆయన నవరసాలు కురిపించారు. ఎన్టీఆర్‌కు ముందు, తరువాత కూడా ఎందరో శ్రీకృష్ణ పాత్రను ధరించారు. అయినా అందులో అనేకమార్లు జీవించిన ఘనత నందమూరి సొంతం.

ఒకే పాత్రను పాతికసార్లు తెరపై అభినయించి రక్తి కట్టించడం అక్షరాలా అద్భుతమే! ఆ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత ఎన్టీఆర్‌ సొంతం. ఆరంభంలో ‘ఇద్దరు పెళ్లాలు’, ‘సొంతవూరు’ వంటి సాంఘికాల్లో శ్రీకృష్ణుని గెట్‌పలో కనిపించినా, ‘మాయాబజార్‌’లో ఆ పాత్రే తానుగా ఇమిడిపోయారు ఎన్టీఆర్‌. కృష్ణుని పాత్రకే వన్నెతెర్చిన రామునిగా ఆయన జనం మదిలో నిలిచారు. శ్రీకృష్ణుడంటే ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌ అంటే శ్రీకృష్ణ పాత్ర గుర్తుకువచ్చేవి.

శ్రీకృష్ణునిగా జనం మదిలో చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్‌.. శ్రీరామ పాత్రలోనూ అదేరీతిన అభినయించారు. రాముడంటే నందమూరి తారకరాముడే - అనే తీరున ఆయన అభినయం సాగింది. శ్రీరామ పాత్రలోనూ పలుమార్లు తనదైన నటనతో నందమూరి మెప్పించారు.

రామాయణంలో రామునిగా, భారత, భాగవతాల్లో కృష్ణునిగా అలరించిన నందమూరి - ఆ ఇతిహాసాల్లోని ప్రతినాయక పాత్రల్లోనూ మురిపించడం ముచ్చటైన విషయం. ఓ దేశ పురాణగాథల్లో నాయక, ప్రతినాయక పాత్రల్లో మెప్పించిన నటుడు నందమూరిలాగా మరొకరు కానరారు. రావణబ్రహ్మగా రామారావు రాణించిన వైనం నభూతో న భవిష్యతి. భారతంలోని ప్రతినాయకుడు దుర్యోధన పాత్రలోనూ అన్యులకు అసాధ్యంగా ఆయన పరకాయప్రవేశం చేసి భూత, భవిష్యత కాలాల్లో తనకు తానే సాటి అనిపించారు.

త్రేతాయుగ, ద్వాపరయుగ పాత్రల్లోనే కాదు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని పాత్రనూ ధరించి యావత భారతాన్నీ పులకింపజేసిన నటుడు నందమూరి. తిరుపతి వేంకటేశ్వరునిగా తెలుగువారి మదిని ఆనంద డోలికల్లో ఊగేలా చేసిన నటరత్న ఉత్తరాదివారిని సైతం ‘బాలాజీ’ పాత్రలో అలరించారు.

ప్రపంచంలోనే అత్యధిక పురాణ పాత్రలను పోషించిన ఘనత ఎన్టీఆర్‌ సొంతం. పురాణ పాత్రల పోషణలోనే కాదు, చరిత్రలో చెరిగిపోని ముద్రవేసిన మహనీయుల పాత్రలకూ ప్రాణప్రతిష్ఠ చేశారు నందమూరి, తెలుగు వెలుగులుగా నిలచిన మహానుభావుల పాత్రలను మన కళ్లముందు సజీవంగా నిలిపిన ఘనత కూడా ఎన్టీఆర్‌ సొంతమే. తెలుగుజాతి గర్వించే అనేక చారిత్రక పాత్రల్లో ఆయన అలరించారు. శ్రీకృష్ణదేవరాయలుగా, బ్రహ్మనాయుడిగా, వీరరంగారావుగా, అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్‌ తెరపై కనిపించగానే తెలుగువారి మనసులు పులకించిపోయేవి.

చరిత్ర గతిని మార్చివేసి మరోచరిత్ర సృష్టించిన వారి పాత్రల్లోనే కాదు, కాలగతినే శాసించి కాలజ్ఞానం బోధించిన మహనీయుడు వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రనూ మన ముందుంచి ఆలోచింపజేశారు నందమూరి. ‘బ్రహ్మంతాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది’ అంటూ ప్రజాకోటికి కనువిప్పు కలిగించిన అభినయమూర్తి నటరత్న. అందుకే నందమూరి తారకరామారావు అవతారమూర్తి, చారిత్రక పురుషుడు!
నదమూరి తారకరామారావుగారి అభిమానిగా ఇందు పొందు పరుస్తున్నాను, వారికి నివాళ్ళు అర్పిస్తున్నాను 
   

*మన దేశములో మాత్రమే జరిగే కొన్ని సత్యాలు..ఒక ఆంగ్ల పోస్ట్ నుండి నాకు నచ్చిన విషయాలను తెలుగులో అందిస్తున్నాను. . Share if you care.

1.ఒక కుటుంబంలోని సభ్యులు ఆదర్శవంతులుగా ఉండాలి అంటే .. ఆ కుటుంబములోని స్త్రీలకూ విద్య తప్పనిసరి. మన దేశములో స్త్రీ విద్య కు ఖర్చు పెట్టేదానికంటే ఆ స్త్రీ వివాహం మీద ఎక్కువ ధనం ఖర్చు చేయడం జరుగుతుంది. నెమ్మదిగా మార్పులు సంతరించుకుంటున్నాయి .. ఇంకా ముందు ముందు ఎక్కువ ప్రగతిని చూడవచ్చు.

2. మన దేశములో ఇప్పటికీ మన పోలీసులను చూస్తే . వారు మన రక్షక భటులు అన్నది మరచి పోయి.. ప్రజలు భయపడుతున్నారు. మార్పు ఇప్పటికీ అత్యల్పమే. ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నతాధికారులు తప్ప మిగతా పోలీసు వ్యవస్థ.. ప్రజలను ఇప్పటికీ భయపెడుతూనే ఉంది. లంచగొండి తనము..అత్యధికం ఈ శాఖలో.

3. వరకట్న వ్యవస్థ అన్నది ఒక దురాచారము అని వ్యాసాలూ వ్రాసిన ప్రబుద్ధులే . చదువులు పూర్తికాగానే ఎక్కువగా కట్న కానుకలు కావాలని అడుగుతున్నారు.

4. ఇరవై ముప్పై వేలు పోసిన మొబైల్ కి స్క్రీన్ గార్డ్ వేస్తారు గానీ .. రోడ్ మీద వాహనాలలో వెళ్ళేప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం మరియు.. హెల్మెట్ పెట్టుకోవాలి అంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ నామోషీనే. మొబైల్ కి ఉన్న విలువ కనీసం ఒక వ్యక్తీ తన విలువైన జీవితానికి ఇవ్వడం లేదు.. దీనికి ఉన్నత న్యాయస్థానాలు కలుగ జేసుకున్నా ఇప్పటికీ హెల్మెట్ వాడే వారు అంతంత మాత్రమే.

5. మన సమాజములో ఏ తప్పూ చేయకున్నా అత్యాచారం చేయబడ్డ వారికంటే చేసిన వారికే ఎక్కువ రాచ మర్యాదలు.. అత్యాచారం తప్పని ఎవరికీ చెప్పారు కానీ .. అత్యాచారం నుండి ఎలా తప్పించుకోవాలో మాత్రం నేర్పిస్తారు.

6. పి కె వంటి వెకిలి చిత్రాలు బాగా వందల కోట్లు సంపాదిస్తాయి కానీ ఉన్నతమైన విలువలతో తీసిన చిత్రాలను ఎవరూ చూడరు.

7. భగవద్ గీత, ఉపనిషత్తులు , వేదాలను వెకిలి చేస్తారు కానీ వాటిలో ఉన్న విషయం తెలుసుకున్న వారు మాత్రం అతి తక్కువ.

8. ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారి కంటే రిజర్వేషన్స్ ఉన్న వారికే ఎక్కువ లాభాలు ఉన్నాయి.

9. మన దేశములోని రాజకీయ నాయకులే తీవ్ర వాదులు కన్నా ప్రమాదకరం.. రాజకీయ నాయకులే ప్రజలను ఎక్కువగా విడదీసి పాలిస్తారు.

*ఆ మొఘల్ రణధీరు తంతియా తోపి ఝాన్సీల సమర దీప్తి
త్యాగ మూర్తులు తిలక్, దాదా ,సి ఆర్ దా మాలవ్యా మన గాంధి మహిత శక్తి
జాతీయ సంస్థయై శాంత్యహింసల తోడ కాంగ్రెస్సు నడిపిన కదన ఫణితి
తమిళ ఆంద్ర కేరళ ధారుణీ ప్రజలెల్ల ధారవోసిన మహా త్యాగ ఫలము
మాత్రుదేశమును గాచ సుక్షాత్రియుడై బోసు పడరాని ఇడుముల బడిన శ్రమయు
పండిత నెహ్రుజీ పటేల్ పట్టాభి రాజాజీ నెరపిన రాజ్య పటిమ
భారతీయులు పుణ్యంబు పండెననగా వచ్చెనిదిగో సుస్వాతంత్ర్య వత్సరంబు
ప్రొద్దుగుడి శుభములు పొందురయ్య తొల్లి భారత విభవంబు వెల్లి విరియ

రచన: తెలియదు.. గానం: ఘంటసాల







*

No comments:

Post a Comment