Thursday 29 June 2017

పుణ్యవతి (1967)


pranjali prabha- old songs
మనసు పాడింది సన్నాయి పాట...కనులు ముకుళించగ... తనువు పులకించగా...
చిత్రం : పుణ్యవతి (1967)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :
మనసు పాడింది సన్నాయి పాట
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా

చరణం : 1
జగమే కల్యాణ వేదికగా
సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా
సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా
నా అలివేణి తలవాల్చిరాగ

చరణం : 2
చిలికే పన్నీటి వెన్నెలలోనా
పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా
పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా
నా వనరాజు ననుచేర రాగా

చరణం : 3
మదిలో దాచిన మమతలతేనెలు
పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు
పెదవులపైనే కదలాడగా
పెదవులకందనీ మధురిమలేవో
హృదయాలు చవిచూడగా

మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగా, తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా......చిత్రం :-…

గులేబకావళి కధ

ప్రాంజలి ప్రభ - పాత సినిమా పాటలు

గులేబకావళి కధ
https://youtu.be/7QskCsBq8bg
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి

చరణం1:
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

చరణం2:
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం

https://www.youtube.com/watch?v=AOB42ip2Ay0
Aradhana Movie Songs | Aadadani Orachupulo | ANR | Savitri | Girija | Relangi
ANR - Savitri and Girija's Aradhana Telugu Movie Songs - Aadadani Orachupulo Song with HD Quality (A...

Wednesday 7 June 2017

ముకుంద (2014)


అరెరె చంద్రకళా జారెనా కిందికిలా...అందుకేనేమో ఇలా గుండెలో పొంగె అలా

చిత్రం : ముకుంద (2014)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్, సాయిశివాని

ఘల్లున ఘల్లున నందన నందన
ఘల్లున ఘల్లున నందన నందన
అరెరె చంద్రకళా జారెనా కిందికిలా
అందుకేనేమో ఇలా గుండెలో పొంగె అలా
రెప్పలో ఉన్న కలా చేరెనా చెంతకిలా
కనుకే కన్నులలా మెరిసే మిలా మిలా

ఏ కైపు వల నిన్నాపెనలా
చిత్రంగ అలా చూస్తుంటే ఎలా
ఓ వెల్లువలా ముంచెత్తవేలా
ఆ వరద ననే కరిగించేలా

హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో
పొమ్మని పొమ్మని తరిమేయ్ దూరాన్నీ
ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో
పొమ్మనే కమ్మని కసిరే కాలాన్నీ

సౌందర్యమా ఒప్పుకో సర్లే అనీ
ఎందుకు అన్నానా సంగతి ఏదైనా
సందేహమా వదిలేయ్ చిన్నారినీ
సిగ్గుని పొమ్మన్నా సిద్దపడే ఉన్నా
తడబాటు నిజం బిడియం సహజం
ఇష్టానికదో తీయని దాఖలా
నా బేల గుణం నీ పెంకితనం
చూస్తుంది కదా దాస్తావేలా

హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో
పొమ్మని పొమ్మని తరిమేయ్ దూరాన్నీ
ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో
పొమ్మనే కమ్మని కసిరే కాలాన్నీ

ఏం చెయ్యనే మహ ముద్దొచ్చావనీ
మక్కువ ముదిరిందా తిక్కగ తరిమిందా
ఏం చెప్పనే తట్టుకోలేనే అనీ
ఎందుకులే నిందా ముందుకురా ముకుందా
గుట్టొదులుకుని గట్టెక్కమని
లాగొచ్చుకదా నువ్వే నన్నిలా
ఆకట్టుకుని చేపట్టమని
పనిగట్టుకుని బతికించాలా

https://www.youtube.com/watch?v=Rhdl2Pyz_TU


Arere Chandrakala Song | Mukunda | Starring Varun Tej, Pooja Hegde
Mukunda is a 2014 Telugu film written & directed by Srikanth Addala.

చిన్ని కృష్ణుడు (1986), Lakshadhikari


మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ...నీలి కన్నుల్లా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ

చిత్రం: చిన్ని కృష్ణుడు (1986)
సంగీతం: ఆర్.డి. బర్మన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: జానకి

పల్లవి:

మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ
నీలి కన్నుల్లా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ
నీలి కన్నుల్లా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ

చరణం 1:

చెప్పాలంటే నాలో..సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో..ఓ..ఓ.. కాగే తారా..ఆ.. మందారాలు..ఊ..ఊ
చెప్పాలంటే నాలో..సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో..ఓ..ఓ.. కాగే తారా..ఆ.. మందారాలు..ఊ..ఊ
పొద్దే తాంబూలాలై..ఎర్రనాలై సంజెలన్నీ..పల్లవించే ఊహలన్నీ
తా ప్రేమ పాటలాయే..ఈ దూరం..దూరతీరం ముద్దులాడే దెన్నడో..ఓ..ఓ..ఓ..ఓ

మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ

చరణం 2:

కన్నె చెక్కిళ్ళలో..పండే గోరింటాకు
కన్నులతో రాసే..ప్రేమే లేఖ నీకూ..ఊ
కన్నె చెక్కిళ్లలో..పండే గోరింటాకు
కన్నులతో రాసే..ప్రేమే లేఖ నీకూ..ఊ..ఉ..ఊ
వచ్చే మాఘమాసం..పందిరేసే..ముందుగానే..
మీరు నేను పల్లకీలో..ఊరేగే శుభవేళ
నీ చిత్తం నా భాగ్యం..మనువాడే..ఏ..ఏ..దెన్నడో
..ఓ..ఓ..ఓ

మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ
నీలి కన్నుల్లా..ఆ నిలిచీ..ఈ..ఈ పిలిచేనా ప్రేమా..ఆ
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ
మౌనమే..ఏ..ఏ ప్రియా ధ్యానమై..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ
https://www.youtube.com/watch?v=nVtE_ZmNUsc


Mouname Priya - Chinni Krishnudu - R D Burman
www.youtube.com
A beautiful song from the telegu movie Chinni Krishnudu Music By R D Burman Singer S. Janaki All cre...
  
 మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది
మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు
ఔనా..ఆ..మ్మ్ మ్మ్
తోటలో ఏముంది నా మాటలో ఏముంది నా మాటలో ఏముంది
తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు నీ మాటలో తేనియలు
ఔనా..ఆ..మ్మ్ మ్మ్
తేనెలో ఏముంది నా మేనిలో ఏముంది నా మేనిలో ఏముంది
తేనెలో బంగారం నీ మేనిలో సింగారం నీ మేనిలో సింగారం
ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది నా పాటలో ఏముంది
ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు నీ పాటలో సరిగమలు
నేనులో ఏముంది నీవులో ఏముంది నీవులో ఏముంది
నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది
నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది
నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది
ఆ..ఆ..మ్మ్..మ్మ్
https://youtu.be/tMtvItbQIxs

Lakshadhikari Songs - Mabbulo Emmundhi - NTR - Krishna Kumari
Watch NTR Krishna Kumari's Lakshadhikari Telugu Old Movie Song With HD Quality Music - T Chalapathi .